ముంబై: ఉద్ధవ్ థాక్రే శివసేన, షిండే శివసేన మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌పై తాజాగా ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పాటు పార్టీ వీడి షిండేతో పాటు వేరు కుంపట్టి పెట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కూడా ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
కాగా, జూన్ 2022లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత రెండు శివసేన వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్‌కు అనర్హత పిటిషన్‌లు ఇచ్చారు. షిండేతో పాటు వెళ్లిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ వర్గం అనర్హత పిటిషన్‌లు వేయగా ఉద్ధవ్ వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలపై షిండే వర్గం అనర్హత పిటిషన్‌లు ఇచ్చింది. షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని గుర్తిస్తూ ధనుస్సు బాణం గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది వారికే కేటాయించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment