ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వైఖరి మారుతోందా.. పాత మిత్రుడు ఉద్ధవ్ థాక్రేపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ పెరుగుతోందా.. ఉద్ధవ్‌తో కలిసి వెళితేనే త్వరలో రానున్నమరాఠా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి
బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ కష్టం వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలకు మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం(జూన్11) వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఉద్ధవ్ ఇండియా కూటమి కోసం కష్టపడ్డారని ప్రశంసించారు.
గతంలో ఉద్ధవ్ బీజేపీతో ఉన్నప్పుడు 18 ఎంపీ సీట్లు గెలుచుకుని ఇప్పుడు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తతం కేంద్రంలోని మోదీ3.0 ప్రభుత్వంలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment