
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా శుక్రవారం అవినాష్ మాట్లాడుతూ మేం మహిళల కోసం ‘లక్‌పతి’ దీదీ స్కీమ్ అమలు చేస్తుంటే గతంలో మీరు మీ హాయంలో మీ ‘దాదీ’ పేరుతో స్కీములు అమలు చేశారని ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇందిరాగాంధీపై మంత్రి కావాలని చేసిన ఈ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.అయితే స్పీకర్ వాసుదేవ్ దేవ్‌నాని ఇందుకు ఒప్పుకోలేదు.దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకున్నారు.
సభ నడవకుండా అడ్డుకుంటుండంతో ఆరుగురు కాంగగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.పార్లమెంట్‌లో వ్యవహరించినట్లుగానే బీజేపీ రాజస్థాన్ అసెంబ్లీలోనూ వ్యవహరిస్తోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment