indiragandhi
-
ఇందిరాగాంధీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీలో ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బడ్జెట్ సెషన్ సందర్భంగా శుక్రవారం అవినాష్ మాట్లాడుతూ మేం మహిళల కోసం ‘లక్పతి’ దీదీ స్కీమ్ అమలు చేస్తుంటే గతంలో మీరు మీ హాయంలో మీ ‘దాదీ’ పేరుతో స్కీములు అమలు చేశారని ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇందిరాగాంధీపై మంత్రి కావాలని చేసిన ఈ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.అయితే స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఇందుకు ఒప్పుకోలేదు.దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకున్నారు.సభ నడవకుండా అడ్డుకుంటుండంతో ఆరుగురు కాంగగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.పార్లమెంట్లో వ్యవహరించినట్లుగానే బీజేపీ రాజస్థాన్ అసెంబ్లీలోనూ వ్యవహరిస్తోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. -
ఏది వాస్తవ చరిత్ర?
జూన్ 27న ‘వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత’ అని డా. కత్తి పద్మారావుగారు రాసిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయానికి అభ్యంతరం లేదు. కాని వాస్తవ చరిత్ర ఏదన్నదే అసలైన చిక్కు. నాలుగు దశాబ్దాల నాడు వచ్చిన ఒక తెలుగు సినిమాలో రావుగోపాలరావు పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ ‘చరిత్ర అడక్కు... చెప్పింది విను’ అనే దాన్ని ఆయన తన వ్యాసం ద్వారా మరోమారు చెప్పారు. డీ.డీ. కోశాంబి, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్రలు చెప్పిందే చరిత్రగా అంగీకరించి తీరాలా! అంతకన్నా భిన్నమైన చరిత్ర ఉందని కొత్త పరిశోధన ద్వారా బయటకు తీసుకురాకూడదా?ఒక సబ్జెక్టులో ఒకరి కన్నా ఎక్కువ మంది రాసిన పుస్తకాలు ఉంటాయి. వాటిలో దేనినైనా చదువుకోవచ్చు. కాని చరిత్రలో మాత్రం నియంతృత్వ పోకడగా రొమిల్లా, బిపిన్ చంద్రల పుస్తకాలు దాటి చదవటానికి వీలు లేదనడం సబబేనా? ఈ రచయితలు భారతీయ చరిత్రకు ఒక రంగు పులిమారు. ఆ రంగును పలుచన చెయ్యటాన్ని అంగీకరించం అంటారు వారి శిష్యులు. వివాదాస్పద కట్టడం కూల్చివేత చిన్న విషయం కాదన్నారాయన. ఆ కూల్చివేత వెనుక హిందూ రాజ్య నిర్మాణ భావన ఉందని తీర్మానించారు. అయితే జమ్మూ–కశ్మీర్, కాశీ, మధురల్లో దేవాలయాలు ధ్వంసమవ్వడం చారిత్రక వాస్తవమే కదా! ఆ ధ్వంసం వెనుకనున్న భావన ఏమిటో కూడా పిల్లలకు తెలియాలి కదా!ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి చరిత్ర పుస్తకాలలో మత ఘర్షణల గురించి చెప్పిన అధ్యాయంలో ఏమి రాశారో ఆయన చదివారా? అందులో గుజరాత్లో జరిగినవి, అయోధ్య నేపథ్యంలో జరిగినవి మాత్రమే ఉన్నాయి. నవీన భారత చరిత్రలో ఆ రెండు సందర్భాలలో తప్పించి మరెన్నడూ మత కల్లోలాలు జరగలేదన్నది యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ వంటి రచయితలు భావిస్తుంటే అంతకన్నా హాస్యాస్పదం ఏదీ ఉండదు.కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి, ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల ఊచకోత గురించి కూడా వీరు ప్రస్తావించి ఉంటే అది వాస్తవ చరిత్ర అయి ఉండేది. కొన్నింటిని కప్పిపుచ్చి, మరికొన్నింటిని కొందరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వివరంగా రాస్తామంటే అది వాస్తవ చరిత్ర కానేకాదు. రైతు ఉద్యమాల గురించి రాసినప్పుడు, 2018లో నాసిక్ నుండి ముంబైకి, ఆ తర్వాత పంజాబ్ నుండి ఢిల్లీకి జరిగిన రైతాంగ ఊరేగింపుల గురించే రాస్తామంటే ఎలా!ఆంధ్రాలో జరిగిన ఎన్జీ రంగా ఆధ్వర్యంలో పలాస నుండి చెన్నపట్నంకి జరిగిన రైతు యాత్ర గురించి రాయం అంటే ఎలా! ‘దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరగనున్నాయి’ అనడాన్ని అంతా స్వాగతించాల్సినదే. అయితే భారతీయులందరికీ వర్తించే లౌకిక చట్టాలు లేకుండా లౌకికవాదం ఎలా పెరుగుతుంది? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అమలు చెయ్యకుండా రాజ్యాంగ స్ఫూర్తి ఎలా వస్తుంది?ఏ వర్గానికి చెందినవైనా చరిత్రలోని మంచి చెడులు చెబితేనే అది వాస్తవ చరిత్ర. ముఖ్యమైనవి, విద్యార్థులకు అంతగా అవసరం లేని అంశాలు పుస్తకాల నుండి తొలగించటం అన్ని సబ్జెక్టులలో జరుగుతుంది. చరిత్ర పుస్తకాల్లోనూ జరిగింది. విద్యార్థులకు మేలు చేసిన అంశం మీద అనవసరపు రాద్ధాంతం ఎందుకు? – డా. దుగ్గరాజు శ్రీనివాసరావు, 9440421695 -
మరో వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌గోపీ
తిరువనంతపురం: ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్‌గోపీ మరో వివాదానికి తెర తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ది నేషన్’గా అభివర్ణించి సంచలనం రేపారు.శనివారం(జూన్ 15) కేరళ త్రిసూర్‌లోని కాంగ్రెస్ నేత కరుణాకరణ్ సమాధి ‘మురళి మందిర్’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్‌గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేగాక కరుణాకరన్‌తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్‌కు కరుణాకరణ్ తండ్రి అని చెప్పారు. అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు. ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్ నుంచి సురేశ్‌గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. దీంతో కేంద్రంలోని మోదీ3.0 మంత్రి వర్గంలో సురేశ్గోపీకి చోటు దక్కింది. -
అదొక.. 'AI పొలిటికల్ అవతార్'!
ఈ సంవత్సరమే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో.. అవినీతి ఆరోపణల కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతని పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) తరఫున అతను పోటీ చేయడానికే కాదు.. ప్రచారం చేయడానికీ వీల్లేదని ఆ దేశపు సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా బరిలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికలుగా ఇమ్రాన్ ప్రచారం చేసిపెట్టాడు. ప్రసంగాలిచ్చాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు తీర్పును ధిక్కరించాడా? అయ్యో అస్సలు కాదు. జైల్లోనే ఉన్నాడు. మరి? ప్రచారం, ప్రసంగాలు చేసింది ఇమ్రాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతార్!ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తన చిప్‌ని దూర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! దాదాపు 50కి పైగా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం. సుమారు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) మంది ఓటును వినియోగించుకుంటున్నారు. అమెరికా టు ఆఫ్రికా, ఆసియా టు ఐరోపాలోని దేశాల్లో జరిగే ఈ ఎన్నికల్లో పాలసీ మ్యాటర్స్, ప్రచారం .. పాజిటివ్, నెగటివ్ రెండు కోణాల్లో ఏఐదే ప్రధాన పాత్ర! అందుకే 2024, గ్లోబల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరాన్ని ఏఐ ఎలక్షన్స్ ఇయర్ అంటున్నారు. ఈ సందర్భంగా.. మన దగ్గర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటున్న ఈ క్షణం దాకా ఎన్నికల ప్రచారాల్లో వస్తున్న మార్పుల వెంట సరదాగా నడిచొద్దాం..దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారమంటే అగ్రనేతలు నిర్వహించే బహిరంగ సభలే! ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకి వస్తే.. ఖాదీ వస్త్రధారణ, పవర్ఫుల్ స్లోగన్సే ప్రచారస్త్రాలుగా ఉండేవి. 1965లో లాల్‌బహదూర్ శాస్త్రి ‘జైజవాన్ జై కిసాన్’తో మొదలైందీ ఎన్నికల నినాద యాత్ర. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని ఉరువా బహిరంగ సభలో ఆ నినాదాన్నిచ్చారు ఆయన. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని.. సరిహద్దు గట్టి రక్షణకు సైనికుల బలాన్ని, వ్యవసాయాధారిత మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులే కాబట్టి వాళ్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆ రెండు వర్గాలకు తమ సర్కారు అండగా ఉంటుందనే భరోసాను కల్పించడానికి శాస్త్రి ఆ స్లోగన్ని అందుకున్నారు. అది వైరలై నేటికీ లైవ్‌గానే ఉంది.1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హటావో (పేదరిక నిర్మూలన)’ నినాదం కాంగ్రెస్‌కి ల్యాండ్‌స్లైడ్ విక్టరీని తెచ్చిపెట్టింది. అయితే ఆ నినాదానికి యాంటీగా ప్రతిపక్షాలు.. ‘గరీబీ కాదు గరీబోంకో హటారహే (పేదరికాన్ని కాదు పేదలను నిర్మూలిస్తోంది)’ అంటూ ఆమెను ట్రోల్ చేశాయి. 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు జనతా పార్టీ ‘ఇందిరా హటావో దేశ్ బచావో’ స్లోగన్‌తో విజయం సాధించింది. ఇందిరా హత్య తర్వాత 1984 ఎన్నికల్లో ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిరా నీ పేరుంటుంది)’ నినాదంతో కాంగ్రెస్ గెలుపొందింది.1989లో వీపీ సింగ్ ‘రాజా నహీ ఫకీర్ హై.. దేశ్ కీ తక్దీర్ హై (రాజు కాదు పేద.. ఆయనే ఈ దేశపు భాగ్యప్రదాత)’ స్లోగన్‌తో ఎన్నికలను జయించి ప్రధాని అయ్యాడు.1996 స్లోగన్ ‘బారీ బారీ అబ్ కీ బారీ అటల్ బిహారీ’ ఎంత పాపులరో వేరేగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా ‘ఇండియా ఈజ్ షైనింగ్’, ‘కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్ (కాంగ్రెస్ హస్తం.. సామాన్యుడికి ఆపన్న హస్తం)’ నినాదాలు ఆయా పార్టీల ఐడెంటిటీలుగా మారాయి. అయితే నినాదాల పవర్ సోషల్ మీడియా ఇరాలోనూ కొనసాగుతోంది. ‘అచ్ఛే దిన్ ఆలే వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’, ‘హాత్ బద్లేగా హాలాత్ (హస్తం మార్పును తెస్తుంది), ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘అబ్ కీ బార్ చార్సౌ పార్’ వంటి నినాదాలే అందుకు నిదర్శనం.స్వాతంత్య్రం వచ్చిన ఓ రెండుమూడు దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారంలో రేడియో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దశాబ్దం కిందటి వరకు పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఆ రోల్‌ని తీసుకున్నాయి. వీటితోపాటు గోడ పత్రికలు, పాంప్లెట్స్, వాల్ రైటింగ్స్ కూడా తమ ఉనికిని చాటాయి. ప్రైవేట్ చానళ్ల పర్వం మొదలయ్యాక అవీ తమ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చూపించాయి. నేతల ప్రచార యాత్రలూ ఆయా పార్టీల జయాపజయాలను ప్రభావితం చేశాయి. వాటిల్లో ఆడ్వాణీ రథ యాత్ర ఒకటి. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ రైట్ వింగ్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆ తర్వాత ఐదేళ్లలోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేలా చేసింది.రిగ్గింగ్ చేస్తున్నట్టు..స్లొవేకియాలో నిరుడు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల తరఫున నిలబడిన వ్యక్తి ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ టేప్‌లో.. తాను ఎలా రిగ్గింగ్ చేయబోతున్నాడో మరొకరికి విపులంగా వివరిస్తున్నాడు. ఆ ఆడియో బయటకు వచ్చాక సదరు నేత ఎన్నికల్లో ఓడిపోయాడు. అతనికి అమెరికా, నాటో దేశాలను సమర్థించే వ్యక్తిగా పేరుంది. అందుకే అతన్ని ఎన్నికల్లో ఓడించేందుకు ఏఐ సాయంతో రష్యన్ ఏజెన్సీలు డీప్‌ఫేక్ ఆడియోను çసృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి అమెరికా అనుకూల అభ్యర్థి ఓటమికి దారులు వేసి, రష్యన్ అనుకూల వ్యక్తిని గెలిపించుకున్నాయి. ఎన్నికల అనంతరం యూఎస్ చేపట్టిన సమగ్ర విచారణలో ఈ అంశం వెలుగు చూసింది.జంతువులతో పోల్చినట్టు..ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేషియా ఎన్నికలపైనా ఏఐ ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వాధినేత ప్రభోవో సుబియాంటో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమ్మింగ్ తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో అక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే వ్యక్తులను ఉపాధ్యక్షుడు ‘జూ’లోని జంతువులతో పోల్చినట్టుగా ఉందీ వీడియోలో. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వీడియోపై విచారణ జరిపించింది. గిబ్రాన్ పాత వీడియోకు ఏఐ జనరేటెడ్ వాయిస్‌ను జోడించి ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టుగా తేలింది.తప్పుకుంటున్నట్టు..ఈ సంవత్సరం మొదట్లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా నహీద్.. స్వతంత్ర అభ్యర్థిగా గాయ్బంధా నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల పోరులో గెలుపు కోసం అతను శ్రమిస్తుండగా.. హఠాత్తుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అతను పోటీ నుంచి తప్పుకుని ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా! దీంతో అప్పటి వరకు నహీద్‌కు వచ్చిన ప్రచార ఊపంతా గంగపాలైంది. చివరకు ఆ వీడియో డీప్ ఫేక్‌గా నిర్ధారణైంది.సోషల్ మీడియా..తొంభైయ్యవ దశకంలో ఎన్నికల ప్రచారం పేరుతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలైంది. సామాన్యులు పోటీలో నిలబడి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రాజకీయ ప్రచారంపై ఎన్నికల కమిషన్ నజర్ పెట్టింది. కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. అలా రాజకీయ ప్రచారానికి హద్దులు నిర్దేశమవుతున్న తరుణంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇంటర్నెట్ విప్లవం వచ్చి పడింది. సోషల్ మీడియాను మోసుకొచ్చింది. అంతే ఈమెయిల్స్, వాట్సాప్ మొదలు యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా పాపులర్ ప్లాట్‌ఫామ్స్ జనాలకు చేరువయ్యాయి. ఆదిలోనే వాటి ఇంపాక్ట్‌ని గ్రహించి.. సమర్థవంతంగా వాడుకున్న పార్టీగా బీజేపీకి పేరుంది. గుజరాత్లో మొదలైన మోదీ వేవ్ 2014లో సోషల్ మీడియా వేదికగా దేశమంతటా విస్తరించడానికి కారణమైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ..సోషల్ మీడియా ప్రచారాన్ని రాకెట్లోకి ఎక్కించి ఆకాశం అందుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స(ఏఐ) ఎంట్రీ ఇచ్చింది. 2013 నుంచే ఏఐ వాడకం మొదలైనా అది శైశవ దశ. ఇప్పుడు ఏఐ యవ్వన దశకు చేరుకుంది. సరదాగా మొదలైన ఏఐ వాడకం ప్రొఫెషన్స్సకి ఉపకరణంలా మారింది. ఇప్పుడు మరింతగా ముదిరి ఎన్నికల ప్రక్రియలో భాగమైంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారం ఎంతో కీలకం. తమకు తెలిసిన, తమ దగ్గరకు వస్తున్న సమాచారం ఆధారంగానే ఓటరు నిర్ణయం ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో రాజకీయాల్లోని వ్యక్తులతో పాటు ఆకతాయిలూ ఉంటున్నారు. ఫలితంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వరకు అంతటా ఎన్నికల ప్రక్రియ కుదుపునకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఐ వాడి, వేడికి అమెరికా, యూరప్‌లలో ఫెయిర్ ఎలక్షన్స్స కోరుకునే ప్రజాస్వామ్యవాదులకు దడ మొదలైంది.ఆర్థిక, ఆయుధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం తెలియంది కాదు. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో ఇండియాలో మన చేతికి ఉన్న వాచిలో టైమ్ ఎంతో చూడగలదని చెబుతుంటారు. అంతటి అమెరికా అధ్యక్షుడికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో! డెమొక్రాట్ల తరఫున బైడెన్, రిపబ్లికన్ ల తరఫున డోనాల్డ్ ట్రంప్‌లు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఏఐ ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం వారికీ సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న వీడియోఇద్దరినీ..తైవాన్ ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సైయింగ్ వెన్ లక్ష్యంగా అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్‡దేశాధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్ని వీడియో ఒకటి. అందులో చైనా – తైవాన్ సంబంధాలపై దేశ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా సమాచారం వ్యాప్తి చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలో అధ్యక్షుడి వాయిస్‌నే కాదు న్యూస్ యాంకర్‌నూ ఏఐ ద్వారా సృష్టించారు.ఘాటైన వ్యాఖ్యలు!బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే కొద్ది రోజులకే ఏఐ సాయంతో రణ్‌వీర్‌సింగ్ వాయిస్‌ను క్లోన్ చేసి అదే వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులో.. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మోడీ అసంబద్ధ విధానాలపై రణ్‌వీర్‌సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అంతేకాదు దేశ భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరినట్టుగా ఉంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే తేరుకున్న రణ్వీర్ సింగ్ కుటుంబం సదరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసు పెట్టింది. మరో హీరో ఆమిర్‌ఖాన్ కూ ఇలాంటి అనుభమే ఎదురైంది.ఇమ్రాన్ .. నీకు నేనున్నాను!ఈ మార్చి మొదట్లో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఒకటి అమెరికాలో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ును ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పిన మాటలు అమెరికాలో సంచలనం కలిగించాయి. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడిపిస్తానని, అమెరికా– పాకిస్తాన్ ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై నలువైపులా విమర్శలు చుట్టుముట్టాయి. చివరకు టెక్నోక్రాట్స్, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపితే.. అది ఏఐ యాప్ ద్వారా తయారైన డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ట్రంప్ మాట్లాడుతున్న పాత వీడియోలు, ట్రంప్‌ను పోలిన ఏఐ వాయిస్ సాయంతో కొత్త వీడియోను తయారుచేసి వదిలారు. అది నిజామా.. కాదా? అని తెలుసుకునేలోపు ఆ వీడియో సగం అమెరికాను చుట్టొచ్చింది.అంతేకాదు న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికలప్పుడు.. అక్కడి ఓటర్లకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బైడెన్ స్వయంగా.. ప్రైమరీ ఎన్నికల్లో ఓటు వేయద్దంటూ ఆ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో సేవ్ చేసిన ఓటును త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌ల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బైడెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నిజమేనేమోనని సగటు అమెరికన్ ఓటరు నమ్మే పరిస్థితి నెలకొంది. కానీ విచారణలో ఏఐ సాయంతో బైడెన్ వాయిస్‌ను సృష్టించి ఆ కాల్స్ చేసినట్టు తేలింది. ఇలా అసలు జరగని విషయాన్ని కచ్చితంగా జరిగిందన్నట్టుగా మన పంచేద్రియాలను నమ్మించడం సులువైపోయింది.మన దగ్గర..అమెరికన్ ర్యాపర్ లిల్ యాచీ నడక ఆధారంగా.. ప్రధాని నరేంద్ర మోదీని డిక్టేటర్‌గా పేర్కొంటూ రూపొందిన ఏఐ మీమ్.. ఎక్స్‌లో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల ఏఐ మీమ్స్, ఏఐ అవతార్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఆఖరికి ఈ ఏఐ మీమ్స్ ట్రెండ్‌పై సాక్షాత్తు ప్రధాని ‘నా మీద చేసిన మీమ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఎన్నికల ఒత్తిడితో సతమతమవుతున్న నేను దీన్ని చూసి భలే రిలాక్స్ అయ్యాను’ అని స్పందించారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారానికి ఏఐని వాడుకుంటోంది. ప్రధాని మోదీ హిందీ సంభాషణను ఏఐ సాయంతో ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి మార్చింది.నేరుగా దేశ ప్రధానే తమ సొంత భాషలో తమతో మాట్లాడారు అని ప్రజలు మురిసిపోయారు. సాంకేతికతను ఒడిసిపట్టుకున్నామని బీజేపీ ఆనందంతో గంతులేసింది. అదే విధంగా గడిచిన పదేళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపైనా ఏఐ సాయంతో వీడియో రూపొందించి జనాల్లోకి వదిలింది. ప్రచారంలో దూసుకుపోయింది. ఏఐని మంచికి వాడుకుంటే తప్పులేదు. ప్రజలను భ్రమల్లోకి నెట్టాలనుకుంటేనే ప్రమాదం. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత యువ జనాభా మన సొంతం. ఈ యువ భారతానికి స్పీడెక్కువ.సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేది వీళ్లే. ఈ ఉడుకు రక్తానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా.. నిజాన్ని తలదన్నేలా ఏఐ తయారుచేస్తున్న తప్పుడు సమాచారం అందితే? దాని ఆధారంగా వారి ప్రయాణం సాగితే? వ్యక్తులుగా వారికి, వ్యవస్థగా దేశానికి తీరని నష్టం. రెచ్చగొట్టే సభలు, సమావేశాలు, తప్పుడు ప్రకటనలనైతే అడ్డుకోవచ్చు. కానీ చేతిలో ఇమిడిపోయే ఫోన్లను టాయిలెట్లకు సైతం తీసుకుపోతున్న కాలంలో.. నియంత్రణ లేకుండా కనురెప్ప పాటులో సోషల్ మీడియా ద్వారా బట్వాడా అవుతున్న అబ్ధాలను అడ్డుకోవడమెలా?మరణించిన వ్యక్తి ప్రచారం..2019లో.. తమిళనాడు, కన్యాకుమారి నుంచి వసంత్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఆయన మరణించారు. మొన్నటి ఏప్రిల్ 19న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయ్‌కుమార్ పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు తన కొడుకు విజయ్ను గెలిపించాలంటూ వసంత్‌కుమార్ కోరుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో చనిపోయిన వసంత్ 2024లో ఎలా ప్రచారం చేశాడా అని జనాలు అవాక్కయ్యారు. అయితే అది డీప్‌ఫేక్ సాయంతో రూపొందించిన వీడియోగా తేలింది.ఫ్యాక్ట్ చెక్ ఉన్నా..సాంకేతికంగా రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో ప్రతి చెడును చట్టాలతో అరికట్టడం ఒకింత కష్టమే! అనుమానం ఉన్న కంటెంట్‌ను పట్టుకుని, దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిజానిజాలు తేల్చడం ఖర్చు, కాలంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ చెక్, ట్రూత్ ఫైండర్, ఫేక్‌న్యూస్ తదితర పద్ధతుల్లో అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. డిజిటల్ లిటరేట్సే కానీ డిజిటల్ ఎడ్యుకేట్స్ లేదా డిజిటల్లీ చాలెంజ్డ్ జనాభా ఉన్న దేశాల్లో.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పలురకాలుగా వడబోస్తే తప్ప అసలైన విషయం బటయకు రాదు. కానీ అసలు నిజం వెలుగు చూసేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.ముల్లును ముల్లుతోనే..ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారానికి చెక్ పెట్టాలంటే తిరిగి టెక్నాలజీనే ఆయుధంగా మలచుకోవాలి. సాంకెతిక నైపుణ్యంతో సృష్టిస్తున్న అభూత కల్పనలను ఇట్టే పసిగట్టి హెచ్చరించి, నిరోధించే ప్రత్యామ్నాయ యాప్‌లను డెవలప్ చేయడంపై భావి ఆవిష్కర్తలు దృష్టి సారించాలి. లేదంటే నీడే నిజమనే భ్రాంతిలో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, ఓపెన్ ఏఐ, టిక్‌టాక్‌లు తమ ఫ్లాట్‌ఫామ్స్‌పై డీప్‌ఫేక్ ద్వారా జరిగే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఫేక్ను గుర్తించే వ్యవస్థలను మరింత సమర్థంగా రూపొందిస్తామని వెల్లడించాయి.ఎన్నికల వ్యవస్థలోకి ఏఐని జొప్పించి చేస్తున్న విష ప్రచారంపై పాశ్చాత్య ప్రపంచం మేల్కొంది. ఏఐని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలను నిర్వహిస్తోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది. ఏఐని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనకు సమయం ఆసన్నమైందని పోరుతోంది.యంత్రమా.. హృదయ స్పందనా..వందమంది చేసే పనిని ఒక్క యంత్రమే చేయగలదు. మనిషి కంటే ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలు యంత్రాల సొంతం. ఇప్పుడా యంత్రాలకు మరింత మెరుగ్గా ఆలోచించే శక్తిని ఏఐ అందిస్తోంది. అయితే ఎన్ని శక్తియుక్తులు ఉన్నా మనిషి స్పృహ, హృదయ స్పందన ముందు అవన్నీ దిగదుడుపే.ముగింపు..సంప్రదాయం, సాంకేతికతకు ఎప్పుడూ ముడిపడదు. ఆ పోరులో టెక్నాలజే ఓ మెట్టు పైన ఉంటుంది. కాలానికి తగ్గట్టు మారాల్సిందే. తప్పదు.. తప్పు లేదు. అయితే మంచిచెడులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పర్యవసానాలు అనుభవించిన తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాల తయారీ మీద స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. జీవాయుధాల తయారీ, సాగులో బయోటెక్నాలజీ వినియోగం తదితర అంశాల మీద ఓ కన్నేసి ఉంచాయి. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఏఐ వాడకం వంటి వాటి నియంత్రణ మీదే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది అంటున్నారు సామాజిక, రాజకీయ విశ్లేషకులు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
మెదక్‌లో గెలుపొంది.. ఉన్నత పదవుల్లోకి..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఎంతో మందికి మంచి పదవులను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ప్రముఖులుగా చరిత్రలో లిఖించింది. గతంలో ఇక్కడి నుంచి పోటీచేసి గెలిచిన నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి ఉన్నతమైన పదవులు అలంకరించారు. అలా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న వారంతా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను మెదక్ జిల్లాకు ఆ విధమైన ప్రత్యేక ఏర్పడింది. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీచేసి విజయం సాధించి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. పద్మాదేవేందర్‌రెడ్డి.. పద్మాదేవేందర్‌రెడ్డి 2001లో టీఆర్ఎస్ అవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో రామాయంపేట జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం స్వరాష్ట్రం కోసం 2008లో కేసీఆర్ పిలుపు మేరకు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీచేయగా ఓడిపోయారు. ఆ తరువాత 2009లో టికెట్ దక్కక పోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2014లో మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణలో తొలి ఉప సభాపతిగా పనిచేసి చరిత్రలో నిలిచారు. అనంతరం 2018లో సైతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ 1980లో లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ(కాంగ్రెస్) నుంచి పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదివిని అలంకరించారు. అప్పట్లో ఇందిరాగాంధీకి 3,01,577 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జనతాపార్టీకి చెందిన జైపాల్‌రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ 2,19,124 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యమంత్రిగా అంజయ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టి.అంజయ్య 1980 అక్టోబర్ నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో చెన్నారెడ్డి సీఎంగా కొనసాగుతున్న సందర్భంగా ఆయనను మార్చి అంజయ్యకు సీఎంగా అవకాశం కల్పించారు. ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేస్తుండగా దానికి రాజీనామా చేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక కాకుండానే సీఎం పదవి చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఈ నేపథ్యంలో అప్పటికే రామాయంపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా టి.అంజయ్య కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేట స్థానానికి ఎన్నికలు నిర్వహించగా ప్రతిపక్షాలు సైతం నామినేషన్ వేయక పోవడంతో టి.అంజయ్య ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిని అలంకరించి 16 నెలల పాటు కొనసాగారు. ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యే గెలుపొందిన సీహెచ్ జగన్నాథరావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 24 నుంచి సెప్టెంబర్ 20 వరకు సుమారు ఏడు నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవి కూడా చదవండి: ఐదేళ్లు మీకోసం రక్తం ధారపోస్తా..! : మంత్రి గంగుల కమలాకర్ -
గుర్తుండిపోయే నేత!
కొందరు తమకొచ్చిన పదవులకుండే ప్రాముఖ్యత వల్ల వెలిగిపోతారు. కానీ చాలా తక్కువమంది చేపట్టిన పదవి ఏదైనా దానిపై తమదైన ముద్ర వేస్తారు. ఆ పదవికే వన్నె తెస్తారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా తరచుగా తన విశిష్టతను చాటుకున్నారు. ఒకానొక దశలో ఆమెను ప్రధాని పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయొచ్చునన్న ఊహాగానాలు రావడానికి ఈ విశిష్టతే కారణం. ఇతర రంగాల మాదిరిగా పురుషాధిక్యత రాజ్యమేలే రాజకీయరంగంలో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, తమను తాము నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీకి తండ్రి జవహర్లాల్ నెహ్రూ సమున్నత వారసత్వం ఉంది. కానీ సుష్మా స్వరాజ్‌కు అటువంటి నేపథ్యం లేదు. ఆమె పూర్తిగా స్వశక్తితో ఎదిగిన మహిళ. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాడి, పరిష్కారాలు సాధించిన చరిత్రగలవారు. అప్పట్లోనే గొప్ప వక్తగా అందరి మన్ననలూ పొందారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, ఏ సమస్యపైన అయినా ప్రభావవంతంగా మాట్లాడగల సామర్థ్యం సొంతం చేసుకోవడం వల్లనే ఆమె 25 ఏళ్ల పిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రి కాగలిగారు. జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవ హరించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశలో సంఘ్ పరివార్ అనుబంధ సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఆమెది. ఆ దశలోనే ఆమె ఆనాటి జనసంఘ్ నాయకుడు ఎల్కే అడ్వాణీ దృష్టిలో పడ్డారు. తన రాజకీయంగా భిన్నాభిప్రా యాలుండే స్వరాజ్ కౌశల్‌ను పెళ్లాడాక ఆమె జనసంఘ్‌కు దూరమయ్యారు. సోషలిస్టు రాజకీ యాల్లో చురుకైన పాత్ర పోషించారు. దేశం ఉక్కు నిర్బంధాన్ని చవిచూసిన అత్యవసర పరిస్థితి కాలంలో నిరసన ప్రదర్శనల్లో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ చీకటి రోజుల్లోనే సోషలిస్టు నేత, దివంగత నాయకుడు జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రధాన కుట్రదారుగా చేర్చిన బరోడా డైనమైట్ కేసులో భర్తతో పాటు న్యాయస్థానంలో వాదించారు. ఆ క్రమంలో ఆమె లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అనుయాయిగా మారారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక సోషలిస్టు పార్టీ జనతా పార్టీలో విలీనమై నప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో బీజేపీలో చేరి కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా పనిచేశారు.అయితే బీజేపీలో చాలామందికి లేని వెసులుబాటు çసుష్మకు ఉంది. సోషలిస్టుగా రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కావొచ్చు... బీజేపీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నా ఆమెను ఉదారవాద నేతగానే అనేకులు పరిగణించారు. దానికితోడు ఆమె కొన్ని కీలక సందర్భాల్లో నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆ భావనే కలిగించేవి. బెంగళూరులోని పబ్‌పై హిందూ ఛాందసవాదులు దాడిచేసి మహిళలపై దౌర్జన్యానికి దిగినప్పుడు ఆ చర్యను ఖండించిన ఏకైక బీజేపీ నేత సుష్మానే. ప్రియాంకా చతుర్వేది కాంగ్రెస్ నేతగా ఉండగా పదేళ్ల ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ట్వీట్లు చేసినవారిని సుష్మ మందలించారు. ప్రియాంకకు అండగా నిలిచారు. మతాంతర వివాహం చేసుకున్న జంట పాస్‌పోర్టు కోసం వచ్చినప్పుడు లక్నోలోని అధికారి ఆ మహిళపై తన పరిధి దాటి వ్యాఖ్యానించినప్పుడు సుష్మ మందలించారు. ఆమెకు పాస్‌పోర్టు అందేలా చూశారు. ఇలాంటి సందర్భాల్లో సంఘ్ పరివార్ శ్రేణులుగా చెప్పుకున్నవారు ఆమెపై విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినా సుష్మ లెక్కచేయలేదు. విదేశీ వ్యవ హారాల శాఖ నిర్వహణ ఏ రాజకీయ నేతకైనా ప్రతిష్టాత్మకమైనదే. ఐక్యరాజ్యసమితితోసహా అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యంవహించే అవకాశం లభించడం, మన వాదనను సమ ర్ధవంతంగా వినిపించడం ఒక వరం. అదే సందర్భంలో ఆ పదవితో సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండటం సాధ్యపడదు. కానీ ఆ పదవి స్వభావాన్నే ఆమె మార్చారు. ఇరాక్‌లోని బస్రాలో ఉగ్రవాదుల చక్రబంధంలో చిక్కుకున్న 168మందిని కాపాడటం వెనక ఆమె కృషి చాలా ఉంది. విదేశాల్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారికి, ఇక్కడి వ్యక్తిని పెళ్లాడి వీసా లభించక ఇబ్బందులు పడుతున్నవారికి, గల్ఫ్ దేశాలకెళ్లి అక్కడ వెట్టిచాకిరీలో మగ్గినవారికి ఆమె అమ్మలా ఆపన్నహస్తం అందించారు. ‘మీరు అరుణగ్రహంపై చిక్కుకున్నా కాపాడతాన’ంటూ ఆమె ఒక సందర్భంలో పెట్టిన ట్వీట్ విదేశాల్లో ఉండకతప్పనివారికి ఎంతో భరోసానిచ్చింది. ఆమెలోని మాన వీయతకు అద్దం పట్టింది. విదేశాంగ శాఖలో కూడా ఇంత చేయొచ్చా అని అందరూ ఆశ్చర్య పోయారు. అడ్వాణీ శిబిరానికి చెందినవారు గనుక ఆమెకు మోదీ ప్రభుత్వంలో చోటుండకపోవ చ్చన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆమె సమర్థతను మోదీ సరిగానే గుర్తించారు. కీలకమైన విదే శాంగ శాఖ అప్పగించారు. వాజపేయి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఆ శాఖపై సుష్మ చెరగని ముద్రవేశారు. చిత్రరంగాన్ని పరిశ్రమగా గుర్తించింది ఆమె హయాంలోనే. అందువల్లే చిత్ర నిర్మా ణాలకు బ్యాంకు రుణాలు అందడం మొదలైంది. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఎదగనీయడం లేదని అనేకులు ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటివారు సుష్మ రాజకీయ జీవితం అధ్యయనం చేయాలి. అడుగడుగునా ఆధిపత్య ధోర ణులు, పితృస్వామిక భావజాలం తొంగిచూసే సమాజంలో ఎలాంటి నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలకు ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు తప్పవు. వాట న్నిటినీ దీటుగా ఎదుర్కొనడం వల్లనే, తనను తాను నిరూపించుకోవడం వల్లనే సుష్మా స్వరాజ్ ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారు. విశిష్ట నేతగా ఎదిగారు. -
బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది
న్యూఢిల్లీ: బీజేపీ తనను చంపాలను కుంటోందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లే వ్యక్తిగత రక్షణ సిబ్బందే తనను హత్య చేయవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అత్యున్నత జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న కేజ్రీవాల్ శనివారం పంజాబ్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..‘బీజేపీ నన్ను చంపాలనుకుం టోంది. ఇందిరా గాంధీని చంపినట్లే ఏదో ఒక రోజు వ్యక్తిగత రక్షణ అధికారితో బీజేపీ నన్ను హత్య చేయిస్తుంది. నా వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు’ అని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోపణలను ఢిల్లీ పోలీసు విభాగం ఖండించింది. దేశ రాజధానిలో ఉండే సీఎం కేజ్రీవాల్ సహా అన్ని రాజకీయ పార్టీల నేతల భద్రతను తమ అధికారులు చూసుకుంటున్నారని, వీరంతా సమర్థులు, విధుల పట్ల అంకిత భావం ఉన్నవారేనని పేర్కొంది. వ్యక్తిగత భద్రత వంటి సీరియస్ అంశాలను సైతం ప్రజల మెప్పు పొందేందుకు వాడుకోవడం దిగజారుడుతనమని బీజేపీ మండిపడింది. వ్యక్తిగత భద్రతా అధికారిపై అనుమానం ఉంటే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంది. అనంతరం కేజ్రీవాల్ ట్విట్టర్లో..ఏం తప్పు చేశానని బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది? తుది శ్వాస వరకు దేశం కోసం పనిచేస్తూనే ఉంటా’ అని తెలిపారు. -
‘ఇందిరాగాంధీని ప్రజల నుంచి చెరిపేసే యత్నం’
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ని ప్రజల హృదయాల నుంచి చెరిపేసే కుట్ర జరుగుతోం దని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఇందిర వర్ధంతిని ప్రధాని మోదీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఇందిరను స్మరించకపోవడం శోచనీయమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కేవలం ఒక వర్గానికి పరిమితం చేసేలా మోదీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
ఇందిరను హిట్లర్‌తో పోల్చిన జైట్లీ
-
నాజీల స్ఫూర్తితోనే ఎమర్జెన్సీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జర్మన్ నియంత హిట్లర్‌కు మధ్య పోలికలున్నాయని, వారిద్దరూ ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారని కేంద్ర మంత్రి జైట్లీ విమర్శించారు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించడం తెల్సిందే. 3 భాగాల సిరీస్ ‘ద ఎమర్జెన్సీ రీవిజిటెడ్’లో రెండోదైన ‘ద టైరనీ ఆఫ్ ఎమర్జెన్సీ’పేరిట ఫేస్బుక్లో ఓ ఆర్టికల్‌ను జైట్లీ పోస్ట్ చేశారు. హిట్లర్ కంటే ఒకడుగు ముందుకేసిన ఇందిర.. భారత్‌ను రాజరికపు ప్రజాస్వామ్య దేశంగా మార్చారని, 1933లో నాజీ జర్మనీలో జరిగిన దానిని స్ఫూర్తిగా తీసుకునే ఇందిర ఎమర్జెన్సీకి పథకం రచించారని ఆరోపించారు. ‘హిట్లర్, ఇందిర ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారు. ఇందిరాగాంధీ అమలు చేసినంతగా కొన్ని హిట్లర్ కూడా చేయలేదు. మీడియాపై ఉక్కుపాదం మోపారు. పార్లమెంట్ కార్యకలాపాలను పత్రికల్లో రాకుండా ఇందిర అడ్డుకున్నారు. ప్రెస్ సెన్సార్‌షిప్‌కు సంబంధించి భారత్, జర్మనీలో అమలు చేసిన చట్టాలు ఒక్కటే’ అని చెప్పారు. హిట్లర్ రాజ్యాంగానికి లోబడి చర్యలు తీసుకుంటే.. ఇందిర ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీని తీసుకొచ్చారని, ఆర్టికల్ 359 కింద ప్రాథమిక హక్కులను రద్దు చేశారని, దేశంలోని ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. హిట్లర్ మాదిరిగానే ఇందిర పార్లమెంటులోని విపక్ష నేతలందరినీ అరెస్టు చేసి తన ప్రభుత్వానికి మూడింట రెండువంతుల ఆధిక్యాన్ని సాధించారని జైట్లీ గుర్తు చేశారు. జర్మనీకి ఒకే అత్యున్నత అధికార కేంద్రం ఉండాలని, ఆ అధికారం ఫ్యూరర్(హిట్లర్)కే ఉండాలని భావించేవారని.. అదే మాదిరిగా ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర అనుకునేలా చేశారని నాటి ఏఐసీసీ అధ్యక్షుడు దేవకాంత బారువా వ్యాఖ్యలను ఉటంకిస్తూ జైట్లీ చెప్పారు. కాగా, జైట్లీ ఫేస్బుక్ పోస్ట్‌ను ప్రధానిమోదీ ట్విట్టర్లో షేర్ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి జైట్లీ పోస్ట్‌లో రాశారని, వ్యక్తిగత స్వేచ్ఛను ఎమర్జెన్సీ ఎలా హరించింది.. రాజ్యాంగంపై నేరుగా ఎలా దాడి చేసింది వివరించారని ట్వీట్‌చేశారు. -
మోదీకి ఇందిర తరహా గండం
న్యూఢిల్లీ: 1977లో ఎమర్జెన్సీ తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎదుర్కొన్న పరిస్థితినే ఈసారి మోదీ ఎదుర్కోబోతున్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబిస్తున్నారు. 1947లో దేశవిభజన అనంతరం యూపీలోని అలీగఢ్, రాజస్తాన్‌లోని కోటా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ మాతృసంస్థ జన్‌సంఘ్ గట్టిపునాది ఏర్పరచుకుంది. 1980లో ఈ సంస్థ బీజేపీగా రూపాంతరం చెందింది. ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గణనీయంగా విస్తరించినప్పటికీ మరో పదేళ్లవరకూ యూపీలో పట్టుసాధించలేకపోయింది. మాజీ ప్రధాని, జాట్ కులస్తుడైన చరణ్ సింగ్‌కు యూపీలోని రైతు వర్గాలు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటంతో బీజేపీ ఎదగలేకపోయింది. ఆర్యసమాజ్‌కు చరణ్‌సింగ్ మద్దతు, ములాయం, చరణ్‌సింగ్ కొడుకు అజిత్‌ల మధ్య వర్గపోరుతో బీజేపీ యూపీలో విస్తరించింది. ఏకమైన విపక్షాలు ఈ నేపథ్యంలో 2019లో బీజేపీని ఎదుర్కోవాలంటే ఒక్కటవ్వాలని నిర్ణయించిన విపక్షాలు చురుగ్గా పావులు కదిపాయి. కైరానాలో ఆర్ఎల్డీ తరఫున పోటీచేసిన తబస్సుమ్ హసన్‌కు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు ప్రకటించాయి. జాట్, మైనారిటీ ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో తబస్సుమ్ 44 వేల ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. 1977లో ఇందిరాగాంధీ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితినే మోదీ ఎదుర్కొంటున్నారని తాజా ఎన్నికల ఫలితాలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇందిరను గద్దె దించాయనీ, ప్రస్తుతం దేశంలో ఆదే తరహాలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో రైతుల సమస్యలతో పాటు చెరుకు పంటకు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన బాకీలు లక్ష్యంగా ప్రచారంచేశామని ఆర్ఎల్డీ నేత దూబే తెలిపారు. -
సీటు కోసం..నేతల తోపులాట
-
సీటు కోసం.. నేతల తోపులాట
ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల్లో గొడవ జరిగింది. వేదికపై సీటు కోసం మాజీ మంత్రి సీఆర్ఆర్, పీసీసీ కార్యదర్శి సుజాత వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరి పై ఒకరు పరస్పర మాటలు తూటాలు పేల్చుకున్నారు. ఎంత నచ్చచెప్పినా గొడవ సద్దుమణగకపోవడంతో ఆగ్రహం చెందిన మాజీ ఎంపీ వి.హన్మంతరావు సభ మధ్యలోనే వేదికపై నుంచి దిగి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి వేడుకలలో పరస్పరం ఆరోపణలు చేసుకోవడం దారుణమన్నారు. నేతలు సంయమనం పాటించకుండా వాదోపవాదాలకు దిగడం విచారకరమని చెప్పారు. -
అమాంతంగా ఎదిగిన మోదీ
రాజకీయ ప్రసంగాలలో అసహనం, ద్వేషం, అహంకారం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని టీవీ న్యూస్ చానళ్లలో చర్చ పేరిట మర్యాద, మన్నన లేకుండా నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం, తర్జని చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ కేకలు వేయడం వీక్షకుల రక్తపోటు పెంచడం తప్పితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనమూ చేకూర్చడం లేదు. దేశ చరిత్రలో, ప్రధాని నరేంద్రమోదీ జీవితంలో మొన్నటి శుక్రవారం అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజు పార్లమెంటులోనూ, పార్లమెంటు సమావేశం అనం తరం ప్రధాని నివాసంలోనూ కనిపించిన సుహృద్భావం, రాజకీయ పరిపక్వత, నిర్మాణాత్మక దృక్పథం అవిచ్ఛిన్నంగా కొనసాగితే కొంతకాలంగా మేధావు లనూ, ప్రజాస్వామ్యవాదులనూ వేధిస్తున్న అనేక చిక్కు ప్రశ్నలకు సమాధా నాలు లభిస్తాయి. రాజ్యాంగ దివసం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు ఆరంభం సందర్భంగా రెండు రోజులు జరిగిన పార్లమెంటు సమావేశాలను ముగిస్తూ ప్రధాని చేసిన ప్రసంగం దేశ రాజకీయాలను మేలు మలుపు తిప్పే శక్తి కలిగినట్టిది. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును స్మరించుకుంటూ రెండురోజులు పార్లమెంటు ప్రత్యేకంగా చర్చ జరపాలన్న నిర్ణయం గొప్పది. ఇండియా పార్ల మెంటరీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడానికి అనేక మంది మహానుభావులు కారకులు. వారిలో ముగ్గురు చిరస్మరణీయులు. భారత రాజ్యాంగం ఉత్కృష్టమై నది. రాజ్యాంగ రచనలో కీలకమైన భూమిక పోషించిన దార్శనికుడు అంబే డ్కర్. రాజకీయ స్వాతంత్య్రమే కాకుండా సామాజిక, ఆర్థిక స్వాతం త్య్రానికి సైతం తోడ్పడే విధంగా, సమాజంలోని అంతరాలను తగ్గించే దిశగా రాజ్యాంగాన్ని నిర్మించిన స్రష్ట ఆయన. దేశ విభజన జరిగిన తీరు కారణంగా చెలరేగిన హింస, కల్లోలం మధ్య, మత కలహాల మధ్య తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ దేశాన్ని పరిపాలించేందుకు అవసరమైన వ్యవస్థను నిర్మించాడు. పేదరికం, అవిద్య, మూఢనమ్మకాలతో కునారిల్లుతున్న దేశానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధికి బాటలు వేసిన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ. అయిదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని నిర్మించిన రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ముగ్గురిలో ఇద్దరు విస్మృతిలోకి వెళ్లవచ్చును కానీ రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి కనుక దాని నిర్మాత ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుంది. రాజ్యాంగం సర్వోన్నతమైనది కనుకనే నెహ్రూ, పటేల్ కంటే అంబేడ్కర్‌కు కాలక్రమేణా జనాదరణ , ఆరాధనా భావన అసాధరణంగా పెరుగుతూ వస్తున్నది. ఎవరి పాత్ర వారు ప్రతిభావంతంగా పోషించారు కనుక అందరికీ చరిత్రలో చెరగని స్థానం ఉంటుంది. కాంగ్రెస్‌పై జైట్లీ దాడి ఒక ప్రతిభావంతుడైనా రాజకీయవాదికీ, ఒక దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ వ్యత్యాసం ఏమిటో శుక్రవారం (నవంబర్ 27, 2015)నాడు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని నరేంద్రమోదీ జాతికి స్పష్టంగా చూపించారు. చర్చను ప్రారంభించిన దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తన పరిమితులలోనే మాట్లా డారు. ధర్మనిరపేక్షత, పంథ్నిరపేక్షత అంటూ, సెక్యులరిజం అన్న పదాన్ని ఈ దేశంలో దురుపయోగం చేశారంటూ పాత ధోరణిలోనే ప్రసంగించారు. దేశంలో అసహనం పెరుగుతోందనీ, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోని పార్టీ, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని పార్టీ రాజ్యాంగ దివసం నిర్వహించడం విడ్డూ రంగా ఉన్నదనీ కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసిన విమర్శకు అరుణ్ జైట్లీ అత్యంత సమర్థంగా, నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా సమాధానం ఇచ్చారు. హిట్లర్‌తో ఇందిరకు పోలిక ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన ఇందిరాగాంధీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చి జైట్లీ కాంగ్రెస్‌వాదుల గుండెల్లో గునపం దింపారు. హిట్లర్ జర్మనీ రాజ్యాంగాన్ని వినియోగించుకొని 1933లో అదే రాజ్యాంగానికి తూట్లు పొడిచి నాజీ నియంతృత్వాన్ని నెలకొల్పిన క్రమంలోని కొన్ని ఘట్టాలను వివరించి అటువంటి ఘట్టాలే ఇందిర ఆత్యయిక పరిస్థతి విధించి నియంతగా మారిన క్రమంలోనూ ఉన్నాయని సోదాహరణంగా వివరించారు. హిట్లర్ సర్వాధికారాలను హస్తగతం చేసుకునేందుకు ముందుగా ఎమర్జెన్సీ విధించాడు. జర్మన్ పార్లమెంట్లో తనకు మెజారిటీ లేని కారణంగా ప్రతిపక్ష సభ్యులను నిర్బంధించాడు. పత్రికలపైన సెన్సార్షిప్ విధించాడు. తాను చేస్తున్నదంతా జర్మన్ల మంచికోసమేనని నమ్మబలికాడు. 25 అంశాల ఆర్థికాభివృద్ధి కార్య క్రమం ప్రకటించాడు. ప్రభుత్వం తీసుకునే చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించ కూడదంటూ ఒక చట్టం తీసుకొని వచ్చాడు. హిట్లర్ సలహాదారు రుడాల్ఫ్ హెస్ ‘హిట్లర్ ఈజ్ జర్మనీ, జర్మనీ ఈజ్ హిట్లర్’ అన్నాడు. ఇదే రీతిలో మన దేశంలో సైతం 1975లో ఎమర్జెన్సీ విధించారనీ, ప్రతిపక్ష నేతలను నిర్బంధించారనీ, పత్రికలపైన సెన్సార్షిప్ విధించారనీ, ఇదంతా దేశ ప్రజల మేలుకోరే చేస్తున్నట్టు చెప్పారనీ, 20 అంశాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించారనీ, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా ‘ఇండియా ఈజ్ ఇందిర’ అన్నారనీ ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించకుండానే జైట్లీ చెప్పవలసిందంతా చెప్పారు. రెండేళ్ల ఆత్యయిక పరిస్థితి తర్వాత ఇందిరే స్వయంగా ఎన్నికలు ప్రకటించిన సంగతి జైట్లీ చెప్పలేదు. అంబేడ్కర్ అనంతరం దేశంలో దళితులలో ఆత్మ విశ్వాసం పెంచిన నేత కూడా ఆమేనన్న వాస్తవాన్నీ ప్రస్తావించలేదు. తన వాద నకు అవసరమైన అంశాలనే ఏరుకున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇందిరా గాంధీ తీవ్ర విఘాతం కలిగించిన మాట వాస్తవమే. నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే శక్తిని ప్రసాదించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసినవారిని స్మరించుకోవలసిన సందర్భం ఇది. జైట్లీ ఒక సమర్థుడైన న్యాయవాదిగా కాంగ్రెస్ పార్టీ వాదనను చీల్చి చెండాడేందుకు ఇందిరను హిట్లర్‌తో పోల్చారు. ఆ క్రమంలో తన స్థాయిని తగ్గించుకున్నారు. అరుణ్‌జైట్లీ కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తుంటే పక్కనే మౌనంగా, గంభీ రంగా కూర్చున్న ప్రధాని చివరి వక్తగా గొప్పగా మాట్లాడారు. సామరస్యపూ రితంగా, హుందాగా, బాధ్యతాయుతంగా, వివేకవంతంగా ప్రసంగించి తోటి రాజకీయవాదులనూ, దేశ ప్రజలనూ ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచెత్తారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ రహిత భారతదేశం) కావాలంటూ 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ మొన్నటి వరకూ దేశంలో మాట్లాడినా, విదేశాలలో ప్రవాస భారతీయుల సభలలో మాట్లాడినా ఎన్నికల భాషే మాట్లాడారు. విదేశీ సభలలో సైతం కాంగ్రెస్ నాయ కులను దుయ్యబట్టడం, ఇంతవరకూ ప్రధానులుగా పని చేసినవారు దేశాన్ని భ్రష్టపట్టించారన్నట్టు పొగరుగా మాట్లాడటం కొనసాగించారు. మొన్న అకస్మాత్తుగా అద్భుతంగా ప్రసంగించి తన స్థాయిని పెంచుకున్నారు. రాజ నీతిజ్ఞుడైన ప్రధానిలాగా మాట్లాడారు. ఈ మార్పుకు కారణాలు ఏమిటి? బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి మొదటిది. తన హవా తగ్గిపోతున్నదనే అంశం మోదీకి అర్థమై ఉండాలి. తనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి (గ్రాండ్ అలయెన్స్) మాదిరి ప్రతిపక్ష సంఘటనలు వచ్చే సంవత్సరం ఎన్ని కలు జరగబోయే రాష్ట్రాలలో కూడా ఏర్పడితే బీజేపీకి కనుచూపు మేర విజయా వకాశాలు కనిపించవనే ఎరుక రెండో కారణం. బీజేపీలోనే సీనియర్ నాయకుల నేతృత్వంలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉన్నదనే భయం మూడో కారణం. ఆర్థిక రంగంలో మాటలే కానీ చేతలు లేకపోవడం, మోదీకి వీరాభిమానులైన కార్పొరేట్ దిగ్గజాలూ, వణిక్ ప్రముఖులూ పెదవి విరవడం, ప్రతిపక్షాన్ని కలుపుకొని పోకుండా జిఎస్టి (గుడ్స్ అండ్ సర్వీస్ టాక్స్)వంటి బిల్లులకు ఆమోదం లభించదనీ, ఆర్థిక సంస్కరణలు అడుగు ముందుకు సాగదనీ గ్రహించడం నాలుగో కారణం. సొంత పార్టీలోని హిందూత్వవాదుల వల్ల తనకూ, తన పార్టీకీ, తన ప్రభుత్వానికీ అప్రతిష్ఠ వస్తున్నదనీ, విదేశాలలో భారత ప్రతిష్ఠ దిగజారుతున్నదనీ తెలుసుకోవడం అయిదో కారణం. తనపైన మోజు తగ్గడంతో కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్‌గాంధీకి ఎంతో కొంత ఆదరణ పెరుగుతోందన్న అభిప్రాయం ఆరో కారణం. మోదీ మొండివాడనీ, ఆహంకారి అనీ, వ్యతిరేక భావాలను సహించే మనస్తత్వం లేదనీ, నెహ్రూను కురచగా చూపించేందుకు సర్దార్ పటేల్‌నూ, అంబేడ్కర్నూ కీర్తిస్తున్నాడనే అభిప్రాయం ప్రబలడం మంచిది కాదనే స్పృహ ఏడో కారణం. రాజ్యాంగంపైన పార్లమెంటులో చేసిన ప్రసంగంలో మోదీ తనపైన ప్రజ లకున్న అంచనాను కొన్ని అడుగుల ఎత్తు పెంచుకున్నారు. తన ముందు పని చేసిన ప్రధానులంతా దేశాభివృద్ధికి కృషి చేశారనీ, దానికి కొనసాగింపుగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాననీ చెప్పడం ఒక ఆరోపణకు సమాధానం. అంబేడ్కర్‌ను ఆకాశానికెత్తుతూనే నెహ్రూ గురించి రెండు మంచి మాటలు చెప్పడం విశేషం. ‘మేడమ్ సోనియాజీ’ అంటూ సంబోధించడం ద్వారా ప్రతిపక్షం పట్ల గౌరవం ప్రదర్శించారు. పార్లమెంటులో ప్రతిష్టంభన నివారిం చేందుకు సమాలోచనలకు రావలసిందిగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్నూ, సోనియాగాంధీనీ తన ఇంటికి ఆహ్వానించాలన్నది గొప్ప నిర్ణయం. కాంగ్రెస్ నాయకులు సైతం సముచితంగా స్పందించి ప్రధాని నివాసానికి వెళ్ళి 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. తమ వాదన వినిపించారు. తొలి విడత సమాలోచనలో అంగీకారం కుదరకపోయి ఉండవచ్చు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒక చోట కూర్చొని సమస్యలపైన చర్చించడమే స్వాగతించవలసిన సందర్భం. పెరుగుతున్న అసహనం, ద్వేషం కొంతకాలంగా దేశంలో రాజకీయాలు బాగా దిగజారాయి. రాజకీయ ప్రసం గాలలో అసహనం, ద్వేషం, అహంకారం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని టీవీ న్యూస్ చానళ్లలో చర్చ పేరిట మర్యాద, మన్నన లేకుండా నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం, తర్జని చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ కేకలు వేయడం వీక్షకుల రక్తపోటు పెంచడం తప్పితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనమూ చేకూర్చడం లేదు. ఇటీవల అసహనంపైన జరిగిన చర్చలో ప్రయోగించిన పదజాలం, ప్రదర్శించిన శరీరభాష నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కానివి. మొన్నటి వరకూ ప్రధాని స్వయంగా పరుషంగా మాట్లాడటంతో అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి అనుభవజ్ఞులైన అమాత్యులే కాకుండా స్మృతి ఇరానీ వంటి కొత్త మంత్రులు సైతం ప్రతిపక్షాలనూ, ప్రతిపక్ష నాయకు లనూ అవహేళన చేయడం, కటువుగా మాట్లాడటం దేశ ప్రజలు గమనిస్తు న్నారు. మహేశ్ శర్మ వంటి హిందూత్వవాద మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, అసోం గవర్నర్ వంటి ఉన్నత పదవులలో ఉన్నవారూ భిన్నాభి ప్రాయం వెలిబుచ్చిన ముస్లింలను ఈ దేశం విడిచి పాకిస్తాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్ళిపొమ్మంటూ హుంకరించడం ప్రజలకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. రాజ్యాంగ దివసం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఈ పెడధోరణులన్నింటికీ అడ్డుకట్ట వేయాలి. ‘మై ఐడియా ఆఫ్ ఇండియా (ఇండియా అంటే నా ఉద్దేశం)’ ఇదీ అంటూ మోదీ అనేక విధాలుగా హిందీలో, సంస్కృతంలో, ఇంగ్లీషులో చెప్పినా, ‘ఇండియా ఫస్ట్’ అన్నదే తన మతమనీ, రాజ్యాంగమే పవిత్రగ్రంథమనీ స్పష్టం చేసినా ఆయన వీరాభిమానులు అర్థం చేసుకోకుండా పాత మానసిక ధోరణినే కొనసాగిస్తే వారిని దారిలో పెట్టవలసిన బాధ్యత ప్రధానమంత్రిదే. అధికార పక్షంలో వచ్చిన లేదా వచ్చినట్టు కనిపిస్తున్న పరివర్తన ప్రతిపక్షాలనే కాకుండా సమస్త రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది. పార్లమెంటులో ప్రతిష్టంభన తొలగకపోతే ప్రజలకు అపకారం. అధికార పక్షానికి నష్టం. ప్రధానికి కోలుకో లేని దెబ్బ. అనేక దేశాలలో పర్యటించి ఆయా దేశాధినేతలకూ, అక్కడి పారిశ్రా మికవేత్తలకూ ఇండియాలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్నదనీ, త్వరలోనే జీఎస్టీ అమలులోకి వస్తుందనీ గొప్పలు చెప్పిన ప్రధాని అన్ని పక్షాలనూ కలుపుకొని ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందకపోతే నవ్వులపాలు అవుతారు. కోతలరాయుడుగా తేలుతారు. ప్రతిపక్షాలను కలుపు కొని ప్రజాహితానికి పాటుపడితే ఆదర్శవంతమైన ప్రధానిగా చరిత్రలో ఉన్నత స్థానం సంపాదించుకుంటారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిర్ణయం మోదీదే. అమలు చేయవలసిన బాధ్యతా ఆయనదే. కె.రామచంద్రమూర్తి (సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్) -
'ఇన్స్పెక్టర్ రాజ్' పూర్తిగా అంతం కాలేదు
హైదరాబాద్: ఇందిరాగాంధి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన 'ఇన్స్పెక్టర్ రాజ్' ఇప్పటికీ వ్యవస్థలో కొనసాగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో 1990 లలో ప్రవేశపెట్టిన ఆర్థీక సంస్కరణలతో ఇన్స్పెక్టర్ రాజ్ విధానం క్షీణించినప్పటికీ పూర్తిగా అంతం కాలేదన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ తన వివేకంతో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతను కల్పించారనీ, అయితే ఇందిరాగాంధీ తన స్వంత ప్రయోజనాల కోసం చేసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా ఇన్స్పెక్టర్ రాజ్ విధానం ఏర్పడిందన్నారు. ఇన్స్పెక్టర్ రాజ్ అనేది ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ యూనిట్ల మీద ప్రభుత్వం యొక్క అతి జోక్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా 1970-80 మధ్య కాలంలో దేశంలో ఈ విధానం విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఈ మధ్య కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కూడా దానిని పూర్తిగా తొలగించలేకపోయిందనీ అయితే చాలా వరకు దాని ప్రభావం క్షీణించిందని వెంకయ్యనాయుడు తెలిపారు. -
నాయనమ్మ బాటలోనే రాహుల్
న్యూఢిల్లీ: కేదార్ నాథ్ ఆలయానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాను హెలికాప్టర్ పంపిస్తానని చెప్పినా వద్దన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తెలిపారు. గౌరికుంద్ నుంచి కేదార్ నాథ్ వరకు ఆయన మొత్తం 17 కిలో మీటర్లు నడిచి వెళ్తారని చెప్పారు. చాలా రోజుల విరామం తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ వారం రోజులుగా పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో ధీటుగా స్పందిస్తూ తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కేదార్ నాథ్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. దీనిపైనే హరీశ్ రావత్ మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్‌ను దర్శించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను ఇందిరతో ఉన్నానని, ఇప్పుడు రాహుల్తోనని నాడు ఇందిరా బద్రీనాథ్ బాబా దీవెనలు పొందితే ఇపుడు రాహుల్ కేదార్ బాబా దీవెనలు పొందనున్నారని చెప్పారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కాలినడకన ఆలయాన్ని చేరుకొని రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటికే రాహుల్ మరికొందరు నేతలతో కలసి కేదార్ నాథ్ బయలు దేరారు.