
ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల్లో గొడవ జరిగింది. వేదికపై సీటు కోసం మాజీ మంత్రి సీఆర్ఆర్, పీసీసీ కార్యదర్శి సుజాత వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరి పై ఒకరు పరస్పర మాటలు తూటాలు పేల్చుకున్నారు. ఎంత నచ‍్చచెప్పినా గొడవ సద్దుమణగకపోవడంతో ఆగ్రహం చెందిన మాజీ ఎంపీ వి.హన‍్మంతరావు సభ మధ‍్యలోనే వేదికపై నుంచి దిగి వెళ్ళిపోయారు.
ఈ సందర‍్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి వేడుకలలో పరస్పరం ఆరోపణలు చేసుకోవడం దారుణమన్నారు. నేతలు సంయమనం పాటించకుండా వాదోపవాదాలకు దిగడం విచారకరమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment