
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ని ప్రజల హృదయాల నుంచి చెరిపేసే కుట్ర జరుగుతోం దని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఇందిర వర్ధంతిని ప్రధాని మోదీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఇందిరను స్మరించకపోవడం శోచనీయమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కేవలం ఒక వర్గానికి పరిమితం చేసేలా మోదీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment