Vallabhai Patel statue
-
‘ఇందిరాగాంధీని ప్రజల నుంచి చెరిపేసే యత్నం’
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ని ప్రజల హృదయాల నుంచి చెరిపేసే కుట్ర జరుగుతోం దని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఇందిర వర్ధంతిని ప్రధాని మోదీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఇందిరను స్మరించకపోవడం శోచనీయమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కేవలం ఒక వర్గానికి పరిమితం చేసేలా మోదీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
'సర్ధార్ పటేల్ లేకుంటే హైదరాబాద్‌కు వీసా అవసరమయ్యేది
హైదరాబాద్: సర్ధార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కు వీసా తీసుకోవాల్సి వచ్చేదని గుజరాత్ న్యాయశాఖా మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు. పటేల్ విగ్రహానికి, బీజేపీకి సంబంధముందన్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. సర్ధార్ పటేల్ విగ్రహానికి, బీజేపీకి సంబంధం లేదని జడేజా తెలిపారు. పటేల్ విగ్రహ ప్రతిష్టాపన ట్రస్టు ద్వారా జరుగుతోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి రైతూ ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దేశంలోని ప్రతీ గ్రామం నుండి పాత ఇనుమును సేకరించనున్నారు. దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని, ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
వల్లభాయ్‌పటేల్ విగ్రహానికి ప్రతి గ్రామం నుంచి ఇనుము సేకరణ
గాంధీనగర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దేశంలోని ప్రతీ గ్రామం నుండి పాత ఇనుమును సేకరించనున్నారు. దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని, ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇటీవల హర్యానాలో జరిగిన ఒక సభలో కూడా చెప్పారు. 'అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ' విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ఉంటుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు దేశంలోని రైతులందరూ తమ నాగళ్ల నుంచి చిన్న ఇనుము ముక్కను పంపించాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి 200-300 గ్రాముల ఇనుముని సేకరిస్తామని చెప్పారు. న్యూయార్క్ నగరంలోని లిబర్టీస్ అనే రోమన్ దేవత విగ్రహం 1886 సంవత్సరలో అమెరికా దేశానికి ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చారు.