వల్లభాయ్‌పటేల్ విగ్రహానికి ప్రతి గ్రామం నుంచి ఇనుము సేకరణ
గాంధీనగర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్‌లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం దేశంలోని ప్రతీ గ్రామం నుండి పాత ఇనుమును సేకరించనున్నారు.
దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని, ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఇటీవల హర్యానాలో జరిగిన ఒక సభలో కూడా చెప్పారు. 'అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ' విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ఉంటుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు దేశంలోని రైతులందరూ తమ నాగళ్ల నుంచి చిన్న ఇనుము ముక్కను పంపించాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి 200-300 గ్రాముల ఇనుముని సేకరిస్తామని చెప్పారు.
న్యూయార్క్ నగరంలోని లిబర్టీస్ అనే రోమన్ దేవత విగ్రహం 1886 సంవత్సరలో అమెరికా దేశానికి ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చారు.