తిరువనంతపురం: ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్‌గోపీ మరో వివాదానికి తెర తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ది నేషన్’గా అభివర్ణించి సంచలనం రేపారు.
శనివారం(జూన్ 15) కేరళ త్రిసూర్‌లోని కాంగ్రెస్ నేత కరుణాకరణ్ సమాధి ‘మురళి మందిర్’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్‌గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేగాక కరుణాకరన్‌తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్‌కు కరుణాకరణ్ తండ్రి అని చెప్పారు. అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు.
ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్ నుంచి సురేశ్‌గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. దీంతో కేంద్రంలోని మోదీ3.0 మంత్రి వర్గంలో సురేశ్‌గోపీకి చోటు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment