
ఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు మరోసారి ఝలక్‌కు ఇచ్చారు. తాజాగా, ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు.
గతేడాది ఆకాష్ ఆనంద్‌కు ఇదే పదవిలో కొనసాగుతుండగా.. తొలగిస్తూ మాయావతి అన్యూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాధ్యతల నుంచి ఆకాష్ నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్ స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించింది. రాజకీయాల్లో ఆకాష్ మరింత పరిణితి పొందాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ సున్నా స్థానాలకే పరిమితమైంది.
ఆ తర్వాత జూన్ 2024లో ఆకాష్ ఆనంద్‌ను తిరిగి పార్టీకి తీసుకున్నారు. పలు పార్టీ పదవుల్ని కట్టబెట్టారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ మేనల్లుడిని అన్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది.