త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment