misuse
-
తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై టీటీడీ నిఘా
-
వనంలో వనితలపై అనుచిత నిఘా
పెద్దపులులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా అలరారుతున్న ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఘోరం జరుగుతోంది. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు, జంతువుల సంఖ్యను లెక్కపెట్టేందుకు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు అడవిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, డ్రోన్లను గ్రామీణ మహిళలపై అనుచిత నిఘాకు వాడుతున్న వైనం కలకలం రేపుతోంది. వంట చెరకు, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే గ్రామీణ మహిళలను దొంగచాటుగా చూసేందుకు కొందరు అధికారులు, స్థానికులు ఈ కెమెరాలు, డ్రోన్లు, వాయిస్ రికార్డర్లను వాడుతున్నారు. ఈ విస్మయకర విషయాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెలుగులోకి తెచ్చింది! అడవే వారికి జీవనాధారం ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అక్కడి గ్రామీణ మహిళలకు అడవే ఆధారం. వంట చెరకు, తేనె, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. రోజుల పాటు అక్కడే గడుపుతారు. తాగుబోతు భర్తల హింస, వేధింపులు తాళలేక అడవి బాట పట్టే అతివలు ఎందరో. అడవి తల్లిని ఆశ్రయించే ఈ మహిళలకు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలు, డ్రోన్లు తలనొప్పిగా తయారయ్యాయి. అడవిలో సెలయేర్లు, గట్ల వద్ద స్నానాలు చేసే, బహిర్భూమికి వెళ్లే మహిళలను డ్రోన్లు, నిఘా కెమెరా కళ్లు వెంటాడుతున్నాయని కేంబ్రిడ్జ్ అధ్యయనంలో తేలింది. ‘‘మహిళలు అటవీ సంపదను కొల్లగొట్టకుండా వారిని బయటకు తరిమేందుకు మొదట్లో కెమెరా ట్రాప్‌లు, డ్రోన్లను అధికారులు వాడేవారు. తర్వాత కొందరు అధికారులు ఇలా మహిళలను దొంగచాటుగా చూసేందుకు దుర్వీనియోగం చేశారు. ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఇటీవల ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వాట్సాప్‌లోనూ షేర్ చేయడంతో విషయం గ్రామస్తుల దాకా చేరింది. చివరకు స్థానిక నిఘా కెమెరాలను తగలబెట్టే దాకా వెళ్లింది’’అని కేంబ్రిడ్జ్‌లో సోషియాలజీ విభాగ పరిశోధకుడు, నివేదిక ముఖ్య రచయిత త్రిశాంత్ సిమ్లయ్ చెప్పారు. నివేదిక వివరాలు ‘ఎన్విరాన్మెంట్, ప్లానింగ్ ఎఫ్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదేం దిక్కుమాలిన పని! ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో అత్యంత విలువైన వనమూలికలుంటాయి. వాటిని సేకరించి పొ ట్ట నింపుకునేందుకు గ్రామీణ మహిళలు అడవుల్లోకి వెళ్తుంటారు. గుంపులుగా వెళ్లి కొద్ది రో జలు అక్కడే ఉంటారు. ‘‘అడవి తల్లితో మాకెంతో అనుబంధం. ఇంట్లో మాకు నిర్బంధం ఎక్కువ. పెళ్లి వంటి వేడుకలప్పుడు తప్పితే కనీసం నోరు తెరిచి పాడటం కూడా తప్పే. అందుకే వనదేవత ఒడికి చేరినప్పుడే అందరం కలిసి ఆనందంగా పాటలు పాడుతూ పనిలో నిమగ్నమవుతాం’’అని ఒక గ్రామీణురాలు తెలిపారు. తాజాగా కొన్ని చోట్ల నిఘా కెమెరాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతాల్లో పులి సంచారంపై అధికారులకు నిఘా కరువైంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో కెమెరాల దుర్వీనియోగం చివరకు మహిళ ప్రాణాలను బలి గొందని స్థానికుల్లో ఆగ్రహం రేగింది. ‘‘రెక్కా డితేగానీ డొక్కాడని పేద మహిళలు ఇప్పటికీ అడవిలోకి వెళ్తు న్నారు. కానీ ఏ చెట్టు కొమ్మకు ఏ కెమెరా ఉందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. వాళ్ల గొంతులు మూగబోయాయి. అమాయక గ్రామీణుల జీవనశైలి మీదే ఇది ప్రభావం చూపుతోంది’’అని పర్యావరణవేత్తలు, సా మాజికవేత్తలు అంటున్నారు. జంతువులను చూడమంటే మహిళలను దొంగచాటుగా చూడటమేటని త్రిశాంత్ ప్రశ్నించారు.స్పందించని అధికారులు దీనిపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా అధికారులు స్పందించలేదు. జిమ్ కార్బెట్ జాతీయవనం ఢిల్లీ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాది అంతటి నుంచీ ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ జీప్ సఫారీ సౌకర్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఉప ఎన్నికల్లో బీఎస్ఫీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.ఈ ఫలితాల అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. గతంలో బ్యాలెట్ పేపర్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా నకిలీ ఓట్లు వేసేవారని, ఈ పని ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూడా జరుగుతోందని మాయావతి ఆరోపించారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
TG: 'ఆసరా' పక్కదారి..
సాక్షి, హైదరాబాద్: ఆపన్నులకు ఇచ్చే ఆసరాలోనూ దుర్వినియోగం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సెర్ప్ తనిఖీల్లో బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం ఉద్యోగులు, వారి కుటుంబీకులు.. రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆపన్నులకు, అభాగ్యులకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్లను అందుకుంటున్నట్లు బయట పడింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5650 మంది అటు ఉద్యోగ పెన్షన్లతో పాటు.. ఆసరా పెన్షన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు ఇటీవలి సెర్ప్ సర్వేలో వెల్లడైంది. వీరిలో 3824 మంది ఇప్పటికే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగతా 1826 మంది ఇప్పటికీ రెండు పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్‌ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే.. అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకుంటున్నారు.గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు... ఈ విధంగా డబుల్ పింఛన్లు అందుకున్నట్లు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రూ.2.50 కోట్లు ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా అధికారుల విచారణలో తేలింది.రాష్ట్రవ్యాప్తంగా తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలోనే ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిశలు, వృద్ధులు,బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు. గత ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు ఇవ్వగా కొత్త ప్రభుత్వం వీటిని ‘చేయూత’ పెన్షన్లుగా పేరు మార్చింది.మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని.. ఇదంతా అమానవీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హుల జాబితాలోనే ఉండటం గమనార్హం. దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేది. 2010లో ఆమె మరణించింది. ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు రూ.24073 ఫ్యామిలీ పెన్షన్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆమెకు మరోవైపు ఆపన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. అందుకే జూన్ నెల నుంచి ఆసరా పెన్షన్ ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు. అనర్హులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జాతీయ రహదారులు, రోడ్లకు కూడా రైతుబంధు చెల్లించి దాదాపు రూ.25,672 కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అదే తీరుగా ఆసరా పెన్షన్ల పేరిట భారీఎత్తున నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం తాజా సంఘటనలో తేలిపోయింది. -
పాన్‌కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్‌ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్‌కార్డ్ నెంబర్‌తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
కృత్రిమ మేధ దుర్వినియోగంతో పెను సంక్షోభం
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగం అవుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు సృష్టించడానికి కృత్రిమ మేధను వాడుకుంటున్నారని, ఇదొక పెను సంక్షోభానికి దారి తీస్తోందని హెచ్చరించారు. ఏఐ దుర్వినియోగం, దాని ప్రభావంపై ప్రజల్లో చైతన్యం పెంచాలని చేయాలని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ‘దివాళీ మిలన్’ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. గార్బా వేడుకలో తాను పాట పాడుతున్నట్లు ఇటీవల ఓ ఫేక్ వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించారని, ఓ అభిమాని తనకు ఆ వీడియోను పంపించాడని తెలిపారు. నిజానికి పాఠశాల రోజుల నుంచి తాను ఏనాడూ పాట పాడలేదని నవ్వుతూ చెప్పారు. వైవిధ్యంతో కూడిన మన సమాజంలో డీప్‌ఫేక్‌లు పెద్ద ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఏఐ పరిజ్ఞానంతో డీప్‌ఫేక్‌ల సృష్టి వల్ల కొత్త సంక్షోభం తెరపైకి వస్తోందని వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వీడియోలు నిజమో కాదో తేల్చుకునే వ్యవస్థ ప్రజలందరికీ అందుబాటులో లేదని పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’కు ప్రజల మద్దతు వివాదాస్పద దృశ్యాలు, సంభాషణలు ఉన్న చలనచిత్రాలు గతంలో వస్తే కొద్దిరోజుల్లోనే ఆ రగడ చల్లారేదని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం అలాంటి చిత్రాలను సమాజంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, పెద్ద వివాదంగా మారుస్తున్నాయని, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆ చిత్రాలు పరాజయం పాలవుతున్నాయని చెప్పారు. సిగరెట్ పెట్టెలపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు ఉన్నట్లుగానే డీప్‌ఫేక్ వీడియోలపైనా అలాంటి హెచ్చరికలు ఉంటే బాగుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇది కేవలం నోటిమాట కాదని, క్షేత్రస్థాయిలో జరగబోయే వాస్తవమని స్పష్టం చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారానికి జనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సమయంలో దేశంలో రూ.4.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగిందని తెలిపారు. కోవిడ్–19 ముప్పు తొలగిపోవడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారని చెప్పారు. సాధారణ ప్రజల మరణాలను ఖండిస్తున్నాం ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై మోదీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పశి్చమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు ప్రపంచానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ మానవాళి క్షేమం కోసం గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కేంద్రం వర్చువల్‌గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్’ రెండో ఎడిషన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు చనిపోతుండడం బాధాకరమని చెప్పారు. చర్చలు, దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలన్నారు. 21వ శతాబ్దంలో మార్పులకు లోనవుతున్న ప్రపంచాన్ని ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్’ వేదిక ప్రతిబింబిస్తోందన్నారు. ఐదు ‘సీ’లు.. కన్సల్టేషన్, కమ్యూనికేషన్, కో–ఆపరేషన్, క్రియేటివిటీ, కెపాసిటీ బిల్డింగ్ అనే ఫ్రేమ్‌వర్క్ కింద గ్లోబల్ సౌత్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
‘ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది నేర దర్యాప్తు సంస్థ(Crime Investigation Department..సీఐడీ). ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. ‘‘సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టాం’’ అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారాయన. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్ తెలిపారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించాం. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడం. ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ విధంగా 45 తప్పుడు పోస్టులని గుర్తించాం. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించాం. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపాం. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టాం. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు’’ అని సీఐడీ సూచించింది. సోషల్ మీడియా అకౌంట్స్‌ను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్‌లు 19 మందికి నోటీసులు ఇచ్చాం. ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చాం. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశాం. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లని గుర్తించాం. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్‌లు పెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. -
‘కృత్రిమ మేథ’తో రసాయన దాడులు? ‘ఛాలెంజ్’ స్వీకరించిన ‘ఓపెన్ ఏఐ’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ముడిపడిన విస్తృత నష్టాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి ఓపెన్ ఏఐ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపులు, వ్యక్తిగత ఒప్పందాలు, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ రెప్లికేషన్తో సహా సంభావ్య ఏఐ బెదిరింపులపై ఈ బృందం దృష్టి సారించనుంది. అలెగ్జాండర్ మాడ్రీ నేతృత్వంలోని ఈ బృందం.. ఏఐని ఉపయోగించుకుని ఎవరైనా చేసే కుట్రపూరిత చర్యలకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించింది. అలాగే ఏఐ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాలను పరిశోధిస్తుంది. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో ఉత్తమంగా నిలిచిన వాటికి ఏపీఐ క్రెడిట్‌తో పాటు 25 వేల డాలర్లు(ఒక డాలర్ రూ.83.15) అందించనున్నట్లు ప్రకటించింది. చాట్ జీపీటీ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసే ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏఐతో ఏర్పడే ముప్పును అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ఇటీవలే దీని గురించి వెల్లడించింది. దీని ప్రధాన లక్ష్యం ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే భారీ ముప్పులపై అధ్యయనం చేయడం, అంచనా వేయడం, తగ్గించడం. గత జూలైలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే ముప్పును అరికట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సూచించింది. కృత్రిమ మేధస్సుతో ముడిపడిన ఏఐ వ్యవస్థలు ఏదో ఒక రోజు మానవ మేధస్సును అధిగమించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేథలో తలెత్తే ముప్పును నివారించే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో 2023 మే నెలలో ఈ సంస్థ.. ఏఐతో కలిగే ముప్పును ప్రస్తావిస్తూ, ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. కృత్రిమ మేథస్సుతో కలిగే నష్టాలను ప్రపంచ స్థాయిలో తీవ్రంగా పరిగణించాలని ఆ లేఖలో ఓపెన్ ఏఐ కోరింది. ఇది కూడా చదవండి: ఖతార్‌లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు? -
సోషల్ మీడియా దుర్వినియోగంపై... జర జాగ్రత్త: సీజేఐ
సాక్షి, చెన్నై: వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టే సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఐఐటీ మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కలి్పంచాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేసి నిరుపాయకరమైందిగా మార్చా లన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ పేర్కొన్నారు. -
ఇబ్బందికర సందేశాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది. ‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్లను ప్రదర్శిస్తాయి. టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్లాక్‌చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన అన్ని హెడర్లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. -
చైనాలో తొలి ‘చాట్‌జీపీటీ’ అరెస్టు
బీజింగ్: రైలు ప్రమాదానికి గురైందని, తొమ్మిది మంది చనిపోయారని తప్పుడు వార్తను చాట్‌జీపీటీలో సృష్టించి, ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. చైనాలో చాట్‌జీపీటీ దుర్వినియోగం కారణంగా జరిగిన తొలి అరెస్టు ఇదేనని పోలీసులు చెబుతున్నారు. వాయవ్య గాన్సు ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు హాంగ్ అనే మారుపేరుతో చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. అతడు సృష్టించిన తప్పుడు వార్త నిజమని భ్రమించి, కొన్ని పత్రికలు ప్రచురించడం గమనార్హం. -
సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విపక్షాలకు చుక్కెదురైంది. సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ సహా 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నాయకుల అరెస్టులపై నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని విపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిర్దిష్ట కేసు వివరాలు లేకుండా మార్గదర్శకాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సామాన్యుడికి, రాజకీయ నాయకులకు వేర్వేరు న్యాయ సూత్రాలు ఉండవని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజకీయ నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించలేం అని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని విపక్షాల తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వీ న్యాయస్థానాన్ని కోరారు. విపక్షాల స్పేస్ తగ్గిందని కోర్టులను ఆశ్రయించడం సరికాదు, దానికి సరైన వేదిక రాజకీయాలే అని సుప్రీకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాజకీయాల్లోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని హితవు పలికింది. చదవండి: ఛానల్ బ్యాన్.. కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. -
మీ ఫోన్ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్..!
సాక్షి, హైదరాబాద్: మీ ఫోన్ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్‌ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. మనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ పోర్టల్‌లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేయవచ్చు. అంటే మన ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ దొరికాక అన్‌బ్లాక్ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌తోపాటు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్ పోర్టల్‌లో జత చేయాలి. వివరాలన్నీ అప్లోడ్ చేస్తే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్‌లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్ పనిచేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్ సైతం ఈ పోర్టల్‌లో ఉంది. మార్చి 15 నుంచి అమల్లోకి.. వాస్తవానికి సీఈఐఆర్ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ సీఈఐఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పోలీసు సిబ్బంది ఈ సేవలు వాడాలి: డీజీపీ మొబైల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్.. ఇకపై అలాంటివి కుదరదు!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్ ట్రాకింగ్ వివాదానికి సంబంధించిన కేసును టెక్ దిగ్గజం గూగుల్ సెటిల్ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లొకేషన్ ట్రాకింగ్ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్‌ను ట్రాక్ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్‌పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్ డాలర్లకు గూగుల్ సెటిల్ చేసుకుంది. ఇలా కస్టమర్ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్‌సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
గూగుల్‌కు సీసీఐ రూ. 1,338 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి వివిధ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న అభియోగాలపై టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. అంతే కాకుండా అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడాన్ని మానుకోవాలని ఆదేశించింది. నిర్దిష్ట వ్యవధిలోగా తన తీరును మార్చుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మూడేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే మొబైల్ తయారీ సంస్థలు (ఓఈఎం) .. గూగుల్ మొబైల్ సూట్‌ను (జీఎంఎస్) కూడా పొందుపర్చేలా తప్పనిసరిగా నిర్దిష్ట ఒప్పందం కుదుర్చుకోవాలని గూగుల్ షరతు విధిస్తోందన్న ఆరోపణ కూడా ఈ ఫిర్యాదుల్లో ఉంది. దీనితో పాటు మరికొన్ని అభియోగాలపై లోతుగా విచారణ జరపాలంటూ 2019 ఏప్రిల్‌లో సీసీఐ ఆదేశించింది. అక్టోబర్ 25న పదవీ విరమణ చేస్తున్న సీసీఐ చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా తాజాగా తుది ఉత్తర్వులు ఇచ్చారు. అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా జీఎంఎస్ను తప్పనిసరిగా ప్రీ–ఇన్స్టాల్ చేయాలనడం డివైజ్‌ల తయారీదారులకు అసమంజస షరతు విధించడమే అవుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే, స్మార్ట్ డివైజ్‌లలో ప్రీ–ఇన్స్టాల్డ్ యాప్స్‌ను ఎక్కడ ఉంచాలనే విషయంలోనూ ఓఈఎంలపై ఒత్తిడి తేకూడదని స్పష్టం చేశారు. -
సీబీఐకి అనుమతులు ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమె త్తారు. విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సీబీఐ, ఈడీలతో దాడులు చేయి స్తూ ఆ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్రం వైఖరితో ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాల ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ తరహా దాడులు ఆగాలంటే.. విచారణకు వీ లుగా సీబీఐకి ఇచ్చిన అనుమతులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సూచించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రా ల పరిధిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. బుధవారం బిహార్ రాజధాని పట్నాలో పర్యటించిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. విస్తృత చర్చల తర్వాతే.. ‘దేశంలోని విపక్ష పార్టీలను అంతమొందించి గుత్తాధిపత్యం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఒకవైపు బలహీనులను బెదిరిస్తూ సత్య హరిశ్చంద్రుని వారసుల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కుంభకోణాలకు పాల్పడటమే కాకుండా ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ డబ్బును బీజేపీ వెదజల్లుతోంది. దేశంలోని విపక్షాలన్నీ ఏకమై బీజేపీ ముక్త భారత్‌ను సాధిస్తేనే దేశ పురోగతి సాధ్యమ వుతుంది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి ముందుకు సాగుతాం. విస్తృత చర్చల అనంతరం ఎన్నికల సమయంలో ఈ శక్తికి ఎవరు నేతృత్వం వహిస్తారనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం’ అని కేసీఆర్ చెప్పారు. ధర్మం పేరిట దేశాన్ని చీల్చుతున్నారు.. ‘ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలోని ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో లేనంతగా పడిపోయింది. గతంలో దేశం నుంచి మేధో వలస జరగ్గా, ఇప్పుడు పెట్టుబడిదారులు దేశాన్ని వీడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తిని అంతమొందించేందుకు ఎఫ్ఆర్బీఎం వంటి చట్టాల పేరిట ఇబ్బందులు పెడుతున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు, బేటీ పడావో.. భేటీ బడావో వంటివి కేవలం నినాదాలకే పరిమితమవుతున్నాయి. ధర్మం పేరిట దేశాన్ని చీల్చుతూ అంతర్జాతీయ స్థాయిలో తలవంపులు తెస్తున్నారు. భిన్నంగా ఆలోచించాలి.. 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా సాగునీరు, తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ కొరత ఉంది. మేకిన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్నా జాతీయ జెండాను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా దేశంలో నెలకొని ఉన్న సమస్యల నుంచి బయట పడేందుకు భిన్నంగా ఆలోచించాలి. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై సీఎం నితీశ్‌తో కూడా చర్చించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టుదలతో ముందుకు సాగండి: నితీశ్ తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని బిహార్ సీఎం నితీశ్ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు భారత్‌కు మార్గదర్శకంగా నిలుస్తు న్నాయని అన్నారు. కేసీఆర్ గురించి అవగా హన లేనివారే తప్పుడు మాటలు మాట్లాడు తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవస రంలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు వదులు కోరంటూ.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టు దలతో ముందుకు కొనసాగాలని, మరింత శక్తి కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించాలని నితీశ్ సూచించారు. లాలూతో కేసీఆర్ భేటీ బుధవారం ఉదయం 12 గంటలకు బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమా నంలో పట్నాకు వెళ్లిన కేసీఆర్ కు.. తేజస్వీ యాదవ్ స్వాగ తం పలికారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత దేశ రాజ కీయాలు, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు. అనంతరం నితీశ్, తేజస్వీతో కలిసి కేసీఆర్ మీడియా భేటీలో ప్రసంగించారు. తర్వాత బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిసిన కేసీఆర్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం గురుగోవింద్ సింగ్ జన్మస్థలం పట్నా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్‌కు చేరుకు న్నారు. సీఎం వెంట బిహార్‌కు వెళ్లిన బృందంలో సీఎస్ సోమేశ్‌కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు, తదితరులున్నారు. అమర వీరులు, కార్మికుల కుటుంబాలకు సాయం చైనాతో పోరాటంలో భాగంగా గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు, అలాగే సికింద్రాబాద్‌లోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన బిహార్ కార్మికుల కుటుంబాలకు.. నితీశ్‌తో కలిసి కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. నితీశ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సా యం చెక్కుల రూపంలో అందజేశారు. -
పార్లమెంట్లో అదే అలజడి.. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీంతో రెండు సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై మంగళవారం రాజ్యసభ కూడా చర్చించనుంది. సభ గౌరవాన్ని తగ్గించొద్దు: స్పీకర్ లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని తగ్గించే పని చేయొద్దని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైనా విపక్షాలు నినాదాలు ఆపలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు, ఇది ఈడీ సర్కారు అంటూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. సభలోకి ఇకపై ప్లకార్డులు తీసుకురాబోమని నలుగురు కాంగ్రెస్ ఎంపీలు హామీ ఇవ్వడంతో వారిపై సస్సెన్షన్‌ను ఎత్తేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సభ్యులను హెచ్చరించారు. సభాపతి స్థానాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల వినతిని ప్రభుత్వం వినకపోవడం వల్లే నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. రాజ్యసభలోనూ అవే సీన్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు తదితరాలపై ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. దాంతో సభ మధ్యాహ్నం 12 దాకా వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి చేరుకొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపక్షాలను కోరారు. ధరల పెరుగుదలపై మంగళవారం సభలో చర్చిస్తామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సభలో విపక్షాల నిరసనల మధ్యే ఖాదీ, జీడీపీలో వీధి వ్యాపారుల పాత్ర, నదుల స్వచ్ఛీకరణ, అభివృద్ధిపై చర్చను చేపట్టారు. నినాదాల హోరు పెరగడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. మాంద్యానికి అవకాశం లేదు: నిర్మల భారత్‌లో ఆర్థిక మాంద్యం గానీ, ఆర్థిక మందగమనం గానీ ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చలో ఆమె మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతోంది అని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లు, కొనుగోలు సూచికే(పీఎంఐ) సాక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. మోదీపై నమ్మకం ఉంది కాబట్టే లేఖ రాసిందని అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాల వల్ల ఇటీవల వంట నూనెల ధరలు తగ్గిపోయాయని ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ‘నో వన్ కిల్డ్ జెస్సికా తరహాలో దేశంలో ద్రవ్యోల్బణం లేదు’ అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. పచ్చి కూరగాయలు తినాల్సిందే ధరల పెరుగుదలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ లోక్‌సభలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా హఠాత్తుగా లేచి పచ్చి వంకాయను ప్రదర్శించారు. వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో పచ్చి కూరగాయలు తిని కడుపు నింపుకోవాల్సిందేనంటూ వంకాయను కొరికి నిరసన వెలిబుచ్చారు. -
మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు
సాక్షి, సిర్పూర్(టి)(ఆదిలాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. సిర్పూర్(టి) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ లేక తరగతి గదులు, ఆవరణ మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో మందుబాబులు పాఠశాలలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకోవడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పశువులు సైతం పాఠశాల ఆవరణలో తిరుగుతుండటంపై పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మొత్తం పాఠశాలలు 54 మండలంలోని గ్రామాల్లో మూడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశాలలు, 43 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిల్లో ఒక్కదానికి సైతం ప్రహరీ లేకపోవడం విడ్డూరం. సిర్పూర్(టి)లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీకి కొంత గోడ నిర్మించినా కూలిపోవడంతో రక్షణ కరువైంది. లోనవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ అదే దుస్థితి నెలకొంది. చీలపెల్లి, భూపాలపట్నం, మాకిడి, జక్కాపూర్, ఇటిక్యాల పహాడ్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు పక్కనే వాగులు, అటవీప్రాంతాలు ఉన్నాయి. కాని వీటికి ప్రహరీ లేకపోవడంతో పాములు, విషపురుగులు యథేచ్ఛగా పాఠశాలల్లోకి వస్తున్నాయి. కాగితాలకే పరిమితమైన హామీలు.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రహరీ నిర్మిస్తే పాఠశాలల్లోకి పశువులు, మందుబాబులు రాకుండా ఉంటారని గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలి. అధికారులు నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కరించాలి. గ్రామంలోని పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తే మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. పశువులు లోనికి రాకుండా ఉంటాయి. – సత్యనారాయణ, చీలపెల్లి -
ఎన్ఎస్వోకు కోపమొచ్చింది.. ఆ దేశాల్లో ‘పెగసస్’ బ్లాక్!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తాము తయారుచేసిన ‘పెగసస్’స్పైవేర్ సాఫ్ట్వేర్ దుర్వినియోగం అవుతోందని పలు కథనాలు వెలువడి, అనేక దేశాల్లో వివాదమైన నేపథ్యంలో దాని తయారీసంస్థ ఎన్ఎస్వో గ్రూప్ ఆగ్రహంగా ఉంది. అందుకే తమ సొంత క్లయింట్లు ఆ స్పైర్‌వేర్‌ను వినియోగించడానికి వీల్లేకుండా తాత్కాలికంగా బ్లాక్‌చేసిందని అమెరికా మీడియాలో కథనాలొచ్చాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ తయారుచేసిన పెగసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను పలు దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం, నేరాలు, తదితరాల కట్టడి కోసం కొనుగోలుచేస్తాయి. అయితే, ఈ లక్ష్యాలకు బదులుగా పౌరులు, జడ్జీలు, మంత్రులు, పాత్రికేయులు, మానవహక్కుల నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై నిఘాకు దుర్వినియోగం చేస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, తదితర అనేక మీడియా సంస్థల నివేదికలు బహిర్గతపరచడం తెల్సిందే. దీంతో ఎన్ఎస్వో సంస్థ తాత్కాలికంగా తమ క్లయింట్లు ఈ టెక్నాలజీని వాడకుండా బ్లాక్‌చేసింది. పలు మీడియాల సమాఖ్య ‘పెగసస్ ప్రాజెక్ట్’పేరిట ఈ దుర్వినియోగంపై వివరాలు రాబడుతున్న నేపథ్యంలో తమ సంస్థ ఈ చర్య తీసుకుందని ఎన్ఎస్వో ఉన్నతాధికారి చెప్పారని ఇజ్రాయెల్‌లోని లాభాపేక్షలేని స్వతంత్ర మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్పీఆర్) వెల్లడించింది. ఎన్ఎస్వో ఇప్పటికే ఐదు ప్రభుత్వాలను బ్లాక్‌చేసిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. వీటిలో మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.అయితే, ప్రభుత్వాలు ఫోన్ల హ్యాకింగ్‌కు పాల్పడిన ఘటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, సంస్థ అంతర్గత దర్యాప్తులోనూ ఇదే తేలిందని ఎన్ఎస్వో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆరోపణలు తీవ్రస్థాయిలో రావడంతో ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం సైతం ఎన్ఎస్వో సంస్థపై దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. దర్యాప్తులో భాగంగా టెల్అవీవ్ సిటీ దగ్గర్లోని ఎన్ఎస్వో ఆఫీస్‌లో అధికారులు దర్యాప్తు చేపట్టారని ఇజ్రాయెల్ రక్షణశాఖ పేర్కొంది. ఎన్ఎస్వో సంస్థకు 40 దేశాల్లో 60కిపైగా కస్టమర్లు ఉన్నారని తేలింది. ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ పలు దేశాల నిఘా, దర్యాప్తు సంస్థలు, సైనిక విభాగాలేనని సమాచారం. -
ఆత్మలకు ఆసరా.. ఏళ్లుగా చనిపోయిన వారికి పెన్షన్లు..
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): రాజన్నసిరిసిల్ల జిల్లాలో చనిపోయిన వారికి పింఛన్లు వస్తున్నాయి. బతికుండి.. అన్ని అర్హతలున్న వారు ఏళ్లుగా ఆఫీస్‌లు చుట్టూ తిరిగిన అధికారులు కనికరించడం లేదు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపు లేని తనం.. బాధ్యతా రాహిత్యం మూలంగా వందలాది మంది మృతులు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. నెలవారీగా తనిఖీలు చేసి చనిపోయిన వారి పేర్లు తొలగించాల్సి ఉంది. కానీ మున్సిపల్ అధికారుల పట్టింపులేని తనంతో సచ్చినోళ్ల బ్యాంకు ఖాతాల్లో ప్రజాధనం పడుతూనే ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు నివేదిక ఆధారంగా మృతుల పేర్లను ఎంపీడీవోలు తొలగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మృతులకు ఆసరా పెన్షన్లు వస్తున్నా.. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా ఆత్మల పేరిట ఆసరా పొందుతున్నారు. ఇప్పటికైన జిల్లా అధికారులు సచ్చినోళ్ల పెన్షన్లు తొలగించి అర్హులకు ఆసరా కల్పిస్తే.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రజాధనానికి సార్థకత ఉంటుంది. సిరిసిల్లలోని కార్మికక్షేత్రం బీవై నగర్‌లోని ఇంటి నంబరు 11–01–40లో నివసించే కోనమ్మగారి భూలక్ష్మి(78) ఐదేళ్ల కిందటే కాలం చేసింది. కానీ ఆమెకు ఇంకా వృద్ధాప్య పెన్షన్ రూ.2,016 వస్తూనే ఉంది. ఆమె బ్యాంకు ఖాతాలో ఆసరా డబ్బులు పడుతున్నాయి. ఆమె పెన్షన్ నంబరు 12402 కేఏ0339114000 ద్వారా ఐదేళ్లుగా ప్రజాధనం బినామీల పాలవుతుంది. ఇలా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికి పైగా సచ్చినోళ్ల పేరిట ప్రతీ నెల ఆసరా పెన్షన్ సొమ్ము జమవుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా చనిపోయిన వారికి ఆసరా పెన్షన్ డబ్బులు ఇవ్వడంతో నెలకు రూ.20.16 లక్షల మేరకు ప్రజాధనం వృథా అవుతోంది. అర్హుడి వేదన.. అరణ్య రోదన ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఎక్కలదేవి రవి(30) మానసిక వికలాంగుడు. అతని తల్లిదండ్రులు దేవవ్వ, పుట్టయ్య దినసరి కూలీలు. రవికి పెన్షన్ ఇప్పించాలని కోనరావుపేట మండల అధికారుల చుట్టూ తిరిగారు. సిరిసిల్ల ఆస్పత్రికి సదెరం సర్టిఫికెట్ కోసం వచ్చారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మానసిక వికలాంగులకు పరీక్షలు చేసే వైద్యుడు లేక సదెరం సర్టిఫికెట్ రాలేదు. ఫలితంగా ఆ అభాగ్యుడికి సర్కారు సాయం అందడం లేదు. ఇలాంటి అన్నీ అర్హతలు ఉన్న వారికి ఆసరా కల్పించే మానవత్వం అధికారుల్లో లోపించింది. ఇలాంటి వారు జిల్లాలో ఎందరో ఉన్నారు. వీరంతా ‘ఆసరా’ అమరులు ► సిరిసిల్ల పట్టణంలోని ఇంటి నంబరు 10–8–83లో మూడేళ్ల క్రితం చనిపోయిన కట్ల మల్లవ్వకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. బీవై నగర్లో ఇంటి నంబరు 11–1–48లో నాలుగు నెలల క్రితం మరణించిన కుడిక్యాల రాజేశం అనే నేత కార్మికుడి ఇంకా పెన్షన్ అందుతుంది. ► బీవై నగర్‌లోని ఇంటి నంబరు 11–2–52లోని దూస సుశీల ఏడాది కిందట మరణించినా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. ► నాలుగేళ్ల క్రితం మరణించిన సుంక పోచవ్వ అనే వితంతువుకు, మూడు నెలల క్రితం మరణించిన పోగుల రాధవ్వ వితంతువు పెన్షన్ వస్తుండగా.. మూడు నెలల కిందట మరణించిన వెంగళ ► బాలనారాయణకు నేత కార్మికుడి పెన్షన్, నాలుగు నెలల కిందట మరణించిన అల్లె రామస్వామికి నేత కార్మికుడి పెన్షన్ వస్తుంది. ► సిరిసిల్ల బీ.వై.నగర్లో వివిధ కారణాలతో 15 నెలల క్రితం మరణించిన వృద్ధురాలు గూడూరి శాంతవ్వ, నాలుగేళ్ల క్రితం మరణించిన బూర లింగయ్య, మూడేళ్ల కిందట మరణించిన గాజుల చంద్రవ్వ, మూడేళ్ల కిందటే మరణించిన బొద్దుల పుణ్యవతి, రెండు నెలల కిందట మరణించిన కొండ రాజేశం ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం చనిపోయిన వారికి ఆసరా పెన్షన్ ఇవ్వడం తప్పు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయి నివేదికలతో చనిపోయిన వారి పెన్ష న్ తొలగించాల్సి ఉంటుంది. తప్పకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. చనిపోయిన వారి డబ్బులు ఎవరు తీసుకున్నా రికవరీ చేయిస్తాం. దీనిపై మున్సిపల్ కమిషనర్లకు లేఖలు రాస్తాం. – కౌటిల్యరెడ్డి, డీఆర్డీవో -
కమీషన్లకు కక్కుర్తీ..కలెక్టర్ నోటీసులు!
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన కారణంతో సంజాయిషి ఇవ్వని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.37.03 లక్షల లెక్కలపై నిర్లక్ష్యం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జె.ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్ కురిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషా గ్రామపంచాయతీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే కారణాలతో కలెక్టర్ ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గ్రామపంచాయతీకి చెందిన నిధులు రూ.37,03,865 సంబంధించిన రికార్డులు చూపించకపోగా కలెక్టర్ జారీచేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం సైతం ఇవ్వలేదు. దీంతో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ముగ్గురిపై సస్పెన్షన్ విధించారు. ప్రతీ నెల రూ.9.17 కోట్లు జిల్లాలోని 380 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.9.17 కోట్లు మంజూరు చేస్తోంది. గ్రామాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండగా, ఆయా నిధులను పల్లెప్రగతి పనులతో పాటు వైకుంఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, శాని టేషన్, పంచాయతీ నిర్వహణ కోసం పాలకవర్గాలు వినియోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు రూ.110 కోట్లు గ్రామపంచాయతీల నిధుల రూపంలో జీపీలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. చాలా వరకు గ్రామాల్లో శ్మశానవాటిక పనులు పూర్తి కాలేదు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపడంతోపాటు నిధుల్లో పారదర్శకత లేని 8 మంది సర్పంచులకు కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధర్మపురి మండలం జైన, రాజారం, రాయికల్ మండలం ధర్మాజీపేట, వెల్గటూర్ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూర్, కథలాపూర్ మండలం బొమ్మెన, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచులకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దుర్వినియోగం ఇలా.. ధర్మపురి మండలంలోని జైనాలో హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన ట్రీగార్డులలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019–2020లో 1,600 ట్రీగార్డులను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.54 చొప్పున రూ.86,400 చెల్లించాల్సి ఉండగా.. రూ.1.92లక్షల విలువైన ట్రీగార్డులు కొన్నట్లు రికార్డులు చూపించినట్లు నిర్ధారణయ్యింది. సాధారణ నిధుల కింద రూ.1.95లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.7,95,845, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.27,13,020 మొత్తం రూ.37,03,865 నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీలు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా స్పందించకపోవడంతో సస్పెన్షన్ చేస్తున్నట్లు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ధర్మపురి మండలంలోని రాయపట్నంలో రూ.4 లక్షలు, బుగ్గారం పంచాయతీలో రూ.2.40 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీస్‌లు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సంజాయిసీ ఇవ్వాలని కోరారు. -
నాడెప్ కుండీలతో నిధుల గల్లంతు..!
అధికారం ఉంది... అడిగేవారు ఎవ్వరన్న ధైర్యంతో గత టీడీపీ పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నాడెప్ కుండీల నిర్మాణాల పేరుతో రూ.కోట్లాది రూపాయలను ఖర్చుచేశారు. నాసిరకం నిర్మాణాలతో నిధులు కాజేశారు. సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యాన్ని మరుగునపడేశారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేశామంటూ ప్రచారం చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు నిరుపయోగంగా మారిన నాడెప్ కుండీలు కనిపించడం లేదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. లక్కవరపుకోట: జిల్లాలోని పలు గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన నాడెప్ కుండీలు నిరుపయోగంగా మారాయి. ఉపాధి హామీ పథకం నిధులు రూ.కోట్లు ఖర్చుచేసినా పైసా ప్రయోజనం కలగలేదు. ఎక్కడా కిలో సేంద్రియ ఎరువు కూడా తయారు కాలే దు. టీడీపీ కార్యకర్తలకే కుండీలను మంజూరు చేసి నిధులను కైంకర్యం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోని కుండీలు నిధుల దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యంగా మారాయి. అయ్యవారు టార్గెట్ ఇచ్చారు.. మనం నిర్మించేద్దామనే క్రమంలో ఒక్కో గ్రామంలో ఒకే చోట నాలుగు నుంచి ఎనిమిది కుండీలను నిర్మించారు. ప్రతీ పైసా ప్రజోపకారానికే ఖర్చు చేయాలని.. మంచి విజన్ ఉన్న నాయుకుడినంటూ చెప్పుకున్న చంద్రబాబుకు ఈ వృథా ఖర్చులు కనిపించలేదా అంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాల చేశారంటూ మండిపడుతున్నారు. నిర్మాణాల తీరు ఇలా... జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో 33, 256 నాడెప్ కుండీల నిర్మాణానికి రూ. రూ.35కోట్ల72 లక్షల41వేలు ఖర్చుచేశారు. అలాగే, 2017–18 సంవత్సరంలో 16,450 కుండీల నిర్మాణానికి రూ.14.46 కోట్లు, 2018–19 సంవత్సరంలో 2,239 కుండీలకు రూ2.05కోట్లు ఖర్ఛు చేశారు. జిల్లాలో అత్యధికంగా గుర్ల మండలంలో 810 కుండీల నిర్మాణానికి సుమారు రూ.76లక్షల నిధులు చెల్లించారు. ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని కొత్తవలస మండలంలో 796, లక్కవరపుకోటలో 520, వేపాడలో 705, ఎస్.కోటలో 421, జామి మండలంలో 550 సేందియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణాలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే నిర్వహించారు. ఇప్పటికే కొన్ని చోట్ల బీటలు వారి శిథిలావస్థకు చేరాయి. చెల్లింపులు ఇలా.. ఒక్కో కుండీ నిర్మాణానికి గత ప్రభుత్వం సుమారుగా రూ10,900 కేటాయించింది. 10 అడుగుల పొడువు, ఆరడుగుల వెడెల్పు, మూడు అడుగుల ఎత్తు పరిమాణంలో నిర్మించాలి. ఈ నిర్మాణాలు అత్యధికంగా టీడీపీ కార్యకర్తలు సంబంధిత ఉపాధి హామీ క్షేత్రసహాయకులు కుమ్మకై నిర్మించారని పలువురు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఎలా నిర్మించినా ఒక్కోగుంతకు సుమారుగా రూ.9,100 చెల్లించారు. అవగాహన కల్పించక... సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కుండీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారే తప్ప వీటిపై రైతులకు ప్రచారం చేయలేదు. కుండీల లబ్ధిదారుల ఎంపికలో పాడి పశువులు లేనివారు.. ఎరువులు అవసరం లేనివారు అధికమంది ఉండడం వల్లే లక్ష్యం నీరుగారింది. నిధులు కాజేయడమే లక్ష్యంగా నిర్మాణాలు చేశారే తప్ప సేంద్రియ ఎరువులు తయారుచేద్దామన్న ఉద్దేశం ఎక్కడా కనిపించలేదనేందుకు నిరుపయోగంగా కనిపిస్తున్న కుండీలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ సిబ్బంది తీసుకున్నారు. అవగాహన బాధ్యతను మండల వ్యవసాయాధికారులకు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. కాగా... ఎక్కడ రైతులకు అవగాహన మాత్రం కల్పించలేదు. సేంద్రియ ఎరువుల గుంతల్లో పోయాల్సిన చెత్త, పశువుల పేడను ఎప్పటి మాదిరిగానే ఆరుబయటే రైతులు పోసుకుంటున్నారు. నిధులు రికవరీ చేయాలి గ్రామాల్లో నిర్మించిన నాడెప్‌ల పనులను ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించాలి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల నుంచి రికవరీ చేయాలి. నిర్మాణ పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వి నియోగం అయ్యింది. – గాడి అప్పారావు, సీఐటీయూ నాయకుడు, ఎస్.కోట డివిజన్ ఎందుకు నిర్మించారో తెలియదు... మా గ్రామంలో పదుల సంఖ్యలో సేంద్రియ ఎరువుల తయారీ కుండీలను నిర్మించారు. నిర్మాణ సమయంలో అధికారులు వచ్చి హడావుడిగా నిర్మించేశారు. వాటిని ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించలేదు. నిరుపయోగంగా ఉన్న కుండీలను ఇప్పటికే కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. – కొట్యాడ జగం, మాజీ సర్పంచ్ మాది నిర్మాణ బాధ్యత మాత్రమే.. మేము గ్రామాల్లో రైతులకు అవసరమైన చోట నాడెప్లను నిర్మించిన వరకే మా పని. రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులు, వెలుగు సిబ్బందికి అప్పగించారు. – ఎస్.విజయలక్ష్మి, ఉపాధిహామీ ఏపీఓ, లక్కవరపుకోట మండలం -
డిజిటల్ దోపిడీ
రూ.2.75 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.4.5 లక్షల బిల్లు.. రూ.3–3.5 లక్షల విలువ చేసే యూనిట్లకు రూ.6 లక్షలకు పైగా బిల్లు.. వర్చ్యువల్ క్లాస్ రూమ్, అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో గత ప్రభుత్వ మాయాజాలం.. జిల్లాలో 257 పాఠశాలల్లో వర్చ్యువల్ క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్ యూనిట్ల సరఫరా.. ఫైబర్ నెట్ కనెక్షన్ లేక 131 పాఠశాలల్లో మాత్రమే ఇన్స్టాలైన ఎక్విప్మెంట్.. వాటిలో 92 పాఠశాలల్లోనే వర్కింగ్.. ఎక్విప్మెంట్ మొరాయింపుతో 39 పాఠశాలల్లో పనిచేయని పరిస్థితి.. అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ కింద 154 పాఠశాలలకు ఎక్విప్మెంట్ సరఫరా.. జూలైలో హడావుడిగా పాఠశాలలకు చేరవేత.. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ ఒప్పందం.. స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ వద్దని చెప్పినా పంపిణీ చేసిన ప్రైవేటు ఏజెన్సీ.. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు ఎన్నికల ముందు.. తర్వాత కొను‘గోల్మాల్’ ఎలా సాగిందో చూశారా! ముడుపులు, కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. కార్యరూపంలోకి వచ్చేసరికి వాటి డొల్లతనంతోపాటు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన చర్యల వెనక అవినీతి దాగుందని స్పష్టమవుతున్నది. శాశ్వత ప్రయోజనాలిచ్చే మౌలిక సదుపాయాల వైపు దృష్టి పెట్టకుండా సాంకేతిక బోధనాభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమం చేపట్టారు. వర్చ్యువల్ తరగతుల బోధన, డిజిటల్ తరగతుల బోధన పేరుతో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారు. ఒక్క జిల్లాలోనే రూ.10 కోట్ల మేర కుంభకోణం చోటు చేసుకుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వర్చ్యువల్ తరగతి బోధన పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ క్లాస్ రూమ్ స్టూడియో నుంచి ఉపాధ్యాయుడు అందించే బోధనను ప్రత్యక్ష ప్రసారం చేసేందు కు పాఠశాలలకు ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది. వర్చ్యువల్ క్లాస్ రూమ్ బోధన కార్యక్రమాన్ని 2018 ఏప్రిల్‌లో తొలి విడతగా 70 పాఠశాలల్లో, 2018 ఆగస్టులో రెండో విడతగా 99 పాఠశాలల్లో, 2019 ఫిబ్రవరిలో మూడో విడతగా 88 పాఠశాలల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్క పాఠశాలకు రూ.4.5 లక్షల విలువైన ఎక్విప్మెం ట్ యూనిట్‌ను సరఫరా చేశారు. ఒక్కొక్క యూ నిట్‌లో ఒక పోడియం, ఒక యూపీఎస్, ఆరు యూపీఎస్ ఎక్స్టర్నల్ బ్యాటరీలు, ఒక ల్యాప్ టాప్, ఒక ప్రొజెక్టర్, ఒక టాబ్లెట్ (కార్బన్), ఒక వెబ్ కెమెరా, ఒక ఇంట్రాక్టివ్ పెన్, 40 క్లిక్కర్స్, ఒక క్లిక్కర్ రిసీవర్, ఒక 4.1 ఆడియో సిస్టమ్, ఒక ఏసీ (ఇన్వెర్టర్) ఉంటాయి. ఇవన్నీ పాఠశాలలో అమర్చి, ఇన్స్టాల్ చేస్తేనే జిల్లా కేంద్రంలో ఉన్న వరŠుచ్యవల్ కాస్ రూమ్ స్టూడియో నుంచి ఉపాధ్యాయుల బోధనలు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఎక్విప్మెంట్ యూనిట్ సరఫరా, నిర్వహణ ఒక ప్రైవేటు ఏజెన్సీకి గత ప్రభుత్వం అప్పగించింది. ఆ ఏజెన్సీ ప్రతినిధికి గత ప్ర భుత్వ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఫైబర్ నెట్ లేకుండానే... నాసిరకం ఎక్విప్మెంట్తో... పరికరాలన్నీ అమర్చి, ఇన్స్టాల్ కావాలంటే ఆ పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండాలి. కళ్లెం ఇచ్చి గుర్రం ఇవ్వనట్టుగా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వకుండా ఎక్విప్మెంట్ సరఫరా చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. తొలి విడత 70 పాఠశాలల్లో 51 పాఠశాలలకు ఫెబర్ నెట్ కనెక్షన్‌లుండటంతో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. మిగతా 19 పాఠశాలల్లో గత ఏడాది కాలంగా ఎక్విప్మెంట్ నిరుపయోగంగా ఉంది. ఇన్స్టాల్ చేసిన వా టిలో 19 పాఠశాలల్లో కొన్ని రోజుల్లోనే ఎక్విప్మెంట్ మొరాయించింది. అలాగే, రెండో విడత 99 పాఠశాలల్లో కేవలం 36 పాఠశాలలకు ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండటంతో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశారు. మిగతా 63 పాఠశాలల్లో సంబంధిత ఎక్విప్మెంట్ నిరుపయోగంగానే ఉంది. ఇన్స్టాల్ చేసినవాటిలోని ఏడు పాఠశాలల్లో కొన్ని రోజులకే ఎక్విప్ మెంట్ పనిచేయడం మానేసింది. మూడో విడతలో 88 పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేయగా, వాటిలో 44 పాఠశాలలకు మాత్రమే ఫైబర్ నెట్ కనెక్షన్ ఉండటంతో ఇన్స్టాల్ చేశారు. ఇందులో 13 పాఠశాలల్లో కొన్ని రోజులకే పనిచేయడం మానేశాయి. ఇలా మొత్తం 257 పాఠశాలల్లో 131 పాఠశాలలు మాత్రమే ఇన్స్టాల్కు నోచుకోగా, వాటిలో 92 మాత్రమే యాక్టివ్‌గా ఉ న్నాయి. 39 పాఠశాలల్లో పనిచేయడం లేదు. ఇక, 126 పాఠశాలలకు ఎక్విప్మెంట్ వచ్చి నా ఫైబర్ నెట్ కనెక్షన్ లేక ఇన్స్టాల్ కాలేదు. దీంతో అక్కడికొచ్చిన ఎక్విప్మెంట్ నిరుపయోగంగా ఉండిపోయింది. ఇందులో చెప్పాల్సిన విషయమేంటంటే పాఠశాలలకు వచ్చి న ఎక్విప్మెంట్ ఆశించిన క్వాలిటీలో లేవని తెలుస్తున్నది. దీనికి తోడు ఎక్విప్మెంట్ యూనిట్ విలువ రూ.4.5 లక్షల మేర చూపించినట్టు తెలిసింది. కానీ వాస్తవంగా దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.2.75 లక్షల మేర ఉంది. దాదాపు లక్షా 50 వేల వరకు తేడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. సాధారణంగా బల్క్‌లో తీసుకుంటే తగ్గాలి. కానీ ఇక్కడ ఎక్కువగా ఉంది. దీని వెనక పెద్ద గోల్మాల్ నడిచింది. ముడుపుల బాగోతం నడవడంతో కాంట్రాక్టర్ చెప్పిందే వేదం అన్నట్టుగా సాగిపోయింది. ఇదొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సాగింది. ఇదొక పెద్ద కుంభకోణం. ఇదీ వర్చ్యువల్ క్లాస్ రూమ్ బాగోతం. అడ్వాన్స్డ్ డిజిటల్ మాయ... అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో కూడా మరో కథ నడిచింది. ప్రాథమిక పాఠశాలలో అధునాతన డిజిటల్ క్లాస్రూమ్ బోధనా కార్యక్రమాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎన్నికలకు ముందు చేసిన ఆలోచన. అదే సందర్భంగా యుద్ధప్రాతిపదికన ఒక ఏజెన్సీతో ఒప్పందం చేసుకుం ది. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో 154 ప్రాథమిక పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేశారు. 65 ఇంచెస్ ఇంట్రాక్టివ్ ప్లాట్ పేనల్, ఐఎఫ్‌పీ మౌంటెడ్ బ్రాకెట్, 1కేవీఎ ఆన్లైన్ యూపీఎస్, వైర్లెస్ కీ బోర్డు, మౌస్ వంటి పరికరాలతో కూడిన ఎక్విప్మెంట్ యూనిట్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరఫరా చేశారు. గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీ జూలై 7వ తేదీ తర్వాత హడావుడిగా యూనిట్ల ను పాఠశాలలకు చేరవేసింది. ఒక్కొక్క యూని ట్ విలువ రూ.6 లక్షల మేర చూపించినట్టుగా ప్రస్తుత ప్రభుత్వ అధికారులు గుర్తించారు. వాస్తవానికైతే మార్కెట్ ప్రకారం దాని విలువ రూ.3 లక్షల నుంచి 3.5 లక్షల మేర ఉంటుంద ని అంచనా. దాదాపు 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా లాగేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించారేమో పాఠశాలలకు యూనిట్లు సరఫరా చేయవద్దని, తక్షణం నిలిపివేయాలని సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సంబంధిత సరఫరా ఏజెన్సీని జూలై 3వ తేదీన ఆదేశించారు. కానీ సద రు ఏజెన్సీ పట్టించుకోకుండా యుద్ధప్రాతిపది కన పాఠశాలలకు ఎక్విప్మెంట్ యూనిట్లను సరఫరా చేసేసింది. ఈ విషయం తెలుసుకున్న స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ తక్షణమే సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన యూనిట్లను తీసుకోవద్దని, అప్పటికే వచ్చేస్తే వాటిని తెరవొద్దని, ఇన్స్టాల్ చేయవద్దని ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు ఆఫీసర్ సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా సంబంధిత యూనిట్లు ఎక్కడికక్కడ అక్కరకు రాకుండా ఉన్నాయి. వీటిలో కూడా నాసిరకం పరికరాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎక్విప్మెంట్ యూనిట్లను తెరవద్దని ఆదేశాలిచ్చాం.. అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్ పేరుతో 154 పాఠశాలలకు సరఫరా చేసిన ఎక్విప్ మెంట్ యూనిట్లను తెరవద్దని సంబంధిత పాఠశాలల ప్ర«ధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేర కు తక్షణ ఆదేశాలిచ్చాను. ఎక్కడైనా తెరిచినట్టయితే సంబంధిత ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. – బి.శ్రీనివాసరావు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
మొక్కల మాటున అవినీతి చీడ
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): వన సంరక్షణ ...వన మహోత్సవం...ఇలా రకరకాల పేర్లతో గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీడియాలో ప్రకటనలు... పత్రికల్లో ఫొటోలతో తెగ హల్చల్ చేశారు. ప్రజల్ని భాగములను చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేసినట్టు ఆర్భాటం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది ... ఆ మొక్కల మాటున అవినీతికి పాల్పడి లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు. సంరక్షణ గాలికొదిలేయడంతో ఎదగాల్సిన మొక్కలు ఆదిలోనే ఎండిపోయాయి. ఓ కాలానికి పరిమితం కావల్సిన ఎండలు దాదాపు ఏడాదంతా విరగగాయడానికి కారణం పచ్చదనం లేకపోవడమే. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నిల్వలు బాగా పెరిగిపోతుండటంతో భూతాపం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేప«థ్యంలో ఆడవులను సంరక్షించుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచే బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని సమర్ధవంతంగా చేయాల్సిన గత ప్రభుత్వం నిధులెలా ఖర్చు చేయాలో చూసిందే తప్ప మొక్కలెలా పెంచాలో శ్రద్ధ పెట్టలేదు. మొక్కలు పెంపకం పేరుతో నిధులు మింగేసిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. అధికారుల వద్ద లభ్యమైన రెండేళ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ∙2016–17లో 32 మండలాల్లో 1,87 156 మొక్కలు నాటినట్టుగా చూపించారు. ఇందులో 84, 233 మొక్కలు బతికున్నట్టుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. అంటే 45 శాతం మొక్కలు ఊపిరిపోసుకున్నాయన్నమాట. ∙2017–18లో 51 మండలాల్లో 2,61,208 మొక్కలు నాటగా 1,35,828 మొక్కలు బతికినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, 2017–18 సంవత్సరానికి సంబంధించి 23 మండలాల్లో సామాజిక తనిఖీలు జరిపితే రూ.22,19,693మేర దుర్వినియోగం చేసినట్టు తేలింది. అంతకుముందు సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటిలో బతికున్నవెన్నో అధికారుల వద్ద లెక్కల్లేవు. ఎంత నిధులు దుర్వినియోగమయ్యాయో తేల్చే తనిఖీలు జరగలేదు. ఇదంతా అధికారికంగా చెబుతున్న సమాచారం. కానీ అనధికారికంగా చూస్తే వేసిన మొక్కలు ఎక్కడున్నాయో...ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ లెక్కన మొక్కల పెంపకం కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా దుర్వినియోగమయింది. మొక్కలు వేసినందుకు, మొక్కలు పెంపక వేతనం, నీటి సరఫరా ఖర్చు, ఎరువులు, ఇతరత్రా వాటి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినట్టు లెక్కలు రాసుకున్నారు. రికార్డుల్లో లెక్కలు చూపించారే తప్ప క్షేత్రస్థాయిలో వేసిన మొక్కలను పట్టించుకోకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. విశేషమేమిటంటే 2017–18లో సామాజిక తనిఖీల్లో 22 లక్షలకుపైగా దుర్వినియోగం జరిగిందని, 300 మందికిపైగా అక్రమాలకు పాల్పడ్డారని తేల్చినా ఇంతవరకూ ఒక్క పైసా రికవరీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిబట్టి అక్రమాలను ఏ స్థాయిలో ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని డ్వామా పీడీ ఎన్వీ రమణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా ‘నేను ఎన్నికల ముందు బాధ్యతలు స్వీరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని, పరిశీలిస్తానని చెప్పారు. 2016–17లో మొక్కలు నాటిన మండలాలు 32 నాటిన మొక్కలు 1,87,156 మొత్తం వ్యయం 150.37 లక్షలు బతికిన మొక్కలు 84, 233 బతికిన మొక్కల శాతం 45 2017–18లో సోషల్ ఆడిట్ చేసిన మండలాలు 23 దుర్వినియోగమైనట్టు తేల్చిన నిధులు రూ. 22,19,693 2017–18లో మొక్కలు నాటిన మండలాలు 51 నాటిన మొక్కలు 2,61,208 మొత్తం వ్యయం 946.11 లక్షలు బతికిన మొక్కలు 1,35,828 బతికిన మొక్కలు శాతం 52 -
ఒక్కరోజులోనే అమ్మకానికి!
నారాయణపేట: రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేలు చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.75 వేలు వెచ్చించి 21 గొర్రెలను అందిస్తోంది. వీటితో ఆయా లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. నారా యణపేట జిల్లాలోని మరికల్‌కు చెందిన గొర్రెల కాపరులకు సోమవారం పశుసంవర్ధకశాఖ అధికారులు 64 యూనిట్లకు గాను లబ్ధిదారులు ఒక్కొక్క యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొటేలు చొప్పున అందజేశారు. అయితే కాపరులు గొర్రెలను పొంది ఒకరోజు సైతం తమ వద్ద పెట్టుకోకుండా దళారులతో కుమ్మక్కై బేరం చేసుకోవడంతో వాటిని ప్రత్యేక వాహనంలో నల్లగొండ జిల్లా మల్లెపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చర్ల వద్ద పట్టుబడడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో మధ్యవర్తి సాయం తీసుకుంటున్నారు. అక్కడే గొర్రెకు పోగువేసి జిల్లాకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చి మరికల్లో కాపరులకు అందజేశారు. దళారులచే విక్రయాలు ప్రభుత్వ సబ్సిడీతో కొనుగోలు చేసిన గొర్రెలను ఎక్కడ పెంచుకుంటాం.. ఒక్కసారే అమ్మితే పోలా అంటూ కాపరులు అధిక సొమ్ముకు ఆశపడి దళారులతో కుమ్మక్కై గొర్రెలను విక్రయించేస్తున్నారు. ఒక్కో యూనిట్లో దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ గొర్రెలు ఒక్కసారిగా విక్రయాలు చేయడంతో దళారులకు కాసుల పంటనే చెప్పవచ్చు. 64 యూనిట్లు అంటే 1344 గొర్రెలు. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 50 వేల చొప్పున అధికంగా విక్రయించిన రూ.32 లక్షల లాభం వస్తుంది. ఇందులో లబ్ధిదారులకు సగం ఇచ్చినా.. మిగతా సగం దళారుల సొంతమవుతుంది. ఇందులో అధికారుల చేతివాటం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెలు అమ్మితే సభ్యత్వం రద్దు మరికల్ (నారాయణపేట): గొర్రెల కాపరుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను అక్రమంగా అమ్మి న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య అన్నారు. మరికల్లో డీడీలు కట్టిన వారికి 64 యూనిట్లను మం జూరు చేశామని, ఈ మేరకు అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసిన రోజు రాత్రికే చట్టానికి విరుద్ధంగా గొర్రెలను మాచర్ల కొనుగోలుదారులకు అమ్మిన లబ్ధిదారుల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామన్నారు. అలాగే ఆ గ్రామాన్ని సైతం బ్లాక్ లిస్టులో పెట్టి మిగతా లబ్ధిదారులకు కూడా గొర్రెలను నిలిపివేస్తామన్నారు. దీంతోపాటు సం ఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. పట్టుబడిన గొర్రెలను డీడీలు కట్టిన ఇతర గ్రామాల లబ్ధిదారులకు అందజేస్తా మన్నారు. అక్రమంగా గొర్రెలను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభు త్వ సబ్సిడీ గొర్రెలను దొడ్డిదారిన అమ్మితే ఎంతటి వారైనా సరే కేసులు తప్పవని హెచ్చరించారు. -
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు–2018ను సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టు విధించిన నియంత్రణల కారణంగా ఆర్టికల్–18 ప్రాముఖ్యత కోల్పోయిందని మంత్రి గెహ్లాట్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఈ ఆలస్యం దళితుల్లో అసహనం పెరిగిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఆర్టికల్–18కి సవరణలు చేపట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందనే సాకుతో 88శాతం మంది దళితులను ఇబ్బందులు పడనివ్వబోమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్‌ను ఏ కోర్టూ ఇవ్వరాదనే నిబంధనను బిల్లులో చేర్చారు. క్రిమినల్ కేసు నమోదు చేయకున్నా, ఎవరి అనుమతి తీసుకోకుండానే అరెస్టులు చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. -
ఆధార్ గోప్యతపై స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. రోజుకో సంచలన నివేదికలు బహిర్గతం కావడం దేశ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని శుక్రవారం వెల్లడించారు. అమెరికా సెక్యూర్టీకి చెందిన అనేక రహస్య పత్రాలను బయటపెట్టిన స్నోడెన్ వ్యాఖ్య ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశం పరిచయం చేసిన ఆధార్ డేటాబేస్ అక్రమ వినియోగానికి, (మిస్ యూజ్, అబ్యూజ్) అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ ఉద్యోగి , విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించారు. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయి, కానీ ఆ డేటాహ్యాకింగ్‌కు గురి కావడం సాధారణ విషయమే అన్నారు. చట్టాలు ఉన్నా, దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చర్రిత చెబుతోందన్నారు. భారతదేశంలో ఆధార్ డాటాబేస్ ఉల్లంఘనపై సీబీఎస్ విలేఖరి జాక్ విట్టేకర్ వ్యాఖ్యలకు స్నోడెన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వాల సహజ ధోరణి అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆధార్ డేటా సెక్యూరిటీ దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలతో ఆధార్ డేటా గోప్యత చర్చనీయాంశమైనంది. దీనిపై సుప్రీంకోర్టులో నిర్ణయం కూడా పెండింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగానే కేవలం రూ.500 లకే ఆధార్ కార్డు వివరాలు లభ్యం అంటూ వచ్చిన నివేదికలు మరింత కలవరం పుట్టించాయి. ఇటీవల ట్రిబ్యూన్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చాలాసులువుగా ఆధార్ డేటా వచ్చేస్తుందని ఆ పత్రిక బుధవారం ఒక కథనంలో పేర్కొన్నది. దీన్ని ప్రభుత్వం, యూఐడీఏఐ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. It is the natural tendency of government to desire perfect records of private lives. History shows that no matter the laws, the result is abuse. https://t.co/7HSQSZ4T3f — Edward Snowden (@Snowden) January 4, 2018 -
పల్స్‌పోలియో నిధుల దుర్వినియోగంపై నేడు విచారణ
కాకినాడ వైద్యం : పల్స్ పోలియో నిధుల దుర్వినియోగంపై విజయవాడ వైద్య ఆరోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ ఇమ్యూనైజేషన్ అధికారి ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో విచారణ చేపట్టనున్నారు. 2014–15లో పల్స్‌పోలియో కార్యక్రమం కోసం వచ్చిన కంటింజెన్సీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై మంగళ, బుధవారాల్లో డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో డీఎంహెచ్ఓ కార్యాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్యకి ఆదేశించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులందరూ ఇద్దరు డీఎంహెచ్ఓలు, అదనపు డీఎంహెచ్ఓ, ఇద్దరు జిల్లా ఇమ్యునైజేషన్ అ««ధికారులు, పల్స్‌పోలియోకు బిల్లుల తయారీకి ప్రింటర్ యజమానులు కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. -
నిధులు భోంచేస్తున్నారు!
ధర్మవరం ఆస్పత్రిలో రెండేళ్లుగా రోగులకు అందని భోజనం అయినప్పటికీ బిల్లుల డ్రా నిధుల దుర్వినియోగంపై సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ పొంతన లేని సమాధానాలు ఇప్పటికే 7 నెలల బిల్లులు ఖాతాల్లోకి జమ మరో విడత చెల్లింపునకు రంగం సిద్ధం సర్కారు ధర్మాస్పత్రి.. జబ్బుపడిన నిరుపేదలు, సామాన్యులు చికిత్సకు వస్తుంటారు. కొందరు డాక్టరుతో చూపించుకుని మందులు తీసుకుని వెళ్తుంటారు. ఇంకొందరు రోగం నయమయ్యేదాకా ఆస్పత్రిలోనే ఉంటారు. వీరికి ప్రభుత్వం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పిస్తోంది. ధర్మవరం ఆస్పత్రిలో రోగులకు ఆహారం అందించేందుకు కాంట్రాక్టరు ఉన్నారు. అధికారులు మూణ్నెల్లకోసారి బిల్లులు మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి రెండేళ్లుగా అక్కడ భోజనం వడ్డించడం లేదు. ఈ అవినీతి వ్యవహారం ‘సాక్షి’కి తెలిసి అధికారులను ఆరా తీస్తే ఎవరికి వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. రెండేళ్లుగా వడ్డించడం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ అంటే, తమ వద్ద బిల్లులు పెండింగ్లేవు.. ఇచ్చేశామని డీసీహెచ్ఎస్ అంటున్నారు. ధర్మవరం ఆస్పత్రిలో అవినీతి జరిగిందనేందుకు ఈ విరుద్ధ ప్రకటనలే నిదర్శనం. ధర్మవరం ప్రభుత్వాస్పత్రి 50 పడకల సామర్థ్యంతో నడుస్తోంది. ఇక్కడ రోజూ 30–40మంది ఇన్‌పేషెంట్స్ (ఆస్పత్రి వార్డుల్లో చికిత్స తీసుకునే రోగులు) ఉంటారు. వీరికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డించేందుకు ఉడుముల రాము అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లిన ‘సాక్షి’ సిబ్బంది రోగులు మొత్తం బయట నుంచి భోజనం తెచ్చుకోవడాన్ని గమనించారు. ఇదేంటని ఆరా తీయగా.. ఇక్కడ భోజనం పెట్టరని చెప్పారు. నర్సులు, ఆస్పత్రి సిబ్బందిని అడగ్గా.. రెండేళ్లుగా భోజనం వడ్డించడం లేదని బాహాటంగానే తెలిపారు. ఇదీ అసలు తతంగం రోజూ అన్ని బెడ్లపై రోగులు ఉంటున్నట్లు ఆస్పత్రి అధికారులు డీసీహెచ్ఎస్కు నివేదిక పంపుతున్నారు. ప్రతినెలా ఔట్‌పేషెంట్ (ఓపీ), ఇన్‌పేషెంట్ (ఐపీ) వివరాలు పంపాలి. ఇందులో వందశాతం రోగులు ఐపీలో ఉన్నట్లు చూపిస్తున్నారు. ఐపీలో ఉండే వ్యక్తులకు ఒక్కో బెడ్డుకు రోజుకు రూ.40 చొప్పున డైట్‌చార్జీలు (భోజనం ఖర్చులు) ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ డబ్బు కమిషనర్ నుంచి డీసీహెచ్ఎస్కు వస్తుంది. డీసీహెచ్ఎస్ ఆస్పత్రికి పంపుతారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ మాసాలకు సంబంధించి ధర్మవరం ఆస్పత్రిలో రూ.2లక్షలు డ్రా చేశారు. ఆ తర్వాత డిసెంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మరో రూ.2 లక్షలు డ్రా చేసుకున్నారు. ఈ బిల్లులు డీసీహెచ్ఎస్ కార్యాలయం నుంచి ధర్మవరం ఆస్పత్రికి చేరాయి. ఏప్రిల్, మే, జూన్ బిల్లులు కూడా సిద్ధమవుతున్నాయి. రెండేళ్లుగా భోజనం వడ్డించకపోయినా గత ఏడు నెలల డైట్ చార్జీలు రూ.4 లక్షలు ఆస్పత్రి సూపరింటెండెంట్ పరిధిలోకి చేరాయి. భోజనం వడ్డించకపోయినా బిల్లులు పెట్టే ధైర్యం సూపరింటెండెంట్ చేయడం, ఆస్పత్రిలో పరిస్థితి తెలీకుండా ఈ బిల్లులను డీసీహెచ్ఎస్ మంజూరు చేయడం చూస్తుంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఎలాగూ భోజనం వడ్డించలేదు కాబట్టి కాంట్రాక్టరుకు బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నిధులను ఏం చేశారు? ఎవరు ఆరగించారనేది.. కలెక్టర్ తేల్చాల్సి ఉంది. ఈ ఏడు నెలలకు ముందు కూడా ఏ మేరకు బిల్లులు డ్రా చేశారనే దానిపైనా విచారించాల్సి ఉంది. సూపరింటెండెంట్ ఏమన్నారంటే.. ఈ విషయంపై సూపరింటెండెంట్ రామలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రెండేళ్లుగా భోజనం వడ్డించడం లేదని, అలాంటప్పుడు బిల్లులు ఎలా డ్రా చేస్తామని బుధవారం ఉదయం చెప్పారు. తిరిగి సాయంత్రం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ గతేడాది లాస్ట్ క్వార్టర్లో భోజనం పెట్టామని చెప్పారు. భోజనం వడ్డించలేదని ఉదయం చెప్పారు కదా అని ‘సాక్షి ప్రతినిధి’ ప్రశ్నించగా.. ‘కొద్దిమేర పెట్టాం. కొద్దిమేర పెట్టలేదు’ అని పొంతనలేని సమాధానం ఇచ్చారు. డీసీహెచ్ఎస్ ఏమన్నారంటే.. భోజనానికి సంబంధించి తమ వద్ద బిల్లులు పెండింగ్‌లో లేవని, ఇటీవల మంజూరు చేశామని డీసీహెచ్ఎస్ రమేశ్‌నాథ్ చెప్పారు. రెండేళ్లుగా అక్కడ భోజనం వడ్డించలేదు.. అలాంటప్పుడు బిల్లులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించగా.. విషయం ఆరా తీసి మళ్లీ ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ విషయంపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. -
దారిమళ్లుతున్న సబ్‌ప్లాన్ నిధులు
∙రూ.10 లక్షల వరకూ స్వాహా ∙అపహాస్యమవుతున్న జీవనోపాధి పథకం రౌతులపూడి : గ్రామీణప్రాంతాల్లోని దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడానికి, వారి ఆర్థ్ధికపరోభివృద్ధిని మెరుగుపరచడానికి ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకం ఆచరణలో విఫలమౌతోంది. వారి ఆర్థికాభివృద్ధికి జీవనోపాధి పథకం ద్వారా మేకలు, గొర్రెలు, గేదెలు పెంపకానికి, కిరాణా, కూరగాయల వ్యాపారం, ఇటుక తయారీవంటి ఇతర వ్యాపారాల కోసం అందించే నిధులను దారిమళ్లు తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవనోపాధి పెంచడానికి రూ.30వేలు నుంచి రూ.50వేలకు పైగా ఇవ్వాల్సి ఉండగా, వెలుగుసిబ్బంది అధికారపార్టీ నేతలతో కుమ్మక్కై రూ.పది నుంచి రూ.15 వేల వరకు ఇచ్చి దీనిలో మళ్లీ రూ.వెయ్యి తిరిగి వేరే పథకానికి అని వసూలు చేస్తున్నారు. మండలంలోని 2015–16లో ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకంలో ఇప్పటివరకు ఐదు గ్రామైఖ్య సంఘాలద్వారా 22 డ్వాక్రా సంఘాల్లోని 79 మంది లబ్థిదారులకు రూ.19,60,900 నిదులు పంపిణీ చేశారు. ఎస్సీ సబ్‌ప్లా¯ŒS పథకంలో 15 గ్రామైఖ్య సంఘాల ద్వారా 26 డ్వాక్రాల సంఘాల్లోని 131మంది లబ్ధిదారులకు రూ. 53,51,660లు అందజేశారు. ఈ సొమ్ముల నుంచి లబ్ధిదారులను మభ్యపెట్టి వారివద్దనుంచి సుమారు రూ.10 లక్షల వరకు స్వాహాకు పాల్పడినట్లు ’సాక్షి’ నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోంది. మండలంలోని ఉప ప్రణాళికా ప్రాంతానికి చెందిన రాఘవపట్నం శివారు దబ్బాది, సార్లంక గ్రామాలకు చెందిన ఇందిరా గ్రామైక్య సంఘంలోని బోడకొండమ్మ డ్వాక్రా సంఘంలోని పదిమంది సభ్యులకు రూ.3లక్షలు అందించారు. ఈ సొమ్ముల్లోని రూ.1.70లక్షలువరకు వారివద్దనుంచి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా వెలుగుసిబ్బంది వసూలు చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా వారికి అందజేసిన రోజే ఒకవాయిదాతోబాటు ఒక్కొక్క డ్వాక్రాగ్రూపునుంచి రూ.4వేలు ఖర్చుల నిమిత్తం సిబ్బందివసూలు చేసినట్లు తేలింది. జల్దాం శివారు గిన్నిలారంగ్రామానికిచెందిన పెద్దూరు గ్రామైఖ్యసంఘంలోని అల్లూరి సీతారామరాజు, లావణ్య డ్వాక్రాగ్రూపుల్లోని 11 మంది సభ్యులకు రూ.40 వేల చొప్పున రూ.4.28 లక్షలు అందించారు. ఈ సొమ్ములునుంచి ఒక్కొక్కరి నుంచి రూ.18వేల చొప్పున రూ.1.98 లక్షలు వసూలు చేశారు. మొదటి వాయిదా కోసం ఒక్కొక్కరివద్దనుంచి వెయ్యిచొప్పున 11 వేలు, ఖర్చులకోసం ఒక్కొక్క గ్రూపునుంచి రూ.నాలుగువేలు చొప్పున వసూలు చేసారని తెలిసింది. రాఘవపట్నం శివారు సత్యవరం గ్రామైఖ్యసంఘంలోని రెండు డ్వాక్రాసంఘాల్లోని 27మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున రూ.నాలుగు లక్షలు అందించారు. వీటిలో పెరటికోళ్ల పెంపకానికి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు. అంతేకాకుండా మొదటివాయిదాకని చెప్పి మరో వెయ్యి వసూలు చేశారు. మండలంలోని రాజవరంలో పాడిగేదెల పెంపకానికి నాలుగు డ్వాక్రా సంఘాల్లోని ఆరుగురి ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.45వేల చొప్పున రూ.2.70 మంజూరుచేసి అందించారు. అయితే ఒక్కొక్కరి నుంచి బీమా, ఇతర ఖర్చులు కోసం రూ.2,500 వరకు వెలుగు సిబ్బంది వసూలు చేశారు. ఇలా మండల వ్యాప్తంగా రూ.పది లక్షల వరకు స్వాహాకు పాల్పడినట్లు సాక్షి పరిశీలనలో వెల్లడవుతోంది. ఇప్పటికైనా డీఆర్డీఏ జిల్లా ఉన్నతాధికారులు స్వాహాకు గురైన నిధులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్వాహాకు గురైన సొమ్ములను లబ్ధిదారులకు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.1.7 లక్షలు తిరిగి చెల్లించాం ఎస్టీ సబ్‌ప్లా¯ŒSలో తమ గ్రూపులోని పదిమంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.30వేలు చొప్పున రూ.3లక్షలు మంజూరు చేశారు. వీటిలో అదే రోజు తిరిగి చెల్లించాలంటే రూ.1.7 లక్షలు తిరిగి వెలుగుసిబ్బందికి చెల్లించాం. వీటితోబాటు ఒక్కొక్క గ్రూపునుంచి ఖర్చుల నిమిత్తం రూ.4వేలు ఇచ్చాం. తొలి వాయిదా కూడా అప్పుడే చెల్లించాం. – కాకురి దేవుడమ్మ, బోడకొండమ్మ డ్వాక్రా గ్రూపు ప్రెసిడెంట్, దబ్బాది రూ.18 వేలు వసూలు చేశారు పెద్దూరు గ్రామైక్య సంఘంలోని రెండు డ్వాక్రా సంఘాలకు మేకల పెంపకానికి ఒక్కొక్కరికి రూ.40వేలు చొప్పున మంజూరు చేసి అందించారు. వీటిలో ఒక్కొక్కరి నుంచి రూ.18 వేలు వసూలు చేసి వెలుగు సిబ్బంది తీసుకెళ్లారు. వాటికి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. తీసుకున్నరోజే తొలి వాయిదా సొమ్ములు రూ.11 వేలు ఇచ్చాం. – చడ్డా చిన్ని, లావణ డ్వాక్రాగ్రూపు, గిన్నిలారం. బీమాకోసం రెండువేలిచ్చాం ఎస్సీ సబ్‌ప్లా¯ŒS పథకంలో పాడి గేదెల పెంపకానికి రూ.45వేలు అప్పుతీసుకున్నాను. వీటిలో బీమా కోసం రూ.రెండువేలు, ఖర్చులకని మరో రెండువందలు వెలుగు అధికారికి ఇచ్చాను. మరో 15 వందలు మొదటి వాయిదా సొమ్ములు కూడా తగ్గించుకొన్నారు. – ఏడిద కృష్ణవేణి, క్రాంతి డ్వాక్రా గ్రూపు బాధ్యులపై చర్యలు చేపడతాం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకంలో సత్యవరంలో ఒక్కొక్కరి నుంచి పెరటికోళ్ల పెంపకానికి ఒక్కొక్కరు రూ.వెయ్యి చెల్లించారు. మిగిలిన స్వాహాకు గురైన నిధులు గురించి తనకు తెలియదు. సంబంధిత బాధితులను విచారించి స్వాహాపై పరిశీలించి బాధ్యులపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – కె. శ్రీనివాస్, వెలుగు ఏపీఎం -
సొమ్మొకరిది.. సోకొకరిది..
రాజమహేంద్రవరం సిటీ : నగరపాలక సంస్థలో నిధుల వినియోగంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నగరపాలక సంస్థ భవన నిర్మాణానికి నిధులు పెద్దసంఖ్యలో ఖర్చు చేస్తుండగా.. తాజాగా అదే భవన నిర్మాణం కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరుకు కౌన్సిల్ ఆమోదానికి సిద్ధం చేయడాన్ని పలువురు ప్రజాప్రతినిధులు తప్పుబడుతున్నారు. అలాగే 279 జీఓ ప్రకారం పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణ, వారి జీతభత్యాల కోసం మే నెలలో సుమారు రూ.17.79 కోట్లు కౌన్సిల్ ఆమోదం పొందగా.. తాజాగా నగరంలో పారిశుద్ధ్య పనివారికి తొమ్మిది నెలల జీతాల కోసం మరో మారు రూ.9,33,43,990 కోట్లు మంజూరుకు అజెండాలో తీర్మానం సిద్ధం చే శారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టుగా రూ. కోట్ల ప్రజాధనం లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసుకుపోతున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2012లో రూ.6.60కోట్లు మంజూరు చేసింది. భవననిర్మాణం అంతంతమాత్రంగా సాగుతోంది. భవన నిర్మాణం మొదలు పెట్టి అసలు నిధులు కన్నా.. కొసరు నిధులు మంజూరు రెట్టింపు కనిపిస్తున్నాయి. అసలు నిధులు రూ.6.60 కోట్లు కాగా తర్వాత క్రమంలో కమిషనర్ స్టాయి సంఘం నుంచి ఒకసారి రూ.కోటిన్నర, మరోసారి రూ.1.98 కోట్లు ఇలా మొత్తం రూ.10.08 కోట్ల ప్రజాధనం కేటాయించారు. అయినా భవన నిర్మాణం కొలిక్కి రాలేదు. అయితే తాజాగా మరోమారు భవన నిర్మాణానికి నిధులు కావాలంటూ శుక్రవారం జరగనున్న నగర పాలకమండలి సమావేశ అజెండాలో సిద్ధం చేశారు. వీటిలో ఫాల్స్ సీలింగ్‌కు రూ.85.15 లక్షలు, ఎలివేషన్ గ్లాస్, క్లాడింగ్ పనులకు రూ.కోటీ 22 లక్షలు, ఫర్నిచర్ కోసం రూ.కోటీ 30 లక్షలు, బ్రిక్ వర్క్ మూడో ఫ్లోర్‌కు డోర్లు, అన్ని ఫ్లోర్లు ఎలివేషన్ తదితర పనులకు రూ.95,80 లక్షలు కేటాయింపు కోసం పాలక మండలి ఆమోదం కోసం అజెండాలో సిద్ధం చేశారు. ఇక ఆమోదమే తరువాయి. ఒక భవన నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్న అధికారులు.. నగరంలో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించకపోవడం దారుణమైన విషయం. మరోవైపు కోట్లాది రూపాయలతో జరుగుతున్న భవననిర్మాణ పనులపైనా పాలకవర్గ సభ్యుల పర్యవేక్షణ కొరవడడం విచారకరం. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నూతనంగా అమల్లోకి వచ్చిన 279 జీఓ ప్రకారం నగరంలో 50 డివిజన్లను 24 శానిటరీ సర్కిల్స్‌గా విభజించారు. నాలుగు జోన్లుగా( ఈస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ ) విభజించారు. ఈ జోన్లలో పారిశుద్ధ్య నిర్వహణకు రూ.17.79 కోట్లు మంజూరు చేస్తూ ఈ ఏడాది మే 21న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆమోదించారు. నగరంలో ప్రస్తుతం పని చేస్తున్న వారే ఉన్నప్పటికీ శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో 13/884 అంశ«ంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 899 మందికి జూలై 2016 నుంచి మార్చి 2017 వరకూ వారి జీతాలు చెల్లింపునకు రూ.9.33 కోట్లు మంజూరు చేయాలంటూ అజెండాలో రూపొందించారు. మే నెల పాలక మండలి కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్లాయి. వాటితో ఏం చేశారు. తాజాగా ఈ నిధుల మంజూరు ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఇష్టానుసారంగా నిధులు కేటాయించడంపై పలువురు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. -
ఎన్సీఎల్పీ నిధులు పక్కదారి
* అవినీతి ఊబిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం * పిల్లలసంఖ్యను అధికంగా చూపి సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు * పట్టించుకోని ఉన్నతాధికారులు బాలకార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో అవి పక్కదారి పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ నేరుగా సమీక్షించాల్సిన జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం (ఎన్సీఎల్పీ) జిల్లాలో అవినీతిమయంగా మారింది. ఎవరికి వారు అందినకాడికి దండుకుంటూ పిల్లల నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు. ఈ విధంగానైతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుంటూరు వెస్ట్ : జాతీయ బాలకారిృక వ్యవస్థ నిర్మూలన పథకం(ఎన్సీఎల్పీ)లో భాగంగా జిల్లాలో నడుస్తున్న శిక్షణ కేంద్రాలు అవినీతిమయంగా మారాయి. జిల్లాలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. పిల్లల సంఖ్యను అధికసంఖ్యలో చూపించి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రాజñ క్టు అమలు బాధ్యతలు రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. తమను ప్రశ్నించేవారే లేరనే ధీమాతో సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 22 శిక్షణ కేంద్రాలు... జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథకం(ఎన్సీఎల్పీ) జిల్లాలో 1996 నుంచి అమలులో ఉంది. కేరళ మినహా దేశవ్యాప్తంగా 272 జిల్లాలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ పీడీ సెక్రటరీగా ఉండే ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన. జిల్లా వ్యాప్తంగా వినుకొండ, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పిడుగురాళ్ల, తెనాలి, రెంటచింతల, సత్తెనపల్లి, రాజుపాలెం, బొల్లాపల్లి తదితర మండలాల్లో 22 శిక్షణా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో 1,112 మంది పిల్లలు ఉన్నట్లు పథకం నిర్వాహకులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఒక్కొక్క సెంటర్లో ఇద్దరు శిక్షకులు, అకౌంటెంట్, ఆయా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుసెంటర్లకు కలిపి ఒక ఒకేషనల్ శిక్షకుడు ఉంటున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో సెంటర్లో 50 నుంచి 60 మంది పిల్లలు ఉంటున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు నగరంలో ఐదు సెంటర్లు ఉండగా పొన్నూరు రోడ్డులోని సాయిబాబా కాలనీలో మినహా ఏ ఒక్క సెంటర్లో కూడా పిల్లలు లేక సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నల్లచెరువు 23వ లైన్‌లోని శిక్షణా కేంద్రంలో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవంగా అక్కడ 20 మందికి మించి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితులే జిల్లాలోని అన్ని సెంటర్లలో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజనం మినహా సౌకర్యాలు శూన్యం.. 1,112 మంది పిల్లలకు సై్టఫండ్ నిమిత్తం నెలకు రూ.1.66 లక్షలు అందిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా అదే సంఖ్యలో పిల్లలకు వడ్డిస్తున్నట్లు లెక్కలు తయారుచేస్తూ నిధులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. విద్యార్థులకు యూనిఫాం కూడా ఇంతవరకు అందించిన దాఖలాలులేవు. మధ్యాహ్న భోజనం మినహా ఇతర సౌకర్యాలేవీ పిల్లలకు కల్పించలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. శిక్షణా కేంద్రాలకు సమీపంలోని పిల్లలను పిలిచి మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎన్సీఎల్పీ జాతీయ కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరుతున్నారు. తెనాలిలో.... తెనాలి ఐతానగర్లోనూ ఎన్సీఎల్పీ కేంద్రం ఉంది. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలను ఎన్సీఎల్పీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు వయస్ను 50 మంది విద్యార్థులు ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో చూపెడుతున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవానికి అక్కడ విద్యనభ్యసిస్తున్న సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘పంట’ల కారు...!
ఇదోరకం ఎత్తిపోతల పధకం అగ్నిమాపక శాఖ అధికారదుర్వినియోగం ఫైర్ ఇంజన్లతో పంటలకు నీరు పిఠాపురం : అగ్నిప్రమాదం జరిగితే గంటల తరబడి రాని రెండు ఫైర్ ఇంజిన్లు ... 20 మంది సిబ్బంది ... ఉరుకులు పరుగులతో సైరన్ మోగించుకుంటూ రయ్యిన దూసుకుపోయాయి. ఆ హడావుడి చూసినవారు ఎక్కడో ఏదో పెద్ద అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని కంగారుపడిపోయారు. ఇంతకూ ఆ ఫైర్ ఇంజిన్లు వెళ్లింది మంటలు ఆర్పడానికి కాదు ... పంటలకు నీరు తోడుకోడానికి. ఇదేమిటీ ఫైర్ ఇంజిన్లు పంట పొలాలకు నీరు తోడడమేమిటీ అని అనుకుంటున్నారా...! అదేనండి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీస్ వర్మ రచించిన ఇదో కొత్తరకం ‘ఎత్తిపోతల... పథకం’. తన అనుచరుల పంట పొలాలకు నీరు అవసరం పడడంతో ఈ పథకానికి తెరదీశారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే వెళ్లాల్సిన అగ్నిమాపక శకటాలు ... సిబ్బందిని తన అధికార దుర్వినియోగంతో బలవంతంగా తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం పట్ల ఈ ప్రాంతవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గంలో నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నానంటూ ప్రకటనలు గుప్పించిన సదరు ఎమ్మెల్యే చెప్పే మాటలకు ... చేసే పనులకు పొంతన లేదనడానికి ఈ సంఘటనే తార్కాణం. పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఎదురై ఇప్పటికే నాట్లు పడక రైతులు పాట్లు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడక్కడా నాట్లు పడ్డాయి. గత ఐదు రోజులుగా ఎండలు మండిపోవడంతో నాట్లు వేసిన పంటలు బీటలు వారడం ప్రారంభించాయి. ఏలేరు, పీబీసీల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యే ఆ దిశగా నీరు రప్పించలేక చివరకు అత్యవసర వాహనాలైన ఫైర్ ఇంజిన్లను రప్పించి పీబీసీలో నీటిని తోడించి పైపుల ద్వారా పంటలకు నీరు మళ్లించడం చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవలే సాగునీటి ఎద్దడి ఉన్న రైతులు కాలువల్లో నీరు తోడుకునేందుకు వీలుగా ఇదే ఎమ్మెల్యే రాయితీపై ఆయిల్ ఇంజిన్లు పంపిణీ చేశారు. వాటిని పక్కన పెట్టి కాలువ పక్కనే (పీబీసీ) ఉన్న పంట పొలాలకు ఫైర్ ఇంజిన్లతో భారీగా నీరు తోడించడముమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఎమ్మెల్యే ఆదేశానుసారమే... మంటలు ఆర్పాల్సిన మీరు పంటలకు నీరు తోడడమేమిటని అక్కడున్న అగ్నిమాపక అధికారి వీవీఎస్ భావనారాయణను ‘సాక్షి’ ప్రశ్నించగా ఎమ్మెల్యే వర్మ ఆదేశాల మేరకు తాము ఇలా చేయవలసి వచ్చిందని చెప్పారు. మరి ఏదైనా ప్రమాదం సంభవిస్తే మి చేస్తారని అడగ్గా ‘వీలుకుదిరితే వెళతాం లేకపోతే మేమేం చేయలేం’ అంటూ తన అసక్తతను చెప్పుకొచ్చారు. -
సహచరులపై స.హ. దుర్మార్గం?
విశ్లేషణ జనహిత సమాచారం తీసుకోవడా నికే సమాచార హక్కు. చట్టబద్ధమైన హక్కులు కాపాడుకోవడానికి పనికి వచ్చే సమాచారాన్నీ కోరవచ్చు. కాని సహచరులను వేధించడానికి పుంఖా నుపుంఖాలుగా దరఖాస్తులు పెడితే అది దుర్మార్గమూ, దుర్వినియో గమూ అవుతుంది, ఆ పని చేసిన ఉద్యోగిపై దుష్ర్పవర్తన కింద యజ మానులు క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఢిల్లీ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగ శాలలో, గ్రంథాలయంలో పనిచేసే ఇద్దరు సహాయ ఉద్యో గులు తమకు ప్రమోషన్ ఇవ్వలేదని కళాశాల యాజమాన్యం మీద పగబ ట్టారు. కొందరు తమ ప్రమోషన్‌ను అడ్డుకుంటున్నారని వీరు భావించారు. తమపైన ఫిర్యాదు చేశారని, క్రమశిక్షణా చర్య తీసుకున్నారని, సాక్ష్యం చెప్పారని కొందరిని అనుమానించి వారి గురించి ఆర్టీఐ ప్రశ్నలు వేశారు. వారి దాడికి ప్రిన్సిపల్ కూడా గురయ్యారు. వారి రెండో అప్పీలు విచారణకు వచ్చినప్పుడు అయి దుగురు ఉద్యోగులు హాజరై, ఈ ఇద్దరు దుర్మార్గుల సమాచార అభ్యర్థనలకు అంతులేకుండా పోతున్నదని వాపోయారు. ఆఫీసులో పనిచేయకుండా పనివేళలను సమాచార ప్రశ్నలు తయారు చేయడానికి, కుట్రలు చేయడానికి వాడుకుంటు న్నారని, పాఠాలు చెప్పరని, విద్యార్థులకు సాయం చేయడం లేదనీ, వీరు అడిగే సమాచారమంతా స్వార్థం, పగ, ప్రతీకా రంతో కూడినవేనని మొరపెట్టుకున్నారు. ఒక మహిళ.. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా వీడియో తీసి, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అతడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడని చెబుతూ ఒక ఉపా ధ్యాయిని ఒక ప్రింట్ అవుట్ సమర్పించింది. ఈ దుర్వినియోగ ఉద్యోగి ఫొటో అతని వ్యాఖ్యానాలతో సహా వీడియో చూస్తే అతనే కారకుడని తేలిపోతుంది. పని చేయకుండా సహచరుల పనులు చెడగొడుతూ, ప్రభుత్వ సంస్థను నిస్సహాయ స్థితికి తీసుకువస్తే అంతకన్నా హాని ఏముంటుందని, ఈ చట్టం వచ్చింది ఇందుకు కాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలోని తమ సహచరు లందరూ ఈ ఇద్దరు దుర్మార్గుల దుర్వినియోగ సమాచార ప్రశ్నలకు ఫైళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారని ఉద్యోగులు కమిషన్‌కు విన్నవించారు. లిఖిత పూర్వకంగా వీరి దుర్మా ర్గాలను వివరించారు. ప్రిన్సిపల్ తనను ఈ ఇద్దరి వేధింపుల నుంచి విముక్తులను చేయాలని కోరారు. సహచరుల వైద్య ఖర్చుల బిల్లులు, రోగాలు తదితర వ్యక్తిగత వివరాలు కోరే హక్కుపై పరిమితులున్నాయి. అన్నింటినీ వక్రీకరించి వేధిస్తున్నారని చాలా వివరంగా ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. సమస్యా పరిష్కార విభాగాన్ని కూడా వారు దుర్వినియోగం చేసారు. వారు చేసిన 36 ఫిర్యాదులు ఒకే రకమైనవి. అసలవి ఫిర్యాదులే కాదు. వేధింపు ఉత్తరాలని చెప్పి వాటిని తిరస్క రించారు. ఆ వివరాలన్నీ కమిషన్ ముందుంచారు. అంబేడ్కర్ కాలేజీ వీడియో తీసి వాట్సప్, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం నేరం అవుతాయి. వ్యక్తులు తమ స్థాయిలోనూ, కళాశాల యాజమాన్యం తమ స్థాయిలోనూ ఈ దుర్మార్గులపై చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టాలను వినియోగించే అధికారం ఉందని తెలియక ఏ చర్యలూ తీసుకోకపోవడం వల్ల దుర్మార్గుల ఆటలు సాగు తున్నాయి. అంబేడ్కర్ కాలేజీలో పనిచేసే ఒక మహిళ.. తమ కళాశాలలోని సహాయ ఉద్యోగులలో ఒక వ్యక్తి తనపైన దుష్ర్ప చారం చేస్తున్నాడని ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాల స్థాయిలో నోటీసు ఇచ్చి చర్య తీసుకోవలసిన విషయ మని మహిళా కమిషన్ భావించింది. ఆ చర్య తీసుకోక పోవడం వల్ల ఈ దుర్మార్గుడికి బలం చేకూరింది. ఆ సహచర ఉద్యోగి వివరాలను, అనవసర సమాచారాన్ని, వ్యక్తిగత సమా చారాన్ని ఇవ్వాలని అతడు వేధించసాగాడు. సమాచార చట్టంపై పూర్తి అవగాహన లేని వారు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని తెలియని వారు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దుర్మార్గులు చెలరేగిపోతున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక దేహశుద్ధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చిన్న చిన్న సంస్థలలో జరిగే ఇలాంటి వాటిని మీడియా పట్టించుకోదు. కనుక వీరి గురించి అందరికీ తెలియదు. కాని చర్య తీసుకునే అధికారాన్ని విద్యా సంస్థల యాజమాన్యం వినియోగించుకోకపోవడం వల్ల దుర్విని యోగం పెరుగుతున్నది. మౌనంగా భరిస్తూ ఏడ్వడం వల్ల దుర్మార్గం విజృంభిస్తుంది. క్రమశిక్షణా చర్య ఒక్కటి గట్టిగా తీసుకుంటే చాలు వీరి ఆట కట్టయిపోతుంది. ప్రభుత్వ సంస్థలు కీలకమైన పనులు చేయనీయకుండా అడ్డుకునే దుర్వినియోగదారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా సంస్థల అధికారులు పరిశీలించి, దానికి సమంజసమైన విధానాన్ని, ప్రక్రియను రూపొం దించాలి. క్రమశిక్షణా నియమాల్లో పారదర్శకతకు స్థానం కల్పిస్తూనే దుర్వినియోగ వ్యతిరేక చర్యలపై నియమాలను కూడా చేర్చాలి. ఇటువంటి దుర్వినియోగం వల్ల సహ చట్టం ఉనికికే ప్రమాదం వస్తుంది. మంచి పాలన కోసం ఆర్టీఐని వినియో గించాలి. సహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పనిచేయని, పనికిరాని ఉద్యోగులు సంస్థకు, ఈ చట్టానికి తీరని కీడు చేస్తారు. వీరిని ఉపేక్షించకూడదు. వీరిపైన క్రమశిక్షణా చర్య తీసుకోవాలి. ఒక కళాశాలలో బాగా చదువుకున్న ఒక మహిళా ఉపా ధ్యాయురాలు పాఠాలు చెప్పకుండా పక్కవారిని వేధిస్తుంటే సక్రమంగా నోటీసు ఇచ్చి విచారణ జరిపి, వారి దుర్మార్గాన్ని రుజువు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. ఆ పని చేయవచ్చు కాని పగబట్టి స్వార్థంతో ఆర్టీఐని దుర్విని యోగం చేయడానికి వీల్లేదు. పదవీ విరమణ చేసిన వృద్ధ ఉద్యోగి ఒకరు తనకు ఇరవై ఏళ్ల కిందట ప్రమోషన్ రాలేదనే కసితో వరసబెట్టి ఆర్టీఐ వాడసాగాడు. సమాచార కమిషన్ అతని దరఖాస్తులను కట్టగట్టి సమిష్టిగా విచారించి తిరస్కరించింది. ఇతని దుర్మా ర్గాన్ని దుష్ర్పవర్తనగా భావించి క్రమశిక్షణా చర్య తీసుకో వచ్చని, అందుకు సంబంధించిన నియమాలు రూపొం దించాలని కమిషన్ సూచించింది. (CIC/BS/A/2014/002319-SA, CIC/SA/A/2015/002028 కేసుల్లో సీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఈ రోగానికి మందేది?!
మితి మీరితే ఏదైనా వికటిస్తుంది. అది ప్రాణాధార మందుల విషయంలో కూడా వాస్తవమేనని తరచు వెల్లడవుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. వచ్చిన వ్యాధేమిటో తెలియక, రోగి పడుతున్న నరకయాతనను చూడలేక ఆప్తులంతా క్షోభించే పాడుకాలం అంతరించి...రోగకారక క్రిములను మట్టుబెట్టే యాంటీ బయాటిక్స్ అందుబాటులోకొచ్చినప్పుడు ప్రపంచమంతా సంతోషించింది. యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో ఒక విప్లవాత్మక పరిణామం. రోగాన్ని నిరోధించి, ఆయుఃప్రమాణాన్ని పెంచడంలో అవి కీలక పాత్ర పోషించాయి. దేన్నయినా జయించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. తరాలనుంచీ, యుగాలనుంచీ మానవజాతి ప్రాణాలు తోడేస్తున్న అంటువ్యాధులపై 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొనడంతో మొదలెట్టి దాదాపు వంద రకాల యాంటీయాటిక్స్ అందుబాటులోకొచ్చాయి. అయితే అవసరం జూదంగా మారకూడదు. విచక్షణా, హేతుబద్ధతా కొరవడకూడదు. యాంటీబయాటిక్స్ విషయంలో జరిగింది అదే. రోగి స్థితిగతులను అంచనావేసి, రోగ తీవ్రతను ఆధారం చేసుకుని మోతాదు నిర్ధారించాల్సి ఉండగా... అందుకు బదులు విచ్చలవిడి వాడకం ఎక్కువైంది. 'పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం...' అన్నట్టు అన్నిటికీ యాంటీబయాటిక్స్ వినియోగించడం పెరిగిపోయింది. కనుకనే వ్యాధి కారక క్రిములు మొండి ఘటాలుగా మారాయి. ఏ మందులనైనా తట్టుకునే స్థితికి చేరుకున్నాయి. పర్యవసానంగా తేలిగ్గా తగ్గవలసిన వ్యాధులు దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఇదే వరస కొనసాగితే భవిష్యత్తులో చిన్న చిన్న గాయాలు కూడా మానే స్థితి ఉండకపోవచ్చునని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మనం ఎలాంటి విపత్కర స్థితికి చేరువవుతున్నామో తెలియజెబుతున్నాయి. ఇతర రంగాల మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయం కావడంవల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉండే ఆరోగ్యరంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం మితిమీరడంవల్లనే ఇంతగా వికటించింది. ఔషధ సంస్థలకూ, వైద్యులకూ ఉండాల్సిన సంబంధమూ.... వైద్యుడికీ, రోగికీ ఉండాల్సిన బంధమూ గతి తప్పాయి. అనైతికత, అమానవీయత దండిగా పెరిగాయి. పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఔషధ సంస్థలు అడ్డదారిలో అమాంతం ఎదగాలని చూస్తున్నాయి. నాణ్యమైన మందుల్ని ఉత్పత్తి చేయడానికి బదులు నాసిరకం సరుకును మార్కెట్లోకి వదులుతున్నాయి. కొన్నేళ్ల క్రితం 167 రకాల యాంటీబయాటిక్స్‌పై ఆరా తీసినప్పుడు అందులో కేవలం 15 మాత్రమే వ్యాధులను ఎదుర్కొనడానికి ఉపయోగపడతాయని తేలింది! ఔషధ సంస్థలు వైద్యులకు ఆకర్షణీయమైన బహుమతులను ఎరగా చూపి అమ్మకాలను పెంచుకుంటుంటే...రోగి ఆర్థిక స్థోమతనుగానీ, మందుల వాడవలసిన అవసరాన్నిగానీ పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా అంటగట్టే ధోరణి వైద్యుల్లో పెరుగుతోంది. ఇవి చాలవన్నట్టు వచ్చిన రోగమేదో తెలియకుండా, వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకుండా మందుల దుకాణాలకెళ్లి సమస్య చెప్పి ఏవో మాత్రలు కొనుగోలు చేసి వాడేవారూ ఎక్కువయ్యారు. కట్టుదిట్టమైన చట్టాలుండటంతోపాటు వాటి అమలు తీరును పర్యవేక్షించే వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి పోకడలను నియంత్రించడం సాధ్యమవుతుంది. అవి సక్రమంగా పనిచేయకపోవడంవల్లనే రోగ నిరోధకత నానాటికీ క్షీణిస్తున్నదని గుర్తించాలి. నిజానికిది మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. చాలాచోట్ల అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.ఈ ప్రమాదం గురించి 2001లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ అతివాడకాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టకపోతే గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని తెలిపింది. ఈ హెచ్చరికల పర్యవసానంగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. మన దేశంలో ఇలాంటి పరిస్థితి కనబడదు. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్లు ఎన్నడో కనుమరుగయ్యారు. ఇప్పుడు భారీ పెట్టుబడులతో కార్పొరేట్ ఆస్పత్రులు రంగంలోకొచ్చాయి. అవి రోగిని వైద్య సాయం అవసరం పడిన వ్యక్తిగా కాక, కస్టమర్‌గా భావిస్తున్నాయి. వేల రూపాయలు వ్యయమయ్యే వైద్య పరీక్షలు సరేసరి...అవసరంలేని మందుల్ని అంటగట్టే పోకడలు కూడా పెరిగాయి. అసలు ఏ వ్యాధికైనా అల్లోపతి వైద్య విధానం తప్ప మరే విధమైన ప్రత్యామ్నాయమూ లేదని భావించే వాతావరణం ఏర్పడింది. వ్యాధి ప్రాథమిక దశలో ఉండగా ఇంట్లో లభించే చిన్న చిన్న వాటితో దాన్ని అరికట్టడం తేలికవుతుందన్న అవగాహన ఒకప్పుడు ప్రజల్లో ఉండేది. అది రాను రాను కరువవుతోంది. దేనికైనా ఒక మాత్ర మింగేస్తే తేలిగ్గా తగ్గిపోతుందన్న దురభిప్రాయం ఏర్పడుతోంది. కిందిస్థాయి వరకూ పటిష్టమైన యంత్రాంగం ఉండే ప్రభుత్వాలు తల్చుకుంటే ఇలాంటి లోటుపాట్లను సరిదిద్దడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని జరగడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలను మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థల వైఫల్యం కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి సంస్థలు వైద్యుల్లో మాత్రమే కాదు...ప్రజల్లో సైతం యాంటీబయాటిక్స్పైనా...వాటి దుర్వినియోగం, అతి వినియోగంవల్ల కలిగే అనర్థాలపైనా గట్టిగా ప్రచారం చేస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. అలాగే మందుల వినియోగంపై ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సులు, గ్రామీణ ఆరోగ్య సహాయకులవరకూ అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుండాలి. మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుంది. నిర్లక్ష్యమనే రోగాన్ని వదుల్చుకుంటేనే ముంచుకొస్తున్న ముప్పును ఆపడం తేలికవుతుంది. -
'సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారు'
కోల్‌కతా: కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమాల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒకరిద్దరు బయటవాళ్లు చేసిన తప్పుకు మొత్తం పార్టీపైనే నిందలు మోపుతున్నారని అన్నారు. బంగ్లాదేశీయులు తమ పొరుగువారని, సోదరులని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తీవ్రవాదులకు దేశం, మతం ఉండదని, వారిని తీవ్రవాదులుగానే చూడాలని అన్నారు. బెంగాల్ శారద స్కాంలో తృణమాల్ ఎంపీలను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ పలువురు నిందితులను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మమత పైవిధంగా వ్యాఖ్యానించారు. -
'వరకట్న చట్టాలు దురుపయోగమౌతున్నాయి'
వరకట్న చట్టాలు దురుపయోగమవుతున్నాయని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో అరెస్టులు చేయకూడదని, అలా చేయాల్సి వస్తే దానికి గల కారణాలను కోర్టుకు వివరించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వరకట్న వేధింపుల చట్టం కింద ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే అరెస్టు చేయడానికి సహేతుకమైన కారణాలున్నాయా లేదా అన్నది రూఢి చేసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. పలు సందర్బాల్లో మంచానికే పరిమితమైన అత్త మామలు, ఏళ్ల తరబడి విదేశాల్లో ఉంటున్న ఆడబిడ్డలపై కూడా వరకట్న వేధింపు కేసులు నమోదవడాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పు పట్టింది. దీన్ని ఒక ఆయుధంగా వాడుకుని కక్షసాధింపుకు పాల్పడటం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టం వల్ల అరెస్టయ్యే వారిలో నాలుగో వంతు మహిళలే కావడం గమనార్హమని కూడా కోర్టు పేర్కొంది. ఇలా చట్టాన్ని దురుపయోగం చేయడం దురహంకారపూరితం. వీటిని న్యాయస్థానాలు అదుపుచేయాలని సర్వోచ్చ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. -
వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగమవుతోంది
న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మనస్పర్థలు, గొడవల కారణంగా భార్యలు తమ భర్త, వారి కుటుంబ సభ్యులపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో నిందితులను కారణం లేకుండా అరెస్ట్ చేయవద్దని, క్షుణ్ణంగా విచారించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వరకట్నం వేధింపుల కేసులో నిందితులను తొలుత అరెస్ట్ చేసి తర్వాత విచారించాలన్ని పద్ధతిని మానుకోవాలని సూచించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
ఆంధ్రప్రదేశ్‌లోనూ సీబీఐని ఉసిగొల్పారు: మోడీ
హైదరాబాద్: యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనూ సీబీఐని దుర్వినియోగం చేసిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ.. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాజకీయ కారణాల వల్లే కేంద్రం సీబీఐని ఉసిగొల్పిందని మోడీ ఆరోపించారు. నిజామాబాద్ సభలో మోడీతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ సభలో వీరు ముగ్గురు కలసి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు సమర్థ ప్రభుత్వానికే అధికారం ఇవ్వాలని మోడీ కోరారు. ఢిల్లీలో తల్లీకొడుకుల ప్రాణ వాయువుతో నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని విజ్ఙప్తి చేశారు. రెండు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్ రావాలని మోడీ ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. టీఆర్ఎస్తో కుటుంబ పాలన తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ నోటిదురుసు వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. తెలంగాణను ఎంత సమర్థవంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నది సమస్యని, ఎవరిని గెలిపిస్తో అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలని ప్రజలను కోరారు. మోడీ అధికారంలోకి వస్తే యువత భవితకు భరోసా ఉంటుందని, అందుకే మద్దతు ప్రకటించానని చెప్పారు. -
'పద్మశ్రీని అలా వాడొద్దు కదా ? తప్పు కదా ?'
-
గుడిని మింగే దొంగలు!
భక్తుల విరాళాలు అధికారుల జేబుల్లోకి.. ఇరవై ఏళ్లుగా ఆ శాఖలో ఆడిట్ లేదు.. తనిఖీలు, సమీక్షలూ శూన్యం తాజా కమిషనర్ విచారణలో బట్టబయలు కట్టడి చేసేందుకు కమిషనర్ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రధాన దేవాలయాలకు దాతలు, భక్తులు సమర్పించే విరాళాలు పక్కదారి పడుతున్నాయి. అందులో కొందరి విరాళాలతో మాత్ర మే కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా సొమ్ము కొందరు అధికారులు, సిబ్బంది జేబులోకి వెళ్తుంది.. కానీ, అన్ని విరాళాలూ ఎప్పటికప్పుడు వ్యయమవుతున్నట్లుగా లెక్కలు తయారవుతుంటాయి.. ఈ అక్రమాలు బయటపడతాయనే భయం అసలేలేదు.. దానికి కారణం తనిఖీలు, సమీక్షలు లేకపోవడమే.. ఈ శాఖలో ఏకంగా 20 ఏళ్లుగా ఆడిటింగే జరగకపోవడంతో అక్రమాలేవీ బయటపడటం లేదు. అధికారులు దొంగ బిల్లులతో భారీ ఎత్తున నిధులు స్వాహా చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 33 వేల దేవాలయాలను పర్యవేక్షిస్తున్న దేవాదాయ శాఖలో దాదాపు ఇరవై ఏళ్లుగా ఆడిటింగ్ జరగటం లేదు. దాంతో భక్తుల నుంచి భారీగా వస్తున్న విరాళాలను తప్పుడు బిల్లులతో అధికారులు స్వాహా చేస్తున్నారు. ఈ క్రమంలో లోకల్ ఫండ్ ఆడిటింగ్ పేర తూతూమంత్రంగా కథ నడుపుతున్నారు. ఉన్నతాధికారులెవరూ దృష్టిసారించకపోవడంతో.. ఇది మరిం త విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఆదాయం ఎక్కువగా ఉన్న ఆలయాల బాధ్యతలు తీసుకునేందుకు అధికారులు పోటీపడి మరీ పోస్టులు దక్కించుకుంటున్నారు. ఇందుకోసం నేతలకు భారీగా ‘సమర్పించు’ కుంటున్నారు కూడా. కొద్ది నెలల కిందట డిప్యూటీ కమిషనర్ల బదిలీ సమయంలోనూ ఈ తరహా తంతు నడిచింది. తొలుత ఇచ్చిన పోస్టింగులను చివరి నిమిషంలో మార్చి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ముక్తేశ్వరరావు విచారణలో ఈ బాగోతాలన్నీ వెలుగు చూశాయి. గత 20 ఏళ్లుగా దేవాలయాల్లో తనిఖీలు లేవని, సమీక్షలు జరగలేదని కూడా వెల్లడైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్... దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా విధివిధానాలు అవసరమనే అభిప్రాయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తేవటంతో ఇప్పుడా కసరత్తు మొదలైంది. ఈ మేరకు పలు అంశాలపై చేపట్టాల్సిన చర్యలను సూచించనున్నారు. ప్రత్యేక విధి విధానాలకు కసరత్తు ఇక నుంచి దేవాలయాల ఆదాయ, వ్యయాలపై పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహిస్తారు. ఆ ఆడిట్ ఎలా ఉండాలనే దానిపై విశ్రాంత అధికారులతో అధ్యయనం చేయిస్తున్నారు. 6 సీ స్థాయి పరిధిలో రాష్ట్రంలో దాదాపు 24 వేల దేవాలయాలున్నాయి. వాటిలో పనిచేస్తున్న అర్చకులకు జీతాలను సరాసరిన చేతికే అందిస్తున్నారు. దాంతో గుడుల ఆదాయం తగ్గిందంటూ సిబ్బందికి జీతాలు తక్కువగా ఇస్తూ నిధులను స్వాహా చేస్తున్నారు. దాంతో ఇక నుంచి అర్చకుల పేర బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిల్లోనే జీతాలు జమ చేస్తారు. దేవాలయాల పరిధిలోని భూములు, లీజుల వివరాలు.. స్థిర, చరాస్తులకు సంబంధించి ఇప్పటివరకు డేటా బ్యాంకు లేదు. దాంతో అధికారులు భూములను, లీజు సొమ్మును కాజేస్తున్నారు. ఇక ఆలయాలకు ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందిస్తారు.