సాక్షి, హైదరాబాద్: సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమె త్తారు. విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సీబీఐ, ఈడీలతో దాడులు చేయి స్తూ ఆ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్రం వైఖరితో ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాల ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ తరహా దాడులు ఆగాలంటే.. విచారణకు వీ లుగా సీబీఐకి ఇచ్చిన అనుమతులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సూచించారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రా ల పరిధిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. బుధవారం బిహార్ రాజధాని పట్నాలో పర్యటించిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
విస్తృత చర్చల తర్వాతే..
‘దేశంలోని విపక్ష పార్టీలను అంతమొందించి గుత్తాధిపత్యం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఒకవైపు బలహీనులను బెదిరిస్తూ సత్య హరిశ్చంద్రుని వారసుల్లా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కుంభకోణాలకు పాల్పడటమే కాకుండా ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ డబ్బును బీజేపీ వెదజల్లుతోంది. దేశంలోని విపక్షాలన్నీ ఏకమై బీజేపీ ముక్త భారత్‌ను సాధిస్తేనే దేశ పురోగతి సాధ్యమ వుతుంది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి ముందుకు సాగుతాం. విస్తృత చర్చల అనంతరం ఎన్నికల సమయంలో ఈ శక్తికి ఎవరు నేతృత్వం వహిస్తారనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం’ అని కేసీఆర్ చెప్పారు.
ధర్మం పేరిట దేశాన్ని చీల్చుతున్నారు..
‘ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలోని ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో లేనంతగా పడిపోయింది. గతంలో దేశం నుంచి మేధో వలస జరగ్గా, ఇప్పుడు పెట్టుబడిదారులు దేశాన్ని వీడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తిని అంతమొందించేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం వంటి చట్టాల పేరిట ఇబ్బందులు పెడుతున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు, బేటీ పడావో.. భేటీ బడావో వంటివి కేవలం నినాదాలకే పరిమితమవుతున్నాయి. ధర్మం పేరిట దేశాన్ని చీల్చుతూ అంతర్జాతీయ స్థాయిలో తలవంపులు తెస్తున్నారు.
భిన్నంగా ఆలోచించాలి..
70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా సాగునీరు, తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ కొరత ఉంది. మేకిన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్నా జాతీయ జెండాను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా దేశంలో నెలకొని ఉన్న సమస్యల నుంచి బయట పడేందుకు భిన్నంగా ఆలోచించాలి. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై సీఎం నితీశ్‌తో కూడా చర్చించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
పట్టుదలతో ముందుకు సాగండి: నితీశ్
తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని బిహార్ సీఎం నితీశ్ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు భారత్‌కు మార్గదర్శకంగా నిలుస్తు న్నాయని అన్నారు. కేసీఆర్ గురించి అవగా హన లేనివారే తప్పుడు మాటలు మాట్లాడు తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవస రంలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు వదులు కోరంటూ.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టు దలతో ముందుకు కొనసాగాలని, మరింత శక్తి కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించాలని నితీశ్ సూచించారు.
లాలూతో కేసీఆర్ భేటీ
బుధవారం ఉదయం 12 గంటలకు బేగంపేట విమానా శ్రయం నుంచి ప్రత్యేక విమా నంలో పట్నాకు వెళ్లిన కేసీఆర్ కు.. తేజస్వీ యాదవ్ స్వాగ తం పలికారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత దేశ రాజ కీయాలు, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు. అనంతరం నితీశ్, తేజస్వీతో కలిసి కేసీఆర్ మీడియా భేటీలో ప్రసంగించారు. తర్వాత బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిసిన కేసీఆర్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం గురుగోవింద్ సింగ్ జన్మస్థలం పట్నా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్‌కు చేరుకు న్నారు. సీఎం వెంట బిహార్‌కు వెళ్లిన బృందంలో సీఎస్ సోమేశ్‌కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు, తదితరులున్నారు.
అమర వీరులు, కార్మికుల కుటుంబాలకు సాయం
చైనాతో పోరాటంలో భాగంగా గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు, అలాగే సికింద్రాబాద్‌లోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన బిహార్ కార్మికుల కుటుంబాలకు.. నితీశ్‌తో కలిసి కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. నితీశ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సా యం చెక్కుల రూపంలో అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment