లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్‌ఎల్‌డీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఉప ఎన్నికల్లో బీఎస్ఫీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.
ఈ ఫలితాల అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. గతంలో బ్యాలెట్ పేపర్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా నకిలీ ఓట్లు వేసేవారని, ఈ పని ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూడా జరుగుతోందని మాయావతి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment