EVM
-
ఈవీఎంలలో డేటాను చెరిపేయొద్దు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం(డేటా), ఎన్నికల గుర్తుల లోడింగ్ యూనిట్లలో సమాచారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికలు పూర్తయ్యాక ఓడిన అభ్యర్థి అభ్యర్థన మేరకు ఈవీఎంల వెరిఫికేషన్‌లో భాగంగా ఆయా ఈవీఎంలలోని డేటాను చెరిపేయడం, రీలోడ్ చేసే సంస్కృతిని మానుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈసీకి సూచించింది. సింబల్ లోడింగ్ యూనిట్(ఎస్ఎల్యూ)ను తనిఖీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈవీఎంలలో మెమొరీని, ఎస్‌ఎల్‌యూలను తనిఖీచేసేందుకు అవకాశం ఇవ్వాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే ఎన్జీవో సంస్థ, ఓడిన అభ్యర్థి సర్వ్ మిట్టెర్ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా ఆదేశాలిచ్చింది. డేటాను ఎందుకు తొలగిస్తున్నారు?ఈసీ జారీచేసిన ఈవీఎం వెరిఫికేషన్ ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) అనేది ఈవీఎం–వీవీప్యాట్ కేసులో 2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా లేదంటూ ఏడీఆర్ ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది. ఈ కేసును విచారిస్తూ ధర్మాసనం ‘‘ ఎన్నికలయ్యాక అభ్యర్థి వచ్చి ఈవీఎంలోని మెమొరీని, మైక్రో కంట్రోలర్లను, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్‌ను పిలిపించి తనిఖీచేయించాలని కోరితే ఈసీ ఆ ఈవీఎంలలో డేటాను వెరిఫికేషన్‌లో భాగంగా తొలగించకూడదు. అసలు మీరెందుకు డేటాను తొలగిస్తున్నారు?. పాత డేటాను అలాగే ఉంచండి. వెరిఫికేషన్ పేరిట డేటాను చెరిపేసి మళ్లీ అదే డేటాను రీలోడ్ చేయకూడదు. రీలోడింగ్ విధానాన్ని మానేయండి. ఎన్నికలయ్యాక ఇన్నాళ్లూ డేటాను తొలగించేందుకు మీరు అవలంభించిన విధానంపై వివరణ ఇవ్వండి.ఈ విషయంలో స్పందన తెలిపేందుకు మీకు 15 రోజుల గడువు ఇస్తున్నాం. కేసు విచారణను వచ్చే నెల మూడో తేదీతో మొదలయ్యే వారంలో విచారిస్తాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఒక విధానాన్ని తీసుకు రావాలంటూ గతంలో మాజీ హరియాణా మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యే కరణ్ సింగ్ దలాల్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి లఖాన్ కుమార్ సింగ్లాలు వేసిన మరో పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గతంలో కరణ్ ఇలాంటి పిటిషన్ వేశారని గుర్తుచేసింది. బ్యాలెట్ పేపర్ విధానంలోకి మళ్లుదామంటూ వేసిన పిటిషన్‌నూ గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు కొట్టేసింది.రూ.40 వేల ఫీజును తగ్గించండిఓడిన అభ్యర్థి ఒకవేళ ఈవీఎంలను తనిఖీ కోసం అభ్యర్థిస్తే అందుకోసం ఆయనపై వేసే ఫీజు భారాన్ని తగ్గించాలని కోర్టు సూచించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక 45 రోజులపాటు సింబల్ లోడింగ్ యూనిట్లను, ఈవీఎంలతోపాటే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలి. ‘‘అభ్యర్థి వచ్చి అడిగితే ఇంజనీర్‌తో ఈవీఎంలను వెరిఫై చేయించాలి. ఇందుకు ఏకంగా రూ.40,000 ఖర్చు అవుతుందా?. అంత ఫీజును అభ్యర్థిపై వేస్తారా?. ఇది చాలా ఎక్కువ మొత్తం. దీనిని తగ్గించండి’’ అని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్‌ను ధర్మాసనం కోరింది. ‘‘ ఈవీఎంల వెరిఫికేషన్ పద్దతి అనేది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదు. ఈవీఎం సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌లో ఏదైనా మతలబు ఉందో లేదో తెల్సుకునే స్వేచ్ఛ ఉండాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
ఈవీఎంల డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)ల్లో నిక్షిప్తమై ఉన్న డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR), కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది.‘ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని భావించి ఈవీఎంల్లో ఉన్న డేటా తొలగించకండి. ఏవిధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించవద్దు. అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలిగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ఒకవేళ ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎంల్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందన్నారు చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈవీఎంల్లోని మైక్రో కంట్రోలర్, మెమొరీల్లో ఉన్న డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. -
‘EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?’
ఈవీఎంల వ్యవహారంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందా? అంటూ ప్రశ్నించింది. ఈవీఎంలతో ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు ‘న్యాయ’ పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలను) నిందించడాన్ని వదిలేసి ఫలితాలను అంగీకరించాలంటూ విపక్ష కూటమిలోని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాశంమైంది. అయితే..ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పార్టీ తరఫున సీనియర్ నేత మాణికం ఠాగూర్.. ‘‘సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన యూబీటీ.. ఇవన్నీ ఈవీఎంలకు వ్యతిరేకంగానే మాట్లాడాయి. ఒమర్ అబ్దుల్లా.. మీ తరఫున ఓసారి వాస్తవాల్ని పరిశీలించండి. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. సీఎం అయ్యాక మా భాగస్వాముల ధోరణి ఎందుకు మారిందో? అని ప్రశ్నించారాయన. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై.. ఎంవీఏ కూటమి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే ఇండియా కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా మాత్రం ఈవీఎం అవకతవకలపై విరుద్ధంగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. It’s the Samajwadi Party, NCP, and Shiv Sena UBT that have spoken against EVMs. Please check your facts, CM @OmarAbdullah. The Congress CWC resolution clearly addresses the ECI only. Why this approach to our partners after being CM? https://t.co/rr3mpyJqx8— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 16, 2024‘‘గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదు. వందమందికి పైగా సభ్యులు అదే ఈవీఎంలతో మీ పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) తరఫున నెగ్గినప్పుడు దానిని ఘన విజయంగా తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత మీరు అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి ఈవీఎంలను నిందిస్తున్నారు. పక్షపాతంతో కాకుండా సిద్ధాంతాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా...ఓటింగు విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాటం చేయాలి. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదు. ఓటర్లు ఒకసారి మనల్ని ఎన్నుకుంటారు. మరోసారి ఎన్నుకోరు. నేనే దీనికి ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. సెప్టెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించాను. యంత్రాలను నేనెప్పుడూ ఆడిపోసుకోలేదు’’ అని అన్నారు. మొన్నటి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసే పోటీ చేశాయి.ఇదీ చదవండి: ఆ కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు! -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్‌లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
ఎక్కడా లేని ఈవీఎంలు మనకెందుకు?
షోలాపూర్: అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మన దగ్గర మాత్రం ఈవీఎంలు ఎందుకని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ప్రశ్నించారు. ఈవీఎంలను పక్కనపెట్టి కేవలం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈవీఎంల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో నాసిక్ జిల్లా మర్కద్వాడీ గ్రామంలో బ్యాలెట్ పేపర్లతో రీపోలింగ్ జరపాలని పోరాడుతున్న ప్రజలను శరద్ ఆదివారం కలుసుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించారు. మర్కద్వాదీ గ్రామస్థులు గొప్ప ఉద్యమం ప్రారంభించారని, మొత్తం దేశానికే సరైన దశాదిశ చూపుతున్నారని శరద్ పవార్ ప్రశంసించారు. గ్రామస్థులపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు తనకు ఇవ్వాలని, ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. మమతా బెనర్జీ సమర్థ నేత విపక్ష ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని అప్పగించాలన్న ప్రతిపాదనకు శరద్ పవార్‡మద్దతు పలికారు. ఆమె సమర్థత కలిగిన నాయకురాలు అని చెప్పారు. ఇండియా కూటమిని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: రైతులపై టియర్‌గ్యాస్.. ‘ఢిల్లీ చలో’లో హైటెన్షన్ -
EVM Row: ‘ఒకవేళ సీఈసీని తొలగించమని కోరితే..!’
దేశంలో ఇటీవల జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVM) పనితీరు మీద ఎన్నో సందేహాలకు కారణమయ్యాయి. ఈవీఎంలను ఎవరో.. ఎక్కణ్ణుంచో ఆపరేట్ చేస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా ఎన్నికల సరళికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న సుజా సయీద్ అనే ఉద్యోగి తాను ఈవీఎంను హ్యాక్ చేయగలను అని ఛాలెంజ్ చేసినందుకు ఆయనమీద ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా అయన మీద కేసు కూడా బుక్కైంది... మొన్న మహారాష్ట్రలో పోలింగ్ జరిగిన తీరుమీద సందేహాలు వ్యక్తం చేస్తూ షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీలులో 1900 ఓట్లున్న మర్కర్‌వాడీ గ్రామం ప్రజల వినూత్న పోరాటం చేస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించారు. అధికారవర్గాలకు కంగారు పుట్టించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఊరుమొత్తాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఏకంగా ప్రజలను కర్ఫ్యూ పేరిట నిర్బంధించారు.ఇదిలా ఉండగా దేశంలో పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు.. వాటిని హ్యాక్ చేసేందుకు ఉన్న అవకాశాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిన్నటి మహా రాష్ట్ర ఎన్నికల్లోనూ పోలింగ్ సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్లకు, కౌంటింగ్ రోజున బయల్పడిన ఓట్లకు భారీ వ్యత్యాసం రావడంతో ఓడిపోయిన పార్టీల్లో బోలెడు సందేహాలు ముప్పిరిగొన్నాయి. దేశంలో మళ్ళీ బ్యాలెట్ విధానం రావాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో భాను ప్రతాప్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేయండి.. ఈ మేరకు లోక్ సభలో నోటీస్ ఇవ్వండి అంటూ కాంగ్రెసుకు సలహా ఇచ్చారు. మీరు డిమాండ్ చేసినట్లు ఈసీని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదు కానీ ఒక చర్చ అయితే అవుతుంది కదా.. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు కానీ మీ ప్రయత్నం వల్ల ఈవీఎంల పనితీరు మీద ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది కదా.. ఈ దిశగా ఒక అడుగు వేయండి అంటున్నారు ఆ అడ్వకేట్.ఇక ఎన్నికల కమిషన్ నిర్మాణం..కమిషనర్ తొలగింపు పద్ధతులు చూద్దాం..భారత ఎన్నికల సంఘం:-భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి బాధ్యత వహించే స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థభారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం గురించి పేర్కొన్నారుకమిషన్ ప్రధానకార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ కమిషన్ భారతదేశంలోని లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలతోబాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుందిప్రస్తుతం రాజీవ్ కుమార్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే : ఎన్నికల కమిషనర్ తొలగింపు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5)లో పేర్కొన్నారు.లోక్‌సభ, రాజ్యసభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండి దానికి ఓటు వేయడానికి అవసరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగించవచ్చు. దీంతోబాటు ముఖ్య ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇదిలా ఉండగా 2009 లో, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారంటూ ఎన్నికల కమిషనరు నవీన్ చావ్లాను తొలగించాలని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు సిఫార్సు పంపినా దాన్ని రాష్ట్రపతి ఆమోదించలేదు.-సిమ్మాదిరప్పన్న -
ఈవీఎంలపై మరిన్ని అనుమానపు మబ్బులు!
దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)పై మరోసారి గట్టిగా గొంతెత్తింది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈవీఎంలపై సందేహాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయని, వాటిని తీసేసి అహ్మదాబాద్ గోడౌన్లో పెట్టాలని విమర్శించారు. బీజేపీ ఈవీఎంల సాయంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.ఇటీవలి కాలంలో ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోతున్న మాటైతే నిజం. వాటి పనితీరు, ట్యాంపరింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు ఈవీఎంలను నియంత్రించవచ్చునని అంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించాల్సిన, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ఆ పని సమర్థంగా చేయలేకపోతోంది. దీంతో అందరి అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్, ఒడిశాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత హర్యానా, తాజాగా మహారాష్ట్రలోనూ ఈవీఎమ్‌లతో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. ఇందుకు పలు ఆధారాలను చూపుతున్నా ఎన్నికల కమిషన్ మాత్రం కిమ్మనడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వకుండా దబాయింపునకే పరిమితం అవుతోంది.అభ్యర్థులు కోరితే వీవీప్యాట్ స్లిప్‌లలో ఐదు శాతం ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చినా ఎన్నికల సంఘం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరి అంచనాలను తారుమారు చేస్తూ వైఎస్సార్సీపీకి కేవలం11 స్థానాలే దక్కడం కూడా ఈవీఎంలపై అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పించాయి. ఒంగోలు, విజయనగరం వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీవీప్యాట్ స్లిప్‌లను, ఈవీఎంలలోని సమాచారంతో సరిపోల్చి చూడాలని ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా ఎన్నికల సంఘం దాటవేయడం ఇంకో అనుమానాస్పద చర్య. పైగా ఏపీలో అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి పోలింగ్ అయిన పది రోజులకే వీవీపాట్ స్లిప్‌లను దగ్ధం చేయాలని ఆదేశాలు పంపడం వాటిని మరింత పెంచింది. ఆశ్చర్యకరంగా కొన్ని బూత్ లలో వైఎస్సార్సీపీకి ఒక్క ఓటే నమోదైంది.హిందుపూర్లోని ఒక వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంట్లోనే ఏడు ఓట్లు ఉంటే, సంబంధిత బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఒక్క ఓటు వైఎస్సార్సీపీకి నమదైంది. ఇదే బూత్‌లో వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థికి మాత్రం 475 ఓట్లు రావడం విశేషం. క్రాస్ ఓటింగ్ జరిగినా అది ఈ స్థాయిలో ఉండటం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్, కౌంటింగ్ల మధ్యలో సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా నమోదై ఉండటం, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో తేడాలు ఉండటం మనం ఇప్పటికే చూశాం. పోలింగ్ నాడు ఏబై శాతం మాత్రమే ఉన్న బాటరీ ఛార్జింగ్, కౌంటింగ్ నాటికి 90 శాతానికి చేరడం పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.మాజీ మంత్రి రోజా వైఎస్సార్సీపీకి అత్యధిక బలం ఉన్న వడమాల పేట మండలంలో టీడీపీకి మెజార్టీ రావడంపై సంశయాలు వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండు, మూడువేల ఓట్ల ఆధిక్యతతోనే గెలుపొందగా, ఆయన కుమారుడు టీడీపీ పక్షాన పోటీచేయగా ఏకంగా నలభైవేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంతటి ఆధిక్యత టీడీపీకి రావడం ఎలా సాధ్యమైందని రోజా ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు ఉందన్నది ఆమె అనుమానం. వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరిన అప్పటి ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో చేరి దీని గురించి మాట్లాడకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ ఎన్నికలలో మోసం జరిగిందని అభిప్రాయపడ్డారు.ఆ తర్వాత ఆయన ఈవీఎంల ద్వారా కాకుండా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన ఒక సందేశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా.. అలా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కూడా కలిగించాలని అన్నారు.అంతేకాదు.. ఒకప్పుడు ఈవీఎంలపై పలు విమర్వలు చేయడమే కాకుండా.. బ్యాలెట్ల పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిపై తగిర రీతిలో స్పందించినట్లు కనిపించడం లేదు.ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో ఏభై సీట్లు గెలుచుకున్న బీజేపీ అదేరోజు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు గెలవకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ, ఒడిశాల తర్వాత హర్యానా ఎన్నికలలో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. ఫలితాల ట్రెండ్ కూడా తొలుత దానికి అనుగుణంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం బీజేపీకి అనుకూలంగా మారింది. ఇదంతా ఈవీఎమ్‌ల మహిమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్కడ వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించాలని కోరినా, ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు. తాజాగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో విజయం సాధించడంతో ఈవీఎంల టాంపరింగ్ పై కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాలు ఆరోపణలు చేశాయి. అక్కడ కూడా పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య లక్షల ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక నియోజకవర్గంలో 1170 ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని తేలిందట. అక్కడ బీజేపీ అభ్యర్ది సుమారు 1100 ఓట్లతో గెలిచారట. నాందేడ్‌లో కూడా ఓట్ల శాతంలో మార్పులు కనిపించాయి.అక్కడ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, ఆరు సెగ్మెంట్ లలో బీజేపీ గెలించింది. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ ఇదంతా ఈవీఎంల టాంపరింగ్ మహిమే అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా 288 సీట్లకుగాను, ఏభై సీట్లు కూడా సాధించ లేకపోయింది. వీటిని దృష్టిలో ఉంచుకునే మల్లిఖార్జున్ ఖర్గే ఈవీఎంలు వద్దు..బాలెట్ పత్రాలే ముద్దు అని అంటున్నారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమే అయితే.. జమ్ము-కశ్మీర్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ కూటమి ఎలా గెలిచిందన్నది బీజేపీ ప్రశ్నిస్తోంది. సీనియర్ నేత శరద్ పవార్ సమాధానం దీనికి ఇస్తూ పెద్ద రాష్ట్రాలలో ఈవీఎంలను మేనేజ్ చేస్తూ, చిన్న రాష్ట్రాలను వదలి పెడుతున్నారని, అందువల్ల ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ కూడా ఈ అంశంపై దీనిపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.మహారాష్ట్ర మ్యాజిక్ ఏమిటీ అని అంటూ, ఎన్నికలు జరిగిన నవంబర్ ఇరవయ్యో తేదీ సాయంత్రం ఐదు గంటలకు పోలైన ఓట్ల శాతం 58.22 గా ఉందని, ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు అది 65.02 శాతంగా తేల్చారని, కాని కౌంటింగ్ కు ముందు ఆ శాతం 66.05 శాతం ఈ రకంగా మొత్తం 7.83 శాతం పెరిగిందని, అదే మహారాష్ట్ర మేజిక్ అని వ్యాఖ్యానించారు. అదే మ్యాజిక్ జార్ఖండ్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్‌లో తొలిదశలో పోలింగ్ సాయంత్రానికి 64.66 శాతం నమోదైతే, రాత్రి 11.30 గంటలకు 66.48 శాతంగా ప్రకటించారు.అంటే తేడా కేవలం 1.79 శాతమేనని, రెండో దశ పోలింగ్ లో సాయంత్రానికి, రాత్రికి ప్రకటించిన ఓట్ల శాతాలలో తేడా 0.86 శాతమేనని, అంటే ఇక్కడ మాజిక్ తక్కువగా జరిగిందని ప్రభాకర్ సెటైర్ గా వ్యాఖ్యానించారు. మహరాష్ట్రలోని కొన్ని గ్రామాలు ఈవీఎంల పలితాలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మాజీ ముఖ్య కమిషనర్ ఖురేషి కూడా మహారాష్ట్రలో పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల తేడా 7 శాతంపైగా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యినికి మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో బాలెట్ పత్రాల వైపు ఎన్నికల సంఘం మొగ్గు చూపకపోయినా, లేదా ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని నిరూపించకపోయినా, దేశంలో ఎన్నికలపై నీలి నీడలు అలుముకునే అవకాశం ఉంది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒక్కో ఈవీఎంలో 1,500 ఓట్లా?... దానికి అంత సామర్థ్యముందా?: సుప్రీంకోర్టు అనుమానాలు
న్యూఢిల్లీ: ఒక్కో పోలింగ్ స్టేషన్లో పోలయ్యే గరిష్ట ఓట్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో హేతుబద్ధతపై సుప్రీంకోర్టు అనుమానాలు లేవనెత్తింది. ‘‘ఒక్క ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) పోలింగ్ గడువులోగా అన్ని ఓట్లను నమోదు చేయగలదా? దానికి అంత సామర్థ్యముందా? 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యే పోలింగ్ స్టేషన్ల విషయంలో ఏం చేస్తారు? ఒక్కో ఈవీఎం ద్వారా గంటకు సగటున 45కు ఓట్లకు మించి పోల్ కావన్న పిటిషనర్ వాదన నిజమైతే హెచ్చు పోలింగ్ శాతం నమోదయ్యే సందర్భాల్లో ఓటర్ల తాకిడిని తట్టుకోవడం ఎలా సాధ్యం? నిర్దేశిత గడువులోపు అందరూ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తదా?’’ అంటూ ఈసీకి ప్రశ్నలు వేసింది.ఇందుప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌కుమార్ ధర్మాసనం సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్టు స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే, ఒక్క ఓటర్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండే పరిస్థితి రాకూడదని పేర్కొంది. ఈవీఎంల సంఖ్యాపరమైన సామర్థ్యంతో పాటు తాము లేవనెత్తిన సందేహాలన్నింటికీ సమగ్రంగా వివరణ ఇస్తూ ఈసీ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. 1,200కు తగ్గించాలి: పిటిషనర్ ఒక్కో పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1957 నుంచి 2016 దాకా అమల్లో ఉన్న మేరకు 1,200 ఓటర్లకు తగ్గించాలని పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ డిమాండ్ చేశారు. ‘‘పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1,500 మంది ఓటర్లకు పెంచడం వారిని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడమే. దీనివల్ల బూత్‌ల వద్ద రద్దీ పెరిగి ఓటేసేందుకు చాలా సమయం పడుతుంది. అంతసేపు వేచి చూడలేక ఓటర్లు ఓటేయకుండానే వెనుదిరిగే ప్రమాదముంది. ఎందుకంటే సగటున 11 గంటలపాటు పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంల ద్వారా ఒక్కో ఓటు వేసేందుకు 60 నుంచి 90 సెకన్ల దాకా పడుతుంది. ఆ లెక్కన రోజంతా కలిపినా ఒక్కో ఈవీఎంలో 490 నుంచి 660 ఓట్ల కంటే పోలయ్యే అవకాశం లేదు’’ అన్నారు.ఈ వాదనను ఈసీ తరఫు న్యాయవాది మణీందర్‌సింగ్ తోసిపుచ్చారు. ‘‘ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలే అవసరం లేదు. ఒక్కో పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1,200కు బదులు 1,500 ఓట్లు పోలయ్యే విధానం 2019 నుంచీ అమల్లో ఉంది. పార్టీలన్నింటికీ ముందుగా వివరించాకే ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. పైగా పోలింగ్ నాడు సాధారణంగా ఉదయపు వేళల్లో పెద్దగా రద్దీ ఉండదు. ఓటర్లంతా ఒకేసారి ఓటేసేందుకు వస్తే మధ్యాహ్నం తర్వాత కాస్త క్యూలు పెరుగుతాయేమో. అలాంటివారు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటేసేందుకు ఈసీ అనుమతిస్తూనే ఉంది.అవసరమైన చోట్ల పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచడం వంటి చర్యలూ ఉంటాయి’’ అన్నారు. ఈవీఎంలపై ఏదో రకమైన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, అది ధర్మాసనానికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఓటింగ్ శాతం పెరగాలని, తద్వారా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు వీలైనంత ఎక్కువగా పాల్గొనాలని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్యాలెట్ పేపర్‌కు బదులు ఈవీఎంలు తేవడంలో ఉద్దేశమూ అదేనని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనల అనంతరం విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. -
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్‌వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్‌లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్‌ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్‌కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్‌లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్‌కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్‌కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
పోలింగ్‌లో అంతటి వ్యత్యాసం.. నిజంగా ఆందోళనకరం: మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే.‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్‌ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే.ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు.ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా!ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్‌డీ సంస్థ వెల్లడించింది.ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. -
ఈవీఎంలు వద్దు.. మాకు బ్యాలెట్ పేపర్లే కావాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నట్లు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.VIDEO | "Some people praise the Constitution, but only superficially; inside, they are undermining it. To protect the Constitution, Rahul Gandhi ji launched the Bharat Jodo Yatra, and to save democracy, all minorities came forward, which is why we were able to stop PM Modi.… pic.twitter.com/qrQfMQJKb8— Press Trust of India (@PTI_News) November 26, 2024మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణలో బీజేపీ అవకతవకలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించాయి. -
EVMల పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి : వైఎస్ జగన్
-
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఉప ఎన్నికల్లో బీఎస్ఫీ ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది.ఈ ఫలితాల అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. గతంలో బ్యాలెట్ పేపర్‌ను దుర్వినియోగం చేయడం ద్వారా నకిలీ ఓట్లు వేసేవారని, ఈ పని ఇప్పుడు ఈవీఎంల ద్వారా కూడా జరుగుతోందని మాయావతి ఆరోపించారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
ఈవీఎంల ట్యాంపరింగ్ విమర్శలు సిగ్గుచేటు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ విమర్శించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు.. బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లు మాట్లాడటం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్కే అత్యధిక ఓట్లు, సీట్లతో మరోసారి పట్టం కట్టారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని.. మరాఠీలకు అన్యాయం జరుగుతుందని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసి విపక్షాలు కొంత లబ్ధి పొందాయని.. కానీ 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమై బీజేపీ కూటమికి భారీ విజయం అందించారని కిషన్‌రెడ్డి చెప్పారు.మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత మహాయుతి కూటమికి ఇంత పెద్ద విజయం లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలలో కలిపితే కాంగ్రెస్ 30 సీట్లు కూడా దాటలేదంటే ఆ పార్టీ ఎంతటి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందో స్పష్టమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
‘50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా’
ముంబై : మరికొద్ది రోజుల్లో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూరుస్తానంటూ ఓ హ్యాకర్.. ఓ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కూటమికి చెందిన ఓ ఎంపీతో మంతనాలు జరిపినట్లు చెప్పడం గమనార్హం. సదరు మీడియా ప్రతినిధి..ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని పలు మార్లు ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో వీడియో కాల్ మాట్లాడారు. తాను ఓ ఎంపీకి వ్యక్తిగత సహాయకుడినంటూ (పీఏ) పరిచయం చేసుకున్నారు. ఆ వీడియో కాల్లో ఎంపీకి పీఏగా పనిచేస్తున్న ప్రతినిధి.. మీతో ఓ ప్రముఖ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నారు. మీరు మాట్లాడుతారా? అని అడగ్గా.. ఒక్క నిమిషం తర్వాత మరో మీడియా ప్రతినిధి తాను మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తనకు లబ్ధి చేకూరేలా ఈవీఎం హ్యాక్ చేయాలని కోరారు. మధ్యలో సయ్యద్ ఘజా కలగజేసుకుని నియోజవర్గం వివరాల గురించి ఆరాతీశారు. నేను ఈవీఎం హ్యాక్ చేస్తా. అందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈవీఎం హ్యాక్ చేసినందుకు తనకు సుమారు రూ. 52-53 కోట్లు చెల్లించాలి. ప్రాంతాలను స్కాన్ చేయడం,యాప్స్‌ను ఉపయోగించి ఈవీఎం సిగ్నల్స్‌ను మారుస్తానని చెప్పడం వీడియో సంభాషణల్లో వెలుగులోకి వచ్చాయి. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ సయ్యద్ షుజాతో చెప్పడం కలకలం రేపుతుంది.మరి ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మహరాష్ట్ర అధికార,ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి. 👉చదవండి : బీజేపీపై అజిత్ పవార్ తిరుగుబావుటా? -
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్‌కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్‌పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్‌తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు?
సాక్షి, అమరావతి: ‘ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని 12 బూత్‌లలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటోంది. ఈవీఎం ఓట్లను.. వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు? రెండింటినీ ఎందుకు మ్యాచ్ చేయరు?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈసీ తీరు వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. ఈవీఎంలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘కోర్టులో వైఎస్సార్సీపీ వేసిన కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము అడిగే ప్రాథమిక ప్రశ్న ఒక్కటే.. ఒంగోలు నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంలు.. వీవీప్యాట్ల సంఖ్యను మ్యాచ్ చేయాలని కోరాం. నిజంగానే ఎన్నికల కమిషన్ మనసులో కల్మషం లేకపోతే మ్యాచ్ చేసి చూపించొచ్చు కదా? మా సందేహాలే కాకుండా దేశంలోని అందరి సందేహాలు నివృత్తి అవుతాయి?. కానీ, ఇదే ఈసీహైకోర్టులో.. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఈవీఎం, వీవీప్యాట్ల నంబర్లను వెరిఫై చేయమని చెప్పలేదని, మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని మాట్లాడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం. ఈవీఎంలోని నంబర్.. వీవీప్యాట్లను మ్యాచ్ చేయకపోవడంతోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఆరు నెలలు దాటేస్తే వీవీప్యాట్లపై ఇంక్ పోతుందేమోనని ఎదురు చూస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయం. అమెరికా, యూకేతో సహా 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం అన్నది ప్రబలంగా ఉండటం కాదు.. అది ప్రబలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రజాస్వామ్యంలో విలువలను నిలబెట్టాలి.’ అని అన్నారు. -
ఎన్నికల సమయంలో బాబు లోకేష్ లు విదేశాలకు వెళ్ళింది అందుకే
-
ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయను
ప్రొద్దుటూరు క్రైం : 2029లో బ్యాలెట్ పేపర్‌తో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పోటీ చేసినా ఫలితం ఉండదని, 2024లో మోసం చేసినట్టుగానే 2029 ఫలితాల్లోనూ మోసం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే స్వచ్ఛమైన ప్రజా తీర్పు తెలుస్తుందని చెప్పారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.నాలుగు నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని, ఈవీఎం మిషన్లే శాసనం చేశాయని కౌంటింగ్ అయిన అరగంటకే ప్రజలు ముక్తకంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయాయి’ అంటూ రాష్ట్ర ప్రజలంతా అయోమయంగా ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటికీ వైఎస్సార్సీపీ అధిష్టానంగానీ, అభ్యర్థులుగానీ ఫలితాలపై నోరు మెదపలేదన్నారు.దీనిపై ఎందరు అనుమానం వ్యక్త చేసినా కేంద్ర ఎన్నికల సంఘంలో ఉలుకూ పలుకూ లేదన్నారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని పోటీ చేసిన అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివృత్తి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, టెక్నాలజీని ఉపయోగించుకుని అప్రజాస్వామిక వి«ధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. -
వినబడలేదా ప్రమాద ఘంటిక?
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు కనుక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు.హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం పాయింట్ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (first-past-the-post system) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్‌రాయ్ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.సెంట్రల్ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్‌సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎమ్ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.ఈవీఎమ్‌ల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్‌ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎమ్‌ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎమ్‌లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్‌తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ), ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్‌డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్‌డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం.ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్ ఓట్లుగా వీఎఫ్‌డీ అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్‌సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్‌డీ తేల్చింది.ఈవీఎమ్‌లను హ్యాకింగ్ చేయడం, లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్‌లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్‌డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ, ఆ తర్వాత టార్గెట్‌పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్‌ల ఆపరేషన్‌ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్‌డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్‌ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధివీధిన మోరల్ పోలీసింగ్‌ను ఎదుర్కోవలసి రావచ్చు.తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్ ఎలక్షన్’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్‌తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్‌ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్‌లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్‌ల బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్‌లో మనం ప్రవేశించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈవీఎంలపై చంద్రబాబు మాటల గారడీ.. సాక్ష్యాలు చూపిన మేరుగు నాగార్జున
-
ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి తగ్గట్టుగానే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో కనిపించిన తేడాను విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ 70 శాతం మాత్రమే ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో 99 శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హిస్సార్, మహేంద్ర ఘడ్, పానిపట్ జిల్లాలలో ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్ 99 శాతం ఉందని కాంగ్రెస్ గుర్తించింది. అంటే ఇక్కడ ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న అభియోగాన్ని మోపుతున్నారు. నౌమాల్ అనే శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర సింగ్ ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌పై అభ్యంతరం చెబుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కూడా. తొమ్మిది ఓటింగ్ యంత్రాల నెంబర్లు ఇస్తూ, వాటిలో బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టాంపరింగ్ జరిగిందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగి ఉంటే ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదమే అవుతుంది. ఎన్నికలు ఒక ఫార్స్ గా మిగిలిపోతాయి.ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో మాదిరే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు వాడడం లేదని, పేపర్ బాలెట్నే వాడుతున్నారని, దేశంలోనూ పేపర్ బాలెట్ రావాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన దేశానికి మార్గదర్శకత్వం వహించారని అనుకోవాలి.ఏపీలో ఈవీఎంల టాంపరింగ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు కాని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా మాక్ ఓటింగ్ చేస్తామంటూ ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా వ్యవహరించారు. ఉదాహరణకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల డేటానున వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు అవసరమైన ఛార్జీలను కూడా చెల్లించారు. కానీ ఈ పని చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. అభ్యర్థి అంగీకరించక పోవడంతో కొత్త డ్రామాకు తెరలేపుతూ.. వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని నమూనా ఈవీఎంలో మాక్ పోలింగ్ జరుపుతామని ప్రతిపాదించారు. ఇందుకు వైసీపీ అభ్యర్థి ససేమిరా అన్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు రిజర్వులో ఉంది. చిత్రంగా రెండు నెలలు అయినా తీర్పు వెలువడలేదు. ఈ పరిణామాలన్నీ ప్రజల సందేహాలకు మరింత బలం చేకూర్చాయి.విజయనగరం జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి అప్పల నరసయ్యలు కూడా బాలినేని మాదిరిగానే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కానీ ఫలితం మాత్రం తేల లేదు. అధికారులు వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని భీష్మించుకున్నారు. మరోవైపు పోలింగ్ జరిగిన రెండు నెలలైనా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల ఏదో మతలబు ఉందని చాలామంది అభిప్రాయపడే స్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు చేశారు. అందుకు తగ్గ ఉదాహరణలూ ఇచ్చారు. ఈ సందేహాలన్నింటిపైఎన్నికల సంఘం తగిన వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు బలపడకపోవును. ఇంకోపక్క వీవీప్యాట్ స్లిప్‌లను పోలింగ్ తరువాత 45 రోజుల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు పది రోజులకే స్లిప్‌లు దగ్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.వీవీప్యాట్ స్లిప్‌లు ఉండీ ప్రయోజనం ఏమిటి?లెక్కించనప్పుడు వివిపాట్ స్లిప్‌ల రూపంలో ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అన్న ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ జవాబిచ్చేందుకు నిరాకరించడం ఎంత వరకూ సబబు?హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చూచాయగా కూడా చెప్పలేదు. బీజేపీకి మద్దతిచ్చే జాతీయ ఛానళ్లు కూడా ఇదే మాట చెప్పాలి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫలితాలు బీజేపీకి అనుకాలంగా రావడం గమనార్హం.కౌంటింగ్ మొదలైన తరువాత గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ 20 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత బీజేపీ చాలా నాటకీయంగా పుంజకోవడమే కాకుండా.. మెజార్టీ మార్కును దాటేసింది కూడా. కౌంటింగ్ సందర్భంగా ఆయా రౌండ్ల ఫలితాల వెల్లడి విషయంలోనూ ఎన్నికల సంఘం చాలా ఆలస్యం చేసిందని, దీని వెనుక కూడా కుట్ర ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది.ప్రజలు నిజంగానే ఓటేసి బీజేపీని గెలిపించి ఉంటే అభ్యంతరమేమీ ఉండదు కానీ.. ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. ఏపీలో ఇదే తరహా పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ వంటివారు స్పందించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నైతికంగా వ్యవహరించినట్లు అయ్యేది. తాజా పరిణామాలతో తన వాదనను బలంగా వినిపించే అవకాశమూ దక్కేది. అప్పట్లో సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నేత ఏపీలో ఓట్ల శాతం పెరిగిన వైనం, ఈవీఎం ల తీరుపై విమర్శలు చేసినా, వాటికి ఈసీ స్పందించలేదు. ఇంకా పెద్ద స్థాయి నేతలు మాట్లాడి ఉండాల్సింది.ట్యాంపరింగ్ సాధ్యమేనా?సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేపథ్యంలో ఈవీఎంల టాంపరింగ్ పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం మానేసి, కేంద్రంలో ఉన్న పార్టీకి తొత్తుగా పనిచేస్తోందన్న విమర్శలు ఎదుర్కుంటోంది. టాంపరింగ్ అవకాశం ఉంటే జమ్ము-కాశ్వీర్ లో కూడా జరిగేది కదా అని కొందరు వాదిస్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల చేయాలని లేదు. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం కనుక కేంద్ర పెత్తనం అక్కడ ఎలాగూ సాగుతుంది. కానీ ఉత్తర భారత దేశం మధ్యలో ఉండే హర్యానాలో బీజేపీ ఓటమి పాలైతే దాని ప్రభావం పరిసర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉందని భయపడి ఉండవచ్చని, అందుకే సెలెక్టివ్‌గా టాంపరింగ్ జరిగి ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది.2009 ముందు వరకు ఈవీఎంలపై ఆరోపణలు పెద్దగా రాలేదు. 2009లో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడమే కాకుండా, టాంపరింగ్ ఎలా చేయవచ్చో, కొందరు నిపుణుల ద్వారా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 2014లో ఆయన విభజిత ఏపీలో గెలిచిన తరువాత మాత్రం దీని ప్రస్తావనే చేయలేదు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంలపై కోర్టుకు వెళ్లిన వారిలో ఈయన కూడా ఉన్నారు.ఆ క్రమంలోనే సుప్రీం కోర్టు వీవీప్యాట్ స్లిప్ లపై మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా సరే ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. 2024లో టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఈవీఎంల టాంపరింగ్ ఊసే ఎత్తలేదు. పలు ఆరోపణలు వస్తున్నా, వారు కిమ్మనకపోవడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.ఈసీ ప్రజల సంశయాలు తీర్చకుండా ఇప్పటిలాగానే వ్యవహరిస్తే దేశంలో ఎవరూ ఎన్నికలను నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తాయి. భవిష్యత్తులో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ఈ సమస్య మళ్లీ ముందుకు రావచ్చు. 2029 లోక సభ ఎన్నికలు బాలెట్ పత్రాలతో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంటుందా అన్నది అప్పుడే చెప్పలేం. బ్యాలెట్ పత్రాల పద్దతి ఉంటే రిగ్గింగ్ జరగదా? జరగదని చెప్పజాలం.1972 లో పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ సీపీఎం ఎన్నికలను బహిష్కరించింది. ఆ తర్వాత 1978 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు సీసీటీవీల వ్యవస్థ వచ్చింది కనుక బ్యాలెట్ పత్రాల రిగ్గింగ్‌ను కొంతమేర నిరోధించవచ్చు. ఈవీఎంల వ్యవస్థ వల్ల సులువుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా, వాటిని మానిప్యులేట్ చేస్తున్నారని జనం నమ్మితే మాత్రం ఈవీఎంలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడాలి. లేదా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడమే మంచిది కావచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హర్యానా ఫలితాలు బయట పెట్టిన నిజం..
-
యంత్రమా.. కుతంత్రమా?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తల నుంచి సాధారణ ప్రజల వరకూ వ్యక్తం చేస్తున్న అనుమానాలను తాజాగా వెల్లడైన హరియాణా ఎన్నికల ఫలితాలు మరింత పెంచాయి. అత్యధిక ఓటింగ్ శాతంతో అత్యధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకు పరిమితం కాగా ఆ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి 48 సీట్లు రావడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరియాణా ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అనుమానాలు బలపడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లకు, లెక్కింపులో వచ్చిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు వోట్ ఫర్ డెమోక్రెసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు ఆధారాలతో సహితంగా బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలను వ్యక్తం చేయడం విదితమే. ఈసీ మౌనంతో పెరుగుతున్న అనుమానాలు ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్లోడ్ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర జాప్యం చేయడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఫారం – 20లో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన ఒక్కో అభ్యరి్థకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి? లెక్కింపులో ఎన్ని ఓట్లు వచ్చాయి? అనేది తెలిసిపోతుంది.సాధారణంగా ఫారం–20ని ఓట్ల లెక్కింపు జరిగిన వారం రోజుల్లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అయితే ఎన్నికల సంఘం ఈసారి ఈ వివరాలను వెంటనే వెల్లడించలేదు. ఎన్నికల కౌంటింగ్ జరిగిన 108 రోజుల తర్వాత తాపీగా గత నెల 19న నియోజకవర్గాలవారీగా పార్లమెంటు, శాసన సభ స్థానాలకు లెక్కించిన ఓట్ల వివరాలతో ఫారం–20ని ‘సీఈవో ఆంధ్ర’ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇంత ఆలస్యంగా వెల్లడించడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ప్రతి ఎన్నికల్లో పోలింగ్ రోజు ఈసీ ప్రాథమికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత రోజు తుది శాతాలను ప్రకటిస్తుంది. అయితే ఈసారి పోలింగ్ తుది శాతాన్ని ప్రకటించేందుకు ఏకంగా నాలుగు రోజుల సమయం తీసుకుంది. అందులోనూ ప్రాథమికంగా పోలైన ఓట్లకు, తుది ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయి. ఇలా తుది శాతాల ప్రకటనకు సుదీర్ఘ సమయం తీసుకోవడం, భారీ తేడాలు రావడంతో అనుమానాలకు బీజం పడింది. మే 13న రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు తొలుత పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది శాతాన్ని నాలుగు రోజులు ఆలస్యంగా మే 17న ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు పోలింగ్ శాతాల మధ్య 12.54 శాతం పెరుగుదల ఉంది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఏకంగా 49 లక్షల ఓట్లు అదనంగా పెరిగాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వోట్ ఫర్ డెమొక్రసీ (వీఎఫ్‌డీ) సంస్థ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా 538 స్థానాల్లో తేడాలు.. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 538 ఎంపీ స్థానాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), వీఎఫ్‌డీ సంస్థలు పేర్కొన్నాయి. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించినట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపాయి. 176 లోక్‌సభ స్థానాల్లో 35,093 ఓట్లకుపైగా అదనంగా లెక్కించారని వెల్లడించాయి. పోలైన ఓట్ల ప్రకారం చూస్తే ఏపీలో కూటమికి 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కాలని వీడీఎఫ్ స్పష్టం చేసింది. తమ అధ్యయన నివేదికలను ఎన్నికల సంఘానికి కూడా పంపాయి. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణాలు ఏమిటో వెల్లడించాలని ఏడీఆర్, వీఎఫ్‌డీ సంస్థల ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని అప్పట్లోనే ప్రశ్నించారు. కానీ.. ఎన్నికల సంఘం ఇప్పటికీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. -
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
-
ఈవీఎం స్కాం బయటకు రాకుండ చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది..
-
99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది
న్యూఢిల్లీ: ప్రతికూల ఫలితాలిచి్చన హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పద్ధతి, ఈవీఎంల పనితీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ‘‘ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం(లోక్తంత్ర) ఓడిపోయింది. మరో వ్యవస్థ(తంత్ర) అక్రమంగా గెలిచింది’’ అంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కుట్రకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 99 శాతం బ్యాటరీతో బీజేపీ గెలిస్తే.. 70 శాతంతో కాంగ్రెస్ గెల్చింది ‘‘ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వెల్లడైన ఫలితాలివి. వీటిని మేం ఒప్పుకోం. పారదర్శకమైన, ప్రజాస్వామ్యయుత పద్ధతి ఓటమిపాలైంది. హరియాణా అంకం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. బ్యాటరీ 99 శాతం నిండిన ఈవీఎంలలో బీజేపీ గెలిస్తే, 70 శాతం బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో కాంగ్రెస్ గెలిచింది. ఇందులో కుట్ర దాగుంది. 12 నుంచి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరిగితే మొదట ఆశ్రయించేది ఎన్నికల సంఘాన్నే.పారదర్శకంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అది. అందుకే తీవ్రమైన ఈ అంశంపై లిఖితపూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. నిరీ్ణత గడుపులోగా చర్యలు తీసుకోవాలని పట్టుబడతాం. ఓట్ల లెక్కింపు, ఈవీఎంల పనితీరుపై చాలా నియోజకవర్గాల్లో సందేహాలు పెరిగాయి. ప్రతి ఒక్కరితో మాట్లాడాం. ఇది విశ్లేషణల సమయం కాదు. మా నుంచి విజయాన్ని లాక్కున్నారు. వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పు కోరుకుంటున్నారనే వాస్తవం ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనికి ఫలితాలు దర్పణం పట్టట్లేవు.ఫలితాలను కాంగ్రెస్ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం కౌంటింగ్, ఈవీఎంల పనితీరు, సమగ్రత ప్రశ్నార్థకంలో పడటమే. దాదాపు 3–4 జిల్లాల్లోని 12–14 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్థానిక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి మోపారు. ఇదంతా కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఒత్తిడే’’ అని జైరాం రమేశ్ అన్నారు. 200 ఓట్ల తేడాతో ఓడారు : ‘‘ 200 ఓట్లు, 300 ఓట్లు, 50 ఓట్లు.. ఇలా అత్యల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడారు. చక్కని ఆధిక్యత కనబరిచిన అభ్యర్థులు హఠాత్తుగా 100–200 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటి?. అవకతవకలు, అక్రమాల వల్లే ఇది సాధ్యం. అనూహ్య, దిగ్భ్రాంతికర పరిణామమిది. మార్పును కోరుకుంటూ హరియాణా ప్రజలు ఆశించిన దానికి, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వెల్లడైన ఫలితమిది’’ అని జైరాం ఆరోపించారు. ఎందుకంత నెమ్మది? : అంతకుముందు మధ్యాహ్నం వేళ జైరాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ‘‘ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల దాకా ఈసీఐ వెబ్సైట్లో అప్డేట్స్ అనూహ్యంగా నెమ్మదించాయి. దీనికి కారణమేంటి? అదమ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాశ్ 1,268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ ఆయనకు గెలుపు సరి్టఫికేట్ ఇవ్వట్లేదు. ఈసీ వెబ్సైట్లో కూడా ఆయన గెలిచినట్లుగా చూపించట్లేదు. చివరి మూడు రౌండ్ల అప్డేట్స్ ఇవ్వట్లేదు. అనవసర ఆలస్యానికి కారణమేంటి?’ అని జైరాం ప్రశ్నించారు. ఆలస్యం జరగలేదు: ఈసీ : ఈసీ అప్డేట్స్ ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ ఆరోపణల్లో నిజం లేదు. బాధ్యతారాహిత్యంతో, తప్పుడు ఉద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల రూల్ నంబర్ 60 ప్రకారం ఆయా కౌంటింగ్ కేంద్రాల అధికారులు నడుచుకున్నారు. హరియాణా, జమ్మూకశీ్మర్‌లో లెక్కింపుపై అప్డేట్స్ ఆలస్యమయ్యాయన్న మీ మెమొరాండంలో ఎలాంటి వాస్తవాలు లేవు. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల నుంచి 25 రౌండ్ల ఫలితాలు అప్డేట్ అవుతూనే ఉంటాయి’ అని ఈసీ వివరణ ఇచి్చంది. ఈసీ వివరణపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. ‘‘ తటస్థ వైఖరిని అవలంబించాల్సిన ఈసీ ఏకపక్షంగా విపక్ష పార్టీ విన్నపాలను తోసిపుచ్చడం సహేతుకం కాదు. ఫిర్యాదుపై సంప్రదింపుల స్థాయిని ఈసీ దిగజార్చింది’’ అని జైరాం అన్నారు. -
సీసీ ఫుటేజీ ఇప్పట్లో ఇవ్వలేం
తొలిరోజుమాక్ పోలింగ్‌లో ఉపయోగించిన ఈవీఎం కొత్త బ్యాటరీ స్టేటస్ 99 శాతం నుంచి 88 శాతానికి తగ్గింది. అలాంటప్పుడు పోలింగ్ రోజు 12 గంటలకు పైగా వినియోగించిన బ్యాటరీ 21 రోజుల పాటు భద్రపరిచి కౌంటింగ్ రోజు జూన్ 4న తెరిచిన తర్వాత కూడా 99 శాతం ఎలా చూపిస్తోంది? ఈ ప్రశ్నకు ఎన్నికల అధికారుల నుంచి సమాధానం లేదు.రెండో రోజుఈవీఎంలు, వీవీ ప్యాట్లలో ఓట్లను తిరిగి లెక్కించాలని ఫిర్యాదుదారులు కోరితే.. ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎంల డేటా తొలగించామని, వీవీ ప్యాట్లలో స్లిప్‌లను బర్న్ చేశామని అధికారులు చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పుడు వాటిని భద్రపరచాల్సింది పోయి ఆగమేఘాలపై ఎందుకు ధ్వంసం చేశారంటే జవాబు లేదు.మూడో రోజుతాము ఫిర్యాదులో పేర్కొన్న మూడు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నాడు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ, ఈవీఎంలను భద్రపరిచిన గోదాం వద్ద సీసీ కెమెరాల ఫుటేజీ, కౌంటింగ్ రోజు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరితే... అబ్బే.. ఇప్పుడు ఇవ్వడం కుదరదు. సమయం పడుతుంది. అసలు ఇంకా పోలింగ్ కేంద్రాలన్నింటి సీసీ కెమెరాల ఫుటేజీని ఇంతవరకు ఒకచోట కూర్చలేదని అధికారులు చెబుతున్నారు.మాక్ పోలింగ్‌తో ఏం ఉపయోగం?విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎం గోదాంలో సోమవారం నుంచి బుధవారం వరకూ జరిగిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఫిర్యాదుదారుల సందేహాలను నివృత్తి చేయకుండానే అర్ధంతరంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల (ఎస్వోపీ) ప్రకారం మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామని అధికారులు మూడు రోజులుగా చెబుతూ వచ్చారు. తమ సందేహాలను నివృత్తి చేయని మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఫిర్యాదుదారులైన విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అందుకు అంగీకరించలేదు. ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రాతపూర్వకంగా బుధవారం ఎన్నికల కమిషన్‌కు తెలియజేశారు. ఈవీఎంల గోదాం నుంచి ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లాన వంశీ నిష్క్రమించడంతో మాక్ పోల్ కొనసాగించలేకపోయామని విజయనగరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు నివేదిక పంపించినట్లు చెప్పారు.సందేహాలకు సమాధానం శూన్యం ఈవీఎంలపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వాటిని నివృత్తి చేయకపోగా సరికొత్త అనుమానాలకు దారి తీసింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యంగా వెరిఫికేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాక్ పోలింగ్‌లో ఉపయోగించిన కొత్త బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గినప్పుడు మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం ఎందుకు చూపిస్తోందన్న ఫిర్యాదుదారుల ప్రశ్నకు ఈసీ వద్ద జవాబు లేదు. ఇక పోలింగ్ రోజు అన్ని సీసీ కెమెరాలను విజయనగరం కలెక్టరేట్లో ప్రత్యేక కేంద్రం నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినవి దాదాపుగా ప్రైవేట్ ఏజెన్సీలే. అలాంటప్పుడు ఇప్పటివరకూ వారి నుంచి ఫుటేజీని అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల ఒత్తిడి వల్ల, సమయం లేక ఫుటేజీ కూర్పు చేపట్టలేకపోయామన్న అధికారుల వివరణ విచిత్రంగానూ, మరిన్ని అనుమానాలు రేకెత్తించేదిగా ఉందని ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లాన వంశీ పేర్కొన్నారు. -
EVM బ్యాటరీ వెరిఫికేషన్ కు అంగీకరించని అధికారులు
-
డేటా మటాష్.. స్లిప్‌లు ‘బర్న్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహారశైలి తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచిన బాక్సు తాళం చెవులు మరోచోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే ఉంది. బ్యాటరీ స్టేటస్‌పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీ– వెరిఫికేషన్ ప్రక్రియలో.. కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజూ అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్లుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చిచెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని (ఎరేజ్).... అంతేకాకుండా వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్సార్ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అనుమానాలు ఉన్నాయని, రీ–వెరిఫికేషన్ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలను పరిష్కరించకుండానే డేటాను తొలగించాలంటూ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడటం వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రీ–వెరిఫికేషన్‌లో పార్టీల గుర్తులు కాకుండా ఇష్టారీతిన గుర్తులను కేటాయించి మాక్ పోలింగ్ నిర్వహించడం మొదలు అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రస్తుత టెక్నికల్ నిబంధనల్లో (ఎస్వోపీ) బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎం పరిశీలనకు అభ్యర్థి అభ్యర్థి బెల్లాన నిరాకరించినందున మంగళవారం పరిశీలన జరగలేదని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.21 రోజుల తరువాత 99 శాతం బ్యాటరీ స్టేటస్..విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద రెండో రోజు మంగళవారం కూడా హైడ్రామా కొనసాగింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యం చేసిన అధికారులు అర్ధరాత్రి వరకూ మాక్ పోలింగ్ కొనసాగించారు. కొత్త బ్యాటరీ ఉపయోగించగా మాక్ పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం స్టేటస్ చూపించింది. అంటే 20 శాతం తగ్గింది. కానీ మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం చూపించడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్ల లెక్కింపుతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజీని ఇవ్వాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈవీఎంకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ 50 శాతం ఉన్నట్లు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. పోలింగ్ తర్వాత రమారమి 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం తెరచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబర్ 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ తెలియచేయాలని, వీవీ ప్యాట్లను ఓట్లతో సరిపోల్చి లెక్కించాలని, ఆయా పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజీ ఇవ్వాలని బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్‌ను కోరారు. అందుకు అవసరమైన రుసుము వారిద్దరూ చెల్లించారు. అయితే దీని పరిశీలనకు నెల్లిమర్ల ఈవీఎం గోదాం వద్దకు వెళ్లగా... ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీల్లో బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని బెల్లానకు అధికారులు వివరించారు. దీంతో ఆయన రీ–వెరిఫికేషన్‌కు నిరాకరించారు.డేటా అంతా ఖాళీయే...ఫిర్యాదుదారులు కోరినట్లు వెరిఫికేషన్ చేయడానికి వీలుకాదని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని (ఎరైజ్), వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని అధికారులు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను 45 రోజుల వరకూ భద్రపరచాలి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్ రుసుము చలానా ద్వారా చెల్లించారు. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆ ఈవీఎంల్లో డేటా, వీవీ ప్యాట్లలో స్లిప్పులను అధికారులు భద్రపరచాలి. కానీ వాటిని ఆగమేఘాలపై ఆనవాళ్లు లేకుండా చెరిపేయడం కొత్త సందేహాలకు తావిస్తోంది. పైగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డేటా మొత్తం తొలగించినట్లు అధికారులు పేర్కొనడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది.బ్యాటరీ స్టేటస్ గుట్టు రట్టు...వెరిఫికేషన్ కోరిన పెదకాద పీఎస్ నంబర్ 20కు సంబంధించిన ఈవీఎంను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బయటకు తీసి దానికి సంబంధించిన బ్యాటరీని అధికారులు సీజ్ చేశారు. ఆ బ్యాటరీకి బదులు మరో కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్‌ను సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగించారు. పార్టీ గుర్తులు లోడ్ చేయకుండా మరేవో గుర్తులు లోడ్ చేసి సుమారు 1,400 ఓట్లు మాక్ పోలింగ్ చేశారు. ఇది ముగిసిన తర్వాత బ్యాటరీ స్టేటస్ పరిశీలిస్తే 80 శాతం నమోదు కావడం గమనార్హం. అలాంటప్పుడు పోలింగ్ రోజున ఈవీఎం, వీవీ ప్యాట్లకు వాడిన బ్యాటరీ స్టేటస్ 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత కౌంటింగ్ రోజున తెరిచేసరికి 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం తాము తేల్చలేమని అధికారులు పేర్కొన్నారు. కేవలం మాక్ పోలింగ్‌లో బ్యాటరీ స్టేటస్ ఎంత ఉందో మాత్రమే చెబుతామని అధికారులు సమాధానమిచ్చారు. పాత బ్యాటరీ స్టేటస్ గుట్టు ఏమిటో వెల్లడించాలనేదీ తమ డిమాండ్ అని, అంతేకానీ మాక్ పోలింగ్ కాదని ఫిర్యాదుదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తమ డిమాండ్‌ను మెయిల్ ద్వారా పంపించారు.ట్యాంపరింగ్ అయినట్లుంది...కౌంటింగ్ రోజు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ 99 శాతం చూపించిందని ఎన్నికల ఏజెంట్లంతా చెప్పారు. దీంతో జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. దాదాపు 12 గంటలకు పైగా పోలింగ్ కొనసాగడమే గాక 21 రోజుల పాటు స్టాండింగ్ మోడ్‌లో ఉన్నా కౌంటింగ్ రోజున తెరిచేసరికి బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎలా ఉందనేది మా ప్రశ్న. కానీ అధికారులు మేము కోరినట్లు కాకుండా కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తామన్నారు. దీన్ని మేం వ్యతిరేకించాం. ఆ బ్యాటరీ స్టేటస్ ఇప్పుడు చూసినా 99 శాతం ఎందుకు కనిపిస్తోంది? ఉపయోగించిప్పుడు తగ్గిపోవాలే కానీ పెరగడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఈసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని నాకు అనిపిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నాం.– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, విజయనగరంకౌంటింగ్ రోజే ప్రశ్నించాం..ఈవీఎం బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఉండటాన్ని కౌంటింగ్ రోజే మా పార్టీ ఏజెంట్లు గుర్తించారు. అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నారు. జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. పెదకాద పోలింగ్ స్టేషన్లో ఉదయం 7 నుంచి రాత్రి 8:30 గంటల వరకూ దాదాపు 1,400 ఓట్ల పోలింగ్ జరిగింది. ఈ ప్రక్రియలో బ్యాటరీ స్టేటస్ తగ్గాలి కానీ 21 రోజుల తర్వాత కౌంటింగ్ రోజు కూడా 99 శాతం ఉండటం సందేహాలకు తావిస్తోంది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని అన్ని రాజకీయ పార్టీలూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తే బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గింది. దీనిపై సందేహాలను నివత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేశారని.. ఇలా పలు చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి.– బొత్స అప్పలనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరంనిలిచిన ఈవీఎం పరిశీలననెల్లిమర్ల ఈవీఎం గోదాంలో ఈవీఎం పరిశీలన ప్రక్రియ నిలిచిపోయినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రం కంట్రోల్ యూనిట్ బ్యాటరీ పవర్ పర్సంటేజ్‌ను అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అడిగారని, అయితే ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీలో బ్యాటరీ పర్సంటేజ్ లేదని బెల్ ఇంజనీర్లు, అధికారులు ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. దీంతో ఆయన నిరాకరించడంతో ఈవీఎం పరిశీలన జరగలేదన్నారు. -
ఆ రెండు గంటలు ఏం జరిగింది మీరు సమాధానం చెప్పాల్సిందే
-
మా సందేహాలు ఈసీ నివృత్తి చేయలేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయనగరం: మా సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాక్ పోలింగ్ రీ-వెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు.ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో వుండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీరుపై మేం కోర్టుకు న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు టెంపర్ జరిగాయని అనుమానిస్తుంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్ చేశారు.కాగా, విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.. ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్.. ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామనన్నారు. తమ దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదని.. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య ప్రశ్నించారు. ఈసీ, జిల్లా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడాయి. ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను జిల్లా యంత్రాంగం తప్పు దారి పట్టిస్తోంది. కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్లిపోయారు. -
ఈవీఎం రీ-వెరిఫికేషన్ లో గందరగోళం బ్యాటరీ స్టేటస్ పై అనుమానం
-
ఈవీఎం వెరిఫికేషన్ కి వచ్చి తాళం చెవి మరిచిన అధికారులు..
-
విజయనగరం: నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
Updatesవిజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందిఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్మాక్ పోలింగ్‌కు అంగీకరించని వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుజిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళవెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్‌ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ? -
నాలుగు నెలలైనా ఈవీఎంలలో తగ్గని బ్యాటరీ లెవెల్ అధికారుల హైడ్రామా..
-
ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామానే దీనికి నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు.. ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం దొరకలేదని తాపీగా చెప్పడంతో దాదాపు రెండు మూడు గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్నిచోట్లా గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చేవరకు ఈవీఎంల గోదాం వద్ద కలెక్టర్ తన బృందంతో కలసి పడిగాపులు కాయక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు – వీవీ ప్యాట్లలో ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ కనీసం 50 శాతమైనా వినియోగమై ఉంటుందన్నారు. అయితే దాదాపు 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం వాటిని తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అందువల్ల గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబరు 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని కోరారు.తలుపులు తెరిచారు.. తాళం చెవి మరిచారుపోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను, వీవీ ప్లాట్లను నెల్లిమర్లలోని గోదాంలో భద్రపరిచారు. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టరు ప్రతి నెలా వాటిని కచ్చితంగా తనిఖీ చేయాలి. బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సోమవారం వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రెండు రోజుల క్రితమే అధికారులకు తెలుసు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఎన్నికల కమిషన్ నియమించిన బెల్ ఇంజనీర్ల బృందం గోదాం వద్దకు చేరుకుంది. అయితే ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం మరచిపోయినట్లు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఆ తాళాలు కలెక్టరేట్లోని ఎన్నికల సెల్ వద్ద ఉండాలి. అయితే మధ్యాహ్నం కావస్తున్నా తాళం చెవి రాకపోవడంతో పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం కాగా ఫిర్యాదుదారుల తరఫున హాజరైన బెల్లాన వంశీ అభ్యంతరం చెప్పారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎట్టకేలకు తాళాలు పట్టుకొచ్చి బాక్స్‌లను తెరిచారు.మాక్ పోలింగ్‌లోనూ చిత్ర విన్యాసాలు..ఫిర్యాదుదారులు పరిశీలించాలని కోరిన పెదకాద పీఎస్ నంబరు 20కి సంబంధించిన ఈవీఎంను బయటకు తీసి బ్యాటరీని సీజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ బ్యాటరీకి బదులు కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పార్టీల గుర్తులు గాకుండా తమకు నచ్చిన గుర్తులు లోడ్ చేసి మాక్ పోలింగ్ ప్రారంభించారు. వీవీ ప్యాట్లను కూడా పెట్టలేదు. సుమారు 1,400 ఓట్లున్న పీఎస్‌కు సంబంధించిన ఈవీఎంను కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థరాత్రి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ రోజు ఏవిధంగా ప్రక్రియ సాగిందో అదే రీతిలో నిర్వహిస్తేనే పవర్ ఎంత వినియోగమైందో తెలుస్తుందని, అలాకాకుండా మొక్కుబడిగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీ ప్యాట్లకు వినియోగించిన బ్యాటరీ స్టేటస్ కౌంటింగ్ నాటికి ఇంకా 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. మాక్ పోలింగ్ కోసం వాడిన బ్యాటరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అధికారికంగా నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు.నేడు కూడా తనిఖీ కొనసాగింపు...విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను తనిఖీ చేయాలన్న బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఆ ప్రక్రియ కొనసాగనుంది. -
గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్‌తోనే ఈసీ సరి!
సాక్షి, విజయనగరం: గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 20, పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైఎస్సార్సీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదస్పదంగా మారింది.పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్స్‌లోనూ వీవీప్యాట్లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. అయితే కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ అడిగిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్, బాటరీ లెవెల్ డేటాను ఎన్నికల అధికారులు ఇవ్వలేదు.దీంతో ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్‌తో అధికారులు డ్రామా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తన్నాయి. కొత్త గుర్తులతో 1400 ఓట్లు మాక్ పోలింగ్ జరిగింది. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహణ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వెరిఫికేషన్ కి వచ్చి తాళాలు లేవని ఎన్నికల అధికారుల హై డ్రామా
-
Big Question: ఒట్టు.. ఉంది లోగుట్టు.. . ఈవీఎం డేటా డిలీట్..!?
-
బాలినేని అడిగిందొకటి..ఈసీ చేస్తోందొకటి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు నాయకులను, ఓటర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను పరిశీలించాలని కోరుతూ ఈసీ నిర్దేశించిన రూ.5,66,400 రుసుము చెల్లించారు. నగరంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఓట్లను, వీవీ ప్యాట్లలోని సింబల్ స్లిప్‌లతో సరిచూడాలని ఫిర్యాదులో కోరారు. పరిశీలనకు 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. దీంతో ఈసీ ఈవీఎంల చెకింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే బాలినేని కోరిన విధంగా కాకుండా పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను డిలీట్ చేసి, కేవలం ఈవీఎంల పనితీరును మాత్రమే చెక్ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు కొత్తగా వచ్చినపుడు ఫస్ట్‌లెవల్ చెకింగ్, కమిషన్ చెకింగ్ చివరికి పోలింగ్ రోజు కూడా అన్నీ పార్టీల ఏజెంట్ల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహిస్తారని మరళా ఇప్పుడు మాక్‌పోలింగ్ నిర్వహించడం అర్థం లేదన్నారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్‌లతో సరిచేస్తే సందేహాలు నివృత్తి అవుతాయని ఆయన అన్నారు. అయితే కలెక్టర్ ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు ఈవీఎంల చెకింగ్ మాత్రమే చేస్తామని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ఇలాగైతే న్యాయం జరగదని భావించిన బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. ఒక వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే జిల్లా అధికారులు మాక్ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. సోమవారం ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్దకు అధికారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. మాక్‌పోలింగ్ ప్రక్రియను బహిష్కరిస్తున్నామని బాలినేని తరఫున హాజరైన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాక్‌పోలింగ్‌ను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీం తీర్పు ఏం చెబుతోందంటే...ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏదైనా అనుమానాలు వస్తే ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్‌ల్లో ఉన్న స్లిప్‌లతో సరిపోల్చాలని ఎన్నికల్లో పోటీ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈసీని కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 శాతం ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు గాలికొదిలేశారు. అభ్యర్థి కోరిన పోలింగ్ బూతుల్లో వినియోగించిన ఈవీఎం ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈవీఎంల అవకతవకలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను తొలగించి మాక్‌పోలింగ్ నిర్వహించి ఉంటే కోర్టు ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలని ఉత్తర్వులు ఇస్తే అధికారులు ఏం చేసి ఉండేవారో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాక్‌పోలింగ్ ప్రక్రియ ఎవరి మెప్పు కోసం నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాక్‌పోలింగ్ కాకుండా ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్లతో సరిచూడాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించిన కేసు బుధవారానికి వాయిదా పడింది. ఈ విషయంపై అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తానని బాలినేని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం, అధికారులు పోలింగ్ రోజు ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామనడంపై బాలినేని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఓట్లను తొలగిస్తే నిజాలు నిగ్గు తేలేది ఎలా..?ఎన్నికల సంఘం, అధికారులు ఈవీఎంల్లో అవకతవకలు ఉన్నాయని వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలను పరిశీలించాల్సిందిపోయి ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు ఓట్లను ఈవీఎంల్లో తొలగిస్తామని, ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు కేవలం డమ్మీ బ్యాలెట్‌తో యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తామనడంలో అర్థంలేదని రాజకీయపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ తప్పులు జరగకుంటే పోలైన రోజు ఈవీఎం ఓట్లను, వీవీ ప్యాట్లోని స్లిప్‌లతో పరిశీలించవచ్చు కదా అని నిలదీస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మాక్ పోలింగ్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం
సాక్షి, అమరావతి : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీలు, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన టీ–ఎస్వోపీ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. బాలినేని తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ దాదాపు అరపూట వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పు ఉద్దేశం, ప్రధాన సారాంశం, దానికి ఈసీఐ ఏ విధంగా వక్ర భాష్యం చెబుతోందో వివరించారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకే సుప్రీం కోర్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత 45 రోజుల వరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపరచాలని ఆదేశించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 1 ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించేదని, నారా చంద్రబాబు నాయుడు 2019లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందని వివరించారు. పోలింగ్ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు పరిశీలన చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్దిని తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహారశైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. ఈ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీం కోర్టు తీర్పును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్యం కాదన్నారు. ఒకవేళ ఇదే సుప్రీం కోర్టు ఉద్దేశం అయి ఉంటే నేరుగా చెప్పేదే తప్ప, బరŠట్న్ మెమొరీ (ఈవీఎం మైక్రో కంట్రోలర్‌లో శాశ్వతంగా నిక్షిప్తం చేసిన మెమొరీ) గురించి మాట్లాడేది కాదన్నారు. బరŠట్న్ మెమొరీని మాత్రమే పరిశీలించమని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. అందుకే ఆ బాధ్యతలను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లకు అప్పగించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమయం ముగియడంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
బెడిసికొట్టిన ‘మాక్’ నాటకం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్‌తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్‌లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్‌తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్‌కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.పూర్తి వివరాలు ఇవ్వండిసుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
మాక్ పోలింగ్ వద్దు..
-
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు తేడావస్తే సుప్రీంకు వెళ్తా..
-
ఆగిపోయిన ఈవీఎంల లెక్కింపు బయటకు వచ్చిన బాలినేని
-
వీవీప్యాట్ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్
ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు.ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. రిట్ విచారణ రేపటికి..ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్ పోలింగ్ చేస్తోందని బాలినేని తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ 12 బూత్‌లలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. -
నేటి నుంచి ఈవీఎంల పరిశీలన
ఒంగోలు అర్బన్: ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. -
ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినేని న్యాయ పోరాటం
-
‘సుప్రీం’ తీర్పులకు ఈసీ వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, సందేహాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్వోపీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో, పోటీ చేసిన అభ్యర్థుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్నికల సంఘం తిలోదకాలిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే దిశగా ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయట పడే అవకాశమే లేదన్నది నిపుణుల మాట. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ వెలుగుచూసే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. మాక్ పోలింగ్ కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మాత్రమే రూఢీ చేస్తుందని, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయదని స్పష్టంగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ... ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఈవీఎంల ట్యాంపరింగ్, మార్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైన ఓట్లను వీవీ ప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లపరంగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా కోరవచ్చు. అలాంటప్పుడు ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 శాతం ఈవీఎంలను, వీవీ ప్యాట్ల స్లిప్పులను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లు తనిఖీ చేసి పరిశీలన చేసి తీరాలి. పోలింగ్ స్టేషన్లను లేదా సీరియల్ నంబర్లను అభ్యర్థులే ఎంపిక చేసుకోవచ్చు. ఈవీఎంల పరిశీలన కోరిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన సమయంలో ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారం లోపు అభ్యర్థులు ఈవీఎంల పరిశీలన కోరవచ్చు. ఇంజనీర్లతో సంప్రదించిన తరువాత ఈవీఎంల తాలూకు మైక్రో కంట్రోలర్ల ప్రామాణికతను ఎన్నికల అధికారి ధృవీకరించాలి. ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని తేలితే పరిశీలన నిమిత్తం ఆ అభ్యర్థి చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయాలి. ఎన్నికల సంఘం చేస్తున్నది ఇదీ... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు పొంతనే లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికులకు అసాధారణ మెజారిటీలు వచ్చాయి. ఇవన్నీ ఈవీఎంల పనితీరుపై సందేహాలు, అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలనకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఫీజు సైతం చెల్లించారు. అయితే ఇటీవల ఎన్నికల అధికారులు ఈ ఫీజును వాపసు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒత్తిళ్లకు వారు లొంగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడుతుందన్న ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తనిఖీ, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఏమిటీ మాక్ పోలింగ్..? మాక్ పోలింగ్ అనేది ఎన్నికల సంఘం రొటీన్‌గా నిర్వహించే ఓ ప్రక్రియ. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సింబల్ లోడింగ్ యూనిట్లు తదితరాలను తనిఖీ చేస్తారు. ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు, పరిశీలనలు ఉంటాయి. పోలింగ్ రోజు ఎలాగైతే ఆయా మిషన్లను ఓటింగ్ కోసం ఉపయోగిస్తారో అదే రీతిలో మాక్ పోలింగ్ సందర్భంగా వాటిని వినియోగిస్తారు. ఒక్కో బటను నొక్కి సక్రమంగా పనిచేస్తుందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్‌ను నొక్కి పని తీరును పరిశీలిస్తారు. అలాగే వీవీ ప్యాట్ల స్లిప్పులు సక్రమంగా వస్తున్నాయా? లేదా? చూస్తారు. అన్ని యూనిట్లు సక్రమంగా కనెక్ట్ అయ్యాయా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయా? లేదా? అనేది తనిఖీ చేస్తారు. ఎన్నికల సంఘం తీరుపై బాలినేని న్యాయ పోరాటం.. తన నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్ యంత్రాల పరిశీలన, తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు ఆయన న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ నెల 16న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరినట్లు చెప్పారు. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యరి్థంచామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరామన్నారు. -
ఈసీకి బాలినేని ఫిర్యాదు.. 19 నుంచి ‘ఒంగోలు’ ఈవీఎంల చెకింగ్
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. -
ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి
సాక్షి, అమరావతి: దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (ఓట్ ఫర్ డెమొక్రసీ) వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనా? ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? పోలింగ్ శాతం ఇంత భారీ స్థాయిలో ఉండటానికి కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేసైనా ఉండాలి! లేదంటే ఈవీఎంలను మార్చైనా ఉండాలి! లేదంటే అవి సక్రమంగా పనిచేయకపోయి ఉండాలి! అంటూ వీఎఫ్‌డీ, ఏడీఆర్ వ్యక్తం చేసిన సందేహాలు వాస్తవమేనా? ఈవీఎంల పనితీరుపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను తాజాగా అధికారులు కోరుతుండటం ఎన్నికల ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.ఈవీఎంల పనితీరుపై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదు..రాష్ట్రంలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపును ఈసీ జూన్ 4న చేపట్టింది. అంటే పోలింగ్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు గమనించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.విచారణ కోసం జూన్ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా..? మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా? కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ పాట్స్ ట్యాంపరింగ్గానీ ఏమైనా మార్పులుగానీ జరిగాయా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటిపై విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈనెల 25వతేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు..రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాస్పదంగా ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది.ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎఫ్డీలతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది.ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. సీఈవో కార్యాలయానికి ఈ విచారణకు సంబంధం ఉండదని, ఇది పూర్తిగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిర్యాదులపై ఆయా రిటర్నింగ్ అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమక్షంలోనే ఈ విచారణ ప్రక్రియ జరుగుతుందని సీఈవో చెప్పారు.విచారణ నిర్వహించాల్సిందేఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్లు తేలింది. నా లోక్‌సభ స్థానం పరిధిలో 81 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్‌కు, కౌంటింగ్ తేదీకి మధ్య 21 రోజులు గడువు ఉంది. అయినా సరే ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉండటాన్ని బట్టి చూస్తే ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానంతో ఫిర్యాదు చేశా. విచారణకు అయ్యే ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించా. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని అధికారులు నన్ను కోరారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారు. దాన్ని నేను సున్నితంగా తోసిపుచ్చా. విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పా.– బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం లోక్‌సభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫీజు వెనక్కి ఇస్తామని పీఏకు ఫోన్ ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, ఓటింగ్ యంత్రాలను మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫిర్యాదుపై విచారణ కోసం ఫీజు కూడా చెల్లించా. ఇప్పుడు ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నా పీఏకు అధికారులు ఫోన్ చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఫీజు వాపసు ఇస్తామని చెప్పారట. దీనిపై విచారణ జరగాల్సిందే.. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పా. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ అభ్యర్థి -
లోక్‌సభలో అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో.. ఎన్డీయే కూటమిపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మంగళవారం లోక్‌సభలో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్.. యూపీ ఫలితాలతో పాటు పేపర్ లీక్, ఈవీఎంల అంశం గురించి మాట్లాడారు.‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక నీట్ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
‘ఈవీఎం’ సేఫేనా..? జోరందుకున్న చర్చ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) సేఫా..? వాటిలో పడిన ఓటు భద్రమేనాా..? ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చొచ్చా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఇటీవల కొందరు పాపులర్ టెక్నాలజీ నిపుణులే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అయితే ఈవీఎంల వాడకానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశారు. మస్క్ ఈ తరహా అభిప్రాయం వెలిబుచ్చిన సమయానికే మహారాష్ట్రలోని ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గంలో ఓటీపీ ద్వారా ఈవీఎంను తెరిచారన్న వివాదం వెలుగులోకివచ్చింది. దీంతో ఈవీఎంల భద్రతపై చర్చ జోరందుకుంది.భారత్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేధావి శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. వీరే కాక తాజాగా సైబర్ లా నిపుణుడు, ప్రముఖ న్యాయవాది పవన్ దుగ్గల్ కూడా ఇంచు మించు ఇదే చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఛాన్సు లేకపోలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా..? అనే సమాధానం లేని ప్రశ్న మళ్లీ అందరి మెదళ్లను తొలుస్తోంది. అసలు మస్క్ ఏమన్నారు.. సందర్భమేంటి..? ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని టెస్లా అధినేత మస్క్ ఇటీవల సూచించారు. అమెరికా నియంత్రణలో ఉన్న ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’అని మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.మస్క్‌కు మాజీ ఐటీ మంత్రి కౌంటర్లో వాస్తవమెంత..?మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వెంటనే ఎక్స్‌లో మాజీ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు’అని సూచించారు.రాజీవ్ చంద్రశేఖర్ లాజిక్ కరక్టేనా.. సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఏమన్నారు.. ‘ఒక కంప్యూటర్‌కు బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానం లేనపుడు హ్యాక్ చేయడం కష్టమే కావచ్చు. అయితే ఎలాంటి వ్యవస్థనైనా ఏమార్చి దానిలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నా. నిజానికి భారత్‌లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. భారత్‌లో అసలు సైబర్ భద్రతకు సంబంధించి పక్కా చట్టమే ఇప్పటివరకు లేదు.‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు’అని సైబర్ లా నిపుణులు, ప్రముఖ న్యాయవాది పవన్‌దుగ్గల్ వ్యాఖ్యానించారు.శ్యామ్ పిట్రోడా అనుమానాలేంటి..?ఈవీఎంలపై టెక్నాలజీ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి. కొంత మంది చెబుతున్నట్లు ఈవీఎంలు కేవలం స్టాండలోన్ పరికాలే కాదు. వాటికి వీవీప్యాట్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఇంతేగాక వీటిని తయారు చేసే క్రమంలో, రవాణా చేసే సందర్భాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అన్నారు. బ్యాలెట్ పేపరే పరిష్కారమా..? ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్న వాదన వినిపిస్తోంది. -
బ్యాలెట్టే బెటర్. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు: నారాయణ
-
భారత్‌లోనూ EVMలు కాకుండా బ్యాలెట్‌నే వాడాలి: వైఎస్ జగన్
-
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
EVMలపై వైఎస్ జగన్ కీలక ట్వీట్, ఏమన్నారంటే..
గుంటూరు, సాక్షి: ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు.‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారాయన.Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 20242024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్‌లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా... కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ... ఏనీథింగ్ క్యాన్ బీ హ్యాక్డ్ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు... దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీ-డాక్ వ్యవస్థాపకుడు శ్యామ్ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే.ఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. -
మహా ఈవీఎం వివాదం
18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ స్థానం ముంబై నార్త్‌వెస్ట్. ఎందుకంటే అక్కడ గెలుపొందిన శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్‌కు వచి్చంది కేవలం 48 ఓట్ల ఆధిక్యం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇప్పుడు దానిచుట్టే రగడ మొదలైంది. వాయ్‌కర్‌కు అనుకూలంగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఆయన బంధువు మొబైల్ ఫోన్‌తో ఈవీఎంను హ్యాక్ చేశారనే వార్తా కథనం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కథనం క్లిప్పింగ్‌తో ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయడానికి వీల్లేదని, వాటిని తెరవడానికి ఓటీపీ అవసరమే లేదని, బాహ్య వ్యవస్థలతో ఎలాంటి అనుసంధానం లేకుండా ఈవీఎంలు స్వతంత్రంగా పనిచేస్తాయని ముంబై నార్త్‌వెస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ వందనా సూర్యవంశీ చెప్పారు. అనధికారికంగా కౌంటింగ్ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫోన్‌ను వాడిన వాయ్‌కర్ బంధువుపై కేసు నమోదైందని వెల్లడించారు. ముంబై: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు బాహ్య ప్రపంచంతో ఎలాంటి అనుసంధానం, సాంకేతిక సంబంధాలు లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని, సురక్షితమని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం రిటరి్నంగ్ అధికారి వందనా సూర్యవంశీ ఆదివారం తెలిపారు. సమాచార మారి్పడికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు ఉండదని పేర్కొన్నారు. ఈవీఎంలను తెరవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదని, వాటిపై ఉండే బటన్‌ను నొక్కడం ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆమె వివరించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్ కేవలం 48 ఓట్లతో నెగ్గారు. రవీంద్ర వాయ్‌కర్ బంధువు మంగేష్ పాండిల్కర్ కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంకు అనుసంధానమైన మొబైల్ ఫోన్‌ను వాడారని, దీని ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారని, హ్యాక్ చేశారని మిడ్–డే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై రిటరి్నంగ్ ఆఫీసర్ వందన స్పందిస్తూ.. ‘ఈవీఎంలు సాంకేతికంగా లోపరహితమైనవి. బయటినుంచి ఏ ఇతర సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. వాటిని ప్రోగ్రామ్ చేయడం కుదరదు. వైర్‌లెస్‌గా, వైర్లను కనెక్ట్ చేసి సమాచార మారి్పడి చేయడానికి ఈవీఎంలలో ఎలాంటి ఏర్పాటు లేదు’ అని తెలిపారు. రవీంద్ర వాయ్‌కర్ బంధువు మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారనే వాదనలను కొట్టిపారేశారు. ఇది శుద్ధ అబద్ధం. ఒక పత్రిక దీన్ని వ్యాపింపచేస్తోంది. మిడ్–డే పత్రికకు ఐపీసీ 499, 505 సెక్షన్ల కింద పరువునష్టం, అసత్య వార్తల ప్రచారానికి గాను నోటీసులు జారీచేశామని వందనా సూర్యవంశీ వెల్లడించారు. ముంబై నార్త్‌వెస్ట్‌లో శివసేన (యూబీటీ) అభ్యర్థి అమోల్ సజానన్ కీర్తికర్ గెలిచారని తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే రవీంద్ర వాయ్‌కర్ (శివసేన– షిండే) 48 ఓట్లతో గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. మేము గెలిచినందుకేనా ఈ సందేహాలు: ఏక్నాథ్ షిండే ముంబై నార్త్‌వెస్ట్‌లో తమ (శివసేన) అభ్యర్థి రవీంద్ర వాయ్‌కర్ గెలిచినందుకే ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. ఈ ఒక్క నియోజకవర్గం ఫలితంపైనే ఎందుకు సందేహాలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలోని మిగతా స్థానాల ఫలితాలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయడం లేదు? ఎందుకంటే ముంబై నార్త్‌వెస్ట్‌లో నా అభ్యర్థి వాయ్‌కర్ గెలిచారు. వారి అభ్యర్థి (శివసేన–యూబీటీ) ఓడిపోయారు.. అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పు వాయ్‌కర్‌కు అనుకూలంగా ఉందన్నారు. అది డాటా ఎంట్రీ ఆపరేటర్ మొబైల్ రవీంద్ర వాయ్‌కర్ బావమరిది మంగేష్ పాండిల్కర్ కాల్స్ చేయడానికి, అందుకోవడానికి కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ దినేశ్ గౌరవ్ ఫోన్ వాడారని రిటరి్నంగ్ ఆఫీసర్ వందన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ వాడకూడదనే అధికారిక ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఐపీసీ 188 సెక్షన్ కింద మంగే‹Ùపై పోలీసు కేసు నమోదైంది. అలాగే దినేశ్ గౌరవ్‌పై కూడా కేసు నమోదైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటాను పొందుపర్చడానికి మాత్రమే మొబైల్ ఫోన్‌ను వాడాలని, ఫోన్‌తో అవసరం తీరగానే సీనియర్ అధికారికి అప్పగించాలని, ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లోనే పెట్టాలి. దినేశ్ ఈ నిబంధనలను పాటించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్.. సిస్టమ్‌లోకి లాగిన్ అవుతారు. డేటా ఎంట్రీ, ఓట్ల లెక్కింపు రెండు వేర్వేరు అంశాలు. కౌంటింగ్ ప్రక్రియకు, మొబైల్ ఫోన్ అనధికారిక ఉపయోగానికి ఎలాంటి సంబంధం లేదు. మొబైల్ ఫోన్ వాడకం దురదృష్టకర ఘటన, దీనిపై దర్యాప్తు జరుగుతోందని వందన వెల్లడించారు. ‘అధునాతన సాంకేతిక ఫీచర్లు, గట్టి అధికారిక నిఘా ఉందని.. అందువల్ల ఓట్లను తారుమారు చేసే అవకాశమే లేదని చెప్పారు. ప్రతిదీ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల ఎదుటే జరుగుతుందన్నారు. రవీంద్ర వాయ్‌కర్ గాని, ఓటమి పాలైన అమోల్ కీర్తికర్ గాని రీ కౌంటింగ్‌ను కోరలేదని తెలిపారు. చెల్లని పోస్టల్ బ్యాలెట్లను పునఃపరిశీలించాలని డిమాండ్ చేయగా.. తాము అది చేశామని వివరించారు. అధీకృత కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టలేమని తెలిపారు. ఫలితాన్ని నిలిపివేయాలి: పృథ్విరాజ్ చౌహాన్ ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ ఆదివారం డిమాండ్ చేశారు. భారత ఎన్నికల సంఘం అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని లోతుగా చర్చించాలని కోరారు. ‘మొబైల్ ఫోన్ అనధికారిక వినియోగంపై దర్యాప్తు జరగాలి. ఎఫ్ఐఆర్ను బహిరంగపర్చలేదు’ అని చౌహాన్ అన్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఎన్నికల్లో విజయం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలోన్ మస్క్ చర్చకు తెర లేపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. భారత్‌లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about transparency in our electoral process.Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024 దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్‌లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు.మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుందన్నారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభలో గెలిచిన అభ్యర్థి బంధువులు ఈవీఎంలకు కనెక్ట్ చేసిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన కథనాల్ని ట్వీట్ చేశారు.ఫోన్‌తో ఈవీఎంను అన్‌ల్యాక్ చేసిన ఎన్డీఏ అభ్యర్థి!ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. అందుకు జూన్ 4న రెస్కో పోలింగ్ కౌంటింగ్ సెంటర్ బయట ఎంపీ రవీంద్ర వైకర్ బావ మంగేష్ పన్హాల్కర్ ఫోన్ వినియోగించారు. ఆ ఫోన్ వినియోగించడం వల్లే రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్‌కు మంగేష్ పన్హాల్కర్‌కు ఫోన్‌కు మధ్య కనెక్టివిటీ ఉందని, ఫోన్లో ఓటీపీ సాయంతో కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఈవీఎం మెషిన్ ఓపెన్ అయ్యేలా టెక్నాలజీని వినియోగించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మంగేష్ ఫన్హాల్కర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. వాటిని ఎవరు కనెక్ట్ చేయలేరు. కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై,ఇంటర్నెట్ను వినియోగించలేరని అన్నారు.We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh— Elon Musk (@elonmusk) June 15, 2024 -
ఈవీఎంలతో మోసం చేశారు
ధర్మవరం: ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కుట్రలు, మోసాలతో జరిగాయని, ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడి గెలుపొందారని తాను అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ డెమో ద్వారా వివరించారు. నియోజకవర్గాలలో పోలైన ఓట్లు, ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలోని పలు రాష్ట్రాలలో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో మోసాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలకే కూటమి అభ్యర్థులు 120 సీట్లు గెలిచారు.. 150 సీట్లు గెలిచారంటూ టీవీలలో చూపించారన్నారు. ఇలా చేయడం వల్ల కౌంటింగ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లు బయటకు వెళ్లిపోతే అధికారులతో వన్‌సైడ్‌గా చెప్పించుకోవచ్చని పథకం పన్ని అమలు చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. తాను ఓడిపోయిన బాధలో మాట్లాడట్లేదని, తాము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారు ఏ మాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ఓడినా ప్రజల కోసం గొంతు వినిపిస్తానన్నారు. కార్యకర్తలెవ్వరూ అధైర్య పడొద్దన్నారు. రానున్న రోజులు మంచిగా ఉంటాయని భరోసా ఇచ్చారు. -
ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి!?
సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నిమిత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే.. వీటిలో 40 లక్షలు వినియోగించారని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్‌ను కోరితే.. తమకేం తెలీదని.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్‌ను అడగాలంటూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఓ కమ్యునిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తంచేశారన్నారు. ఈవీఎంల గోల్మాల్ అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు. గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్‌మాల్‌పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందోననే అపోహ ప్రస్తుతం నెలకొందని, ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చంద్రబాబు దృష్టిపెట్టాలని ఉండవల్లి సూచించారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములకు ఓట్ల తేడా కేవలం 1.9 శాతం మాత్రమేనన్నారు. అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అని ఉండవచ్చన్నారు.వైఎస్సార్సీపీకి మళ్లీ మంచి రోజులు..ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకోవద్దని.. ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరంలేదన్నారు. 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుందని.. వారికి మళ్లీ మంచి రోజులు రావచ్చని ఉండవల్లి చెప్పారు. గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలుపే దీనికి నిదర్శనమన్నారు. ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటుచేసుకున్నాయని చెప్పారు. తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి 169, జయలలిత పార్టీకి 30 సీట్లు వచ్చాయని.. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలితకు 225, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు. అలాగే, 1996లో కరుణానిధి 221 సీట్లు సాధించగా.. జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమయ్యారన్నారు. మళ్లీ 2011 ఎన్నికల్లో జయలలిత ఏకంగా 203 సీట్లు సాధించారని చెప్పారు. దీనినిబట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్తువ ఉండకూడదని ఉండవల్లి అన్నారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలి..మరోవైపు.. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, ఆయన ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రానికి అందాల్సిన నిధుల సాధనకు కృషిచేయాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఏపీకి రూ.1.42 లక్షల కోట్లలో 50 శాతం ఆస్తులు రావాలని, వాటిని సాధించుకునేందుకు పోరాడాలని సూచించారు.రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014లో పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసుకుని, ఇప్పుడు బాబు చర్చకు డిమాండ్ చేయాలన్నారు. అలాగే, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై నోటీసు ఇప్పించాలన్నారు. వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్లపై సైతం చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసును చంద్రబాబు ప్రభుత్వమే సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని ఉండవల్లి చెప్పారు. జగన్ జైలుకెళ్లే అవకాశం ఉండదు..అక్రమాస్తుల కేసులో జగన్ మళ్లీ జైలుకెళ్లే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అన్ని చార్జిషీట్లూ పూర్తయ్యాయని చెప్పారు. ఇక కమ్మ, కాపులది డెడ్లీ కాంబినేషన్ అని.. కసి, పట్టుదలవల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనపై జగన్ కక్షసాధింపు చర్యలు చేపట్టారని ప్రజలు నమ్మారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణం కావచ్చునన్నారు. ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అలాంటి వారివల్లే కొంతమంది వైఎస్సార్సీపీకి దూరమయ్యారని చెప్పారు. -
ఈవీఎం గోల్ మాల్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనుమానాలు
-
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
EVMలు హ్యాక్ ?.. ఆన్నాడు చంద్రబాబు వ్యాఖ్యలు..అనుమానాలు నిజమేనా !
-
వెలుగులోకి మరో ‘కౌంటింగ్’ మాయ
అచ్చంపేట: ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈవీఎం మారిపోయిన సంఘటన ఇప్పటికే బయటపడగా, తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట జెడ్పీ హైస్కూల్లో ఉన్న 56వ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో ఓట్లను లెక్కించకుండానే అధికారులు పక్కన పెట్టేశారని కౌంటింగ్ ఏజెంట్లు తెలిపారు.దీనిపై అధికారులను ప్రశ్నించగా, ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అది ఓపెన్ కావడంలేదని, అందువల్ల లెక్కింపు సాధ్యం కావడంలేదని చెప్పారని ఏజెంట్లు చెప్పారు. ఈ బూత్‌లో మొత్తం 737 ఓట్లు ఉన్నాయి. అందులో 357 మంది పురుషులు, 380 మంది మహిళలు ఉన్నారు. అచ్చంపేట మండలంలో 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీకి 7,597 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి టీడీపీకి ఈ మండలంలో 161 ఓట్ల మెజార్టీ వచ్చింది.అయితే, 56వ పోలింగ్ బూత్‌లో ఓట్లను లెక్కించకుండానే టీడీపీకి 161 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు ఎలా ధృవీకరిస్తారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఈ విధంగా, చేశారని, వైఎస్సార్సీపీని దెబ్బ తీయడానికి ఇంకా బయటపడని ఘోరాలు ఇంకెన్ని జరిగాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఈవీఎంలు మార్చేశారు
-
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
AP: ఈవీఎంల మార్పిడి జరిగిందా?
పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, బూటకపు ఎన్నికలు జరిగాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్ చెప్పారు. వీటిని చీకట్లో జరిగిన ఎన్నికలుగా పరిగణించాలన్నారు. ఎన్నికల కమిషన్‌పై న్యాయసమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల కమిషన్ కుట్ర చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. తక్షణం ఎన్నికలను రీకాల్ చేసి తిరిగి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువులో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకుని ఈవీఎంలపై విచారణ చేపట్టాలని కోరారు. ఓటమి భయంతో కూటమి కట్టిన టీడీపీ అభ్యర్థులకు వేల మెజార్టీ రావడం, బీజేపీ పోటీచేసిన రెండుచోట్ల లక్షల్లో మెజార్టీ రావడం, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను విజయం సాధించడం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందుతుందని ముందే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో వారికి కలిసి వచ్చిన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందన్నారు.ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని, ఇదే విషయాన్ని మెజార్టీ సర్వేసంస్థలు వెల్లడించాయని చెప్పారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలందరికీ మేలు చేశారన్నారు. లక్షలాదిమంది ఓటర్లున్న వైఎస్సార్సీపీకి కేవలం ప్రతిపక్ష హోదాకు తక్కువగా అసెంబ్లీ సీట్లు దక్కడం వెనుక భారీ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ముందు నుంచి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేసిందన్నారు. తనపై కేసు నమోదు చేసిందన్నారు. తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆధారాలతో సహా వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. -
ఈవీఎంనే మార్చేశారు
మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్లు తప్పులతడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండటంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంట్ నియోజకవర్గానిదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్రమే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎం మారి్పడి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్ కళాశాలలో జరిగింది. ఒక గదిలో లోక్‌సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్ బూత్ పార్లమెంట్ ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకొచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్సార్సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపింది. వైఎస్సార్సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచి్చన రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్వోకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్వో చెప్పారు. కౌంటింగ్ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంట్‌కు సంబంధించినదిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్ బూత్‌కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎం తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీ ప్యాట్ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్సార్సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీఎం మారిన సంగతి బయటపడకుండా, పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్సార్సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్ కాకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచి్చంది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థులు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడుతున్నారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర
సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్ సెంటర్ వద్ద మైక్‌లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్ హెల్ప్¬లైన్’ అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్ కుమార్ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లో డిక్లరేషన్ ఫారంపై రిటర్నింగ్ అధికారి నియమించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్‌గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు. -
అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించొద్దని.. నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు, తర్వాత రోజుల్లో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని మీనా సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..కౌంటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను భద్రపర్చాలి..ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే వాయిదా వేయకుండా అదేరోజు ప్రతి ఈవీఎంకు సీల్‌వేసి భద్రపర్చాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుసటి రోజే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేశాం. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇండెక్స్ కార్డులో ఎలాంటి తప్పులకు ఆస్కారంలేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోపు మా కార్యాలయానికి అందజేయాలి. ప్రతి టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్..ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్‌కు అవకాశం కల్పించాలి. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం–17సి, పెన్ను లేక పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలిజ అంతకుమించి ఏమున్నా అనుమతించొద్దు. అథారిటీ లెటర్లు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్‌ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పొద్దు. కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్‌ఫోన్‌తో వారిని అనుమతించడానికి వీల్లేదు.కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు..ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకు తగ్గట్లుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రణాళికను పటిష్టంగా ఏర్పాట్లుచేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్నిచోట్లా ఏర్పాటుచేయాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి.అదనపు సీఈఓలు పి. కోటేశ్వరరావు, సీఈఓ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ సీఈఓ ఎస్. వెంకటేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. -
జూన్ 4 జడ్జిమెంట్ డే: తొలి, చివరి ఫలితాలపై క్లారిటీ ఇదిగో
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభంకానుంది. 11 గంటల కల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలుండగా.. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై ఓ అంచనాకి వచ్చేయొచ్చు. తొలి ఫలితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరి జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు మాత్రం ఆలస్యంగా వెలువడనున్నాయి. ఈ రెండు చోట్లా 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు. మరోవైపు.. భీమిలి(విశాఖ), పాణ్యం(నంద్యాల) ఫలితాల కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు(మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ చీటీలు) పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. -
ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలి: రాజీవ్‌కుమార్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఇందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల సీఈవోలు, ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి రాజీవ్‌కుమార్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరి సమిష్టి కృషితో దేశవ్యాప్తంగా ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు.. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపు గురించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్‌కుమార్ ఆదేశించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా.. ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ‘లెక్కింపు పూర్తి అయినట్లుగా’ ఆయా ఈవీఎంలపై మార్క్ చేయాలని ఆదేశించారు. ఆ వెంటనే సీల్ చేసి ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ, ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుళ్లు, స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని.. డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే
సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్ డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్ఆర్ కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే.. ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రంలో గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటరి్నంగ్ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాలను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. -
లోకేష్ కు అమ్మేశారా ?
-
ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో
సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయటకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లువచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపుస్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్
-
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
దర్శి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో ఈసీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న ఆరోపణలకు దర్శి ఘటన బలం చేకూరుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై 10 రకాల సెక్షన్లు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది.ఈ విషయంపై పచ్చ మీడియా చిలువలుపలువలుగా కథనాలు ప్రచురిస్తోంది. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నేతలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దానిని పగులగొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డిపై తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రం. 13వ తేదీ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా దర్శి ఎంఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఎంపీ అభ్యర్థికి చెందిన ఈవీఎంను టీడీపీ నేత వేమిరెడ్డి చెన్నారెడ్డి(వీసీ రెడ్డి) పగులగొట్టాడు. ఇదే బూత్ సమీపంలో టీడీపీ నేతలు వీరంగం చేయడంతో కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.నిందితుడికి 41ఏ నోటీసులతో సరి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వీసీ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా వీసీ రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి వీసీ రెడ్డి పరారయ్యాడు. 41ఏ నోటీసులు తీసుకున్న వ్యక్తి పోలీసుల అనుమతి లేకుండా గ్రామం విడిచి వెళ్లకూడదు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన నిందితుడు ఒంగోలు రామ్‌నగర్‌లో నివాసముంటున్న టీడీపీ కీలక నేత కుమారుడి వద్ద ఆశ్రయం పొందినట్లు గత పది రోజులుగా ప్రచారం జరిగింది. సదరు నాయకుడి ఒత్తిడి మేరకే వీసీ రెడ్డిపై పోలీస్ అధికారులు ఉదాశీన వైఖరిని అవలంబిస్తున్నారని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా.. బుధవారం వీసీ రెడ్డి దర్శిలోని ఓ రెస్టారెంట్లో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతుండటం గమనార్హం. ఈవీఎం ధ్వంసం చేసిన విషయం, నరసరావుపేట నుంచి వచ్చిన 150 మంది టీడీపీ గూండాలు దర్శి నియోజకవర్గంలో చేసిన రచ్చను ఉద్దేశపూర్వకంగా దాచేసిన ఎల్లో మీడియా.. వైఎస్సార్సీపీ నాయకులపై మాత్రం విషం చిమ్మడాన్ని ఆపడం లేదు. -
‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
సాక్షి, నరసరావుపేట / రెంటచింతల: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడులు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈసీకి మొర పెట్టుకున్నా... పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది.. పాల్వాయి గేట్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 202 పోలింగ్ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. ఈసీ డేటా భద్రమేనా?సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్ వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్ ఎక్స్ ఖాతా, టీడీపీ సోషల్ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 53 గ్రామాల్లో దాడులుసాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట: పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి, పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు. వీడియోను మొబైల్లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు.. ఆ వీడియో వెనుక అసలు నిజాలు..⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. ⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. ⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. ⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు. ⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు. ⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చెప్పారు. ⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?⇒ నారా లోకేష్ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.దాడి చేసి.. రిగ్గింగ్202 పోలింగ్ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్ బూత్ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. –చింతా సుబ్బారావు, ఇన్చార్జి సర్పంచి,వైఎస్సార్సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..⇒ మాచర్ల రూరల్ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు ⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు ⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి ⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి ⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట ⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు. ⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. ⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. ⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. ⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. ⇒ చిలకలూరిపేట: అప్పాపురం -
ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్
సాక్షి, పల్నాడు: ఏపీలో ఎన్నికల సందర్బంగా ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశించింది.కాగా, ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో, వారిని కోర్టులో హాజరుపరచగా నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్ భయంతో పరారయ్యారు. -
TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్‌రాజ్ వివరించారు. 115 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు. వాతావరణం సహకరించడంతో.. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్ పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదైంది, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి గత లోక్‌సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. వందల కొద్దీ ఫిర్యాదులు పోలింగ్ రోజైన సోమవారం నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్‌కు 415, టోల్ ఫ్రీ నంబర్‌కు 21, సీ–విజిల్ యాప్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్‌లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం. మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు! ఓటేసేందుకు హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారులను పంపించివేస్తారు. ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్‌లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ బృందాలు.. రిసెప్షన్ సెంటర్‌కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, ప్రిసైడింగ్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. -
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్‌లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్ బూత్‌లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్‌లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది. -
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు. ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు. -
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌కు మహాయుతి కూటమి బారామతి లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
ఆ ఈవీఎంల వినియోగానికి హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి, కాంగ్రెస్ తరఫున వజ్రేష్‌యాదవ్ పోటీ చేశారు. 33 వేల మెజారిటీతో మల్లారెడ్డి విజయం సాధించారు. అయితే అఫిడవిట్లో మల్లారెడ్డి తప్పుడు సమాచా రం ఇచ్చారని.. నిర్ణీత ఫార్మాట్లో వివరాలన్నీ ఇవ్వలేదని ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వజ్రేష్ యాదవ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సమీప అభ్యర్థి అయిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఎన్నికల కమిష న్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వజ్రేష్ తరఫున న్యాయవాది సిర్థ పోగుల దాఖలు చేసిన పిటిష న్పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. ఎన్నికల కమిషన్, మేడ్చేల్ ఆర్డీవో, అసెంబ్లీ కార్యదర్శి, మల్లారెడ్డితో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు కారణంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్లను వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నోటీసులుజనగామ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్ఎస్) ఎన్నికను సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాపరెడ్డి(కాంగ్రెస్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమీప ప్రత్యర్థినైన తనను శాసనసభ్యుడిగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై కూడా న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. వాదన తర్వాత.. రాజేశ్వర్‌రెడ్డి సహా ఇతర ప్రతివా దులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూన్ 14కు వాయిదా వేశారు. -
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు. బెంగాల్లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.పశ్చిమబెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్‌లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు. -
ఈవీఎం వివాదం చల్లారేనా!
సార్వత్రిక ఎన్నికల రెండో దశ కూడా పూర్తికావస్తుండగా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వినియోగంపై వచ్చిన వ్యాజ్యాలను తోసిపుచ్చింది. విపక్షాలను విమర్శించటానికీ, ఆరోప ణలు సంధించటానికీ వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని ప్రధాని నరేంద్ర మోదీ... ఇంకా అయిదు దశల పోలింగ్ జరగాల్సిన తరుణంలో మౌనంగా ఎందుకుంటారు? అందుకే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టన్నారు. ఈవీఎంలపై సందేహాలు రేకెత్తించిన పాపానికి క్షమాపణలు చెప్పాలని కూడా మోదీ డిమాండ్ చేశారు. దేన్నయినా సందేహించటం దానికదే పాపం కాదు. పాపమే అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ సహా దాదాపు అందరికందరూ ఆ పాపం చేసినవారే. ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే పరాజితుల ప్రథమ కోపం ఎప్పుడూ ఈవీఎంలపైనే. వరసగా 2004, 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు బీజేపీ ఈవీఎంలనే తప్పుబట్టింది. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది. హ్యాకర్ల ద్వారా ఈవీఎంల సోర్స్ కోడ్ మార్చి అకాలీదళ్ తమ విజయాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఇక యూటర్న్ల సిద్ధ హస్తుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకైతే ఇలాంటి ఆరోపణలు మంచినీళ్లప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు ఈవీఎంలపైనే ఆయన ఆగ్రహం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినప్పుడు మాత్రం చప్పుడు చేయలేదు. మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాక ఈవీఎంలపై వీరంగం వేశారు. మధ్యలో ఈవీఎంలు దొంగిలించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి వాటిని తారుమారు చేయొచ్చని చూపించే ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబే. మళ్లీ ఎన్డీఏ పంచన చేరినందువల్ల ఈవీఎంల వివాదంపై ఇప్పుడాయన కిక్కురుమనటం లేదు. ఇతరుల మాటెలావున్నా ప్రస్తుతం ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేసిన సంస్థల్లో విశ్వసనీయతగల అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ కూడా వుంది. కనుక ఈవీఎంలను సందేహించటం స్వప్రయోజనాల కోసమేనని భావించలేం. అదో పెద్ద నేరంగా పరిగ ణించలేం. అలాగని పేపర్ బ్యాలెట్ విధానం సవ్యంగా సాగిందా? పోలింగ్ బూత్‌లు చేజిక్కించు కుని, బ్యాలెట్ పేపర్లు గుంజుకుని తమ గుర్తుపై ముద్రలు వేసుకుని పెత్తందారులు చెలరేగిపోలేదా? రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు రీపోలింగ్ జరపక తప్పలేదు! ఈవీఎంల వల్ల ఈ జాడ్యం ఎంతో కొంత కట్టడి అయింది. నిమిషానికి కేవలం అయిదు ఓట్లు మాత్రమే వాటిల్లో నమో దయ్యే అవకాశం వుండటం వల్ల పోలింగ్ కేంద్రాలు ఆక్రమించిన దుండగులకు గతంలోని వెసులు బాటు పోయింది.వెనువెంటనే బలగాలు ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవ కాశం వుండటం వల్ల వారి ఆటలు సాగటం లేదు. 1982లో తొలిసారి ఈవీఎంలతో కేరళలో ఒక ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే తగిన చట్టం లేకుండా ఈవీఎంల వినియోగం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. 1998లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కేవలం కొన్ని నియోజక వర్గాల్లో 45 ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలపై తరచు ఫిర్యాదులు వస్తున్నందువల్ల వాటికి ప్రింటర్లను అనుసంధానించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరిమితంగా దాన్ని అమలు చేసినా... ఆ తర్వాత కాలంలో వీవీ ప్యాట్ల పూర్తిస్థాయి వినియోగం మొదలైంది. ఓటరు తనకు నచ్చిన గుర్తుకు ఓటేసిన వెంటనే ప్రింటర్‌పై ఆ పార్టీ పేరు, గుర్తు ఏడు సెకన్లపాటు కనబడే ఏర్పాటుచేశారు. ఆ వెంటనే ఒక స్లిప్పై అది ప్రింటయి దానికి అనుసంధానించిన బాక్స్‌లో పడుతుంది. పోలింగ్ సమయంలోనైనా, కౌంటింగ్ సమయంలోనైనా ఈవీఎంలను దేనితోనూ అనుసంధానించటం సాధ్యంకాదని... రిమోట్ కంట్రోల్, బ్లూటూత్, వైఫైలతో నియంత్రించటం కూడా అసాధ్యమని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరు బెల్, హైదరాబాద్ ఈసీఐఎల్ వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. పోలింగ్‌కు ముందు ఈవీఎంల తనిఖీకి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. చిత్రమేమంటే ఈ ప్రక్రియపై ఓటర్లనుంచి ఎప్పుడూ ఫిర్యాదులు లేవు. ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ పేపర్‌కు మళ్లాలన్న వినతిని తోసిపుచ్చటంతోపాటు వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లే తీసుకునేలా, పరిశీలించుకున్నాక వారే బ్యాలెట్ బాక్స్‌లో వేసేలా చూడాలన్న కోరికను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈవీఎంల ద్వారా వెల్లడయ్యే ఓట్ల సంఖ్యనూ, వీవీప్యాట్ స్లిప్‌లనూ లెక్కించి రెండూ సరిపోలినప్పుడే ఫలితం ప్రకటించాలన్న పిటిషనర్ల వినతిని కూడా తిరస్కరించింది. అయితే పార్టీల గుర్తులను కంప్యూటర్ ద్వారా ఈవీఎంలలో లోడ్ చేయటానికి ఉప యోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను ఎన్నికల పిటిషన్లు పడిన సందర్భాల్లో పరిశీలించేందుకు అనువుగా 45 రోజులు భద్రపరచాలని ఆదేశించింది. అంటే ఇకపై ఈవీఎంలతో పాటు ఎస్ఎల్యూలు కూడా సీల్ చేసివుంచటం తప్పనిసరి. అలాగే రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఫిర్యాదుచేస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 5 శాతం ఈవీఎంలనూ, ఎస్ఎల్యూలనూ ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చు. అయితే ఫలితాలొచ్చిన ఏడు రోజుల్లో ఫిర్యాదులు చేయాలి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించే యంత్రాలు సమకూర్చుకునే ఆలోచన చేయాలని ఈసీని కోరింది. ఏదేమైనా బాహాటంగా బయట పడిన సంద ర్భాలుంటే తప్ప ఈవీఎంలపై అనవసర రాద్ధాంతానికి ముగింపు పలకటం అవసరం. ఇందుకు బదులు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవటం ఎలా అన్న అంశంపై పార్టీలు దృష్టి సారించాలి. -
ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తరవాత వాటిని 100శాతం లెక్కించాలంటూ పలువురు పిటిషన్లు వేశారు. అయితే ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ADR) పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను అన్నింటిని కలిపి మూడు రోజులపాటు విచారణ జరిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్. చివరకు.. పిటిషన్లు కొట్టేస్తూ ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇచ్చింది. ‘‘వీవీప్యాట్లు వందశాతం సరిపోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు.వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యమే. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సంశయవాదాన్ని పెంపొందిస్తుంది. అందుకే.. అర్థవంతమైన విమర్శలు అవసరం. అది న్యాయవ్యవస్థ అయినాసరే చట్ట సభలు అయినాసరే. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు. అనుమానాలతో ఈవిఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దు’’ అని జస్టిస్ దత్తా తీర్పు ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా ఈసీకి రెండు కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు 1. సింబల్ లోడింగ్ యూనిట్ ను సీల్ చేయాలి . అభ్యర్థులు వారి ప్రతినిధులు సంతకాలు దానిపై చేయాలి . ఈ యూనిట్ ను ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు భద్రంగా ఉంచాలి2. ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లో రెండు మూడో స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తే ఈవీఎంల వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వాలి. ఇంజనీర్ల ద్వారా ఐదు శాతం ఈవీఎంలను తనిఖీ చేయాలి. దీనికోసం అయ్యే ఖర్చును అభ్యర్థి భరించాలి. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని తేలితే ఖర్చు వెనక్కి ఇవ్వాలి. వెరిఫికేషన్ సమయంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ చూసే అవకాశం ఇవ్వాలి.వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది. రెండ్రోజుల వాదనలు ఇలా.. ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇక ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఏప్రిల్ 24వ తేదీ నాటికి సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. అయితే..తీర్పు ఇవ్వకుండా ట్విస్ట్అయితే ఏప్రిల్ 24వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించలేదు. ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లోనా? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని స్పష్టం చేసింది.ఈ విచారణ సందర్భంగా ఈవీఎమ్ సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించింది. ఇక ఈ ఉదయం(ఏప్రిల్ 26) అన్ని పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.వీవీప్యాట్ ఎందుకు?ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దఫ దఫాలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తూ వచ్చింది. -
వీవీప్యాట్ స్లిప్పుల క్రాస్‌చెక్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లలో వేసిన మొత్తం ఓట్ల వీవీప్యాట్ స్పిప్పులు వెరిఫై చేయాలని వేసిన పిటిషన్లపై బుధవారం(ఏప్రిల్24) మరోసారి విచారణ జరిపిన అత్యున్నత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగసంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఏ పనిచేయాలన్నది తాము సూచించలేమంది. ఎన్నికల్లో మొత్తం వీవీప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్‌పై సుప్రీంకోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఉన్న పలు సందేహాలపై న్యాయమూర్తులు ఈసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీర్పు రిజర్వు చేశారు. -
ఆ అనుమానాలు పోవాలంటే...
ఈవీఎంలతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని భారత ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ వీటిపై వస్తున్న సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమవుతోంది. ఎన్నికలు అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా! ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసుకునేందు సులువైన పరిష్కారం, వీవీప్యాట్ స్లిప్‌లను అందివ్వడం!! స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. నొక్కినదానికే పడిందని నిర్ధారించే వీవీప్యాట్ స్లిప్ వీరికి భౌతికంగా అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి, సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తూ (మార్చి 16, 2024) భారత ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ చాలా ధీమాగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లతో అక్రమాలకు పాల్పడటం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈవీఎంలన్నీ ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసినవని వివరించారు. ఈవీఎం వ్యవస్థలో బ్యాలెట్ యూనిట్,కంట్రోల్ యూనిట్‌తో పాటు, వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్) అనే మూడు భాగాలు ఉంటాయన్నది మనకు తెలుసు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అన్నది తెలుసు కునేందుకూ, ఈవీఎంలపై వస్తున్న అనుమానాల నివృత్తికీ వీవీ ప్యాట్లు కీలకమవుతాయి. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకోలా చెప్పాలంటే వీటిపై అనుమానాలు రేకెత్త డమే తప్పన్న చందంగా మాట్లాడుతోంది. ఈవీఎంల వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని, వీవీప్యాట్ స్లిప్పు లపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నది ఎన్నికల కమిషన్ వాదనగా ఉంది. నమ్మమంటే నమ్మాల్సిందేనా? ఈవీఎంల దుర్వినియోగం అసాధ్యమని సీఈసీ చెబుతున్నా ఓటర్లలో చాలామందికి ఆ నమ్మకమైతే లేదు. ఈవీఎంలపై సందేహాలు వద్దు అని చెప్పేందుకు సీఈసీ తానే రాసిన ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ఆరోపణలపై ఈవీఎంలే స్వయంగా స్పందిస్తే ఎలా ఉంటుందో వివరించారు. ‘‘తీరని కోరికలకు అన్ని వేళల్లో అందరిపై దూషించడం సరికాదు. మీరేంటో మీరే నిరూపించుకోలేనప్పుడే ఈవీఎంలపై తప్పు మోపుతారు’’ అన్నారు. ఈవీఎంల దుర్వినియోగం ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడం, ‘తీరని కోరికలు’గా అభివర్ణించడంతోనే ఈవీఎంలు విశ్వసనీయ మైనవి అయిపోవు. ఎన్నికలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ బాధ్యత పూర్తయినట్టూ కాదు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని కోరుతున్నది ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ పార్టీలు, ఈవీఎం నిపుణులు. ఈవీఎంల విషయంలో పారదర్శకత లేదనీ, వాటిని నమ్మలేమనీ వీరందరూ పలు సందర్భాల్లో ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ చేయలేదు. ఈ ధోరణి అనుమానాలు మరిన్ని రెకెత్తేలా చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దేశంలో పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సంఖ్యలను అస్సలు ప్రశ్నించకూడ దన్నట్టుగా ఉంది ఎన్నికల కమిషన్ ధోరణి. దేశ జనాభాలో 11 శాతం మంది మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారనీ, గడచిన తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారనీ నీతి ఆయోగ్ చెబుతోంది. పారదర్శకత ఏమాత్రం లేని నేపథ్యంలో ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ ఈవీఎంలపై చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న భరోసాలను ఎలా నమ్మగలరు? ఎన్నికలు అందరి వ్యవహారం... ఓటర్లు వేసిన ఓటును మార్చి చూపే అవకాశం కానీ, ఈవీఎంలు తప్పులు చేయడం కానీ అసాధ్యమని ఎన్నికల కమిషన్(ఈసీ) చెబు తోంది. కానీ చాలా కారణాల వల్ల అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈవీఎంలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు సంబంధించి 2019 సాధారణ ఎన్నికల్లో సుమారు 373 నియో జకవర్గాల గణాంకాల్లో తీవ్రమైన తేడాలున్నట్లు ‘ద క్వింట్’ వెబ్సైట్ గుర్తించింది. ఈ విషయంపై సీఈసీ, ఈసీ స్పందన నాస్తి. ఎన్నికల తరువాత ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే, ఆరోపణలు చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. తద్వారా మాత్రమే అది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్న భరోసా సామాన్యుడికి ఇవ్వగలదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మాత్రమే ఈవీఎంల విశ్వసనీ యతపై సందేహాలు లేవనెత్తుతారు అని సీఈసీ చేసిన వ్యాఖ్య రెండు విషయాలను సూచిస్తుంది. మొదటిది... ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు శ్రమ చేయని వారు చెప్పే కుంటిసాకు అని చెప్పే ప్రయత్నం. రెండోది... ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు మాత్రమే పరిమితమని చెప్పడం. రెండూ తప్పే. ప్రజాస్వామ్యంలో సర్వాధికారి పౌరుడే. ఈ ప్రజాస్వామ్య సర్వాధికారి సార్వభౌమత్వాన్ని తనకు నచ్చిన వ్యక్తికి దఖలు పరచడమే ఓటింగ్. ఈ పని జరగాలంటే ఎన్నికలు, ఓటింగ్ వ్యవస్థ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి ఉండాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, అక్రమాలకు తావు లేకుండా జరగడమే కాదు... అలా జరిగినట్లు కనిపించాలి కూడా. అంతేకాదు... తాము వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా ఓటరుకు స్పష్టంగా తెలిసేలా ఉండాలి. ఓటింగ్, లెక్కింపు వ్యవస్థలు రెండూ కూడా ఓటరు ఎవరికి ఓటేశారో వారికే ఓటు పడిందని ధ్రువీకరించేలా పనిచేయాలి. వేసిన వెంటనే రికార్డు కావాలి. రికార్డు అయిన విధంగానే లెక్క కూడా తేలాలి. ఈవీఎం యంత్రాలపై ఈసీ నిఘా అనేది రెండు కారణాల వల్ల అంత నమ్మదగ్గదిగా అనిపించదు. మొదటిది ఈవీఎం యంత్రాలను ప్రభావితం చేయగలమని, లేదా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేలా చేయగలమన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈసీ తగినంతగా ప్రయత్నించకపోవడం;ఓటర్లు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల్లో ఈసీ విశ్వసనీయత అనేది అతి నిమ్న స్థాయికి చేరడం. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వివక్ష లేకుండా ఎన్నికల కోడ్‌ను అమలు చేయలేకపోవడం వాటిల్లో ఒకటి మాత్రమే. ఈవీఎంలు సక్రమంగా పనిచేయవు అనేందుకూ, నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోవచ్చు అనేందుకూ ఆధారాలు లేవు. అక్రమాలు జరిగే అవకాశం ఉన్నంతమాత్రాన జరిగినట్టూ కాదు. కానీ సాక్ష్యం లేకపోవడం అన్నది సంఘటనే జరగకపోవడం కాదు. వీవీప్యాట్ స్లిప్ ఇవ్వాలి! ఎన్నికల సమయంలో వ్యవస్థలు, వనరులన్నింటిపై పెత్తనం, అధికారం ఒక పార్టీదిగా ఉంటుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అనుమానాలు, ఆరోపణలు వస్తూంటాయి. ఈవీఎంల విషయంలో ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే... తమ ఓటు రికార్డు అయ్యిందా, లేదా అన్నది. ఈ ఆందోళనకు సులువైన పరిష్కారం ఉంది. ఓటర్లకు వీవీప్యాట్ స్లిప్‌లను అందివ్వడం. ఓటరు తాను అనుకున్న పార్టీకే ఓటు పడిందని నిర్ధారించుకుంటే ఆ స్లిప్‌ను బాక్స్‌లో మళ్లీ వేస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే... ఓటర్లు ఓ బటన్ ను నొక్కడం ద్వారా ఓటేస్తారు. ఆ తరువాత వీరికి భౌతికంగా వీవీప్యాట్ స్లిప్ అందుతుంది. ఓటరు ఈ స్లిప్‌ను సరి చూసుకుని మళ్లీ వీవీప్యాట్ బాక్స్‌లో వేయాలి. దీనివల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డు అవుతాయి. రెండింటినీ లెక్కించి సరి చూసిన తరువాత ఫలితాలు ప్రకటించాలి. గత ఏడాది డిసెంబరులో ఇండియా కూటమి కూడా ఇదే సూచన చేసింది. సుప్రీంకోర్టు విచా రణలోని అంశాల్లోనూ ఇది ఉంది. వీవీప్యాట్ స్లిప్స్‌ను లెక్కించి ఫలితాలను ప్రకటించడం వల్ల ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరగవచ్చు కానీ... ఏడు దశల్లో నెలన్నర పాటు ఎన్నికలు జరగ్గా కానీ జాప్యం ఒకట్రెండు రోజులు ఫలితాలు వెల్లడించేందుకు అయితే నష్టమేమీ ఉండదు. ఎ ఎల్ ఐ చౌగులే వ్యాసకర్త ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
‘400 మందితో నామినేషన్ వేయిస్తా’
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించే మార్గాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. రాజ్‌గఢ్‌లోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను ఇక్కడి నుంచి 400 మంది నామినేషన్లు వేసేలా కృషి చేస్తున్నానని, తద్వారా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. రాజ్‌గఢ్‌లోని కచ్నారియా గ్రామంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మీరు కోరుకుంటే ఒక మార్గం ఉంది . ఒక స్థానం నుండి 400 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు . దానికి నేను సిద్ధమవుతున్నాను’ అన్నారు. పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ వివరాలను కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. "రిజర్వ్డ్ కేటగిరీకి చెందని వారు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు రూ. 12,500 డిపాజిట్ చేయాలి. ఇది దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగే ఒక సీటుకు దారి తీస్తుంది" అని చెప్పారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో విసిగిపోయారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంపై దిగ్విజయ్ సింగ్ గతంలోనే అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలపై 2018లోనే ఏఐసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో దిగ్విజయ్ సింగ్ ఏఎన్ఐతో అన్నారు. -
అసెంబ్లీల వారీగా ఈవీఎంల తరలింపు
వేలూరు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వేలూరు లోక్‌సభ నియోజవర్గంలోని పోలింగ్ సెంటర్లకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం మిషన్లను తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లోని గోడౌన్లో ఈవీఎం మిషన్లను భద్ర పరిచారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో గోడౌన్లో సిద్ధంగా ఉంచిన ఈవీఎంలను వేలూరు జిల్లాలోని మొ త్తం ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు కలెక్టర్, ఎన్నికల అధికారి సుబ్బులక్ష్మి అధ్యక్షతన గురు వారం ఉదయం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందుగా ఈ ఈవీఎం మిషన్ల గోడౌన్‌ను పరిశీలించారు. వేలూరు జిల్లాలోని మొత్తం 1,303 పోలింగ్ కేంద్రాలకు గాను 1,561 ఈవీఎం మిషన్లు, 1,561 కంట్రోల్ మిషన్లు, వీవీ ప్యాడ్ వంటి వాటిని తరలించారు. ఈవీఎం మిషన్లను ఆయా అసెంబ్లీ స్థానాల్లోని తాలుకా కేంద్రాల్లో ప్రత్యేక గదిలో ఉంచి, సీల్ వేయనున్నట్లు తెలిపారు. ఆ గదులకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారుల వద్ద పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. -
‘‘ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రధాని అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత పక్కాగా చెప్పగలుగుతున్నారంటే ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని అధిర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకు ఈవీఎంల గోల్‌మాల్‌పై మాకు కచ్చితమైన సమాచారం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో ప్రధాని అంత పక్కాగా చెప్పడం చూస్తుంటే ఈవీఎంలలో ఏవో రహస్యాలు దాగి ఉన్నాయనిపిస్తోంది. కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్లే బీజేపీకి 370 సీట్లు వచ్చాయని వాళ్లు ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. ఒక వ్యవస్థ తర్వాత మరొక వ్యవస్థను బీజేపీ కబ్జా చేసింది. ఈ దేశంలో ఎన్నికలను కూడా ఒక తమాషాలా తయారు చేశారన్న భావన కలుగుతోంది’ అని అధిర్ అన్నారు. #WATCH | On PM Modi's statement "370 to BJP, 400 to NDA", Congress MP AR Chowdhury says, "...Lagta hai ki EVM mein Modi ji ka koi haath chalega..." pic.twitter.com/0KK3AEEIiZ — ANI (@ANI) February 6, 2024 ఇదీచదవండి.. క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి -
'ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదు'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ — digvijaya singh (@digvijaya_28) December 5, 2023 మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె!
ఎన్నికలు.. ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు మాత్రమే పాల్గొనే నిశబ్ధ యుద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణలో అర్హత లేని నేతల్ని ఓడించేందుకు.. అర్హత ఉంటే మళ్లీ ఎన్నుకునేందుకు అదికూడా ఐదేళ్లకొకసారి దొరికే అవకాశం ఎలక్షన్స్. అందుకే ఆ అవకాశం వదులుకోకుండా ఓటేసి బాధ్యత నెరవేర్చుకోవాల్సిన అవసరం ప్రతీ పౌరుడికీ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి భారీగా కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అందులో 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటేసేందుకు సిద్ధమైన వాళ్లు దాదాపు 10 లక్షలుకాగా.. మిగతా వాళ్లు మరో ఏడు లక్షలు ఉన్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ కోసం సర్వం సిద్ధమైన వేళ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈవీఎంలపై ఓటు ఎలా వేయాలి? సరైన ఓటు వేశామా? లేదా? అనేది ఎలా నిర్ధారించుకోవాలి.. ఒకవేళ పొరపాటు జరిగితే ఏం చేయాలి.. ఆ విషయాలన్నీ ఈ కథనంలో.. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు.. పోలింగ్ కేంద్రాల వద్ద తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలి. పార్టీల గుర్తులు, పార్టీలను ప్రతిబింబించే రంగుల దుస్తులు.. కండువాలు.. టోపీలు ధరించొద్దు. అలాగే పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఓటేసేందుకు లోనికి వెళ్లాక.. బూత్ లోపలికి సెల్ఫోన్లు, ఇతర డివైజ్‌లు(పరికరాలు) తీసుకెళ్లకూడదు. అలాగే.. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి. ఓటు హక్కు ఉండి ఓటర్ కార్డు లేకున్నా.. కింద ఉన్నవాటిల్లో ఏదో ఒక కార్డుతో వెళ్లి ఓటేయొచ్చు ఆధార్‌కార్డు బ్యాంక్ పాస్‌బుక్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్‌పోర్ట్ పెన్షన్ కార్డు(ఫొటో తప్పనిసరి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే సర్వీస్ ఐడీ కార్డులు ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినప్పుడు ముగ్గురు అధికారులు ఉంటారు. ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్‌లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాతే ఓటరు.. పోల్ చీటీ తీసుకుని కంట్రోల్ యూనిట్ (సీయూ)లోపలికి వెళ్లి ఓటు వేయాలి. అక్కడ ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తును ప్రెస్ చేస్తే ఓటేసినట్లు లెక్క. ఇంతకీ మనం వేసిన ఓటు పడిందా? లేదా? పడితే మనం వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా? ఎలా తెలుసుకోవడం.. ఇందుకోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చేయడంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఓటేసే టైంలో.. సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, దానిని బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దశలవారీగా వీవీ ప్యాట్ విధానాన్ని అమలు చేస్తూ వస్తోంది. తెలంగాణలో వీవీ ప్యాట్ విధానం అమలు చేయడంతో ఇది రెండోసారి. ఫిర్యాదులు కూడా.. ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. ఓటరు ఒకరికి ఓటు వేస్తే మరొక అభ్యర్ధికి ఓటేసినట్టుగా రికార్డు అయినా.. బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థి/ పార్టీ గుర్తును తప్పుగా చూపితే.. లేదంటే ఓటు ఒకరికి బదులు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ కేంద్రంలో ఉండే ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల కమిషన్ రూల్స్ 1961.. 49 ఎంఏ ప్రకారం ప్రిసైడింగ్ అధికారికి ఓటరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లేదంటే టోల్‌ఫ్రీ నెంబర్లు 1950, సీ-విజిల్ యాప్ లేదంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ఓటు విషయంలో నష్టం జరిగిందని భావిస్తే.. న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించొచ్చు. ఇలా జరుగుతుంది.. ఈ విషయమై టెస్ట్ ఓటు వేసేందుకు ఓటరును అనుమతిస్తారు. ఒకవేళ ఓటరు చెప్పేది తప్పుడు సమాచారమని తేలితే దాని పరిణామాల గురించి కూడా వివరిస్తారు. ఓటరు చెప్పిన సమాచారం వాస్తవమని నిరూపించేందుకు టెస్ట్ ఓటు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజంట్ల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఓటరు చెప్పినట్టుగా ఒక సింబల్ బటన్ నొక్కితే మరో సింబల్ గా రికార్డైతే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఈ సమాచారాన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారి నివేదిస్తారు. ఈ సమయంలో పోలింగ్ ను నిలిపివేస్తారు. ఆపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈ ఆరోపణ తప్పని తేలితే ప్రిసైడింగ్ అధికారి ఫారం 17 ఏలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. -
ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది?
మనదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఓటింగ్ కోసం ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేస్తారు. అయితే ఓటింగ్ సమయంలో ఎవరైనా ఈవీఎం బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, ఆ తర్వాత డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో వేలాది ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇవి ముందుగానే సిద్ధం చేయనున్నారు. ఎన్నికల తేదీకి ముందు ఈ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటరు ఎవరైనా ఈవీఎంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకేసారి అనేక బటన్లను నొక్కితే ఏమవుతుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. రెండు వేర్వేరు గుర్తులు ఉన్న బటన్లను నొక్కి. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక ఓటు వేసిన తర్వాత ఏ బటన్ నొక్కినా ఆ యంత్రంలో ఎటువంటి స్పందన చోటుచేసుకోదు. ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధిత బటన్‌ను నొక్కిన వెంటనే, ఆ ఓటు నమోదువుతుంది. దీని తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. ఎవరైనా మళ్లీ ఆ బటన్ నొక్కినా ఏమీ జరగదు. ఎవరైనా మరో బటన్ నొక్కినా ఓటు నమోదు కాదు. ఒకరికి ఒక ఓటు అనే ప్రాతిపదికన ఈవీఎంలను తయారు చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి బటన్ ప్రెస్ చేసిన తరువాతనే రెండవ ఓటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదు. ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం? -
వీడియో: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
-
కర్ణాటక: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలెట్ యూనిట్లను డ్యామేజ్ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్, బాలెట్ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్లు ధ్వంసం చేశారని తెలిపింది. -
Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్
Live Updates: ► ఈసారి కర్ణాటక ఓటరు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా వరుసగా సెకండ్ ఛాన్స్ ఏపార్టీకి ఇవ్వలేదు కన్నడ ఓటర్లు. అయితే.. గత సంప్రదాయం ప్రకారమే ఈసారి ఎన్నికలతో ప్రభుత్వాన్ని మారుస్తారా? లేదంటే 38 ఏళ్ల సంప్రదాయాన్ని బద్దలు కొట్టి వరుసగా రెండోసారి అదే ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తారా?.. అనేది 13వ తేదీన కౌంటింగ్‌తో తేలనుంది. ► కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. 2018లో నమోదు అయిన పోలింగ్ శాతం 72.13. ఇక ఈసారి ఎంత నమోదు అయ్యిందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ► కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే.. ఆరు గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ.. క్యూ లైన్లో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు. చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. ► సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుంది. అయితే, క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. 65.69% voter turnout recorded till 5 pm, in #KarnatakaElections pic.twitter.com/PH6R2LYtAP — ANI (@ANI) May 10, 2023 ► కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ సాయంత్రం ఆరు గంటలదాకా జరగనుంది. కాబట్టి.. సాయంత్రం 6గం.30ని.. తర్వాతే ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాలని ఈసీ ఆదేశించింది. దీంతో కన్నడనాటతో పాటు మొత్తం మీడియాలో అరగంట పాటు నిశ్శబ్ధం(సైలెన్స్ పీరియడ్) నెలకొనుంది. ఆ అరగంట కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన చర్చలు సైతం జరగకూడదని స్పష్టం చేసింది ఈసీ. ► మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం ఓటింగ్ నమోదు. ► నటుడు కిచ్చా సుదీప్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుదీప్ బెంగళూరులో ఓటు వేశారు. ఈ సందర్బంగా సుదీప్ మాట్లాడుతూ.. నేను సెలబ్రెటిగా ఇక్కడకు రాలేదు. భారతీయుడిగా ఇక్కడకు వచ్చాను. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. సమస్యలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ఓటు వేయాలన్నారు. ► ఓటు వేసిన మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ. ఆయన స్వగ్రామైన హసన్ జిల్లాలోని హరధనహల్లిలో దేవేగౌడ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదొక చిన్న గ్రామం. సర్వతోముఖాభివృద్ధి జరిగింది. ఆ ఘనత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్డి రేవణ్ణకే దక్కాలి అని అన్నారు. #WATCH | "It's a small village. All round development has taken place. Credit should go to HD Revanna, who represents this constituency," says JD(S) chief and former Prime Minister HD Devegowda after casting his vote at his native village Haradanahalli in Hassan district… pic.twitter.com/FOSPR1ldBm — ANI (@ANI) May 10, 2023 ► మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.25 శాతం ఓటింగ్ నమోదు. ►కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ తన సతీమణి, కాంగ్రెస్ నేత గీతా శివరాజ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా ప్రముఖ కన్నడ నటుడు రవిచంద్రన్ కుమారులు మనోరంజన్, విక్రమ్ కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేశారు #WATCH | Kannada actor Shiva Rajkumar and his wife and Congress leader Geetha Shivarajkumar cast their votes for #KarnatakaElections pic.twitter.com/pLq8RKCIBM — ANI (@ANI) May 10, 2023 #WATCH | Sons of veteran Kannada actor Ravichandran - Manoranjan and Vikram cast their votes in #KarnatakaElections. pic.twitter.com/tmjJVPzfOj — ANI (@ANI) May 10, 2023 ►కర్ణాటక ఎన్నికల సందర్భంగా.. తన నియోజకవర్గంలో ఆటో నడిపిన డీకే శివ కుమార్. #WATCH | #KarnatakaElections | Karnataka Congress president and party's candidate from Kanakpura, DK Shivakumar drives an auto in the constituency. pic.twitter.com/pPxoaEZBdi — ANI (@ANI) May 10, 2023 ► కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తన భార్య రాధాభాయితో కలిసి గుల్బర్గా పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #KarnatakaElections | Congress national president Mallikarjun Kharge and his wife Radhabai Kharge cast their votes at a polling booth in Kalaburagi. pic.twitter.com/Z6BH4uqwyY — ANI (@ANI) May 10, 2023 ►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.99% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ►కన్నడ నటుడు డాలీ ధనంజయ తన కుటుంబంతో కలిసి అర్సికెరెలోని కాలేనహళ్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #KarnatakaElections | Kannada actor Daali Dhananjaya and his family cast their votes in Kalenahalli Village of Arsikere. pic.twitter.com/dTOywG0Eud — ANI (@ANI) May 10, 2023 ►‘కాంతార’ ఫేమ్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఓటు వేశారు. కర్ణాటక అత్యుత్తమ భవిష్యత్తు కోసం తాను ఓటేశానని.. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. ►బుధవారం రోజే పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు తమ కుటుంబంతో కలిసి మైసూరులోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ►కర్ణాటక ఎన్నికల్లో జేడీజేపీ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తమ కుటుంబ సమేతంగా ఓటు వేశారు. రామనగర పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. Former Karnataka CM & JDS leader HD Kumaraswamy, along with his family, casts his vote for #KarnatakaAssemblyElection2023, at a polling booth in Ramanagara pic.twitter.com/hsRtcNxcaB — ANI (@ANI) May 10, 2023 ► కన్నడ నటుడు ఉపేంద్ర బెంగుళూరులోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Actor Upendra Rao casts his vote for #KarnatakaElections2023, at a polling booth in Bengaluru pic.twitter.com/tqSbieqyot — ANI (@ANI) May 10, 2023 ► సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ #WATCH | "No chances, we will form the government on our own," says Karnataka Congress president DK Shivakumar when asked about the possibilities of a post-poll alliance with JDS pic.twitter.com/jQGowmgaZT — ANI (@ANI) May 10, 2023 ఆకట్టుకుంటున్న ‘సఖి పోలింగ్ కేంద్రాలు’ ►మహిళా సాధికారతకు చిహ్నంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘సఖి బూత్’లను ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 996 పోలింగ్ కేంద్రాల్లో మహిళా అధికారులు, సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తారు. గ్యాస్ సిలిడర్కు పూజలు ►కర్ణాటక ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వినూత్నంగా నిరసన చేపట్టింది. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసి అగరబత్తీలు వెలిగించారు. #WATCH | Congress workers garland an LPG gas cylinder and burn incense sticks near it, in Bengaluru's Rajarajeshwari Nagar area#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/f3v8XBwswS — ANI (@ANI) May 10, 2023 ► కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | #KarnatakaAssemblyElection2023 | Senior Karnataka BJP leader KS Eshwarappa casts his vote at a polling booth in Shivamogga. pic.twitter.com/JBzvEKLad4 — ANI (@ANI) May 10, 2023 రాజకీయాలను వీడను ► కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ఓటేశారు. ఆయన మాట్లాడుతూ.. 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. పనిచేసే పార్టీకి ఓటు వేయలని సూచించారు. ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తు ఇమిడి ఉందన్నారు. ‘నేను రాజకీయాలను వీడను.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయను. ఇవే నా చివరి ఎన్నికలు’ అని అన్నారు. #WATCH | Former Karnataka CM and Congress candidate from Varuna constituency, Siddaramaiah casts his vote for #KarnatakaElection pic.twitter.com/SPjUIzCOcF — ANI (@ANI) May 10, 2023 "I request the voters to vote for the party which works. The future of this country is also involved in this election," says Former Karnataka CM and Congress leader Siddaramaiah pic.twitter.com/heX4HuGCI2 — ANI (@ANI) May 10, 2023 ► కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా హెబ్బల్ నియోజకవర్గంలో ఓటు వేశారు. #WATCH | Karnataka Chief Electoral Officer Manoj Kumar Meena casts his vote at Hebbal constituency#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/ateaP2f85M — ANI (@ANI) May 10, 2023 ► కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థిగా మారిన బీజేపీ తిరుగుబాటు నేత జగదీష్ శెట్టర్ హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నియోజక వర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు. అన్ని వయసు, వర్గాల వారు తమకు ఓటు వేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. Jagadish Shettar, former Karnataka CM and Congress candidate from Hubli-Dharwad Central Assembly constituency cast his vote for #KarnatakaAssemblyElection2023 pic.twitter.com/3QwDbltzAf — ANI (@ANI) May 10, 2023 ►కర్ణాటకలో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భార్య ధీమా వ్యక్తం చేశారు. తన భర్త గెలుస్తారని వందశాతం నమ్మకం ఉందన్నారు. కేరళ స్టోరీ కర్ణాటకలో ఏమాత్రం ప్రభావం చూపలేదని అన్నారు. కాంగ్రెస్ ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. #WATCH | "I am 100% that my husband will win. Congress govt will come. It (The Kerala Story) will not have any effect in Karnataka. I appeal to people to vote for Congress," says wife of Karnataka Congress president DK Shivakumar#KarnatakaElections pic.twitter.com/tYNDK0jwIC — ANI (@ANI) May 10, 2023 ►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 10 గంటల వరకు 13 శాతం ఓటింగ్ నమోదైంది. #WATCH | #KarnatakaElections | Karnataka Congress president and party's candidate from Kanakapura, DK Shivakumar offers prayers at Sri Kenkeramma Temple in Kanakapura, Ramanagara. His brother and party MP DK Suresh is also with him. pic.twitter.com/mWII5XkgMJ — ANI (@ANI) May 10, 2023 ►కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనక్పురలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనతో పాటు ఆయన సోదురడు కూడా ఉన్నారు. #WATCH | Union Minister and BJP MP from Dharwad constituency, Pralhad Joshi, arrives at a polling booth in Hubballi to cast his vote for #KarnatakaAssemblyElection2023 "I'm happy that people are celebrating this festival of democracy in a big way. People are interested to bring… pic.twitter.com/dKzm3o6va8 — ANI (@ANI) May 10, 2023 ►కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్బలిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ► ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లంతా కచ్చితంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వం చేసే పనులను విమర్శించడం లేదా అభినందించే హక్కు ఉంటుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు. #WATCH | Jayanagar, Bengaluru | Sudha Murty gives a message to young voters after casting her vote; says, "Please look at us. We are oldies but we get up at 6 o'clock, come here and vote. Please learn from us. Voting is a sacred part of democracy..."#KarnatakaElections pic.twitter.com/B1ecZCH93M — ANI (@ANI) May 10, 2023 "First, we vote and then we can say this is good, this is not good but if we don't do that then we don't have the right to criticise," says Infosys founder Narayana Murthy after casting his vote in Bengaluru#KarnatakaElections pic.twitter.com/BAuZXKUzVs — ANI (@ANI) May 10, 2023 ► కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షిమోగలో ఓటు వేయడానికి ముందు పూజలు జరిపి కుమారులిద్దరితో కలిసి ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు విజయేంద్ర భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ► కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుబ్లీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH | Karnataka CM Basavaraj Bommai offered prayers at a Hanuman temple in Hubbali as voting continues across the state. He is contesting as a BJP candidate from Shiggaon assembly constituency.#KarnatakaElections pic.twitter.com/LGbOwJ1MWE — ANI (@ANI) May 10, 2023 ► సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ 80 సంవత్సరాలు దాటిన వారు ఉండగా, 17 వేల మంది 100 సంవత్సరాలు పైబడిన వారున్నారు. ► 5.55 లక్షల మంది ఓటర్లు అంగవైకల్యం ఉన్నటువంటి వారు ఉన్నారు. ► కర్ణాటకలో 2.62 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు తమ ఓటర్లున్నారు. ► ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు. #WATCH | Actor Prakash Raj arrives at polling booth in St. Joseph's School in Shanti Nagar, Bengaluru to cast his vote for #KarnatakaAssemblyElection pic.twitter.com/DsYgbc3ko3 — ANI (@ANI) May 10, 2023 ► గాలి జనార్ధన్ రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ (KRPP) ఉత్తర కర్ణాటకలో 47 స్థానాల్లో పోటీకి దిగింది. బళ్లారి పరిసర ప్రాంతాల్లో గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ కీలకంగా మారింది. ► బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి, బళ్లారి సిటీ నియోజకవర్గ కేఆర్పీపీ పార్టీ అభ్యర్థి గాలి లక్ష్మి అరుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కర్ణాటక ఎన్నికల్లో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయ నగర్ బీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమే ఓటు వేశారు. #WATCH | Union Finance Minister & BJP leader Nirmala Sitharaman arrives at a polling booth in Bengaluru to cast her vote.#KarnatakaElections pic.twitter.com/E8zdPRZCBT — ANI (@ANI) May 10, 2023 ► ఓటర్లు సులభంగా పోలింగ్ బూత్‌ను గుర్తించేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. చునావనా (chunavana) మొబైల్ అప్లికేషన్ ద్వారా పోలింగ్ స్టేషన్లు గుర్తించేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ► ఎలక్షన్స్ సాఫీగా సాగేందుకు పోలింగ్ బూతుల వద్ద అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశామని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) మనోజ్ కుమార్ మీనా తెలిపారు. ► 38 రోజులపాటు ప్రధాన రాజకీయా పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ రాష్ట్రంలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ► కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం భిన్న శైలిలో సాగింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఓటర్లను ఆకర్షించడానికి వారు చెరో మార్గం అనుసరించారు. ► శని, ఆదివారాల్లో అట్టహాసంగా మోదీ 30 కిలోమీటర్లకు పైగా భారీ రోడ్ షోలు నిర్వహిస్తే, రాహుల్ మాత్రం సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోతూ ప్రచారం చేశారు. ► మోదీ జేపీ నగర్ నుంచి మల్లేశ్వరం వరకు 26 కి.మీ. పొడవునా, న్యూ తిప్పసంద్ర రోడ్డు నుంచి ట్రినిటి సర్కిల్ దాకా 6.5 కి.మీ. మే చేసిన రోడ్ షోలకు జనం పోటెత్తారు. ► రాహుల్ మాత్రం ఆది, సోమవారాల్లో రాజధాని జనంలో కలిసిపోయి ప్రచారం చేశారు. ఫుడ్ డెలివరీ బోయ్తో పాటు అతని మోటార్ సైకిల్‌పై ప్రయాణించారు. ► రాష్ట్రంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ మనవిచేశారు. మొత్తం 5.3 కోట్లు ఓటర్లు అందరూ ఓటు వేయాలని ఆయన కోరారు. దేశ ఐటీ రాజధానిలో యువ, నగర ఓటర్లు ప్రజాప్రభుత్వ పండుగలో చురుకుగా పాల్గొనాలని, ఓటేసే వృద్ధులను స్ఫూర్తిగా తీసుకుని యువత కదలాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్దే ఓటు వేసిన వృద్ధులు, దివ్యాంగులను అభినందించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం అన్ని సౌలభ్యాలను కల్పించామన్నారు. (చదవండి: నువ్వా-నేనా! రాహుల్ అలా.. మోదీ ఇలా.. ప్రచారంలో ఎవరికి వారే భిన్న శైలి) ► బెంగళూరులో జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు నగర జిల్లాలో మొత్తం 8,802 పోలింగ్ కేంద్రాలు ఉండగా సుమారు 36 వేల మంది పోలింగ్ అధికారులను నియమించామని, అదనంగా 20 శాతం మంది సిబ్బందిని కేటాయించామని తెలిపారు. ► విధానసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మే 10వ తేదీ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్ల సంచారాన్ని పొడిగించారు. బయ్యప్పనహళ్లి, కెంగేరి, నాగసంద్ర పట్టు సంస్థ, కృష్ణరాజపుర, వైట్‌ఫీల్డ్ మార్గంలో 12.5 గంటల వరకు రైళ్ల రాకపోకలు ఉంటాయి. మెజిస్టిక్ నుంచి ఆఖరి రైలు రాత్రి 12.35 గంటలకు బయ్యప్పనహళ్లి, కెంగేరి, నాగసంద్ర పట్టు సంస్థ వరకు ప్రయాణిస్తుంది. ► కాంగ్రెస్, బీజేపీ జేడీఎస్ మధ్యే ప్రధాన పోటీ. ముమ్మరంగా ప్రచారం చేసిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ. భారీ రోడ్ షోలతో జనంతో మమేకమైన నేతలు. ► 224 అసెంబ్లీ స్థానాలకు పోటీపడుతున్న 2,165 మంది అభ్యర్థులు. కర్ణాటకలో మొత్తం 5.31 కోట్ల మంది ఓటర్లున్నారు. ► ఈనెల 13 న ఎన్నికలు ఫలితాలు వెలువడనున్నాయి. సాక్షి, బెంగళూరు: దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఇతరత్రా ఎన్నికల సామగ్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 లోపల పోలింగ్ బూత్ దగ్గర క్యూలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. తెల్లవారుజామున 5.30 కు సిబ్బందిచే నమూనా పోలింగ్ జరిగింది. నమూనా పోలింగ్ సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 776 సునిశిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా పెట్టింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. 84,119 మంది పోలీసులను ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లోకి తీసుకుంది. (చదవండి: దుఃఖాన్ని దిగమింగి బందోబస్తు విధులకు) -
నేడు జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తెరవనున్న అధికారులు
-
ఈవీఎంలో పార్టీ గుర్తుల తొలగింపునకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎం, బ్యాలెట్లపై పార్టీ గుర్తులు నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హత, ఫొటోలు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ఆదేశించాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం విచారించింది. ఈవీఎంలో పార్టీ గుర్తులుండడంపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది. ఎన్నికలు పార్టీలతో ముడిపడి ఉంటాయని, పిటిషన్‌ను అంగీకరిస్తే అభ్యర్థి గెలిచాక పార్టీలు మారే ప్రమాదముందని పేర్కొంది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పార్టీల నీడలో అభ్యర్థులు ఉండడం వల్లే చట్టసభల సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. నేర చరిత్ర లేని వారికి పార్టీలు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పిటిషనర్ వాదనపై అటార్నీ జనరల్ వెంకట రమణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలో ఓటు వేయడానికి ముందుగానే ఓటర్లు తమ అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారని ఏజీ పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచన చేసింది. కోర్టు విచారణకు అంగీకరించని నేపథ్యంలో తాను ఈసీని ఆశ్రయిస్తాయని వికాస్ సింగ్ పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు. చదవండి: ఎన్నికల వేళ.. బీజేపీలో ముసలం -
సాక్షి కార్టూన్ 13-03-2022
అలాంటిది ఏదన్నా ఉంటే ముందు మన రాష్ట్రంలోనే ప్రయోగించే వాళ్లు మేడం! -
ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు
లక్నో: వాస్తవానికి స్ట్రాంగ్ రూమ్‌లో ఉండాల్సిన ఈవీఎంలను తరలిస్తున్న ఓ ట్రక్కును వారణాసి వద్ద అడ్డగించినట్లు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ తెలిపారు. మరో రెండు ట్రక్కులు తప్పించుకున్నాయన్నారు. అధికార బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వారణాసి ఎన్నికల అధికారులు మాత్రం.. ఆ ఈవీఎంలు శిక్షణ కోసం వాడేవని స్పష్టంచేశారు. అఖిలేశ్ ఆరోపణలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖండించారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునేందుకు వీలుగా అభ్యర్ధులందరికీ ఈసీ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. (చదవండి: మేయరైన ఆటోవాలా) -
హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం
సాక్షి, కరీంనగర్: ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంల సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అభ్యర్థుల ఫొటో, గుర్తులు ఉన్న ఈవీఎంను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతుందన్న అపోహ ఓటర్లతో పాటు నేతల్లో ఉండేది. ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు. ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపించడంతో ఓటరు సంతృప్తి చెందుతాడు.ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ద్వారా లెక్కించిన తరువాత వీవీప్యాట్‌లోని చీటీలను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్ ఈవీఎంలు మొరాయించినా.. ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానం కూడా సాధ్యం కాకపోతే వీవీప్యాట్ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్ చీటీలను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ల్లను అమర్చడం వల్ల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి అనుమానాలకు తావుండదు. చదవండి: Huzurabad By Election Results 2021: హుజూరాబాద్ తీర్పు నేడే ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ఈవీఎం గల్లంతవలేదని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఓ ఈవీఎంను అక్రమంగా తరలించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం, ఈవీఎంలు భద్రపరిచిన ఎస్ఆర్ ఆర్ కళాశాల వద్ద వీవీప్యాట్ యంత్రాన్ని బస్సు నుంచి కారులోకి మారుస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి అది ఈవీఎం కాదని, వీవీప్యాట్ యంత్రమని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్–200లో మాక్ పోలిం గ్ సమయంలో ఒక వీవీ ప్యాట్ యంత్రం పనిచేయలేదని, అందుకే రిజర్వ్‌లో ఉన్న మరో యంత్రాన్ని వినియోగించామని తెలిపారు. మొరాయించిన యంత్రాన్ని బస్సులో బందోబస్తు మధ్య కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించామన్నారు. అయితే అప్పటికే అక్కడ 150 బస్సులు పార్కు చే యడంతో స్థలాభావం వల్ల కాలేజీ ఆవరణకు ముం దే ఆ బస్సును నిలిపివేశారని తెలిపారు. సెక్టోరియ ల్ అధికారి సూచనల మేరకు ఆయన డ్రైవర్ వీవీప్యాట్ యంత్రాన్ని బస్సులోంచి కారులోకి మార్చా రని రవీందర్‌రెడ్డి వివరించారు. దీన్ని గుర్తుతెలి యని వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమా ల్లో తప్పుగా ప్రచారం చేశారన్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ జరుపుతున్నామని, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జమ్మికుంటలో ఈవీఎంలు తరలిస్తున్న బస్సు విషయంలోనూ వదం తులు వచ్చాయని విలేకరులు ప్రశ్నించగా బస్సు టైరు పంక్చర్ అయితే దాన్ని మార్చారే తప్ప ఈవీఎంలను మార్చలేదని రవీందర్‌రెడ్డి వివరించారు. రికార్డు స్థాయిలో పోలింగ్.. 135 కేసులు నమోదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.64% పోలింగ్ నమోదైందని ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 135 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే ఇందులో రాజకీయ నాయకులు, ఓటర్లు ఎందరో చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద విపక్షాల ధర్నా.. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద భద్రపరిచిన ఈవీఎంలను అధికారులు మార్చారని ఆరోపిస్తూ శనివారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అనుచరులతో కలసి కాలేజీ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ తులా శ్రీనివాసరావు.. బల్మూరి వెంకట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈవీఎంను కారులో ఎలా తరలిస్తారంటూ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఏసీపీ తుల శ్రీనివాసరావుతో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈవీఎంల తరలింపులో అక్రమాలు జరిగాయని, ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్వంలో బీజేపీ కార్యకర్తలు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక మండలాలు, కరీంనగర్ పట్టణంలోనూ బీజేపీ జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. -
అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా?
సాక్షి, కరీంనగర్: ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం. ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా.. పడగొట్టాలన్నా.. ఈ ఓటుతోనే సాధ్యం. దేశంలో 18సంవత్సరాలు నిండిన ప్రతీ భారతీయుడికి ఓటేయడం ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించే హక్కు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన చాలా ఏళ్ల వరకు బ్యాలెట్ (కాగితం)తోనే ప్రజలు ఓటు వేసేవారు. సాంకేతికతకు అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పులు వచ్చాయి. కాగితంతో లెక్కింపు, భద్రపరచడం తదితర కారణాలతో ఓటింగ్ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటుందని కేంద్రం గుర్తించింది. అందుకే, దేశంలో 1982 నుంచి ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈవీఎంలు అంటే ఏంటి? ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎంలు మొదటిసారిగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది కంట్రోల్ యూనిట్ కాగా, రెండవది బ్యాలెటింగ్ యూనిట్. కంట్రోల్, బ్యాలెటింగ్ యూనిట్లను ఒకేసారి కనెక్ట్ చేస్తారు. కంట్రోల్ యూనిట్ పోలింగ్ బూత్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. బ్యాలెటింగ్ యూనిట్లో ఓటర్లు ఓటు వేస్తారు. కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాలెట్ బటన్ పోలింగ్ బూత్ ఆఫీసర్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే బ్యాలెటింగ్ యూనిట్లో ఓటరు ఓటు వేయగలడు. చదవండి: ఈ విషయం తెలుసా..? టీఆర్ఎస్కు మూడు గుర్తులు ►ఒక్కసారి బ్యాలెట్ యూనిట్లో ఓటరు పక్కనున్న అభ్యర్థి బటన్ క్లిక్ చేయగానే లైట్ వెలుగుతుంది. వెంటనే బజర్ సౌండ్ వస్తుంది. తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. పోలింగ్ బూత్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్లో బటన్ ప్రెస్ చేస్తే తిరిగి ఓపెన్ అవుతుంది. ►ఈవీఎంలు నిమిషానికి ఐదు ఓట్లు మాత్రమే పరిమితం చేస్తాయి. ఈవీఎంలు 6 ఓల్ట్ అల్కాలైన్ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 క్యాండెట్స్‌ను ఉంచవచ్చు. అలా నాలుగు బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు. చదవండి: Huzurabad Bypoll: వీళ్లు అభ్యర్థులే కానీ ఇక్కడ ఓటేసుకోలేరు.. ►ఒక్క నియోజకవర్గంలో 64 మంది క్యాండెట్స్కే పరిమితం ఉంటుంది. ఒకవేళ 64 మందికి పైగా క్యాండెట్స్ ఉంటే ఆ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్క ఈవీఎం 3,840 ఓట్లను స్టోర్ చేస్తుంది. ఈవీఎంలు హాక్ అవ్వవు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సిలికాన్ చిప్‌లో ఉంచేస్తారు. ►ఈవీఎంలు అక్కడక్కడా టాంపరింగ్ అవుతున్నాయని వార్తలు రావడంతో ఎలక్షన్ కమిషన్ ఓటరు– వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్ (వీవీప్యాట్) అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఓటరు బ్యాలెటింగ్ యూనిట్ బటన్ నొక్కగానే దేనికి ఓటు వేశాడో ఒక పేపర్‌పైనే ప్రింట్ అవుతుంది. ఇది కొన్ని సెకన్లు ఉండి వెళ్లిపోతుంది. ఓటరు సరిగ్గా ఓటు వేశాడో లేదో చూసుకోవచ్చు. వీవీప్యాట్లు సీజ్ చేసి ఉంటాయి. ఈవీఎం టాంపరింగ్ అయిందని అనుమానం వస్తే వీవీప్యాట్‌లో ప్రింట్ అయిన ఓట్లను బ్యాలెట్ పేపర్‌లాగా లెక్కిస్తారు. ►ఈవీఎంలను మన దేశానికి చెందిన రెండు కంపెనీలు తయారు చేస్తాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) బెంగళూరు, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), హైదరాబాద్. ఈవీఎంలకు వాడే సాఫ్ట్వేర్ కోడ్ అందులో పనిచేసే ఇంజినీర్లకు మాత్రమే తెలుసు. ఈవీఎంలలో మూడు మోడల్స్ ఉన్నాయి. ►మొదటి మోడల్‌ను 1989–2006 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్ చేశారు. దీనిని 2014 ఎన్నికల్లో చివరిగా వినియోగించారు. రెండో మోడల్ 2006 నుంచి 2012 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్ చేశారు. మూడో మోడల్ 2013లో మ్యాన్ ఫ్యాక్చర్ చేయగా, ప్రస్తుతం దీనినే ఉపయోస్తున్నారు. ఇది ట్యాంపర్ ప్రూఫ్ మోడల్. ప్రతీ ఈవీఎం మ్యాన్‌ఫ్యాక్చర్ చేసిన తరువాత రాజకీయ పార్టీల ఎదుట చెక్ చేస్తారు. పోలింగ్ అయిపోయిన తరువాత కంట్రోల్ యూనిట్లో ఉన్న క్లోజ్ బటన్‌ను ప్రెస్ చేస్తారు. దీంతో ఈవీఎం సీల్ అవుతుంది. ►ఒక్కసారి మ్యాన్‌ఫ్యాక్చర్ చేసిన ఈవీఎంలను 15 సంవత్సరాల వరకు వినియోగిస్తారు. తరువాత ఈవీఎంలో చిప్స్‌ను ఎలక్షన్ ఆఫీసుకు అప్పగిస్తారు. -
Huzurabad Bypoll: వీళ్లు అభ్యర్థులే కానీ ఇక్కడ ఓటేసుకోలేరు..
సాక్షి, కరీంనగర్: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఈవీఎంకు అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్లోని థర్మల్ కాగితం 1500ల కాగితపు స్లిప్పులను మాత్రమే ముద్రించగలుగుతుంది. 22.5 వోల్టు బ్యాటరీతో పని చేసే వీవీప్యాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేసింది. తెలిపేందుకు వీవీ ప్యాట్లోని డిస్ప్లేలో ఓటరు స్లిప్ కనిపిస్తుంది. అయితే ఇందులో 100వరకు కాగితపు స్లిప్పులు పోలింగ్ రోజున జరిగే మాక్ పోలింగ్ ప్రక్రియలోనే ఖర్చవుతాయి. అందుకే ప్రతీ పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 1400 మందికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి అన్న మాట. చదవండి: ఈటల రాజేందర్‌ను చిత్తు చిత్తుగా ఓడించండి: హరీశ్ వీళ్లు అభ్యర్థులే కానీ ఓట్లేసుకోలేరు ఎన్నికల బరిలో నిలిచారు.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు..తమకే ఓటేయాలని ఊరూరా తిరుగుతున్నారు కానీ ఎన్నికల రోజున మాత్రం ఓటు వేయలేరు. వారి ఓటు వారే వేసుకోలేని పరిస్థితి అన్న మాట. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఉమ్మడి జిల్లా అయినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటు లేదు. హైదరాబాద్‌లో ఉంది. ఇక రిజిస్టర్డు పార్టీల్లో అలీ మన్సూర్ మహ్మద్ (అన్న వైఎస్సార్ కాంగ్రెస్) నిజామాబాద్ జిల్లావాసి. కన్నం సురేశ్‌కుమార్(జె స్వరాజ్ పార్టీ)ది మేడ్చల్ జిల్లా. కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ(యు) శాయంపేట వాసి. లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ)ది సూర్యపేట జిల్లా. చదవండి: మీకు తెలుసా.. ఓట్లు ఎన్నిరకాలుగా వేయవచ్చో..? స్వతంత్ర అభ్యర్థుల్లో ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, కోట శ్యామ్‌కుమార్‌ది కరీంనగర్. ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్ మండలం కాగా కుమ్మరి ప్రవీణ్‌ది కొత్తపల్లి మండలం కమాన్‌పూర్. గుగులోతు తిరుపతిది సైదాపూర్. గంజి యుగంధర్ది పర్వతగిరి. బుట్టెంగారి మాధవరెడ్డి, సీపీ సుబ్బారెడ్డి, చెలిక చంద్రశేఖర్, కంటే సాయన్నది మేడ్చల్. చిలుక ఆనంద్ జూలపల్లి. పిడిశెట్టి రాజుది కోహెడ. లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డిది శంకరపట్నం మండలం కాచారం. వేముల విక్రమ్రెడ్డిది ధర్మపురి మండలం జైనలో ఓటు హక్కు ఉంది. మొత్తంగా 30 మంది అభ్యర్థుల్లో 20 మంది వారి ఓటు వారికే వేసుకోలేరు. -
టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలతో నిద్రపోయిన అధికారి
కోల్‌కతా: ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం 31 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగా బెంగాల్ ఎన్నికల కమిషన్.. నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేసింది. పోలింగ్‌కు ముందు రోజు సదరు అధికారి తనకు బంధువైన టీఎంసీ నాయుకుడి ఇంట్లో రాత్రంతా ఈవీఎంలతో పాటు ఉన్నందుకు గాను బెంగాల్ ఈసీ సదరు అధికారిని సస్పెండ్ చేసింది. అయితే అధికారి వద్ద ఉన్న ఈవీఎం, వీవీపాట్ సామాగ్రిని ఎన్నికల్లో వినియోగించలేదని ఈసీ తెలిపింది. ఈ ఘటన ఉలుబేరియా ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తులసిబీరియా గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తపన్ సర్కార్ అనే డిప్యూటి అధికారి 17 సెక్టర్ ఉలుబేరియా ఉత్తర్ పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి నిర్దేశించిన 4 ఈవీఎంలు, వీవీపాట్లను తీసుకుని తనకు బంధువు, స్థానిక టీఎంసీ నాయకుడు ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో వివాదం రాజుకుంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగాల్ ఎన్నికల కమిషన్ తపన్ సర్కార్‌ని సస్పెండ్ చేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సెక్టార్ అధికారి చర్యలు భారతదేశ ఎన్నికల కమిషన్ నియమావళికి తీవ్ర భంగం కలిగించాయి. ఇందుకు గాను అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక అధికారి వద్ద ఉన్న ఈవీఎంలు, వీవీపాట్లను పోలింగ్‌లో వినియోగించలేదు. ఎక్స్ట్రాగా ఉన్న ఈవీఎంలను అధికారి తనతో పాటు ఉంచుకున్నాడు. ఏది ఏమైనా అతడి చర్యలు ఆమోదించదగినవి కావు. అధికారితో పాటు ఆ ప్రాంత పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటాం’’ అని ఈసీ తెలిపింది. ఈ ఘటన అనంతరం జనరల్ అబ్జర్వర్ నీరజ్ పవన్ అన్ని ఈవీఎం సీళ్లను పరిశీలించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండి పడ్డారు. పూర్తి స్థాయిలో విచారించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దారుణం. ఈ క్రమంలో సదరు అధికారి ఇంట్లో ఉన్న అన్ని ఈవీఎంలను, వీవీపాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నారు. కొద్ది రోజుల క్రితం అస్సాంలో బీజేపీ నాయకుడి వ్యక్తిగత వాహనంలో ఈవీఎం తరలించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ నేత వాహనంలో ఈవీఎం.. ఈసీ సంచలన నిర్ణయం -
బీజేపీ నేత వాహనంలో ఈవీఎం.. ఈసీ సంచలన నిర్ణయం
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రైవేట్ వాహనంలో ఈవీఎంను తరలించడం కలకలం సృష్టించింది. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన ఈవీఎంను ఓ బీజేపీ నాయకుడి వాహనంలో తీసుకు రావడం వివాదాస్పదంగా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ నాయకుడి వాహనంలో ఈవీఎం తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రతాబరి పరిధిలోని ఇందిరా ఎంవీ స్కూల్లో 149వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది బయలుదేరుతుండగా.. ఈసీ కేటాయించిన వాహనం చెడిపోయింది. అప్పటికే రాత్రి 9 గంటల కావడంతో సెక్టార్ ఆఫీసర్‌కు ప్రిసైడింగ్ అధికారి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయివేట్ వాహనంలో ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు. చివరకు ఆ వాహనాన్ని బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ భార్యదిగా ధ్రువీకరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు వాహనంపై దాడిచేశారు. రాళ్లు విసరడంతో వారి నుంచి తప్పించుకోడానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు ఈ విషయాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాక ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. బీజేపీ విజయం సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతుంది అంటూ విమర్శిస్తున్నాయి. చదవండి: మట్టిలో పరుగులు తీసిన ప్రియాంక గాంధీ -
బీజేపీ నేత వాహనంలో ఈవీఎం..
-
కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం: హైకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఈవీఎంలనే ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈమేరకు మంగళవారం మద్రాసు హైకోర్టుకు వివరణ ఇచ్చింది. 2017 తర్వాత తయారైన ఈవీఎంలనే వినియోగించనున్నట్లు వెల్లడించింది. అలాగే శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వలేమని తెలిపింది. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 15ఏళ్ల నాటి ఈవీఎంలనే ప్రస్తుతం వాడబోతున్నారని ఆరోపించారు. దీనిపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. పాత ఈవీఎంలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని సమస్యాత్మక కేంద్రాల జాబితాను ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 11వేలసమస్మాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ విషయమై ఈ నెల 26వ తేదీన అన్ని పార్టీలతో చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా, శాంతిభద్రతల దృష్ట్యా జాబితాను ప్రకటించలేమని స్పష్టం చేశారు. పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు 44వేల కేంద్రాల్లో వెబ్ కెమెరాలను అమర్చనున్నట్లు వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో 2017 తర్వాత తయారై ఈవీఎంలనే వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. ఈసీ వాదనతో కోర్టు ఏకీభవించింది. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించాలని సూచించింది. శరవేగంగా ఏర్పాట్లు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ సాహు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఈసీ సాహు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లను తెప్పించుకోవాలని సూచించారు. ముమ్మరంగా తనిఖీలు.. కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. పొల్లాచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో మంగళవారం ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఈరోడ్ సత్యమంగళంలో డీఎంకే కార్యకర్తలు ఓ హోటల్‌ను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పుదుకోట్టైలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు రూ.2వేల నోట్లతో సిద్ధం చేసిన కవర్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. చెన్నై అన్నానగర్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీలో రూ.48 లక్షలు పట్టుబడింది. మధురై తిరుమంగళంలో ఓటుకు నోటు పంచుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు కెమెరాకు చిక్కడంతో ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. రాయపురంలో 250 గ్యాస్ స్టౌలు, తిరునల్వేలిలో రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కాంచీపురంలో 3.5 కేజీల నగలు పట్టుబడ్డాయి. ఈ క్రమంలోనే తిరువణ్ణామలైలో డీఎంకే అభ్యర్థి ఏవీ వేలు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 25 కోట్ల మేర లెక్కల్లో లేని ఆదాయమున్నట్లు తేల్చారు. తపాలా ఓటు హల్చల్! సామాజిక మాధ్యమాల్లో తపాలా ఓటు ప్రత్యక్షం కావడంపై ఎన్నికల కమిషన్ విచారించి ముగ్గురిపై కేసు నమోదు చేసింది. తెన్కాశిలోని కృష్ణవేణి అనే ఉపాధ్యాయిని తన తపాలా ఓటును ఫొటో తీసి భర్త గణేశ్ పాండ్యన్‌కు పంపించారు. ఆయన తన సమీప బంధువు సెంథిల్ పాండ్యన్‌కు ఫార్వర్డ్ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. విచారించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. చదవండి: కమల్ హాసన్‌పై గౌతమి ఫైర్ సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ -
బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో వీవీప్యాట్ మెషీన్లు అందుబాటులో లేనందున వాటితో సాధ్యం కాకపోవచ్చుననే నిర్ధారణకు ఎస్ఈసీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ ఈవీఎం మెషీన్‌కు వీవీప్యాట్‌ను జతచేయాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు ‘సాక్షి’కి ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. వీవీప్యాట్లను సరఫరా చేయాలంటూ ఇదివరకే ఈసీఐఎల్, బెల్ కంపెనీలను ఎస్ఈసీ కోర గా, అవి అనుమతి కోసం ఈసీకి రాశాయి. ఈసీ నుంచి అనుమతి లభించి, ఆ కంపెనీలు ఈ ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో వీవీప్యాట్ యంత్రాలు తయారు చేసేప్పటికి కాలాతీతమౌతుందనే అభిప్రాయంతో ఎస్ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే బ్యా లెట్ బాక్స్‌లతోనే ఎన్నికలకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ముగిసిన గడువు.. త్వరలోనే ఈసీ, జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అభిప్రాయాలు కూడా ఎస్ఈసీ తీసుకోనుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఏ విధానమైతే సులభంగా ఉంటుందన్న దానిపై స్పష్టతనివ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలను ఎస్ఈసీ కోరిన గడువు కూడా బుధవారంతో ముగిసింది. టీఆర్ఎస్తో పలు పార్టీలు బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గుచూపగా, బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే నిర్వహించాలని సూచించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఏ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఎస్ఈసీ చెప్పకుండా, ముందుగానే బ్యాలెట్లతో నిర్వహించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తే ఓటర్లకు రిస్క్ తక్కువగా ఉంటుందన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎస్ఈసీ చెబితే దానిపై తమ నిర్ణయం చెబుతామంటూ టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ బుధవారం లేఖను పంపింది. రెండింటిలోనూ రిస్కే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈవీఎం లేదా బ్యాలెట్ పత్రాలు.. ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా రిస్కేనని, ఈ రెండు పద్ధతుల్లోనూ సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఓటర్‌కు కోవిడ్ ఉన్నా లక్షణాలు కనిపించని అసింప్టమేటిక్‌గా ఉంటే ఏ విధానంలో నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా కెమికల్స్‌తో ప్రింట్ చేసిన న్యూస్ పేపర్ లేదా బ్యాలెట్ పేపర్‌పై వైరస్ ఎక్కువ సేపుండే అవకాశాలు తక్కువనేది ఇప్పటికే స్పష్టమైనందున ఆ పద్ధతి వైపే ఎస్ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు..? ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా ఎస్ఈసీ స్పష్టతనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నివేదిక అందగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో నిమగ్నమైనట్టు తెలిపాయి. జీహెచ్ఎంసీ పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున వచ్చే ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే వీలుంది. దీన్ని బట్టి నవంబర్ 2, 3వ వారం నుంచి డిసెంబర్ చివరివరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే మంచి రోజుల్లో ఎన్నికలు జరపాలనుకుంటే మాత్రం జనవరి 15 నుంచి 25వ తేదీల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు. -
ఏ మీట నొక్కినా బీజేపీకే..
పుణే: మహారాష్ట్రలోని కోరెగావ్ అసెంబ్లీ స్థానంలోని ఓ గ్రామంలో ఈవీఎం గురించి అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి పడుతోందంటూ కొందరు గ్రామస్తులు అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే వారి ఆరోపణలో నిజం లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీర్తి నలవాడె స్పష్టంచేశారు. గ్రామంలో ఎన్నికల సమయంలో ఈవీఎం మార్చిన మాట వాస్తవమని, అయితే అందులో ఓటు వేరే పార్టీకి పడుతోందన్నది అవాస్తవమన్నారు. ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్‌కు వేసే ఓటు బీజేపీ అభ్యర్థి ఉదయన్‌రాజే భోసలేకి పడుతోందని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయాన్ని గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ సమర్దించడంతో రభస ప్రారంభమైంది. దీనికి తాను కూడా సాక్ష్యం అంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే శశికాంత్ షిండే అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్సీపీకి ఓటేయాలని వచి్చన దీపక్ రఘునాథ్ పవార్ తాను బటన్ నొక్కక ముందే బీజేపీకి చెందిన బటన్ పక్కనే ఉన్న రెడ్ లైట్ వెలిగిందని ఎన్నికల అధికారులతో అన్నారు. దీంతో అధికారి మాటపూర్వకంగా ఒప్పుకొని, బటన్ సరిగా పనిచేయకపోతుండటం కారణమని భావించి ఈవీఎం మారి్పంచాడు. కాగా, హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. -
వీవీప్యాట్ లెక్కింపు చివర్లోనే
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ చీటీల లెక్కింపు జరపాలన్న 22 విపక్ష పార్టీల డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఈసీని కలసి ఈ మేరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళ, బుధవారాల్లో రెండు దఫాలుగా లోతుగా చర్చించామని, మొత్తం మీద, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఆచరణ సాధ్యం కాదని, విపక్షాల డిమాండ్‌కు అంగీకరించే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కాగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటే అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను కూడా అనుమతించే అంశంపై ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సిందిగా ఏప్రిల్ 8 నాటి తీర్పులో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా బలహీన కమిషన్ : కాంగ్రెస్ ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి బలహీన కమిషన్‌గా ఈసీని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈసీ ఈవీఎంలను బీజేపీకి విజయాన్ని చేకూర్చే ‘ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్లు’గా ఏమన్నా మార్చిందా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ‘మోదీస్ క్యాంపెయిన్ కోడ్’గా (మోదీ ప్రచార నియమావళి) మార్చారా? అంటూ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఒత్తిళ్లకు ఈసీ లొంగిపోయిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరించడం విచారకరం, దురదృష్టమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. శాంపిల్‌ను తొలుత పరీక్షించాలన్న ప్రాథమిక సూత్రానికి ఈసీ ఎందుకు కట్టుబడటం లేదో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. డీఎంకే సైతం ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ కేవలం ప్రదాని మోదీ మాటే వింటుందా? అని ఆ పార్టీ సీనియర్ నేత దొరైమురుగన్ ప్రశ్నించారు. విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధం: అమిత్ వీవీ ప్యాట్లను తొలుత లెక్కించాలన్న విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. ఆరో విడత ఎన్నికల తర్వాతే విపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాయని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశాయని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బుధవారం నాటి ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. మూడు వ్యాజ్యాలను (పిల్స్) విచారించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు తుదిరూపునిచ్చిందని అమిత్ షా చెప్పారు. వీవీప్యాట్లపై విపక్షాల అసహనం ఎన్నికల్లో వారి ఓటమికి సంకేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. -
‘అదే జరిగితే.. రక్తం ఏరులై పారుతుంది’
పట్నా : కౌంటింగ్ రోజున అధికార పార్టీ అవకతవకలకు పాల్పడితే.. జనాలు ఊరుకోరు.. రక్తపాతం సృష్టిస్తారని హెచ్చరిస్తున్నారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) నాయకుడు ఉపేంద్ర కుష్వహా. బిహార్, యూపీల్లో ఈవీఎంల తరలింపు విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ఎవరూ సరిగా సమాధానం చెప్పడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూసి జనాలు భయపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. మహాకూటమి కానీ, ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు. మా ఓటు.. మాకు గౌరవం, జీవనాధారం. మా బతుకుల జోలికి వస్తే.. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాడతామో.. అలానే మా ఓట్ల కోసం కూడా కొట్లడతాం. ఓట్ల లెక్కిపు రోజున ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం హింసాకాండ చెలరేగడం.. రక్తం ఏరులై పారడం ఖాయం’ అన్నారు. అంతేకాక ‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. అప్పుడు జనాల్లో మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత.. మా(మహాకూటమి) పాట్ల సానుకూల స్పందన కనిపించింది. చాలా చోట్ల మహాకూటమి విజయం సాధిస్తుందని అర్థమైంది. అందుకే ఓట్ల లెక్కింపు నాడు ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల’ని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎన్డీఏ ఖండిస్తుంది. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆర్ఎల్ఎస్పీకి చెందిని ఉపేంద్ర కుష్వహా ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టాడు. కానీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో.. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో గత ఏడాది డిసెంబరులో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాడు. -
ఈవీఎంల తరలింపు.. ప్రతిపక్షాల ఆందోళన
లక్నో : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికి.. ఈవీఎంల తరలింపు వ్యవహారంలో మాత్రం రోజుకో వివాదం తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఈవీఎంలు.. అర్థరాత్రి పూట ప్రైవేట్ వాహనాల్లో దర్శనమివ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్ అన్సారీ, తన కార్యకర్తలతో కలిసి.. స్ట్రాంగ్ రూమ్ ఎదుట నిరసనకు దిగారు. ఓ మిని ట్రక్కు నిండా ఈవీఎంలను తరలించేదుకు ప్రయత్నించారని అన్సారీ ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారంగా ఓ వీడియోను కూడా చూపిస్తున్నారు. ఆదివారం పోలింగ్ ముగిస్తే.. ఇప్పుడేలా ఈవీఎంలను తరలిస్తారని అన్సారీ ప్రశ్నిస్తున్నారు. WOAH! WATCH MGB candidate from Gazipur confronting POLICE on EVM safety. He alleges that a truck full of EVMs was spotted. He is now sitting on dharna outside the counting centre. His demand is that instead of CISF, BSF must protect EVMs. Watch this space for more. pic.twitter.com/kpYLbyPc73 — SaahilMurli Menghani (@saahilmenghani) May 20, 2019 అయితే ఈ ఆరోపణలను జిల్లా కలెక్టర్ కొట్టి పారేస్తున్నారు. వీడియోలో చూపిన 35 ఈవీఎంలను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చామని.. వాటిని ఇప్పుడు తరలించామని తెలిపారు. గత గురువారం కూడా యూపీలో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ వాహనంలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు అడ్డుకున్నారు. అయితే ఇవి ఎక్స్ట్రా ఈవీఎంలు అని అధికారులు సర్ది చెప్పారు. అలానే బిహార్‌లోని సరాన్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ ప్రైవేటు వాహనంలో పదుల సంఖ్యలో ఈవీఎంలను తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్జేడీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. अभी-अभी बिहार के सारण और महाराजगंज लोकसभा क्षेत्र स्ट्रोंग रूम के आस-पास मँडरा रही EVM से भरी एक गाड़ी जो शायद अंदर घुसने के फ़िराक़ में थी उसे राजद-कांग्रेस के कार्यकर्ताओं ने पकड़ा। साथ मे सदर BDO भी थे जिनके पास कोई जबाब नही है। सवाल उठना लाजिमी है? छपरा प्रशासन का कैसा खेल?? pic.twitter.com/K1dZCsZNAG — Rashtriya Janata Dal (@RJDforIndia) May 20, 2019 -
ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాట్లు లెక్కిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సోమవారం జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు తెరుచుకోకపోతే వాటి స్థానంలో వీవీప్యాట్ల స్లిపులను లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఈవీఎంకు సంబంధించి బ్యాటరీ రీప్లేస్మెంట్, కంట్రోల్ యూనిట్ మరమ్మతులు సాధ్యం కానప్పుడు వీవీప్యాట్లను లెక్కిస్తామన్నారు. లెక్కింపు సమయంలో మొరాయించిన ఈవీఎంలను పక్కకు పెట్టి మిగిలిన ఈవీఎంలతో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తామన్నారు. చివర్లో మొరాయించిన ఈవీఎంల పరిస్థితి పరిశీలించి కేంద్ర పరిశీలకులు, ఆర్వో తగు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఓట్ల లెక్కింపులో ఫారం 17సీ అత్యంత కీలకమైనదని, ఈ ఫారంలోని వివరాలతో సరిపోలితేనే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కౌంటింగ్‌కు ముందు మాక్‌పోల్ నివేదిక లెక్కలు కూడా సరిపోవాలన్నారు. ఒకవేళ మాక్‌పోల్ ఓట్లు తొలగించకుండా అంటే సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగించి ఉంటే పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లను తొలగించి లెక్కింపు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అలాగే సీఆర్సీ చేయని వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఐదు ఎంపిక చేసే ర్యాండమైజేషన్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో సందేహాలు తలెత్తితే పోలింగ్ డైరీ ఆధారంగా ఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని, ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోనే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉండి మెజార్టీ స్వల్పంగా ఉంటే ఆర్వో, కేంద్ర పరిశీలకులు రీ–కౌంటింగ్‌కు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఈ రీకౌంటింగ్‌లో మొత్తం ఈవీఎంలు చేయాలా లేక సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లకే పరిమితం చేయాలా అన్నది కూడా వారే నిర్ణయిస్తారన్నారు. సీఎం వ్యాఖ్యలపై ఖండన కౌంటింగ్ ఏజెంట్లకు 17సీ ఫారంలు ఇవ్వడం లేదని, కనీస ఆహార ఏర్పాట్లు కూడా చేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ద్వివేది ఖండించారు. కౌంటింగ్ హాల్లో ఎన్ని టేబుళ్లు ఉంటే అంత మంది ఏజెంట్లను అనుమతిస్తామని, అలాగే ఏజెంట్లకు 17సీ ఫారం కూడా తప్పకుండా ఇస్తామన్నారు. అలాగే ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
చివరలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ ఓట్లు, ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కించాకే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పార్టీలకు పడిన ఓట్ల సంఖ్యతో సరిపోలుస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు గురువారం హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 23 ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏయే స్థాయిలో ఏ ఓట్లు లెక్కించాలి. లెక్కించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. ఎన్నికల ఏజెంట్లతో వ్యవహరించాల్సిన తీరు.. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌లోని ఓట్లను లెక్కించాల్సిన పద్ధతి.. పరిశీలకుల సంతకాలకు ఉన్న ప్రాముఖ్యం తదితర అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను శిక్షణలో భాగంగా వివరించినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడిన నిజామాబాద్ నియోజకవర్గ ఓట్లను లెక్కించేందుకు 18 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అత్యధిక ఓటర్లున్న మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి 24 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్ భన్వర్‌లాల్, డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జాయింట్ సీఈవో ఆమ్రపాలి పాల్గొన్నారు. -
రోజుకో రివ్వూ!పూటకో భయం!
-
హోటల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ స్వాధీనం
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ హోటల్లో సోమవారం ఉదయం ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ముజఫర్‌పూర్ ఎస్డీఓ కుందన్ కుమార్ ఈవీఎంలను సీజ్ చేసి తన స్వాధీనంలోకి తీసుకున్నారు. సెక్టార్ మేజిస్ర్టేట్ అవధేష్ కుమార్ తన డ్రైవర్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లడంతో ఈవీఎంలను హోటల్‌కు తీసుకువెళ్లినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈవీఎంలను హోటల్ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం తెలియగానే అక్కడ గుమికూడిన స్ధానికులు మేజిస్ర్టేట్ తీరును తప్పుపడుతూ నిరసన తెలిపారు. పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని మేజిస్ర్టేట్ అవధేష్ కుమార్‌కు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈవీఎంలు హోటల్‌కు ఎలా చేరుకున్నాయో వెల్లడించాలని ఆయనను కోరారు. తన డ్రైవర్ ఓటు వేసేందుకు వెళ్లడంతో మేజిస్ర్టేట్ ఈవీఎంలు, వీవీప్యాట్‌ను హోటల్‌కు తీసుకువెళ్లారని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ నిర్ధారించారు. నిబంధనలను ఉల్లంఘించిన అవధేష్ కుమార్‌పై శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అధికారులపై ఈసీ కొరడా
-
ఏబీఎన్ చానెల్‌పై చర్యలు తీసుకోండి
కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలిపోతున్నాయంటూ అబద్ధపు కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ చానల్, ఆ సంస్థ విలేకరిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో భద్రపరచిన ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలిపోతున్నాయంటూ ఏబీఎన్ చానల్లో ఈనెల 13న వచ్చిన కథనాన్ని వారు ఖండించారు. తప్పుడు సమాచారంతో వార్తను ప్రసారమయ్యేలా పనిచేసి జిల్లా ప్రజలు, అభ్యర్థుల ఆందోళనకు కారణమైన చానెల్, ఆ విలేకరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆ పార్టీ నాయకులు జిల్లా అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మచిలీపట్నం పట్టణ కన్వీనర్, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్‌దాదా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని భద్రపరచిన యూనివర్శిటీ స్ట్రాంగ్ రూంలలోకి ఏబీఎన్ విలేకరి ప్రవేశించడంతో భద్రతా ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడిందన్నారు. ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ను అంటూ సదరు విలేకరి దర్జాగా లోపలికి ప్రవేశించి రహస్యంగా వీడియోలు తీసి చానల్లో ప్రసారం చేయడం ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. కాగా, ఈ కథనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా విషయాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్ మాట్లాడుతూ.. వాస్తవాలను ప్రసారం చేయాల్సిన చానళ్లు ఇలాంటి అసత్యపు కథనాలతో తమ రేటింగ్లను పెంచుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. అబద్ధపు ప్రసారంతో ప్రజాప్రతినిధులు, ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్ ఛానల్‌పై కలెక్టర్, ఎస్పీ తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
టీడీపీ హత్యా రాజకీయం
ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యా రాజకీయాలకు దిగారని స్పష్టమవుతోంది. ఏ బూత్‌లో చూసినా ఓటర్లు బారులు తీరి ఉండడంతో ఏం జరుగుతుందో అని ఆందోళనపడ్డారు. ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలకు దిగారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులను కూడా పోలింగ్ బూత్‌ల్లోకి రాకుండా అడ్డుకున్నారు. చివరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనూ బరితెగించారు. అర్ధరాత్రి ఈవీఎంలను ధ్వంసం చేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచే ప్రయత్నం చేశారు. సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో బుద్దిచెప్పేందుకు జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే. ఓటర్లను చూసిన టీడీపీ నేతలు గుండెల్లో గుబులు పుట్టింది. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దశాబ్దాల కాలంగా కుప్పం వాసులను నమ్మించి మోసం చేస్తూ వస్తున్న తన నిజస్వరూపాన్ని జనం అర్థం చేసుకున్నారని చంద్రబాబు కుప్పంలోనూ గుబులే! గ్రహించినట్టున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని పోలింగ్ తీరును బట్టి పసిగట్టారు. దీంతో ఆయనకు కుప్పం గెలుపుపై కూడా గుబులు పట్టుకున్నట్టుంది. తమ్ముళ్లు రంగంలోకి దిగారు. అడ్డదారులు తొక్కైనా తమ అధినేతను గట్టెక్కించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కుప్పం పరిధిలోని 170, 173, 174, 175 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలను ద్వంసం చేసి వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచాలని నిర్ణయించారు. ఓటింగ్ పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక ఆ బూత్‌లలోకి ప్రవేశించారు. 170 బూత్‌లోని వీవీప్యాండ్ను పగులగొట్టారు. మరో మూడు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు తెలిసింది. అయితే ఆ విషయాలను బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలింగ్ అధికారులందరినీ వెలుపలకు పంపేసి తమ పని కానిచ్చేశారని ప్రచారం జరుగుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాడ్లను పగులగొట్టిన విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కొందరు అధికారులను మేనేజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ సోదరుడు సతీష్ దాడిచేశారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే.. కుప్పంలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కు కుట్రలు బయటపడ్డాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఎజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు. హత్యా రాజకీయాలు తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి శంకర్‌యాదవ్ సొంత ఊరు పీటీఎం మండలం టి.సదుంలోనే తనకు వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయని గ్రహించి నాయకులు, కార్యకర్తలను ఉసిగొల్పారు. రెచ్చిపోయిని టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ కార్యకర్త ఆర్పి వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. పూతలపట్టులో ఈసారైనా పట్టు నిలుపుకోకపోతే పరువుపోతుందని భావించిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లను బూత్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. పొలకల కట్టకిందపల్లి పరిధిలోని ఉప్పరపల్లి పోలింగ్ బూత్‌లో ఎస్సీ ఓటర్లను ఓటు వెయ్యనివ్వకుండా అగ్రకులస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఏకంగా అభ్యర్థిపైనే దాడిచేసి హత్యాయత్నం చేశారు. అడ్డొచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కొట్టారు. అంతటితో ఆగని పచ్చ నేతలు ఎంఎస్ బాబు వాహనాన్ని ధ్వంసంచేశారు. మీడియా కెమెరా మెన్ రమణపై దాడిచేసి అతని వద్ద ఉన్న కెమెరాను పగులగొట్టారు. బందార్లపల్లెలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. బాబు సొంత నియోజకవర్గంలో రౌడీ తమ్ముళ్లు సీఎం చంద్రబాబు జన్మించిన నియోజకవర్గం చంద్రగిరిలో ఈసారి ఎలాగైనా పరువు కాపాడుకోవాలని ఏరి కోరి పులివర్తి నానిని అభ్యర్థిగా రంగంలోకి దించారు. సీఎం, మంత్రులు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. టీడీపీ శ్రేణులు ఏం చేస్తున్నా పట్టించుకోకూడదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నియోజక వర్గంలోని రామచంద్రాపురం, తిరుపతి అర్బన్ మండలం మంగళం, రూరల్ మండలం పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. వైస్సార్సీపీకి దళితులంతా ఓట్లు వేస్తారని వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీ కండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురం, సొరకాయలపాలెంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యే చెవిరెడ్డిని కూడా గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. తీవ్రవాదుల్లా ప్రవర్తన టీడీపీ శ్రేణులు ఆధిపత్యం కోసం తీవ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యంచేస్తూ టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. వార్తల సేకరణ కోసం వెళ్లిన పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులపైనా దాడికి తెగబడ్డారు. పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరినీ రాకుండా గేట్లు వేసి అడ్డుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారని తెలిసింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సొంత మండలం పాకాలలోనైనా పరువు దక్కించుకోవాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తుమ్మలగుంటలో పులివర్తి నాని భార్య రంగంలోకి దిగి తమ అనుచరుల ద్వారా మహిళలను లాగి బయటకు పంపేశారు. జిల్లా అంతటా కుట్రలు సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవిబి పురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఎజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ, అధికారులు బెదిరింపులకు దిగారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఎజెంట్లను లోపల కూర్చోబెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్ ప్రారంభం అయ్యేసరికి మధ్యాహ్నం 1గంట దాటింది. ఎన్నికలకు ముందే కుట్రలు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సంఘమిత్రలను పోలింగ్ బూత్‌ల వద్ద సహాయకులుగా అధికార పార్టీ నాయకులు నియమింపజేశారు. వీరిలో కొందరి ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా పథకం వేశారు. వృద్ధులు, వికలాంగులను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లి ‘ఇలా ఓటు వేయాలి’ అని చెబుతూ వారే టీడీపీకి అనుకూలంగా ఓటు వేయించి పంపే కార్యక్రమం చేశారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3,500 మందిని ఓపీఓలుగా నియమించారు. వీరిలో కొందరు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుండడంతో స్థానికులు అభ్యం తరం వ్యక్తం చేశారు. -
డిసైడైపోయారా?
-
స్ట్రాంగ్ రూమ్‌లకు చేరిన ఈవీఎమ్‌లు
-
మహబూబ్‌నగర్ లో 65.30శాతం పోలింగ్
సాక్షి , మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా టెక్నికల్ సిబ్బంది వెంటనే స్పందించి వాటిని సరిచేస్తూ అవసరమైన చోట ఈవీఎంలు మారుస్తూ ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసుశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నా పోలింగ్ కు ఇబ్బంది లేకుండా వ్యవహరించారు. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో 7.95 శాతం, నాగర్‌కర్నూల్ పరిధిలో 12.49 శాతం పోలింగ్ తగ్గింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు రెండు లోక్‌సభ స్థానాల్లోనూ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరచలేదు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోత తట్టుకోలేక చాలామంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి సమస్యలను ఎప్పటికప్పుడు అదిగమించారు. మహబూబ్‌నగర్‌లో 1,871, నాగర్‌కర్నూల్‌లో 1,936 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ల ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పరిశీలించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7,53,935 మంది మహిళా ఓటర్లు ఉండగా 4,89, 453 మంది ఓటేశారు. అలాగే 7,51,216 మంది పురుషుల్లో 4,93,435 మంది ఓటేశారు. బహిష్కరణల పర్వం ఒక్క జడ్చర్ల మండలంలోనే ప్రజలు మూడు చోట్ల ఎన్నికలు బహిష్కరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు తమకు సరైన పరిహారం ఇవ్వలేదని, ఇచ్చే పరిహారం రూ.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలను బహిష్కరించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. మహబూబ్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటంతో 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అదే మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ సునితలు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్పీ రెమా రాజేశ్వరి అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రానికి అడ్డుగా కూర్చోవటం చట్టరిత్యా నేరమని, సమస్యలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని మహిళలకు సముదాయించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించటంతో ధర్నా విరమించారు. దీంతో బూరెడ్డిపల్లిలో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని, తమ సమస్యలను ఎవరు పట్టించుకోవటం లేదంటూ జడ్చర్ల మండల కేంద్రం బాదేపల్లి గంజ్ పోలింగ్ కేంద్రంలో బుడగజంగం కులస్తులు ఎన్నికను బహిష్కరించి పోలింగ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడారు. దీంతో అక్కడ గంటసేపు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటి స్ధానంలో ఇతర ఈవీఎంలు అమర్చారు. దీంతో పలు చోట్లా పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. -
రీపోలింగ్ పై నేడు నిర్ణయం
-
ఓటమి సంకేతాలతో విచక్షణ మరిచారు
సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు మెదులుతుండడంతో కొద్దిరోజులుగా ఇష్టానుసారం మాట్లాడుతున్న చంద్రబాబు.. గురువారం పోలింగ్ రోజు సైతం మరింత రెచ్చిపోయి విచక్షణ లేకుండా వ్యవహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలింగ్ మొదలైన తొలి గంటలోగానే ఈవీఎంలు పనిచేయడం లేదనే సాకు చూపి రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంతో టీడీపీ శ్రేణులే నివ్వెరపోయాయి. పోలింగ్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే హడావుడి చేయడం, రీపోలింగ్ అడగడం ద్వారా చంద్రబాబు ఓటమిని అంగీకరించినట్లయిందంటూ ఆ పార్టీ నాయకులే చర్చించుకున్నారు. 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని, ఇది దారుణమని చెప్పడం ద్వారా ఓటర్లను గందరగోళానికి గురిచేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఇది చంద్రబాబులోని అభద్రతా భావాన్ని బయటపెట్టిందనే వ్యాఖ్యలు విన్పించాయి. మూడు వేల ఈవీఎంలు పనిచేయడం లేదని చంద్రబాబు ప్రకటించడంపై ఎన్నికల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు సైకిల్‌కు ఓటేస్తే ఫ్యానుకు పడుతోందని చెప్పడం, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా తన స్థాయి మరచిపోయి గల్లీ నాయకుడిలా ప్రవర్తించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పదేపదే పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ద్వారా ఓటర్లను గందరగోళపరిచేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు. వీడియో సందేశాలు విడుదల చేసి ఎన్నికల నిర్వహణలో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ తానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఆయన వైఖరితో ఆశ్చర్యపోవడం ఎన్నికల అధికారుల వంతైంది. అలాగే టీడీపీ క్యాడర్‌తో చంద్రబాబు గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడుతూ ఘర్షణలకు పురికొల్పారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతోందని, దాన్ని అడ్డుకోవాలని ఆయనతోపాటు ముఖ్య నాయకులు పదేపదే స్థానిక నాయకత్వానికి సూచనలు పంపారు. దీని వల్లే ఓడిపోతామనే భయం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ రక్తసిక్తం కావడానికి, ఉద్రిక్తతలు ఏర్పడడానికి చంద్రబాబు క్యాడర్‌కు ఇచ్చిన సూచనలే కారణమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. -
దుష్ప్రచారాలను నమ్మొద్దు:ఈసీ ప్రకటన
-
రాప్తాడులో ఈవీఎంలు ధ్వంసం..ఉద్రిక్తత!
-
ఓటర్లతో కలిసి ధర్నాకు దిగిన ఆర్కే
-
చీరాలలో పనిచేయని ఈవీఎంలు
-
ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్ధి
-
నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్
-
మైదుకూరులో రెండు వర్గాల మధ్య తోపులాట
-
ఒంగోలులో మొదలైన పోలింగ్
-
ప్రారంభమైన తొలివిడత పోలింగ్
-
ఏపీ పోలింగ్ : జాతీయ రహదారిపై ఆందోళన
సాక్షి, కృష్ణా : విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 47వ పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచి ఈవీఎం పనిచేయకపోడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. సాయంత్రం 6 గంటలలోపు లైన్లలో వేచిఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. అయితే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దగ్గర ఉండి ఓట్లు వేయిస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని టీడీపీ నాయకులు తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మరోపక్క వల్లభనేని వంశీ కూడా తన అనుచరులతో అక్కడే ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ గోదావరి : దెందులూరు నియోజకర్గంలోని ప్రత్తికొల్లలంకలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు. ఓటింగ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా ఈ వివాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారంటూ మాజీ సర్పంచ్ మహాలక్ష్మీరాజు కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న 7 కుటుంబాల సభ్యులపై దాడికి తెగబడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆస్పత్రిలో బాధితులు.. పశ్చిమ గోదావరి : ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ వీరంగం సృష్టించాడు. స్థానిక 150 వ పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామరాజుపై మనోజ్, అతని అనుచరులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన రామరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అనుచరులు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతున్నారని రామరాజు మధ్యాహ్నం అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో రామరాజు, అతని తల్లి తండ్రులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. రాత్రి 10 గంటల సమయంలో మరోమారు ఎమ్మెల్యే అల్లుడు మనోజ్ రామరాజుపై దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామరాజు అమరావతి : ఈవీఎంలు మొరాయించడం.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని చెప్పారు. పోలింగ్ శాతం 80కి చేరువలో ఉందని తెలిపారు. సాక్షి, కర్నూలు : రాత్రి తొమ్మిది అవుతోన్న ఆళ్లగడ్డలో పోలింగ్ జరుగుతోంది. అయితే టీడీపీ శ్రేణులు దీనికి అడ్డుతగులుతున్నారు. తెలుగు తమ్ముళ్లు రాళ్లతో దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. అప్పటికే నిల్చున్న ఓటర్ల మధ్యలో కొంతమందిని బలవంతంగా చేర్చి వారితో కూడా ఓటు వేయించాలని గొడవకు దిగారు. దీనికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.. రాళ్లురువ్వి భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసులు కాల్పులు, టియర్‌గ్యాస్ ప్రయోగించడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి. హైదరాబాద్: తన ఓటమి తప్పదనే భావించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరిచి దిగజారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలింగ్ ముగిసిన సందర్భంగా రాత్రి 8:30 గంటలకు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు శాంతియుతంగా జరగకుండా, ఓటింగ్ శాతం తగ్గించడానికి చంద్రబాబు అనేక కుట్రలు పన్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం తమకు అనుకూలమని, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. 8 దాటినా పలుచోట్ల పోలింగ్ అమరావతి : రాత్రి 8 దాటినా పలుచోట్ల పోలింగ్ కొనసాగుతుంది. నిర్ణీత సమయంలోపు క్యూలైన్లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఇంకా పోలింగ్ జరుగుతోంది. చీరాల, గాజువాకలో ఓటర్లు ఇంకా బారులు తీరారు. అప్పుడే రీపోలింగ్‌పై నిర్ణయం.. అమరావతి : సాయంత్రం 5 గంటల వరకు 65.96 శాతం పైగా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 25 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందారని, ఆరుచోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసారని తెలిపారు. ఈ అన్నివిషయాలను కేంద్రఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాజకీయపార్టీలు రీపోలింగ్ కూడా కోరుతున్నాయని, కేంద్ర ఎన్నికల పరిశీలకుల స్క్రూటీని తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూడు గంటలకు పోలింగ్ ఆగిపోయిందని, రిపోలింగ్ నిర్వహించే విషయంపై పరిశీలిస్తున్నామన్నారు. క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించామని తెలిపారు. ఇక మొత్తం పోలింగ్ 80 శాతం పైగా అయ్యే అవకాశం ఉందన్నారు. సిద్ధారెడ్డిపై టీడీపీ నేతల దాడి అనంతపురం: కదిరిలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డిపై టీడీపీ నేతల దాడికి యత్నించారు. వారిని ఆయన గన్‌మెన్ గిరి అడ్డుకోగా... అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కదిరి లోని 88 పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలైన ఓట్ల శాతం 65.96 శ్రీకాకుళం 63.77 % విజయనగరం 74.18% విశాఖపట్నం 55.82 % తూర్పుగోదావరి 69.85 % పశ్చిమగోదావరి 67.28 % కృష్ణా 64.50 % గుంటూరు 61.12 % ప్రకాశం 70.74 % నెల్లూరు 66.90 % కడప 63.90 % కర్నూలు 63 % అనంతపురం 67.08 % చిత్తూరు 69.32 % అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉండాలి: విజయసాయిరెడ్డి హైదరాబాద్ : ఈవీఎంలు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ పంపేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎలాంటి కుయుక్తులైనా పాల్పడే అవకాశం ఉందని, పోలింగ్ ముగిసే చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ముగిసిన పోలింగ్ సమయం.. బారులు తీరిన ఓటర్లు అమరావతి : ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గడువులోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు టోకెన్లు ఇచ్చి మరి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికి.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం.. పార్టీల నేతలు వాగ్వాదాలకు దిగడంతో పోలింగ్‌కు కొంత ఆలస్యమైంది. ఇక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అయినా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. హెలీకాప్టర్ల ద్వారా ఈవీఎంల తరలింపు తూర్పుగోదావరి జిల్లా : రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన గుర్తేడు - 4, దారగండి -1, పాతకోట - 1 బొద్దగండి - 1 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలతోపాటు ఎన్నికల సిబ్బందిని రెండు ఓఎన్జీసీ హెలీకాప్టర్ల ద్వార కాకినాడకు తరలించారు. వాకలపూడిలోని నేవి బేస్‌కు ఎజెన్సీ ఎన్నికల సిబ్బంది చేరుకుంది. పోలింగ్ ముగింపుకు కౌంట్ డౌన్.. అమరావతి : పోలింగ్ ముగింపుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది విజ్ఞప్తి చేశారు. 6 గంటల్లోపు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. క్యూలైన్లో ఉన్న చివరి ఓటరు నుంచి ఓటరు స్లిప్‌లు జారీ చేస్తామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలింగ్ కొంత ఆలస్యం అవుతుందన్నారు. 4 గంటల వరకు 54.66 శాతం పోలింగ్ అమరావతి: సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 54.66 శాతం పోలింగ్ నమోదైంది. గడువులోపు పోలింగ్ బూత్‌కు వచ్చిన వారికి ఎంతసమయమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక జిల్లాల వారిగా 4 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు శ్రీకాకుళం 52.11 % విజయనగరం 62.30% విశాఖపట్నం 45.79 % తూర్పుగోదావరి 57.32 % పశ్చిమగోదావరి 55.67 % కృష్ణా 52.53% గుంటూరు 52.41% ప్రకాశం 56.47 % నెల్లూరు 56.29 % కడప 56.44 % కర్నూలు 51 % అనంతపురం 54.96 % చిత్తూరు 57.30% రీపోలింగ్‌కు డిమాండ్ అనంతపురం : పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మండలంలోని తలమర్ల గ్రామంలో ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 20 శాతం పోలింగ్ కూడా పూర్తికాలేదు. దీంతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మావోయిస్టు ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ అమరావతి : మావోయిస్టు ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్యే పుష్పవాణిపై దాడి విజయనగరం: జియ్యమ్మవలస మండలం చినకుదమలో ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పుష్పవాణిపై టీడీపీ నేత రామకృష్ణ దాడి చేశారు. పోలీసులు లేకపోవడంతో పుష్పవాణికి ప్రజలు రక్షణగా నిలిచారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రిగ్గింగ్.. గుంటూరు : చిలకలూరి పేటలో పోలీసుల సాయంతోనే టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బయటపెట్టారు. టీడీపీ నేతలు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా.. బయట పోలీసులు కాపలా ఉన్నారు. కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి చిత్తూరు జిల్లా : పుంగనూరు నియోజకవర్గం వనములదిన్నె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పరిశీలించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారన్నారు. పోలింగ్ బూత్‌లో ప్రచారం.. ఓటర్ ఐడీలో రిగ్గింగ్ విశాఖపట్నం : పశ్చిమ నియోజవర్గం, బుచ్చిరాజుపాలెంలోని సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్లో టీడీపీ నేతలు బరితెగించారు. 59, 60,61,పోలింగ్ బూతుల్లో సైకిల్‌కు ఓటెయ్యాలంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఈవాగ్వాదం సందర్భంగా టీడీపీ నేతల నుంచి ఓటర్ ఐడీ కార్డులు బయటపడ్డాయి. ఈ ఓటర్ కార్డులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త మృతి చిత్తూరు : టీడీపీ నేతల దాడిలో గాయపడి వెంకట్రాయపరెడ్డి అనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చెందారు. పెద్దతిప్పసముద్రం మండలం టీ సదుంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్న టీడీపీ నేతలను వెంకట్రాయపరెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు వెంకట్రాయపరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన వెంకట్రాయపరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లిలోని క్రిస్టియన్‌పేట పోలీస్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. మందకొడిగా పోలింగ్.. విజయనగరం జిల్లా : నెల్లిమర్ల నియోజకవర్గం బోగాపురం మండలం సవరవిల్లిలో మందకొడిగా పోలింగ్ జరుగుతోంది. క్యూలైన్ లో సుమారుగా 700 మంది ఓటర్లున్నారు. టీడీపీ దష్ప్రచారంపై ప్రశాంత్ కిషోర్ ఫైర్ హైదరాబాద్ : తన పేరుతో ఓ నకిలీ ట్వీట్ ఇమేజ్ను ప్రచారం చేస్తున్న టీడీపీపై వైఎస్సార్ సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫైర్ అయ్యారు. ఓటమి కళ్ల ముందున్నప్పుడే ఇలాంటి దిగజారిన చర్యలకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారన్నారు. అసత్యాలు, నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని బై..బై.. బాబు అంటూ ట్వీట్ చేశారు. .@ncbn when you lose trust of the people and your faith in their wisdom, after abuses and lies, you stoop down to circulating fake news. Few hours left for the polling to close but it’s clear that people of AP have decided their verdict. It is time to say #ByeByeBabu pic.twitter.com/TH3K4dwXqB — Prashant Kishor (@PrashantKishor) April 11, 2019 పేట్రేగిన టీడీపీ శ్రేణులు.. చిత్తూరు : పూతలపట్టులో టీడీపీ శ్రేణులు పేట్రేగాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఎంఎస్ బాబును ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. రౌడీ షీటర్లను అనుమతిస్తున్నారని .. అనంతపురం : ప్రసన్నాయనపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వివాదం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన రౌడీ షీటర్లను అనుమతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు అభ్యంతరం వక్తం చేశారు. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అరెస్ట్ చేసి.. టీడీపీ నేతలను వదిలేసారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈవీఎం సామాగ్రి ధ్వంసం వైఎస్సార్ జిల్లా : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లెలో టీడీపీ నేత హల్చల్ చేశాడు. పోలింగ్ బూత్ 176 లోకి ప్రవేశించి మరి ఈవీఎం సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఇంత చేసినా పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు జిల్లాలవారిగా పోలింగ్ శ్రీకాకుళం 54% విజయనగరం 63% విశాఖపట్నం 51% తూర్పుగోదావరి 52% పశ్చిమగోదావరి 50 % కృష్ణా 51 %, గుంటూరు 50 % ప్రకాశం 58 % నెల్లూరు 53 % చిత్తూరు 57 % కర్నూలు 40 % కడప 63 % అనంతపురం 53%, కర్నూలు : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌పై బీజేపీ అభ్యర్థి బీవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ భరత్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పోలీసులకు లంచాలు ఇచ్చి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బూత్‌ల వద్ద అనుచరులతో కలిసి టీజీ భరత్ హడావిడి చేస్తున్నారన్నారు. ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ విజయనగరం: సాలూరు నియోజకవర్గం, ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని కొఠియా గ్రామంలో గిరిజనులను ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. గుంటూరు : మాచవరం మండలం కొత్తగణేషునిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. దళితులను ఓటింగ్‌కు వెళ్లనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకొని గ్రామానికి వెళ్లిన గురజాల వైఎస్సార్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. గ్రామానికి ఎందుకు వచ్చావంటూ రెండు కార్లను ధ్వంసం చేశారు. పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి కిడ్నాప్ చిత్తూరు : పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబును టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై టీడీపీ నేతలు భౌతికదాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి ప్రతిపాటి భార్య బెదిరింపులు గుంటూరు: చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య బెదిరింపులకు దిగారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల వైపు వేలు చూపిస్తూ ఆమె వార్నింగ్ ఇవ్వడంతో మంత్రి సతీమణి తీరుపై ఎన్నికల సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయనగరం: బాడంగి మండలం ముగడలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు దాడి చేసి కొట్టారు. అంతేకాకుండా ఆయనను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపేసి.. అరాచకంగా ప్రవర్తించారు. తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం సొరకాయలపాలెంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరులోని వసంతపేట స్కూల్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి.. లాఠీచార్జ్ చేశారు. 2 లక్షలతో పట్టుబడ్డ గంటా అనుచరుడు విశాఖపట్నం: ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల ప్రలోభాలు కొనసాగుతుండగా.. తాజాగా విశాఖపట్నంలో మరో టీడీపీ నాయకుడు డబ్బుతో పట్టుబడ్డాడు. మర్రిపాలెం జ్యోతినగర్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు కొప్పిరెడ్డి రామకృష్ణ రూ. 2 లక్షలతో దొరికిపోయాడు. అతను ఈ డబ్బును ఓటర్లకు పంచేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. ఓటింగ్ శాతం వివరాలివి.. చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతం కొనసాగుతోంది. ఓటర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటవరకు నమోదైన సరాసరి ఓటింగ్ శాతం నియోజకవర్గాలవారీగా ఈ కిందివిధంగా ఉంది. తంబల్లపల్లి : 43.80% పీలేరు : 37% పుంగనూరు : 46% చంద్రగిరి : 32% సత్యవేడు : 38% జీడీ నెల్లూరు : 40.56% చిత్తూరు : 38% కుప్పం : 44.60% పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలవరకు జిల్లాలో మొత్తంగా 20.41 శాతం పోలింగ్ నమైందింది. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలోని నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.. కొవ్వూరు : 23.86 % నిడదవోలు : 12.14 % ఉంగుటూరు : 21.15 % ఏలూరు : 32.50 % నర్సాపురం : 25.81 % పాలకొల్లు : 12 % భీమవరం : 20.20 % ఆచంట : 26.60 % ఉండి : 11.2 % తణుకు : 16.76 % చింతలపూడి : 27.89 % దెందులూరు : 25 % గోపాలపురం : 31 % తాడేపల్లిగూడెం : 21 % పోలవరం : 28 % ఉదయం 11 గంటలవరకు అందిన సమాచారం మేరకు జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళం 19.78%, విజయనగరం 31.57%, విశాఖపట్నం 21.64 %, తూర్పుగోదావరి 27.50%, పశ్చిమగోదావరి 20.41 %, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23 %, కడప 17.84 % పోలింగ్ నమోదైంది. అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నాం వరకు ఓటర్లు పోటెత్తుత్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు జల్లా వ్యాప్తంగా 38.86 శాతం పోలింగ్ నమోదైంది. రాయదుర్గం : 26.00% ఉరవకొండ : 47.00% తాడిపత్రి : 27.62% గుంతకల్ : 39.00% సింగనమల : 37.14% అనంపురం అర్బన్ : 29.00% కళ్యాణదుర్గం : 49.00% రాప్తాడు : 31.30% మడకశిర : 42.00% హిందూపురం : 38.00% పెనుకొండ :49.00% పుటపర్తి : 37.00% ధర్మవరం :51.00% కదిరి: 41.33% అనిల్‌కుమార్ యాదవ్‌పై దాడి నెల్లూరు : నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ వద్ద పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు ఆయనపై దాడి చేశారు. గోపిరెడ్డిని కారుతో ఢీకొట్టిన ‘పచ్చ’ నేత గుంటూరు: యలమందలో టీడీపీ నేతలు గూండాయిజానికి దిగారు. నర్సరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకుడు కడియల రమేశ్ దాడికి దిగాడు. అంతేకాకుండా గోపిరెడ్డిని కారుతో అతను ఢీకొట్టాడు. దీంతో గోపిరెడ్డి గాయపడ్డారు. బరితెగించి మరీ టీడీపీ నేతలు పోలింగ్ రోజున రెచ్చిపోతుండటంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిగోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను సైతం కిడ్నాప్ చేశారని, ఈ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తాడిపత్రిలో దాష్టీకం అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు బరితెగించారు. ఇక్కడి వీరాపురంలో జేసీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు వేట కోడవళ్లతో దాడులకు దిగారు. జేసీ వర్గీయుల దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు. చదవండి: వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణహత్య దుష్ప్రచారాన్ని నమ్మకండి: ద్వివేది రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని, సమస్యలు లేవని తాజాగా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని కొన్ని టీవీ చానెళ్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15శాతం పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు. ఒకరికి ఓటు వేస్తే వేరొకరికి వెళ్తుందన్నది కూడా దుష్ప్రచారమేనని, ఈవీఎంలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని ఆయన ఓటర్లకు సూచించారు. చదవండి: మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు : ద్వివేది పచ్చపార్టీ నేతల దౌర్జన్యం పచ్చపార్టీ నేతలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారు. పోలింగ్‌కు అంతరాయం కలిగించేలా కొన్ని ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సావవంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా, పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ప్రజలు బారులు తీరారు. కొన్నిచోట్ల మొదట ఈవీఎంలు మొరాయించినా.. ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం కావడంతో దాదాపు రాష్ట్రమంతటా పోలింగ్ సజావుగా సాగుతోంది. చదవండి: రెచ్చిపోతున్న పచ్చపార్టీ నేతలు సీఈవోను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు అమరావతి : రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో ఈవీఎంలపై పచ్చ మీడియాలో దుష్ప్రచారాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ఈసీని కలిశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పోలింగ్, పోలింగ్ సందర్భంగా తలెత్తిన పరిస్థితులు సీఈవోకు వివరించిన వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకే రీ పోలింగ్ అంటున్నారని విమర్శించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ, నాగిరెడ్డి మండిపడ్డారు. పచ్చ చొక్కాలతో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారని, ఇలా చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని వారు అన్నారు. టీడీపీ ప్రలోభాలు.. ప్రకాశం: పోలింగ్ రోజున కూడా టీడీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని కొత్తపేటలో ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేత ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాడు. దీంతో పోలింగ్ కేంద్ర వద్దే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత చుండూరు వాసును పోలీసులు అరెస్టు చేశారు. ఆ పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతా: డీఎల్ వైఎస్సార్ జిల్లా: తనపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తనపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఇందుకుగాను పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు కథనాలు రాసిన పత్రికా యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతానని డీఎల్ హెచ్చరించారు. స్వేచ్ఛగా ఓటు వేయండి.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, పలుచోట్ల ఈవీఎంలలో తలెత్తిన లోపాలు సరిదిద్దామని తెలిపింది. చదవండి: ఈవీఎంలో లోపాలు.. ఈసీ కీలక ప్రకటన ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతాలివే! ఏపీ అంతటా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు.. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతున్నా.. చాలావరకు పోలింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12.95శాతం పోలింగ్ నమోదు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 14శాతం పోలింగ్ నమోదు తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 12.36శాతం పోలింగ్ నమోదు విజయనగరం: కురపాం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 15శాతం నమోదు దాడులు.. దౌర్జన్యాలు.. రాప్తాడులో ఉద్రిక్తత! అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి దిగుతుండటంతో ఇక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు సనపలోని ఓ పోలింగ్ కేంద్రంలో పరిటాల అనుచరులు ఈవీఎంలను ధ్వంసం చేశారు. సిద్ధరాంపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు రాళ్ల దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మరూరు గ్రామంలో పరిటాల సునీత, శ్రీరామ్‌లు ఏకంగా ఓటర్లను బెదిరించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. టీజీ వెంకటేశ్ హల్చల్ కర్నూలు: పోలింగ్ కేంద్రాల బూత్‌ల వద్ద టీడీపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ హల్చల్ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఓటర్లు టీడీపీకి ఓటు వేసేలా ఆయన పోలింగ్ కేంద్రాల వద్ద వ్యవహరిస్తుండటంపై ఆయన తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జిల్లా : జమ్మలమడుగు మండలం పొన్నతోట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు ఏకంగా పోలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సా సీపీకి ఓట్లు పడే చోట ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆరోపించారు. లోకేష్ ఓడిపోతారనే ఉద్దేశ్యంతోనే ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఓటర్లతో కలిసి ధర్నాకు దిగారు. శ్రీకాకుళం : సంతబొమ్మాలి మండలం నిమ్మడలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల సిబ్బందిపై అచ్చెన్నాయుడు అనుచరులు బెదిరింపులకు దిగారు. నిమ్మడ పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలను తొలగించి వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను బయటకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. ఇంత జరుగుతున్నా పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు రాకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ వల్ల ‘హోదా’ సజీవంగా ఉంది! వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే ప్రత్యేక హోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రతి జిల్లాలనూ యువభేరి కార్యక్రమాలతో హోదా పట్ల యువతలో వైఎస్ జగన్ అవగాహన పెంచారని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలిపారు. యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటోందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి చూస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుందని అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పులివెందులలో వైఎస్ షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత వైఎస్సార్ జిల్లా: పొట్లదుర్తిలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దౌర్జన్యానికి దిగారు. పొట్లదుర్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ చేయి చేసుకున్నారు. చిత్తూరు: ఐరాలం మండల నాంపల్లి, పేరయ్యగారిపల్లి, కమ్మకిందపల్లిలో ఓటు వేసేందుకు వెళుతున్న దళితులను అడ్డుకున్న టీడీపీ.. విశాఖ: పాయకరావుపేట మండలం పింటకోట పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ గుర్తు పడకపోవడంతో పోలింగ్ నిలిపివేత గుంటూరు: నర్సరావుపేట రామచంద్రాపురం పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకున్న టీడీపీ నేతలు టీడీపీ దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ ఏజెంట్ల కిడ్నాప్! గుంటూరు: నర్సరావుపేట మండలం యలమందలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ముగ్గురు వైఎస్సార్సీపీ ఏజెంట్లను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకొని.. వారిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో ఒక ఏజెంట్ గాయపడ్డారు. వైఎస్సార్సీపీ నర్సరావుపేట అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపైనా పచ్చ పార్టీ నేతలు దాడికి దిగారు. దీంతో ఆయన సెల్‌ఫోన్‌తోపాటు మీడియా ప్రతినిధి కెమెరా ధ్వంసమయ్యాయి. మంగళగిరి : ఉండవల్లిలో సీఎం చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేశ్ దంపతులు ఓటు వేశారు. మొరాయిస్తున్న ఈవీఎంలు.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యలతో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరికొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7.40 గంటల కల్లా అందుతున్న సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ జగన్.. పులివెందుల : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. జనం మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్నట్టు చెప్పారు. నిర్భయంగా ఓటు వేయాలని కొత్త ఓటర్లకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్ జగన్ పులివెందులలోని భాకరాపురం ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. ముందుగా లోక్‌సభ అభ్యర్థికి, ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఆయన ఓటు వేశారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి బయల్దేరే ముందు వైఎస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి గోపాల క్రిష్ణ ద్వివేది తెలిపారు. తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని మున్సిపల్ హై స్కూల్ లో పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. మొరాయించిన ఈవీఎంలను టెక్నికల్ టీమ్ రిపేర్ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సాయంతం 6గంటల వరకు క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కును కల్పిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. తాడేపల్లిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ బూగ్ నంబర్లు 20,24,26, 39,27, 51, 54, 69 లో ఈవీఎంలు పనిచేయడం పనిచేయడం లేదు. శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలస మండలం లో 214, 210 పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. 210 బూత్‌లో ఇంకా మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. పార్వతీపురం 38వ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్‌లో ఈవీఎం మొరాయించింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 122వ పోలింగ్ కేంద్రంలోఈవీఎం మొరాయించింది. గట్టిగా నొక్కినా ఓట్లు పడలేదు. అలాగే ఓటు వేశాక బీప్ సౌండ్ రాలేదు. ఏజెంట్లు రానిపక్షంలో వారి కోసం 15 నిముషాలు ఎదురుచూశారు. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,120 పోలింగ్ కేంద్రాలకు గాను 28,000 చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు సాఫీగా ప్రారంభంమైంది. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలీంగ్ నిర్వహించారు. అన్ని పార్టీల ఏజెంట్లు మాక్పోలింగ్కి అందుబాటులో ఉండేలా చూసి ఈ మాక్‌పోలింగ్‌ను జరిపారు. రాష్ట్రంలో175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలకు గాను 46,120 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. -
1 కాదు 5 లెక్కించండి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్(వీవీప్యాట్) స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో లోక్‌సభ స్థానంలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏవైనా 5 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వసనీయత ఏర్పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. 50 శాతం వీవీప్యాట్ యంత్రాలను ఈవీఎంలతో సరిపోల్చాలని 21 విపక్ష పార్టీలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఎక్కువ సిబ్బంది కావాలి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతమున్న నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా 4,125 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఈవీఎంల ద్వారా సరిపోల్చుతున్నాం. ఒకవేళ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో లెక్కించాల్సిన వీవీప్యాట్ యంత్రాల సంఖ్యను పెంచితే, ఎన్నికల సిబ్బంది స్వయంగా లెక్కించాల్సి ఉంటుంది. దీనివల్ల తప్పులు జరిగే అవకాశముంది. ప్రస్తుతం వీవీప్యాట్ లెక్కింపునకు ముగ్గురు ఎన్నికల సిబ్బంది, ఓ పరిశీలకుడితో పాటు రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నాం. కానీ వీవీప్యాట్ల సంఖ్య పెరిగితే, భారీగా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారికి విశేషమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది’ అని తెలిపారు. మరోవైపు విపక్షాల తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ స్పందిస్తూ.. 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను, ఈవీఎంలతో సరిపోల్చేందుకు అదనంగా 5.2 రోజుల సమయం అవసరమని ఈసీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ సిబ్బందిని పెంచితే ఫలితాల వెల్లడి ఆలస్యం కాదన్నారు. ఒకవేళ ఈసీ 50 శాతం వీవీప్యాట్లను లెక్కిస్తే ఆరు రోజులు ఆలస్యమైనా తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ర్యాండమ్ యథాతథం దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం..‘వీవీప్యాట్–ఈవీఎంల లెక్కింపునకు ప్రస్తుతం అనుసరిస్తున్న ర్యాండమ్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది’ అని స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20,600 పోలింగ్ స్టేషన్లలలో వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చనున్నారు. ఈ విషయమై ఈసీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వీవీప్యాట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో రిజర్వులో ఉంచినవాటితో కలిపి 39.6 లక్షల ఈవీఎంలు, 17.4 లక్షల వీవీప్యాట్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. -
ఎన్నికల ఫలితాలు జాప్యమైనా సరే..
న్యూఢిల్లీ: ఈవీఎం ఫలితాలతో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చేందుకు ఓకే అంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆర్రోజుల సమయం పట్టినా పర్లేదని ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతినడం లేదని ఈసీ తమకు భరోసా ఇవ్వగలిగితే చాలన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంల ఫలితాలతో సరిపోల్చడం వల్ల ఫలితాల వెల్లడికి 5.2 రోజుల వరకు ఆలస్యమవుతుందన్న ఈసీ వాదనపై ఈ మేరకు 22 ప్రతిపక్ష పార్టీలు కోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ధర్మాసనం దీనిపై సోమవారం వాదనలు విననుంది. ప్రస్తుత విధానంలో అసెంబ్లీ నియోజకవర్గంలోనైతే ఒక పోలింగ్ బూత్, లోక్‌సభకైతే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లతో సరిపోల్చి చూస్తున్నారు. కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చేలా ఈసీని ఆదేశించాలంటూ పార్టీలు కోర్టును ఆశ్రయించడం తెల్సిందే. -
బూత్ కమిటీలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగింపుకొస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు బూత్‌కమిటీలపై దృష్టి పెట్టాయి. పోలింగ్‌కు ముందు రెండ్రోజులు, పోలింగ్ రోజున వీరి పాత్ర క్రియాశీలకం కానున్న నేపథ్యంలో బూతు కమిటీలకు కావాల్సిన సరంజామా సర్దే పనిలో పడ్డాయి. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల నంబరింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలతో వారికి అవగాహన కల్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్‌లకు తీసుకొచ్చేందుకు పార్టీలన్నీ బూత్ కమిటీలపై ఆధారపడుతున్నాయి. ఇన్‌చార్జీలకు ప్రత్యేక శిక్షణ పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్‌చార్జీలకు పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. పార్టీ ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కరపత్రాలు పంచడం, నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలన్నీ కమిటీలకే అప్పగించాయి. పార్టీల అసెంబ్లీ ఇన్చార్జీల సూచనల మేరకు బూత్కమిటీలను ఎంపిక చేసి, పార్టీకి ఓట్ల శాతం పెంచే యత్నాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు. -
ఇందూరుకు అధునాతన ఈవీఎంలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు బరి లో ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్ నిర్వహణకు వీలున్న అధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరు ను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సం స్థలు ఈసీఐఎల్, భెల్ కంపెనీలకు చెందిన ఇంజనీర్లు చేరుకున్నారు. 600 మందికి పైగా ఇంజనీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. నియోజకవర్గం పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్ కేం ద్రానికి ఒక్కో కంట్రోల్ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఏర్పాట్ల పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్, ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్ నిఖిల్‌కుమార్ బుధవారం నిజామాబాద్‌లో పోలింగ్ ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు. సుదీప్‌జైన్ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఎం–2 ఈవీఎంఎస్ ద్వారా, 4 బ్యాలెట్ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు. నిజామాబాద్ స్థానానికి 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎన్నిక ఎంతో చాలెంజ్‌తో కూడుకుందని, అతి తక్కువ సమయంలో దీన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదని.. 12 బ్యాలెట్ యూనిట్స్‌తో ఎన్నిక నిర్వహించడం ఇదే తొలిసారని అన్నారు. ‘బ్యాలెట్ పద్ధతిలోనేఎన్నికలు నిర్వహించాలి’ సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న రైతు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగర శివారులోని విజయలక్ష్మీ ఫంక్షన్‌హాలులో ఈవీఎంలపై అవగాహన కల్పించే కేంద్రం వద్ద ఆందోళన చేశారు. -
ఏపీలో కలకలం; డమ్మీ ఈవీఎంలు పట్టివేత
ఇబ్రహీంపట్నం (మైలవరం): సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2,400 డమ్మీ ఈవీఎంలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రామాంజనేయులుకు చెందిన వ్యక్తులు వీటిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. విషయాన్ని మండల ఎన్నికల నియమావళి అధికారి, ఎంపీడీవో రామప్రసన్న దృష్టికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒక్కొక్క ఈవీఎం రూ.16కు కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు బిల్లులు చూపించారు. అయితే ఒక ఈవీఎం ఖరీదు సుమారు రూ.100 వరకు ఉంటుందని గుర్తించిన అధికారులు 2,400 ఈవీఎంలకు రూ.2.40 లక్షలు ఖర్చును భీమవరం టీడీపీ అభ్యర్థి పి.రామాంజనేయులు ఖర్చులో జమచేసి ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు.