ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్‌లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.
దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు.
ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment