సాక్షి, విజయనగరం: మా సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేదని వైఎస్సార్‌సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాక్ పోలింగ్ రీ-వెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో వుండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీరుపై మేం కోర్టుకు న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు టెంపర్ జరిగాయని అనుమానిస్తుంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్ చేశారు.
కాగా, విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.. ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్.. ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామనన్నారు. తమ దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదని.. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య ప్రశ్నించారు. ఈసీ, జిల్లా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడాయి. ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను జిల్లా యంత్రాంగం తప్పు దారి పట్టిస్తోంది. కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment