రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి ఐదు లక్షలా?: బొత్స | YSRCP MLC Botsa Satyanarayana Serious Comments On CBN Govt Over Vijayawada Floods And Tirupati Stampede | Sakshi
Sakshi News home page

రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి ఐదు లక్షలా?: బొత్స

Published Mon, Jan 20 2025 5:34 PM | Last Updated on Mon, Jan 20 2025 7:13 PM

YSRCP MLC Botsa Satyanarayana Serious Comments ON CBN Govt

సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వం హామీల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి.. అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట మానవ తప్పిదమే అని చెప్పుకొచ్చారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలి. హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందే. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు. విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట ఇవ్వన్నీ.. మానవ తప్పిదాలే. రాష్ట్రంలో పేద విద్యార్థికి ఇంగ్లీష్‌ వద్దా? సంపన్నులకే ఇంగ్లీష్‌ మీడియమా? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో.. మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆరోజు ఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు. నిందితుడిని డబ్బులివ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?.

బహుమానంగా ఇచ్చారా?
ఈ ఘటన జరిగినప్పుడు దేవుడు మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేసి.. అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు బహుమానంగా ఇచ్చారా?. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రం గుర్తుంచుకోవాలి.  

వారెందుకు నోరు మెదపడం లేదు?:
ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్‌ కళ్యాణ్, హిందూ మతానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేసుకునే బీజేపీ ఏం చేస్తున్నాయి?. వారెందుకు నోరు మెదపడం లేదు?. ప్రభుత్వ చర్యను వారెలా సమర్థిస్తున్నారు?.

ప్యాకేజీ మతలబ్‌ ప్రైవేటీకరణ..
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని, కేంద్ర హోంమంత్రితో ఆ మాట చెప్పించకపోవడం వెనుక మతలబ్‌ కూడా ప్రైవేటీకరణ చేయడమేనని స్పష్టంగా తెలుస్తోంది. కూటమి నాయకుల అబద్ధపు హామీలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరినీ వదలకుండా అందరినీ కూటమి నాయకులు వంచించారు’ అని కామెంట్స్‌ చేశారు. 

మొన్న విజయవాడ.. నిన్న తిరుపతి బాబుపై బొత్స ఫైర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement