
సాక్షి, విజయనగరం జిల్లా: నెల్లిమర్ల మండలం బూరాడపేటలో టీడీపీ-జనసేన నేతల కొట్లాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డీలర్ పోస్ట్ విషయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం నెలకొంది. ఆదివారం గ్రామంలో గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన నేతలు కర్రలతో దాడి చేసుకున్నారు. జనసేన మండల నేత కరుమజ్జి గోవింద్‌తో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
పెనుకొండలో టీడీపీ వర్సెస్ బీజేపీ
మరోవైపు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనుచరులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుయాయుల మధ్య భూ వివాదం రచ్చకెక్కింది. ఇరు వర్గాలు తరచూ ఘర్షణలకు దిగుతుండడంతో చుట్టుపక్కల రైతులు.. కియా కార్ల పరిశ్రమ వద్ద ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా తెగని భూ పంచాయితీతో పదేపదే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, దారులు మూసేయడం, జేసీబీలతో రోడ్లు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాడ్లు, కర్రలతో గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment