clash
-
కుర్కురే తెచ్చిన రగడ.. 30 మంది అరెస్ట్
బనశంకరి: ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద పోరాటమే సాగింది. 10 మంది గాయపడగా, అంతకుమించి పరారీలో ఉన్నారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్కురే కొన్నారు. సద్దాం కుటుంబీకులు దగ్గరిలోనే చిన్న హోటల్ పెట్టుకున్నారు. గడువు మీరిన కుర్కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో రగడ రాజుకుంది. రెండు కుటుంబాలవారు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు రెండు వాహనాల్లో వచ్చి హోటల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి కొట్టారని సద్దాం కుటుంబీకులు ఆరోపించారు. ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అరెస్ట్ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలచంద్రనాయక్ తెలిపారు. కుర్కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొట్లాట దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇక గాయపడిన పలువురు ఆస్పత్రిలో చేరారు. -
పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చివరకు ఘర్షణకు దారితీయడం గమనార్హం. ఇరుపక్షాల ఎంపీలు ఒకరినొకరు తోసేసుకోవడం, పరస్పరం గొడవ పడడం, ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడి ఆసుపత్రిలో చేరడం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, రాహుల్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ ఆరోపించడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా గురువారం దిగ్భ్రాంతికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నినాదాలు, అరుపులు, కేకలతో ఉద్రిక్తత అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉదయం ఉభయ సభలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీలం రంగు దుస్తులు ధరించి, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ వాద్రాతోపాటు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తర్వాత వారంతా మకరద్వారం గుండా పార్లమెంట్ లోపలికి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు బైఠాయించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ కించపర్చిందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు. మకరద్వారం మెట్లపై ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడ్డాయి. తాము ముందుకెళ్లడానికి దారి ఇవ్వడం లేదని ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. దాంతో ఎన్డీయే ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఇండియా కూటమి సభ్యులు సైతం స్వరం పెంచారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. తోపులాటలు, అరుపులు కేకలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో కొందరు ఎంపీలు కిందపడ్డారు. మెట్ల మధ్యభాగంలో నిలబడిన తమను రాహుల్ గాంధీ బలంగా తోసివేశారని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుకెళ్లడానికి పక్కనే తగినంత దారి ఉన్నప్పటికీ ఆయన తమపై ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించారని అన్నారు. రాహుల్ గాంధీ తోసివేయడంతో తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న సారంగిని చక్రాల కురీ్చలో అంబులెన్స్ దాకా తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, బీజేపీ ఎంపీలే దారికి అడ్డంగా నిల్చొని, రాహుల్ గాం«దీని ముందుకు వెళ్లనివ్వలేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. మోదీ పరామర్శ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన ప్రతాప్ సారంగితోపాటు ముకేశ్ రాజ్‌పుత్ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. సారంగి కణతకు కుట్లు పడ్డాయి. ముకేశ్ రాజ్‌పుత్ తలకు గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరినీ ఫోన్లో పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే ఎంపీలు సైతం ఆసుపత్రికి చేరుకొని ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లను పరామర్శించారు. బీజేపీ ఎంపీలు కర్రలతో బెదిరించారు: రాహుల్ బీజేపీ ఎంపీలు తనపై బల ప్రయోగం చేశారని, దురుసుగా తోసివేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కింద పడిపోయానని, తనకు గాయాలయ్యాయని చెప్పారు. బీజేపీ ఎంపీలే తమపై దౌర్జన్యానికి పాల్పడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీ ఎంపీలే తమపై భౌతిక దాడులు చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కర్రలు చేతపట్టుకొని తమను అడ్డుకున్నారని, బెదిరించారని, పార్లమెంట్ లోపలికి వెళ్లనివ్వలేదని చెప్పారు. పార్లమెంట్ రెజ్లింగ్ రింగ్ కాదు: రిజిజు తమ ఎంపీ సారంగిని రాహుల్ గాంధీ నెట్టివేశారని, రౌడీలా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దుయ్యబట్టారు. ఒక వృద్ధుడిని నెట్టివేసినందుకు రాహుల్ సిగ్గుపడాలని అన్నారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలిచానని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన ఘటన ఏనాడూ చూడలేదని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్ అనేది బల ప్రదర్శనకు వేదిక కాదని, కుస్తీలు పట్టడానికి రెజ్లింగ్ రింగ్ కాదని సూచించారు. గురువారం నాటి ఘర్షణపై తగిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అంబేడ్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఈ నోటీసు అందజేశారు. రాజ్యసభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్‌లోకి వెళ్తుంటే ఎగతాళి చేశారుతాము పార్లమెంట్‌లోకి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు ఎగతాళి చేశారని, లోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేడ్కర్‌ను అవమానించినందుకు హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ ముందస్తుగానే కుట్ర పన్నిందని విమర్శించారు.పరస్పరం ఫిర్యాదులు మొత్తం గొడవకు రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా మారారు. ఆయనపై బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, భౌతిక దాడి, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఫిర్యాదు అందించారు. రాహుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దారుణంగా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓం బిర్లాకు ఫిర్యాదు అందజేశారు. మల్లికార్జున ఖర్గే సైతం ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీల దాడిలో తన మోకాలికి గాయమైందని పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు జరపాలని కోరారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. నా ఆత్మగౌరవం దెబ్బతీశారురాహుల్ గాందీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నన్ కోన్యాక్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఆమె గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘మకరద్వారం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా రాహుల్ గాంధీ నాకు చాలా సమీపంలోకి వచ్చారు. కోపంగా చూస్తూ నాపై గట్టిగా అరిచారు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ ప్రవర్తన ఇదేనా?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు లేఖ అందజేశారు. ‘‘నేను గిరిజన మహిళను. రాహుల్ నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నాకు రక్షణ కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును పరిశీలిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీల నిరసన -
ఉదయ్పూర్ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. మహారాజుకు నో ఎంట్రీ
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్ను.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.ఉదయ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయన అభిమానులు, మద్దుతుదారులు ప్యాలెస్‌పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్ ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
యూపీ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ కంట్లో ఎస్పీ నలుసు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీరు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 37 పార్లమెంట్ స్థానాలు కొల్లగొట్టామన్న అతివిశ్వాసంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాలదన్నుతోంది. ఎస్పీ ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. యూపీలో తమతో మాటైన చెప్పకుండా ఎస్పీ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. తాము పోటీలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో అభ్యర్థిని బరిలో దించి పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది. మహారాష్ట్రతో మహా వికాస్ అఘాడీ కూటమిలో పొరపొచ్చాలు పెరిగేలా 12 సీట్లు కోరుతూ కాంగ్రెస్‌కు ఎస్పీ ఇక్కట్లు తెస్తోంది. యూపీలో ఏకపక్షంగా..ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని ఎస్పీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి. అయితే ఇంతవరకు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాలేదు. హరియాణా ఎన్నికల్లో అతి విశ్వాసం కారణంగా ఓటమిపాలైన కాంగ్రెస్‌తో పెట్టుకుంటే లాభం లేదని ఎస్పీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఏకపక్షంగా 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో తమ ఓటుబ్యాంకు పటిష్టంగా ఉందని బల్లగుద్ది చెబుతోంది. కాంగ్రెస్‌తో కనీస అవగాహనకు రాకుండానే సొంత అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం సైతం మొదలుపెట్టింది. ప్రకటించని మూడు స్థానాల్లో ఘజియాబాద్ సదర్, ఖైర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో ఘాజియాబాద్ సదర్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని కోరుతోంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ప్రాభల్యం బలంగా ఉంది. ఘజియాబాద్ సదర్‌లో దాదాపు 80వేల మంది దళితులు, 60వేల మంది బ్రాహ్మణులు, 40వేల మంది బనియాలు, 35వేల మంది ముస్లిం, 20వేల మంది ఠాకూర్లు ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ పోటీలో ఉండటంతో దళితుల ఓట్లు తనకు అనుకూలంగా మారతాయన్న నమ్మకం కాంగ్రెస్‌కు లేదు. ఠాకూర్లతో పాటు సంఖ్యాపరంగా ప్రాభల్యం ఉన్న బ్రాహ్మణ, బనియా వర్గాలు బీజేపీతో ఉండటంతో ఇక్కడ గెలుపు సులభం కాదని కాంగ్రెస్ అంచనావేస్తోంది. ఇక ఖైర్‌లో లక్ష ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాట్లు పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం, 55,000 దళిత ఓట్లలో బీఎస్పీ చీలిక తెస్తుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. దీంతో ఎస్పీ ఇస్తామన్న రెండు సీట్లపై కాంగ్రెస్ అయిష్టత చూపుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో అసలు పొత్తులు ఉంటాయా? లేదంటే విడివిడిగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్న ఇరుపార్టీల శ్రేణుల్లో తలెత్తుతోంది. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ రాజీనామా చేసిన బుద్నీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ను వీడి ఎస్పీలో చేరిన అర్జున్ ఆర్యను ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ బుద్నీలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అంశం సైతం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.మహారాష్ట్రలో అదే తీరుమహారాష్ట్రలో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్‌పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల మధ్య పొత్తు విషయంలో చర్చలపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఈలోపే మధ్యలో దూరిన ఎస్పీ తమకు 12 సీట్లు కావాలని డిమాండ్‌చేస్తూ కొత్త పేచీలు మొదలెట్టింది. ఇప్పటికే రెండు స్థానాల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆ అసెంబ్లీ స్థానాలకు చుట్టూ ఉన్న మరో 10 స్థానాలను తమకే కేటాయించాలని కోరుతోంది. ఇందులో మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలపాలని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాయి. ఎస్పీ అంతటితో ఆగకుండా బుధవారం ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో ఎస్పీతో ఎలా డీల్ చేయాలో కాంగ్రెస్‌కు అంతుపట్టని వ్యవహారంగా తయారైంది. -
జాతిరత్నాలురా మీరు..
-
జనాలను ఉరుకులు పెట్టించిన మైసూర్ గజరాజులు
బెంగళూరు: మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి అక్కడ.రెండు ఏనుగులు ధనంజయ, కంజన్‌లు ఒకదానితో ఒకటి కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో ఒక ఏనుగు మరొకదాన్ని తరమడంతో.. జయమార్తాండ గేట్ గుండా బయట ఉన్న ఎగ్జిబిషన్ రోడ్‌కు వచ్చేశాయి.వెనకాల ఏనుగుపై మావటివాడు ఉన్నప్పటికీ.. ఏనుగు నియంత్రణ కాలేకపోయింది. దీంతో రోడ్లపై ఉన్న జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే కాసేపటికే మావటిలు, అధికారులు ఏనుగులు నియంత్రించి వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.మైసూర్ దసరా ఉత్సవాల్లో భాగంగా.. రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఉరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లక్షల మంది హాజరయ్యే ఈ ఉరేగింపునకు అలంకరణతో కూడిన గజరాజులే ప్రత్యేక ఆకర్షణ. అయితే గత రెండు దశాబ్దాల్లో.. ఉరేగింపులోగానీ, శిక్షణలోగానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు జరగలేదని అధికారులు అంటున్నారు. AnxietyGrips as 2DasaraElephants fight,run out of Palacepremises;Elephants pacified,BroughtBack toPalace;Noharm/damage@DeccanHerald pic.twitter.com/TZ8O4bmhoT— Shilpa P. (@shilpapdcmysuru) September 21, 2024 -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపధ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరిమూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపజేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ స్వయంగా ఆ గణేశ్ మండపం దగ్గరకు వచ్చి, పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ దాఖేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు.సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై ఆరుగురు వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష్ సంఘ్వీ తెలిపారు. -
తెలంగాణలో సీఎం మార్పుపై టీ- కాంగ్రెస్ లో చర్చ
-
సినిమాను తలపించేలా.. చిన్న ‘పార్కింగ్’ గొడవ.. పెద్ద రచ్చ.. వీడియో వైరల్
ఢిల్లీ: నోయిడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుగుపొరుగు ఇళ్ల వారు రోడ్డుపైనే కొట్టుకున్నారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లోని బి-బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్ లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం జరగ్గా.. నితిన్ తరపు వ్యక్తులు తొలుత రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత గాయపడిన రాజీవ్ చౌహాన్ కుమారులు రోడ్డుపై పార్కింగ్ చేసిన నితిన్ కారును ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళల మధ్యకూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UPpic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 -
Odisha: ఘర్షణల్లో యువకుని మృతి.. ఖుర్దాలో నిషేధాజ్ఞలు
ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుని మృతికి దారితీసింది. ఈ ఘటన నేపధ్యంలో మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్‌ఎస్‌స్)లోని సెక్షన్ 163 కింద జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. ఖుర్దా పట్టణ శివార్లలోని ముకుంద్ ప్రసాద్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఈ ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిశీలించి, అతను మృతిచెందినట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన హింసాకాండలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎస్.కె. ప్రియదర్శి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.ఈ హత్య అనంతరం స్థానికులు రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించారని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనం అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఘర్షణల దరిమిలా ఖుర్దా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తక్షణమే నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
గుడివాడలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య రచ్చ
-
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.నాగవరప్పాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే.. టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. -
టీడీపీ కోసం 37 కేసులు పెట్టించుకున్నా.. ఏం లాభం?
విజయవాడ, సాక్షి: అధికారంలో ఉన్నా పదవి ఉంటేనే ఏదైనా చెల్లుతుందని, ఆ పదవి లేకనే తాను ఏం చేయలేకపోతున్నానంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘పదవి లేక పోవడంతో నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారు. నా మాట చెల్లలేదు. చాలా ఆవేదనగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. నన్ను నమ్ముకున్న వారికి నేనేం చేస్తాను. నన్ను కార్యకర్తలు క్షమించాలి.. .. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినోళ్లను నేను అడ్డుకున్నా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడెవరు వచ్చారో చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అందులోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్లను తిట్టా. టీడీపీ కోసం ఎంతో చేశా. .. నా మీద మొత్తం 37 కేసులు ఉన్నాయి. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకున్నా. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా. ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నా తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా.. .. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా. నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్నా. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా. చచ్చేంతవరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను ఎంపీ కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అని బుద్దా వెంకన్న అన్నారు. బుద్దా ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ కేశినేని చిన్ని మైక్ అందుకున్నారు. ‘‘పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడొవద్దు. త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు కూడా మంచి పదవులు వస్తాయి అని బుద్దాను సముదాయించే మాటలు చెప్పారు. ఇదిలా ఉంటే.. సీఐల బదిలీలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిచ్చు రాజేసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. అయితే.. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సాక్షిగా అది నిజమని తేలింది. -
Bihar: పోలీసులతో ఘర్షణ...మెడికోలకు గాయాలు!
ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(ఎస్‌కేఎంసీహెచ్)లో వైద్య విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో పోలీసుల చర్యను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.పోలీసుల లాఠీచార్జి అనంతరం వైద్య విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్‌కేఎంసీహెచ్‌లో వైద్యులు ఎమర్జెన్సీతో సహా అన్ని సేవలను నిలిపివేశారు. సమ్మెకు దిగుతున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు వైద్య విద్యార్థులు బైక్‌పై మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నారు. మెడికల్ కాలేజీ గేటు నంబర్ త్రీ దగ్గర అహియాపూర్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ అధికారి వీరిని ఆపారు.ఈ నేపధ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఒక వైద్య విద్యార్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని మిగిలిన వైద్య విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో విద్యార్థులందరికీ షేర్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థులంతా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని చుట్టుముట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు వాహనాల్లో ఎస్‌కెఎంసిహెచ్‌కి చేరుకున్నారు. అనంతరం వారు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రోగులు, వారి బంధువులు భయాందోళనలతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వైద్య విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. -
మధ్యాహ్నం భోజనం కాంట్రాక్టు కోసం టీడీపీ నేతల మధ్య ఘర్షణ
-
త్రిసూర్‌లో కాంగ్రెస్ ఓటమి.. కొట్టుకున్న కార్యకర్తలు
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేరళలోని త్రిసూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపి గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్ధి కే మురళీధరన్ ఓటమి చెందారు.అయితే పార్టీ ఓటమికి డీసీసీ చీఫ్ జోస్ వల్లూర్, త్రిసూర్ మాజీ ఎంపీ టీఎన్ ప్రతాపన్యే కారణం అంటూ జూన్ 4 తరువాత స్థానికంగా పలు పోస్టుల వెలువడ్డాయి. ప్రతాపన్, జోస్ వల్లూర్ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా ఓటమిపై త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) తాజాగా సమావేశమైంది. ఈ భేటీలో పోస్టర్ల అంశంపై కార్యకర్త సురేష్‌ను వల్లూరు ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది.డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిర, వల్లూర్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొందరు కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జోస్ వల్లూరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిరా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 19 మందిపై కేసు బుక్ చేశారు. వల్లూరుతో పాటు అతని మనుషులు డీసీసీ ఆఫీసులో తనపై దాడి చేసినట్లు కురియచిర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.అయితే వల్లూరు వల్లే మురళీధరన్ ఓడిపోయినట్లు కురియాచిర ఆరోపించారు. కౌంటింగ్ రోజు సైతం జిల్లా, రాష్ట్ర నాయకత్వం తన ప్రచారానికి రాలేదని మురళీధరన్ ఆరోపించారు. -
టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
నూజివీడు:ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ నడకుదురు గిరీష్‌పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. దీంతో గిరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. నూకల సాయికిరణ్ (చింటూ), నూకల సాయి అరుణ్‌లకు.. కౌన్సిలర్ గిరీష్‌కు మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విజయం సాధించినప్పటి నుంచి చింటూ, అరుణ్‌లు గిరీష్‌ను కవ్విస్తూ వస్తున్నారు. పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న గిరీష్ చికెన్ సెంటర్ వద్దకు సైతం వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మిత్రుడు మూడు సుధీర్‌కుమార్ బండిపై చింటూ వెళ్తుండగా.. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో గిరీష్ వారిని ఆపాడు. ఎందుకు కవ్విస్తున్నారంటూ చింటూను నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్లింది. ఈ క్రమంలో గిరీష్ చింటూపై కత్తితో దాడి చేశాడు. దీంతో అదే సెంటర్లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న హోంగార్డు చంద్రశేఖర్, సుధీర్, మరికొందరు నిలువరించి గిరీష్ వద్ద ఉన్న కత్తిని లాక్కున్నారు. తన అన్న చింటూపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న చింటూ తమ్ముడు నూకల సాయి అరుణ్ కత్తి తీసుకుని గిరీష్‌పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో గిరీష్ చావుబతుకుల మధ్య అక్కడి నుంచి పారిపోతున్నా వెంబడించారు. అక్కడి నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని సీఐ ఎంవీఎస్ఎన్ మూర్తికి తెలుపగా వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింటూను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితులు నూకల సాయి అరుణ్, మూడు సుధీర్‌కుమార్‌లను అరెస్టు చేశామని, వారిపై 307 కేసు నమోదు చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు. ఘటన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. తమ హోంగార్డు చంద్రశేఖర్ ఎంతో ధైర్యంగా గిరీష్ చేతిలోని కత్తిని లాక్కొన్నాడని, దీంతో మరిన్ని గాయాలు కాకుండా ఆపగలిగామన్నారు. ఈ సందర్భంగా హోంగార్డుకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు నూజివీడు డీఎస్పీ జీ లక్ష్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
టీడీపీ, బీజేపీ, జనసేనలో రచ్చ రచ్చ
-
ఒగ్గు పూజారుల ఘర్షణ
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో ఒగ్గు పూజారులు ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట మల్లన్న ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధి చెందిన రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయం వద్ద.. పూజల విషయమై ఒగ్గు పూజారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పూజారులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గంగరాజు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పూజల విషయమై కొన్నేళ్లుగా వివాదం.. రేకులకుంట మల్లన్న ఆలయంలో కొన్నేళ్లుగా ఒగ్గు పూజారుల మధ్య పూజల విషయమై వివాదం నెలకొంది. చెరుకూరి వంశానికి చెందిన 26 మంది, కోటి వంశంవారు 22 మంది, పయ్యావుల వంశం వాళ్లు 10 మంది పూజలు చేయడంతోపాటు పట్నాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల వంశం పూజారులు తాము 10 మందిమే ఉన్నామని, మరో 10 మందికి అవకా«శం ఇవ్వాలని కోరడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పయ్యావుల వంశంవారు దేవాదాయ శాఖ నుంచి కొత్తగా 10 మంది పూజలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారని ఈఓ తెలిపారు. దీంతో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద పూజలు చేస్తున్న కొత్తవారిని పాత పూజారులు నిలదీయంతో ఘర్షణ మొదలైంది. పరిస్థితి చేయిదాటిపోయి దాడులకు దిగారు. ఈ ఘటనతో ఆలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దాడుల విషయంలో పూజారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. -
ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే. చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్ -
ధర్మవరంలో హై టెన్షన్...వరదాపురం Vs పరిటాల..
-
ఎన్నికలకు ముందే జేఎన్‌యూలో ఘర్షణ.. పలువురికి గాయాలు!
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో శుక్రవారం అర్థరాత్రి విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తమ సభ్యుల్లో కొందరికి గాయాలయ్యాయని ఇరువర్గాలు పేర్కొన్నాయి. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన ప్రకారం ఈ ఘర్షణపై జేఎన్‌యూ పాలకవర్గం నుంచి ఇంతవరకూ స్పందన లేదు. 2024 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకోవడానికి క్యాంపస్‌లో విద్యార్థి సంఘాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వేదికపైకి ఎక్కి కౌన్సిల్ సభ్యులు, స్పీకర్లతో గొడవకు దిగి, యూజీబీఎంకి అంతరాయం కలిగించారని లెఫ్ట్-అనుబంధ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) ఆరోపించింది. సోషల్ మీడియాలో రెండు గ్రూపులు షేర్ చేసిన వీడియోలలో, ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు నినాదాలుచేస్తూ వాదించుకోవడాన్ని చూడవచ్చు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
బాబు సమక్షంలో.. కాబోయే సీఎం పవన్ అన్నందుకు..!
చిత్తూరు, సాక్షి: సీట్ల పంపకం తేలడం మాటేమోగానీ.. టీడీపీ-జనసేన కొట్లాటలు మాత్రం రోజుకో చోట బయటపడతున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో.. అదీ ఆయన సమక్షంలోనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం గమనార్హం. గంగాధర(జీడీ) నెల్లూరులో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రా.. కదలిరా బహిరంగ సభలో టీడీపీ- జనసేన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ జెండాలను కట్టిన కర్రలను తీసుకుని టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతిపరులను తరిమి కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చంద్రబాబు సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం. అందుకు కారణం ఏంటో తెలుసా?.. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ కొంతమంది జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారట. టీడీపీ కార్యకర్తలు అది భరించలేకే.. ఇలా డిష్యుం డిష్యుంకి దిగారు.