రోడ్డు ప్రమాదంలో టైలర్‌ మృతి | road accident.. tailor dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో టైలర్‌ మృతి

Published Tue, Oct 25 2016 1:51 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

road accident.. tailor dead

ఏలూరు అర్బన్‌ : పొరుగూరులో చదువుతున్న పిల్లలను  పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దెందులూరు మండలం అలుగులగూడెంకు చెందిన దానే వెంకన్న టైలర్‌. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన ఇద్దరు కొడుకులను కొవ్వలిలోని ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. వారిని రోజూ ఉదయం పాఠశాల వద్ద దించి తిరిగి  సాయంత్రం ఇంటికి తీసుకువస్తుంటాడు. ఈ నేప«థ్యంలో సోమవారం సాయంత్రం వెంకన్న యథావి«ధిగా  పిల్లలను తీసుకువచ్చేందుకు మోటార్‌సైకిల్‌పై వెళ్తూండగా కొవ్వలి సెంటర్‌లో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement