
బనశంకరి: ఐదు రూపాయల కుర్‌కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద పోరాటమే సాగింది. 10 మంది గాయపడగా, అంతకుమించి పరారీలో ఉన్నారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్‌కురే కొన్నారు. సద్దాం కుటుంబీకులు దగ్గరిలోనే చిన్న హోటల్ పెట్టుకున్నారు. గడువు మీరిన కుర్‌కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు.
దీంతో రగడ రాజుకుంది. రెండు కుటుంబాలవారు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు రెండు వాహనాల్లో వచ్చి హోటల్‌లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి కొట్టారని సద్దాం కుటుంబీకులు ఆరోపించారు. ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అరెస్ట్ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ బాలచంద్రనాయక్ తెలిపారు. కుర్‌కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొట్లాట దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇక గాయపడిన పలువురు ఆస్పత్రిలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment