
సాక్షి, హైదరాబాద్: వంట విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీష్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన బాదల్ తమాంగ్(29), సకిల మిశ్ర మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మణికొండ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. తమాంగ్ స్థానికంగా ఓ సెలూన్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి వంట విషయంలో తమాంగ్ భార్యతో గొడవపడి అన్నం తినకుండా ఆమె ఉన్న గదికి బయట నుంచి గడియ పెట్టి బయటకు వెళ్లాడు.
ఆదివారం ఉదయం 6.45 గంటలకు భార్య బయటకు వచ్చి చూడగా భర్త కనిపించలేదు. బాత్‌రూమ్‌కు వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా తాడుతో కిటికీ చువ్వలకు ఉరి వేసుకొన్నాడు. ఇరుగు పొరుగు సాయంతో బయటకు తీయగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
►మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment