packet
-
కుర్కురే తెచ్చిన రగడ.. 30 మంది అరెస్ట్
బనశంకరి: ఐదు రూపాయల కుర్కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద పోరాటమే సాగింది. 10 మంది గాయపడగా, అంతకుమించి పరారీలో ఉన్నారు. ఈ ఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణా అంగడిలో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు కుర్కురే కొన్నారు. సద్దాం కుటుంబీకులు దగ్గరిలోనే చిన్న హోటల్ పెట్టుకున్నారు. గడువు మీరిన కుర్కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో రగడ రాజుకుంది. రెండు కుటుంబాలవారు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు రెండు వాహనాల్లో వచ్చి హోటల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి కొట్టారని సద్దాం కుటుంబీకులు ఆరోపించారు. ఇరు కుటుంబాలు చెన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అరెస్ట్ భయంతో 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలచంద్రనాయక్ తెలిపారు. కుర్కురే కోసం ఇంత గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొట్లాట దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇక గాయపడిన పలువురు ఆస్పత్రిలో చేరారు. -
చిన్న ప్యాకెట్.. సూపర్‌హిట్!
న్యూఢిల్లీ: రకరకాల కారణాలతో ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు పెంచలేని పరిస్థితి నెలకొంది. అత్యంత ఆదరణ ఉండే చిన్న ప్యాకెట్ల ధరలను పెంచితే కొనుగోళ్లు తగ్గిపోతాయన్న ఆందోళనతో అవి కస్టమర్లను నిలబెట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేట్లు పెంచే బదులు గ్రామేజీ (బరువు)ని తగ్గించి అదే ధరకు సదరు ఉత్పత్తులను అందిస్తున్నాయి. తక్కువ రేటు ఉండే చిన్న ప్యాకెట్లకు (ఎల్‌యూపీ) డిమాండ్ బాగానే ఉండటంతో ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పలు కంపెనీలు తమ సబ్బులు, నూడుల్స్ మొదలుకుని చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల వరకూ వివిధ ఉత్పత్తుల విషయంలో ఇదే వ్యూహం పాటిస్తున్నాయి. వీటితో పాటు మధ్యస్థ రేట్లతో బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టడం, పెద్ద ప్యాక్‌లపై ధరల పెంపును సింగిల్ డిజిట్ స్థాయికి పరిమితం చేయడం వంటి ప్రయత్నాలెన్నో చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ఒకవైపు ధరలపరమైన చర్యలతో పాటు మరోవైపు వ్యయాల నియంత్రణ కసరత్తుతో ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌యూపీ ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. వీటి ధర శ్రేణి రూ. 1, రూ. 5, రూ. 10 స్థాయిలో ఉంటుంది. బండగుర్తుల్లాంటి ఈ రేట్లలో మార్పులు చేయలేని పరిస్థితి. అందుకే గ్రామేజీని తగ్గించి అదే రేట్లకు అందిస్తున్నాం. అదే పట్టణ ప్రాంతాల విషయానికొస్తే తలసరి ఆదాయం కాస్త ఎక్కువ. వినియోగదారులకు ఎక్కువ వెచ్చించగలిగే సామర్థ్యాలు ఉంటాయి. అందుకే పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచాము’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాస్త డబ్బు చేతిలో ఆడేలా చూసుకునేందుకు వినియోగదారులు ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా చౌక ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు తాము గమనించినట్లు పార్లే ప్రోడక్ట్స్ వర్గాలు తెలిపాయి. ఎల్‌యూపీ ప్యాక్‌ల అమ్మకాల్లో పెరుగుదల ఇందుకు నిదర్శనమని వివరించాయి. మార్చి త్రైమాసికం నుంచి మారిన ట్రెండ్.. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి క్వార్టర్లో ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం బిజోమ్ తెలిపింది. వంట నూనెలు వంటి కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం అసాధారణ స్థాయికి పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు వీలైనంత వరకూ పర్సులపై భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఎక్కువ పరిమాణంలో సరుకులు కొనుక్కునే వారు కూడా ప్రస్తుతం బడ్జెట్‌కి కట్టుబడి ఉండే ప్రయత్నాల్లో భాగంగానే ఎల్‌యూపీ ప్యాక్‌లవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. చాలా మటుకు ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో రూ. 1 నుంచి రూ. 10 వరకూ రేటుతో చిన్న ప్యాక్‌ల వాటా 25–35 శాతం మేర ఉంటోంది. హెచ్‌యూఎల్ వ్యాపారంలో ఇలాంటి చౌక ప్యాక్‌ల విక్రయాలు 30 శాతం వరకూ ఉంటాయి. ఇమామీ అమ్మకాల్లో వీటి వాటా 24 శాతం స్థాయిలో ఉంది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో అమ్మకాల్లో రూ. 5, రూ. 10 స్థాయి ప్యాక్‌ల వాటా 50–55 శాతం వాటా ఉంటోంది. అమ్మకాల సంగతి అలా ఉంచితే చిన్న ప్యాక్‌ల విషయంలోనూ కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అబనీష్ రాయ్ వివరించారు. పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచగలిగినప్పటికీ .. తక్కువ ధర యూనిట్లలో నిర్దిష్ట స్థాయికన్నా గ్రామేజీని తగ్గించడానికి వీల్లేదు. దీంతో అవి ప్రత్యేకంగా బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెడుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇమామీ ఇలాంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కాస్తంత ఎక్కువ ధరకు, ఎల్యూపీతో పోలిస్తే ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఓ మోస్తరు అవసరాల కోసం వినియోగదారులు అనవసరంగా అధిక రేటు పెట్టి పెద్ద ప్యాక్‌లను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పుతుందని రాయ్ పేర్కొన్నారు. ఇది ఇటు కొనుగోలుదారులు అటు కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటోందని వివరించారు. -
పిజ్జా లవర్స్‌కి ఓ షాకింగ్ వీడియో
-
పిజ్జా లవర్స్‌కి ఓ షాకింగ్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: పిజ్జా ప్రియులకు మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసినపుడు తనకు ఎదరైన చేదు అనుభవాన్ని ఢిల్లీకి చెందిన రాహుల్ అరోరా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పిజ్జా తిని తాను అనారోగ్యానికి గురయ్యానని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం పిజ్జా ఆర్డర్ చేసిన రాహుల్ ఎంచక్కా దాన్ని లాగించేశారు. అయితే స్వల్పంగా అనారోగ్యానికి గురి కావడంతో, మర్నాడు ఉదయం పిజ్జా వాళ్లు ఇచ్చిన మసాలా ప్యాకెట్‌ను విప్పి పరిశీలించాడు. ఈ ప్యాకెట్ నుండి న డామినోస్ ఒరెగానో పాకెట్లో పురుగులు దర్శనమివ్వడంతో షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను పిజ్జా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త! అంటూ సెప్టెంబర్ 10న ఫేస్బుక్లో ఈ విడియోను షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. మసాలా ప్యాకెట్లో ఉండేపురుగులు ఎక్కువ కదలకుండా ఉంటాయని, మసాలా దినుసుల్లానే కనిపిస్తూ..మోసం చేస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు పిజ్జా తినేటపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యవహారంలో స్థానిక పిజ్జా ఔట్ లెట్ క్షమాపణ చెప్పిందని చెప్పారు. అయితే దీనిపై వినియోదారుల ఫోరానికి ఫిర్యాదు చేసినట్టు రాహుల్ పేర్కొన్నారు. ఇదే అమెరికాలో అయితే ఏం జరిగేది.. భారతీయ వినియోగదారుల పట్ల చల్తా హై ధోరణికి ముగింపు పడాలని వ్యాఖ్యానించారు. ఘటనపై స్పందించిన డొమినోస్ పిజ్జా.. వినియోగదారులకు అందించే తమ ప్రొడక్టులు అన్ని పరిశుభ్రంగా ఉంటాయని తెలిపింది. రెస్టారెంట్ల ఇచ్చే సాచెట్లను పలుమార్లు పరిశీలించిన అనంతరమే పంపుతామని హామీ ఇచ్చింది. -
ఒక్కో రైతుకు ఒక ప్యాకెట్
- అధికంగా కావాలని రైతుల పట్టు - ససేమిరా అన్న అధికారులు - వరి విత్తనాల పంపిణీలో వాగ్వాదం నంద్యాలఅర్బన్: స్థానిక ఏడీఏ కార్యాలయ సమీపంలోని వరి సీడ్ ఫామ్‌హౌస్‌లో సోమవారం చేపట్టిన విత్తన వడ్ల పంపిణీలో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులకు కర్నూలు సోనా-5204రకం, నంద్యాల సోనా -7 రకం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. 30కేజీలున్న ప్యాకెట్‌కు రూ.1140తో చలానా చెల్లించి తీసుకెళ్లాలంటూ అధికారులు చెప్పగా రైతులు రెండు, మూడు ప్యాకెట్లు కావాలని డిమాండ్ చేశారు. ఒకప్యాకెట్ సీడ్‌తో ఏం చేయాలంటూ నిలదీశారు. బండిఆత్మకూరు, మహానంది, పాణ్యం, గోస్పాడు తదితర మండలాల రైతులు విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మధ్యాహ్నం వరకు పంపిణీ జరగకపోవడంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు ఒక్క ప్యాకెట్ మాత్రమే పంపిణీ చేస్తామని, మిగిలితే మరోసారి పంపిణీ చేపడతామని అధికారులు చెప్పారు. నంద్యాల సోనా-7రకం తక్కువగా ఉందన్నారు. దీంతో రైతులు చేసేదేమి లేక ఒక్క ప్యాకెట్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. పంపిణీలో ఫామ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఖాదర్‌వలి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. -
ఆహారపొట్లాల పంపిణీ
రైల్వేస్టేషన్ : సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్ ఆవరణలోని గడియారం స్తంభం దగ్గర పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్వే మల్లాది విష్ణు మాట్లాడుతూ పుష్కరయాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. వందలాది మంది యాత్రికులకు వెజిటబుల్ బిర్యానీ, వాటర్‌ప్యాకెట్లను అందించారు. కాంగ్రెస్ నాయకులు మీసాల రాజేశ్వరరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
గరళం!
అనంతపురం మెడికల్: కలుషిత నీటి భయంతో ఫిల్టర్ నీటిని సేవిస్తున్న లక్షలాది ప్రజలకు గుర్తింపు లేని మినరల్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు మరో ముప్పును తెచ్చి పెడుతున్నాయి. శుద్ధి చేసిన క్యాన్, బాటిల్, ప్యాకెట్ ద్వారా విక్రయిస్తున్న నీటిని తాగితే రోగాలు త థ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో కరిగిన ఘన పదార్థాల శాతాన్ని ( టీడీఎస్- టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) అతి స్వల్ప మోతాదుకు తగ్గించడమే అందుకు ప్రధాన కారణం. దీర్ఘకాలం ఈ నీటిని తాగితే మూత్రపిండాలు, హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పట్టణ, పల్లె ప్రాంతాల్లో వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇందులో పట్టుమని 10 మినహా తక్కిన ప్లాంట్లన్నీ భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) గుర్తింపు లేకుండా వెలిసిన వే! బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతున్నా పబ్లిక్ హెల్త్ అధికారులు గానీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థలు కానీ మొద్దునిద్ర వీడడం లేదు. స్వచ్ఛమైన నీరు అంటే: హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే కలిగి ఉన్న నీటిని స్వచ్ఛమైన నీరుగా వ్యవహరిస్తారు. దీన్ని శుద్ధజలం (డిస్టిల్డ్ వాటర్)గా పిలుస్తారు. ఈ నీటిని కర్మాగారాలకు వాడతారు. తాగేనీటిలో శరీరానికి అవసరమైన ఘన పదార్థాలు సరైన మోతాదులో ఉండటం తప్పనిసరి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఉపయోగకర ఘనపదార్థాలను మనం నీటి ద్వారానే గ్రహిస్తూ ఉంటాం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో భూగర్భజలాలు కలుషితమై సీసం, పాదరసం, ఫ్లోరిన్ లాంటి హానికర మూలకాలు కూడా తాగేనీటిలో కరిగి ఉన్నాయి. వీటిని తొలగించి శరీరానికి అవసరమైన మూలకాలను సరైన మోతాదులో ఉండేలా భూగర్భజలాలను శుద్ధి చేయాలి. కానీ చాలామంది ఈ ప్రక్రియను సరిగా నిర్వహించడం లేదు. హానికారకాలను తొలగించే ప్రక్రియలో భాగంగా చాలా ఫిల్టర్లు టీడీఎస్‌లను నామమాత్రపు స్థాయికి తగ్గిస్తున్నాయి. దీంతో తాగేనీటి ద్వారా శరీరం గ్రహించాల్సిన అవసరమైన మూలకాల మోతాదు గణనీయంగా తగ్గుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా, దీర్ఘకాలంలో శరీరంలో ఘనపదార్థాల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాగేనీటిలో టీడీఎస్ మోతాదు కనీసం 80-150 మధ్య ఉండటం మంచిదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సహా పలు సంస్థలు చెబుతున్నాయి. అక్రమాలు ఇలా: ప్రస్తుతం పోటీని తట్టుకునేందుకు భూగర్భజలాలను ఎక్కువ మోతాదులో ఫిల్టర్ చేస్తున్నారు. దీంతో మినరల్స్ పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నాయి. కొన్ని ప్లాంట్లలో రుచి కోసం రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాతన ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలో టీడీఎస్‌తో పాటు ఇతర వివరాలను రోజూ పరీక్షించి నమోదు చేసేందుకు ఓ బయోకెమిస్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మినరల్ ప్లాంటు ఏర్పాటుకు పబ్లిక్‌హెల్త్ అధికారులు అనుమతి ఇవ్వాలి. ఇవేవి ఫిల్టర్ ప్లాంట్లలో కనిపించవు. తెలుసుకోండిలా: నీటిలో టీడీఎస్ తెలుసుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర 500-1000 వరకూ ఉంటుంది. సాధారణంగా మార్కెటోలో లభించే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌నే చాలామంది మినరల్ వాటర్‌గా వ్యవహరిస్తారు. కానీ మినరల్ వాటర్ ప్రత్యేకమైంది. కొన్ని ముఖ్యమైన బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే దీనిని తయారు చేస్తున్నాయి. అనారోగ్యం పాలవుతారు - డాక్టర్ శివకుమార్ నీటి లవణాలు(సోడియం,ప్లోరిన్,కాల్షియం) సమపాళ్లలో ఉండాలి. మినరల్‌వాటర్ పేరుతో లవణాలను తొలగిస్తున్నారు. దీని ద్వారా ఎముకల్లో పటుత్వం కోల్పోవడం, చిన్నారుల్లో ఎదుగుదల, లో బీపీ తదితర సమస్యలు వస్తాయి. నిబంధనలు పాటించే మినరల్ వాటర్‌నే వాడాలి. -
విదేశీ వేస్ట్ వారియర్..!
విదేశీయులెవరైనా మన దేశానికి వస్తే... మన సంస్కృతిని చూసి ముచ్చటపడతారు. మన సంప్రదాయాలను చూసి సెల్యూట్ చేస్తారు. మన కళలను చూసి హ్యాట్సాఫ్ చెబుతారు. కానీ ఒక్క విషయానికి మాత్రం ముఖం చిట్లిస్తారు. అది... అపరిశుభ్రత. జోడీ అండర్హిల్ని కూడా మన దేశంలోని అపరిశుభ్రత చాలా చికాకు పెట్టింది. కానీ ఆమె మిగతావారిలా ముఖం తిప్పుకునో, ముక్కు మూసుకునో వెళ్లిపోలేదు. చీపురు పట్టింది. చెత్తను ఊడ్చడం మొదలుపెట్టింది. భారతదేశాన్ని చెత్త బారి నుంచి రక్షిస్తానంటూ శపథం చేసింది! పార్కలో సరదాగా కూర్చుని చిప్స్ తింటాం. ఖాళీ అయిన ప్యాకెట్‌ని అక్కడే వదిలి వెళ్లిపోతాం. దాహంగా ఉందని వాటర్ బాటిల్ కొంటాం. ఖాళీ అయిన తర్వాత విసిరేస్తాం. వాటివల్ల తిరిగి మనకే నష్టం వాటిల్లుతుందన్న స్పృహ మనకి ఉండదు. ఆ స్పృహను కలిగించేందుకే తాను వచ్చానంటుంది జోడీ అండర్హిల్. ఎక్కడో బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి, భారతదేశాన్ని చెత్తరహిత దేశంగా మార్చాలని కంకణం కట్టుకుంది. అందుకే ఉత్తర భారతదేశంలో అందరూ ఈమెని ‘చెత్తమ్మాయి’ అంటుంటారు. 1976లో ఇంగ్లండులో పుట్టింది జోడీ. మొదట్నుంచీ సమాజం కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తుండేది. అందువల్లే పెద్దయ్యాక రకరకాల ఉద్యోగాలు చేసినా ఏవీ తృప్తినివ్వలేదు. దాంతో ఓ స్వచ్ఛంద సంస్థలో చేరింది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. దానికి తోడు జోడీకి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. దాంతో పలు దేశాలు తిరిగి నిధులు సేకరించేది. పనిలో పనిగా అక్కడి సంస్కృతీ సంప్రదాయాల గురించి ఇష్టంగా తెలుసుకునేది. ఆ విధంగానే 2009లో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వచ్చింది. ఆ పర్యటన తనను ఎప్పటికీ భారతదేశంలోనే ఉంచేస్తుందని ఆమె ఊహించి ఉండదు. ఒంటరిగా వచ్చింది... సైన్యంగా మారింది... ఉత్తర భారతదేశం జోడీని చాలా ఆకర్షించింది. పర్వత సానువులు, వాటిపై పేరుకున్న మంచు ముద్దలు, పచ్చని చెట్లు, చక్కని జలపాతాలు... ఆ ప్రాకృతిక సౌందర్యానికి పరవశించింది జోడీ. కానీ అంత అందమైన ప్రకృతి పరిశుభ్రంగా లేకపోవడం ఆమెను బాధపెట్టింది. ముఖ్యంగా మల్లెపువ్వులా మెరవాల్సిన హిమాలయాలు సైతం మురికిగా తయారవడాన్ని ఆమె చూడలేకపోయింది. ఆమెలోని సామాజిక స్పృహ మేల్కొంది. అందరినీ కలిసి పరిసరాలను, పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించేది. కొందరు విని వదిలేసేవారు. కొందరు వినడానికి ఇష్టపడేవారే కాదు. దాంతో మొదటి అడుగు తనే వేయాలని నిర్ణయించుకుంది జోడీ. చలికోటు, బూట్లు, గ్లవుజులు వేసుకున్నా వణికిం చేంత చలి ఉండే హిమాలయాల్లో చెత్త ఏరడం ప్రారం భించింది. అందరూ తనని విచిత్రంగా చూస్తున్నా, చెత్తమ్మాయి అంటున్నా పట్టించుకునేది కాదు. దాంతో కొన్నాళ్లకు ఆమె తపనను అందరూ అర్థం చేసుకున్నారు. ఆమె పనిలో సాయపడటం మొదలుపెట్టారు. అయితే తన పని అంతటితో అయిపోలేదని, చేయా ల్సింది చాలా ఉందని జోడీకి తర్వాత అర్థమైంది. గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన కొన్ని దృశ్యాలు ఆమెను కదిలించాయి. ఇళ్ల పక్కనే చెత్తకుప్పలు ఉండటం, వాటి దగ్గరే పిల్లలు ఆడుకోవడం, శుభ్రత లేకపోవడం వల్ల అంటు వ్యాధులు ప్రబలడం వంటివి చూశాక తన సేవలను విస్తరించాల్సిన అవసరం కనబడింది జోడీకి. అప్పుడే ‘వేస్ట్ వారియర్స’ను నెలకొల్పింది. ఆసక్తి ఉన్నవారిని వాలం టీర్లుగా చేర్చుకుంది. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే... భారతదేశంలో చెత్త అన్న మాట వినబడకుండా చేయడం! ఎక్కడ చెత్త ఉంటే అక్కడ వేస్ట్ వారియర్స ప్రత్యక్షమైపోతారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చెత్త అనేది కనబడకుండా చేశారు. భారత దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ చెత్తరహితంగా చేయాలనే ఆశయంతో పని చేస్తున్నారు. తన లక్ష్యానికి అడ్డు ఉండకూడదని పెళ్లి కూడా మానుకుంది జోడీ. అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా అని అడిగితే... ‘రోజులో ఎక్కువ సమయం చెత్త ఏరు కోవడంలోనే మునిగిపోయే అమ్మాయిని భరించే మగాడు ఎక్కడ దొరుకుతాడు’ అంటూ నవ్వేస్తుంది. పిల్లల్ని పెంచడానికి కేటాయించే సమయాన్ని పనికే కేటాయిస్తాను అంటుంది. సమాజం కోసం బతికేవాళ్లకు తన అనే స్వార్థం ఉండదు. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఓటమీ ఉండదు! - సమీర నేలపూడి ‘‘పరిశుభ్రత అనేది ఏ ఒక్కరివల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరిలోనూ శుభ్రంగా ఉండాలన్న ఆలోచన ఉంటేనే అది సాధ్యపడుతుంది. చెత్తను తేలికగా తీసుకుంటాం. ఎక్కడ పారేస్తే ఏంటి అనుకుంటాం. దానివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రకృతికి హాని కలుగుతుంది. పర్యాటక రంగానికి హాని కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే... దేశ ప్రతిష్ఠను కూడా అది దెబ్బ తీస్తుంది. భారతదేశాన్ని చెత్తదేశం అని ఎవరూ అనకూడదనే నేను ‘చెత్తమ్మాయి’గా మారాను!’’