ఒక్కో రైతుకు ఒక ప్యాకెట్
ఒక్కో రైతుకు ఒక ప్యాకెట్
Published Mon, May 15 2017 11:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- అధికంగా కావాలని రైతుల పట్టు
- ససేమిరా అన్న అధికారులు
- వరి విత్తనాల పంపిణీలో వాగ్వాదం
నంద్యాలఅర్బన్: స్థానిక ఏడీఏ కార్యాలయ సమీపంలోని వరి సీడ్ ఫామ్‌హౌస్‌లో సోమవారం చేపట్టిన విత్తన వడ్ల పంపిణీలో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులకు కర్నూలు సోనా-5204రకం, నంద్యాల సోనా -7 రకం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. 30కేజీలున్న ప్యాకెట్‌కు రూ.1140తో చలానా చెల్లించి తీసుకెళ్లాలంటూ అధికారులు చెప్పగా రైతులు రెండు, మూడు ప్యాకెట్లు కావాలని డిమాండ్ చేశారు. ఒకప్యాకెట్ సీడ్‌తో ఏం చేయాలంటూ నిలదీశారు. బండిఆత్మకూరు, మహానంది, పాణ్యం, గోస్పాడు తదితర మండలాల రైతులు విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
మధ్యాహ్నం వరకు పంపిణీ జరగకపోవడంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు ఒక్క ప్యాకెట్ మాత్రమే పంపిణీ చేస్తామని, మిగిలితే మరోసారి పంపిణీ చేపడతామని అధికారులు చెప్పారు. నంద్యాల సోనా-7రకం తక్కువగా ఉందన్నారు. దీంతో రైతులు చేసేదేమి లేక ఒక్క ప్యాకెట్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. పంపిణీలో ఫామ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఖాదర్‌వలి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి పర్యవేక్షించారు.
Advertisement