ఆహారపొట్లాల పంపిణీ
సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్ ఆవరణలోని గడియారం స్తంభం దగ్గర పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్వే మల్లాది విష్ణు మాట్లాడుతూ పుష్కరయాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు.
రైల్వేస్టేషన్ :
సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్ ఆవరణలోని గడియారం స్తంభం దగ్గర పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్వే మల్లాది విష్ణు మాట్లాడుతూ పుష్కరయాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. వందలాది మంది యాత్రికులకు వెజిటబుల్ బిర్యానీ, వాటర్‌ప్యాకెట్లను అందించారు. కాంగ్రెస్ నాయకులు మీసాల రాజేశ్వరరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.