
బిచ్చగాడు సినిమాతో ఫేమస్ కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తాజాగా సీక్వెల్‌ను తెరకెక్కించారు. తానే హీరోగా, దర్శకుడిగా రూపొందించిన బిచ్చగాడు-2 ఇటీవలే థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
(ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!)
తాజాగా ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ ఆంటోనీ అందరికంటే భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్‌లో యాచకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తానే స్వయంగా వారికి వడ్డించారు. ఇదీ చూసిన ఆయన అభిమానులు హీరో చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. విజయ్ ఆంటోని భోజనం వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.
(ఇది చదవండి: అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి)
Comments
Please login to add a commentAdd a comment