beggars
-
బిచ్చగానిలా స్ట్రింగ్ ఆపరేషన్
-
యాచకులను నియంత్రించండి.. పాక్‌కు సౌదీ హెచ్చరిక
ఇస్లామాబాద్: పాక్‌లోని యాచకులు తమ పొట్టపోసుకునేందుకు సౌదీ అరబ్‌కు తరలివెళ్లడం గల్ఫ్ దేశానికి భారంగా మారింది. ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.పాక్‌లోని యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తాజాగా పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా హెచ్చరించింది. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారాన్ని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ప్రచురించింది. పాక్‌కు చెందిన యాచకులు గల్ఫ్‌కు తరలివెళ్లడాన్ని నియంత్రించాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోరింది. అక్కడి యాచకులు తమ దేశానికి రావడంతో ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆరోపించింది.ఉమ్రా వీసాతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా ఆ దేశం చర్యలు తీసుకోవాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఉమ్రాను ఏర్పాటు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు ఉమ్రా చట్టం తీసుకురావాలని పాకిస్తాన్ నిర్ణయించింది.దీనికిముందు సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా పేరుతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశానికి వెళుతున్నారని, అక్కడ భిక్షాటన సాగిస్తున్నారని సౌదీ అరేబియా తరచూ ఆరోపిస్తోంది.ఇది కూడా చదవండి: విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు -
కరాచీలో పెరిగిన యాచకుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం!
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుండి తీసుకున్న రుణాలతో పాక్ రోజులు నెట్టుకొస్తోంది. రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారింది. దేశంలోని నలుమూలల నుంచి నాలుగు లక్షలకు పైగా యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేర సంఘటనలు మరింతగా పెరిగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంపై పాక్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ ఒక నివేదికను అందజేసింది. దానిలో కరాచీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మాట్లాడుతూ, ఈద్, రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులు కరాచీకి వచ్చారని, వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం కరాచీలో యాచకుల సంఖ్య పెరిగిందని, అలాగే నేరాల సంఖ్య కూడా పెరిగిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నగర అదనపు ఐజీ మాట్లాడుతూ పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. -
ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఉపాధి మార్గాలు లేక వేలాది మంది అల్లాడిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలామంది వీధుల్లో, ఇతర రద్దీ ప్రదేశాలలో భిక్షాటనకు దిగుతున్నారు. తద్వారా వారు రెండు పూటలా కడుపు నింపుకుంటున్నారు. భారతదేశంలో కూడా బిచ్చగాళ్ల సంఖ్య అత్యధికం. పలు నగరాల్లో సిగ్నల్స్ దగ్గర, మాల్స్ వెలుపల కూడా బిచ్చగాళ్లు కనిపిస్తారు అయితే దేశంలో ఎక్కువ మంది బిచ్చగాళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో సుమారు 4 లక్షల మంది భిక్షాటన చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇవి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు. వాస్తవంగా దీనిని మించిన సంఖ్యలో బిచ్చగాళ్లు ఉండవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా యాచకులు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య 81 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల 13 వేల మంది యాచకులు ఉండగా, వీరిలో రెండు లక్షల మందికి పైగా పురుషులు, దాదాపు రెండు లక్షల మంది మహిళలున్నారు. దీంతోపాటు చిన్నారులు కూడా యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా యాచకులు ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిచ్చగాళ్లు ఉన్న ప్రాంతం విషయానికొస్తే లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇది కాకుండా దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది యాచకులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య ఖచ్చితమైమనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ గణాంకాలను ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి! -
కేబీఆర్ పార్కులో యాచకుల బెడదపై ‘ఎక్స్’లో ఫిర్యాదు
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు జీహెచ్ఎంసీ వాక్ వేలో యాచకుల బెడద వాకర్లకు ఇబ్బందిగా మారుతున్నదని, ఇక్కడ యాచించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని భానుమూర్తి అనే వాకర్ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఆదివారం ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ తక్షణమే తనిఖీలు చేపట్టి వాక్‌వేలో యాచిస్తున్న వారిని కుటుంబ సభ్యులకు అప్పగించాలని జీహెచ్ఎంసీ సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులను ఆదేశించారు. దీంతో సర్కిల్–18 యూసీడీ విభాగం అఽధికారులు ఆదివారం రాత్రి వాక్‌వేలో తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళ ఇక్కడకు వస్తున్న వాకర్లతో పాటు పక్కనే ఉన్న హోటల్‌వద్ద టీ తాగేందుకు వచ్చిన కస్టమర్ల వద్ద యాచిస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను బంజారాహిల్స్‌రోడ్ నెం.2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక నివాసం ఉంటున్న కుమారుడి వద్దకు చేర్చారు. అయితే ఆమె బెగ్గర్ కాదని, సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిందని కుమారుడు ఽఅధికారులకు చెప్పారు. మరోసారి బయటకు రాకుండా చూసుకోవాలని, ఇది మంచి పద్ధతి కాదని తల్లీకొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
'బిచ్చగాడు' హీరో.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే!
బిచ్చగాడు సినిమాతో ఫేమస్ కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తాజాగా సీక్వెల్‌ను తెరకెక్కించారు. తానే హీరోగా, దర్శకుడిగా రూపొందించిన బిచ్చగాడు-2 ఇటీవలే థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) తాజాగా ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ ఆంటోనీ అందరికంటే భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో యాచకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తానే స్వయంగా వారికి వడ్డించారు. ఇదీ చూసిన ఆయన అభిమానులు హీరో చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. విజయ్ ఆంటోని భోజనం వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు. (ఇది చదవండి: అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి) -
బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం
ఏ సిగ్నల్ దగ్గరో, లేదా దారిమధ్యలోనో దీనంగా కనిపించిన బిచ్చగాళ్లకు తోచినంత సాయం చేయడం చాలామందికి అలవాటు. అలా చేయడం వల్ల కాస్త పుణ్యం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ ఒడిశాకు చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్టు చంద్ర మిశ్రా మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ‘‘దానం చేయవద్దు పెట్టుబడి పెట్టండి’’అనే నినాదంతో అద్భుతాలు సృష్టించారు. ఈ పిలుపు వెనుక ఉన్న సాహసం, ఆయన సాధించిన విజయం గురించి తెలిస్తే.. మీరు కూడా ఔరా అంటారు..! బెగ్గర్స్ కార్పొరేషన్: చంద్ర మిశ్రా జర్నలిస్టు,సామాజిక కార్యకర్త, చంద్ర మిశ్రా బిచ్చగాళ్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడంలో పెట్టుబడి పెడితే, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వొచ్చని బాగా నమ్మారు. బిచ్చగాళ్లకు భిక్ష కాదు పెట్టాల్సింది.. కాసింత చేయూత, తగినంత పెట్టుబడి ఉంటే అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో అసంఘటిత రంగానికి చెందిన వేలాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోవడం, వారణాసిలో గుడి దగ్గర వేలాంది మంది బెగ్గర్స్‌ను చూసిన చలించిపోయిన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పేదరికంతో బిచ్చగాళ్లుగా మారిన వారికి దానం పరిష్కారం కాదనీ, ప్రాథమిక మార్పు తీసుకొచ్చేలా సాయం చేయడమే ఏకైక పరిష్కారమని నమ్మారు. అలా అనేక ప్రయోగాల తర్వాత, చంద్ర అధికారికంగా ఆగస్టు 2021లో బెగ్గర్స్ కార్పొరేషన్‌ను రిజిస్టర్ చేసారు. రూ.10 నుంచి రూ.10వేలు దాకా తోచినంత పెట్టుబడి పెడితే ఆరు నెలల్లో 16.5 శాతం వడ్డీతో చెల్లిస్తామని, దీని ద్వారా గ యాచకుల జీవితాల్లో మార్పువస్తుందని ప్రకటించారు. బిచ్చగాళ్లకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే చంద్ర లక్ష్యం. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన నిరుద్యోగ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్బుక్ సర్వే నిర్వహించి వారణాసిలో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా సమీప ప్రాంతాల నుండి దాదాపు 27వేల మంది చేరడంతో ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. ఉత్సాహం చూపించిన వారికి బ్యాగుల తయారీవంటి నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాలు ఇప్పించడం మొదలైంది. దీంతో పలువురు బిచ్చగాళ్ళు కార్పొరేషన్లో చేరిక పెరిగింది. శిక్షణ తరువాత రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. అలా ఇంతింతై..అన్నట్టుగా సాగుతోంది బెగ్గర్స్ కార్పొరేషన్. 2021-22లో రూ. 5.7 లక్షలతో మొదలైన పెట్టుబడి, 2022-23లో 10 రెట్లు పెరిగింది. ఇపుడు రూ. 10 కోట్ల పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయంపై పలువురి ప్రశంసలు దక్కాయి. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా? ) #BeggarsCorporation is raising ₹ 10 cr #investment, not #donation. Indians donate ₹ 103 lakh cr p/a. If only 700 donors invest ₹ 1.5 lac each on one beggar, we don't need #VentureCapital to create 1st #beggingfree city of India. Don't donate, invest.https://t.co/TkwiATIS8k — Beggars Corporation (@BeggarsCorp) April 13, 2023 వ్యవస్థాపకులుగా 14 కుటుంబాలు ఫలితంగా ఇప్పటికే 14 పేద కుటుంబాల జీవనోపాధి కల్పించారు. తద్వారా ప్రారంభ పెట్టుబడిదారుల డబ్బును ఆరు నెలల్లోపు తిరిగి ఇచ్చేయడమేకాదు, 16.5 శాతం లాభాన్ని ఆర్జించారు. దీంతో తన భాగస్వాములైన బద్రీనాథ్ మిశ్రా, దేవేంద్ర థాపాతో కలిసి, మిశ్రా ఆగస్ట్ 2022లో బెగ్గర్స్ కార్పొరేషన్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారి పోయింది. 14 యాచక కుటుంబాలు వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నాయి. ఇందులో పన్నెండు కుటుంబాలు చక్కటి సంచులను తయారు చేస్తాయి. మరో రెండు కుటుంబాలు వారు దేవాలయాల సమీపంలో దుకాణాల్లో పువ్వులు, పూజా సామగ్రి ఇతర వస్తువులను విక్రయిస్తారు. If you think #beggars can't work, please watch this video. Today for the first time she came with her child. I motivated her to work. With 15 minutes of guidance, she started stitching. What if she gets skill training under Learn & Earn? @narendramodi @blsanthosh @MSDESkillIndia pic.twitter.com/KHm3jVNugr — Chandra Mishra (@employonomics) December 29, 2021 కార్పొరేషన్లో చేరింది ఒక మహిళ కావడం విశేషం. భర్త వేరొకరిని పెళ్లిచేసుకుని బాధిత మహిళను ఇంటినుంచి తరిమిమేయడంతో 12 ఏళ్ల కొడుకుతో పాటు, కాశీ ఘాట్ వద్ద భిక్షాటన చేసేది. ఆమెను కలిసి పనినేర్చుకోమన్నపుడు వెనకడుగు వేసింది. మిషన్‌ను పాడు చేస్తానేమోనని భయపడింది. చివరికి 15 నిమిషాల్లో ఆమె నేర్చుకొంది. కుట్టుపని శిక్షణలో పదును తేలడం బెగ్గర్స్ కార్పొరేషన్‌కు మరింత ప్రోత్సహాన్నిచ్చిందనీ, వారికి చేయూతనిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచితే చాలనే నమ్మకాన్ని తమలో పెంచిందని చంద్ర చెబుతారు. ‘‘వారి జీవితాలను మార్చడంలో ఎంతవరకు విజయం సాధించానో ఖచ్చితంగా తెలియదు, కానీ బనారస్ బెగ్గర్స్ కార్పొరేషన్ ద్వారా నేను మారును. నేను ఒక మాధ్యమం మాత్రమే. నిజానికి నేను యూపీకి చెందిన వాడ్నికాను. వారణాసి ప్రజలతో నాకు సంబంధం లేదు. కానీ వృద్ధి సమానంగా ఉండాలని ఈ ఉద్యమం నాకు నేర్పింది. మనం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించే వరకు రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. బిచ్చగాళ్లు పారిశ్రామికవేత్తలు కాగలిగితే, నిరుద్యోగం అనేదే ఉండదు’ అంటారు చంద్ర. విరాళాలకు బదులుగా పెట్టుబడులను ప్రోత్సహించాం తద్వారా బిచ్చగాళ్ళు వ్యవస్థాపకులుగా మారారు. ఈ రకమైన చర్య ప్రపంచంలోనే మొదటిది, ఏకైక చొరవ అని ఆయన పేర్కొన్నారు. అవార్డులు, రివార్డులు ♦ఈ మిషన్‌లో ఒక్కో బిచ్చగాడికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. వీటిలో రూ. 50వేల మూడు నెలల నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి వినియోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని వ్యక్తి సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఖర్చు చేస్తారు. ♦ దీంతోపాటు వారణాసి ఘాట్ల వద్ద అడుక్కునే పిల్లలకు సహాయం చేయడానికి మిశ్రా స్కూల్ ఆఫ్ లైఫ్‌ను కూడా స్థాపించారు. బెగ్గర్స్ కార్పొరేషన్ చంద్ర మిశ్రాకు 100 ఇన్నోవేటివ్ స్టార్టప్‌లలో స్థానం సంపాదించిపెట్టింది. తరువాత టాప్ 16 మైండ్‌ఫుల్ స్టార్టప్‌లలో చేరారు. ♦ ప్రారంభంలో 57 మంది తన ప్రచారానికి నిధులు సమకూర్చారు . వారి డబ్బుతో, మిశ్రా లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఉపాధిని ఏర్పాటు చేశారు. ♦ బెగ్గర్స్ కార్పొరేషన్స్ అనేక అవార్డులను కూడా అందుకుంది. స్టార్టప్ ఇండియా సహకారంతో లెమన్ ఐడియాస్ నిర్వహించిన ఇన్నోప్రెన్యూర్స్ గ్లోబల్ స్టార్టప్ కాంటెస్ట్‌లో ఇది బెస్ట్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును అందుకుంది. -
హైదరాబాద్‌లో నరక ‘యాచన’.. ప్లాన్ రెడీ చేసిన అధికార యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో చిన్నారుల యాచనపై ఉక్కుపాదం మోపేందుకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో కూడిన సంచార వాహనాన్ని రంగంలోకి దింపనుంది. ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించింది. త్వరలో సంచార వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి రెండు పర్యాయాలు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం తాజాగా నిరంతర ప్రక్రియగా సంచార వాహనంతో ప్రత్యేక కార్యాచరణకు దిగుతోంది. గత కొనేళ్లుగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు మూణ్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు చేపట్టిన చర్యలతో కొన్నాళ్లపాటు వీరి బెడద తగ్గినా.. మళ్లీ యాచకులకు.. ‘ఫ్రీ’ నగరంగా తయారైంది. దీంతో నగంరలోని ప్రధాన కూడళ్లలో చిన్నారులతో, పసి పిల్లలను చంకన పెట్టుకొని యాచకులు వాహనదారులను అవస్థలకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. విజృంభిస్తోన్న బెగ్గర్ మాఫియా నగరంలో బెగ్గింగ్ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారి, ఆపదల్లో ఉన్నవారి కుటుంబాల చిన్నారులను పట్టుకొచ్చి యాచన చేయిస్తోంది. కుటుంబాలకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు వారి పిల్లలతో భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత ‘వసూలు’ చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెట్టడం, టార్గెట్ మేరకు డబ్బులు తేకపోతే హింసించడం షరామామూలుగా మారింది. నరక ‘యాచన’ అభం శుభం తెలియని పసి పిల్లలను బెగ్గింగ్ మాఫియా నరక యాతనకు గురి చేస్తోంది. పసి పిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమేస్తారన్న ఉద్దేశంతో రెండేళ్లలోపు చిన్నారులను వినియోగిస్తోంది. ముఖ్యంగా నగరానికి వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించడం నిత్యకృత్యమైంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వందలకు వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా యాచకులకు చిన్నారులను ఉదయం ఏడు గంటలకు అందించి సాయంత్రం తీసుకెళ్లడం చేస్తున్నట్లు సమాచారం. కొందరు పసి పాపకు ఆకలి లేకుండా నిద్రలోనే ఉండేలా రెండు, మూడు గంటలకోసారి ప్రమాదకరమైన నల్ల మందు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు వందల మందికిపైగా నగరంలో సుమారు ఐదువందలకు పైగా చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్లు తెలుస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాల్లో చిన్నారులు అధికంగా కనిపిస్తారు. గత ఐదేళ్లలో ఆపరేషన్ ముస్కాన్,ఆపరేషన్ స్మైల్ కింద సుమారు రెండు వేలకు పైగా చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
యాచన.. డిజిటల్ యోచన
అర్వపల్లి: అంతా డిజిటల్‌మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్‌పే, గూగుల్‌పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్ పేమెంట్ స్కానర్‌ను చూపించాడు. దీంతో గోవర్దన్ తన సెల్‌తో స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లించాడు. ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్) గ్రామమని తెలిపాడు. హనుమాన్ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు. -
యాచకుల మధ్య వివాదం.. నాలుగు తులాల గొలుసు దొరికింది..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): రోడ్డుపై దొరికిన బంగారాన్ని పంచుకునే క్రమంలో యాచకుల మధ్య తలెత్తిన వివాదం చివరకు పోలీసుల వరకు వెళ్లి గొలుసు పోగొట్టుకున్న మహిళకు ఊరట కలిగించింది. వివరాల్లోకి వెళితే....ఈ నెల 25న ఉప్పుగూడ తానాజీనగర్‌కు చెందిన స్వాతి అనే మహిళ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల్లో దర్శనానికి వెళ్లిన క్రమంలో నాలుగు తులాల బంగారు గొలుసును పోగొట్టుకుంది. ఈ విషయమై ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా ఈ గొలుసు చార్మినార్ వద్ద యాచకులకు దొరికింది. దీనిని పంచుకునే క్రమంలో వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో వీరిలో ఒకరు చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గొలుసును స్వాధీనం చేసుకొని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ గొలుసు స్వాతికి చెందిందని నిర్ధారించిన పోలీసులు....ఆమెకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. -
ప్రగ్యాకు చుక్కలు చూపించిన బిచ్చగాళ్లు.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’సినిమాలో బ్రహ్మనందం, బిచ్చగాళ్ల సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. కొంతమంది యాచకులు బ్రహ్మిని చుట్టుముట్టి బాబు.. బాబు అంటూ డబ్బుల కోసం వేధిస్తుంటారు. డబ్బులు ఇచ్చినా వదలరు. చివరకు వాళ్లకి క్షమాపణ చెప్పి వెళ్లిపోతాడు. అచ్చం అలాంటి ఘటననే హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌కు ఎదురైంది. రోజూ మాదిరే జిమ్ సెంటర్‌కి వెళ్లింది ప్రగ్యా. జిమ్ చేసి బయటకు వచ్చేసరికి కొంతమంది పిల్లలు డబ్బులు అడుగుతూ కనిపించారు. వారికి కాస్త డబ్బులు తీసి ఇచ్చి కారు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో మరికొంతమంది యాచకులు వచ్చి.. మేడమ్ మేడమ్ అంటూ ప్రగ్యాని తెగ విసిగించారు. బౌన్సర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. కారు డోర్ అద్దాలు పైకి ఎత్తకుండా చేతులు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆమె తన దగ్గరున్న డబ్బులన్ని వాళ్లకే ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రగ్యా ప్రస్తుతం బాలయ్య సరసన ‘అఖండ’లో నటిస్తోంది. -
బెగ్గర్లకు బంపరాఫర్: ప్రభుత్వం నుంచి రోజుకు రూ.215
రాజస్తాన్: ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే ఎక్కడో ఒకదగ్గర యాచకులు తారసపడుతుంటారు. కొందరు వారి పరిస్థితిని అర్థం చేసుకుని చేయగలిగిన సాయం చేస్తే మరికొందరు విస్కుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వారి జీవితాలు మర్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జైపూర్‌లో ‘బెగ్గర్‌ఫ్రీ’ అనే వినూత్న కార్యక్రమానికి రాజస్థాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజస్తాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఆర్ఎస్ఎల్డీసీ), సోపన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 43 మంది యాచకులను చేరదీశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి జైపూర్ లో యాచిస్తూ జీవిస్తున్నారు. ఈ 43 మందికి వసతి సదుపాయం కల్పించి, యోగా నేర్పించడం, ఆటలు ఆడించడం, కంప్యూటర్ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమం గురించి రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిరజ్ కుమామర్ పవన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని యాచకులందర్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. రాజస్థాన్ పోలీసులు జైపూర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా బెగ్గర్స్ ఫ్రీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించామని, దీనికోసం ‘కౌశల్ వర్ధన్’ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాచుల వారీగా శిక్షణ నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 20 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని, శిక్షణ పూరై్తన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొలిసారి జైపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. యోగా ట్రైయినర్ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరు కాస్త భిన్నంగా ఉంటారు. మానసికంగానే గాక, వివిధ అనారోగ్య సమస్యలతో శారీరకంగానూ బలహీనంగా ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి మానసిక, శారీరక స్థితిగతులను అంచనావేసిన తరువాత వారికి యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. ‘‘సమాజంలో యాచకులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమని సోపన్ సంస్థ అధికారి చెప్పారు. మూడున్నర నెలలపాటు వారికి శిక్షణతోపాటు రాజస్థాన్ ప్రభుత్వం వారికి రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ నగదు భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. -
బిక్షాటనలో రూ.43 లక్షల లాటరీ
పారిస్ : ఉపాధి లేకపోవడంతో ఆ నలుగురు బిచ్చగాళ్లుగా మారారు. వీరికి రోజూ పూట గడవడమే కష్టంగా ఉండేది. బిక్షాటన చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకునేవారు. అయితే లాటరీ టికెట్లు అమ్మే దుకాణాన్ని బిక్షాటనకు స్థలంగా ఏంచుకున్నారు. ఎందుకంటే లాటరీ టికెట్లు కొనేందుకు అక్కడికి జనం ఎక్కువగా వస్తారనేది వీరి ప్లాన్. అవతలి వారికి లాటరీ తగులుతుందే లేదో తెలియదు గానీ కస్టమర్లు పారేసిన లాటరీ టికెట్లను భద్రంగా ఉంచుకునేవారు. ఏదోఒక రోజు వారికి ఆ లాటరీ టికెట్ల రూపంలో లక్షలు తగిలే అవకాశం ఉండవచ్చన్నది. (చదవండి : భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) ఆరోజు రానే వచ్చింది. ఒకరోజు అక్కడికి ఓ యువతి వచ్చి లాటరీ టికెట్ కొన్నారు. అప్పటికే పక్కనే ఉన్న ఆ నలుగురు బిచ్చగాళ్లు దానం చేమయని యువతిని ప్రాదేయపడగా ఆమె ఏం ఆలోచించకుండా చేతిలో ఉన్న లాటరీ టికెట్‌ను బిక్షంగా వేసింది. బిక్షమడిగితే డబ్బులు ఇవ్వకుండా ఎందుకు పనికిరాని లాటరీ టికెట్ చేతిలో పెట్టిందేంటి అనుకున్నారు. అయితే లాటరీ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగానే వారి కళ్లు బైర్లు కమ్మాయి. దాదాపు 50వేల యూరోలు( దాదాపు రూ. 43లక్షల రూపాయలు) వారికి లాటరీగా తగలింది. పాపం ఆ యువతి తాను కొన్ని టికెట్‌ను కనీసం స్క్రాచ్ చేయకుండా ఎందుకు వీరికి బిచ్చమేసిందో తెలియదుగాని వారిని లక్ష్మీదేవి కనికరించింది. అయితే లాటరీ నిజంగా గెలుచుకున్నామా లేదా అనే సంగతి తెలుసుకోవడానికి ఫ్రెంచ్ లాటరీ ఆపరేటర్ ఎఫ్డీజేను కలుసుకున్నారు. వారికి నిజంగానే లాటరీలో డబ్బు వచ్చిందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. యువతి దానం చేసిన లాటరీలో గెలుచుకున్న డబ్బులు వీరికే సొంతమని పేర్కొంది.(చదవండి : కరోనా వ్యాక్సిన్‌ను అడ్డుకుంటారా ?!) -
కరోనా కట్టడి ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. వివిధ విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కానీ, కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం పరిస్థితిని తేలిగ్గా తీసుకుంటున్నారు. యాచకుల తాత్కాలిక పునరావాసం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. యాచకులను తెచ్చి తాత్కాలిక బసలో ఉంచారు. ఆపై పట్టించుకోకపోవడంతో యాచకులంతా ఇష్టానుసారం తిరిగారు. ఉంచింది ఓ మైదానం కావటంతో కొందరు యువకులు అలవాటుగా అక్కడ జాగింగ్ చేశారు. అంతలో యాచకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలటంతో ఆ చుట్టుపక్కల ఉండే వారందరిలో ఇప్పుడు భయం మొదలైంది. జీహెచ్ఎంసీ అధికారులు తీరిగ్గా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ అంటూ ప్రకటించి హడావుడిగా కట్టడి చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం అత్తాపూర్ తదితర ప్రాంతాల్లోని 50 మంది యాచకులను జీహెచ్ఎంసీ సమీకరించి విజయనగర్ కాలనీలోని మున్సిపల్ ఫుట్‌బాల్ మైదానంలో ఆశ్రయం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అక్కడుంచిన యాచకులను అధికారులు గాలికొదిలేశారు. పగటివేళ ఆ యాచకులు సమీపంలోని ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ యాచిస్తూ వచ్చారు. తిరిగి సాయంత్రం మైదానానికి చేరుకునేవారు. జీహెచ్ఎంసీ సిబ్బంది భోజన వసతి కల్పించినా, కొందరు సొంతంగా వండుకోవటం ప్రారంభించారు. రాత్రి పడుకునే సమయంలో తప్ప యాచకులు మిగతా ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల్లోనే తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితిలో కచ్చితంగా మాస్కు ధరించాల్సి ఉన్నా, యాచకులకు జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని అందించలేదు. దాదాపు యాభై మంది సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తుండటంతో జనం బిత్తరపోయారు. ఒకేసారి ఇంతమంది యాచకులు కొత్తగా కనిపిస్తున్నారంటూ కొంత ఆందోళనకు కూడా గురయ్యారు. ఇక మైదానంలోని బోరు పంపు వద్ద వారు స్నానాలు చేస్తూ, దుస్తులు ఉతుక్కోవటంతో కొన్ని రోజుల పాటు ఆ మురుగునీరు కాలనీలో ఇళ్ల ముందు కాలువకట్టింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు చేతులు కాలాక.. యాచకుల బృందంలోని ఓ వృద్ధురాలికి కరోనా పాజి టివ్ వచ్చింది. దీంతో ఇన్ని రోజులు ఆ బాధితురాలి తోనే కలిసి ఉన్న మిగతావారి పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు వెంటనే అందరి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. మైదానంలో రెండు మరుగుదొడ్లే ఉన్నాయి. ఇన్ని రోజులు బాధితురాలు సహా మిగ తా యాచకులు వాటినే వాడారు. కలిసి తిన్నారు, ఒకేచోట పడుకున్నారు. ఆ ప్రాంతాలన్నీ కలియదిరిగారు. యాచకులకు ఆ మైదానాన్ని షెల్టర్ చేసి అక్కడే భోజ నాలు అందిస్తున్నప్పుడు వారు వెలుపలికి రాకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడే వైద్య పరీక్షలు చేసి ఉం టే, కరోనా బాధితులుంటే వెంటనే తేలేది. కానీ, అదే మీ జరగలేదు. ఈలోగా, ఇన్ని రోజులపాటు వారు బస్తీలు, కాలనీల్లో తిరగటం, వారు మైదానంలో ఉండగానే అక్కడ కొందరు యువకులు అటవాటు ప్రకారం జాగింగ్ చేయటం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది. అంతా అయ్యాక శుక్రవారం మైదానానికి రెండు వైపులా కంటైన్మెంట్ జోన్ అని రాసి ఉన్న హెచ్చరికలను ఏర్పాటు చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది ట్యాంకర్ సాయంతో మైదానం మొత్తం రసాయన జలాలను పిచికారీ చేశారు. ఏంటీ సంగతి అని ఆరాతీస్తే, అప్పుడుగాని మైదానంలో ఉన్న యాచకురాలికి వైరస్ సోకిందన్న సంగతి స్థానికులకు తెలియలేదు. -
కరోనా : యాచకులు, నిరాశ్రయులపై ప్రత్యేక దృష్టి
-
బెజవాడలో యాచకులు తరలింపు
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నేపథ్యంలో యాచకులు, నిరాశ్రయులపై వీఎంసీ(విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడలో ఉన్న యాచకులు, నిరాశ్రయుల కోసం రోడ్లపై జల్లెడ పడుతున్నారు. స్వచ్చంధ సంస్ధలు రోడ్లపైకి వస్తూ యాచకులు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తుండడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యి రోడ్లపై యాచకులు కనిపిస్తే వారిని వెంటనే షెల్టర్లకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదు బస్సుల ద్వారా 250మందికి పైగా యాచకులను షెల్టర్లకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా విజయవాడ పరిధిలోని పది షెల్టర్ల లో యాచకులను ఉంచనున్నట్లు, మిగతా నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వీఎంసీ అధికారులు తెలిపారు. యాచకులు, నిరాశ్రయులకు భోజనం పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ('శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు') -
భోపాల్‌లో సిటీ బెగ్గర్లు
హైదరాబాద్‌కు చెందిన కొందరు మహిళలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బెగ్గింగ్ పేరిట చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. వీరు అమాయకులైన చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు తేలింది. మరోవైపు చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భోపాల్‌లో అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి చెందిన అధికారులు చైల్డ్ లైన్ సహాయంతో దాడులు నిర్వహించి 21 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 44 మంది చిన్నారులను కాపాడారు. చిక్కిన మహిళల్లో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా వెనుక చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి వ్యవహారాలు ఉండొచ్చనే అనుమానంతో ఆ మహిళలపై భోపాల్‌లోని బజ్రియ ఠాణాలో కేసులు నమోదు చేశారు. భిక్షాటన చేస్తూ చిక్కిన 21 మంది మహిళలను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన అధికారులు చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ మాఫియా వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ సీఐడీ ఆధీనంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన అధికారులు కాన్పూర్, హైదరాబాద్‌లో దర్యాప్తు చేపట్టారు. సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ బెగ్గింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి (సీడబ్ల్యూసీ) చెందిన అధికారులు చైల్డ్ లైన్ సహాయంతో నగరంలో దాడులు నిర్వహించి 21 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ భిక్షాటన చేస్తున్న 44 మంది చిన్నారులను కాపాడారు. సీడబ్ల్యూసీకి చిక్కిన మహిళల్లో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా వెనుక చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి వ్యవహారాలు ఉండవచ్చుననే అనుమానంతో ఆ మహిళలపై భోపాల్‌లోని బజ్రియ ఠాణాలో కేసులు నమోదు చేశారు. భిక్షాటన చేస్తూ చిక్కిన 21 మంది మహిళలను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన అధికారులు చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ మాఫియా వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ సీఐడీ ఆధీనంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన అధికారులు కాన్పూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ దర్యాప్తు చేపట్టారు. బిచ్చగాళ్లు పెరిగిపోవడంతో... భోపాల్‌లో నగరంలో ఇటీవల బిచ్చగాళ్ళ తాకిడి ఎక్కువైనట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మహిళా భిక్షగత్తెల చేతుల్లో చిన్నారులను గమనించిన అక్కడి సీడబ్ల్యూసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో గత నెల మూడో వారంలో వరుస దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 21 మంది మహిళలను అదుపులోకి తీసుకుని, 44 మంది చిన్నారులకు కాపాడారు. సదరు మహిళల వ్యవహార శైలి ఆద్యంతం అనుమానాస్పదంగా ఉండటంతో సీడబ్ల్యూసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు వారి వ్యవహారశైలి భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు బుర్ఖాలు ధరించి, చేతుల్లో లేదా వీల్‌చైర్‌పై చిన్నారులతో భిక్షాటన చేస్తుండగా పలకరిస్తే తెలుగులో మాట్లాడుతున్నారు. తాము ఓ వర్గానికి చెందిన వారమని చెబుతున్నప్పటికీ.. పేర్లు, మెడలో ధరించిన మంగళసూత్రాలు, కాళ్లకు ఉన్న మట్టెలు మరో వర్గానికి చెందిన వారిగా సూచిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అవసరం లేకపోయినా.. ఈ మహిళల్లో కొందరికి భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని బజ్రియ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు భర్తలతో వేరు పడగా, మరికొందరు దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరి సంతానం అనేక మిషనరీ స్కూళ్లల్లో చదువుకుంటుండగా, మరికొందరు మహిళలు భిక్షాటనతోనే సొంతంగా ఇళ్లు సైతం సమకూర్చుకున్నట్లు వెల్లడైంది. ఓ మహిళకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండగా, పిల్లలు హిమాయత్‌నగర్‌లోని ప్రముఖ మిషనరీ స్కూల్లో చదువుకుంటున్నట్లు తేలింది. రెస్క్యూ చేసిన చిన్నారుల్లో కొందరు ఇంగ్లిష్ సైతం మాట్లాడుతున్నట్లు పోలీçసులు పేర్కొన్నారు. వీరిలో ఓ మహిళ నగరంలోని ఓ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తున్నట్లు తేలింది. సెలవుల్లో మాత్రం వివిధ నగరాలకు వెళ్లి బిక్షమెత్తుకుంటానని తెలిపింది. తమ వెంట ఉన్న చిన్నారులు తమ పిల్లలే అంటూ వారు చెబుతున్నా పోలీసులు మాత్రం నమ్మట్లేదు. అదే నిజమైనా సొంత పిల్లలతో భిక్షాటన చేయించడమూ నేరం అయినందున వీరిని రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి కొన్ని ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి అసలైనవా? కాదా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రంగంలోకి దిగిన సీఐడీ సిట్... ఈ బెగ్గింగ్ మాఫియా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్ పోలీసు విభాగం కేసును బజ్రియ పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీకి బదిలీ చేసింది. కేసును భోపాల్‌తో పాటు కాన్పూర్, హైదరాబాద్‌ల్లోనూ దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సిట్ ఏర్పాటు చేసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు కాన్పూర్, హైదరాబాద్ చేరుకుని ఆరా తీస్తున్నాయి. రెస్క్యూ చేసిన చిన్నారుల్లో ఎవరైనా భిక్షాటన చేస్తున్న మహిళల పిల్లలే ఉన్నారా? అనే అంశాన్ని నిర్థారించడంపై దృష్టి సారించారు. ఇందుకుగాను వీరి సంబంధీకుల్ని సంప్రదించడంతో పాటు చిన్నారులు, మహిళలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అక్కడి కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రాథమికంగా ఈ కేసులో ఐపీసీలోని 363 (చిన్నారులను భిక్షాటనకు వినియోగించడం), 367 (చిన్నారులను కిడ్నాప్ చేయడం) సెక్షన్లతో పాటు జేజే యాక్ట్ లోని సెక్షన్ 76ను చేర్చారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా మరికొన్ని చేర్చడం, ఉన్న వాటితో మార్పులు చేయనున్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న సిట్ బృందం వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
అందుకే నేను ఇలా ఉన్నాను మరి!
మూడురోజులుగా తిండి లేని ఒక యాచకుడు ఆ దారిన వెళ్లే ఒక కారును ఆపి ‘‘కాస్త ధర్మం చెయ్యండి బాబూ’’అన్నాడు. యాచకుడి కట్టూబొట్టూ చూసి అతనేదో మంచి కుటుంబం నుండి వచ్చిన వాడై ఉంటాడని, అతని మాట తీరు చూస్తే కాస్త చదువుకున్నవాడని అనిపించింది కారులోని వ్యక్తికి. పైగా, అతను తనకు అప్పుడే ప్రమోషన్ వచ్చిందన్న సంతోషంలో ఉన్నాడు. దాంతో అతను జేబులో నుంచి వందరూపాయల నోటు తీసి యాచకుడికి ఇవ్వబోయాడు. ఆ వంద రూపాయల నోటుకేసి చూస్తూ పక్కనే కూర్చున్న స్నేహితుడు పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అన్నాడు అతను. ‘‘అతి త్వరలో నువ్వు కూడా నా స్థానంలో ఉండాల్సి వస్తుందనిపించి నవ్వొచ్చింది. కనిపించిన ప్రతివాడికీ ఇలా దానం చేస్తూ పోతే చివరికి ఏమీ మిగలదు. నేనందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలే నాకు రావలసిన ప్రమోషన్ కూడా మిస్సయింది’’ అన్నాడు స్నేహితుడు. దానికతను నవ్వుతూ, ‘‘బహుశా అందుకేనేమో నాకు ప్రమోషన్ వచ్చింది. కారు కూడా కొనుక్కోగలిగాను. నువ్వేమో అలాగే ఉన్నావు ఎదుగూబొదుగూ లేకుండా’’ నవ్వుతూనే అంటించాడు. మీరు ఇస్తూ పోతే మీ దగ్గర ఉన్నదంతా అయిపోతుందనేది సాధారణ ఆర్థిక సూత్రాలకు సంబంధించినది. అదే ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారమైతే మీరు ఏమీ ఇవ్వకుండా ఉన్నట్లైతే మీ దగ్గర ఏదీ మిగలదు. అదే మీరు ఇస్తూ పోతే మీ దగ్గర చాలా చాలా ఉంటుంది. బాహ్య, అంతర్గత ప్రపంచాల చట్టాలు పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ముందు మీరు అంతర్గతంగా చక్రవర్తి స్థాయికి ఎదగండి. అప్పుడే పంచేందుకు మీ దగ్గర చాలా ఉంటుంది. – ఓషో భరత్ -
అక్కడ కేవలం ఇద్దరు యాచకులే!
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దేశంలోని యాచకులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల మంది యాచకులు, సంచార యాచకులు ఉన్నారు. 81వేల మంది యాచకులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉండగా కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది. గెహ్లాట్ లోక్‌సభకు రాసిన లిఖితపూర్వక సమాధానంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4,13,670 మంది యాచకులు ఉండగా వారిలో 2,21,673మంది పురుషులు కాగా, 1,91,997మంది స్త్రీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ 65,835మంది యాచకులతో రెండో స్థానంలో ఉండగా 30,218 మందితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాచకుల సంఖ్య తక్కువగా ఉంది. 2,187మంది యాచకులతో దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది. దాద్రా నగర్ హవేలీలో 19మంది, డామన్ డయ్యూలో 22మంది, అండమాన్ నికోబార్‌లో 56మంది యాచకులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వెనకబడిన తరగతులకు చెందిన ఒక సంస్థ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ను సంచార జాతులు, యాచకులు, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని గుర్తించి వారందరినీ ఒబీసీల్లో ఉపకులాలుగా చేర్చాలని కోరింది. గత అక్టోబరులో ప్రధాని మోదీ ఒబీసీల వర్గీకరణ కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఆ కమిషన్ ప్రధాన విధి ఒబీసీల వర్గీకరణ. ఫలితంగా ఎక్కువ వెనకబడిన కులాలకు రిజర్వేషన్లను వర్తింపచేయడం. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జాతీయ వెనకబడిన కులాల కమిషన్‌కు ఒక లేఖ రాశారు.దానిలో ఆయన సంచార జాతులను, యాచకులను, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని ఓబీసీలోని ‘ఏ’ కేటగిరీలో ఉప కులాలుగా చేర్చాలని కోరారు. చేతివృత్తులు చేసుకునేవారిని, విద్య, ఉపాధి రంగాల్లో 50శాతం కన్నా తక్కువ ఉన్నవారిని ‘బీ’ కేటగిరీలో, 50శాతం కన్నా ఎక్కువ ఉన్నవారిని ‘సీ’ కేటగిరీలో ఉపకులాలుగా చేర్చాలని కోరారు. వ్యవసాయం, ఇతర వృత్తులను చేసుకునేవారిని డీ కేటగిరీలో, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను ఈ కేటగిరీలో చేర్చాలని లేఖలో వివరించారు. జనాభావారీగా విభజించిన తర్వాత రిజర్వేషన్‌ను నిర్ణయించాలని కోరారు. -
తమ అభిమాన హీరోని కలవాలని కొందరు..
తమ అభిమాన కథానాయకుడిని కలవాలని కొందరు.. అసాధ్యమని తెలియక హీరోలు కావాలని ఇంకొందరు.. అమ్మానాన్న మందలించారని మరికొందరు.. ఇంట్లో నుంచి కాలుబయట పెట్టి వీధిన పడుతున్నారు.. తిరిగి ఇంటికెళ్లలేక రోడ్డుమీదే బతికేస్తున్నారు.. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల చేతికి చిక్కి.. యాచక వృత్తిలోకి బలవంతంగా దించేవారికి దొరికి.. బంగారు భవిష్యత్తును చేజేతులా పాడుచేసుకుంటున్నారు! సాక్షి, ముంబై: వీధిబాలల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. 2017లో ఒక్క ముంబై నగరంలోనే పోలీసులు దాదాపు 700 మంది వీధిబాలలను కాపాడారు. ఇంకా పోలీసులకు చిక్కకుండా రోడ్లపై తిరుగుతున్నవారు మరెందరో ఉన్నారు. వీరంతా అనాథలు కారని, రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినవారేనని పోలీసులు చెబుతున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మానాన్న మందలించారనే కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్లాలలో తెలియక రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే బతుకున్న 706 మంది చిన్నారులను 2017లో గుర్తించి, తిరిగి ఇంటికి పంపడమో, వసతి గృహాల్లో చేర్చడమో చేశారు. ముంబై శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలోనే 528 మందిని గుర్తించగా వారిలో 360 మంది బాలలు, 168 మంది బాలికలు ఉన్నారు. ఇక ముంబైలోని రైల్వే స్టేషన్లలో 178 మందిని గుర్తించగా వారిలో 115 బాలలు, 63 మంది బాలికలున్నారు. వీరంతా 13 నుంచి 18 ఏళ్లలోపు వయసు వారే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారట. సమాచారం అందిస్తే సరి.. పిల్లలెవరైనా తప్పిపోతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ నంబర్ వంటి వివరాల ఆధారంగా కూడా తల్లిదండ్రులను గుర్తిస్తున్నామని, అయితే చాలామంది పిల్లలు తిరిగి ఇంటికెళ్లేందుకు భయపడుతున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా తిరిగి ఇంటికి పంపుతున్నామని చెబుతున్నారు. దొరకనివారి పరిస్థితి... రైల్వే పోలీసులు గుర్తించిన పిల్లలు ఎలాగోలా తల్లిదండ్రుల వద్దకు చేరడమో.. ఇష్టంలేనివారిని వసతిగృహాల్లో చేర్చడమో జరుగుతోంది. మరి మిగతావారి పరిస్థితి ఏంటి? దీనిపై ఆర్పీఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అనుప్‌కుమార్ మాట్లాడుతూ... చాలామంది పిల్లలపై మాదకద్రవ్యాల ముఠాలు, యాచకవృత్తిలోకి పిల్లల్ని దింపే ముఠాలు నిఘాపెట్టాయి. రైళ్లలో నుంచి ఒంటరిగా దిగే పిల్లలకు మాయమాటలు చెప్పి, తీసుకెళ్లి బలవంతంగా బాలకార్మికులుగా, యాచకులుగా, మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిగా మార్చేస్తున్నారు. -
యాచకుల ఆదాయం ఏడాదికి రూ.270 కోట్లు..!
-
ముష్టియా..!
-
భిక్షం అడుక్కునేవారిలో 98 శాతం ఫేక్!
సాక్షి, హైదరాబాద్ : విశ్వనగరం ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్స్ ఫ్రీ సిటీ’గా చేయాలన్న అధికారుల ప్రయత్నాలు ఆశించిన మేర కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా గడిచిన కొద్ది రోజులుగా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద అడుక్కునేవారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. హైదరాబాద్‌లో భిక్షాటన చేసేవారి సంఖ్య సుమారు 14 వేలు. అయితే వారిలో 98 శాతం మంది నకిలీలేనని, మాఫియాగా ఏర్పడి, యాచక ముఠాలుగా వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ‘యాచకులకు డబ్బు ఇవ్వకండి’ అంటూ పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన జీహెచ్ఎంసీ.. నిజంగా అభాగ్యులైనవారిని గుర్తించి, పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేసింది. అలా కొంతకాలంపాటు తగ్గిన యాచకుల సంఖ్య.. ఆశ్చర్యకరంగా మళ్లీ పెరుగుతోంది. దీనికి కారణం మాఫియా మాయాజాలమా? లేక అధికారుల నిర్లక్ష్యవైఖరా? వెల్లడికావాల్సిఉంది. యాచకుల వ్యవహారం ఇలా ఉంటే, మతిస్థి మితం కోల్పోయి, రోడ్లపై సంచరించేవారి కోసం తెలంగాణ జైళ్ల శాఖ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా వంతు సేవ : మతిస్థిమితం కోల్పోయి రోడ్డపై సంచరిస్తోన్నవారిని చేరదీసి, పునరావాసం కల్పించనున్నట్లు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వి.కె. సింగ్ తెలిపారు. శుక్రవారం చంచల్‌గూడ సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవలో తమ వంతుగా ఈ పని చేయబోతున్నట్లు చెప్పారు. పోలీస్, ఎన్జీవోస్, కార్పొరేట్ సంస్థలతో కలిసి ఆరు నెలల్లో రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వ్యక్తులను చేరదీసి పునరావాసం కల్పిస్తామన్నారు. శిక్షా కాలం పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగాలు : వివిధ కేసుల్లో ఖైదీలుగా శిక్షా కాలాన్ని పూర్తిచేసుకుని విడుదలైనవారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ ప్రకటించింది. జైళ్ల పెట్రోల్ బంకుల్లో డిసెంబర్ నాటికి 500 మంది విడుదలైన ఖైదీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సింగ్ వివరించారు. అందులో 50 శాతం మహిళలకే అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. -
యాచకుల ఆదాయం ఏటా రూ.270 కోట్లు!
-
యాచకుల ఆదాయం..ఏటా రూ.270 కోట్లు!
గ్రేటర్లో 20 వేల మంది బెగ్గర్స్.. పిల్లలు, వృద్ధులు సైతం భారీ సంఖ్యలో.. ఏటా దాదాపు రూ.270 కోట్లు ఆర్జిస్తున్న వైనం.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ ప్రోగ్రాం షురూ.. సిటీబ్యూరో నగరంలో యాచకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పలు సిగ్నళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద పెద్ద సంఖ్యలో యాచకులు సంచరిస్తున్నారు. వీరిలో నెలలు నిండని పసికందులను చంకలో ఎత్తుకున్న మహిళల నుంచి...ఐదారేళ్లలోపు బాలలు, వృద్ధుల వరకు ఉన్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల మేరకు నగరంలో ఉన్న 20 వేల మంది యాచకులు రోజుకు రూ.75 లక్షల చొప్పున ఏటా దాదాపు రూ.270 కోట్లు సంపాదిస్తున్నారు. వ్యవస్థీకృతమైన ఈ యాచక వృత్తిని నిర్మూలించేందుకు గత జూన్‌లో జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నగరాన్ని ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు అడుగులు వేస్తోంది. 20 వేల మంది.. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలను బట్టి గ్రేటర్లో రమారమి 20 వేలమంది యాచక వృత్తిలో ఉన్నారు. వీరిలో దాదాపు 90 శాతం మంది నకిలీలే. అంటే, పని చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ (అశక్తులు, అంగవికలురు, యాచన తప్ప ఇతర పనులు చేయలేనివారు కాకుండా) యాచన చేస్తున్నవారు. అసలైన యాచకులు పదిశాతం లోపునే ఉన్నారని ఆయా సంస్థలు గుర్తించారుు. కొన్ని సంస్థలైతే నిజమైన యాచకులు వెరుు్యమంది కూడా లేరని చెబుతున్నారుు. ఫ్లై(ఫ్యూచర్ లీడింగ్ మిషన్), ‘యూత్ ఫర్ సేవ’ ‘ ఇందిరా ప్రియదర్శిని రూరల్ ఏరియా డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ’ ‘ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ’ లోని వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల సగటు వివరాల మేరకు నగరంలోని యాచకులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలున్నారుు. వాటి మేరకు నగరంలో గుంపులుగా, వ్యక్తిగతంగా యాచన వృత్తిని కొనసాగిస్తున్నారు. బిచ్చగాళ్లతో దందా చేరుుస్తున్న దళారులు నగరంలో 200 మందికి పైగా ఉన్నారు. అరుుతే వీరు గుడ్డివారు, అంగవికలురు, ఎలాంటి పనులు చేయలేనివారు, పసిబిడ్డలనే తమ దందాకు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పేద కుటుంబాలకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చి, ఆ అప్పు తీర్చేందుకు మీ పిల్లలను పంపమంటూ వారిని ఈ ఊబిలో దింపుతున్నారు. వారి ద్వారా వస్తున్న సొమ్ము వడ్డీకే సరిపోరుుందంటూ, వారికి కొంత మొత్తాన్ని మాత్రం కమీషన్‌గా ముట్టజెపుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. వీరు కాక యువకులు, శక్తి ఉండి ఈ వృత్తిలో కొనసాగుతున్న వారిలో బీహార్, మధ్యప్రదేశ్‌లతో సహా ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉన్నారు. వివిధ జంక్షన్లు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర ప్రాంతాల్లో వీరు అడుక్కుంటున్నారు. ఈ పని అరుుతే సులభంగా ఉంటుందని, శ్రమ ఉండదని ఈ అవతారమెత్తినవారూ ఎందరో ఉన్నారు. మరికొందరు పార్ట్టైమ్గాను, పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో మాత్రమే ఈ పని చేస్తున్నారు. ఈ వృత్తిని వారు చిన్నతనంగా భావించడం లేదు. పెపైచ్చు త్వరితంగా, సులభంగా డబ్బు సంపాదనకు ఇదే మేలైన మార్గమని భావిస్తున్నారు. వ్యసనాలు అధికం.. వీరిలో చాలామందికి మద్యం, ఇతరత్రా మత్తుపదార్థాల వ్యసనం ఉంది. వచ్చే సంపాదనలో 40-50 శాతం ఇందుకే ఖర్చు చేస్తున్నారు. 20 శాతం మాత్రం ఆహారం కోసం వినియోగిస్తున్నారు. మిగతా సొమ్మును తెలిసిన వారి వద్ద, ఊళ్లలోని బంధువుల వద్ద ఉంచుతూ పొదుపు చేస్తున్నారు. బ్యాంకుల్లో జమ చేస్తున్నవారు, వడ్డీలకు తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ఓ నకిలీ బిచ్చగాడికి బ్యాంక్ లాకర్‌తో సహ నగరంలోని రెండు చోట్ల ఇళ్లు ఉండటం కూడా మేయర్ దృష్టికి వచ్చింది. బాలల ఆదాయం రూ. 500 .. ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున రూ.500 వరకు ఆర్జిస్తున్నారు. ఈ వృత్తిలోని మహిళల్లో కొందరు పగటి పూట యాచన చేస్తూ, రాత్రి వేళల్లో సెక్క్వర్కర్లుగా మారుతున్నారు. వీరిలోని కొందరు మగవాళ్లకు ముగ్గురు భార్యలు కూడా ఉన్నారు. వారు తమ సంతానాన్ని సైతం ఇదే వృత్తిలోకి దింపుతున్నారు. 15 - 25 ఏళ్ల వయసు వారు చిన్న చిన్న దొంగతనాలతోపాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. వీరిలో 90 - 95 శాతం మంది పునరావాసం కల్పిస్తామన్నా, వృద్ధాశ్రమాలు/విద్యాసంస్థలు/ ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో చేరుస్తామన్నా ముందుకు రావడం లేరు. ఈ వృత్తిని వీడటానికి ఏమాత్రం సుముఖంగా లేరు. పసికందులతో దందా.. దాదాపు మూడువేల మంది పసికందులతో ఈ వ్యాపారం చేస్తున్నారని మేయర్ రాంమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా యాచన తప్ప ఏపనీ చేయలేని అసహాయులను అన్నివిధాలా ఆదుకుంటామని, ఈ దిశగా ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్జీవోలకు తగిన సహకారం అందిస్తామన్నారు. యాచనను కొనసాగించే నకిలీ బెగ్గర్స్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాంఛనంగా ప్రారంభం... నగరంలో ‘బెగ్గర్ ఫ్రీ సిటీ ’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. గ్రేటర్‌లోని ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో యాచన చేస్తున్న వారిలో 50 మందిని నగర శివారు చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు. వీరిని అక్కడకు తరలించే వాహనాన్ని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు గత జూన్‌లో శ్రీకారం చుట్టారు. పోలీసు విభాగంతోపాటు వివిధ ప్రభుత్వశాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 500 మంది యాచకులను గుర్తించామని, వీరందరినీ దశలవారీగా పునరావాస కేంద్రాలకు పంపించడంతోపాటు, పనులు చేయగలిగిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నగరంలో వ్యవస్థీకృతమైన బెగ్గింగ్‌ను రూపుమాపేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మానాన్న అనాథాశ్రమం నిర్వాహకులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 200 మందికి అమ్మానాన్న అనాథాశ్రమంలో పునరావాసం కల్పించినట్లు మేయర్ ఈ సందర్భంగా తెలిపారు. నగరంలో యాచకుల సంఖ్య: 20 వేలు బాలలు: 3 వేల మందికి పైగా.. నకిలీ యాచకుల సంఖ్య: 90 శాతం రోజువారీ సంపాదన: రూ. 75 లక్షలు ఏడాదికి దాదాపు: రూ.270 కోట్లు -
'నాయక్' తరహాలో పిల్లలతో భిక్షాటన
గచ్చిబౌలి: ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఓ కేటుగాడు అనాధాశ్రమం ముసుగులో చిన్నారులను యాచకులుగా మార్చేస్తున్నాడు. మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తానని పేద తల్లిదండ్రులతో నమ్మబలికి తీసుకొస్తున్న పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నాడు. సదరు మాయగాడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రమేశ్ కుమార్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం, కొమ్మవరం గ్రామానికి చెందిన మాలిపెద్ది జేమ్స్(36) ఆర్సీపురం మండల పరిధిలోని అమీన్పూర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని 2012లో బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నెలకొల్పాడు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను మంచి చదువులు చదివిస్తానని నమ్మబలికి తన అనాథాశ్రమానికి తీసుకొస్తున్నాడు. స్థానికంగా జడ్పీహెచ్ఎస్, ఆర్నాల్డ్ హైస్కూల్ల్లో వారిని చేర్పిస్తున్నాడు. వీరిలో 10 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16న కొండాపూర్ కొత్తగూడ జంక్షన్లో మోహన్, శివ, కార్తిక్, అఖిల, వెంకటేశ్ అనే చిన్నారులతో భిక్షాటన చేయించాడు. బుధవారం ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు జర్కిన్ ధరించి. డొనేషన్ బాక్స్‌లు పట్టుకొని ట్రిపుల్ ఐటీ జంక్షన్, టీసీఎస్ కంపెనీ ముందు భిక్షాటన చేస్తుండగా.. బీట్ కానిస్టేబుల్ నరేందర్, దాస్ గమనించారు. చిన్నారుల్లో ఇద్దరిని పిలిచి ఎందుకు డబ్బులు అడుగుతున్నారని ప్రశ్నించగా... బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నుంచి వచ్చామని, జేమ్స్ సార్ తమను పంపించాడని చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడని అడగగా రోడ్డు అవతలి వైపు నిల్చుని ఉన్నాడని జేమ్స్‌ను చూపించారు. అయితే, పోలీసులు తన వైపు వస్తున్నారని గ్రహించిన ఆ కేటుగాడు అప్పటికే ఇద్దరు చిన్నారులను ఆటో ఎక్కించి పంపేశాడు. అంతలోనే పోలీసులు వెళ్లి జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆర్సీపురం పోలీసుల సహకారంతో గచ్చిబౌలి పోలీసులు మెదక్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ చందుతో కలిసి బ్రహ్మపుత్ర ఆశ్రమంపై దాడి చేశారు. 19 మందికి విముక్తి బ్రహ్మపుత్ర అనాధాశ్రమంలో ఉన్న 19 మంది బాలబాలికలకు విముక్తి కల్గించారు. వీరిలో ఐదుగురు అమ్మాయిలు కాగా 14 మంది అబ్బాయిలున్నారు. ఒక విద్యార్థికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో జేమ్స్ ఆ విద్యార్థిని ఇటీవలే ఇంటికి పంపేశాడని తెలిసింది. పోలీసులు తాము రెస్కూ్య చేసిన చిన్నారులను అమీన్‌పూర్‌లోని మహిమ ఫౌండేషన్‌లో ఆశ్రయం కల్పించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ , యాచక వృత్తి నిరోధక చట్టం, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసి.. నిందితుడు జేమ్స్‌ను రిమాండ్‌కు తరలించారు. ఖర్చు భరించలేకే భిక్షాటన: జేమ్స్ దాతలు సహకారంతోనే బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నడిపిస్తున్నానని నిందితుడు జేమ్స్ తెలిపాడు. ఆర్నాల్డ్ హైస్కూల్లో చదివిస్తున్న వారికి ఫీజు చెల్లించే పరిస్థితి లేక.. తప్పు అయినప్పటికీ చిన్నారులతో భిక్షాటన చేయించానని చెప్పాడు. నిందితుడు జేమ్స్ -
బిచ్చగాళ్లు వాట్సాప్‌లో అడుక్కుంటున్నారు
దుబాయ్: నిన్న మొన్నటి వరకు దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్ల మీద అడుకున్న యాచకులు మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లోనూ అడుక్కుంటున్నారు. జాలి గుణం ఉన్న వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్న వారు కట్టు కథలతో కథనాలను పంపి తమకు తొచినంత దానం చేయమని అభ్యర్థిస్తున్నట్లు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ వెబ్సైట్ వెల్లడించింది. దయనీయమైన కథనాలను గుర్తు తెలియని నంబర్ల నుంచి పంపిస్తూ డబ్బులు యాచిస్తున్నట్లు పేర్కొంది. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్‌లకు పంపిస్తున్నారని వెబ్సైట్ తెలిపింది. రంజాన్ మాసం కావడంతో దుబాయ్‌లో ఈ మోసాల సంఖ్య మరింత పెరిగిందట. -
వామ్మో! వాట్సాప్ ను వాళ్లూ వాడుకుంటున్నారు!
అబుధాబి: మొబైల్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిన్నమొన్నటివరకు రోడ్డుపక్కన పేవ్మెంట్ల మీద, కూడళ్ల వద్ద, థియేటర్ల వద్ద అడుక్కున్న యాచకులు ఇప్పుడు వాట్సాప్నూ వదిలిపెట్టడం లేదు. సున్నితమైన మనస్సు, దానగుణం ఉన్న వారు లక్ష్యంగా ఏకంగా వాట్సాప్ లో కరుణరసాత్మకమైన కథనాలు వండివారుస్తున్నారు. అమ్మ జబ్బుకు, అక్కకు రోగం, అన్నకు వైకల్యం అన్న తరహాలో అత్యంత దయనీయ కథనాలను గుర్తుతెలియన నంబర్ల ద్వారా పంపిస్తూ డబ్బులు అడుక్కుంటున్నారు. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్‌లకు పంపిస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో దుబాయ్‌లో ఈ ట్రెండ్ మరింత ముదిరింది. ప్రజల జాలిగుణాన్ని సొమ్ము చేసుకొని డబ్బు దోచుకునే ఉద్దేశంతో మోసగాళ్లే ఇలాంటి సందేశాలను వాట్సాప్ నంబర్లకు కుప్పలు తెప్పలుగా పంపిస్తున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని అబుదాబి డీజీపీ (ఆపరేషన్స్) ఆమిర్ మహమ్మద్ ఆల్ ముహైరి చెప్పారు. వాట్సాప్ లో తనకు నిత్యం ఇలాంటి దీనతీదీనమైన కథనాలతో సందేశాలు వస్తుండటంతో ఓ మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసపూరితమైన సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మీడియా దుబాయ్ ప్రజలకు సూచించింది. -
వీధివీధిలో ‘బాబ్బాబులే’
► రాష్ట్రమంతా గణనీయంగా పెరిగిన యాచకులు ► పొరుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పట్టణాలకు వలస ► భిక్షాటనను జీవనోపాధిగా ఎంచుకుంటున్న యువత ► టిఫిన్ సెంటర్లకు కమీషన్ పద్ధతిలో చిల్లర సరఫరా విజయవాడ: రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబ్బాబు.. అంటూ యాచకులు కనిపిస్తున్నారు. రోజురోజుకీ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే అన్ని ప్రధాన పట్టణాల్లోనూ వీరి సంఖ్య 30 నుంచి 40 శాతం పెరిగింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి మొదలైన భిక్షాటన మారుతున్న కాలంలో ఆదాయ వనరుగా మారింది. శరీరంలో శక్తి సన్నగిల్లి ఏ పనీ చేయలేక పొట్టకూటి కోసం యాచన చేసే వృద్ధులు, వికలాంగుల జాబితాలో కొత్తగా యువతీయువకులు కూడా చేరిపోతున్నారు. రకరకాల కారణాలు, కొత్తకొత్త వేషాలతో భిక్షాటనకు దిగుతున్నారు. తాగుడు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలైన యువకులు భిక్షాటన చేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం రెండేళ్ల కిందట రాష్ట్రంలో వీరి సంఖ్య 3.50 లక్షలు కాగా ఇప్పుడు 5 లక్షలు దాటింది. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పోలీసుల వేధింపులు ఎక్కువ కావడంతో ఏడాది కాలం నుంచి వేలాది మంది యాచకులు రాష్ట్రానికి వలస వచ్చారు. ప్రధాన నగర శివారుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని భిక్షాటన చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సుమారు 90 వేల మందికి పైగా రోజూ ట్రాఫిక్ సిగ్నళ్లు, ఆలయాలు, ఇతరత్రా రద్దీ ప్రదేశాల్లో చిల్లర యాచన చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కొక్కరి ఆదాయం రోజుకు రూ. 500 నుంచి రూ.800 ఉంటోంది. విజయవాడలోనే ఎక్కువ... యాచకుల సంఖ్య బెజవాడలోనే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే బెంజిసర్కిల్, లబ్బీపేట, బీసెంట్‌రోడ్, లెనిన్ సెంటర్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాలతో పాటు ఇంద్రకీలాద్రి దిగువన కూడా వీరు ప్రతి పదినిమిషాలకొకరు సంచరిస్తున్నారు. గుంటూరులో సుమారు 3 వేల మందికిపైగా బిచ్చగాళ్లు ఉన్నట్లు అంచనా. తిరుపతిలోని కపిలతీర్థం, నాలుగుకాళ్లమండపం, రైల్వేస్టేషన్లో చిల్లర వేస్తే తప్ప భక్తులను వదిలి పెట్టడంలేదు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో సీనియర్ యాచకులందరూ గ్రూపుగా ఏర్పడి కొత్తగా వచ్చే యాచకులపై బెదిరింపులకు దిగుతున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఆటో డ్రైవర్లతో యాచకులు చిల్లర కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ రెండు నగరాల్లోనూ పాతిక మందికి పైగా లక్షాధికారులైన బిచ్చగాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి. -
నిరుద్యోగుల ఐక్యవేదిక బిక్షాటన
-
సందర్శకులకు యాచకుల వేధింపులు
చార్మినార్ (హైదరాబాద్) : చార్మినార్, మక్కా మసీదులు చూసేందుకు వచ్చే సందర్శకులకు యాచకుల వేధింపులు ఎక్కువయ్యాయి. పర్యాటక కేంద్రాలు కావడంతో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు అధిక సంఖ్యలో నిత్యం పాతబస్తీని సందర్శిస్తుంటారు. చార్మినార్, మక్కా మసీదుల వద్ద తిష్ట వేసిన యాచకులు పర్యాటకులను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిల్లర లేదని చెప్పినా వినకుండా వెంట పడి ఇచ్చేంత వరకు సతాయిస్తున్నారు. దీంతో వీరిని కట్టడి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. -
బిచ్చగాళ్ల నోట ప్రభుత్వ పథకాల పాటలు!
న్యూఢిల్లీ: 'నడిపించు నా నావా..' 'బంతుకు బండి బైలెల్లినాదో..' అంటూ రైళ్లలో తమ పాటల ద్వారా తత్వాన్ని బోధిస్తూ పదో పరకో అడుక్కునే యాచకులకు సరికొత్త శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వారు ప్రస్తుతం ఆలపిస్తున్న పాటల్ని సమూలంగా మాన్పించి.. వాటి స్థానంలో ప్రభుత్వ పథకాలను పాటలుగా పాడించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 5 వేల మంది యాచకుల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలిసింది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో.. బేటీ పడావో, జన్‌ధన్ యోజన తదితర పథకాలకు ఇప్పటికే రేడియో, టీవీ, సామాజిక మాధ్యమాల్లో కల్పిస్తున్న ప్రచారం సరిపోవడంలేదంటూ వినూత్న ప్రయోగానికి తెరలేపిన కేంద్రం.. ఆయా పథకాలకు సంబంధించిన పాటలకు యాచకులు ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే గుర్తించిన 5 వేల మంది యాచకులకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. అతి తర్వరలోనే మనం ఈ పాటలు వినే అవకాశం ఉంది. -
వాట్సాప్‌లో బెగ్గర్స్ హల్ చల్
దుబాయ్: దుబాయ్‌లో రామదాన్ ప్రాంతంలో బెగ్గర్స్ హల్ చల్ ఎక్కువవుతోంది. స్మార్ట్ ఫోన్లతో వారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా 'సఫరింగ్ అండ్ నీడ్'(బాధ, అవసరం) అనే పదాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ పోలీసులకు ఆగ్రహంతో పాటు తలనొప్పిగా తయారయ్యారు. వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ పదాలను పంపించి వారి నుంచి అడుక్కుతినే పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. సానుభూతి పొందాలని చిన్న పిల్లలను ఉపయోగించుకుంటూ వారితో భిక్షమెత్తిస్తున్నారు. దీంతో దుబాయ్ పోలీసు విభాగం వారిని అదుపు చేసేందుకు పకడ్బంధీ చర్యలకు దిగింది. గత ఏడాది పదమూడుమంది చిన్నారులను అదుపులోకి తీసుకుంది. దీంతోపాటు 'ఒకసారి అందరికోసం' అనే నినాదంతో బెగ్గర్స్ ను అదుపుచేసే చర్యల్లో భాగంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఇక నుంచి ఎవరు అడుక్కుంటూ కనిపిస్తారో వారిని ఒక నెల రోజుల పాటు జైలులో వేయడంతోపాటు బహిష్కరిస్తారట. అలాగే, భిక్షమెత్తడం ద్వారా సంపాధించిన సొమ్ము మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్తున్నారు. విదేశాల నుంచి చాలామంది అడుక్కుతిని బతికేందుకు వస్తున్నారని, దానిని నియంత్రించేందుకు ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. 2009 నుంచి ఇప్పటివరకు 4,136 బెగ్గర్స్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో రామదాన్ అనే ప్రాంతంలోనే 1237 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
బ్యాంక్ ఆఫ్ బెగ్గర్స్
-
ధర్మం చెయ్యొద్దు బాబూ!
త్వరలో ‘యాచకులు లేని నగరం’ అమలుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ప్రజల్లో అవగాహనకు ముమ్మర ప్రచారం ‘గౌరవ సదన్’ల ఏర్పాటుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: ‘యాచకులకు మీరు ధర్మం చేయవద్దు. వారు ఆ వృత్తిని వదిలి... సాధారణ ప్రజల్లాగా జీవించాలంటే ఇంతకంటే మరో మార్గం లేద’టూ జీహెచ్ఎంసీ ప్రచారం చేయనుంది. గ్రేటర్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు.. రహదారుల పొడవునా వీరి వల్ల ప్రజలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలూ జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కారంతో పాటు నగరంలో యాచ క వృత్తిని నిరోధించేందుకు జీహెచ్ఎం సీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ కోసం సన్నాహాలు ప్రారంభిం చింది. యా చకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం.. పని చేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం... వ్యాధి పీడితులుంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని భావిస్తోంది. ఇన్ని చేసినా ఆ అలవాటు మానలేని వారిని ఆ ‘దారి’ నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విస్తృత ప్రచారం చేపట్టనుంది. బ్యానర్లు.. హోర్డింగ్‌ల ద్వారా ‘భిక్షాటనను ప్రోత్సహించవద్దు’ అంటూ ప్రచారం చేయనుంది. ఇప్పటికే ఇలాంటి స్లోగన్లు, డిజైన్లు తయారు చేశారు. త్వరలోనే వీటితో ప్రచారం చేయనున్నారు. ఈ అంశం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏదైనా రంగంలో ప్రసిద్ధి చెందిన వారిని (లెజెండ్‌ను) ఈ కార్యక్రమానికి అంబాసిడర్(ప్రచారకర్త)గా నియమించాలని భావిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి అంబాసిడర్‌ను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా బలవంతంగా యాచన చేయిస్తున్నట్లు ప్రజల దృష్టికి వస్తే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ (నెంబరు 040- 21 11 11 11)కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రచారం చేయనున్నారు. స్థితిగతులపై సర్వే నగరంలో దాదాపు 20 వేల మంది యాచకులు ఉన్నట్టు జీహెచ్ఎంసీ సర్వేలో తేలింది. వీరిలో రాత్రి బస చేసేందుకు కనీసం నీడ కరువైన వారు దాదాపు వెయ్యి మంది ఉన్నారు. భిక్షాటన ద్వారా వారికి రోజుకు లభిస్తున్న సగటు ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ, ఎలాంటి ఆశ్రయం పొందుతున్నారు..? వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు.. తదితర అంశాలను సేకరించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు? వీరి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న వంద జంక్షన్ల వివరాలు సేకరించారు. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకుస్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా యాచకుల్లోని వృద్ధులు, వికలాంగులకు ఆసరా కల్పించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ తరఫున తొలిదశలో జోన్‌కు ఒకకేంద్రం చొప్పున ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించనున్నారు. వాటికి ‘గౌరవసదన్’లుగా నామకరణం చేయనున్నారు. వాటిలో ఉండే వారికి ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెల వంటి వాటికి కొంత నగదు ఇస్తారు. పని చేయగలిగిన శక్తి ఉన్న వారికి పనులు చూపిస్తారు. -
నిరుపయోగంగా స్కైవాక్
సాక్షి, ముంబై : నగర వాసుల సౌకర్యార్థం సుమారు రూ.40 కోట్లు వెచ్చించి గ్రాంట్‌రోడ్‌లో నిర్మించిన స్కైవాక్ నిరుపయోగంగా మారింది. ఈ స్కైవాక్ ఉపయోగించాలంటే దాదాపు 60 మెట్లు ఎక్కి దిగాల్సి ఉంది. చాలా మంది ఈ స్కైవాక్‌ను ఉపయోగించుకోవడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. వృద్ధులు వీటి జోలికి వెళ్లడం లేదు. ప్రస్తుతం భిక్షగాళ్లు, తాగుబోతులకు అడ్డాగా మారింది. స్కైవాక్‌ను నానాచౌక్ నుంచి తాడ్‌దేవ్, కెంప్స్ కార్నర్, లామింగ్ టన్ రోడ్, గిర్గావ్ చౌపాటీ, ఒపేరా హౌజ్ ప్రాంతాల ప్రజలకు సౌకర్యాంగా ఉండేందుకు నిర్మించినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా, ఈ స్కైవాక్‌కు వ్యతిరేక దిశలో ఉన్న ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఫ్లై ఓవర్లో కొంత భాగాన్ని బారికేడ్లతో కవర్ చేయలేదు. వెండర్లు, భిక్షాటన చేసేవారు, ఆకాతాయిలు పరిసర ఇళ్లలోని నివాసితుల పట్ల అసభ్య దూషణకు పాల్పడుతున్నారు. కిటికీలకు వ్యతిరేక దిశలోనే స్కైవాక్ నిర్మించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని పలువురు నివాసితులు వాపోతున్నారు. ఈ విషయమై మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనితా పర్దేశి మాట్లాడుతూ..భిక్షాటన చేసేవారిని, తాగుబోతులను ఎప్పటికప్పుడు ఈ స్కైవాక్పై నుంచి తరిమేస్తున్నామని అన్నారు. మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
ముష్టియా
-
భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించండి
-
'తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించండి'
హైదరాబాద్ : తెలంగాణలో భిక్షగాళ్ల వ్యవస్థను నిర్మూలించాలంటూ డీవీరావు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. భిక్షగాళ్ల మాఫియా వల్ల ఏటా హైదరాబాద్‌లో రూ.140 కోట్ల టర్నోవర్ జరుగుతోందని ఆయన తన పిల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే 11వేలమంది యాచకులు ఉన్నారని, వారిని పునరావాస కేంద్రాల్లో ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్లో ప్రతివాదులుగా హోంశాఖ సెక్రటరీ, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆయన చేర్చారు. -
ఆకాశవంతెనలు నిరుపయోగం
సాక్షి, ముంబై: నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్మించిన ఆకాశవంతెన (స్కైవాక్)లు నిరుపయోగంగా మారుతున్నాయి. అవి యాచకులు, మాదకద్రవ్యాల బానిసలు, మద్యప్రియులు, జూదగాళ్లు, ప్రేమికులు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వీరంతా స్కైవాక్లపైనే తిష్టవేస్తున్నారు. వాటిని దుర్గంధమయం చేస్తున్నారు. దీంతో వాటిని వినియోగించుకునేందుకు బాటసారులు, మహిళలు, పిల్లలు జంకుతున్నారు. రాత్రి వేళల్లో వెళ్లేందుకు పురుషులు కూడా జంకుతున్నారు. కాగా నగర రహదారులను హాకర్లు ఆక్రమిస్తున్నారు. సమస్య రైల్వేస్టేషన్ల వద్ద తీవ్రంగా ఉంది. రైలు దిగిన ప్రయాణికులు రోడ్డెక్కాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్కైవాక్‌ల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఆటో, బస్టాండ్ లేదా రహదారి చేరుకుంటారని ఆ సంస్థ భావించింది. అయితే అనుకున్నదొక్కది.... అయ్యిందొక్కటి అనే చందంగా స్కైవాక్‌ల పరిస్థితి మారింది. స్కైవాక్‌లను ఎక్కడం బాగా కష్టంగా ఉండడంతో వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు రహదారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటి నిర్మాణానికి అర్థమే లేకుండాపోయింది. ఈ కారణంగా ఇవి అలంకార ప్రాయంగా మారాయి. -
బిచ్చగాళ్ల అడ్డాలు మెట్రో స్టేషన్లు
న్యూఢిల్లీ: మెట్రో రైల్వే స్టేషన్ల పరిసరాలు బిచ్చగాళ్లతో నిండిపోతున్నాయి. గడిచిన కొంతకాలంగా ఈ సమస్య మరింత జటిలమవుతోంది. మెట్రో రైల్వే వ్యవస్థ అందుబాటులోకి రావడం నగరవాసులకు వరంగా మారింది. అయితే అదే సమయంలో బిచ్చగాళ్లు, అనాథలు, నిరాశ్రయులు, దేశదిమ్మరులు ఈ స్టేషన్లను ఆక్రమిస్తున్నారు. ప్రస్తుతం అనేక మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నోయిడా సిటీ సెంటర్, సెక్టార్-18, ఝండేవలాన్, షాదిపూర్, చాందినీ చౌక్...ఇలా ఏ స్టేషన్ల వద్దచూసినా వీరే కనిపిస్తారు. డబ్బు ఇవ్వమనో... అన్నం పెట్టమనో అందరినీ బతిమిలాడుకుంటూ ఉంటారు. స్టేషన్నుంచి అడుగు బయటికెళుతుంటే ఇక కనిపించే దృశ్యాలన్నీ ఇవే. ఇదే విషయమై పశ్చిమ జనక్‌పురి-కర్కర్డుమాల మధ్య ప్రతి రోజూ రాకపోకలు సాగించే ల్యూబా చోప్రా అనే విద్యార్థిని మాట్లాడుతూ ‘మెట్రో స్టేషన్లలోని మెట్ల వద్ద బిచ్చగాళ్లను చూడాల్సిరావడం చిరాకుగా అనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రతిరోజూ ఓ కొత్త బిచ్చగాడు కనిపిస్తాడు. మెట్రో రైల్వే స్టేషన్లు వారికి కొత్త ఆలయాలుగా మారాయి. ప్రతిరోజూ ఓ కొత్తబిచ్చగాడు కనిపిస్తుండడంతో వీరంతా వంతుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇదొక వ్యవస్థీకృత వ్యాపారం. అయితే దురదృష్టమేమిటంటే దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.కాగా ఈ తరహా నిర్లక్ష్య ధోరణి నోయిడా సిటీ సెంటర్ స్టేషన్లోనూ బాగా కనిపిస్తుంది. అక్కడ బిచ్చగాళ్ల సంఖ్య విపరీతంగా ఉండడంతో పాదచారులకు దారి దొరకని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే విషయమై ప్రసూన్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ ‘ఉదయం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే బిచ్చగాళ్లు దారికి అడ్డంగా ఉండడం వల్ల మంచే జరుగుతోంది. ఒకరిపై మరొకరు పడిపోయే పరిస్థితి తప్పిపోతోంది. ఈ రకంగా బిచ్చగాళ్ల వల్ల కొంతమేలే జరుగుతోంది’ అని అన్నాడు. అయితే వారు డబ్బు కోసం బాగా విసిగిస్తుంటారన్నాడు. బిచ్చగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, దీనిని నియంత్రించేవారే లేరని వాపోయాడు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే జేబు దొంగతనాలు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదన్నాడు. ఈ సమస్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదంటూ విచారం వ్యక్తం చేశాడు. ఆయా మెట్రో స్టేషన్ల బయట పోలీసులు కానీ లేదా భద్రతా సిబ్బంది కానీ లేకపోడంతో బిచ్చగాళ్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది.