ఇస్లామాబాద్: పాక్‌లోని యాచకులు తమ పొట్టపోసుకునేందుకు సౌదీ అరబ్‌కు తరలివెళ్లడం గల్ఫ్ దేశానికి భారంగా మారింది. ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పాక్‌లోని యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తాజాగా పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా హెచ్చరించింది. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారాన్ని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ప్రచురించింది. పాక్‌కు చెందిన యాచకులు గల్ఫ్‌కు తరలివెళ్లడాన్ని నియంత్రించాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోరింది. అక్కడి యాచకులు తమ దేశానికి రావడంతో ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆరోపించింది.
ఉమ్రా వీసాతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా ఆ దేశం చర్యలు తీసుకోవాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఉమ్రాను ఏర్పాటు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు ఉమ్రా చట్టం తీసుకురావాలని పాకిస్తాన్ నిర్ణయించింది.
దీనికిముందు సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా పేరుతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశానికి వెళుతున్నారని, అక్కడ భిక్షాటన సాగిస్తున్నారని సౌదీ అరేబియా తరచూ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు
Comments
Please login to add a commentAdd a comment