పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు అధిక విదేశీ బాహ్య రుణాలు, ద్రవ్యోల్బణం, విదేశీమారక నిల్వలతో పోరాడుతోంది. మరోవైపు రాజకీయ అస్తిరత చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్ పరిస్థితిపై సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ 2023 నుంచి 2026 నాటికల్ల చైనా, సౌదీ అరేబియాలకు దాదాపు రూ. 63 వేల కోట్ల విదేశీ రుణం చెల్లించాల్సి ఉందని తెలిపింది. తీవ్ర నగదు కొరతతో సతమత అవుతున్న పాక్ ఒకవేళ విదేశీ రుణాలను చెల్లించలేక చేతులెత్తేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందిని హెచ్చరింది.
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్(యూఎస్‌ఐపీ) ప్రచురించిన సర్వేలో ప్రస్తుతం పాక్ విపరీతమైన ద్రవ్యోల్బణం, ఉగ్రవాద సమస్య, రాజకీయ విభేదాలతో అల్లాడుతుందని, అందువల్ల విదేశీ రుణాలను చెల్లించలేని దీనస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించింది. అప్పులో ఊబిలోకి కూరుకుపోయిందని రాబోయే మూడేళ్లలో చైనా, సౌదీలకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన రుణ ఒత్తిడిని ఎదుర్కొనకు తప్పదని నివేదిక సూచించింది. అదీగాక ఏప్రిల్ 2023 నుంచి జూన్ వరకు బాహ్య రుణ సేవల భారం సుమారు రూ. 36 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నందున సమీప కాలంలో తీవ్ర రుణ ఒత్తిడి తప్పదని నివేదిక పేర్కొంది.
కానీ పాక్ అధికారులు చైనాను రీఫైనాన్స్ చేయమని ఒప్పించాలని భావిస్తున్నారని ఎందుకంటే గతంలో చైనా ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు అలా చేశాయని నివేదిక వెల్లడించింది. పాక్ ఈ బాధ్యతలను నెరవేర్చగలిగినా వచ్చే ఏడాది మరింత సవాలుగా మారుతుందని, పైగా రుణ సేవలు దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా, వాస్తవానికి పాక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఇవ్వాల్సిన రూ. 9 వేల కోట్లు నిధుల కోసం వేచి ఉంది. ఇది గతేడాది నవంబర్‌లోనే పాక్‌కి పంపిణీ అవ్వాల్సి ఉంది.
ఈ నిధులు పాక్‌కి 2019లో ఆమోదించిన రూ 53 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లో భాగం. ఈ 2019కి సంబంధించిన ఐఎంఎఫ్ ప్రోగాం జూన్ 30, 2023న ముగుస్తోంది. అలాగే నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గడువుకు మించి ప్రోగ్రామ్ పొడిగించటం అసాధ్యం. దీని గురించి పాక్ ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నప్పటికీ..ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. కాగా, ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ కార్యక్రమాన్ని పునరుద్ధరించేలా అన్ని కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు ముందకు వచ్చింది కూడా. పైగా పాక్‌కు అదొక్కటే తప్ప ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడే సులభమైన మరో పరిష్కారమార్గం అందుబాటులో లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment