Gulf Arab emirate
-
యాచకులను నియంత్రించండి.. పాక్‌కు సౌదీ హెచ్చరిక
ఇస్లామాబాద్: పాక్‌లోని యాచకులు తమ పొట్టపోసుకునేందుకు సౌదీ అరబ్‌కు తరలివెళ్లడం గల్ఫ్ దేశానికి భారంగా మారింది. ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.పాక్‌లోని యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తాజాగా పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా హెచ్చరించింది. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారాన్ని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ప్రచురించింది. పాక్‌కు చెందిన యాచకులు గల్ఫ్‌కు తరలివెళ్లడాన్ని నియంత్రించాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోరింది. అక్కడి యాచకులు తమ దేశానికి రావడంతో ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆరోపించింది.ఉమ్రా వీసాతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా ఆ దేశం చర్యలు తీసుకోవాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఉమ్రాను ఏర్పాటు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు ఉమ్రా చట్టం తీసుకురావాలని పాకిస్తాన్ నిర్ణయించింది.దీనికిముందు సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా పేరుతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశానికి వెళుతున్నారని, అక్కడ భిక్షాటన సాగిస్తున్నారని సౌదీ అరేబియా తరచూ ఆరోపిస్తోంది.ఇది కూడా చదవండి: విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు -
స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం..
కరీంనగర్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి మృతదేహం స్వగ్రామం చేరింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన జక్కుల లచ్చవ్వ–భూమయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. వీరికి వివాహాలు కావడంతో వేర్వేరుగా నివాసముంటున్నారు. రెండో కుమారుడు లక్ష్మణ్(40) పదేళ్లుగా దుబాయ్‌కు వెళ్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇంటికి వచ్చి అప్పు చేసి ఇల్లు కట్టాడు. మళ్లీ దుబాయికి వెళ్లి ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తక్కువ వేతనం రావడంతో అప్పులెట్లా తీర్చాలన్న బెంగతో జూలై 31న తన రూంలో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటిమిత్రుల సహకారంతో ఆదివారం రాత్రి గల్ఫ్ నుంచి శవపేటిక ఇంటికి చేరింది. సోమవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య శకుంతల, కుమారుడు మల్లికార్జున్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు. -
‘గల్ఫ్ నుంచి వస్తున్నా..’ అని ఫోన్ చేసి.. ముంబాయిలో దిగాడు, కానీ..
సాక్షి,నిర్మల్: ‘దేశం నుంచి వస్తున్నా..’ అని ఫోన్ చేసి గల్ఫ్ నుంచి బయ లుదేరిన యువకుడు ఐదురోజులైనా ఇంటికి చేరలేదు. మార్గంమధ్యలోనే ఎటువెళ్లాడో.. ఆచూకీ తెలియడం లేదు. ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లాకేంద్రంలోని మంజులాపూర్‌కు చెందిన బెజ్జారపు లక్ష్మణ్(26) అనే యువకుడు 2014నుంచి యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ ఉపాధి పొందుతూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. మధ్యలో రెండుసార్లు ఇంటికి వచ్చి వెళ్లాడు. ఇదే క్రమంలో ఈనెల 19న ఇంటికి వస్తున్నట్లు ఫోన్‌చేసి చెప్పాడు. ఆరోజే కాదు.. మరో రోజైనా.. లక్ష్మణ్ ఇంటికి చేరుకోలేదు. కంగారుపడ్డ తండ్రి లింగన్న, సోదరుడు నరేశ్ తాను చేరుకుంటానని చెప్పిన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ నరేశ్ తన తమ్ముడి గురించి సిబ్బందిని అడుగగా, పోలీస్ ఔట్ పోస్ట్‌కు వెళ్లామని చెప్పారు. వారి వద్దకు వెళ్లి పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు వివరాలు తెలుపగా.. లక్ష్మణ్ షార్జా నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగినట్లు తెలిపారు. ఏంచేయాలో పాలుపోక కుటుంబసభ్యులు గురువారం జిల్లాకేంద్రంలోని ప్రవాసిమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లను కలిశారు. ఆయన వారితో కలిసి ఎస్సీ ప్రవీణ్‌కుమార్ వద్దకు తీసుకెళ్లి లక్ష్మణ్ ఆచూకీ కోసం విన్నవించారు. చదవండి: ఆన్లైన్ తరగతులు అర్థం కాలేదు.. ఫెయిలైనందుకు క్షణికావేశంలో.. -
గల్ఫ్ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. వేతనాలు తగ్గిస్తూ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాత జీతమే ఇవ్వాలంటూ.. నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై 15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జరగని న్యాయం పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. ఎంబసీకి విజ్ఞప్తి పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
బహ్రెయిన్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) 66వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి.. పబ్లిక్ గార్డెన్లో మొక్కలు నాటారు. అనంతరం ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని గుర్తుచేశారు. తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరున్నర సంవత్సరాలు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికై అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను మన వంతు పాత్ర పోషించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులకు పథకాలతోనే సరైన సమాధానం ఇవ్వాలని, గల్ఫ్ దేశాలలో ఉన్న కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం అనందంగా ఉందన్నారు. తమ కుటుంబాలను వదిలి ఉపాధికోసం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో సీఎం కేసీఆర్ గల్ఫ్‌లో పర్యటించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలతో చర్చించి తదితర వివరాలు కనుకుని, గల్ఫ్‌లో భారత రాయబారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారించనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎంలు కూడా గల్ఫ్‌లో పర్యటించిన దాఖలు లేవన్నారు. దీంతో ఎన్నారైల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని సతీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం తాము ఒక అదృష్టంగా భావిస్తుమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్ఎస్ నాయకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిరెన్లకు సలహాలు సూచనలు అందిస్తు సెల్‌ను ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ, ఎన్నారై టీఆర్ఎప్ సలహాదారు కల్వకుంట్ల కవితకి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు పార్టీ నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంత చేసిన అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బిడ్డా.. ఇంటికి రా!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలో తానే స్వయంగా గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పనులు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతా చేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరక్క వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బిడ్డలు పనికోసం వేరే చోటకి వెళ్తే, తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని తిరిగి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని సీఎం ప్రకటించారు. నూతన ఎన్ఆర్ఐ విధానం అధ్యయనం కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళ రాష్ట్రంలో పర్యటించనుంది. గల్ఫ్ దేశాల్లో పనికి పోయిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సీఎం సమావేశం కానున్నారు. -
గల్ఫ్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, తాడేపల్లిగూడెం : గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయం వద్ద జరిగిన గల్ఫ్ హెల్ప్‌లో పలువురు మాణిక్యాలరావుకు వినతులు అందించారు. కొవ్వూరుకు చెందిన జి.నాగేశ్వరరావు జీవనోపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా దేశం వెళ్లగా, అక్కడ అనారోగ్యం కారణంగా జూలై 4న మృతి చెందాడని, మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని మృతుని సోదరుడు ముత్యాలరావు వినతిపత్రం అందించాడు. ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన తన తల్లి ఎస్.నాగమణి పది నెలల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం కువైట్ వెళ్లిందని, ఆమెతో ఎక్కువ పనిచేయించుకుంటూ జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తన తల్లిని స్వదేశం రప్పించాలని కుమార్తె జ్యోతి వినతిపత్రం అందించింది. భీమవరానికు చెందిన వీరమళ్ల దేవి రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం సౌది అరేబియా దేశానికి వెళ్లగా అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్ల తరువాత ఇండియాకు పంపాల్సి ఉన్నా ఇండియాకు పంపడం లేదని, తన కుమార్తెను ఇండియాకు రప్పించాలని తండ్రి జి.సోమేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి న్యాయం జరిగే విధంగా చూస్తానని బాధితులకు వివరించారు. -
5 లక్షల నిర్మాణ కూలీలు కావలెను!
దుబాయ్: గల్ఫ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో నిర్మాణ కూలీల కొరత రియల్ ఎస్టేట్ రంగాన్ని పట్టిపీడిస్తోందని ఓ మీడియా నివేదికలో వెల్లడైంది. 2015 నాటికి నిర్మాణ కూలీల కొరత భారీగా పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి 5 లక్షల మంది నిర్మాణ కూలీల కొరత ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీ(డీఐఏసీ), డెల్లాయిట్ కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్ట్ లకు ఊహించని డిమాండ్ ఏర్పడటంతో నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల్లో కూలీ, ఇతర సాంకేతిక నిపుణల కొరత ఏర్పడిందని నివేదికలో తెలిపారు. డిజైన్ ఇంజనీరింగ్, మధ్య స్థాయి నిపుణుల అవసరం ఉంటుందని మల్టీ నేషనల్ కంపెనీలు తెలిపాయి. వరల్డ్ ఎక్స్ పో 2020 నిర్వహించడానికి దుబాయ్ బిడ్ గెలుచుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున నిర్వహించే వరల్డ్ ఎక్స్ పో 2020 కు 45 వేల హోటల్ రూమ్ లు అవసరం ఉంటుందని హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ తెలిపింది. వరల్డ్ ఎక్స్ పో 2020 కోసం 3.40 బిలియన్ డాలర్ల మేరకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని.. అందుచేత స్కిల్డ్ లేబర్ కు యూఏఈలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.