కరీంనగర్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి మృతదేహం స్వగ్రామం చేరింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన జక్కుల లచ్చవ్వ–భూమయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. వీరికి వివాహాలు కావడంతో వేర్వేరుగా నివాసముంటున్నారు.
రెండో కుమారుడు లక్ష్మణ్(40) పదేళ్లుగా దుబాయ్‌కు వెళ్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇంటికి వచ్చి అప్పు చేసి ఇల్లు కట్టాడు. మళ్లీ దుబాయికి వెళ్లి ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తక్కువ వేతనం రావడంతో అప్పులెట్లా తీర్చాలన్న బెంగతో జూలై 31న తన రూంలో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తోటిమిత్రుల సహకారంతో ఆదివారం రాత్రి గల్ఫ్ నుంచి శవపేటిక ఇంటికి చేరింది. సోమవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య శకుంతల, కుమారుడు మల్లికార్జున్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment