Top Stories
ప్రధాన వార్తలు

వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్ జగన్ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025

కూటమి కుట్రలు పటాపంచలు.. ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం
సాక్షి, ప్రకాశం జిల్లా: త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు ఎదురైంది. త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. అక్రమ కేసులతో భయపెట్టినా వైఎస్సార్సీపీకే ఎంపీటీసీలు పట్టం కట్టారు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా త్రిపురాంతకం-2 ఎంపీటీసీ సృజన లొంగలేదు. ఎన్నికల హాలులోనే సృజనపై టిడిపి ఎంపీటీసీలు దాడికి కూడా యత్నించారు. సృజనా ఎత్తిన చేయిని బలవంతగా దించివేయడానికి కూటమి అభ్యర్థి చల్లా జ్యోతి ప్రయత్నించింది.అనంతపురం జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. రొద్దం ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి నాగమ్మ ఘన విజయం సాధించారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందారు. ఆయనకు 33 మంది వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు పోటీకి దూరంగా ఉన్నారు.మాడుగుల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్. రాయవరం మండల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మోదీ అంటే భయమా.. దక్షిణాదిపై స్పందనేది బాబు?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలలో కాక పుట్టిస్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 రాజకీయ పార్టీల నేతల సమావేశం ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గట్టిగానే చెప్పగలిగింది. ఈ సమావేశానికి హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూడా తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ కాపీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అంశం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఇంకా చర్చ జరగలేదని చెబుతుంటే మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం చెన్నై సమావేశాన్ని దొంగల భేటీగా పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ ఇప్పటికీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడడానికి నోరు పెగులుతున్నట్లు లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అనుకోవడం లేదని చెబుతున్నారు. వీరిద్దరు బీజేపీతో కూటమి కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.గతంలో చంద్రబాబు నాయుడు తను కూటమిలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోనని కనీసం కబుర్లయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడం గమనార్హం. పాతికేళ్లపాటు పునర్విభజన వద్దని చెన్నై భేటీలో పాల్గొన్న నేతలు కోరారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే సమస్యకు జగన్ తన లేఖ ద్వారా పరిష్కార మార్గాలు వివరించారు. పాతికేళ్ల నిషేధమన్న డిమాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాతికేళ్లలో ఉత్తరాది జనాభా మరింత పెరగదని ఈ నేతలు గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పుడే పునర్విభజన వ్యవహారానికి ఒక పద్దతైన పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పక తప్పదు.వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న వాటాను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. ఇదే ఉద్దేశం చెన్నై భేటీలో పాల్గొన్న నేతలందరికీ ఉన్నప్పటికీ, వారి తక్షణ డిమాండ్ మాత్రం పునర్విభజన వద్దన్నది కావడం గమనార్హం. అయితే, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నియోజకవర్గాలు పెరగకపోతే ఎన్నికైన ఎంపీలకు అవి అలవికానివిగా మారతాయి. ఉదాహరణకు ఇప్పుడు 17 లక్షల నుంచి 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, అది పాతిక లక్షలకు ఒక నియోజకవర్గంగా మారవచ్చు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి దీనివల్ల నష్టం జరగకూడదన్నది అంతా ఒప్పుకోవాలి.ఈ సమస్యకు ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించడం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో కొత్త నియోజకవర్గాలు భారీ ఎత్తున వస్తాయి. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో పెరగవు సరికదా కేరళ వంటి చోట్ల నియోజకవర్గాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రం ఎంపీలు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. యూపీతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొద్ది రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. ఈ పరిణామం ఒకరకంగా నియంతృత్వ ధోరణికి దారి తీయవచ్చన్నది దక్షిణాది రాష్ట్రాల నేతల భయం.జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు.. దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే, ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, యూపీ నుంచి కేంద్రానికి అందే రూపాయి పన్ను అందితే, తిరిగి ఆ రాష్ట్రానికి 2.73 రూపాయలు వెళుతున్నాయని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయలకు పైగా నిధులు వెళుతుంటే తమిళనాడుకు 29పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులు వస్తున్నాయని వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే ఉత్తరాది, దక్షిణాది అంతరం బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ సమగ్రత భావానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అనవసరమైన అపోహలకు దారి తీస్తుంది.కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగితే బీజేపీ లబ్ది పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెన్నై సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ది పథంలో వెళుతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండరాదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ అధినేత జగన్ మాత్రం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా దామాషా పద్దతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, తదానుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై భేటీలో తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్‌లోని పరిస్థితులు, ఐఎన్డీఏతో ఉన్న సంబంధాల రీత్యా హాజరై ఉండవచ్చు. నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు తెలియచేశారు. తదుపరి భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంతవరకు హాజరు అవుతుందన్నది సందేహమే. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పక్షాలు పాల్గొన్న సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లడంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శలు చేస్తుంది. ఒడిషా నుంచి బీజేడీ నేతలు హైదరాబాద్ వస్తారా? రారా? అన్నది చెప్పలేం. ఎటుతిరిగి డీఎంకే, వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసే ఉంటున్నాయి కనుక వారికి ఇబ్బంది ఉండదు. ఇక వైఎస్సార్సీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీకి వెళ్లకుండా, అలాగని తన అభిప్రాయాలు దాచుకోకుండా ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు. దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరగరాదని ఆయన డిమాండ్ చేసినట్లయింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పక్షాలు అధికంగా ఉన్న భేటీకి ఆయన హాజరు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతవరకు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే వైపుకానీ, ఇటు ఇండియాకూటమివైపు కానీ ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు మాత్రం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. సాధారణంగా అయితే గతంలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తే పొత్తుల గురించి పట్టించుకోకుండా మాట్లాడతానని చంద్రబాబు అనేవారు. గుజరాత్ మత కలహాల అంశంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఓటింగ్ సమయానికి జారి పోయినప్పటికీ, కొన్నిసార్లు అయినా మాట్లాడేవారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యూపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక వాటాలో కేంద్రం నుంచి నిధుల వెళ్లే తీరుతెన్నులపై గతంలో ధ్వజమెత్తేవారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని మాట వరుసకైనా అనేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంటే ఏం భయమో తెలియదు కానీ.. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం స్పందించడం లేదు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఆయనకు దీనిపై పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ, తానే మోదీని ఎదిరించగలనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు వంటి సీనియర్ నేత, ఇప్పుడు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేకపోవడం ఆయన ఎంతగా బలహీనపడ్డారో తెలియ చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

IPL 2025: అశ్విన్, చహల్‌ను వదులుకొని రాయల్స్ తప్పు చేసిందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో పరాజయం ఎదుర్కొన్న ఆ జట్టు.. నిన్న (మార్చి 26) ఆడిన రెండో మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ సీజన్లో రాయల్స్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వారి జట్టు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో వారి జట్టు చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్‌లో మాత్రం దారుణంగా ఉంది. గత సీజన్ వరకు వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్‌ను వదులుకుని రాయల్స్ పెద్ద తప్పు చేసింది. వీరి ప్రత్యామ్నాయంగా వచ్చిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రాయల్స్ యాష్, చహల్‌కు ప్రత్యామ్నాయంగా లంక స్పిన్ ద్వయం మహీశ్ తీక్షణ, వనిందు హసరంగలను అక్కున చేర్చుకుంది. వీరు మంచి బౌలర్లే అయినా యాష్, చహల్ అంత ప్రభావం చూపలేకపోతున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఈ విషయం తేలిపోయింది. రాయల్స్ మరో ఇన్ ఫామ్ పేసర్ ఆవేశ్ ఖాన్‌ను కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంటుంది. బౌల్ట్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకున్న జోఫ్రా ఆర్చర్ గల్లీ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ ఏకంగా 76 పరుగులిచ్చాడు (4 ఓవర్లలో). జట్టులోకి కొత్తగా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువ పేసర్ ఫజల్ హక్ ఫారూకీ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. అనుభవజ్ఞుడైన సందీప్ శర్మలో మునుపటి జోరు కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన దేశీయ పేసర్ తుషార్ దేశపాండే ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో అశ్విన్, చహల్, బౌల్ట్ లేని లోటు రాయల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత బౌలింగ్ యూనిట్‌తో రాయల్స్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. బ్యాటింగ్‌నే నమ్ముకొని అద్భుతాలు చేద్దామన్నా, ఈ సీజన్లో రాయల్స్ బ్యాటర్లు ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. తొలి మ్యాచ్‌లో జురెల్, శాంసన్ పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్‌లో వారిద్దరూ తేలిపోయారు. స్టార్ ఓపెనర్ జైస్వాల్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఏదో చేస్తాడనుకున్న నితీశ్ రాణా దారుణంగా విఫలమవుతున్నాడు. గత సీజన్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్ పరాగ్‌లో ఆ మెరుపులు కనిపించడం లేదు. హెట్మైర్ను పరిశీలించాల్సి ఉంది. ఈ బ్యాటింగ్ విభాగంతో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న రాయల్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు కూడా ఏమాత్రం ప్రతిఘటించలేదు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన రియాన్ పరాగ్ ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా.. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గౌహతి వేదికగా మార్చి 30న జరుగనుంది.

నోటీసు లేకుండానే వందల ఉద్యోగాలు కట్
ప్రస్తుత ఏడాదిలోనూ చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా జొమాటో కూడా చేరింది. దీనికి సంబంధించినా ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే.. 300 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించారని, జొమాటో మాజీ ఉద్యోగి ఆరోపించారు. మంచి పర్ఫామెన్స్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ నన్ను కూడా కంపెనీ తొలగించిందని బాధితుడు పేర్కొన్నాడు. అయితే గత మూడు నెలలలో 28 నిమిషాలు ఆలస్యమైన కారణంగా తొలగించినట్లు మాజీ ఉద్యోగి చెప్పుకొచ్చాడు.జొమాటో లేఆఫ్స్ ప్రభావం కేవలం నా మీద మాత్రమే కాదు, సుమారు 300 మందిపై ప్రభావం చూపిందని మాజీ ఉద్యోగి / బాధితుడు పేర్కొన్నాడు. పనిలో ఏమైనా లోపం ఉంటే.. దాన్ని సరిచేసుకోవడానికి సంస్థ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. మేము చేసిన కృషి, మేము అందించిన ఫలితాలు కంపెనీ పట్టించుకోలేదు. ఒక్కసారిగా వందల మందిని బయటకు పంపింది.జొమాటో తన నేడు ఈ స్థాయిలో ఉందంటే.. దీనికి కారణం సంస్థ కోసం పనిచేస్తున్న ఉద్యోగులే అని చెప్పవచ్చు. అలంటి ఉద్యోగులనే సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే ఉద్యోగంలో నుంచి తీసేయడం అనేది బాధాకరం అని బాధితుడు పేర్కొన్నాడు. చాలా కంపెనీలు ఉద్యోగులను వ్యక్తులుగా కాకుండా.. కేవలం సంఖ్యగా మాత్రమే చూస్తున్నాయని అన్నాడు.ఇదీ చదవండి: వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెడ్దిట్ పోస్టు మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం 300 మందిపై ప్రభావం చూపిందని అన్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేఖంగా పోరాటం చేయండని మరొకరు సలహా ఇచ్చారు.

తగ్గేదేలే అంటున్న కిమ్.. ఏఐతో సరికొత్త ప్లాన్
సియోల్: ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తమ దేశ సైనిక బలంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు మిస్సైల్స్‌ను పరీక్షించిన కిమ్.. తాజాగా అత్యాధునిక డ్రోన్ల పని తీరును పర్యవేక్షించారు. ఏఐ సాంకేతికతతో కూడిన ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా తయారు చేసినట్టు అక్కడి అధికారిక మీడియా కథనాలు వెల్లడించాయి.అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల డ్రోన్ల ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా కృత్రిమ మేధస్సు (AI)తో తయారుచేసిన అత్యాధునిక డ్రోన్ల పరీక్షను ఆయన పర్యవేక్షించారు. భూమిపై, సముద్రంలో వ్యూహాత్మక లక్ష్యాలను, శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యం కలిగిన అత్యాధునిక నిఘా డ్రోన్ల పరీక్షను కిమ్ పర్యవేక్షించినట్లు నార్త్ కొరియా మీడియా వెల్లడించింది. ఈ సందర్బంగా కిమ్ మాట్లాడుతూ..‘ఆయుధాల ఆధునికీకరణలో మానవరహితమైనవి, కృత్రిమ మేధస్సు సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. అమెరికా, దాని మిత్ర దేశాలకు ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్ట్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ‘అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ.కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ (బైడెన్ ప్రభుత్వం) శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోంది’ అని కిమ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.Kim Jong Un Tests AI-Equipped DronesNorth Korean leader Kim Jong Un personally observed tests of new reconnaissance and kamikaze drones equipped with artificial intelligence, according to state media KCNA.#NorthKorea #KimJongUn #AI #Drones #MilitaryTech pic.twitter.com/Bh6lFP0031— Cyrus (@Cyrus_In_The_X) March 27, 2025

భార్యను ప్రియుడికిచ్చి పెళ్లిచేసిన భర్త.. ఆ తర్వాత ఏమైందంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి, అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త.. వారిద్దరికీ పెళ్లి జరిపించారు. అంతేకాకుండా.. తమ ఇద్దరు పిల్లలను తానే పోషిస్తానని సదరు భర్త చెప్పుకొచ్చారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోని సంత్ కబీర్‌నగర్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, బబ్లూ జీవనోపాధి మరోచోట పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాధిక.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఈ సంబంధం క్రమంగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం భర్త బబ్లూకు కూడా తెలిసింది. దీంతో, భార్యను మందలించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. అయితే, ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో బబ్లూ.. నా భార్య నాతో జీవించాలా లేక తన ప్రేమికుడితో జీవించాలా అని నిర్ణయించుకుంటుందా? అని గ్రామస్తుల ముందు పంచాయితీ పెట్టాడు. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు మొత్తం సమాజం నివ్వెరపోయింది.భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో.. ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్ కోర్టుకు హాజరయ్యాడు. ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండో వివాహం చేశాడు. తానే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇక మొదటి భర్త తన భార్యతో కలిగిన సంతానాన్ని తనతోనే పోషిస్తానని చెప్పాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Darr Ka Mahaul HaiKai shocking cases mein jab patiyon ko maar diya gaya, toh pati community mein darr fail gaya hai.Sant Kabir Nagar: Ek naye twist mein, 7 saal ki shadi ke baad, ek aadmi ne apni biwi ka past accept kar liya aur khud usko uske lover ke saath vida kiya, aur… pic.twitter.com/CLwzKzg1e1— F3News (@F3NewsOfficial) March 26, 2025

రామ్ చరణ్ RC16 'టైటిల్, ఫస్ట్ లుక్' విడుదల.. బుచ్చి బాబు మార్క్
రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో అదిరిపోయే మాస్ గెటప్‌లో ఆయన కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తన మార్క్ చూపించబోతున్నాడని క్లియర్‌గా అర్థం అవుతుంది. మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా రేంజ్లో ఈ ప్రాజెక్ట్ రానుంది. అయితే, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్( Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది. ‘జైలర్’ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు . గేమ్‌ఛేంజర్ పరాజయంతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ ఫుల్ జోష్ నింపుతుంది. ఈసారి తప్పకుండా హిట్ కొడుతున్నాం అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 𝐀 𝐌𝐀𝐍 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐋𝐀𝐍𝐃, 𝐀 𝐅𝐎𝐑𝐂𝐄 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐍𝐀𝐓𝐔𝐑𝐄 ❤️🔥#RC16 is #PEDDI 🔥💥Happy Birthday, Global Star @AlwaysRamCharan ✨#HBDRamCharan#RamCharanRevolts@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/ae8BkshtR3— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2025

హౌతీ దాడుల ‘సిగ్నల్’ ముచ్చట్లు లీక్.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడి వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్’ యాప్ గ్రూప్చాట్లో చర్చిస్తూ పొరపాటున ఒక సీనియర్ పాత్రికేయుడిని ఆ గ్రూప్‌లో చేర్చుకున్న ఉదంతంలో అసలు ఆ గ్రూప్‌లో ఏం చర్చించారన్న వివరాలు బహిర్గతమయ్యాయి. సీనియర్ పాత్రికేయుడు జెఫ్రీ గోల్డ్బర్గ్ ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న ‘ది అట్లాంటిక్’ మేగజైన్ ఈ వివరాలను బుధవారం స్క్రీన్షాట్ల రూపంలో బయటపెట్టింది.ఈ గ్రూప్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్, విదేశాంగ మంత్రి రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్, హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్సహా 19 మంది సభ్యులుగా ఉన్నారు. మార్చి 15వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఏ సమయంలో ఎక్కడెక్కడ ఏ రకం బాంబులు, యుద్ధవిమానాలు, డ్రోన్లతో దాడిచేసేది రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చాటింగ్‌లో పేర్కొన్నారు. దాడులను ప్రశంసిస్తూ మిగతావాళ్లు అమెరికా జెండాలు, పిడికిలి గుర్తు, ఎమోజీలను పోస్ట్‌చేశారు.సభ ముందుకు నిఘా అధికారులులీకేజీ ఉదంతంపై ఉన్నతస్థాయి విచారణలో భాగంగా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు బుధవారం పార్లమెంట్ దిగువ సభలో ఇంటెలిజెన్స్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్నారు. దేశం ఎదుర్కొంటున్న ముప్పులపై వార్షిక సమీక్షలో భాగంగా వీళ్లంతా వివరణ ఇచ్చుకోనున్నారు. ఇప్పటికే వీళ్లంతా మంగళవారం ఎగువసభ సెనేట్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. లీకేజీపై కొందరు డెమొక్రటిక్ పార్టీ సెనేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. లీకేజీని అధ్యక్షుడు ట్రంప్ అతిచిన్న పొరపాటుగా అభివర్ణించారు. గతంలో డెమొక్రటిక్ నాయకురాలు హిల్లరీ క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో సొంత ఈ–మెయిల్ వాడినందుకే అత్యంత సున్నిత సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదముందని తీవ్ర వివాదం రేపిన రిపబ్లికన్లు ఇప్పుడు లీకేజీ ఘటన అత్యంత అప్రాధాన్యమైన అంశమని కొట్టిపారేయడం గమనార్హం.
400 ఎకరాల భూమి వేలం.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ఇదే: ధర ఎంతో తెలుసా?
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’కు సుంకాలతో ముప్పు
కునాల్ కమ్రాకు ముంబై పోలీసుల ఝలక్
‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?.. ఇలాంటి వింత చూడలేదు’
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
ఐపీఎల్-2025లో ఆసక్తికర విషయం.. వాళ్లే హీరోలయ్యారు..!
నోటీసు లేకుండానే వందల ఉద్యోగాలు కట్
స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ ప్రోగ్రామ్! జెన్ జెడ్ స్టోరీ టెల్లర్స్‌కి అవకాశల వెల్లువ..
పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
400 ఎకరాల భూమి వేలం.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ఇదే: ధర ఎంతో తెలుసా?
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’కు సుంకాలతో ముప్పు
కునాల్ కమ్రాకు ముంబై పోలీసుల ఝలక్
‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?.. ఇలాంటి వింత చూడలేదు’
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
ఐపీఎల్-2025లో ఆసక్తికర విషయం.. వాళ్లే హీరోలయ్యారు..!
నోటీసు లేకుండానే వందల ఉద్యోగాలు కట్
స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ ప్రోగ్రామ్! జెన్ జెడ్ స్టోరీ టెల్లర్స్‌కి అవకాశల వెల్లువ..
పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
ఓట్లేయించుకున్నవారు జీతాలు పెంచుకున్నారు.. ఓటేసిన మనకు కనీస వేతనం లేదు!
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు
అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
సినిమా

వేసవిలో సోదరా
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల అనుబంధాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్న సినిమాయే ‘సోదరా’. ఈ వేసవికి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు’’ అని తెలిపారు చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్.

రెట్టింపు వినోదంతో...
‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము టిక్కెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హారిక సూర్యదేవర మాట్లాడుతూ– ‘‘కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. నార్నే నితిన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’లో వినోదం రెట్టింపు ఉంటుంది. చూసి ఆనందించండి’’ అని తెలిపారు. ‘‘మా ట్రైలర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాం. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు సంగీత్ శోభన్, రామ్ నితిన్.

హిస్టారికల్ ప్యారడైజ్
‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై రూపొందుతోన్న ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. కాగా ఈ సినిమా సరిగ్గా 365 రోజుల్లో తెరపైకి రానుందని పేర్కొని, ‘వన్ ఇయర్ టు గో... ఇండియన్ సినిమా విట్నెస్ ది మ్యాడ్నెస్’ అంటూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన మా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించింది. హైదరాబాద్ చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ నానీని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో చూపించనుంది. సుధాకర్ చెరుకూరి అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం, ఏఓ విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మా చిత్రం తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ సహా 8 భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.

ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముంబయిలో ఆమె కారును ఓ బస్సు ఢీకొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఐశ్వర్య బాడీ గార్డ్స్ వెంటనే కారులో నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.ఐశ్వర్యరాయ్ కారును బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కారుకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.అక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని జుహుకి చెందిన ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆమె క్షేమం గురించి పలువురు ఆరా తీశారు.కాగా.. ఐశ్వర్యరాయ్ చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 2లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఆమె ఉత్తమ నటిగా ప్రధాన పాత్ర (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం 2023లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

పాక్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విధుల నేపథ్యంలో బిజీగా ఉండగా.. అతడి స్థానంలో టామ్ లాథమ్ (Tom Latham)ను సెలక్టర్లు తాత్కాలిక సారథిగా ఎంపిక చేశారు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తాజాగా గాయపడ్డాడు.బ్రేస్వెల్కే సారథ్య బాధ్యతలుపాక్తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో టామ్ లాథమ్ కుడిచేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొత్తానికి లాథమ్ దూరమయ్యాడు. అతడి స్థానంలో హెన్రీ నికోల్స్ జట్టులోకి రాగా.. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ వన్డే టోర్నమెంట్ టైటిల్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. టీమిండియా చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలై.. రెండోసారి ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది.ఈ మెగా ఈవెంట్ కంటే ముందు త్రైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించిన కివీస్ జట్టు.. దక్షిణాఫ్రికా, ఆతిథ్య పాక్‌లను ఓడించి విజేతగా నిలిచింది. 4-1తో పాక్‌ను చిత్తు చేసిన కివీస్ఇక, చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ స్వదేశంలో పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. పొట్టి సిరీస్‌లో పాక్‌పై అద్భుత విజయం సాధించింది. మైకేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్సీలో 4-1తో సల్మాన్ ఆఘా బృందంపై గెలుపొంది సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో శనివారం (మార్చి 29) నుంచి న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇక ఐపీఎల్ కారణంగా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తదితరులు జట్టుకు దూరం కాగా.. కీలక పేసర్ మ్యాట్ హెన్రీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు.. పాక్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైలీ జెమీషన్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఈ నేపథ్యంలో.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న నిక్ కెల్లీ, మహ్మద్ అబ్బాస్‌లకు తొలిసారి న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కింది. ఇక టామ్ లాథమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన హెన్రీ నికోల్స్ ఇప్పటి వరకు 78 వన్డేలు ఆడాడు. అయితే, మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న అతడు.. దేశవాళీ క్రికెట్‌తో పునరాగమనం చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు.మరోవైపు.. విల్ యంగ్ పాక్‌తో తొలి వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అతడి భార్య తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో రెండు, మూడో వన్డేలకు అతడు దూరంగా ఉండనున్నట్లు సెలక్టర్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కవర్‌గా రైస్ మరియూకు తొలిసారి పిలుపునిచ్చినట్లు తెలిపారు.పాకిస్తాన్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టుమైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), మహ్మద్ అబ్బాస్, ఆది అశోక్, విల్ యంగ్/రైస్ మరియూ, మార్క్ చాప్మన్, జేకబ్ డఫీ, మిచ్ హే, నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, బెన్ సియర్స్, నాథన్ స్మిత్.న్యూజిలాండ్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సూఫియాన్ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి

ఐపీఎల్లో నేడు (మార్చి 27) సన్‌రైజర్స్ మ్యాచ్.. 300 చూడగలమా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 27) ఆసక్తికర సమరం జరుగనుంది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వై నాట్ 300 అని టార్గెట్ పెట్టుకున్న తమ జట్టు ఈ మ్యాచ్‌లో తప్పక టార్గెట్‌ను రీచ్ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. సన్‌రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే టార్గెట్ 300ను దాదాపుగా రీచ్ అయినంత పని చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 286 పరుగులు చేసింది.తొలి మ్యాచ్‌లో మిస్ అయిన టార్గెట్ 300ను నేటి మ్యాచ్‌లో తప్పక రీచ్ అవ్వాలని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కూడా పట్టుదలగా ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు 300 పరుగులు చేయలేదు. ఐపీఎల్లో టాప్-3 అత్యధిక స్కోర్లు (287, 286, 277) సన్‌రైజర్స్ ఖాతాలోనే ఉన్నాయి. ఈ సీజన్లో సన్‌రైజర్స్ తప్పక 300 మార్కును తాకుతుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. దీని కోసమే సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌ను అభిమానులు ఫాలో అవుతున్నారు.నేడు మ్యాచ్ జరుగబోయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ప్రస్తుతం సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే.. నేటి మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 286 పరుగులు చేయగా.. ఛేదనలో రాయల్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడినా అద్భుతంగా పోరాడింది.రాయల్స్ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మిగతా సన్‌రైజర్స్ ఆటగాళ్లు కూడా 200పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించారు. హెడ్ అర్ద సెంచరీ చేశాడు. అభిషేక్, క్లాసెన్ తమదైన శైలిలో ఉన్న కాసేపు విధ్వంసం సృష్టించారు. నితీశ్ రెడ్డి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఐపీఎల్లో సన్‌రైజర్స్, లక్నో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో లక్నో మూడు గెలువగా.. సన్‌రైజర్స్ కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్సే విజయం సాధించింది. గత సీజన్లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ తొలి అర్ద భాగంలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ సీజన్లో సన్‌రైజర్స్, లక్నో రెండూ బలంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర వీరులున్నారు. సన్‌రైజర్స్‌లో అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీశ్ ఉంటే.. లక్నోలో మిచెల్ మార్ష్, పూరన్, మార్క్రమ్, మిల్లర్, పంత్ ఉన్నారు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడినా లక్నో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మార్ష్, పూరన్ సుడిగాలి అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు కూడా రాణించారు. అయితే ప్రత్యర్ధి ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. గత మ్యాచ్‌తో పోలిస్తే నేటి మ్యాచ్‌లో లక్నో బౌలింగ్ మరింత బలపడనుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ , అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, మణిమారన్ సిద్దార్థ్

RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘెర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ అతి కష్టం మీద 151 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కేకేఆర్ బౌలర్లు చెలరేగిపోయారు. మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో ఆర్చర్ 2 సిక్సర్లు బాదడంతో రాయల్స్ 150 పరుగుల మార్కును తాకగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌ను క్వింటన్ డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్) చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. డికాక్ మరో ఎండ్ నుంచి రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారం తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు. డికాక్ రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు రాయల్స్ ఏ ఒక్క అవకాశం రాలేదు. డికాక్ బాధ్యతాయుతంగా ఆడి రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రాయల్స్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్కరు కూడా డికాక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు.వాస్తవానికి రాయల్స్ బ్యాటింగ్ చేసే సమయంలోనే మ్యాచ్‌ను కోల్పోయింది. ఆ జట్టు కనీసం 170-180 పరుగులు చేసుండాల్సింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ గెలుపుకు వీరు ఆదిలోనే బీజం వేశారు.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 170 పరుగులు స్కోర్ చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ వికెట్ (గౌహతి పిచ్) గురించి తెలుసు కాబట్టి కాస్త తొందరపడ్డాను. వేగంగా పరుగులు సాధించే క్రమంలో నేను చేయాల్సిన దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాను. నేను అదనంగా 20 పరుగులు చేసుంటే బౌలర్లకు ఫైటింగ్ చేసే అవకాశం ఉండేది.డికాక్ అద్భుతంగా ఆడాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాలన్నదే మా ప్రణాళిక. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలోనైనా మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకుందామనుకున్నాము. అదీ జరగలేదు. డికాక్ మాకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్నులాగేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత సీజన్లో జట్టు నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరింది. అలాగే చేశాను. ఈ సీజన్లో మేనేజ్మెంట్ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమంది. జట్టు అవసరాల కోసం ఎక్కడ బ్యాటింగ్ చేసేందుకైనా నేను సిద్దంగా ఉండాలి.గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో మాకు యువ జట్టు ఉంది. మేము చిన్న దశల్లో బాగా రాణిస్తున్నాము. దీన్నే మ్యాచ్ మొత్తంలో కొనసాగిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. మా తప్పులను ఒప్పుకుంటాము. వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా చూసుకుంటాము. కొత్త ఆలోచనలతో చెన్నైతో మ్యాచ్‌లో బరిలో నిలుస్తాము.కాగా, రియాన్ సారథ్యంలో రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో రియాన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియాన్‌ను ఇంకో అవకాశం ఉంది. నాలుగో మ్యాచ్ నుంచి శాంసన్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు. రాయల్స్ మార్చి 30న ఇదే గౌహతిలో సీఎస్కేతో తలపడనుంది.

RR VS KKR: మొయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది: రహానే
ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌లో అంత మజా రాలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్ ఫీలయ్యారు. మ్యాచ్ ఇంత చప్పగా సాగడానికి పిచ్‌తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) రాయల్స్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. స్పిన్నర్లు మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్‌గా వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 5) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో (కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్ (రహానే) తీయగలిగాడు. మొయిన్ అలీ రనౌటయ్యాడు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్‌కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్ ఓ నాణ్యమైన ఆల్‌రౌండర్. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్‌తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొటుంది. ఈ మ్యాచ్ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది.
బిజినెస్

ఉపగ్రహాల్లో అక్కడికక్కడే విద్యుదుత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: ఉపగ్రహాలతో శాటిలైట్ టీవీలు మొదలుకొని ఖనిజాల గుర్తింపు వరకూ అనేక ప్రయోజనాలున్నాయి. అయితే భూమికి దూరంగా కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాలు పని చేయాలంటే విద్యుత్తు కావాలి. ఇప్పటివరకూ బరువైన సోలార్ ప్యానెల్స్ లేదా బ్యాటరీలతో ఈ విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఇలా కాకుండా... రేడియో ధార్మిక పదార్థాలు వెలువరించే వేడినే విద్యుత్తుగా మార్చగలిగతే? ఎన్నో ప్రయోజనాలుంటాయి. హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ హైలెనర్ టెక్నాలజీస్ అచ్చంగా ఇదే పనిలో ఉందిప్పుడు. ఈ దిశగా టేక్‌మీ2స్పేస్ అనే కంపెనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.వేడిని విద్యుత్తుగా మార్చేందుకు ఇప్పటికే థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ.. వీటితో అధిక మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కష్ట సాధ్యం. మరోవైపు హైలెనర్ టెక్నాలజీస్ సంస్థ ప్రపంచంలో మొదటిసారి కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా కాలుష్యం ఏమాత్రం లేని విద్యుత్తును ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. టేక్‌మీ2 స్పేస్ భూ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు కంపెనీలిప్పుడు చేతులు కలిపాయి. ఉపగ్రహాలకు విద్యుత్తును అందించేందుకు హైలెనర్ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థలను పరీక్షించేందుకు నిర్ణయించాయి. వేడిని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయడం.. ఉపగ్రహాల్లోని కంప్యూటర్లను నడిపించడం ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.‘‘లెనర్ టెక్నాలజీ అంతరిక్షంలోనూ పనిచేస్తుందని నిరూపించడం చాలా కీలకం. టేక్‌మీ2స్పేస్ నైపుణ్యం, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో ఈ విషయాన్ని నిరూపించేందుకు ఎంతో ఉపయోగపడతాయి’’ అని హైలెనర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈవో సిద్ధార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే.. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లోనూ అక్కడక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగల అవకాశం ఏర్పడుతుంది. అది కూడా వృథా అవుతున్న వేడి సాయంతో!!ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!‘‘ఉపగ్రహాల్లో వేడిని తగ్గించడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. హైలెనర్ టెక్నాలజీస్ ఉత్పత్తులు ఈ ఘనత సాధిస్తే అతితక్కువ స్థలంలో దీర్ఘకాలం పనిచేయగల ఒక ఇంధన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’’ అని టేక్‌మీ2 స్పేస్ వ్యవస్థాపకుడు రోనక్ కుమార్ సామంత్రాయ్ తెలిపారు. సౌర విద్యుత్తు, బరువైన బ్యాటరీల వాడకాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వివరించారు.

ఎయిర్టెల్ కీలక నిర్ణయం: ముందుగానే..
న్యూఢిల్లీ: గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి అదనంగా రూ. 5,985 కోట్ల మొత్తాన్ని టెల్కో భారతి ఎయిర్టెల్, దాని అనుబంధ సంస్థ భారతి హెక్సాకామ్ చెల్లించాయి. రుణాలు, వడ్డీ వ్యయాల భారాన్ని తగ్గించుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో భాగంగా ఈ మేరకు చెల్లించినట్లు ఎయిర్టెల్ తెలిపింది.దీనితో అధిక వడ్డీ భా రం ఉండే స్పెక్ట్రం బాకీలకు సంబంధించి ఎయిర్టెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,981 కోట్లు, ఇప్పటివరకు మొత్తం రూ. 66,665 కోట్లు చెల్లించినట్లయింది. ముందస్తుగా చెల్లించిన మొత్తం లయబిలిటీలపై సగటు వడ్డీ రేటు 9.74 శాతంగా ఉంది. అటు మరో అనుబంధ సంస్థ నెట్వర్క్ ఐ2ఐ కూడా 1 బిలియన్ డాలర్ల పర్పెచ్యువల్ డెట్ సెక్యూరిటీలను చెల్లించేసింది. కంపెనీ వీటిని 2020లో జారీ చేసింది.

వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలు
ఎండాకాలంలో వచ్చిన వానలాగా.. అలా వచ్చి ఇలా వెళ్లినట్లు, బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గి.. మళ్ళీ అమాంతం పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 110 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,840 వద్ద ఉంది.ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వందేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 55 పాయింట్లు పెరిగి 23,541కు చేరింది. సెన్సెక్స్(Sensex) 178 పాయింట్లు ఎగబాకి 77,469 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.33 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.14 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.12 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.04 శాతం దిగజారింది.ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల భవిష్యత్తులో కీలక వడ్డీరేట్ల కోత ఉంటుందనే సంకేతాలిచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్ల కోతపై ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా విక్రయాలు తగ్గిస్తున్నారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచుతుంది. భారత రూపాయి స్థిరత్వం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఏప్రిల్ 2న ట్రంప్ ఇండియాపై విధించనున్న ప్రతికార సుంకాలపై నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిపారు. దాంతో మార్కెట్ వర్గాలు దీన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు ..!
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే.. మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు. ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు. ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు.

'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణ వివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై..
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్‌లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు. శారద మురళీధరన్ పోస్ట్‌లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్నిఅలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.రంగు తక్కువ అనేభావం మాయం..సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక పాత్రల్లో పనిచేశారు.(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్)

ఉషా వాన్స్ నటి దీపికా పదుకొణె స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్ బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్‌లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్‌తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్ గురించి చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్‌లో జరిగిన తప్పిదం ఏంటంటే..డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే పోస్ట్ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్ చేసి ఉన్న జేడీ వాన్స్ ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్గా మార్ఫింగ్ చేసిన ఫోటోని ఎలా పోస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్ ఫోటో అనే కాదు. Usha Vance is a brilliant and accomplished attorney known for her intelligence, grace, and support for her husband, J.D. Vance. Her beauty is matched by her poise and dedication, making her an inspiring figure. pic.twitter.com/Wm56FK0uCq— Ivanka Trump 🇺🇲 🦅 News (@IvankaNews_) March 23, 2025ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్గ్రీన్ స్టైల్ అది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్ వేర్ని మార్ఫింగ్ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్ ఫోటో అని క్లియర్‌గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్ పెట్టాలి అని కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్‌లో పెరుగుతున్న క్రేజ్)

భారత్ గోలీ సోడాకు విదేశాల్లో ఫుల్ డిమాండ్..!
ఒకప్పుడు మనదేశంలో సంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీసోడా చూస్తుండగానే కనుమరుగైంది. పెప్సీ, మజా, కోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ మని శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్‌తో ప్రజల మన్నలను అందుకున్న పానీయం ఇది. 80,90లలో దీనిదే హవా. అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెగ్గుచుకుని తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వెరేలెవెల్లో ఉంది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దామా..!.మన భారత సంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్‌తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాజిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని, కామర్స్ మంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు. దాని వినూత్న రీక్రీయేషనే అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉందట. అంతేగాదు ఈ గోలిసోడా మార్కెట్‌కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్మ్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. మన భారతీయులు సైతం ఈ గోలీసోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయలును కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్‌తో వచ్చే టప్ మనే పేలుడు శబ్దం.. మనల్ని ప్రేమగా గుర్తుంచుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు మళ్లీ ఇలా రీబ్రాండింగ్ అంర్జాతీయ మార్కెట్‌ని ఆకర్షించి ఆధునాత ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒకరంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పోటీపడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్ ఈ సోడా మన దేశంలో కూడా మళ్లీ ఇదివరకటి రోజుల్లా అమ్ముడైలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ..ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్న ఆర్యోక్తి గుర్తోస్తోంది కదూ..!.Bharat's very own GOLI POP SODA returns to wow tastebuds worldwide! 🇮🇳Kudos to @APEDADOC for promoting the revival of the traditional Indian Goli Soda.📖 https://t.co/Ask6n6YCCl pic.twitter.com/T7XZmc1xmc— Piyush Goyal (@PiyushGoyal) March 25, 2025(చదవండి: పెళ్లి సంగతి తర్వాత..కౌన్సిలింగ్ ఇప్పించండి..! )
ఫొటోలు
International

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిలో ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఇటువంటి మార్పులు చేర్పుల కారణంగా చట్టపరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వులోని వివరాల ప్రకారం ఇంతవరకూ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ(Election process)లో అత్యవసమైన ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే ఓటరు జాబితాలను వెలువరించడంలో, ఎన్నికల సంబంధిత నేరాలను విచారించడానికి అందరూ సమాఖ్య సంస్థలకు సహకరించాలని ఆ ఉత్తర్వులో కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించని రాష్ట్రాలు సమాఖ్య నిధులలో కోతలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులో హెచ్చరించారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. సమాఖ్య ఎన్నికలలో ఓటు వేసేందుకు పాస్‌పోర్ట్ వంటి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేశారు.ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్-ఇన్ బ్యాలెట్(Mail-in ballot)లను రాష్ట్రాలు ఇకపై అంగీకరించకూడదని దీనిలో స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు, మోసాలను అరికట్టేందుకేనని పేర్కొంది. ముఖ్యంగా మెయిల్-ఇన్ ఓటింగ్ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావించారు. ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందని పేర్కొన్నారు.రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఈ ఉత్తర్వుకు మద్దతు ప్రకటించారు. ఇది ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఉపయోపగడుతుందని పేర్కొన్నారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు అమెరికన్ పౌరులు మాత్రమే ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా ఉందని పేర్కొన్నారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వును ఖండించారు. కొందరు ఓటర్లు ఓటు హక్కును కోల్పోతారని వారు పేర్కొన్నారు. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు అందుబాటులో లేదని తెలుస్తోంది.మరోవైపు ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో 18 రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్లను ఆ తేదీకి ముందు పోస్ట్‌మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికారు. కాగా కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు సమాఖ్య ప్రభుత్వం వాడుతున్న చట్టవిరుద్ధమైన ఆయుధంగా అభివర్ణించారు. ట్రంప్ ఓటర్ల సంఖ్యను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం

అమెరికాలోనే 35ఏళ్లుగా జీవితం.. ట్రంప్ రాకతో ఊహించని మలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల కారణంగా అక్కడ నివాసం ఉంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు అమెరికాను వీడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక, తాజాగా ఓ కుటుంబానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. 35ఏళ్లుగా అమెరికాలోనే నివాసం ఉంటున్న ఓ జంటను అధికారులు.. అమెరికా నుంచి పంపించేశారు. అక్రమంగా నివాసముంటున్నారనే కారణంతో వారిని దేశం నుంచి వెళ్లగొట్టారు.వివరాల ప్రకారం.. కొలంబియాకు చెందిన గ్లాడీస్ గొంజాలెస్ (55), నెల్సన్ గొజాలెస్ (59) దంపతులు దాదాపు 35ఏళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉన్నారు. వీరిద్దరూ అక్కడే ముగ్గురు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఎటువంటి నేరచరిత్ర లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఇటీవల అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ జంట వద్ద సరైన పత్రాలు లేవని తేలింది. దీంతో, వారిని.. అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం, కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచారు. మూడు వారాల అనంతరం చివరకు స్వదేశానికి తరలించారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక సదరు జంట.. కన్నీరు పెట్టుకుంటూ అమెరికాను వీడారు.ఈ ఘటనపై వారి కుమార్తెలు స్పందించారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో తాము షాక్‌కు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమ తల్లిదండ్రులు ఇక్కడే జీవిస్తూ, సామాజిక సేవలో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి నిర్ణయాలు వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కార్ భారీ డిపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని వెనక్కి పంపించేస్తున్నారు. ఇక, భారత్‌కు చెందిన వారిని కూడా ఇప్పటికే స్వదేశానికి తరలించిన విషయం విధితమే.

ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు.. అమెరికాకు భారీ షాక్!
అమెరికా నుంచి శాస్త్రవేత్తలు నిష్క్రమిస్తున్నారు. పరిశోధనలకు నిధులను తగ్గించడంతోపాటు వర్క్ వీసాలపై నిబంధనలను కఠినతరం చేయడంతో విసుగు చెందిన పలువురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు దేశం వీడే ఆలోచనలో ఉన్నారు. స్థిరమైన అవకాశాలున్న యూరప్, ఆస్ట్రేలియా, కెనడాలకు మకాం మార్చాలని వారు ఆలోచిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఫ్రాన్స్, స్వీడన్ ప్రయత్నిస్తున్నాయి. శాస్త్రవేత్తలను తమ దేశాలకు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వ నిధుల కోతతో అనిశ్చితి.. ట్రంప్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐహెచ్) వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలకు వేల కోట్ల రూపాయల నిధులను నిలిపేయాలని నిర్ణయించింది. అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 7,400 మంది విదేశీ స్కాలర్లకు ట్రంప్ ప్రభుత్వం నిధులను ఇప్పటికే నిలిపేసింది. దీంతో శాస్త్రవేత్తలకు అనిశ్చిత వాతావరణం నెలకొంది. వారు ఆర్థికంగా చితికిపోయారు. నిధుల నిలిపివేత కారణంగా కేన్సర్ వంటి వైద్య పరిశోధన సహా అంతరిక్ష పరిశోధన వంటి రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఇప్పటికే దావా వేశారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ)లో మలేరియా పరిశోధనలో ఉన్న అమెరికన్ అలెక్స్ కాంగ్ ఫెలోషిప్‌ను ఫిబ్రవరిలో ఆకస్మికంగా రద్దు చేశారు. అమెరికా ఇకపై సైన్స్ లేదా ప్రజారోగ్య పరిశోధనలు చేయడానికి ఉత్తమమైన ప్రదేశం కాదని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన యూరప్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. వీసా పొందడం కష్టమేననని ఆయన అన్నారు. అమెరికాలోని చాలా మంది పరిశోధకులది ఇదే పరిస్థితి. ‘పరిశోధనలంటే నాకు ఇష్టం. కానీ అమెరికాలో ఇప్పుడందుకు అనుకూల పరిస్థితి లేదు’ అని ప్రతిష్టాత్మక అమెరికన్ సంస్థలో కేన్సర్, జన్యుశాస్త్రంపై అధ్యయనం చేస్తున్న పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు ఒకరు వ్యాఖ్యానించారు. తలుపులు తెరిచిన కెనడా, చైనా కెనడా, చైనాలు కూడా పరిశోధకులకు తలుపులు తెరుస్తున్నాయి. అమెరికాకు చెందిన పరిశోధకులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా, కెనడా, చైనా మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఒక అడుగు ముందుకేసి ఆ్రస్టేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డేనియల్ కేవ్... శాస్త్రవేత్తలను ఆకర్షించడానికి ఫాస్ట్ ట్రాక్ వీసాలను ప్రతిపాదించారు. అమెరికాతో టారిఫ్ వార్‌లో ఉన్న కెనడాకు ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థలకు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. పరిశోధకులకు పోటీ ప్యాకేజీలను అందించే సామర్థ్యం తక్కువే ఉన్నా.. అవకాశమివ్వాలని ఆలోచనలో ఉంది. చైనీస్–అమెరికన్ శాస్త్రవేత్తలను తిరిగి ఆహా్వనిస్తూ చైనా ఇప్పటికే ప్రకటన చేసింది. జాతీయ భద్రత ముసుగులో శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని అమెరికా అస్తవ్యస్తం చేస్తోందని చైనా విమర్శించింది. చాలా మంది చైనీస్–అమెరికన్ శాస్త్రవేత్తలు అమెరికాలో తమ కెరీర్‌ను ఇక్కడే కొనసాగించాలా వద్దా అనే పునరాలోచనలో పడ్డారని, చైనాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్లకు మేథో వలస..అమెరికాలో వలసలపై ఆంక్షలు విధించిన సమయంలో పరిశోధకుల నిష్క్ర మణ జరగడం గమనార్హం. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక దేశం నుంచి మేధోవలసలు ఈ స్థాయిలో జరగడం ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అమెరికా తన శాస్త్రీయ, పారిశ్రామిక కార్యక్రమాలను పెంచడానికి కొత్త గుర్తింపు పత్రాలను అందించింది. జర్మన్, ఆ్రస్టియన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు పునరావాసం కలి్పంచింది. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని స్థానిక అమెరికన్ సమాజం ఆవేదన వ్యక్తం చేసింది. శాస్త్రవేత్తల వలసలపై ఇంటర్నెట్లో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద సమస్యలను అమెరికానే పరిష్కరించింది. అలాంటిది ఇప్పుడు శాస్త్రవేత్తలను పట్టించుకోవడం మానేసింది. డేటాను తుడిచిపెట్టేస్తోంది. పరిశోధనలను రద్దు చేసింది. తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కొన్ని పదాలను ఉపయోగించలేమని నిపుణులు చెబుతున్నారు. బెస్ట్ మైండ్స్ అమెరికా నుంచి వెళ్లిపోతున్నాయి’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో రాశాడు.చైనాలో బిగ్ ఏఐ న్యూస్!పదేళ్ల పాటు అమెరికాలో పనిచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం డాక్టర్ గువో–జున్ క్వి తిరిగి చైనాకు రావాలని నిర్ణయించుకున్నారు! అతను అమెరికాను వదిలి చైనాకు వెళ్లడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్ ట్రెండ్స్‌కు పెద్ద మేల్కొలుపు అని మరో పరిశోధకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. అమెరికా వెలుపల పరిశోధకులు ఆప్షన్ల కోసం వెతుకుతున్నట్లు మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజంగా వలస అవుతుందా, అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే కొన్ని నెలల్లో తెలియనుంది.స్వాగతించేందుకు యూరప్ సన్నాహాలు.. అమెరికాను వీడుతున్న శాస్త్రవేత్తలకు సహాయం చేయాలంటూ పలువురు అమెరికన్ చట్టసభల సభ్యులు, సభ్యదేశాలు, కంపెనీలు యురోపియన్ కమిషన్‌ను కోరినట్లు వార్తలొచ్చాయి. అమెరికాలోని వాతావరణం స్వతంత్ర పరిశోధకుల పరిశోధనలకు నిరుత్సాహం కలిగిస్తోందని యురోపియన్ పరిశోధనా మండలి అధ్యక్షురాలు మారియా లెప్టిన్ అన్నారు. పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందన్నారు. ఫ్రాన్స్, స్వీడన్, కెనడా వంటి దేశాలు అమెరికాను వీడాలనుకుంటున్న అగ్రశ్రేణి పరిశోధకులను తమ దేశాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడి బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలు, వృత్తి,వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యం, సాంస్కృతిక చైతన్యాన్ని చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పరిశోధకులకోసం నిధులను రెట్టింపు చేయాలని కమిషన్ అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్ యురోపియన్ రీసెర్చ్ కౌన్సిల్‌కు పిలుపునిచ్చారు. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇప్పటికే బయో మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాలను కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్స్లర్ దెబోరా ప్రింటిస్ వెల్లడించారు. అమెరికా ప్రతిభావంతులకు ఫ్రెంచ్ విశ్వవిద్యాలయం ‘సైంటిఫిక్’ ఆశ్రయం కల్పిస్తోంది.

ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్‌కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్‌లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్‌లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్‌పీ, వాల్‌మార్ట్, ఫోర్డ్, స్టార్‌బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్‌ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్‌బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్‌లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్‌లో అంత లేదు.. భారత్‌లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్‌లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్‌లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్‌కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్‌లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్
National

ఆ తీర్పు అమానుషం.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా తప్పుబట్టింది. తీర్పులోని కొన్ని విషయాలు తమనెంతో బాధించాయన్న ద్విసభ్య ధర్మాసనం.. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి వివరణ కోరుతూ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తీర్పు ఇచ్చిన జడ్జి రామ్ మనోహర్ నారాయణపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.దుస్తులను పట్టుకుని లాగటం, వక్షోజాలను తాకడం లాంటి చేష్టలు అత్యాచార నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి రామ్ మనోహర్ నారాయణ(Ram Manohar Narayan Mishra) అభిప్రాయపడ్డారు. అయితే మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సుమోటోగా సర్వోన్నత న్యాయస్థానం విచారణకు చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది.ఈ నెల 17న ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ మేధావుల దగ్గరి నుంచి సామాన్యుల దాకా ఆందోళన వ్యక్తం చేశారు.‘‘అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పు కాపీ చదువుతుంటే బాధేస్తోంది. ఇదొక సున్నితమైన అంశం అనే పట్టింపులేకుండా తీర్పు ఇచ్చారు. ఇదేదో క్షణికావేశంలో చేసింది కూడా కాదు. తీర్పును నాలుగు నెలలపాటు రిజర్వ్ చేసి మరీ వెల్లడించారు. అంతే.. సరైన స్పృహతోనే ఈ తీర్పు వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తీర్పుపై స్టే విధించేందుకు మేం బాగా ఆలోచిస్తుంటాం. కానీ, తీర్పు కాపీలోని 21, 24, 26 పేరాలు చదివాక.. అమానుషంగా అనిపించింది. అందుకే స్టే విధిస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు వెల్లడించింది.ధర్మాసనం వ్యాఖ్యలతో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ఏకీభవించారు. ఈ తరుణంలో జస్టిస్ గవాయ్ కలుగజేసుకుని ఇది తీవ్రమైన అంశం. సున్నితమైన అంశంగా భావించకుండా సదరు జడ్జి తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి’’ అని తుషార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.వీ ద విమెన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆందోళనలు.. బాధితురాలి తల్లి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు దర్యాప్తు చేపట్టింది. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఇంతకు ముందే ఓ పిటిషన్ దాఖలైంది. అయితే జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బీ వరాలే దానిని విచారణకు స్వీకరించలేదు.కేసు నేపథ్యం ఇదే..2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. ఆపై అత్యాచారానికి యత్నించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన.

అద్దెంటి కుర్రాడితో భార్య అలా.. కట్ చేస్తే ఏడడుగుల గోతిలో..
రోహ్తక్: హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తేన భార్య వావాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా సదరు వ్యక్తిని భర్త దారుణంగా హత్య చేశాడు. అతడు బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్లో జగ్దీప్ అనే వ్యక్తి హరిదీప్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. యోగా గురువైన హరిదీప్.. హర్యానాలోని మస్త్‌నాథ్ యూనివర్సిటీలో యోగా బోధిస్తుంటాడు. అయితే, హరిదీప్.. జగదీప్ ఇంట్లో అద్దెకు ఉంటూ.. అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం హరిదీప్‌కు తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో హరిదీప్ తన స్నేహితులతో కలిసి జగ్దీప్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం, హరిదీప్ బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. బోర్ వెల్ కోసం అని ముందుగానే కార్మికులకు చెప్పి ఏడు అడుగులు గొయ్యి తవ్వించాడు.ఇదిలా ఉండగా.. హరిదీప్ చనిపోయిన పది రోజుల తర్వాత అతడు కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు వచ్చింది. దీంతో, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో, జగదీఫ్ కాల్ డేటా, రికార్డింగ్‌లను పరిశీలించిన తర్వాత అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ హత్య ఉదంతం గతేడాది డిసెంబర్లో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన మూడు నెలల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఇక, తాజాగా ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

దూసుకుపోతున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇకపై ఆరోగ్య రికార్డుల నిర్వహణ మరింత సులభంగా మారనుంది. ఇప్పుడున్న వ్యవస్థ అత్యంత సవాలుగా ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(Ayushman Bharat Digital Mission) (ఏబీడీఎం) ఈ సమస్యలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు నడుంబిగించింది. డిజిటల్ విధానంతో సమూల మార్పులుఏబీడీఎం చూపుతున్న చొరవ కారణంగా రోగులు/బాధితులు తమ ఆరోగ్య డేటాను(Health data) సురక్షితంగా యాక్సెస్ చేసుకునేలా అవకాశం కలుగుతుంది. అలాగే రోగి అనుమతి ఉన్నప్పుడు మాత్రమే డేటా షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ భారత ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంతో సమూలంగా మారుస్తోంది. ఈ నేపధ్యంలో 2025, మార్చి నాటికి 76 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు క్రియేట్ చేశారు. అలాగే 50.9 కోట్ల ఆరోగ్య రికార్డులను దీనికి అనుసంధానం చేశారు. ఇది కాగితం అనేది అవసరంలేని, రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ దిశగా పడిన ముందడుగుగా చెప్పుకోవచ్చు.రోగి అనుమతి మీదటనే..ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా అనేది 14 అంకెల యునిక్ నెంబర్. ఈ ప్రత్యేకమైన నంబర్ రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు వంటి ఆరోగ్య సంస్థల మధ్య అనుసంధానం చేస్తుంది. ఫలితంగా రోగులు ఆస్పత్రులకు వెళ్లినప్పుడల్లా తమ వైద్య రికార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. బాధితుడు లేదా రోగికి సంబంధించిన పూర్తి వైద్య చరిత్రను(Medical history) హెల్త్‌కేర్ ప్రొవైడర్లు ఇకపై సులభంగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. సంప్రదాయ వైద్య డేటా బేస్‌లతో పోలిస్తే.. ఏబీడీఎంలో ఆరోగ్య రికార్డులన్నీ నిల్వ కావు. దీనికి బదులుగా రోగి డేటా ఆయా వ్యక్తుల దగ్గర లేదా ఆరోగ్య సంస్థల వద్ద భద్రంగా ఉంటుంది. ఈ డేటాను రోగి అనుమతితో మాత్రమే ఇతరులకు షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.తక్షణం యాక్సెస్ చేసుకునే అవకాశంఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సాయంతో రోగులు తమ ల్యాబ్ రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు మొదలైనవి ఏబీడీఎం అధీకృత పర్సనల్ హెల్త్ రికార్డ్ (పీహెచ్ఆర్) యాప్‌ల ద్వారా వెంటనే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో(chronic diseases) బాధపడుతున్న వారు ఈ విధానం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. రోగులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తక్షణమే ఆస్పత్రులు లేదా ఫార్మసీలతో పంచుకోగలుగుతారు. ఫలితంగా ఆస్పత్రులలో బాధితులు వేచి ఉండే సమయం తగ్గుతుంది. అలాగే ఫార్మసీలలో మందులు కొనుగోలు వేగవంతం అవుతుంది.గణనీయంగా తగ్గనున్న వైద్య ఖర్చులుఈ విధానం వలన పేపర్ వర్క్(Paper work) అనేది గణనీయంగా తగ్గుతుంది. డాక్టర్ అపాయింట్మెంట్ కూడా సులభంగా లభించేందుకు అవకాశం కలుగుతుంది. బాధితుల మెడికల్ హిస్టరీ కొన్ని నిముషాలలోనే వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల బాధితులకు పునరావృత పరీక్షల అవసరం మరింతగా తగ్గుతుంది. తప్పిదాలకు అవకాశం ఉండదు. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఈ విధానం సాయంతో వైద్యులు కచ్చితమైన డయాగ్నోసిస్ చేయగలుగుతారు. అలాగే సమర్థవంతమైన చికిత్సను కూడా అందించగలుగుతారు. ఏబీడీఎం నమోదు ప్రక్రియ ఐదు నిమిషాలలో పూర్తవుతుంది. బాధితులు ఇందుకోసం ఏబీడీఎం పోర్టల్‌లో ఏబీహెచ్ఏ నంబర్ కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. తరువాత నిర్థారిత పీహెచ్ఆర్ యాప్ ద్వారా వైద్య రికార్డులను లింక్ చేయాలి. తద్వారా వారు ఆరోగ్య సేవలను సులభంగా యాక్సెస్ చేసుకోగలుగుతారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా సంజయ్ మిశ్రా

యూపీలో అన్ని మతాల ప్రజలు సురక్షితమేనా?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మైనారిటీల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక యోగినని.. మనుషులంతా సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని.. అందుకే రాష్ట్రంలో అన్ని మతాల వాళ్లు సురక్షితంగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కేవలం హిందూ మతానికే బీజేపీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శల ప్రస్తావనతో ఆయనకో ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో హిందువుల దుకాణాలు తగలబడితే.. ఆ వెంటనే ముస్లింల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లకు నిప్పంటుకుంటే.. కాసేపటికే ముస్లింల ఇళ్లూ తగలబడిపోయేవి. అయితే ఇదంతా 2017కి ముందు నాటి పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. అదే వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకు భద్రత ఉంటోందా?.. లేదు కదా. అందుకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా తీసుకోండి. పాకిస్థాన్ మరో ఉదాహరణ. అఫ్గనిస్థాన్‌లో ఏం జరిగిందో తెలుసు కదా!. అవతలివాడు కొట్టక ముందే జాగ్రత్త పడడంలో తప్పేముంది?’’ అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.హిందువులు బాగున్నారంటే.. ముస్లింలూ బాగున్నట్లే. నేనొక సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరుడిని. నేనొక యోగిని. నా దృష్టిలో అంతా సమానమే. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అదే రాష్ట్ర అభివృద్ధికి కీలకం కూడా అని అన్నారాయన. సనాతన ధర్మం ఈ భూమ్మీదే అతిపురాతన మతం అని, దానిని అనుసరించేవారు ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయబోరని అన్నారు. హిందూ పాలకులు దండెత్తి ఇతర దేశాలకు ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చరిత్రలో లేవన్నారు. కానీ, బదులుగా మనకు దక్కుతోంది ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలాంటి ‘నమునా’ వల్లే బీజేపీ ఇవాళ దేశంలో బలంగా ఉండగలిగిందని యోగి అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగారు. విదేశాలకు వెళ్లి మాతృదేశాన్నే తిడతారు. అందుకే ఆయన ఉద్దేశాలేంటో ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి ‘నమునా మనుషులే’ ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. అప్పుడే దారులన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోగలం. అయోధ్య, కుంభమేళా సహా దేశ ప్రతిష్టకు పేరు తెచ్చే ఏ సందర్భానైనా వివాదం చేయడమే కాంగ్రెస్‌కు తెలుసు అని అన్నారాయన. చట్టాన్నిగౌరవిస్తున్నాం, లేకుంటేనా..ప్రార్థనా స్థలాల వివాదాలపైనా సీఎం యోగి ఏఎన్ఐ ఇంటర్వ్యలో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని.. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. లేకుంటే ఈ పాటికే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసనని అన్నారాయన. భారతీయ వారసత్వానికి ఆలయాలే గుర్తింపుగా అభివర్ణించిన సీఎం యోగి.. అలాంటి వాటిని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అభిమతమని అన్నారు. దేవుడు ఇచ్చిన కళ్లు.. ఆ కళ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ ఇది చూడాల్సిందే. శంభల్‌లో ఏం జరిగింది.. అదే సత్యం అని యోగి పేర్కొన్నారు. ఆలయాలను కూల్చి మసీదులు కట్టి అల్లా కూడా అంగీకరించడని ఇస్లాంలోనే ఉంది. అలాంటప్పుడు వాళ్లు ఆ పని ఎలా చేయగలిగారు?. ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒక్కొక్కటిగా బయట పెట్టి వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారాయన.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

హౌ టు కిల్ పుస్తకం చదివి.. అల్లుడిని చంపిన అత్త
యశవంతపుర: మాగడి రియల్టర్ లోకనాథసింగ్ (37) హత్య కేసులో భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. విచారణలో కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అల్లుడంటే సరిపడని అత్త హేమా, ఆమె కూతురు యశస్వి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్లో శోధించి హత్యకు పథకం వేశారు. హౌ టు కిల్ పుస్తకం చదివిన హేమా భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించింది. గత ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించిన తరువాత అతన్ని ఇద్దరూ గొంతు కోసి హతమార్చారు. భార్య యశస్వికి చెందిన ప్రైవేట్ వీడియోను పెట్టుకొని లోకనాథ్‌సింగ్ బెదిరించేవాడని, తాను మరో మహిళను పెళ్లి చేసుకొంటానని భార్య, అత్తకు చెప్పేవాడు. ఇది తట్టుకోలేక అంతమొందించినట్లు విచారణలో తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ధనుశ్రీ మృతి
బెంగళూరు: బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు.. ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్తో కలిసి బైక్‌పై కుణిగల్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమెపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

MMTS Train Incident: లభించని నిందితుడి ఆచూకీ
సికింద్రాబాద్: ఈ నెల 22న మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం ఘటన మిస్టరీ వీడలేదు. మరుసటి రోజు నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నా నిందితుడి ఆచూకీ తెలియడంలేదు. పలు బృందాలుగా ఏర్పడిన రెండు వందలకు పైబడిన పోలీసులు బృందాలుగా ఏర్పడిన వివిధ విభాగాల పోలీసులు కేసు దర్యాప్తులో ఏమాత్రం ప్రగతి సాధించలేకపోతున్నారు. ఘటన మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు రెండు సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఒకటి ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఎటు పది కిలోమీటర్ల దూరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడం. మరోవైపు బాధితురాలు ఘటన భయం నుంచి ఇంకా తేరుకోకపోవడం. ముఖానికి, తలకు తీవ్రమైన గాయాలు కావడం, పళ్లు ఊడిపోవడంతో యశోదా ఆసుపత్రిలో బాధితురాలికి పలు శస్త్ర చికిత్సలతో కూడిన వైద్యం చేస్తున్నారు. ఈ కారణంగా బాధితురాలు పోలీసులతో వివరంగా మాట్లాడలేకపోతోంది. బాధితురాలు కాస్త కోలుకుని ఘటన భయం నుంచి బయటపడి పూర్తి వివరాలు వెల్లడిస్తే గానీ దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన రెండో రోజే పలువురు పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి పోలీసులు చూపించారు. ఇందులో నిందితుడి మాదిరి ఉన్నట్టు రెండు ఫొటోలను అనుమానితులుగా బాధితురాలు పేర్కొంది. ఆ ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలికి చూపించగా వారిరువురు కాదన్నట్టు సమాధానం చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచి్చంది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఫోన్‌కాల్‌లో మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి మిత్రులను కూడా రప్పించిన పోలీసులు మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నిందితుణ్ని గుర్తిస్తాం: రైల్వే పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న ఇరువురు పాత నేరస్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన వారు కాదని బాధితురాలు చెప్పినప్పటికీ వారి కదలికలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో ఒకరు ఘటన జరిగిన సమయంలో కల్లు కాంపౌండ్‌లో మరొకరు ఇంకో ప్రదేశంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా గుండ్ల పోచంపల్లి వరకు ఎంఎంటీఎస్ స్టేషన్లను ఆవరించి ఉన్న పలు గ్రామాల్లోనూ దర్మాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడి గుర్తింపు కోసం ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా.. సీసీ కెమెరాలు లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో దర్యాప్తులో ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని రైల్వే పోలీసులు చెబుతుండడం గమనార్హం.

అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. జూన్ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్‌మేకర్‌తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఫ్రంట్ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్‌ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్ కప్పి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.