Peddapalli District News
-
రుణమాఫీ కాలేదంటే రాజీనామాకు సిద్ధం
సాక్షి, పెద్దపల్లి: రైతు సంక్షేమం కాంగ్రెస్ సర్కార్‌తో నే సాధ్యమని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలని ప్ర భుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ పేరిట రైతులను మభ్యపెట్టారని మండిపడ్డారు. నాలుగు విడతల్లో రూ.లక్షమాఫీ చేస్తే వడ్డీకే సరిపోలేదన్నా రు. ఇది రైతులను మోసం చేయడం కాదా? అని ప్ర శ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రుణమాఫీ కాలేదని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పెద్దపల్లికి వస్తే 90శాతం రుణమాఫీ జరిగిన విషయాన్ని చూపిస్తానాని స్పష్టం చేశారు. నిరూపించకుంటే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే కేటీఆర్ రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. సన్నవడ్లకు పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.51 కోట్ల బోనస్ వస్తోందని, ఇందులో రూ.46 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అ య్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా భూములకు ఒక్కచుక్క నీరు అందించలేదని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే అన్నారు. నిరూపిస్తే రాజీనామా చేస్తావా? ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ -
పే.. ద్ద కొండచిలువ
పెద్దపల్లిరూరల్: పెద్డబొంకూర్ గ్రామంలోని బీటీ రోడ్డుపై పే..ద్ద కొండచిలువల ప్రత్యక్షమైంది. గ్రామశివారులోని పురావస్తు భూమిలో ఏ పుగా పిచ్చిమొక్కలు పెరిగాయి. అందులోనుంచి ఓ కొండచిలువ గ్రామ బీటీరోడ్డుపైకి వచ్చింది. ముఖ్యంగా హైవే రోడ్డు నుంచి బొంకూర్ ఆటోస్టాండ్ వరకు వీధిదీపాలు లేవు. దీంతో పిచ్చిమొక్కలు, ముళ్లపొదల్లోని పాములు, విషపురుగులు, క్రిమికీటకాలు తరచూ గ్రామంలోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేసి విషసర్పాలు, క్రిమికీటకాల బారి నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
గోదావరిఖని: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. కేసుల ప్రస్తుత స్థితిగతులు, గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు తీరు గురించి పోలీస్ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నేరాల కట్టడికి సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజు తదితరులు ఉన్నారు. ధ్యానం జీవితంలో భాగం కావాలి ధ్యానం నిజజీవితంలో భాగం కావాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన ధ్యానం సాధన చేయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వలంటీర్స్ రామ్మోహన్ బండా, ఓంప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సీపీ మాట్లాడుతూ యోగా, ధ్యానం ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక, భౌతిక అభ్యాసాలన్నారు. నిత్య ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. వివిధ కారణాలతో అధిక ఒత్తిడికి గురవుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియలు చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సి.రాజు, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీనివాస్, సంపత్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేనరెడ్డి, ఆర్ఎస్ఐ అనిల్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం సీపీ శ్రీనివాస్ -
కార్మికుల పనికి ఆటంకం కలిగిస్తారా?
పెద్దపల్లిరూరల్: తమది ప్రజాప్రభుత్వమని చెబు తున్న కాంగ్రెస్ పాలకులు.. ప్రజాపాలనలో కార్మికులను పనికూడా చేసుకోనివ్వరా? అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు ప్రశ్నించా రు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హా మీలు అమలు చేయాలనే డిమాండ్‌తో చలో హైద రాబాద్ కార్యక్రమం చేపట్టగా.. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని మున్సిపల్ కార్మికులను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ముత్యంరావు శనివారం విలేకరులతో మాట్లాడారు. అర్ధరాత్రి అమాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఉ దయం ఐదు గంటలకు విధులకు హాజరైన కార్మికులను అరెస్టు పేరిట అదుపులోకి తీసుకుని పోలీస్ స్టే షన్లలో నిర్బంధించడం దుర్మార్గమన్నారు. ప్రభు త్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఏడాదిగా ఓపిక పట్టినా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. నా యకులు, కార్మికులు పాక మహేశ్, ఆరెపల్లి చంద్ర య్య, బొంకూరి సాగర్, సతీశ్, కిషన్ నాయక్, సురే శ్, రామ్మూర్తి, మల్లేశ్, గట్టయ్య, చంద్రయ్య తదిత రులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ప్రజాపాలనలో పనికూడా నేరమేనా? సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు ఆగ్రహం -
త్రికోణమితి అనువర్తనాలు
విద్యార్థి : నల్గొండ రితిక పాఠశాల : జెడ్పీహెచ్ఎస్, రామడుగు, కరీంనగర్ గైడ్ టీచర్ : సంగోజు శ్రీనివాస్ ఉపయోగించిన పరికరాలు : అట్టపెట్టె, డ్రాయింగ్ షీట్లు, లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్. ఉపయోగం : ఎత్తయిన భవనాలు, సెల్‌ఫోన్ టవర్లు, శిఖరాల ఎత్తును సులభంగా ఎలా కనుక్కోవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా చూపించారు. సాధించిన బహుమతి : జిల్లా స్థాయి సీనియర్స్ కేటగిరీలో ద్వితీయ స్థానం. -
వేద గణితం..
సిరిసిల్ల కల్చరల్: సిరిసిల్లకు చెందిన మడుపు ముత్యంరెడ్డి 57 ఏళ్లుగా బోధన వృత్తికే పరిమి తమై, గణితానికి జీవితాన్ని అంకితం చేశారు. 80 ఏళ్ల వయసులో సొంతంగా పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. పూరీ పీఠాధిపతి శంకరాచార్యులు భారతీ కృష్ణ తీర్థ స్వామి ఆంగ్లంలో రాసిన వేదగణితాన్ని తెలుగులో రాశారు. 200 పేజీలున్న ఈ పుస్తకం హైస్కూల్ విద్యార్థులకు సంఖ్యా శాస్త్రంలో ఎదురయ్యే అంక గణిత పరికర్మలను దృష్టిలో పెట్టుకొని వేద గణిత సూత్రాలు, పద్ధతులను వివరించింది. ఇది ఎంతోమంది గణిత ఉపాధ్యాయులకు కరదీపికై ంది. ముత్యంరెడ్డి ఇప్పటికీ ప్రత్యక్షంగా, ఉత్తరాల ద్వారా, సెల్‌ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తున్నారు. -
మిషన్ మ్యాథమేటిక్స్
ఇల్లంతకుంట(సిరిసిల్ల): గణితం అంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, సబ్జెక్టును ఇష్టంగా నేర్చుకోవడానికి మిషన్ మ్యాథమేటిక్స్ అనే కాన్సెప్ట్‌తో ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇల్లంతకుంట మండలం అనంతగిరి హైస్కూల్ మ్యాథ్స్ టీచర్ ఫరీదుద్దీన్. కరోనా సమయంలో పదోతరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ తయారు చేసి, పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని మ్యాథ్స్ టీచర్లతో గ్రూపు నిర్వహిస్తున్నారు. భరోసా మ్యాథ్స్ విజార్డ్ సంస్థ నిర్వహించిన గణిత కాన్సెప్ట్ వీడియో కాంపిటీషన్లో ఈ పాఠశాల విద్యార్థులు రక్షిత, అక్షిత జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. -
ఘనులు
ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2024గణితంలోఅర్బన్ ఎఫీషియెన్సీ టాయిలెట్స్విద్యార్థి : అర్ఫా యుస్రా పాఠశాల : సాయి మానేరు, కరీంనగర్ గైడ్ టీచర్ : వి.ప్రజ్ఞ ఉపయోగించిన పరికరాలు : చార్ట్స్, మార్కర్స్, గమ్, గ్లూగన్, కార్ట్బోర్డ్, స్ట్రాలు, టీ కప్స్ తదితరాలు. ఉపయోగం : జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ టాయిలెట్స్ నిర్మించి, ఉపయోగించుకోవచ్చు. సాధించిన బహుమతి : జిల్లాస్థాయి సీనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానం.● నూతన ఆవిష్కరణల వైపు అడుగులు ● మ్యాథ్స్‌లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ● ఎగ్జిబిట్లతో అదరగొట్టిన స్టూడెంట్స్ ● నేడు జాతీయ గణిత దినోత్సవంన్యూస్రీల్ -
క్రీడారంగ అభివృద్ధికి కృషి
సుల్తానాబాద్(పెద్దపల్లి): క్రీడారంగ అభివృద్ధికి ప్ర భుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశా ల మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న సీ ఎం కప్ –2024 ముగింపు వేడుకలు శనివారం ని ర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన క్రీ డాపాలసీతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తో క్రీడారంగం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. క్రీ డా రంగానికి పుట్టినిల్లు సుల్తానాబాద్ అని తెలిపా రు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాజట్టు ప్రతిభ చూపా లని సూచించారు. డీవైఎస్వో సురేశ్, ఎస్సై శ్రవణ్ కుమార్, అంతటి అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు. -
మూడు కోణాలు.. 180 డిగ్రీలు
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని తక్కళ్లపెల్లి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన మామిడి శ్రీహిత అనే పదోతరగతి విద్యార్థిని రూపొందించిన గణిత ప్రాజెక్టు రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలకు ఎంపికై ంది. మ్యాథ్స్ టీచర్ గంగాధర్ ఆధ్వర్యంలో త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు, చతుర్భుజంలోని నాలుగు కోణాల మొత్తం 360 డిగ్రీలు అని కార్ట్ బోర్డుతో సహాయంతో వివరించింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నట్లు ఉపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు. -
సోలార్ పవర్ మల్టీ సేవ్ మెషిన్
విద్యార్థి : ఎం.చేగువేరా పాఠశాల : పారమిత హెరిటేజ్, కరీంనగర్ గైడ్ టీచర్ : లలిత్‌మోహన్ సాహూ ఉపయోగించిన పరికరాలు : ఐరన్, మోటార్స్, సోలార్ ప్యానల్, నెట్, ఫ్రేమ్, వైర్, వీల్స్ తదితరాలు. ఉపయోగం : ఇది తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఒక వినూత్న సోలార్ బహుళ జల్లెడ యంత్రం. నిర్మాణ స్థలాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, భూసార పరీక్షా కేంద్రాల్లో నేల ధాన్యాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. సాధించిన బహుమతి : జిల్లా స్థాయి జూనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానం. -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
గోదావరిఖనిటౌన్: స్థానిక సింగరేణి ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ శనివారం ప్రారంభించారు. సింగరేణి కాలరీస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 42ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నాయకు లు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యు డు రేణికుంట్ల ప్రవీణ్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు యాట ఓదెలు, ఆరెపల్లి రామచందర్, బడికెల కృష్ణ, జనగామ నర్సయ్య పాల్గొన్నారు. పాఠశాల సందర్శన ధర్మారం(ధర్మపురి): రచ్చపల్లి ప్రాథమిక పాఠశాలను లక్నో నుంచి వచ్చిన కేంద్ర బృందంలోని ప్రతినిధులు శనివారం సందర్శించారు. ప్రతినిధులు ప్రవీణ్‌యాదవ్, అత్తర్ సలీం ఈ బృందంలో ఉన్నారు. ఒకటి నుంచి ఐదో తరగ తి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లంలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియల్లో ఎఫ్ఎల్ఎన్కు అనుగుణంగా ఆశించిన సామ ర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఫుడ్‌స్టాల్స్ ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు వంశీమోహనాచార్యులు, ఉ పాధ్యాయులు సంపత్, లక్ష్మణ్, పాఠశా కమిటీ చైర్‌పర్శన్ ప్రమీల, మండల విద్యాధికారి ఛాయాదేవి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం ఫేక్, జిల్లా రిసోర్స్ పర్శన్ శ్రీకాంత్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మురుగు నీటికాలువలో దిగి కౌన్సిలర్ నిరసన పెద్దపల్లిరూరల్: మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ నాంసాని సరేశ్‌బాబు శనివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలో కొత్తగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు దానిపక్కన డ్రైనేజీ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు, డ్రైనేజీ కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన హయాంలో రూ.కోటి మంజూరు చేయించారని గుర్తుచేశారు. ఆ నిధులతోనే బీటీ రోడ్డు నిర్మించి, డ్రైనేజీ పనులు చేపట్టకుండా చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవర కూ మురుగునీటి కాలువ నుంచి బయటికి రానని ఆయన భీష్కించుకు కూర్చున్నారు. ఇంగ్లిష్ బోధకులు కావలెను యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి పాఠశాలలో ఇంగ్లిష్ పాఠ్యాంశం బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరస్పాండెంట్, డీజీఎం(పర్సనల్, అధికార ప్రతినిధి) అనిల్ కుమార్ శనివారం కోరారు. 2024–25 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిన ఇంగ్లిష్ బోధించేందుకు బీఏ, ఎంఏ, బీఎడ్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 30వ తేదీలోగా పాఠశాలలో తమ దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు. రేపు కూరగాయల మార్కెట్ బంద్ పెద్దపల్లిరూరల్: హోల్‌సేల్ వ్యాపారి ఖాలిక్ భాయ్ మృతికి సంతాప సూచకంగా సోమవా రం స్థానిక కూరగాయల మార్కెట్‌ను బంద్ చేస్తామని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మార్కెట్ బంద్ ఉన్నందున వినియోగదారులు తమకు అవసరమైన కూరగాయలను ఆదివారమే తీసుకెళ్లాలని సూచించారు. బంద్‌కు అందరూ సహకరించాలని వారు కోరారు. -
ఏసుక్రీస్తు బోధనలు అనుసరించాలి
మంథని: ఏసుక్రీస్తు బోధనలు క్రైస్తవులు అందరూ అనుసరించాలని ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ అన్నారు. పట్టణ శివారులోని శ్రీరాంనగర్ సి యోను ప్రార్థన మందిరంలో శుక్రవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. తొలుత కేట్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. పొరుగువారిని ప్రేమించడం, ఆప్యాయత పంచడం లాంటి క్రీస్తు బోధనలు అనుసరించాలని కోరా రు. ఆజ్మీరా దయారాజ్, దూడ మహేశ్, మంథని మార్క్, గద్దల రాజేశ్, జోసెఫ్, మంథని ప్రసాద్, చింతకుంట్ల ప్రేమ్‌కుమార్, అందె రమేశ్, ఈర్ల సదానందం, రామగిరి కుమార్, కామని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పనితీరు ఆధారంగా పోలీస్‌లకు గ్రేడింగ్
● రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడిగోదావరిఖని: నేరాల నియంత్రణకు మెరుగైన ప్రొయాక్టివ్ పోలీసింగ్ నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. కమిషరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల అదికారులతో కమిషనరేట్ నుంచి శుక్రవారం ఆన్లైన్ జూమ్ మీటింగ్‌లో వార్షిక నేర సమీక్ష నిర్వహించారు. డీసీపీ, ఏసీపీ, సీఐ స్థాయి అధికారులు సమీక్షించి ప్రతీ కేసును త్వరగా పరిష్కరించాలని సీపీ సూచించారు. విచారణలోని కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్‌తోపాటు, ఆకస్మిక వాహన తనిఖీలు చేయాలని, సాంకేతిక వ్యవస్థ కూడా వినియోగించుకోవాలని అన్నారు. అధికారులు పనితీరు ఆధారంగా వచ్చే ఏడాది నుంచి గ్రేడింగ్ ఇస్తామని ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీలు, అసాంఘిక శక్తులు, మావోయిస్టులపై దృష్టి కేంద్రీకరించాలని, డయల్ 100కు వచ్చే కాల్స్‌పై తొందరగా స్పందించాలని చెప్పారు. గంజాయి, పేకాట, పీడీఎస్ రైస్, గుడుంబా, వైట్ కాలర్ తదితర నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. భూతగాదాలు, సివిల్ కేసుల్లో ఎస్వోపీ ప్రకారం పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో లాఠీ రాజ్యం నడుస్తోంది
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని: రాష్ట్రంలో లాఠీరాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన రిలే నిరాహార దీక్ష ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు నమోదు చేస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల గడ్డ రామగుండం నుంచి రెవంత్‌రెడ్డి పాలన పతనం ప్రారభంమైందని ఆయన అన్నారు. కేటీఆర్‌పై నమో దు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సా గుతాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, గోపు అయి లయ్యయాదవ్, కార్పొరేటర్లు గాదం విజయ, బాదె అంజలి, జనగామ కవితాసరోజిని, నారా యణదాసు మారుతి, అచ్చే వేణు, బొడ్డు రవీందర్, మేతుకు దేవరాజ్, రాకం వేణు, జిట్టవేన ప్రశాంత్, ముద్దసాని సంధ్యారెడ్డి పాల్గొన్నారు. -
ఉత్తమ రైతు మల్లారెడ్డి
● డ్రమ్‌సీడర్ ద్వారా వరి సాగులో ఆదర్శం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మల్లారెడ్డి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో శుక్రవారం డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నుంచి మల్లారెడ్డి ఉత్తమ రైతు అవార్డు అందుకునన్నారు. 2012 నుంచి మల్లారెడ్డి డ్రమ్‌సీడర్ ద్వారా వరి సాగు చేస్తున్నారు. నూతన వంగడాలతో ప్రోత్సహిస్తూ.. తన అనుభవాలు, సాగు పద్ధతుల గురించి స్థానికులతోపాటు పొరుగున ఉన్న కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించడంతోపాటు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆరు పరిశోధన కేంద్రాల నుంచి వివిధ రకాలైన వరి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసి అభివృద్ధి చేస్తున్నారు మల్లారెడ్డి. చీడపీడలను తట్టుకునే వరి వంగడాలను రైతులకు అందిస్తూ అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు, ఆకుకూరలు, బంతిపూలు, కూరగాయలూ సాగుచేస్తూ అధిక ఆదాయం గడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఫార్మర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో సుమారు 300 మంది రైతులను భాగస్వాములను చేశారు. అధిగబడి ఇచ్చే కూరగాయల విత్తనాలు, వరి వంగడాలను రాయితీపై అన్నదాతలకు అందజేస్తున్నారు. రైతు మల్లారెడ్డి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించింది. రైతులు, గ్రామస్తులు తదితరులు ఆయనను అభినందించారు. అవార్డుకు నామినేటు చేసిన కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ సిద్ది శ్రీధర్, ప్రభుత్వానికి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
‘డయల్ యువర్ డీఎం’కు స్పందన
మంథని: స్థానిక ఆర్టీసీ డి పో పరిధిలో శుక్రవారం ని ర్వహించిన డయల్ యువ ర్ డీఎం కార్యక్రమానికి ప్ర యాణికుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.15 మంది ఫోన్ ద్వారా సమస్యలు, సూచనలు చేసినట్లు చెప్పా రు. మంథని– జమ్మికుంట మధ్య రాత్రివేళ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని, మంథని – జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలకు బస్సు నడిపించాలని, కాళేశ్వరం – వేములవాడకు బస్సులు నడిపించాలని ప్రయాణికులు సూచించారని అన్నారు. పెద్దపల్లి నుంచి మంథనికి భాగ్యనగర్ ట్రైన్‌కు లింక్ బస్సు నడిపించాలని సూచనలు చేశారన్నారు. ఈ సమస్యలు, సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డీఎం వివరించారు. మహిళల రక్షణే లక్ష్యం జ్యోతినగర్(రామగుండం): మహిళల రక్షణే షీ టీం లక్ష్యమని గోదావరిఖని ఏసీపీ రమేశ్ అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో శుక్రవా రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. బస్స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కళాశాలలు పరిధిలో షీటీం నిరంతరం విధులు నిర్వర్తిస్తోందని తెలిపారు. వేధింపులకు గురైన వారు 63039 23700 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్య తెలియజేయాలని ఆయన సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. రామగుండం సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై ఉదయ్‌కిరణ్, షీటీం ఇన్చార్జిలు మల్లయ్య, సురేశ్, స్నేహలత, సీడీపీవో అలేఖ్య, సంధ్య, స్వర్ణలత, సుమతి, హెచ్ఎం జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల సందర్శనకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను లక్నో బృందం ఽశుక్రవారం సందర్శించింది. బృందంలోని దేవి సంస్థాన్ పెడ గాజీ విభాగానికి చెందిన స భ్యులు సయ్యద్ మహ్మద్ సలీం, ప్రవీణ్ యాదవ్ విద్యార్థులతో మాట్లాడారు. ఎఫ్ఎల్ఎన్ అమలు తీరుపై ఆరా తీశారు. భాషాభివృద్ధి, గణిత ప్రక్రియలను పరీక్షించారు. మారుమూల గ్రామాల్లోనూ విద్యార్థులు ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడటం ప్రశంసనీయమన్నారు. హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అ మృతసురేశ్, బండారి స్రవంతితోపాటు జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్, డీఆర్పీ సంది సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. మంగపేటవాసికి పురస్కారం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మంగపేటకు చెందిన ఒల్లాల శ్రీనివాస్ 2024కుగాను డాక్టర్ స ర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యా య పురస్కారం అందుకున్నారు. ఆంగ్లభాషపై ఆసక్తి పెంపొందించేలా 20 పరిశోధన పత్రాలు సమర్పించిన శ్రీనివాస్‌కు పాండిచ్చేరి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్(పీఐఎంఎస్) ఈ పురస్కారం అందజేసింది. వివిధ అంశాల్లో పరిశోధనలు చేసినందుకు ఆ సంస్థ ఏటా ఈ అవార్డులు అందిస్తోంది. శ్రీనివాస్ సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనను గురుకులాల సమన్వయకర్త ఆర్ఎల్సీ సురేశ్, ప్రిన్సిపాల్ మహేశ్, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. దరఖాస్తులు ఆహ్వానం జ్యోతినగర్(రామగుండం): మైనార్టీ విద్యార్థులకు ఉచిత వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు. అర్హత గల ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అకౌంట్స్ అ సిస్టెంట్ యూజింగ్ ట్యాలీ, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రంగారెడ్డి పేర్కొన్నారు. ఆసక్తిగల ధ్రువీకరణపత్రాలను జతచేసి ఈనెల 27వ తేదీలోగా పెద్దపల్లిలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
మహిళా సంఘాల పనితీరు మెరుగుపడాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో స్వశక్తి మహిళా సంఘాలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మా ట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 9,102 మహిళా సంఘాలకు సుమారు రూ.478 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా ని ర్దేశించగా.. ఇప్పటివరకు 3,898 సంఘాలకు రూ.322.68 కోట్లు మంజూరు చేశారని కలెక్టర్ తెలిపారు. లక్ష్యంలో 67.51 శాతమే సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత లక్ష్యం సా ధించాలని ఆయన సూచించారు. ఎన్పీఏలను తగ్గించాలని అన్నారు. సీ్త్రనిధి రుణాల రికవరీపై దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, అడిషనల్ డీఆర్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృషి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం నివారించా లని అన్నారు. అభివృద్ధి పనులను ప్రాధాన్యతాక్ర మంలో మార్చి వరకు పూర్తి చేయాలని పేర్కొ న్నారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలను ట్రాన్స్‌కో అధికారులతో సమన్వయం చేసుకుంటూ తొలగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. సుల్తానాబాద్‌లోని డివైడర్లలో మొక్కలు పెంచాలని పేర్కొన్నారు. డంప్‌యార్డ్‌కు అనుకూలమైన స్థలం ఎంపిక చేయాలని ఆదేశించారు. సుల్తానాబాద్ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్, మంథని కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 42 పడకలను అందుబాటులోకి తేవాలి సుల్తానాబాద్(పెద్దపల్లిరూరల్): జిల్లా కేంద్రంలో చేపట్టిన 42 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన 42 పడకల భవనాన్ని ఆయన తనిఖీ చేశారు. 2025 జనవరిలోగా పనులను నాణ్యతో పూర్తిచేయాలని సూచించారు. టీఎస్ఎంఐడీసీ ఈఈ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. ఆయిల్‌పామ్ మొక్కలు నాటాలి వచ్చే ఏడాది జనవరిలోగా 850 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటే ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆయిల్‌పామ్ మొక్కల గ్రౌండింగ్‌పై ఆయన సమీక్షించారు. అధికారులు జగన్మోహన్రెడ్డి, ఆదిరెడ్డి, తిరుమల ఆయిల్‌పామ్ కంపెనీ సీఈవో కేశు కల్యాణ్కర్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
పోటెత్తిన సన్నాలు
● బోనస్ వర్తింపజేయడమే ప్రధాన కారణం ● తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు ● మొత్తం 2.66 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరణ ● రైతుల ఖాతాల్లో రూ.63.51 కోట్ల బోనస్ జమ ● జిల్లావ్యాప్తంగా 18,962 మంది రైతులకు చెల్లింపులు సాక్షి, పెద్దపల్లి: ఏటా అన్నదాతల నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోల మధ్య ధాన్యం సేకరణ సాగేది. ఈ వానాకాలంలో అలాంటి అవరోధాలకు తావులేకుండా కొనుగోళ్లు సాఫీగా సాగాయి. సన్న వడ్లు క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించటం, అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించడం, తరుగు పేరిట కోతలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని అధికారులు వివరిస్తున్నారు. దసరా పండుగ అనంతరం వరి కోతలు ప్రారంభం కాగా.. దీపావళి పండుగ నాటికి జోరందుకున్నాయి. మధ్యలో కొన్నిసార్లు అకాల వర్షాలతో రైతులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. అయితే, ధాన్యంలో కోతలకు తావులేకుండా చర్యలు తీసుకోవడంతో రెండుమూడ్రోరోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మరోవారం పదిరోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పలువురు వ్యాపారులు కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసినా.. సన్నాలకు బోనస్ వర్తిస్తుండడంతో కొనుగోలు కేంద్రాలకే రికార్డుస్థాయిలో సన్నవడ్లు వచ్చి చేరుతున్నాయి. రూ.63 కోట్ల బోనస్ జమ.. గతేడాది వానాకాలం సీజన్లో మొత్తం 1.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఈ సీజన్లో 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచే చేసి 47,209 మంది రైతుల నుంచి ఇప్పటివరకు రూ.617 కోట్ల విలువైన 2.66లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మంథని పరిధిలో ఇంకా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 29,809 మంది రైతుల నుంచి రూ.94.55 కోట్ల విలువైన సన్నరకం ధాన్యం సేకరించగా, అందులో 18,962 మంది రైతులకు రూ.63.51 కోట్ల బోనస్ చెల్లించారు. మరో 1,0847 మంది రైతుల ఖాతాల్లో రూ.31.04 కోట్లు జమ చేయాల్సి ఉంది. వేగవంతంగా వివరాల నమోదు గతంలో తరుగు పేరిట రైస్‌మిల్లుల్లో ట్రక్షీట్లు ఇవ్వడంలో జాప్యమైంది. దీంతో ట్యాబ్‌లలో వివరాలు నమోదు చేయడం ఆలస్యమయ్యేది. దీంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో వారం, పదిరోజులు గడిస్తేనే.. డబ్బు జమయ్యేది. ఈసారి కోతలు లేవు, రైస్ మిల్లర్లు లారీల్లోంచి ధాన్యం వెనువెంటనే అన్లోడ్ చేసుకోవడం, ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు సివిల్ సప్లయ్ పోర్టల్‌లో ట్యాబ్‌లతో నమోదు చేయడంతో కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని పరిశీలించి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని నివేదికలు పంపిస్తున్నారు. దీంతో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సన్న, దొడ్డురకం వడ్లు కలుపుకొని 44,225 మంది రైతులకు రూ.581.55కోట్ల మేరకు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమాచారం ఏర్పాటు చేసిన కేంద్రాలు 321 మూసివేసినవి 106 ధాన్యం విక్రయించిన రైతులు 47,209 కొనుగోలు చేసిన ధాన్యం (మెట్రిక్ టన్నుల్లో) 2,66,280 ధాన్యం విలువ(రూ.కోట్లలో) 617.72 కొనుగోలు చేసిన దొడ్డురకం (మెట్రిక్ టన్నుల్లో) 63,267.75 కొనుగోలు చేసిన సన్నరకం (మెట్రిక్ టన్నులు) 2,03,012.80 తుదిశకు కొనుగోళ్లు జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరాయి. వచ్చిన వడ్లను వచ్చినట్లే తూకం వేయడంతో కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. ట్యాబ్‌లో వివరాలు నమోదు చేశాక రెండు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్మిల్లుల్లోకి తరలిస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ ధాన్యపు గింజను పకడ్బందీగా కొనుగోలు చేస్తున్నాం. – శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ -
ఒక్కరోజైనా ఆడలే..
రామగిరి(మంథని): గ్రామీణ యువత, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, క్రీడా నైపుణ్యం వెలికితీసేందుకు గత ప్రభుత్వం ఊరూరా తెలంగాణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసింది. స్థలం కొరతతో కొన్ని గ్రామాల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేయనేలేదు. అయితే, కొన్నిచోట్ల పాఠశాలల మైదానాల్లో బోర్డులు ఏర్పాటు చేసి మమ అనిపించారు. కొన్ని పల్లెల్లో ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ విస్మరించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైంది. దీంతో అవి బోర్డులకే పరిమితమయ్యాయి. నిర్వహణ లేక పిచ్చిమెక్కలు, గడ్డి ఏపుగా పెరిగింది. కొన్నిచోట్ల పరికరాలు తుప్పుపట్టి ఎందుకూ పనికిరాకుండాపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్రీడాపాలసీ తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై దృష్టి సారించాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు. ఉపాధిహామీ నిధులతో.. జిల్లాలో 266 గ్రామ పంచాయలు ఉండగా.. ఉపాధిహామీ ద్వారా విడుదలైన నిధులతో 230 క్రీడాప్రాంగాణాలు ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి దాదాపు రూ.లక్ష నుంచి సుమారు రూ.2లక్షల వరకు వెచ్చించి ఏర్పాట్లు చేశారు. ఎకరం స్థలంలో మైదానం ఏర్పాటు చేయాలని, అందులో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్‌జంప్ పిట్లతో పాటు వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉంచాలని అప్పటి ప్రభుత్వం సూచించింది. వీటితోపాటు చుట్టూ ఫెన్సింగ్ మాదిరిగా కానుగ, వెదురు, తంగేడు తదితర మొక్కలు విరివిగా నాటి పెంచాలని ఆదేశించింది. అయితే, అధికారుల నిర్లక్ష్యంతో ఈ సౌకర్యాలు ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. నామమాత్రంగా ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగాణాలు చెట్లు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక తెలంగాణ క్రీడా మైదానాలకు కేటాయించిన రూ.లక్షలు వృథా అయ్యాయనే విమర్శలు కొంతకాలంగా వెలువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పెద్దబోర్డులు ఏర్పాటు చేయడం తప్ప క్రీడా సామగ్రి, పరికరాలు, వసతులు కల్పించలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. జాడలేని క్రీడా సామగ్రి? గత ప్రభుత్వం క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేయడంతోపాటు ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు రూ.లక్షకుపైగా విలువైన క్రీడా సామగ్రిని కేటాయించింది. వీటిని గ్రామప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు అందజేసింది. క్రీడా ప్రాంగాణాలు వినియోగంలోకి రాకపోవడంతో అవి ఎక్కడ ఉన్నాయనేది ఎవరికీ తెలియడంలేదు. మైదానం ఉంది.. ఆటల్లేవ్ పిచ్చిమొక్కలు.. కరువైన వసతులు అందుబాటులోకి రాని క్రీడా పరికరాలు అధికారుల పర్యవేక్షణ లోపం.. క్రీడాకారులకు శాపం జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రాంగణాల దుస్థితి లక్ష్యం నెరవేరేదెలా? గ్రామీణ యువతను క్రీడల్లో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. వారు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా క్రీడాసామగ్రి అందజేసింది. కానీ, వసతుల లేమి, పర్యవేక్షణ లోపంతో ఇప్పటివరకు అందులో ఒక్క ఆటైనా ఆడిన సందర్భం లేదు. – బూరుగు రాజుగౌడ్, క్రీడాకారుడు, రామగిరి వినియోగంలోకి తెస్తాం గ్రామీణ క్రీడా ప్రాంగాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. వినియోగంలో లేనివాటిని గుర్తించి, క్రీడా పరికరాలను వినియోగంలోకి తీసుకొస్తాం. క్రీడా ప్రాంగాణాలను, క్రీడా పరికరాలను యువత సద్వినియోగం చేసుకుని పోటీల్లో రాణించేలా ప్రోత్సహిస్తాం. – వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఇది రామగిరి మండలం గ్రామం తెలంగాణ క్రీడా ప్రాంగణం. గత ప్రభుత్వం దీనిని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం దీనిపై పర్యవేక్షణ కరువైంది. దీంతో బోర్డు తొలగించి పక్కన పడేశారు. ఇది రామగిరి మండలం కల్వచర్లలోని గ్రామీణ క్రీడా ప్రాంగణం. దీని నిర్వహణను ఎవరూ పట్టించుకోవడంలేదు. స్థానికులు తమ వాహనాల పార్కింగ్ కోసం ఇలా వినియోగిస్తున్నారు. -
సొంతింటి పథకం అమలు కోసం ఉద్యమం
● సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని: సొంతింటి పథకం అమలు కోసం ఉద్యమించాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు పేర్కొన్నారు. గురువారం ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గని, స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకాన్ని అమలు చేయాలన్నారు. మారుపేర్ల కార్మికుల విజిలెన్స్ కేసులను ఎత్తివేసి సమస్య పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ, సింగరేణి ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా ఇప్పటికి ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. సీఐటీయూ నిర్వహించే దశలవారీ పోరా టంలో యూనియన్లకు అతీతంగా కార్మికులు కలిసిరావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, జెల్లా గజేంద్ర, తోట నరహరిరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలి
పెద్దపల్లి రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలెక్టరేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల్లో పఠనం, గణిత సామర్థ్యాలు పెంచాలని సూచించారు. పాఠశాలలను సందర్శించినప్పుడు బోధన ప్రక్రియలో కొన్ని లోటుపాట్లు గమనించడం జరిగిందన్నారు. జిల్లాలోని 1,075 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు డీఆర్పీల ద్వారా కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. బోధన విధానంలో ఉన్న లోపాలను సవరించుకుని పాఠశాలలోని 80 శాతం పిల్లల్లో పఠన, గణిత సామర్థ్యాలు పెంచినట్లయితే జిల్లాస్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డీఈవో డి.మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త ిపీఎంషేక్ పాల్గొన్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహణ పెద్దపల్లిలోని అమర్‌నగర్ చౌరస్తా సమీపంలోని 35వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా దరఖాస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రజలు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించాలని సూచించారు. ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఎన్యుమరేటర్లు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలని, సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు లాగిన్లు రూపొందించాలని అధికారులకు తెలిపారు. ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు రావడానికి వీలులేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కృషి చేయాలి కలెక్టర్ కోయ శ్రీ హర్ష -
స్వీయ రక్షణపై అవగాహన
కోల్‌సిటీ: ప్రకృతి వైఫరీత్యాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందం గోదావరిఖనిలో కల్పించిన అవగాహన ఆకట్టుకుంది. స్థానిక సప్తగిరికాలనీలో గురువారం ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ (విజయవాడ) కమాండర్ ఐఎన్ఎస్ పి.బబ్లూ బిశ్వాస్ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. గుండెపోటుకు గురైతే చేపట్టాల్సి న సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. గోదావరిఖనిలో గతంలో వరద ముంపుకు గురయిన మల్కాపూర్, సప్తగిరికాలనీ, గంగానగర్, ఉదయ్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ ప్రసాద్, ఫైర్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఉద్యోగుల బాధ్యతను పెంచేందుకే సన్మానం పెద్దపల్లి రూరల్: అధికారిక పర్యటన నిమిత్తం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ విభాగానికి చెందిన ఉన్నతశ్రేణి అధికార యంత్రాంగాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ సన్మానించారు. జనరల్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ రమేశ్, కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ చీఫ్ ఇంజినీర్ ఎం.కె.ఝా, డీజీఎం జలమండలి అబ్దుల్ సత్తార్‌ను శాలువాతో సత్కరించా రు. బీసీ యువజన సంఘ కో– ఆర్డినేటర్ ఆకు ల స్వామి, వివేక్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి సత్యనారాయణ, గొల్లపల్లి రమేశ్, తాడూరు వివేక్, తిరుపతి పాల్గొన్నారు. ఎర్రకోట వేడుకలకు ‘ఖని’ విద్యార్థి గోదావరిఖని టౌన్: ఢిల్లీలోని ఎర్రకోటలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీర్ మామిడి రాహుల్ ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ జై.కిషన్ఓజా తెలిపారు. పరేడ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే తేనేటి విందులో రాహుల్ పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. రాహును ప్రిన్సిపాల్, ఎన్సీసీ ప్రోగ్రాం ఆఫీసర్లు ఏ.సాంబశివరావు, ఎం.నరేశ్, కిరణ్మయి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, ఎన్సీసీ ఆఫీసర్ బి.తిరుపతి, అధ్యాపకులు సవిత, శారద, రామకృష్ణ, నరేశ్ అభినందించారు. -
అనర్హులకు ఆసరా!
● పింఛన్లపై విజిలెన్స్‌కు ఫిర్యాదు ● ఒక్క ఇల్లందకుంటలోనే 1,000 మంది అనర్హులు? ● ఉమ్మడి జిల్లాలో ఎందరో? ● 500 మందిని గుర్తించిన అధికారులు ● నకిలీ సర్టిఫికెట్లపై డీఆర్డీఏ, సివిల్ ఆస్పత్రి పరస్పర ఆరోపణలు ● రెండేళ్ల కిందే బయటపెట్టిన ‘సాక్షి’ ● విచారణ పక్కనబెట్టిన ఏసీబీసాక్షి ప్రతినిధి, కరీంనగర్●: దివ్యాంగులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. ముఖ్యంగా నకిలీ సదరం సర్టిఫికెట్లు చూపి, నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ తీసుకుంటున్న విషయం కరీంనగర్ జిల్లాలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక్క ఇల్లందకుంట మండలంలోనే 1,000 మంది వరకు అనర్హులున్నట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా వారి సదరం సర్టిఫికెట్లపై విజిలెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ విషయంలో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి చాలామంది అనర్హులు అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు పొందినట్లు తేల్చారు. ఇల్లందకుంటలో ఇప్పటివరకు 500 మందిని గుర్తించారు. వీరంతా ఇప్పటికీ ఆసరా పింఛన్ పొందుతున్నట్లు తెలిసింది. మిగిలిన వారెక్కడ? ఇల్లందకుంటలో దాదాపు మరో 500 మందిని విజిలెన్స్ అధికారులు గుర్తించలేకపోతున్నారు. వారంతా ఎవరు? ఎక్కడున్నారు? సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు? అన్న విషయాలపై తర్జనభర్జన పడుతున్నారు. మొత్తానికి నానా ఇబ్బందులు పడి, లోతుగా దర్యాప్తు చేస్తే.. కేవలం 70 సర్టిఫికెట్ల లబ్ధిదారులు, వారి సమాచారం పూర్తిస్థాయిలో రీ వెరిఫై చేయించగలిగారు. 2011 నుంచి ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన డాక్టర్లు 15 మందిని విచారణకు పిలిచారు. వీరంతా కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో విధులు నిర్వహించినవారే. ఇప్పుడు రిటైరయ్యారు. ఏ కారణం చేత జారీ చేశారో.. ఏ సమయంలో ఇచ్చారో.. అన్న విషయాలు వారికి గుర్తు లేకపోవడం గమనార్హం. దీంతో విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు మిగతా 500 మంది కోసం గాలిస్తున్నారు. ఈ విషయంలో ఇటు డీఆర్డీఏ, అటు సివిల్ ఆస్పత్రి అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. జరిగిన వ్యవహారంలో తమ తప్పు లేదంటే తమ తప్పు లేదంటూ తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘సాక్షి’లో వరుస కథనాలు.. సదరం నకిలీ సర్టిఫికెట్ల విషయంలో ‘సాక్షి’ దినపత్రిక 2022లోనే వరుస కథనాలు రాసింది. అప్పుడు కూడా జమ్మికుంటకు చెందిన ఓ విజిల్ బ్లోయర్(కుంభకోణాన్ని వెలికితీసిన వ్యక్తి) ద్వారా విషయం వెలుగుచూసింది. ఆ తర్వాత 317 జీవో అమలు సమయంలోనూ కలెక్టరేట్ కేంద్రంగా జరిగిన బదిలీల్లోనూ అనేక నకిలీ సర్టిఫికెట్లను అధికారులే పక్కనబెట్టారు. కానీ, అప్పటికే చాలామంది వాటి ఆధారంగా కోరుకున్న చోటకు బదిలీ చేయించుకోవడం, లేదా బదిలీ నిలిపివేయించుకోవడం ద్వారా లబ్ధి పొందారు. అనంతరం విచారణను ఏసీబీ చేపట్టింది. సివిల్ ఆస్పత్రి, డీఆర్డీఏ సిబ్బందిని విచారించింది. పలు ఆధారాలు సేకరించింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన సంబంధిత అధికారులు ఆ తర్వాత చల్లబడ్డారు. కొంతకాలానికి విచారణను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ, దీనికి సంబంధించిన సమస్త సమాచారం కరీంనగర్ ఏసీబీ వద్ద ఉంది. అయితే, విజిలెన్స్ అధికారులు ఏసీబీని సంప్రదించారా లేదా అన్నది సందేహమే. ఇది కేవలం ఇల్లందకుంట మండలానికే పరిమితమైన సమస్య కాదు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా 2011 నుంచి జరుగుతున్న వ్యవహారం. దర్యాప్తు పూర్తయితే ఎన్ని కొత్త కోణాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
సుల్తానాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సూచించారు. సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సీఎంకప్ పోటీలను గురువారం ప్రారంభించారు. వేణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు క్రీడలతో శారీరక, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుందని, క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి 650మందికి పైగా క్రీడాకారులు హాజరు కాగా.. శనివారం వరకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, జూడో, రెజ్లింగ్ పోటీలు జరగనున్నాయి. జిల్లా క్రీడాశాఖ, పెద్దపల్లి జూడో, రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జూడో, రెజ్లింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పలువురు విజేతలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. డీఐఈవో కల్పన, డీవైఎస్వో సురేశ్, మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, స్పోర్ట్స్‌క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్, జూడోసంఘం అధ్యక్షుడు మాటేటి సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ దాసరి వేణు ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు