బెజ్జారపు లక్ష్మణ్ (ఫైల్)
సాక్షి,నిర్మల్: ‘దేశం నుంచి వస్తున్నా..’ అని ఫోన్ చేసి గల్ఫ్ నుంచి బయ లుదేరిన యువకుడు ఐదురోజులైనా ఇంటికి చేరలేదు. మార్గంమధ్యలోనే ఎటువెళ్లాడో.. ఆచూకీ తెలియడం లేదు. ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లాకేంద్రంలోని మంజులాపూర్‌కు చెందిన బెజ్జారపు లక్ష్మణ్(26) అనే యువకుడు 2014నుంచి యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ ఉపాధి పొందుతూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు.
మధ్యలో రెండుసార్లు ఇంటికి వచ్చి వెళ్లాడు. ఇదే క్రమంలో ఈనెల 19న ఇంటికి వస్తున్నట్లు ఫోన్‌చేసి చెప్పాడు. ఆరోజే కాదు.. మరో రోజైనా.. లక్ష్మణ్ ఇంటికి చేరుకోలేదు. కంగారుపడ్డ తండ్రి లింగన్న, సోదరుడు నరేశ్ తాను చేరుకుంటానని చెప్పిన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ నరేశ్ తన తమ్ముడి గురించి సిబ్బందిని అడుగగా, పోలీస్ ఔట్ పోస్ట్‌కు వెళ్లామని చెప్పారు. వారి వద్దకు వెళ్లి పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు వివరాలు తెలుపగా.. లక్ష్మణ్ షార్జా నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగినట్లు తెలిపారు. ఏంచేయాలో పాలుపోక కుటుంబసభ్యులు గురువారం జిల్లాకేంద్రంలోని ప్రవాసిమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లను కలిశారు. ఆయన వారితో కలిసి ఎస్సీ ప్రవీణ్‌కుమార్ వద్దకు తీసుకెళ్లి లక్ష్మణ్ ఆచూకీ కోసం విన్నవించారు.
చదవండి: ఆన్‌లైన్ తరగతులు అర్థం కాలేదు.. ఫెయిలైనందుకు క్షణికావేశంలో..
Comments
Please login to add a commentAdd a comment