Nirmal
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పిచ్చుకలకు కుచ్చులు
గతం ఎక్కడికో పోదు. వర్తమానమై పలకరిస్తుంది. భవిష్యత్ ఆశాకిరణమై మెరుస్తుంది. ఘనంగా చెప్పుకోవడానికి గతంలో ఎన్నో ఉన్నాయి. ‘ఇది మా ఇల్లు మాత్రమే కాదు... పక్షులది కూడా’ అనుకోవడం అందులో ఒకటి. పిచ్చుకలకు ఇంట్లో చోటివ్వడంతోపాటు వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంత సీన్ ఉందా?పక్షుల ప్రపంచం, మన ప్రపంచం వేరైపోయాయి. ఇప్పుడు పక్షుల నుంచి చుట్టపు చూపు పలకరింపు కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పిట్ట కనిపించినా వాటిని పలకరించే ఓపిక మనకు లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయలక్ష్మిలాంటి పక్షిప్రేమికులు ఆశాదీపాలను వెలిగిస్తున్నారు. ఆ వెలుగును చూడగలిగితే మరెన్నో దీపాలు వరుస కడతాయి. పక్షులతో చెలిమి చేయడానికి స్వాగత తోరణాలు అవుతాయి.తమ ఇంటి పిట్టగోడపై వాలిన ఆ పిట్టను చూడగానే నిర్మల్‌కు చెందిన విజయలక్ష్మికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ‘‘మా ఊళ్లో.. మా ఇంట్లో.. మా నాన్నగారు ఇలాంటి పిచ్చుకల కోసం ఏదో చేసేవారే..! దానికోసం గూడు కట్టడంతో పాటు తినడానికి ఏదో పెట్టేవారే..!’ అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసింది. బంధువులకు ఫోన్లు కలిపింది. నానమ్మ తరపువాళ్లు ‘దాన్ని వరికుచ్చు అంటారే..’ అని చెప్పడంతోనే ‘హమ్మయ్యా.. తెలిసింది..’ అని అనుకుని ఊరుకోలేదు.‘ఇక ఇప్పుడు కుచ్చులు కట్టడమెలా..!?’ అంటూ ఆలోచనల్లో పడింది. యూట్యూబ్‌లో ‘వరికుచ్చుల తయారీ’ గురించి సెర్చ్ చేసింది. ఆ వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చేసుకుంది. నిర్మల్ జిల్లాలో డీఆర్డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి)గా పనిచేస్తున్న విజయలక్ష్మి తన సిబ్బందికి కూడా వరి కుచ్చులు తయారు చేయడం ఎలాగో నేర్పించింది. వీరు చేసిన వరికుచ్చులు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఈ వరికుచ్చులపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లల్లో వేలాడదీస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో మనుషులు మాత్రమే కాదు... అందమైన పిచ్చుకలు కూడా కనిపిస్తున్నాయి.ఎన్నో ఎన్నెన్నో!పచ్చదనమన్నా, పల్లెవాసులతో కలిసిపోవడమన్నా ఇష్టపడే విజయలక్ష్మి డీఆర్డీవోగా నిర్మల్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది...→ గ్రామీణ, ఆదివాసీ మహిళలు రుతుక్రమ సమయంలో ఇంటికి దూరంగా ఉండటాన్ని చూసి చలించిన విజయలక్ష్మి వారికి అవగాహన కలిగించేందుకు షార్ట్ఫిలిమ్ తీసింది. తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి కుంటాల మండల మహిళ సమాఖ్య ద్వారా రేలా (రూరల్ వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివేషన్) పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్నిప్రారంభించారు → నిర్మల్ కొయ్యబొమ్మల కోసం మూడుచోట్ల పొనికిచెట్లను పెంచుతున్నారు → మండల మహిళల ద్వారా సమీకృత సాగుప్రారంభించి అందులో వరితో పాటు కూరగాయలు, బీట్రూట్, క్యారట్, వట్టివేరు, కర్రపెండలం పండిస్తున్నారు. చేపలు, నాటుకోళ్లు పెంచుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే ‘ప్యాషన్’ఫ్రూట్నూ ఇక్కడ పండిస్తున్నారు→ ఉపాధిహామీ పథకంలో కూలీలు, పనుల సంఖ్యను పెంచి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలిపారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో, వసూలు చేయడంలోనూ నిర్మల్‌ను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా సంక్షేమాధికారి ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టారు. ‘మన వంట–అంగన్వాడీ ఇంట’ ‘న్యూట్రిబౌల్’లాంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు.వరికుచ్చుల సరిగమలుపాతకాలపు లోగిళ్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ చోటిచ్చేవి. చిలుకచెక్కతో ఉండే ఇళ్ల స్లాబుల్లోనే పిచ్చుకల కోసమూ గూళ్లను కట్టించేవారు. వాటిలో కాపురం పెట్టే జంటల కోసం తమ పంటల్లో నుంచి భాగాన్ని పంచేవారు. ధాన్యం ఇంటికొచ్చే వేళ పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికుచ్చులను తయారు చేసిపెట్టేవారు. అలా చేసిన కుచ్చులను పిచ్చుకల గూళ్లకు దగ్గరగా వేలాడదీసేవారు. పొద్దుపొద్దున్నే వాటిపై వాలే పిచ్చుకలు ఒక్కో వడ్లగింజను నోటితో ఒలుస్తూ ఆరగిస్తూ, కిచకిచమంటూ ఇంటిల్లిపాదిని మేలుకొల్పేవి.ఆ మంత్రదండం మన దగ్గరే ఉంది!భవిష్యత్ గురించి మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. గతంలోకి కూడా తొంగిచూస్తే... విలువైన జ్ఞాపకాలే కాదు విలువైన సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటికి మళ్లీ ఊపిరి పోస్తే విలువైన గతాన్ని వర్తమానంలోకి ఆవిష్కరించినట్లే. ప్రతిప్రాంతానికి తనదైన విలువైన గతం ఉంటుంది. విలువైన సంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తే ‘ఇప్పుడా రోజులెక్కడివి!’ అని నిట్టూర్చే పరిస్థితి రాదు. గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చే మంత్రదండం మన దగ్గరే ఉంది.– విజయలక్ష్మి – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
ఇథనాల్‌పై గెలుపులో అంతా ఆమే!
అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం. ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.నమ్ముకున్న పొలాలే లేకుంటే...‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.ఊరూరా..ఇంటింటికీ..పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ......ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.నిద్రలేని రాత్రులుదిలావర్పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్‌లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లిఅందరం ఒక్కటై...మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.– ఆలూరు లక్ష్మి, దిలావర్పూర్రెండడుగులు వెనక్కి వేసి...తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్‌పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్పూర్లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
నిరూపించే దమ్ముందా.. కేటీఆర్, బీజేపీకి మంత్రి సీతక్క సవాల్
హైదరాబాద్: అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా ప్రజలకు కేటీఆర్ ఓమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దిలావార్పూర్, గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదు.. అయినా మా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. దొంగ నాటకాలు, రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా?. ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలైన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషం వెదజల్లుతున్నారు. తలసాని సాయి కుమార్ ఎవరో బీఆర్ఎస్ చెప్పాలి. ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నారు.ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు, ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు.. ఇంత దారుణమా?. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ దొర చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి?. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, కేసులు పెడితే తప్పా?.ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించింది. ఫౌంహౌస్ నుంచి పాలన చేసిన మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. -
ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కొడుకుదే: కాంగ్రెస్
నిర్మల్ : దిలావర్ పూర్లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ కౌంటర్‌కు దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిదే. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు. కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు దిలావర్ పూర్‌కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన. కాగా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
నిర్మల్: నిరసనల ఎఫెక్ట్.. ఇథనాల్ పరిశ్రమ పనులకు బ్రేక్
నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాకర్టీ ఏర్పాటుపై స్థానికులు చేపట్టిన ఆందోళనలతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో.. ఐదుగురు రైతులను జిల్లా కలెక్టర్ చర్చలకు పిలిచారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది అని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.దాదాపు రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్థులు నిరసనల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆ నిరసనలు ఉధృతం చేశారు. నిన్న రాత్రి రోడ్డుపైనే వంటలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారంతా రోడ్డుపైనే భోజనం చేశారు.ఇవాళ మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరనసల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసుల వాహనాలపైకి రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరుగులు తీశారు. అనంతరం, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం సీరియస్మరోవైపు.. ఇథనాల్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
TG: దిలావర్పూర్లో మరోసారి ఉద్రిక్తత
సాక్షి,నిర్మల్‌జిల్లా: జిల్లాలోని దిలావర్పూర్లో బుధవారం(నవంబర్27) ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ మంగళవారం జరిగిన ధర్నా సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేయడంపై గ్రామస్తులు బుధవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.ఈ క్రమంలో శాంతిభద్రతలను కాపాడేందుకుగాను పోలీసులు గ్రామ ప్రజలను నిర్మల్- కళ్యాణ్ నేషనల్ హైవేపైకి రానివ్వలేదు. దీంతో పోలీసులను తరుముకుంటూ వారిపై రాళ్లదాడి చేస్తూ గ్రామస్తులు నేషనల్హైవేపైకి చేరుకున్నారు. పోలీసుల వాహనాలపైనా గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి విషమించడంతో ఘటనాస్థలం నుంచి పోలీసులు తమ వాహనాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: నిర్మల్ పల్లెల్లో ఇథనాల్ మంట -
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్‌లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
వీడెవండీ బాబు... తాగిన మత్తులో ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు
నిర్మల్‌లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సు చోరీకి ప్రయత్నించాడు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వెనుక నుంచి ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖిని చెందిన గణేశ్.. లోపలికి చొరబడ్డాడు. డిపోలో నిలిపి ఉంచిన ఏపీ 01జెడ్ 0076 బస్సు ఎక్కి స్టార్ట్ చేశాడు. గేట్ బయటి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాడు. బస్సు వివరాలు బుక్‌లో ఎంటర్ చేయకపోవడంతో గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు వంశీకి అనుమానం కలిగింది. వెంటనే అక్కడున్న బైక్ తీసుకుని బస్సును వెంబడించాడు. పట్టణ శివారులోని సోఫీనగర్ వద్ద స్థానికుల సహాయంతో బస్సును అడ్డుకున్నాడు. దొంగ మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని బస్సును డిపోకు తరలించారు. బస్సు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గణేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
నిర్మల్ చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ పాల్గొన్నారు. -
మృత శిశువుకు జన్మనిచ్చి తల్లి మృతి
భైంసాటౌన్: కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృత శిశువుకు జన్మనిచ్చి తర్వాత కాసేపటికి తానూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ తండాకు చెందిన రాథోడ్ మనోజ్ తన భార్య శీతల్ (25)కు నెలలు నిండడంతో కాన్పు కోసం కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు కోసం వైద్యులు ప్రయతి్నంచారు. అయితే నొప్పులు ఎక్కువ కావడం, కాన్పు కాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. కుటుంబసభ్యులు శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లగా.. ఆ కాసేపటికే శీతల్ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. -
లారీడ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
-
చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్మనీలో మన రుచులు
నిర్మల్‌ఖిల్లా: జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో నిర్వహిహించిన ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్లో నిర్మల్‌కు చెందిన అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు పాల్గొని ఇక్కడి తెలంగాణ సంప్రదాయ వంటకాలను పరిచయం చేశారు. అక్కడివారికి చికెన్ కర్రీ, బిర్యానీ, వడలు, సకినాలు, బూరెలు తదితర వంటకాల రుచి చూపించారు. జర్మనీ ప్రజలు డబల్ క మీఠా వంటకాన్ని ఇష్టంగా ఆరగించినట్లు వారు తెలిపారు. అక్కడి తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వారూ హాజరయ్యారు. నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు చేసిన వంటకాలకు అక్కడి నిర్వాహకులు, స్థానికుల ప్రశంసలు దక్కాయి. ఇలాంటి ఫెస్టివల్స్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగు ప్రజలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల వారంతా ఒక్కచోట కలుసుకుని మన దేశ వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. మన దేశ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని అజయ్‌కుమార్–శ్రీలత దంపతులు పేర్కొన్నారు. -
వరికుచ్చులను మెచ్చుకున్న సీఎం
నిర్మల్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో జిల్లా నుంచి ప్రదర్శనలో ఉన్న ధాన్యపు కుచ్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే కాకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి స హా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీటిని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఆర్డీఏ, సెర్ప్ సిబ్బంది కలిసి వరికుచ్చులను ప్రత్యేకంగా తయారు చేశారు.చేనేత, ఇతర కళాకృతుల కంటే ఈసారి ధాన్యపుసిరిని కళ్లకు కట్టించే వరికుచ్చులు అందరినీ ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ, కమిషనర్ అనితా రామచంద్రన్, సంగీత దర్శకుడు కీరవాణి పరిశీలించారు. -
రాజాసింగ్‌పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు
నిర్మల్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై జిల్లాలో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ రాజాసింగ్‌తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పైనా కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున రాజాసింగ్, పాయల్ శంకర్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సమయం ముగిసినా కూడా ప్రచారం చేశారనే వీళ్లపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. -
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
సాక్షి, నిర్మల్: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్‌లో కాంగ్రెస్ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.కాంగ్రెస్ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్లను తొలగించడమని చెప్పారు. -
కంగ్రాట్స్.. నిర్మల!
కర్నూలు కల్చరల్/ఆదోని రూరల్: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిర్మలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్‌లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్‌మోడల్, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇంచార్జ్ ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయడం వల్ల ఇంటర్ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్ సృజన, ఇతర అధికారులు కలెక్టర్ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను.. గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్ దృష్టికి వెళ్లడం, కలెక్టర్ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించారన్నారు. ఈరోజు ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్‌ఛార్జి ఐసీడీఎస్ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్ఓ శరన్‌స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు. -
కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్ కోరారు. వారం రోజులుగా ఆదిలాబాద్‌లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే తోడుదొంగలన్నారు. నిజాయతీపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనాలు. బాసర సరస్వతీమాత చరణాలకు నా ప్రణామం. ఈ గడ్డపై పుట్టిన ఆదివాసీయోధులు కుమురంభీమ్, రాంజీగోండుకు నా నివాళులు. తన పోరాటంతో రాంజీ గోండు యువతకు ప్రేరణగా నిలిచారు.." అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ రోడ్డులో పాతక్రషర్ ఎదురుగా ఆదివారం నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్, రమేశ్‌రాథోడ్, పాయల్ శంకర్, సోయం బాపూరావు తరఫున నిర్వహించిన ఈ ఎన్నికలసభకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం నుంచి కనుచూపు మేరంతా జనసంద్రమే కనిపిస్తోందని, కాంగ్రెస్ సుల్తానులు, బీఆర్ఎస్ నిజాంలు ఒక్కసారి వచ్చి చూస్తే.. రాంజీగోండు ప్రేరణ, బీజేపీ గెలుపు ఖాయమన్న విషయం తెలుస్తుందని మోదీ అన్నారు. తమకు తాము రాజకీయ తీస్మార్ఖాన్ అనుకుంటున్నారో, రాజనీతి జ్ఞానిగా భావిస్తున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడో కారు స్టీరింగ్ వేరేవాళ్లకు అప్పగించి ఫామ్‌హౌస్‌కు వెళ్లి పడుకుంటున్నాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని మోదీ చెప్పారు. కొయ్యబొమ్మకు గ్యారంటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మేడిన్ ఇండియా అన్న, మేకిన్ ఇండియా అన్న ఇష్టం ఉండదని ప్రధాని ఆరోపించారు. ఈ కారణంగానే ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ కొయ్యబొమ్మల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్ కొయ్యబొమ్మలకు పూర్వవైభవం తీసుకువస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డుతో నిర్మల్ జిల్లా రైతులకూ మేలు కలుగుతుందన్నారు. ఇక్కడి పసుపురైతులు పండించే పసుపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని తెలిపారు. కోవిడ్ తర్వాత పసుపు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. వరి రైతులకు మద్దతుగా ధాన్యం క్వింటాల్‌కు రూ.3,100 చెల్లిస్తామని ప్రకటించామన్నారు. తెలుగులో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అసలు ప్రధానమంత్రి ఇంతా బాగా తెలుగు మాట్లాడగలరా.. అనేలా భాషను ఉచ్చరించారు. ‘మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..’ అని అనడంతో సభలో విశేష స్పందన వచ్చింది. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా..’ అంటూ తెలుగులోనే ప్రశ్నించారు. ‘మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేది..’ అని చెప్పడం, ప్రతీసారి ‘నా కుటుంబసభ్యులారా..’ అని సంబోధించడం సభికులను ఆకట్టుకుంది. సభ ఆద్యంతం ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఎంపీ సోయం గైర్హాజరు.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఆదిలా బాద్ ఎంపీ, బీజేపీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏ కారణాల వల్ల రాలేదనేది తెలియరాలేదు. ఇది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్, రమేశ్ రాథోడ్, పాయ ల్ శంకర్, అజ్మీరా ఆత్మారాంనాయక్ హాజరయ్యారు. అలాగే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉమ్మడి ఆదిలాబా ద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ మంత్రి అమర్‌సింగ్‌తిలావత్, మాజీ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్, తదితరులంతా పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: '30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్‌లు! -
ఆదర్శప్రాయుడు పీవీ: ఇంద్రకరణ్
నిర్మల్‌టౌన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు నిర్మల్‌కి విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం తన అదృష్టమన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానమంత్రి అవుతున్నారనే ఉద్దేశంతో తనతోసహా ఏడుగురు టీడీపీ ఎంపీలం ఆయనకు మద్దతు తెలిపామని చెప్పారు. పీవీ చాణక్యనీతితో దేశాన్ని బ్రహ్మాండంగా పాలించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కేశవరావు మాట్లాడుతూ పీవీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు విద్యార్థులకు, పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రముఖుల జీవిత చరిత్ర తెలియజేయాలని సూచించారు. -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
భయపడేది లేదు: ఎమ్మెల్యే రేఖా నాయక్
‘‘కాంగ్రెస్‌లో చేరతా.. బీఆర్ఎస్ను ఓడిస్తా.. ప్రతీకారం తీర్చుకుంటా’’.. టికెట్ దక్కకపోవడంపై ఖానాపూర్(నిర్మల్) ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ సెన్సేషన్ రియాక్షన్ ఇది. అంత స్వరం పెంచినా.. బుజ్జగింపులకు బీఆర్ఎస్ అధిష్టానం దిగింది. అయినా ఆమె చల్లారలేదు. దీంతో ‘ప్రతీకార చర్యలకు’ దిగిందనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. మొదట కూతురు భర్త.. ఇప్పుడు తన భర్తనే టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందించారు కూడా. సొంత ఎమ్మెల్యే రేఖనాయక్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది!. అత్తమీద కోపం అల్లుడి మీద ప్రదర్శించింది. మహబూబ్ బాద్ ఎస్పీగా పని చేస్తున్నా శరత్ చంద్రపవార్‌ను.. ఉన్నపళంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఈ రివెంజ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. రేఖా నాయక్ దూకుడు తగ్గించేందుకు మరో అడుగు ముందుకేసింది. రేఖా నాయక్ కుటుంబ అక్రమాలను తవ్వే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె భర్త. శ్యామ్ నాయక్‌పై ఉన్న కేసును ఏసీబీ ద్వారా తిరగదోడేందుకు సిద్దమవుతోందని సమాచారం. తద్వారా రేఖానాయక్‌కు చెక్ పెట్టడంతో పాటు ఆసిఫాబాద్‌లో ఆమె భర్త పోటీ చేయకుండా ఉండేందుకు ఎత్తుగడ వేస్తోందనే ప్రచారం నడుస్తోంది. బహిరంగంగా దూకుడు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్‌కు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆ టిక్కెట్‌ను ఆమె రాజకీయ ప్రత్యర్ధిగా భావించే జాన్సన్ నాయక్‌కు కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో.. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని బావించిన రేఖనాయక్ ఆశలు అవిరయ్యాయి. టిక్కెట్ దక్కలేదనే ప్రస్ట్రేషన్‌లో రేఖానాయక్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై అగ్రహం వెల్లగక్కింది. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. పార్టీ బుజ్జగింపులు చేసిన దారిలేదు. పైగా పార్టీ తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలకు నచ్చలేదట!. పైగా ఖానాపూర్‌తో పాటు ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించి తీరతామని ప్రకటనలు చేయడం మరింత మండిపోయేలా చేసింది. అందుకే ఆమెను దారికి తేవడానికి ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. భార్యభర్తలపై.. రేఖా నాయక్ భర్త ఇప్పటికే శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన శ్యామ్.. ఈ మధ్యే వీఆర్ఎస్ తీసుకున్నారు. అయితే.. భోరజ్ చెక్‌పోస్ట్ వద్ద ఎంవీఐగా పని చేసే సమయంలో ఆయనపై ఏసీబీ ఓ కేసు నమోదు చేసింది. ఆ కేసును ఇప్పుడు బయటకు తీయించాలనే ప్రయత్నాల్లో ఉంది. అలాగే.. రేఖా నాయక్ సైతం ఎమ్మెల్యేగా పలు అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రధానంగా మిషన్ భగీరథ, దళిత బందు, వివిద పథకాల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విచారణ ద్వారా ఆమె దూకుడుకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోందట. అయితే ఇదంతా బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా చేయిస్తున్న ప్రచారమని.. బెదిరింపుల ద్వారా రేఖా నాయక్, ఆమె భర్తను లొంగదీసుకునే ప్రయత్నమనే ఆమె అనుచరులు మండిపడుతున్నారు. కుట్ర అంతా.. అవినీతి, అక్రమ ఆరోపణలను రేఖ, శ్యామ్‌లు సైతం కోట్టిపారేస్తున్నారు. ‘‘సర్కార్ బెదిరింపులకు భయపడేది లేదు. ఎలాంటి అక్రమాలకు పాల్పపడలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’’ అని ఆమె చెబుతున్నారు. అదేవిధంగా శ్యామ్ నాయక్ సైతం తాను వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందని, కేసు కొట్టిపారేసిన తర్వాతనే వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం ఇచ్చిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్న ఆయన.. కేసుతో అయ్యేది లేదంటున్నారు. ‘‘ప్రజల్లో మాకు పెరుగుతున్న అదరణ చూసి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది’’ అని మండిపడుతున్నారు ఈ భార్యభర్తలు. ఏది ఏమైనా.. సర్కార్ బెదిరింపులకు ఆ భార్యాభర్తలు తలొగ్గుతారా? లేదంటే ఈ వేధింపులు వాళ్లపై సింపథీ క్రియేట్ చేస్తాయా?.. చూడాలి. -
నిర్మల్ ఎన్నికల ‘వరద’లో ఎదురీదేవరు?
ఆ పట్టణం వేనిస్ను మరిపిస్తోంది. వర్షకాలం వస్తే చాలు కాలనిలు చెరువులు అవుతున్నాయి. రోడ్లు కాల్వలు అవుతాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పడవల్లో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. పోని ఇదంతా పర్యాటక ప్రాంతమా అంటే అదీ కాదు. పోనీ ప్రగతి అంటే కాదు. అభివృద్ధి అసలు కాదు. మరి దశాబ్ద కాలంగా మంత్రి సాధించిన వందల కోట్ల అభివృద్ధి పనులు వరద పాలు కావడానికి కారణాలేంటి? ఆ వరదలు మంత్రిని ఎన్నికలలో ముంచుతాయా? వరదనీటిలో కమలం వికసిస్తుందా? వరదనీరు తెలంగాణ యోధుడు శ్రీహరి రావు విజయతీరాలకు చేర్చుతుందా? నిర్మల్ ఎన్నికల వరదలో ఎదురీదేవరు? ఏటిలో కోట్టుపోయేదేవరు? నిర్మల్ ఎన్నికల వరద యుద్దంపై సాక్షి స్పేషల్ రిపోర్ట్. వంద ఏళ్ల చరిత్ర, ఘనకీర్తి కలిగిన నిర్మల్ నిర్మల్ నియోజకవర్గానికి వందల చరిత్ర ఉంది. ఏంతో ఘనకీర్తి ఉంది. పాలన చిహ్నలు ఉన్నాయి. కోటలు ఉన్నాయి. కరువు పాతరేసిన చెరువులు ఉన్నాయి. కాలే కడుపులకు కడుపునిండా అన్నం పెట్టిన ధాన్యాగారం.. నియోజకవర్గంలో మామడ, లక్ష్మణ చాందా, సోన్ నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ జి మండలంలో కోన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నూతన ఓటరు జాబితా ప్రకారం 2,33,248 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మున్నూర్ కాపు, ముస్లిం, ముదిరాజ్, పద్మశాలి, గంగపుత్రుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ నియోజకవర్గం నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అప్పటి టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రయ్యారు ఇంద్రకరణ్. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో 79,985 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించి. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. 9,271 ఓట్ల మెజారిటీతో మంత్రి విజయం సాధించారు. క్యాబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు. రెండోసారి మంత్రిగా అభివృద్ధిలో నిర్మల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. నిర్మల్ పట్టణం సుందరీకరణ చేశారు. కాలనిలకు రోడ్లు నిర్మించారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం, మెడికల్ కళాశాల వంటివి సాధించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా కల్పించారు. అదే విధంగా నిర్మల్ ఆసుపత్రిని వంద పడకల అసుపత్రిగా మార్చారు. ఈ ప్రగతితో నిర్మల్ రూపురేఖలు మార్చారని పేరుంది. వీటితో పాటు అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దశ తిగిన దిశ మారని నిర్మల్ అభివృద్ధితో నిర్మల్ దశ మారిన దిశ మారలేదు. వందల ఎళ్లుగా నీళ్లను అందించే చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఆ కబ్జాలతో చెరువులు కనిపించకుండా పోతున్నాయి. వర్షకాలంలో చెరువులలో వెళ్లాల్సిన వరదనీరు రోడ్లపైకి వస్తోంది. కాల్వలను మరిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలలో ఇండ్ల పైకప్పులను ముంచుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడవల్లో ప్రజలు భయటకు వస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ మున్సిపల్లో నాలగో తరగతి ఉద్యోగులనియమాకం వివాదస్పందంగా మారింది. ఉద్యోగాలన్ని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ బంధువులకు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధుల బంధువులకు దక్కాయి. అక్రమంగా ఉద్యోగాల నియమాకాలపై తీవ్రమైన దుమారం రేగింది. సంతలో సరుకులా మున్సిపల్ ఉద్యోగాలు అమ్ముకున్నారని ప్రజలు పార్టీల అధ్వర్యంలో ఉద్యమించారు. ఈ అక్రమం ఉద్యోగాల నియమాకాలపై అర్డిఓ చేత విచారణ జరిపించారు. ఆవిచారణలో ఉద్యోగాలు అక్రమంగా నియమాకాలు చేశారని తెలింది. ఆ ఉద్యోగాలు రద్దు చేయాలని అర్డీఓ సిఫార్స్ చేశారు. మంత్రి కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇది మంత్రికి మచ్చగా మారింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరెట్ నిర్మాణం వివాదంగా మారుతోంది. చెరువులో ఎస్ఎటీఎల్ లేవల్ నిర్మాణం ఒక వివాదమైతే. దీనికి తోడు మంత్రి, బంధువులకు భూములు ఉన్నచోట కలెక్టరెట్ నిర్మాణం చేశారని ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయి. ఉద్యోగాల మచ్చ తోలగక ముందే పట్టణంలో మాస్టర్ ప్లాన్ మంత్రికి దడపుట్టిస్తోంది. తమ భూములు కోల్లగోట్టేందుకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపోందించారని రైతులు అందోళన కోనసాగిస్తున్నారు. భూములకు నష్టం కలిగించమని మంత్రి భరోసా ఇచ్చిన ఇంకా ప్రజలు నమ్మడం లేదట. అవినీతికి అడ్డాగా మంత్రి..! వీటితో పాటు డీ1 పట్టాలు మంత్రి బంధువులు అక్రమంగా పోందారని కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే దళితుల సంక్షేమం అమలు చేస్తున్నా ఈ దళితబంధు పథకం మంత్రికి అడ్డంగా తిరిగింది. నర్సాపూర్ జిలో దళిత బంధు గురించి మంత్రిని ప్రశ్నించిన మహిళపై కేసు నమోదైంది. అది దళిత వర్గాలపై వ్యతిరేకతను పెంచింది. నియోజకవర్గంలో సాగునీరు అందించే ప్రాణహిత, చేవేళ్ల 27 ప్యాకేజీ పనులు అంగులం కదలడం లేదు. అభివృద్ధి పనులు పురోగతి లేకున్నా పార్టీలో అసంతృప్తి మంత్రికి తలనోప్పిగా మారిందట. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభ సత్యనారాయణ భర్త సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ కీలక నాయకుడు శ్రీహరి మంత్రి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మంత్రి తీరుతో విసిగిపోయిన శ్రీహరి మంత్రిపై తిరుగుబాటు చేశారు. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా మంత్రి సన్నిహితుడు సారంగపూర్ జడ్పీటీసీ మంత్రితో విబేధాల కారణంగా పార్టీ వీడారు. కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి గెలుపు కోసం పనిచేసిన శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండుసార్లు అత్యల్ప ఓట్లతో ఓటమి పాలైనా ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వ్యూహలు రచిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. మంత్రి వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలలో ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రిపై వ్యతిరేకత.. కాంగ్రెస్, బీజేపీలకు ప్లస్? అదేవిధంగా అవినీతి మంత్రిని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. వరదలకు మంత్రి కబ్జాలే కారణమని ఆరోపిస్తున్నారట. ఈ సందర్భంగా ఎలేటి మహేశ్వర్‌రెడ్డి ఎన్నికలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ ఓటర్ల మద్దతు కూడ గడుతున్నారు. ఎలేటికి ప్రజల్లో మద్దతు లభిస్తున్న ఎన్నికల వరకు మద్దతు ఉపయోగించుకోవడం లేదని పేరుంది. ఈసారి చివరి వరకు పట్టు నిలుపుకోని విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం ఉంది. చుట్టం చూపులా హైదారాబాద్ నుండి వచ్చి పోతున్నారని భావన. ఈ భావన తోలగించుకోకుంటే ప్రతికూలంగా మారుతుందని కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేయడంలో వెనుకబడ్డారని సోంత పార్టీలో ఉంది. మంత్రిపై వ్యతిరేకత ఉన్నా అనుకూలంగా మలుచుకోకపోతే గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావుతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈసారి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికలలో గెలిచి తీరాలనే కసితో ప్రజల్లోకి వెళ్లుతున్నారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు 2009, 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీహరి రావు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో శ్రీహరి రావుకు భారీగా ఓట్లు లభించాయి. విజయ అంచుల వరకు హరి కేవలం ఎనిమిది వేల ఓట్లతో శ్రీహరి రావు ఇంద్రకరణ్‌రెడ్డిపై ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలలో శ్రీహరి రావు మంత్రి బీఅర్ఎస్లో చేరడంతో టికెట్ దక్కలేదట. కానీ బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడంతో బీఆర్ఎస్లో ఉన్న శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి మంత్రికి వ్యతిరేకంగా తనకు మద్దతు కూడగడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 2014 ఎన్నికలలో ఓటమికి ఈ ఎన్నికలలో కసి తీర్చుకోవాలని భావిస్తున్నారట. మంత్రిపై ఉన్న వ్యతిరేకత తనకు గెలుపు ఖాయమని భావిస్తున్నారట శ్రీహరి. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ప్రజలు పట్టం కడుతారో చూడాలి.