సాక్షి, నిర్మల్: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్‌లో కాంగ్రెస్ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.
కాంగ్రెస్ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్‌లను తొలగించడమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment