సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లిఖిత మరణం ప్రమాదమే: వీసీ
నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు.
నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు
బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి
ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment