venkata narayana
-
తల్లి త్యాగాలను వెలకట్టలేం
సాక్షి, అమరావతి: పురుషులు కన్నా మహిళలు మానసికంగా దృఢవంతులని, తన బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకు తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసి వెంకట నారాయణ భట్టీ అన్నారు. తల్లి త్యాగాలను వేటితోనూ వెలకట్టలేమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా శనివారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులను, మహిళా సీనియర్ న్యాయవాదులను సన్మానించింది. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ భట్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కలిసి హైకోర్టు మహిళా న్యాయమూర్తులయిన జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, ఉపలోకాయుక్త పి.రజనీరెడ్డి, సీనియర్ న్యాయవాదులు కేఎన్ విజయలక్ష్మి, ప్రేమలత, అచ్చెమ్మలను జస్టిస్ భట్టీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం జస్టిస్ భట్టీ, ఆయన సతీమణి అనుపమలను హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య, ఇతర న్యాయవాదులు గజమాలతో, శాలువాలతో వేదమంత్రోచ్చరణ మధ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. అలాగే హైకోర్టు ఉద్యోగుల సంఘం, న్యాయవాద పరిషత్ తదితర సంఘాలు కూడా జస్టిస్ భట్టీని సన్మానించాయి. మదనపల్లి మాణిక్యం.. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, జస్టిస్ భట్టీని ‘మదనపల్లి మాణిక్యం’గా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి పాత్ర కీలకంగా మారిందన్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్ గతంలో అసాంఘిక శక్తులకు చిరునామాగా ఉండేదని, ఆ స్టేషన్ బాధ్యతలను మహిళలకు అప్పగించిన తరువాత దేశంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా మారిందన్నారు. మహిళా శక్తికి ఇదో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, మహిళా న్యాయవాదుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి, అధ్యక్షురాలు కె.అరుణ, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు. సమర్థత వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థత, కష్టపడేతత్వం వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలిగారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని రూపుమాపేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరమన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు అధికరణలున్నాయని, అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులిస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర ఈ సందర్భంగా జస్టిస్ భట్టీ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి, సోదరి, భార్యే కారణమన్నారు. తన తల్లి ఇచ్చిన ధైర్యం, తన సోదరి ఇచ్చిన సలహాలు, తన సతీమణి ఇచ్చిన మద్దతు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యానని చెప్పారు. ఏపీ హైకోర్టుకు సదా రుణపడి ఉంటానని, ఎల్లవేళలా ఈ హైకోర్టుకు అండగా ఉంటానని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను మానవ అక్రమ రవాణా ఉచ్చులో దించుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మహిళా న్యాయవాదుల సమాఖ్య, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థలను కోరారు. ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మరణం ప్రమాదమే: వీసీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు. నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
నవ వధువుది ఆత్మహత్యే..
ఖలీల్‌వాడి: ఈ నెల 2న నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని సుధా హైట్స్ అపార్ట్మెంట్ పైనుంచి పడి చనిపోయిన పూర్ణిమ (26)ది ఆత్మహత్యే నని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వివరాలివి.. రెండు నెలల క్రితం హమాల్వాడికి చెందిన పూర్ణిమకు, విశాల్‌తో వివాహం జరిగింది. పూర్ణిమ ఐటీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటోంది. భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లయిన రెండు నెలల్లోపే.. పూర్ణిమ నివసిస్తున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైనుంచి పడి చనిపోవడంపై.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో పూర్ణిమను భర్త విశాల్ వేధించేవాడని వెల్లడైంది. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల వారిని విచారించాక ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించి.. భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఈ పొట్టేలు నాన్ వెజిటేరియన్ గురూ!
ప్రకాశం : ఆకులు అలములు, పచ్చిక తిని కడుపు నింపుకొని, చెరువులు, కుంటల్లో నీరు తాగే శాకాహార పొట్టేళ్లను చూసి ఉంటాం. మాంసం తిని, మద్యం సేవించే మాంసాహార పొట్టేళ్లున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన పువ్వాడ వెంకటనారాయణకు చెందిన ఐదు నెలల వయసున్న పొట్టేలు పచ్చగడ్డికి బదులు మాంసం ముక్కలు ఆరగిస్తోంది. ప్రతి ఆదివారం కేజీ మాంసం, బాటిల్ మందు తీసుకుంటోంది. యజమాని మద్యాన్ని కూల్‌డ్రింక్ సీసాలో పోసి, దానికో పాలపీక ఏర్పాటు చేసి పట్టిస్తుంటే చప్పరించేస్తోంది. నెల రోజులుగా మాంసం, మద్యం లాగించేస్తున్న ఈ పొట్టేలును చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. - పంగులూరు -
భర్తే హత్య చేశాడు..
{పమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం పోలీసు విచారణలో నేరం అంగీకారం నిందితుడి అరెస్టు జగ్గయ్యపేట : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కేసులో భర్త గిడుగు వెంకట నారాయణను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు బుధవారం తెలిపారు. వివరాలు.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణితో 45 రోజుల క్రితం వివాహమైంది. నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామానికి బంధువుల ఇంటి ఈ నెల 8న వెళ్లారు. తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైందని వెంకట నారాయణ భార్య రాణిని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. అయితే ప్రభుత్వ వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు. దర్యాప్తులో భాగంగా భర్త వెంకట నారాయణ జాతీయ రహదారిపై ఫుడ్‌ప్లాజా వద్ద ఉన్నట్లు సమాచారం రావటంతో సిబ్బంది వెళ్లి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అతనిని విచారించగా నిత్యం తన భార్య అనుమానిస్తుండేదని దీంతో తరచు గోడవ పడేదని ఈ క్రమంలోనే బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులోని పొలాల్లోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు నేరం అంగీకరించినట్లు చెప్పారు. పైగా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా నారాయణ ప్రయత్నించాడన్నారు. అరెస్ట్ చేసిన నారాయణను పేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
ఉప ఎన్నికల్లో పోటీకి అప్పుకావాలట!
ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడని వరంగల్ ఉప ఎన్నికలో అప్పుడే చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక బరిలో దిగుతానని, అందుకుగానూ తనకు రుణం మంజూరు చేయాలని ఓ వ్యక్తి బ్యాంక్‌ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. 'జన సంక్షేమ సంఘం' అనే సంస్థకు అధ్యక్షుడైన వెంకటనారాయణ పాతికేళ్ల యువకుడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. తన సంస్థ తరఫునే వరంగల్ ఉప ఎన్నికలో పోటీచేయాలనుకున్నాడు. అయితే డిపాజిట్ చెల్లింపులు, ప్రచార ఖర్చులు తదితర అవసరాలకు సరిపడా డబ్బులు లేవట! దీంతో శుక్రవారం నల్లకుంటలోని కెనరా బ్యాంక్ కు వెళ్లి రుణం మంజూరు చేయండంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, రాజకీయ చైతన్యం మెండుగా ఉందని పేర్కొన్న వెంకటనారాయణ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. మరి బ్యాంక్ అధికారులు రుణం ఇస్తానన్నారా? అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు! అటు బ్యాంక్ అధికారులు కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకురాలేదు! -
విద్యుత్ చౌర్యంపై నిఘా
ఖమ్మం: వీధిలైట్లు, ఆర్డబ్ల్యూఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయని, ఆయా శాఖల అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ ఎలా కొనగలమని ట్రాన్స్‌కో సీఎండీ వెంకటనారాయణ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, హాస్టళ్లు వంటి అత్యవసర శాఖలు మినహా ఇతర శాఖలేవైనా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా, బిల్లుల వసూళ్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితర అంశాలపై జిల్లా విద్యుత్ అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాకు సరఫరా అవుతున్న విద్యుత్‌కు, అధికారికంగా విద్యుత్ వినియోగానికి మధ్య వ్యత్యాసం ఉంటోందని, అంటే విద్యుత్ చౌర్యం జరగుతున్నట్టేనని, దీనిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. 50 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి కూడా బిల్లులు వసూలు చేయాలన్నారు. పాత మీటర్లు తొలిగించి కొత్తవి అమర్చాలని చెప్పారు. ఒక్కో ఏఈ రెండు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల్లో చెట్లు నరికించడం, ట్రాన్ ్సఫార్మర్ల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు చెల్లించే సర్వీస్ చార్జీ తక్కువేనని, వీటినైనా సకాలంలో చెల్లించేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో తరచూ ట్రాన్స్ఫార్మర్ల సమస్య ఏర్పడుతోందని, దీనిని నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌ఏపీడీఆర్‌పీ పనులు సంవత్సరాల తరబడి పెడింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల కొరత ఉన్న విషయం వాస్తవమేనని, అవసరమైన చోట సిబ్బందిని నియమించేందుకు ప్రపోజల్స్ తయారు చేసి పంపాలని అన్నారు. జిల్లా ఎస్ఈ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 2750 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని, ఇతర ప్రమాదకరమైన లైన్లను గుర్తించి వాటిని మరమ్మతు చేశామని చెప్పారు. ప్రతి నెల జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పని విధానం పరిశీలించి అవసరమైన సూచనలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ డెరైక్టర్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్రావు, డీఈలు ధన్సింగ్, సురేందర్, నాగప్రసాద్, బాబురావు, సుదర్శన్, ప్రతాప్‌రెడ్డి, రవి, ఏడీలు బాలాజీ, సుస్మిత, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. కరెంటు కష్టాలు వినరూ..
ఖమ్మం: జిల్లాలో ట్రాన్స్‌కో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటాను సరఫరా చేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుం దో... ఎప్పుడు పోతుందో తెలవని దుస్థితి నెల కొంది. ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, ఇతర విద్యుత్ వస్తువుల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఏ వస్తువు ఎటు పోతుందోననే తెలుసుకునే నిఘా లేకుండా పోయింది. కరెంటు లైన్ల మరమ్మతు కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా ఏళ్ల తరబడి పనులు సాగుతూనే ఉన్నాయి. దీనికితోడు ట్రాన్స్‌కో అధికారులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు,పెద్ద ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ.. చిరు ఉద్యోగులపై వేటువేస్తూ పిచ్చుకపై బ్ర హ్మాస్త్రాలు సంధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతనంగా నియమితులై జిల్లాకు వ స్తున్న ఎన్పీడీసీఎల్ వరంగల్ డివిజన్ సీఎండీ వెంకటనారాయణ ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి మెరుగైన సేవలను అందించేలా చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా.. జిల్లాలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రానికి 6 గంటలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ సెంట ర్లకు 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ప్రకటించిన అధికారులు అందుకు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి సైతం సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లాలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పో తుందో తెలియని దుస్థితి నెలకొంది. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి అధికారులు ప్రకటించిన విధంగానైనా విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం... ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిం దనే విమర్శలు వస్తున్నాయి. పై స్థాయి అధికారులు చేసిన తప్పులను కిందిస్థాయి అధికారులపై నెడుతూ వారిని బలితీసుకుంటున్నారని విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులు పలువు రు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఒక కేంద్రంలో త ప్పు జరిగితే దాని పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులకు వంతపాడి అమాయకులను బలి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఏళ్లు గడిచినా పూర్తి కాని పనులు జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం, పురాతన లైన్ల పునరుద్ధరణ మొదలైన పనుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్‌డబ్ల్యూఈ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చినా సదరు కాంట్రాక్టర్లపై చర్య తీసుకోలేదు. జిల్లాలోని పట్టణాల్లో ఉన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, అవసరమైనచోట నూతన లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీడీఆర్పీ ద్వారా నిధులు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయలేదు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లుతోంది. ఈ పనులను వేగవంతం చేయమని చెప్పే నాధుడే లేడని పలువురు అంటున్నారు. లోపించిన నిఘా.. అధికారుల ఇష్టారాజ్యం ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ ఇతర వస్తువుల సరఫరా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆరా తీయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రచారం సాగుతోంది. పైరవీ, పలుకుబడి ఉన్న ప్రాంతాలకు అధిక మొత్తంలో వస్తువులు సరఫరా చేస్తున్నారని, గిరిజనుల పేరున గిరిజనేతరులు ట్రాన్స్ఫార్మర్లు తీసుకుంటున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనికితోడు రైతులు, ఇతర పారిశ్రామిక వేత్తలు తమ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఇతర విద్యుత్ పోల్స్, లైన్ల నిర్మాణానికి సంబంధించిన వస్తువులను సొంత ఖర్చులతో కొనుగోలు చేసినా వాటిని కాంట్రాక్టర్లే కొనుగోలు చేశారని బిల్లులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై సీఎం డీ నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. -
కేసీఆర్‌పై గరం... గరం..
రుణ మాఫీపై మాట తప్పారంటూ అన్నదాతల ఆగ్రహావేశం పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం, ధర్నాలు రుణ మాఫీకి పరిమితులు విధిస్తూ బ్యాంకర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై అన్నదాతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. రైతులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల శనివారం కేసీఆర్ దిష్టిబొమ్మలను రైతులు దహనం చేశారు. ధర్నా నిర్వహించారు. రుణ మాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రఘునాధపాలెం, న్యూస్‌లైన్: రుణ మాఫీ అమలుకు షరతులు విధించడానిన నిరసిస్తూ రఘునాధపాలెం మండలంలోని పాపటపల్లి గ్రామ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నిటినీ బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగణ, టీడీపీ నాయకులు వెంకటనారాయణ, మల్లిఖార్జునరావు, రామచంద్రు, కొండయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మణుగూరులో.. మణుగూరు రూరల్: మణుగూరులోని అంబేద్కర్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. రుణ హామీని బేషరతుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బచ్చల భారతి, పార్టీ నాయకులు పాయం నర్సింహారావు, ముత్యంబాబు, వల్లభనేని రమణ, కొమరం పాపారావు, బాబు జానీ, విజయలక్ష్మి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గార్లలో... గార్ల: లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న డిమాండుతో సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో గార్లలోని ఎస్బీహెచ్ ఎదుట రైతులు గంటపాటు ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కోనేటి సుశీల, సీపీఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాసరావు, రైతులు కె.మహేశ్వరరావు, ఇమ్మడి గోవింద్, ఈశ్వర్‌లింగం, గిరిప్రసాద్, పోటు వీరభద్రం, ఆనంద్, లింగారెడ్డి, లక్ష్మి, కవిత, సుజాత, రమ, తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలో... బయ్యారం: రైతుల రుణ హామీ మాఫీ చేయాలని కోరుతూ తహశీల్దార్ భిక్షంకు సీపీఎం నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మండా రాజన్న, నంబూరి మధు, మేర్గు వెంకన్న, బల్లెం ఆనందరావు, కత్తి సత్యం, ప్రసాదరావు పాల్గొన్నారు. కామేపల్లిలో... కామేపల్లి: లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం, తహశీల్దారుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాదావత్ శ్రీను, నాయకులు వింజం నాగభూషణం, ఉప్పతల వెంకన్న, గుండా వెంకటరెడ్డి, అంబటి శ్రీనివాసరెడ్డి, ఎల్.రాంసింగ్, మేడ నాగేశ్వరరావు, అనంతరాములు, మేదర లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో... ఇల్లెందు: పంట రుణాలన్నిటినీ ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలన్న డిమాండుతో రైతు సంఘం (సీపీఎం అనుబంధం) ఆధ్వర్యంలో తహాశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. తహాశీల్దారుకు నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దేవులపల్లి యాకయ్య, ఎస్ఎ.నబీ, ఆలేటి కిరణ్, సర్వయ్య, వెంకన్న, రాందాస్, లక్ష్మయ్య, పాపారావు, సూర్య, సాయిలు, నారాయణ, భిక్షం తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురంలో... అశ్వాపురం: అశ్వాపురంలోని ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను టీడీపీ, బీజేపీ నాయకులు శనివారం దహనం చేశారు. ముందుగా, తె లుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి స్టేట్ బ్యాంక్ మీదుగా గౌతమి నగర్ కాలనీ గేటు వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం, తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహశీల్దారుకు వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు టి.లత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముస్కు శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, నాయకులు వాసిరెడ్డి రమేష్‌బాబు, తుళ్ళూరి ప్రకాశ్, ఆదినారాయణ, రామకృష్ణ, కె.సత్యం, సత్యనారాయణ, ఏనుగు కృష్ణారెడ్డి, షరీఫ్, కర్నాటి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
హింసించి కాన్పుచేశారు
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళను వైద్యసిబ్బంది హింసించి ప్రసవం చేయించారని, దీనికారణంగానే పురిటిబిడ్డ మృతిచెందిందని బంధువులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు బి.కొత్తకోటలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. బాధితుల కథనం మేరకు బి.కొత్తకోట మండలంలోని దిన్నిమీదపల్లెకు చెందిన గర్భవతి జీ.సిద్దమ్మ (25)కు మంగళవారం తెల్లవారుజామున పురిటినొప్పులొచ్చారుు. భర్త వెంకటనారాయణ 108కు ఫోన్‌చేశాడు. అది రాగానే ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాలని కోరారు. దగ్గరలో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రి ఉండటం, సిద్దమ్మకు మూడో కాన్పు కావడంతో బి.కొత్తకోటకే తరలించారు. నర్సులు వరలక్ష్మి, జ్యోత్స్న పరీక్షించారు. కాన్పు ఇబ్బందికరమైతే మదనపల్లెకు పంపాలని వారిని వెంకటనారాయణ కోరాడు. నర్సులు అవసరంలేదంటూ కాన్పు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో నర్సులు తీవ్రంగా హింసించారని బాలింత సిద్దమ్మ విలపించింది. చెంపలపై కొట్టారని, కడుపుపై చేతులుపెట్టి గట్టిగా నొక్కారని చెప్పింది. చెంపలపై కొట్టిన దెబ్బలకు చె వి, ముక్కులోంచి రక్తం కారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రసవం జరగ్గా మరణించిన మగశిశువును అప్పగించారని భర్త వెంకటనారాయణ పేర్కొన్నాడు. ప్రసవం ఇబ్బంది అయితే మదనపల్లెకు రెఫర్ చేయాలని కోరినా పట్టించుకోకుండా ఇలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యంపై నిలదీశారు. దీనిపై వైద్యాధికారిణి గంగాదేవి మాట్లాడుతూ ప్రసవ సమయంలో పురిటిబిడ్డ తల బయటకు రాకుండా ఇరుక్కుపోవడంవల్లే ప్రాణం పోయిందని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పారు. నిరసనగా రాస్తారోకో పురిటిబిడ్డ మరణంపై బాధిత కుటుంబీకులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ప్రసవం కోసం వస్తే పురిటిబిడ్డ ప్రాణాలు తీశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి దశరధరామయ్య ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక తహశీల్దార్ శివయ్య బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మనోహర్‌రెడ్డి, మహమ్మద్‌ఖాసీం, అషఫ్రల్లీ, రఘునాథ్, చిన్నరెడ్డెప్ప, సలీంబాషా పాల్గొన్నారు. నర్సుల నిర్లక్ష్యమని తేలితే చర్య పురిటిబిడ్డ మరణం విషయంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని జిల్లా అదనపు వైద్యాధికారి, జిల్లా ప్రాజెక్టు అధికారి మునిరత్నం చెప్పారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు మంగళవారం సాయంత్రం ఆయన విచారణ చేపట్టారు. ఆయన వెంట మదనపల్లె, తంబళ్లపల్లె క్లస్టర్ అధికారులు లక్ష్మీనరసింహులు, వెంకటస్వామి, స్థానిక వైద్యాధికారిణి గంగాదేవి ఉన్నారు. బాధితురాలు ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ప్రవసం అయ్యే దాకా వైద్యపరంగా తీసుకున్న చర్యలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి సంబంధిత నివేది కను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అప్పగిస్తామని మునిరత్నం చెప్పారు.