basara III T
-
బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల..
మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్సైట్లో, ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్) ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.గ్రామీణ విద్యార్థులకు వరం..గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్‌ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.వేల సంఖ్యలో దరఖాస్తులు..బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.సమీకృత విద్యావిధానం..ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్‌తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్‌టాప్, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.ఏటా భారీగా దరఖాస్తులు..బాసర ట్రిపుల్‌ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ప్రవీణ్ కుమార్‌ను నాగర్‌కర్నూల్‌కు చెందిన విద్యార్ధిగా గుర్తించారు. బాసర ట్రిపుల్ ఐటీలో గతంలోనూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. -
బాసర IIIT ఘటన పై గవర్నర్ తమిళ సై ఆవేదన..!
-
లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో విద్యార్థిని ప్రాణాలు కోల్పోతున్నారు . మొన్న దీపిక అత్మహత్య చేసుకోగా నేడు మరో విద్యార్థి లిఖిత బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. అయితే విద్యార్థినిది అత్మహత్య అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా..ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఖిత మరణం ప్రమాదమే: వీసీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని తెలిపారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదమని తెలిపారు. యూట్యూబ్ చూస్తూ లిఖిత కింద పడిపోయిందన్నారు. అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని తెలిపారు. నిర్మల్ ఆసుపత్రికి లిఖిత తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబితా ఇంద్రెడ్డి .వీసీ వెంకటరమణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా లిఖిత మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై తీవ్రంగా విలపిస్తున్నారు. కూతురు మరణంపై కనీసం సమాచారం ఇవ్వలేదని అందోళన వ్యక్తం చేస్తున్నారు.లిఖిత ఎందుకు చనిపోయిదో కారణం చెప్పడంలేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అంతకుముందు అసుపత్రికి వచ్చిన వీసి వెంకటరమణను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చదవండి: పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయం హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి అయితే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లిఖిత అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వెళ్లిన తమ కూతురు.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
-
మీపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు: కేటీఆర్
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన వాళ్లను నిలదీశారు. శనివారం ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ అక్కడి పరిస్థితులు దృష్టికి రావడంతో మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలం అయ్యారు. తరచుగా ఫుడ్ పాయిజన్ జరగుతున్నా.. మెస్ కాంట్రాక్టర్‌ను మార్చకపోవడంపై ఆయన వీసీ వెంకటరమణపై అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్‌ను ఇంకా ఎందుకు మార్చలేదని.. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారాయన. బాసర ట్రిపుల్ స్నాతకోత్సవంలో భాగంగా మంత్రులు సబితా, ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు బాల్కా సుమన్ ట్రిపుల్ ఐటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ల్యాప్ ట్యాప్, బూట్లు, డెస్క్ ట్యాప్లులు పంపిణి చేశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడానికి సర్కారు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీలో తరచూ విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో కాంట్రాక్టర్‌ను మార్చేసి.. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలంటూ విద్యాశాఖ గతంలో అధికారులను ఆదేశించింది. -
బాసర ట్రిపుల్ ఐటీ రెండో జాబితా విడుదల
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో జాబితాను ఆదివారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొదటి విడతలో 1,404 మంది విద్యార్థుల జాబితాలో గైర్హాజరైన 125 మందికి సంబంధించిన సీట్ల జాబితాను కళాశాల వెబ్సైట్లో పొందుపర్చారు. ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు రాష్ట్రేతర (గ్లోబల్ సీట్లు), దివ్యాంగులకు కేటాయించిన సీట్లతో పాటు స్పోర్ట్స్, కాప్ కేటగిరీకి చెందిన 95 సీట్లకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. 125 సీట్లకు సంబంధించి 7న, మిగిలిన కేటగిరీలకు సంబంధించిన 95 సీట్లకు ఈనెల 12 నుంచి 14 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మొదటి విడతలో 1,279 మంది విద్యార్థులు ప్రవేశం పొందార -
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. విషయం బయటకు పొక్కకుండా
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి తాగుతూ విద్యార్థులు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. కళాశాలలోని బాయ్స్ హాస్టల్–1లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా, శనివారం బాసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ట్రిపుల్ ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో విద్యార్థి తమ హాస్టల్ రూమ్‌లో శుక్రవారం గంజాయి తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ముధోల్ సీఐ వినోద్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థుల నుంచి 100 గ్రాములకుపైగా గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఎలా వచ్చింది? స్థానికంగా కళాశాలలో డీఎస్పీ, సీఐతోపాటు 200 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఇంత భద్రత నడుమ కళాశాలలోకి గంజాయి ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెలవులపై ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమతోపాటుగా గంజాయిని తెచ్చుకున్నారా? లేక స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సరఫరా చేస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ గదిలో విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది వారి రూమ్‌ను తనిఖీ చేశారు. గంజాయి తాగుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత విషయం బయటకు రాకుండా జాగ్రత్త వహించారు. తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్‌ఫోన్ కూడా అనుమతించకుండా గోప్యత వహించారు. కానీ చివరకు విషయం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు -
తీవ్ర ఉత్కంఠ మధ్య బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన..
సాక్షి, నిర్మల్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర పర్యటన ముగిసింది. బాసర ట్రిపుల్ విద్యార్థులు, అధికారులతో గవర్నర్ ముఖాముఖి సమావేశమై చర్చించారు. ట్రిపుల్ ఐటీలో హాస్టల్, మెస్, ల్యాబ్, లైబ్రరీని ఆమె పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో ప్రత్యక్షంగా పరిశీలిస్తూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తమ బాధలను గవర్నర్‌కు వివరించారు. రెగ్యులర్ వీసీ, అధ్యాపకుల నియమాకం, ల్యాబ్, హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్ధులు విన్నపించారు. మెస్ టెంబర్లు రద్దు చేయాలని, ఫుడ్‌పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో బాధపడుతున్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. మెస్ నిర్వహణపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. సానుకూల ధృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని కోరారు. చదవండి: Friendship Day: మైత్రి.. ఓ మాధుర్యం.. అండగా ఉంటూ, ఆదర్శంగా నిలుస్తూ.. అంతకుముందు చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. గతకొంతకాలంగా గవర్నర్ ఎక్కడ పర్యటించినా ఉన్నతాధికారులు దూరంగా ఉంటున్నారు. తాజాగా గవర్నర్ నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ డుమ్మా కొట్టారు. సెలవుల్లో ఉండటం కారణంగా గైర్హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్, డీఎస్పీ జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బాసర విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తీవ్రమైన ఉత్కంఠ మద్య బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన కొనసాగింది. -
గవర్నర్.. గాడిన పెడతారా?
నిర్మల్: ఒకటి, రెండు కాదు.. ఒకదాని వెనుకొకటి.. వరుసగా సమస్యలు బాసర ట్రిపుల్‌ఐటీని పీడిస్తున్నాయి. విద్యాక్షేత్రం ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. తమ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ జూన్ 14 నుంచి 21 వరకు ఎండనక, వాననక ఉద్యమించారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి నెలరోజుల్లో సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలు కావొస్తున్నా అవి పరిష్కారం కాకపోగా, అదనంగా ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ నెల 3న ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ‘ఒక్కసారి వర్సిటీకి వచ్చి చూడండి మేడమ్’అంటూ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదివారం ట్రిపుల్ ఐటీకి వస్తున్నట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆర్జీయూకేటీకి అనుకున్నస్థాయిలో నిధులు రాకపోవడంతోపాటు న్యాక్ నుంచి ‘సీ’గ్రేడ్ రావడంతో విద్యార్థులు నిరాశపడ్డారు. వీటికి తోడు పురుగులన్నం, కప్పల కూరలు, టిఫిన్లలో బల్లులు, బొద్దింకలు రావడం విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించాయి. జూలై 15న ఫుడ్ పాయిజన్ జరిగి 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ చాలామంది కోలుకోలేదు. ట్రిపుల్ ఐటీ నుంచే వర్సిటీల సందర్శన రాజ్‌భవన్‌లో ఈ నెల 3న పలు యూనివర్సిటీల విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సమావేశమ య్యారు. వర్సిటీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ట్రిపుల్ఐటీ నుంచే యూనివర్సిటీల సందర్శన ప్రారంభిస్తున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ►శనివారం రాత్రి 11.40కి హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, నిజామాబాద్ చేరుకుంటారు. ►నిజామాబాద్ నుంచి ఆదివారం వేకువ జామున 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుంటారు. ►ట్రిపుల్ ఐటీ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►ఉదయం 6.20 గంటలకు బాసర జ్ఞానసరస్వతీమాతను దర్శించుకుంటారు. ►ఉదయం 7 గంటలకు తిరిగి ట్రిపుల్ ఐటీ చేరుకుని, విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ►ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థులు, స్టాఫ్‌తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఉదయం 10 గంటలకు ట్రిపుల్ ఐటీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు. రెక్టర్ హోదాలో.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్న ర్ చాన్స్‌లర్ హోదాలో ఉంటారు. కానీ, ప్రత్యేక చట్టం కలిగిన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)కు మా త్రం ఈ హోదా వర్తించదు. గవర్నర్‌కు చీఫ్ రెక్టర్ (చాన్స్‌లర్ తరహాలో సంప్రదాయ పరిపాలనా ధికారి) హోదా మాత్రమే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలన్నింటికీ కలిపి ప్రత్యేకంగా చాన్స్‌లర్ ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్పటి నుంచి చాన్స్‌లర్‌ను నియమించలేదు. ఇటీవల వరుస ఘటనల నేపథ్యంలో గతనెలలో రాహుల్ బొజ్జాను మార్చి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటర మణకు బాధ్యతలు అప్పగించినా సమస్యలపర్వం కొనసాగుతూనే ఉంది. -
చదువు కోసం వస్తే విషపుకూడు పెడతారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న భోజనం విద్యార్ధుల ప్రాణాలమీదికి తెస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చెందారు. పేదవిద్యార్ధులకు కనీసం పట్టెడన్నం పెట్టడం కూడా బరువేనా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నావ్ కదా’ అని షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొన్న బాసర ట్రిపుల్ ఐటీలో వందలమంది, నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది, ఇవాళ సిద్దిపేట సాంఘిక సంక్షేమ వసతిగృహంలో 22 మంది విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా హాస్టల్ మొదలు గ్రామాల్లో ఉన్న గురుకుల వసతిగృహాల వరకు ఎక్కడ చూసినా పురుగుల అన్నం, ముక్కపట్టిన బియ్యాన్నే విద్యార్థులకు వడ్డిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కూరల్లో వానపాములు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయన్నారు. సర్కారు భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కేసీఆర్ దొర మాత్రం కండ్లు తెరవలేదని ధ్వజమెత్తారు. -
ట్రిపుల్ ఐటీలో డిన్నర్ బాయ్‌కాట్
నిర్మల్/బాసర: ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజులు దాటినా.. మెస్ కాంట్రాక్టర్లను మార్చలేదని, ఆరోజు తమకు అధికారులిచ్చిన హామీలు నెరవేర్చలేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. మెస్‌లలో ఖాళీ బెంచీలపై కూర్చుని డిన్నర్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ఈ–1, ఈ–2కు చెందిన మూడువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 15న ట్రిపుల్‌ఐటీలో ఫుడ్‌పాయిజన్ జరిగింది. మెస్‌లలో నాసిరకం, నాణ్యతలేనివి ఉపయోగించడం వల్లే ఇది జరిగిందని, తమ ప్రాణాల మీదకు వచ్చిందని అదేరోజు విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఇన్చార్జి వీసీ వెంకటరమణ ఈనెల 24నాటికి డిమాండ్లు నెరవేరుస్తామని హామీఇచ్చారు. అయితే సదరు హామీలేవీ నెరవేరకపోవడంతో శనివారం మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు రాత్రి 10 గంటల తరువాత మెస్ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీలోని 8,684 మంది విద్యార్థులకు భోజనాలు, టిఫిన్స్ అందించేందుకు ఆగస్టు 6లోపు టెండర్లు దాఖలు చేయాలని డైరెక్టర్ సతీశ్ పేరిట ఆ టెండర్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులు మాత్రం రాత్రి 11 గంటల వరకు భోజనం చేయలేదు. -
విద్యార్థుల ఆందోళన పట్టించుకోరా
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో వారంరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సమస్యలు సిల్లీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హేళనగా మాట్లాడటం విచారకరమని అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మాలాంటి వారు వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి బాసర వరకు పోలీసులను మోహరించి అరెస్టులకు పాల్పడుతున్నారు’అని పేర్కొన్నారు. మరోవైపు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ జూన్ 15న చేసిన ట్వీట్‌కు ఇప్పటివరకు అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని పారిశ్రామికవేత్తలతో ఫొటో లు దిగే కేటీఆర్‌కు విద్యార్థుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరు వల్ల ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి గ్రేడ్‌కు పడిపోయిందని పేర్కొన్నారు. న్యాక్ గ్రేడ్ ఆధారంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయని, యూజీసీ నుంచి పరిశోధనలకు నిధులు వస్తాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. హాస్టళ్లలో ఉంటూ ఆందోళన చేస్తున్న దాదాపు 8 వేల మంది విద్యార్థులకు భోజనం పెట్టబోమని హెచ్వోడీలు బెదిరింపులకు పాల్పడటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యులర్ వీసీని నియమించి, వీసీ క్యాంపస్‌లోనే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణలో భాగమే: రేవంత్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో సైన్యంలోనూ ప్రైవేటీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతోనే కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. ఇక కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు బనాయించిందని విమర్శించారు. -
Basara IIIT: బాసర ఐఐఐటీ విద్యార్థుల నిరసన గళం.. వర్షంలోనూ తగ్గేదేలే!
సాక్షి, నిర్మల్/బాసర: ‘మేమేమైనా రాజకీయ నాయకులమా? మాకు రాజకీయం చేయా ల్సిన అవసరం ఏముంది..? ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా! సమస్యలను పరిష్కరించాలని అడిగే హక్కు కూడా మాకు లేదా?’ అంటూ బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ఐటీ) విద్యార్థులు వరుసగా రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. ‘కలెక్టర్ వస్తే.. విద్యాశాఖ మంత్రి చెబితే మా సమస్యలకు శాశ్వత పరిష్కారం తీరుతుందన్న నమ్మకం పోయింది. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వర్సిటీకి రావాలి, రెగ్యులర్ వీసీని నియమించాలి, మాకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. ఇవే మా ప్రధాన డిమాండ్లు. ఇవి తీరే వరకు వెనకడుగు వేసేది లేదు’ అని స్పష్టంచేశారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలంటూ విద్యార్థులు బుధవారం ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో ఆందోళన కొనసాగించారు. ఉదయాన్నే ప్రధాన ద్వారం వద్దకు విద్యార్థులంతా చేరుకున్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దే రోజంతా బైఠాయించారు. రాత్రయినా.. వర్షం పడుతున్నా.. గొడుగులు పట్టుకుని అలాగే ఆందోళన కొనసాగించారు. బుధవారం రాత్రి వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంత్రితో మాట్లాడించినా.. నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ.. అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఆర్జీయూకేటీకి వెళ్లారు. కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితారెడ్డితో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న 12 డిమాండ్లలో రెండు, మూడు తక్షణమే పరిష్కరిస్తామని, మిగితావి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. ఇందుకు విద్యార్థులు ఒప్పుకోలేదు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వచ్చేదాకా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు. సంబంధిత వార్త: బాసర ట్రిపుల్ ఐటీ: స్పందించిన కేటీఆర్.. ఆపై చర్చలు విఫలం.. మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్ చర్చలు సఫలం..: కలెక్టర్ ఆర్జీయూకేటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ చెప్పారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బాసర పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల సందర్భంగా విద్యా ర్థులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు సరికాదన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, విద్యార్థులు గురువారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతారన్నారు. అయితే, తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేదాకా ఆందోళన ఆపేదిలేదని విద్యార్థులు తెగేసి చెప్పడం గమనార్హం. -
బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకడమిక్ బ్లాక్ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో క్లాస్‌రూమ్‌లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి 70 వరకు చైర్లు, 21 టేబుల్స్ పూర్తిగా దగ్థం అయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగతో కమ్మేసింది. కాగా షార్ట్ సర్య్కూట్‌పై అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారమందించారు. అధికారుల సమాచారంతో వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కొత్త వీసీ వచ్చేనా?
సాక్షి, భైంసా(నిర్మల్) : రాష్ట్రవ్యాప్తంగా 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్‌చాన్స్‌లర్)లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు ఆరంభించింది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి రెగ్యూలర్ వీసీ నియమిస్తారని ఇక్కడ చదివే విద్యార్థులు ఆశిస్తున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ పదవీకాలం గతనెలలో ముగిసింది. మరో ఏడు యూనివర్సిటీల్లోనూ వీసీల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త వీసీ ల నియామకంపై విద్యాశాఖ కసరత్తు ఆరంభించి ప్రభు త్వం ముందుంచింది. శాతవాహన యూనివర్సిటీతో పాటు బాసరలోని ట్రిపుల్ఐటీకి ఇప్పటి వరకు వీసీలనే నియమించలేదు. కొత్తగా వీసీల నియామకం కోసం అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఈ సమయంలో బాసరకు రెగ్యూలర్ వీసీ నియమిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ఇన్చార్జీనే.. తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ బాసర ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నారు. గత ఐదున్నరేళ్లుగా ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. శాశ్వతంగా బాసర ట్రిపుల్ఐటీకి వీసీ నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణకు బాసర ట్రిపుల్‌ఐటీలు దక్కాయి. ప్రత్యేక విద్యాలయాలు కావడంతో ప్రభు త్వం విశ్వవిద్యాలయాలకు హోదా కల్పించి విద్యాలయ ప్రగతికి పాలనాపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియమించలేదు. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేసిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీసీగా అశోక్ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీ నియాయమకంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఏళ్లుగా బాసర ట్రిపుల్ఐటీకి వీసీ నియామకం జరగకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వారు పూర్తిస్థాయి వీసీ కాకపోవడంతో పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. విద్యాలయాల నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే తన నిర్ణయాలను అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఐదేళ్లుగా ఇన్చార్జి వీసీతోనే విద్యాలయ నిర్వహణ కొనసాగుతోంది. సాధించిన కొలువులు... 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్‌ఐటీలో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువులు సాధించారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించారు. 2014లో 309 మంది విద్యార్థులు 2015లో 336 మంది, 2016లో 478 మంది, 2017లో 362 మంది, 2018లో ఇప్పటి వరకు 282 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులు వార్షికవేతనం రూ. 12లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పొందుతున్నారు. ఏటా ప్రవేశాలు... గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి విద్యావిధానం, వసతులు ప్రారంభంలో బడ్జెట్ తదితర విషయాలను పరిశీలించేందుకు 2018లో ప్రభుత్వం అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రంలో మరో మూడు చోట్ల ట్రిపుల్ ఐటీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆమె వద్ద లభించిన సూసైడ్‌నోట్ ద్వారా తెలుస్తోంది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మండపల్లి అని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది. -
సరస్వతి సాక్షిగా...
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం బాసర ఐఐఐటీలోని ఏపీ విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపకార వేతనాల చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యం వల్ల 2,000 మంది పేద విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2014లో రాష్ట్ర విభజనతో బాసర ఐఐఐటీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు ఇడుపులపాయ, నూజివీడు, బాసర ఐఐఐటీ క్యాంపస్‌ల్లో చేరుతున్నారు. బాసర క్యాంపస్‌లో దాదాపు 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 2,000 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఉపకార వేతనాలు చెల్లించాలి. ఉపకార వేతనాలు రాని విద్యార్థులు మొదటి రెండేళ్లు రూ.36,000 చొప్పున, తరువాత నాలుగేళ్లు రూ.40,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ ఐఐఐటీల్లోని తెలంగాణ విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. కానీ, బాసర ఐఐఐటీలోని తమ రాష్ట్ర విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం 2016 నుంచి ఉపకార వేతనాలు చెల్లించడం లేదు. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాలకు ఉపకార వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి సగటున రూ.1.50 లక్షల దాకా బకాయి ఉంది. దాదాపు సగం మంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. ఉపకార వేతన బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కోర్సు పూర్తయినప్పటికీ వారికి సర్టిఫికెట్లను బాసర ఐఐఐటీ అధికారులు ఇవ్వడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే సెమిస్టర్–2కు అనుమతిస్తాం ఉపకార వేతనాలను ఏపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో బాసర ఐఐఐటీ అధికారులు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేయాల ని నిర్ణయించారు. ఉపకార వేతనాలు రాని విద్యార్థులు ఒక్కొక్కరు ఏడాదికి రూ.36,000 చొప్పున రెండేళ్లకు రూ.72,000 చెల్లించాలని స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించని విద్యార్థులను సెమిస్టర్–2కు అనుమతించబోమని నోటీసు బోర్డులో పేర్కొన్నారు. దీంతో ఏపీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ప్రతినిధులు రెండు రోజులుగా అమరావతిలో సాంఘిక సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ సీఎంవో అధికారులు అనుమతించలేదు. సెమిస్టర్–2కు అనుమతించకపోతే తాము చదువుకు అర్ధంతరంగా స్వస్తి చెప్పాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల వేదన అరణ్య రోదన బాసర ఐఐఐటీలో ఏపీ విద్యార్థులు తమ ఉపకార వేతనాల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. విద్యార్థుల ప్రతినిధులు సెప్టెంబర్‌లో అమరావతికి వచ్చి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం(సీఎంవో) అధికారులను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. అయినా ఉపకార వేతనాలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. తమ క్యాంపస్‌లోని ఏపీ విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే మంజూరు చేయాలని బాసర ఐఐఐటీ డైరెక్టర్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు సెప్టెంబర్ 23న ఓ లేఖ, నవంబర్ 22న మరో లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు చెల్లుచీటీ సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కావడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014–15 సంవత్సరానికి మాత్రమే ప్రభుత్వం ఫీజులు చెల్లించింది. ఆ తర్వాత పూర్తిగా నిలిపివేసింది. ఏపీ విద్యార్థులు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకపోవడంతో చదువులు ఆగిపోతున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పటికీ విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు తెలంగాణలో చదువుకునే అర్హులైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటోంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడుస్తోంది. తెలంగాణలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు 20,000 మంది ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. సగటున ఒక్కో విద్యార్థికి రూ.30,000 చొప్పున చెల్లించాల్సి వచ్చినా ఏడాదికి రూ.60 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరు మరో గత్యంతరం లేక సొంత డబ్బులు చెల్లిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత
భైంసా: ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు ఆదివారం అస్వస్థతకు గురయ్యూరు. ఆదివారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో ఈ-3, ఈ-4 విద్యార్థులు భోజనానికి వెళ్లారు. భోజనం చేసిన కొద్దిసేపటికే సుమారు వంద మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ట్రిపుల్ఐటీలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యాధికారి సామ్రాట్ విద్యార్థులందరికీ చికిత్స అందిస్తున్నారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల పరిస్థితిని వీసీ సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు.