సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న భోజనం విద్యార్ధుల ప్రాణాలమీదికి తెస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చెందారు. పేదవిద్యార్ధులకు కనీసం పట్టెడన్నం పెట్టడం కూడా బరువేనా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నావ్ కదా’ అని షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మొన్న బాసర ట్రిపుల్ ఐటీలో వందలమంది, నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది, ఇవాళ సిద్దిపేట సాంఘిక సంక్షేమ వసతిగృహంలో 22 మంది విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా హాస్టల్ మొదలు గ్రామాల్లో ఉన్న గురుకుల వసతిగృహాల వరకు ఎక్కడ చూసినా పురుగుల అన్నం, ముక్కపట్టిన బియ్యాన్నే విద్యార్థులకు వడ్డిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కూరల్లో వానపాములు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయన్నారు. సర్కారు భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కేసీఆర్ దొర మాత్రం కండ్లు తెరవలేదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment