సాక్షి, నిర్మల్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర పర్యటన ముగిసింది. బాసర ట్రిపుల్ విద్యార్థులు, అధికారులతో గవర్నర్ ముఖాముఖి సమావేశమై చర్చించారు. ట్రిపుల్ ఐటీలో హాస్టల్, మెస్, ల్యాబ్, లైబ్రరీని ఆమె పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో ప్రత్యక్షంగా పరిశీలిస్తూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తమ బాధలను గవర్నర్‌కు వివరించారు.
రెగ్యులర్ వీసీ, అధ్యాపకుల నియమాకం, ల్యాబ్, హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్ధులు విన్నపించారు. మెస్ టెంబర్లు రద్దు చేయాలని, ఫుడ్‌పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో బాధపడుతున్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. మెస్ నిర్వహణపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. సానుకూల ధృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని కోరారు.
చదవండి: Friendship Day: మైత్రి.. ఓ మాధుర్యం.. అండగా ఉంటూ, ఆదర్శంగా నిలుస్తూ..
అంతకుముందు చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.
గతకొంతకాలంగా గవర్నర్ ఎక్కడ పర్యటించినా ఉన్నతాధికారులు దూరంగా ఉంటున్నారు. తాజాగా గవర్నర్ నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ డుమ్మా కొట్టారు. సెలవుల్లో ఉండటం కారణంగా గైర్హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్, డీఎస్పీ జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బాసర విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తీవ్రమైన ఉత్కంఠ మద్య బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment