Nirmal District
-
శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
నిర్మల్ : అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలు..భారీగా ప్రజలు (ఫొటోలు)
-
బీరు సీసాల్లో ఫంగస్
మల్లాపూర్(కోరుట్ల): ఓ బెల్ట్‌షాపులో కొనుగోలు చేసిన బీరుసీసాల్లో ఫంగస్ కనిపించింది. కొనుగోలుదారుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు మంగళవారం మెట్పల్లి వెళ్తున్నారు. మార్గమధ్యలో మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్ బెల్ట్షాప్లో బీర్లు తీసుకున్నారు. రెండు సీసాల్లో ఫంగస్ కనిపించింది. దీనిపై బెల్ట్‌షాప్ నిర్వాహకులను ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. అధికా రులు స్పందించి, నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేయాలని కలెక్టర్ ఆదేశం
-
TG: గంటల తరబడి హైవేపై రాస్తారోకో.. వాహనంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి
సాక్షి, నిర్మల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్నాటును నిలిపివేయాలని మహిళలు రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ వద్ద భారీ సంఖ్యలో మహిళలు జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దిలావర్పూర్లో నిర్మించే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మహిళలు వందల సంఖ్యలో కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు కనిపించడంలేదని ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు.. ఎనిమిది గంటల పాటు రాస్తారోకోలోనే ఉన్నారు. నిరసనలు తెలుపుతున్న సమయంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రత్న కళ్యాణి వాహనాన్ని దాదాపు మూడు గంటల పాటు అక్కడే నిలిపివేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడే రోడ్డుపైనే వారంతా వంట చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. -
ప్రశ్న.. పాఠమయ్యేదెప్పుడు?
నిర్మల్: దేశచరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు పేరుంది. జనరల్ డయ్యర్ చేసిన ఈ నరమేథాన్ని దేశం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. కారణం మన చరిత్రపుటల్లో ఈ ఘటనకు..కారకులకు..అమరులకు చోటిచ్చారు కనుక. కానీ.. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే దాదాపు 60 ఏళ్లకిందట అంతకంటే దారుణమైన మారణహోమం మనరాష్ట్రంలోనే చోటుచేసుకుంది. ఒకేసారి వెయ్యిమందిని అత్యంత కిరాతకంగా కాళ్లూచేతులు విరగ్గొట్టి, ఒకే మర్రిచెట్టుకు ఉరితీసి చంపేశారు. ఈ దారుణ మారణకాండ గురించి దేశానికి కాదు.. కనీసం ఆ జిల్లాలోనే ఇప్పటికీ చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరో దారుణమేమంటే.. అసలు ఎక్కడా.. ఏ చరిత్రపుటల్లో.. ఏ పుస్తకంలో.. ఏ పాఠంలో.. చెప్పని ఆ చారిత్రక ఘటన గురించి ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో ఓ ప్రశ్నగా అడిగారు.తెలంగాణ చరిత్రను ఆసాంతం చదివిన వారికి ఎక్కడో ఓ చోట రాసిన విషయం గుర్తుంటే తప్ప.. సమాధానం ఇవ్వలేరు. వెయ్యిమంది వీరుల త్యాగం పాఠ్యాంశంగా అందించాలన్న డిమాండ్ ఉంది. ఏంటా ప్రశ్న... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో రాంజీగోండుకు సంబంధించి అడిగారు. రెండవ పేపర్లో 18వ శతాబ్దంనాటి రాంజీగోండు తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకొని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చివరకు వెయ్యిమంది సైన్యంతో కలిసి ఉరికొయ్యలకు బలికావడం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాలు రాయలేకపోయామని చెప్పారు. ఇందుకు కారణం రాంజీగోండు, వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి చిన్నప్పటి నుంచి ఏ పాఠ్యపుస్తకంలో చదవకపోవడమే. ఎక్కడ ఆ ఘటన.. ఎవరా రాంజీ ! 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆదివాసీ వీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్, గోండ్వానా రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్న వారందరినీ ఏకం చేశాడు. పరాయిదేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై, స్వదేశంలో ఉంటూ వారికి తొత్తులుగా ఉన్న నిజాం రాజులపైనా పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ప్రథమ సంగ్రామంలో పాల్గొన్న రొహిల్లాలు.. ఈ ఆదివాసీ వీరులకు తోడుకావడంతో నెలల తరబడి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. తమ వద్ద సరైన బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు లేకున్నా.. రాంజీ సారథ్యంలో గెరిల్లా తరహా పోరుసల్పారు. కొరకరాని కొయ్యగా మారిన గోండువీరులను శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీ సహా వెయ్యిమంది వీరులను బంధించారు. మరోసారి ఇలాంటి తిరుగుబాటు చేయడానికి కూడా ఎవరూ సాహసించొద్దని ఆ వీరులను అత్యంత దారుణంగా హింసించారు. ఒకే మర్రిచెట్టుకు.. వెయ్యిమంది 1860, ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. అలా వారంతా మాతృభూమి కోసం ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర దశాబ్దాలపాటు కనీసం బయటకు రాలేదు. ఇప్పటికీ ఈ దారుణ మారణకాండ గురించి ఎక్కడా చరిత్రలో, పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. 2021 సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి వెయ్యిమంది అమరులకు నివాళులరి్పంచారు. అయితే ఇప్పటికీ నిర్మల్‌లో వారి స్మారకార్థం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.ముందుతరాలకు తెలిసేలా.. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఎప్పుడో 1857–60లోనే జరిగిన వెయ్యి ఉరులమర్రి ఘటనను ఇప్పటికీ బయటకు తీయకపోవడం దారుణం. ఇలాంటి ఘటనను ముందుతరాలకు తెలిపేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడుపాఠ్యాంశంగా పెడితే... వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి పాఠ్యాంశంగా పెట్టడంతోపాటు విస్తృ తంగా ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అప్పుడే ఇలాంటి ఘటనలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వగలుగుతారు. – డాక్టర్ కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
నిర్మల్ జిల్లాలో పెద్దపులి కలకలం
-
‘ఇన్‌స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు!
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్ జిల్లా, భైంసాకు చెందిన బాలికను ట్రాప్ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు. నిందితుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే..భైంసాకు చెందిన బాలికకు నగరానికి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరకు ఆదివారం ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్ ద్వారా కరెంట్ లోకేషన్ షేర్ చేసింది. హుటాహుటిన నగరానికి వచి్చన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్‌ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినికి ఆన్లైన్లో వేధింపులు..మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్లైన్లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్ చెక్ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో విద్యనభ్యసిస్తున్నారు. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్లైన్లో, సోషల్‌మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతో పాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు స్పష్టం చేశారు. -
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ బాసట
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. నిర్మల్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు అన్ని విధాలా అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.మరోవైపు చిన్నారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.లక్ష సాయం చేశారు. ఈ నగదును స్థానిక అధికారుల చేత ఆమెకు అందించారు. చిన్నారి చదువు పూర్తయ్యేవరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాలికకు ఇల్లు కూడా సమకూరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈమేరకు బాలికకు వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఖర్చులకు ప్రతి నెల డబ్బులు పంపుతానని, త్వరలో కలుస్తానని చెప్పారు. -
అనాధ బాలికకు అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి
-
ఎక్స్పైరీ సెలైన్ ఎక్కించేశారు!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో చికిత్స చేస్తున్నారు. శుక్రవారం ఓ రోగికి కాలం చెల్లిన సెలైన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె.అజారుద్దీన్ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్యుల సూచన మేరకు అతడికి సెలైన్ పెట్టారు. అక్కడే ఉన్న అజారుద్దీన్ సోదరుడు ఆసిఫ్..సెలైన్ సరిగ్గా ఎక్కడం లేదని దానిని పరిశీలించగా ఎక్స్పైరీ డేట్ చూసి షాక్ అయ్యాడు.ఈ ఏడాది మార్చితోనే సెలైన్ కాలపరిమితి ముగిసినట్లు గుర్తించిన వెంటనే అక్కడి వైద్యులు, సిబ్బందిని నిలదీశాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మీడియా ఆస్పత్రి ఆవరణలోని ఓ మెడిసిన్ ట్రాలీలోని మందులను పరిశీలించగా, మూడు వాయిల్స్ కాలం చెల్లినవి కనిపించాయి. అక్కడి నుంచి ఇంజెక్షన్ ఓపీకి వెళ్లి చూడగా అందులో సైతం ఓ వాయిల్ 3 నెలల ముందే గడువు ముగిసినట్లు కనిపించింది.దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీ మాధవ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. కాగా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రాత్రి డీసీహెచ్ సురేశ్, డీఎంహెచ్‌వో రాజేందర్ సందర్శించారు. కాలంచెల్లిన మందులు వాడటంపై కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని తని ఖీ చేసినట్లు తెలిపారు. అజారుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్‌తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి దారుణ హత్య
నిర్మల్: నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలని హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. వివరాలు.. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముగ్గురుపై అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందారు. అలేఖ్య వదిన షెట్పల్లి జయా (25) , కొడుకు షెట్పల్లి రియన్స్ (3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయా, రియాజ్.. ఖానాపూర్ మార్కెట్‌కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ అనే యువకుడు కాపు కాసి దాడి చేశాడు. అయితే అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోవడంతో గొడ్డలితో ఆమెపైకి దాడికి చేసినట్లు సమాచారం. -
‘ఇథనాల్’పై గ్రామస్తుల ఆగ్రహజ్వాల
దిలావర్పూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం–గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా తరలివచ్చిన గ్రామస్తులు, రైతులు ఫ్యాక్టరీపై దాడిచేసి, వాహనాన్ని తగులబెట్టడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు జిల్లా ఉన్నతాధికా రులు సముదాయించడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీపై మొదటి నుంచీ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమీప గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేయడంతోపాటు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫ్యాక్టరీ పనులు ఊపందుకోవడంతో బుధవారం దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా పరిశ్రమ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడ నిర్మిస్తున్న ప్రహరీని కూల్చేశారు. నిర్మాణా లను అడ్డుకున్నారు. వందలమంది మూకుమ్మ డిగా దాడికి పాల్పడటంతో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఓ కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. నిర్మల్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. మరోపక్క రైతులు, గ్రామస్తులు దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారిని సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీసులు వీడియో తీస్తుండగా వారు ఇథనాల్ కంపెనీ వారని అనుకున్న గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఇందులో పలువురు రైతులు, గ్రామస్తులకు గాయాలయ్యాయి. అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, తహసీల్దార్ సరిత అక్కడికి వచ్చి సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటివరకు శాంతియుతంగా ఉండాలని గ్రామస్తులను కోరగా, రైతులు శాంతించారు. కాగా, రైతులు, ప్రజలు గురువారం దిలావర్పూర్ మండల బంద్‌కు పిలుపునిచ్చారు. -
ఇదొక్కటే ‘ఆధారం’!
భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆధార్‌కార్డు అప్డేట్కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
‘కొయ్య బొమ్మ’కు ప్రాణం పోసేదెప్పుడు?
తెలంగాణ కళలకు కాణాచి. చేతివృత్తులు, హస్తకళలకు పెట్టింది పేరు. అలాంటి కళల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ కొయ్యబొమ్మలు ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. దాదాపు 450ఏళ్లుగా నకాషీ కుటుంబాలు ఈ కళను నమ్ముకొని బతుకుతున్నాయి. కాలక్రమంలో పాలకుల పట్టింపు లేక ఈ కళ కనుమరుగయ్యే దశకు చేరుకుంటోంది. కొయ్య బొమ్మ తయారయ్యే ‘పొనికి’ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెరసి కర్రకు కరువు ఏర్పడడం వల్ల కళాకారులకు పని ఉండడం లేదు. ఈ క్రమంలో చాలావరకు నకాషీ కుటుంబాలు ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇలాగే సాగితే రానున్న తరంలో కళ అంతరించి పోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో అసలైన ముడిపదార్థం పొనికి కర్ర. మృదువుగా ఉండే పొనిక చెట్టు కర్రతోనే ఈ బొమ్మలను చేయడం ప్రత్యేకత. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పొనికి చెట్లు విపరీతంగా ఉండేవి. కాలక్రమంలో అడవులతోపాటు పొనికి చెట్లు కూడా అంతరించి పోతున్నాయి. బొమ్మల తయారీకి కావాల్సిన కర్రను కళాకారులు అటవీశాఖ కలప డిపోల నుంచి సేకరిస్తున్నారు. ఈ కర్రకు కొరత ఏర్పడడంతో బొమ్మలు చేసేవాళ్లకు పని ఉండడం లేదు. మూడునెలల క్రితం నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వరుణ్‌రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పొనికి వనాన్ని ప్రారంభించారు. అందులో మొక్కల పెంపకం చేపట్టారు. కానీ అవి చేతికొచ్చి కొయ్యబొమ్మగా మారేందుకు సమయం పడుతుంది. కనీసం పింఛన్ లేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో 1955లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేశారు. కొయ్య బొమ్మను నమ్ముకొని ఒకప్పుడు రెండు వందల కుటుంబాల ఉండేవి. ఇప్పుడు 50లోపే కుటుంబాలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. అందులోనూ నేటితరమంతా వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కళాకారులంతా ఎప్పుడో 25–30ఏళ్ల నుంచి చేస్తున్నవారే. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం, పింఛన్ లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన షెడ్డు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడంలేదు. ‘మా చేతులతో చేసుకున్న బొమ్మలు పెట్టే అన్నం తప్ప.. ఇప్పటిదాకా ప్రత్యేకంగా రూపాయి అందడం లేదు..’ అని సీనియర్ కళాకారులు వాపోతున్నారు. తమ జీవితాల్లోనే ఎలాంటి ఎదుగుదల లేదని, ఇక అలాంటప్పుడు తమ పిల్లలు ఈ కళను ఎలా కొనసాగిస్తారని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా బొమ్మలతోనే.. 35ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీలోనే ఉన్నా. మా పూర్వికుల నుంచి ఇదే ఉపాధి. కానీ పొనికి కర్ర కొరతతో చాలామందికి పనిలేకుండా పోతోంది. సరైన ప్రోత్సాహం లేకపోవడంతో మా పిల్లలు ఇటువైపు రావడం లేదు. –పెంటయ్య, నకాషీ కళాకారుడు -
బీజేపీకి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రాజీనామా
భైంసాటౌన్: నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పి.రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనను కాదని, గత ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన రామారావుపటేల్‌కు టికెట్ కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమై ఆమె రాజీనామాను ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ... అభ్యర్థుల జాబితా ప్రకటనకు గంట ముందు వరకు ఉన్న పేరును తొలగించి, వేరేవారికి ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ముధోల్ బీఆర్ఎస్ ఇన్చార్జి పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి రమాదేవిని ఆమె నివాసంలో కలిశారు. పార్టీలోకి రావాలని ఆహా్వనించగా ఆమె అందుకు అంగీకరించారు. -
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, నిర్మల్ జిల్లా: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లిల వద్ద శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌తో నిర్మించిన కాళేశ్వర ప్రజెక్టు ప్యాకేజీ-27ను (శ్రీలక్ష్మీ నరసింహాస్వామి లిఫ్ట్ ఇరిగేషన్) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తరువాత దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించి పూజ నిర్వహించారు. అదే విధంగా సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆశా కార్యకర్తల ఆందోళన.. గుండంపెల్లిలో ఉద్రిక్తత గుండంపెల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ ఆశా కార్యకర్త సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసుల తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. చివరికి ప్యాకేజీ 28 కాళేశ్వర పనులు ప్రారంభించిన తర్వాత మంత్రికి ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు. -
పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్న చిరుతలు
-
బస్సు ఎక్కిన పాము.. ఎక్కడికెళ్దామని?
-
బస్సు ఎక్కిన పాము.. ఎక్కడికెళ్దామని?
నర్సాపూర్: నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో చొరబడిన పాము అందరిని హడలెత్తించింది. కుంటాల మండలం ఓలా నుంచి నిర్మల్ వైపు ప్రయాణికులతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. ఒక్కో గ్రామంలో ప్రయాణికులతో పాటు విద్యార్థులు ఎక్కుతూ వచ్చేసరికి రద్దీ పెరిగింది. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు బస్సు వెనుక సీట్లవైపు వెళ్లారు. బస్ రన్నింగ్ లో ఉండగానే సీటు కింద తిరుగుతున్న పామును విద్యార్థులు గుర్తించారు. అప్రమత్తమైన డ్రైవర్ నర్సాపూర్ వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఆయన దానిని బంధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి పామును చంపేయడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఫ్రీగా దొరికిన కూరగాయలు..ఎగబడ్డ జనాలు
-
రోడ్లు.. వానపాలు
సాక్షి నెట్వర్క్: భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్, రామ్‌నగర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 24,035 మంది రైతులకు చెందిన 33,429 ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.7 మండలాల్లోని 16 చెరువుల కట్టలు తెగిపోయాయి. బోధన్ మండలం సాలూర శివారులోని మంజీర నది పాత వంతెన పైనుంచి ప్రవహించడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని గురువారం అతలాకుతలం చేసిన మున్నేరు వరద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుతూ వస్తోంది. గురువారం రాత్రి 10గంటలకు 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం రాత్రి ఏడు గంటలకు 18.30 అడుగులకు పడిపోయింది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మున్నేరును పరిశీలించి సహాయక చర్యలపై అధికారులకు సూచ నలు చేశారు. ఖమ్మంలో మున్నేటి వరద, ముంపు ప్రాంతాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. -
రోడ్డెక్కిన రైతులు
-
‘ధరణి’ని కాదు.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, నిర్మల్: ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అవాకులు చవాకులు పేలుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని.. ధరణి పోర్ట్‌లను బంగాళాఖాతంలో వేస్తామన్న దుర్మార్గులను బంగాళా ఖాతంలో పడేయాలని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. ధరణి ఉండలా, వద్దా? ధరణి తీసేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా పడతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే.. బ్యాంకు నుంచి మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. రైతు చనిపోతే ఏవిధంగా రైతు బీమా వస్తుందని నిలదీశారు. అందుకే ధరణి పోర్టల్ ఉండలా, వద్దా మీరే చెప్పండంటూ ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లవారే సరికి పహనీలు మారిపోయేవన్నారు. వరాల జల్లు నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయితీలకు రూ 10 లక్షలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. చదవండి: నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ నిర్మల్‌కు ఇంజనీరింగ్ కళాశాల బాసరా సరస్వతి దేవాలయాన్ని పెద్దగా అభివృద్ధి చేసుకుందామని, అద్భుత ఆలయం నిర్మించుకుందామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు పేర్కన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. 8న చెరువుల పండగ ‘కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాంరాం చెబతారు. కాంగ్రెస్ పాలన మనం చూడలేదా. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి. మనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధు, దళిత బంధు రాంరాం అనే వాళ్లు కావాలా? ఒకప్పుడు కరెంట్ ఎప్పుడ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్. సాగు, తాగు నీరుసమస్య తీర్చుకున్నాం. ఈనెల 8న చెరువుల పండగ జరుపుకోవాలి. దేశంలోనూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ రావాలి ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర ఎకరం కొని వాళ్ల పొలాలకు నీళ్లు తీసుకెళ్తున్నారు. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. అధికారానికి దూరమైన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. త్వరలోనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తాం. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఫోకస్ పెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రం ఇలాగే సుభిక్షంగా ఉండాలంటే మీ ఆశీస్సులు కావాలి. -
ఆ ఊరిలో ఇప్పటి వరకు కరెంట్ లేదంట
-
ట్రిపుల్ ఐటీలో హౌసెకీపింగ్ ఉద్యోగుల తొలగింపు వివాదం
-
ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
-
నువ్వేం ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
-
నువ్వు ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక వివాదస్పదంగా మారింది. కడెం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవారం ఖన్నపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, గ్రామ సర్పంచ్‌తో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. వేదిపై ఉన్న వారి పేర్లు చెబుతూ సర్పంచ్ పేరు పలకడం మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ నరేందర్ రెడ్డి తన పేరు ప్రస్తావించలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. సర్పంచ్ పేరు చెప్పకుండా ప్రోటోకాల్‌న ఉల్లంఘించారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సర్పంచ్ సీరియస్‌గా స్పందించారు. రేపు నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే మాటలకు బయపడని సర్పంచ్.. మీరు నన్నేం చేస్తారు మేడం, ఏం చేస్తారో చేసుకోండని అని బదులిచ్చారు. దీంతో సర్పంచ్‌పై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపించారు. నువ్వు నన్నేం చేస్తావ్?. ఎస్టీ మహిళ అని మాట్లాడుతున్నావా. ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను తీసుకొస్తే.. ఇది నా ఊరు అని ఎలా అంటావ్. మా పార్టీ తరపునే మీ ఊరు డెవలప్ అవుతుంది. మా పార్టీ వల్లే రోడ్లు, ఇళ్లు వచ్చాయి’ అని సర్పంచ్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై సర్పంచర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన పేరు పలకలేదని అడిగినందుకు ఎమ్మెల్యే దుర్బాషాలాడారని అన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పినందుకు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల సర్పంచ్‌లపై రేఖనాయక్ చిన్న చూపు చూస్తుందనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. -
తండ్రి మృతి..10th పరీక్షకు విద్యార్థి
-
కోతుల కథ.. జనం వ్యథ!
విపరీతంగా సంతతి.. అడవుల్లో పండ్ల చెట్లు తగ్గడం, కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో జనావాసాలపై పడుతున్నాయి. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడ కోతి మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. ఏడాదికోసారి చొప్పున తన జీవితకాలంలో అటూఇటూగా 20–22 పిల్లలను కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాలకే పరిమితమైన కోతులు.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం, నీళ్ల కోసం జనావాసాలపైకి దండెత్తుతున్నాయి. ఎవరైనా వాటిని అదిలిస్తే.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తే గుంపులుగా దాడికి పాల్పడుతున్నాయి. ‘హిమాచల్’ప్రయోగం మొదలుపెట్టినా.. ఇంతగా ఇబ్బందిపెడుతున్న కోతులను చంపేందుకు చట్టాలతోపాటు నమ్మకాలు కూడా అడ్డువస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. కోతులను పట్టుకుని ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేసి వదిలేసి.. వాటి సంతతిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. దీనిని స్టడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవనంలో 2020 డిసెంబర్లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఇందులో కోతులకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో విరిగిన చేయితో, పక్కనే కర్ర, గులేర్ పెట్టుకుని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడి పేరు ధనుంజయ్. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్. రోజూ మధ్యాహ్న భోజన సమయంలో కోతులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. వంటలు, భోజనం చేసేప్పుడు ఒకరిద్దరు విద్యార్థులు పొడవాటి కర్రలను పట్టకుని కాపలా ఉండాల్సి వస్తోంది. ఇటీవల అలా వచ్చిన కోతుల గుంపును తరిమేసేందుకు ధనుంజయ్ ప్రయత్నించారు. కానీ అవి ఒక్కసారిగా ఆయనపై దాడికి రావడంతో కిందపడ్డారు. చేయి విరిగింది. ఇప్పటికీ ఇలా భయంభయంగానే పాఠాలు బోధిస్తున్నారు. ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు చాతరబోన నర్సవ్వ (70). కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆమె ఈనెల 2న మధ్యాహ్నం ఇంట్లోనే వంట పాత్రలు కడుగుతోంది. అక్కడ పడేసిన అన్నం మెతుకులను చూసిన కోతుల మంద ఒక్కసారిగా ఆమెపై దాడిచేసింది. ఇష్టారీతిన ముఖం, గొంతు, మెడ, నడుము భాగంలో రక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు మహిళలు భయపడి ఇళ్లలోకి వెళ్లిపోయారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకలేదు. .. ఇలాంటి ఒకటి రెండు ఘటనలు కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ‘‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేచినప్పటి నుంచే పరేషాన్ చేస్తున్నయ్. బయటికి అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందలకు మందలు తిరుగుతున్నాయ్. ఏమైనా అంటే మీదికి వస్తున్నయ్..’’అనుకుంటూ జనం పరేషాన్ అవుతున్నారు. గుంపుగా మీదపడి రక్కుతుండటంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కుక్కల దాడులపై అంతంత మాత్రమైనా స్పందిస్తున్న ప్రభుత్వం.. కోతుల బాధను మాత్రం అసలే పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. ఊరిపైకి కోతులదండు వచ్చిందని తెలిస్తే.. పనులు మానుకొని మరీ, ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నామ్‌కే వాస్తేగానే చర్యలు.. మంకీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఒక పశువైద్యాధికారి, ఒక అసిస్టెంట్‌తోపాటు నలుగురు అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. ఈ కేంద్రానికి తీసుకువచ్చిన కోతులకు వారు ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఇక్కడికి కోతులను తీసుకురావడం దగ్గరే సమస్య నెలకొంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కోతులను పట్టుకుని ఇక్కడి తీసుకువచ్చే బాధ్యతను స్థానిక సంస్థలకే అప్పజెప్పింది. మొదట్లో కొన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అలా కోతులను తెచ్చాయి. అయితే కోతులను పట్టుకోవడం, వాటిని అంతదూరం తరలించడం ఇబ్బందిగా మారిందంటూ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీనితో ఇప్పటివరకు 1,176 కోతులకు మాత్రమే ఆపరేషన్లు చేయడం గమనార్హం. కోతుల బెడద నివారణలో ఎంతోకొంత ఫలితమిచ్చే ఈ అంశాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్ 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో ఒక్కటే పెట్టి వదిలేశారు. ఇక కోతుల బెడదను తప్పించేందుకు పండ్ల చెట్లతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా పెద్దగా చర్యలు లేవని జనం వాపోతున్నారు. కోతులను తేవాలన్నా.. స్పందన తక్కువగానే.. మా కేంద్రానికి తెచ్చిన కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 528 ఆడ కోతులకు ఆపరేషన్ చేశాం. అవి మరో పదేళ్ల వరకు పిల్లలు కనే వయసు ఉన్నవే. అంటే దాదాపు 5,280 కోతులు పుట్టకుండా చేయగలిగాం. గ్రామాల్లో కోతులను పట్టి తీసుకురావాలని సూచిస్తూనే ఉన్నాం. కానీ స్పందన తక్కువగానే ఉంటోంది. – డాక్టర్ శ్రీకర్రాజు, మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ -
డామిట్.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదా?.. ఎందుకిలా జరిగింది?
పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్కీ ఇద్దామనుకున్నారు. సొంత జిల్లాలో పాదయాత్ర, సభ నిర్వహించారు. రేవంత్ వ్యతిరేక నేతలందరినీ కూడగట్టారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌కు దడ పుడుతుందని భ్రమించారు. కాని సీన్ రివర్సయింది. నాయకులు చాలా మంది వచ్చారు. కాని జనమే తక్కువ మంది వచ్చారు. నేతల ఉపన్యాసాలు వినేందుకు జనమే కరువయ్యారు. అది ఏ జిల్లా? రేవంత్‌కు పోటీగా పాదయాత్ర నిర్వహించిన ఆ నేత ఎవరు? చేతిలో పోటీ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వరరరెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సందేశాన్ని, తెలంగాణ సర్కార్ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు టీపీసీసీ చీఫ్. రాబోయే ఎన్నికలలో హస్తం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు రేవంత్. ఇదిలా ఉంటే మహేశ్వర రెడ్డి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసాలో తన పాదయాత్ర చేపట్టారు. రేవంత్ యాత్రకు సవాలు విసిరే విధంగా ఉందని భావించిన ఆయన వ్యతిరేక ఉద్దండ నేతలంతా మహేశ్వరరెడ్డి పాదయాత్ర ప్రారంభించడానికి హాజరయ్యారు. సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితర రేవంత్ వ్యతిరేక వర్గం అంతా మహేశ్వరరెడ్డి పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చారు. పబ్లిక్ రిపోర్ట్‌లో రిజల్ట్ లేదా? అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. తన పాదయాత్ర అంటే వేలాది మంది ప్రజలు తరలి వస్తారని మహేశ్వర్ రెడ్డి అంచనా వేసుకున్నారు. కాని సభకు కొన్ని వందల మంది మాత్రమే హజరయ్యారు. వచ్చినవారంతా మహేశ్వరరెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ జనమే ఎక్కువగా ఉన్నారు. సభ నిర్వహించిన ముథోల్ నియోజకవర్గం నుండి జనాన్ని తరలించడంలో మహేశ్వరరెడ్డి అనుచరులు ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది. జనం లేక పాదయాత్ర ప్రారంభ సభలో కాంగ్రెస్ నాయకులకు ప్రోత్సాహం కరువైంది. మహేశ్వరరెడ్డితో సహా సభలో పాల్గొన్న నాయకులంతా నిమిషాల వ్యవధిలోనే తమ ఉపన్యాసాలను ముగించారు. అందరూ మహేశ్వరరెడ్డి పాదయాత్ర చేపట్టినందుకు ప్రశంసించారు. కాంగ్రెస్ ఉద్దండులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ సభ ప్రసంగాలు వినే ప్రజలు లేక కేవలం 40 నిమిషాల్లోపే ముగిసింది. ఎందుకిలా జరిగింది? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు పోటీ పాదయాత్ర అంటే జనం పోటెత్తుతారని భావిస్తే.. అసలు స్పందనే రాకపోవడంతో మహేశ్వరరెడ్డి ఆందోళన చెందుతున్నారట. పార్టీలోని సీనియర్ నాయకుల ముందు పరువు పోయిందని మదన పడుతున్నారట. రేవంత్ పాదయాత్ర కంటే తన పాదయాత్రకు ప్రజలు భారీగా వస్తారని అంచనాలు వేసుకున్నారట మహేశ్వరరెడ్డి. కాని రేవంత్ పాదయాత్రకు వస్తున్న స్పందనలో పది శాతం కూడా తనకు రాకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారట. నిర్మల్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయింది. బారీ బహిరంగ సభలు సక్సెస్ చేశారు. కాని తన పాదయాత్రకు స్పందన లేకపోవడానికి గల కారణాలను వెతుకుతున్నారట. మొదటగా జనాన్ని తరలించడంలో విఫలమైన అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారట మహేశ్వర్ రెడ్డి. ఆ వైఫల్యానికి కారణాలేంటీ? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే సీనియర్ నాయకులంతా వెన్ను తట్టి ప్రోత్సహించడంతో.. అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు స్పందన రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. మహేశ్వరరెడ్డి రోడ్డు మీదకు వెళితే తండోపతండాలుగా జనం వచ్చేంత పాపులర్ లీడర్ ఏమీ కాదు. పైగా ఆయన తన సొంత నియోజకవర్గం నిర్మల్ వదిలి పక్క నియోజకవర్గం అయిన ముథోల్‌లో పాదయాత్ర చేపట్టారు. ముథోల్ సెగ్మెంట్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో.. క్యాడర్ మొత్తం ఆయనతో పాటు కాషాయ తీర్థం తీసుకుంది. కాంగ్రెస్ జెండాలు కట్టేవాళ్లు లేనిచోట మహేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టడం మైనస్ గా మారిందట. ముథోల్‌లో కాకుండా సొంత నియోజకవర్గం నిర్మల్‌లోనే యాత్ర చేపట్టాలని సన్నిహితులు, సీనియర్లు సూచించినా మహేశ్వరరెడ్డి పట్టించుకోలేదట. కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ హోదాలో ఉండి అత్యుత్సాహం చూపిన ఫలితంగా మహేశ్వర రెడ్డి తన పరువు తానే తీసుకున్నారని ఆయన అనుచరులు, కార్యక్తలు అందోళన చెందుతున్నారట. చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఆరంభ సభే అట్టర్ ప్లాప్ కావడంతో...ఈ ప్రభావం తర్వాత రోజులలో నిర్వహించే పాదయాత్రపై పడకుండా మహేశ్వరరెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట. భారీగా జనాన్ని తరలించాలని అనుచరులకు మహేశ్వర రెడ్డి ఆదేశాలు జారీచేశారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
నా పెళ్లి సంబంధం చెడగొట్టారు.. యువతి సూసైడ్ నోట్ రాసి..
సాక్షి, నిర్మల్: జిల్లా కేంద్రంలోని రాంరావుబాకు చెందిన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుండి వెళ్లి పోయిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్లో యువతి ఉద్యోగం చేస్తోంది. దాని పక్కనే గల ఫోటో షాప్ యజమాని వంశీతో యువతికి పరిచయం ఏర్పడింది. అయితే గత నెల ఫిబ్రవరిలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరి ఎంగేజ్మెంట్ తేదీని సైతం తేదీ ఖరారు చేశారు. వంశీ దంపతులు తనకు పెళ్లి కుదిరిన అబ్బాయికి ఫోన్ చేసి తనపై తప్పుడు మాటలు చెప్పి ఎంగేజ్‌మెంట్‌ను చెడగొట్టారని సూసైడ్ నోట్లో రాసి వెళ్లిపోయింది. తాను వెళ్లిపోవడానికి కారణం వంశీ దంపతులేనని, తన కుటుంబ సభ్యులు కాదని పేర్కొంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వెళ్లిపోవడానికి కారణమైన వంశీని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం వంశీ దంపతులేనని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లి, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదవండి: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య -
పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ.. గుండె ఆగి..
కుభీర్: మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ యువకుడు పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్నాడు.. బంధువులంతా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. కానీ ఆ యువకుడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(కె) గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సరదాగా డ్యాన్స్ చేస్తూ..: పార్డి(కె) గ్రామానికి చెందిన నాయుడు రాజుకు భైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శని వారం సాయంత్రం పెళ్లికొడుకు నాయుడు రాజు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నాయుడురాజు బంధువు, మహారాష్ట్రకు చెందిన తమ్మళ్ల ముత్యం (18) కూడా దీనికి హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమం పూర్తికాగా.. బంధువులు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ముత్యం కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేప టికి డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. అతడు తిరిగి లేవకపోవడంతో బంధువులు వెంటనే భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముత్యం గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆదివారం మహారాష్ట్రలోని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు
-
వ్యథ నుంచి పుట్టిన వారధి
భైంసా రూరల్: ఎవరో వస్తారని ఎదురు చూడలేదు. ఎవరూ స్పందించకపోయినా పట్టించుకోలేదు. తాను అనుకున్నది చేశాడు. నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు. సొంత డబ్బుతో వాగుపై వంతెన నిర్మించాడు నిర్మల్ జిల్లా భైంసా మండలం ఖథ్గాం గ్రామానికి చెందిన యువ రైతు నాగేశ్. గ్రామ రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి సుద్దవాగు అడ్డుగా ఉంది. గతంలో వాగు దాటుతూ ఇద్దరు మృతి చెందారు. వాగుపై వంతెన నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో.. రైతులు, కూలీలు పొలాల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రైతు నాగేశ్ సొంత ఖర్చుతో తాళ్లు, కర్రలతో వంతెన నిర్మించాడు. వాగు అవతలివైపు 400 ఎకరాల పంట పొలాలున్నాయి. రైతు నాగేశ్ పొలం కూడా ఉంది. సొంతంగా రూ.25 వేలు ఖర్చుచేసి తాళ్లు, వెదురు కర్రలతో వంతెన నిర్మించిన నాగేశ్‌ను రైతులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీక్షేత్రంలో వసంత పంచమి జరుçపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచే ఆలయంలో పూజలు జరిగాయి. గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు, అఖిల భారత పద్మశాలి సంఘంతోపాటు పలువురు వ్యక్తులు బాసర వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్ఐటీకి చెందిన 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఆలయంలో సేవలు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బాసర భక్తజనంతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి 4 గంటలు, అక్షరాభ్యాసానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిరావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు. -
బాసరలో వసంత పంచమి వేడుకలు
భెంసా: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో విజయరామారావు స్థానిక వైదిక బృందం ఆధ్వర్యంలో వేడుకలను ప్రారంభించారు. బాసర ఆలయ స్థానాచార్య, ప్రధానార్చకుల పర్యవేక్షణలో గోమాతకు పూజలు చేశారు. తర్వాత యాగశాలలో యాగ పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస పూజలు చేయించారు. -
పంచె కట్టులో.. గ్రౌండ్లో సత్తా చాటిన రైతన్నలు
సాక్షి, నిర్మల్: రైతు అంటే.. పొలం దున్ని, పంటలు పండించాలా?.. వాళ్లలోనూ అదనపు టాలెంట్లు ఉంటాయి. వాళ్లు వినోదాన్ని కోరుకుంటారు. అలాంటి కొందరు రైతులు క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. పొలంలోనే కాదు.. మైదానంలోనూ పంచె పైకి బిగించికట్టి అద్భుతంగా క్రికెట్ ఆడి ఔరా అనిపించారు. నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో ఆదివారం అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. అనంతపేట్, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట్ గ్రామాల రైతులు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఈ పోటీలను ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. వయసుతో సంబంధం లేకుండా .. రైతులు మైదానంలో చురుగ్గా పరుగులు తీస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రైతుల క్రికెట్ చూసేందుకు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాన్నతో నడచి వెళ్లి.. శవమై ఇంటికి
ఖానాపూర్: అప్పటివరకు ఆ చిన్నారి.. అక్క తమ్ముడితోపాటు స్థానిక పిల్లలతో సరదాగా ఆడుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రికి ఇంట్లో నీళ్లు లేవని.. నల్లా రావడం లేదని ఇల్లాలు చెప్పింది. వెంటనే తండ్రి బోరు మోటార్ ఆన్ చేయడానికి బయల్దేరాడు. చిన్న కూతురు తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక.. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి మోటార్ ఆన్ చేస్తుండగా, చిన్నారి అక్కడే ఉన్న విద్యుత్ తీగకు తగిలి షాక్‌కు గురైంది. తండ్రి కళ్లముందే గిలగిలా కొట్టు కుంటూ కూతురు చనిపోయిన ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కొలాంగూడ పంచాయతీ పరిధిలోని దేవునిగూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడావి నాశిక్–విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నాశిక్ ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. స్నానం చేయడానికి నీళ్లు లేకపోవడంతో డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీరు సరఫరా చేసే మోటార్ ఆన్ చేయడానికి వెళ్తుండగా చిన్న కూతురు మాలశ్రీ(5) తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక ఆమెను తీసుకుని వెళ్లాడు. అయితే అప్పటికే చీకటి పడడంతో కూతురును పక్కన నిలిపి నాశిక్ మోటార్ ఆన్ చేస్తుండగా, మాలశ్రీ సమీపంలో విద్యుత్ తీగకు తగిలింది. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కళ్ల ముందే కూతురు ప్రాణాలు పోతున్నా నాశిక్ ఏమీ చేయలేకపోయాడు. స్థానికులు వచ్చే సరికి బాలిక చనిపోయింది. కూతురును పట్టుకుని తండ్రి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
విద్యార్థులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి
బాసర(ముధోల్): ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, ఐడియాలో దమ్ముంటే ఎవరూ ఆపలేరని, గ్లోబల్ లీడర్‌గా ఎదగాలంటే మంచి ఆలోచనలతో నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో శనివారం నిర్వహించిన 5వ స్నాతకోత్సవ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే 20 ఏళ్లలో ప్రపంచం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడుస్తుందని, దానికి తగ్గట్టు మనం కూడా రూపాంతరం చెందాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, సమస్యల పరిష్కారానికి దాదాపు రూ.25 కోట్లు అవసరమని కళాశాల అధికారులు కోరగా.. అవి సరిపోవంటూ రూ.27 కోట్లు సీఎం మంజూరు చేశారని వివరించారు. స్టేట్ యూనివర్సిటీగా ఉన్న ట్రిపుల్ ఐటీని నేషనల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దే బాధ్యత విద్యార్థులదేనన్నారు. ట్రిపుల్ ఐటీకి వరాలు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. ఇకపై విద్యార్థులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి విన్నపం మేరకు నాలుగు వేల మంది విద్యార్థినులు చదువుతున్న ట్రిపుల్ ఐటీలో గైనకాలజీ డాక్టర్లు అందుబాటులో ఉండేలా పది పడకల ఆస్పత్రి నిర్మించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు సోలార్ ఎనర్జీ అందించి, క్యాంపస్ లోని చెరువును సుందరీకరణ చేస్తామని, విద్యా ర్థుల అవసరాల మేరకు సైన్స్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. వీటికి అవసరమయ్యే దాదాపు రూ.5కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ల్యాప్‌టాప్‌లు ప్రదానం గత సెప్టెంబర్‌లో ట్రిపుల్ ఐటీని సందర్శించిన కేటీఆర్ విద్యార్థులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీనిచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ శనివారం స్థానిక కాన్ఫరెన్స్ భవనంలో పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ప్రదానం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో 38మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వీసీ వెంకటరమణ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు
సాక్షి, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు అందిస్తామన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. క్యాంపస్‌కు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో ఉన్న చెరువును సుందరీకరణ చేస్తామని తెలిపారు. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం 10 పడకలతో కూడిన ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని పేర్కొన్నారు. శానిటేషన్ సిబ్బందికి యంత్రాలు మంజూరు చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ప్రపంచంతో పోటీపడే సత్తా ఉందని కొనియాడారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. అనేక స్టార్టప్‌లకు తెలంగాణ వేదికగా మారుతోందని, ప్రఖ్యాత సంస్థలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. మేధస్సు మీద విశ్వాసం ఉంటే ఎంత దాకైనా పోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహా అనేక కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఈ కోర్సులను అర్జీయూకేటి నుంచి ప్రారంభించాలని వీసీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
భయపడి బయటకొచ్చిండు కేసీఆర్
నిర్మల్/మల్లాపూర్(జగిత్యాల): ‘ప్రజాసంగ్రామ యాత్ర దె బ్బకు భయపడి బయటకొచ్చిన కేసీఆర్.. జగిత్యాలలో ఏదే దో వాగినవ్. నీ సంగతేందో చూస్తాం. ఫామ్‌హౌస్‌లో తాగి, తిని జల్సాలు చేస్తున్నవు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి హా మీలు ఏమయ్యాయి? పేదల పథకాలకు పైసలు ఉండవు.. కానీ, లక్షల కోట్లు దండుకోవడానికి మాత్రం పైసలుంటా యా’ అంటూ జగిత్యాలలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని తిప్పికొడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో, జిల్లా సరిహద్దు గ్రామమైన బాదన్‌కుర్తిలో ప్రసంగించారు. యాత్ర బాదన్‌కుర్తి వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవేశించింది. కేంద్రం పేరుచెప్పి మీటర్లు పెడతావా.. ‘కేసీఆర్ వరద కాలువలకు పెట్టే మోటార్లకు మీటర్లు పెడతాడట. ఎన్నికలు వస్తే చాలు మోటార్లకు మీటర్లు అంటూ.. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడదామని చూస్తున్నాడు. మోటార్లకు మీటర్లు పెడితే బయటికి గుంజుకొస్తాం. కేసీఆర్ ఏమైనా బిచ్చపోడా? రైతులకు ఉచిత కరెంటు ఇవ్వకుండా, తన ఫామ్‌హౌస్‌కు ఉచిత కరెంటు తీసుకుంటున్నాడు. తన ఫామ్‌హౌస్‌లో వాడే కరెంటును 30–40 గ్రామాలకు ఇవ్వవచ్చు. రూ.30–40 వేల కోట్లు డిస్కంలకు బకాయి ఉన్నాడు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ గురువారం ఒక పెళ్లికి వెళ్లాల్సి ఉందని, ఆ పెళ్లి పేరు చెప్పుకుని ఒకరోజు ముందు జగిత్యాలలో మీటింగ్ పెట్టారన్నారు. బీఎల్ సంతోష్ గొప్పవ్యక్తి.. బీఎల్ సంతోష్ గొప్పవ్యక్తి అని, దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్‌గా పనిచేస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఓర్వలేక ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయ్యకు ఇష్టమైన లిక్కర్ దందానే బిడ్డ కవిత చేసిందని, కవితను అరెస్టు చేస్తే... బాదనకుర్తి బ్రిడ్జి వద్ద మహిళలు ధర్నా చేయాల్నా అని ప్రశ్నించారు. కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టాడని, దీనికి మనం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, యాత్ర ముగింపు సభ ఈ నెల 15న కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో నిర్వ హిస్తామని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ము ఖ్యఅతిథిగా జేపీ నడ్డా వస్తున్నారని చెప్పారు. -
ఆశ్చర్యం.. ఆవు లేగ దూడ కాళ్లకు 14 డెక్కలు
కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి సతీశ్‌కు చెందిన ఆవుకు గురువారం రాత్రి లేగ దూడ జన్మించింది. దూడకు ముందటి కాళ్లకు నాలుగుకు బదులు ఆరు డెక్కలు, వెనుక కాళ్లకు నాలుగుకు బదులు ఎనిమిది డెక్కలు ఉన్నాయి. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దూడను పరిశీలించారు. సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. జన్యు లోపంతోనే లేగ దూడ 14 డెక్కలతో జన్మించిందని పశువైద్యాధికారి ప్రకాశ్ తెలిపారు. (క్లిక్ చేయండి: గేటు పడింది.. గుండె ఆగింది) -
నిర్మల్ జిల్లాలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
ధనికరాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు
లక్ష్మణచాంద: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఉద్యమకారుడని పాలన ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణలో మాట మీద నిలబడే నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 189వ రోజు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో మంగళవారం పర్యటించారు. కనకాపూర్, నర్సాపూర్, ఒడ్డెపెల్లి, బోరిగాం గ్రామాల మీదుగా యాత్ర సాగింది. కనకాపూర్ గ్రామ కూడలిలో ఆమె మాట్లాడుతూ..నిలబెట్టుకోని హామీలు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని, ఇచ్చిన మాట కోసం ప్రాణాలను ఇచ్చిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో దళితబంధు, గిరిజనబంధు అంటున్నారని, రాబోయే కాలంలో బీసీబంధు అని కూడా అంటారని ఎద్దేవా చేశారు -
గోమయంతో ప్రమిదలు.. ఎలా తయారు చేస్తారంటే!
పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలన్న సంకల్పంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో గోమయ ప్రమిదలు తయారు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో వీటిని తయారు చేస్తున్నారు. నాటు గోవుల నుంచి మాత్రమే సేకరించిన పేడను బాగా ఎండబెడతారు. అనంతరం దాన్ని పొడిచేసి గోమూత్రం, ముల్తానీ మట్టి, చింత గింజల పొడి కలిపి ముద్ద చేస్తున్నారు. అచ్చు యంత్రంతో ఆ ముద్ద నుంచి ప్రమిదలు తయారు చేస్తున్నారు. వీటి తయారీ ద్వారా 20 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ (క్లిక్ చేయండి: రోగులకు ఊరట..పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
Basara Temple: చదువుల తల్లి నిలయంగా వెలుగొందుతూ..
బాసర(ముధోల్): దేశంలోనే రెండో సరస్వతీ దేవి ఆలయంగా బాసర పుణ్యక్షేత్రం అలరారుతోంది. గోదావరినది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో అమ్మవారు నిత్యం పూజలందుకుంటారు. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ల ఇసుక తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవత మూర్తులను ప్రతిష్టించాడు. చాళక్యరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. సరస్వతీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. రైలుమార్గం గుండా కూడా బాసరకు చేరుకోవచ్చు. మూడు గుప్పెళ్ల ఇసుకతో.. వ్యాసుడు గోదావరినది నుంచి మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి మూడు విగ్రహాలను తయారు చేశా డు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వాసర, అటుపై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వల్ల విజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని బండారా అంటారు. వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినట్లుగా.. వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రామాయణం రాసాడని మరో ప్రతీతి. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతిగుండును తడితే మరోవైపు ఒక్కో శబ్ధం వస్తుంది. ఈ రాతి గుండు లోపల సీతమ్మవారి నగలు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. (క్లిక్ చేయండి: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!) చాళక్యుల కాలంలో.. ప్రధాన దేవాలయాన్ని చాళక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. మందిరంలో శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్తమందిరం ఉంది. ఇక్కడ దత్త పాదుకలను చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే మహాకాళి దేవాలయం ఉంది. అటుపై ఇక్కడే ఉన్న వ్యాసమందిరంలో వ్యాసభగవానుడి విగ్రహం, వ్యాస లింగాన్నీ చూడవచ్చు. మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీ దేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. నిజామాబాద్, భైంసా నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. -
కరెంటు కంచె ముగ్గురిని కాటేసింది..
మామడ/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలే వారిపాలిట మృత్యుపాశమయ్యాయి. పశువులు మేపేందుకు అడవికి వెళ్లిన ఓ పశువుల కాపరి, పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతు పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాద ఘటనలు నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మద్దిపడగ మల్లయ్య(64) రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తనకున్న గొర్రెలను మేత కోసం అటవీప్రాంతానికి తీసుకువెళ్లాడు. రాత్రి అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా గ్రామానికి చెందిన పారెడి చంద్రమౌళి పొలం వద్ద విగత జీవిగా కనిపించాడు. సమీపంలో విద్యుత్ కంచె ఉండడంతో కరెంటుషాక్‌తో మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొన్కల్ గ్రామానికే చెందిన ద్యాగల బొర్రన్న(55) కూడా మంగళవారం మరోచోట విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. బొర్రన్న ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. పొరుగు రైతుకు చెందిన పొలం వద్ద పశువుల కోసం గడ్డి కోస్తుండగా కానక విద్యుత్ కంచెకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కరోజు వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యుత్ కంచెకు బలవడంతో పొన్కల్‌లో విషాదం నెలకొంది. నిజాంసాగర్‌లో శవమై...: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్‌కి చెందిన రైతు కుమ్మరి నల్ల పోశెట్టి(43) సోమవారం వేకువజామున పొలానికి వెళ్లాడు. దారిలో స్థానిక ఎంపీటీసీ మోతె శ్రీనివాస్‌కు చెందిన పొలానికి ఉన్న విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగలడంతో పోశెట్టి మృత్యువాతపడ్డాడు. అయితే ఆయన మంగళవారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో శవమై తేలడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంపీటీసీ కుటుంబసభ్యులే పోశెట్టి మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని బ్యాక్‌వాటర్‌లో పడేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోశెట్టి మృతికి కారణమైనవారు తమకు లొంగిపోయారని, మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
హడలెత్తించిన మొసళ్లు
కడెం(ఖానాపూర్)/ఏటూరునాగారం: వేర్వేరు చోట్ల రెండు మొసళ్లు హడలెత్తించాయి. నిర్మల్ జిల్లా ఎలగడప గ్రామంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఓ మొసలి ప్రవేశించి.. గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని చాకచక్యంగా తాళ్లతో బంధించి తీసుకెళ్లి కడెం ప్రాజెక్టులో వదిలారు. అలాగే, ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం జాలర్ల వలకు ఓ మొసలి చిక్కింది. భయాందోళనకు గురైన జాలర్లు వెంటనే దానిని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశారు. గోదావరిలోకి మొసళ్లు వచ్చాయని, స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు హెచ్చరించారు. -
నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్న బంద్
-
పంట నష్టంతో రైతు ఆత్మహత్య
నర్సాపూర్(జి): భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో మనస్తాపం చెందిన ఒక రైతు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నర్సాపూర్(జి) మండలం బూరుగుపల్లి(కే) గ్రామానికి చెందిన జాదవ్ భోజారాం (48)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అప్పులు చేసి ఇద్దరు కుమార్తెల పెళ్లి చేశాడు. వ్యవసాయం కోసం కొంత అప్పు చేశాడు. వానాకాలంలో పత్తి పంట సాగుకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా కొట్టుకుపోయింది. రూ.5 లక్షల వరకు చేసిన అప్పు ఎలా తీర్చాలని కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అర్లి(కే) సమీపంలోని సుద్దవాగు వంతెనపై చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాగులో గాలించగా ఆదివారం భోజారాం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య జాదవ్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్(జి) ఎస్ఐ గీత తెలిపారు. -
పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే డబ్బులు కావాలని వేధింపులు.. తట్టుకోలేక
సాక్షి, ఆదిలాబాద్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకున్న సంఘటన మండలంలోని నిర్మల్ జిల్లా గంజాల్‌లో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన అడెల్ల–శంకర్ కూతురు అరుణ(24)ను సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన గుండారపు గంగాసాగర్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. వృత్తిరీత్యా ఫొటో గ్రాఫర్ అయిన గంగాసాగర్ పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే తనకు డబ్బులు అవసరం ఉన్నాయని రూ.లక్ష తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె తీసుకురాకపోవడంతో భార్యపై అనుమానం పెంచుకుని మానసికంగా వేధించాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. బుద్ధిగా వుంటానని చెప్పి భార్యను కాపురానికి తీసుకువచ్చిన గంగాసాగర్ మళ్లీ కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. అరుణ డబ్బుల విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అరుణకు మూడేళ్ల కూతురు సంస్కృతి ఉంది. అరుణ తమ్ముడు నల్ల అనిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. చదవండి: పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి... -
తీవ్ర ఉత్కంఠ మధ్య బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన..
సాక్షి, నిర్మల్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బాసర పర్యటన ముగిసింది. బాసర ట్రిపుల్ విద్యార్థులు, అధికారులతో గవర్నర్ ముఖాముఖి సమావేశమై చర్చించారు. ట్రిపుల్ ఐటీలో హాస్టల్, మెస్, ల్యాబ్, లైబ్రరీని ఆమె పరిశీలించారు. ట్రిపుల్ ఐటీలో ప్రత్యక్షంగా పరిశీలిస్తూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తమ బాధలను గవర్నర్‌కు వివరించారు. రెగ్యులర్ వీసీ, అధ్యాపకుల నియమాకం, ల్యాబ్, హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్ధులు విన్నపించారు. మెస్ టెంబర్లు రద్దు చేయాలని, ఫుడ్‌పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలతో బాధపడుతున్నారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. మెస్ నిర్వహణపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. సానుకూల ధృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని కోరారు. చదవండి: Friendship Day: మైత్రి.. ఓ మాధుర్యం.. అండగా ఉంటూ, ఆదర్శంగా నిలుస్తూ.. అంతకుముందు చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. గతకొంతకాలంగా గవర్నర్ ఎక్కడ పర్యటించినా ఉన్నతాధికారులు దూరంగా ఉంటున్నారు. తాజాగా గవర్నర్ నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ డుమ్మా కొట్టారు. సెలవుల్లో ఉండటం కారణంగా గైర్హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్, డీఎస్పీ జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బాసర విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తీవ్రమైన ఉత్కంఠ మద్య బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన కొనసాగింది. -
ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన
బాసర/సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం ఆదివారం కూడా తమ నిరసన కొనసాగించారు. విద్యార్థులు శనివారం రాత్రి భోజనం బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం వారు ఫలహారం కూడా చేయలేదు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అయితే మధ్యాహ్నం తల్లిదండ్రులు, ఎస్జీసీ కమిటీ విన్నపం మేరకు భోజనం చేశామన్నారు. అయితే భోజనం చేసినంత మాత్రాన ఆందోళన విరమించినట్టు కాదని ఈ1, ఈ2 విద్యార్థులు ఒక వీడియోను విడుదల చేశారు. ఫుడ్‌పాయిజన్ జరిగిన మెస్‌ల కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు మెస్‌ల నిర్వహణ నుంచి ప్రస్తుతం ఉన్న వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమయ్యే 3 వేల లాప్‌టాప్‌లకు రూ.9 కోట్లు కావాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా, అవసరమైతే బర్తరఫ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు వారి సమస్యలను డైరెక్టర్ సతీశ్‌కుమార్ దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సమయం ఇస్తామని తెలిపారు. కాగా, విద్యార్థులతో రాతరి పొద్దుపోయాక డైరెక్టర్ సతీశ్ చర్చించారు. విద్యార్థుల సమస్యలను సోమవారం నుంచి పరిష్కరిస్తామని, విద్యార్థులు యధావిధిగా తరగతులకు హాజరవుతారని ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం లేఖ రాశారు. -
పంట పోయిందని ప్రాణం తీసుకున్నాడు
ముధోల్: భారీ వర్షాలకు సాగుచేసిన పంట మొత్తం పోయింది. దీంతో మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడ్బిడ్ గ్రామానికి చెందిన మంగారపు లక్ష్మణ్(38) తనకున్న రెండెకరాల్లో వానాకాలం సోయా పంట వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. గతేడాది కూడా వర్షాలకు పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాలేదు. ఆ నష్టాలను పూడ్చుకుందామని ఈ ఏడు వేసిన పంట కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దీనికితోడు ప్రైవేటుగా చేసిన అప్పులు రూ.80 వేల వరకు ఉన్నాయి. అప్పులు తీర్చేమార్గం లేక లక్ష్మణ్ శుక్రవారం గ్రామ శివారులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
-
కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, నిర్మల్ జిల్లా: జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. అలాగే ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ప్లో 2 .5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 17 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి. మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవించారు. అయితే ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ప్రమాదం లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. -
నిర్మల్ జిల్లా: ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
నిర్మల్ జిల్లా: వాగు మధ్య చిక్కుకుపోయిన ఒక యువకుడు
-
నిర్మల్: ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే..
సాక్షి, నిర్మల్: వాగు మధ్య చిక్కుకుపోయిన ఒక యువకుడు ఎట్టకేలకు గ్రామస్తుల సాయంతో క్షేమంగా బయటపడ్డాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం మారుమూల అటవీ గ్రామమైన ఇస్లాంపూర్‌కు చెందిన యువకుడు కనక దాము అనే యువకుడు ఈనెల 11న మండలం ఉడుంపూర్ గ్రామానికి రేషన్ బియ్యం తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వస్తున్నప్పుడు వాగు పొంగడంతో చిక్కుకుపోయాడు. ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపాడు. మంగళవారం ఉదయం సమీపంలోని చెట్టు ఎక్కి గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ కనక పద్మ భర్త జైతు, ఉప సర్పంచ్ వామన్, గ్రామస్తులతో కలిసి వాగు వద్దకు వెళ్లారు. తాడు సాయంతో యువకుడిని ఒడ్డుకు క్షేమంగా తీసుకొచ్చారు. -
64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు
సాక్షి, నిర్మల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నీటిమట్టానికి చేరుకొని 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తిన అందులో ఒక్కటి లేవక పోయేసరికి మొత్తం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచిఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదనంగా మూడు లక్షల నీరు ప్రాజెక్టు పైనుండి వారుతుండడంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే రేఖా నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ ప్రాజెక్టు వద్ద ప్రాంతాన్నిపరిశీలించారు. స్థానిక అధికారులు అప్రమత్తమై కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు ముంపు గ్రామాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 12 గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? ‘గడ్డెన్నవాగు’కు భారీగా ఇన్‌ఫ్లో భైంసాటౌన్: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేయగా, రాత్రి నుంచి మళ్లీ ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో అర్ధరాత్రి గేట్లు ఎత్తారు. ఉదయం రెండు, ఆ తరువాత మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 25,200 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. ‘సదర్మాట్’ పరవళ్లు.. ఖానాపూర్: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం గోదావరి అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీలో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో గోదావరికి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని మేడంపల్లి గ్రామంలోని సదర్మామాట్ వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం 7.6 ఫీట్లు కాగా, మగంళవారం 9.11 ఫీట్లలో నీటిమట్టం కొనసాగుతోంది. 35,399 క్యూసెక్కుల వరద గోదావరిలోకి వెళ్తుందని జేఈఈ ఉదయ్ తెలిపారు. -
నిర్మల్‌లో మళ్లీ జోరు వాన
సాక్షి నెట్వర్క్: నిర్మల్ జిల్లాలో ఆదివారం తగ్గుముఖం పట్టిన వాన సోమవారం మళ్లీ మొదలైంది. రోజంతా వర్షం పడింది. నీట మునిగిన ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. మామడ మండలంలో దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించి.. స్థానికులతో మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషరఫ్ పర్యటించారు. టాక్లి, బిద్రెల్లి, కిర్గుల్(బి) గ్రామాల్లో ముంపు బాధితులతో మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, వంతెనలను పరిశీలించి.. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించి.. నాగాపూర్, మందపల్లి చెరువు కట్టలను, వేణునగర్ గ్రామం వద్ద కాల్వను పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రామప్ప సరస్సు నీటిమట్టం 26 అడుగులకు చేరింది. గణపురం మండలం గణపసముద్రం చెరువు 31 అడుగట్లు గరిష్ట సామర్థ్యం కాగా.. సోమవారం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకుంది. పాకాల సరస్సు పూర్తి స్థాయి మట్టానికి దగ్గరగా వచ్చింది. భద్రాద్రిలో గోదావరి వరద: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో పలుచోట్ల సోమవారం కూడా వానలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 913 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. అయితే అంతకు మూడు రెట్లు నష్టం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదా వరి వరద రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వందకుపైగా ట్రాన్స్ఫార్మర్లు వరదలో మునిగినట్టు అంచనా వేశారు. ముంపు తలెత్తే ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తు న్నారు. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
గుడి బడి అయిన వేళ...
-
‘కమిటి’మెంట్‌తో.. కలిసికట్టుగా..
నిర్మల్/బాసర: వారంతా వయసులో చిన్నవాళ్లు.. సాధారణ కుటుంబాల నుంచే వచ్చినవాళ్లు.. చదువుకునేచోట ఇబ్బందులతో ఆవేదన చెందారు.. సమస్యలను పరిష్కరించాలంటూ వరుసపెట్టి విజ్ఞప్తులు చేసుకున్నారు.. ఎక్కడా స్పందన లేకపోవడంతో నిరసన బాట పట్టారు. అడ్డగోలు నినాదాల్లేవు.. ఉద్రేక నిరసన ప్రదర్శనలు లేవు. ఓపికగా, ఓ పద్ధతిగా, వీసమెత్తు హింస లేకుండా ఆందోళన చేశారు. రాత్రీపగలు, ఎండావానను లెక్క చేయకుండా బైఠాయించారు. పక్కా ప్రణాళికతో, అందరి మద్దతు కూడగట్టుకునేలా వ్యవహరించి.. కోరుకున్నది సాధించారు. ఇదీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సాధించిన ఘనత. దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆరు నెలల ముందు నుంచే.. ఈ నెల 14న బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్) విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ఎంతకూ వెనక్కి తగ్గకుండా కొనసాగించి విజయం సాధించారు. ఈ పోరాటం వెనుక ఆరు నెలల శ్రమ ఉంది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను ఎలాగైనా పరిష్కరించు కోవాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ముందే నేరుగా ఉద్యమానికి దిగకుండా.. అందరికీ తమ సమస్యలను చెప్పాలని నిర్ణయించుకున్నారు. క్యాంపస్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో మొద లుపెట్టి.. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి వీసీ, ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి, విద్యాశాఖ మంత్రి దాకా విజ్ఞప్తులు చేశారు. ఎలాంటి స్పందన రాకపో వడంతో చివరి అస్త్రంగా ఆందోళన బాట పట్టారు. ఎలా చేయచ్చో తెలుసుకుని.. తమ ఆందోళన ఎలా ఉండాలి? ఎలా ఉద్యమం చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది? నిరసన తెలిపే హక్కు (రైట్ టు ప్రొటెస్ట్) కింద ఏం చేయొచ్చు, ఏం చేయవద్దన్న అంశాలపై విద్యార్థులు అధ్య యనం చేశారు. ఆర్జీయూకేటీ చట్టం ఏం చెబుతోం దన్నదీ పరిశీలించారు. ఆందోళన సమయంలో సంయమనంతో ఎలా ముందుకు సాగాలనేది కూడా నోట్స్‌గా రాసుకున్నారు. క్రియాశీలకంగా ఉండేవారితో ‘స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ)’ ఏర్పాటు చేసుకున్నారు. వర్సిటీలోని మొత్తం 7 బ్రాంచ్లకుగాను ఒక్కో బ్రాంచ్‌కు ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని చొప్పున 14 మందిని ఎం పిక చేసుకున్నారు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులను, 20 మంది కోర్‌కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అనుసం ధానంగా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు టెక్నికల్ సపోర్ట్ టీమ్, విద్యార్థులను పోగు చేసే టీమ్, స్పైటీమ్.. ఇలా 12 కమిటీలను ఎన్నుకుని, ఎవరేం చేయాలో నిర్ణయించుకున్నారు. వీటిలో జూనియర్ విద్యార్థులనూ భాగస్వాములను చేశారు. ప్రతీది ప్రణాళికతోనే.. సీనియర్, జూనియర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యమం ఎందుకు చేస్తున్నామనేది వివరించారు. ఆందోళన ఎక్కడ చేయాలి? వరుసలో ఎలా, ఎవరెవరు కూర్చోవాలి? భోజన సమయంలో బ్యాచ్‌ల వారీగా ఎలా వెళ్లిరావాలనేది పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. దీనితోనే ఎర్రటి ఎండ మండినా, భారీ వర్షం ముంచెత్తినా ఒక్కరూ కదలలేదు. 24 గంటల దీక్షలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మాయిలు కూడా ఆరు బయటే నిద్రించారు. జిల్లా కలెక్టర్ వచ్చి నాలుగు గంటల పాటు బతిమాలినా లోపలికి వెళ్లలేదు. అంతా గమనిస్తూ.. విద్యార్థులు తమ ఆందోళన ఎక్కడా అదుపు తప్పకుండా, ఎవరూ తమను ప్రభావితం చేయకుండా పక్కాగా వ్యవహరించారు. వర్సిటీలో ఎక్కడేం జరుగుతోంది? ఎవరెవరు క్యాంపస్‌లోకి వస్తున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాన్ని 40 మందితో కూడిన స్పైకమిటీ గమనిస్తూ ఉండేది. రేవంత్‌రెడ్డి వర్సిటీ గోడదూకి వస్తున్న విషయం కూడా పోలీసుల కంటే విద్యార్థులకే ముందు తెలుసు. తమ మధ్య ఉంటూ ఆరా తీసేందుకు పోలీసులు ఎలా ప్రవరిస్తున్నారో కూడా గమనించగలిగారు. ఇక తమ పోరాటాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసేలా చేయడానికి పబ్లిసిటీ కమిటీ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అప్డేట్ చేస్తూ వచ్చింది. చివరి అస్త్రంగానే ఆందోళన మాది కొత్తగూడెం. నాన్న చనిపోవడంతో అమ్మ కష్టపడి చదివించింది. నాకు నాన్నే స్ఫూర్తి. ట్రిపుల్ఈ మూడో సంవత్సరం చదువుతున్నా. ఎంతగా విజ్ఞప్తి చేసినా వర్సిటీ సమస్యలు తీరకపోవడంతో చివరి అస్త్రంగానే ఆందోళనకు సిద్ధమయ్యాం. అందరం సమష్టిగా సాధించుకున్నాం. – మాదేశ్ సుంకరి, ఎస్జీసీ అధ్యక్షుడు సమష్టి విజయం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వెనకడుగు వేయకుండా విద్యార్థులమంతా సమష్టిగా సాధించిన విజయమిది. హుజూరాబాద్ నుంచి వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నా. ట్రిపుల్‌ఐటీలో చదివే విద్యార్థులందరి భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఆందోళన చేశాం. – లావణ్య గున్నేటి, ఎస్జీసీ ఉపాధ్యక్షురాలు శాంతియుతంగా పోరాడి.. మాది వరంగల్. సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. ఎవరికీ ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా పోరాడాలనుకున్నాం. అలాగే చేసి సాధించుకున్నాం. – సాయిచరణ్, ఎస్జీసీ ప్రధాన కార్యదర్శి -
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు విఫలం
-
చర్చలు సఫలం.. కాదు విఫలం
నిర్మల్/బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదోరోజుకు చేరింది. సమస్య పరిష్కారంపై అధికార వర్గాలు, విద్యార్థుల నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. శనివారం ట్రిపుల్ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. వర్సిటీలోని సాక్ భవనంలో శనివారం విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న మంత్రి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులందరూ సోమవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 12 డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరారని, అయితే రేపటిలోగా కేటీఆర్ లెటర్ అందేలా చూస్తామన్నారు. మరోపక్క.. శనివారం నాటి చర్చలు విఫలమయ్యాయని, తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని విద్యార్థులు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. ఏవోను తొలగిస్తూ ఉత్తర్వులు కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీ ఏవోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావును తొలగించి బాధ్యతలను నూతన డైరెక్టర్ సతీశ్‌కుమార్‌కు అప్పగించినట్లు వర్సిటీ వీసీ రాహుల్ బొజ్జా శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళనల వ్యవహారంలో బాధ్యతాయుతంగా పనిచేయకపోవడంతో రాజేశ్వరరావును విధుల నుంచి తొలగించారనే ఆరోపణలున్నాయి. మోదీజీ మీరైనా స్పందించండి.. ‘నాలుగు రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకు సమాధానం ఇవ్వట్లేదు. మీరైనా స్పందించండని కోరుతున్నాం..’ అంటూ బాసర విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర విద్యాశాఖ మంత్రితోపాటు సీఎంవో, కేటీఆర్, సబితారెడ్డికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అమ్మలా బాధేస్తోంది: సబితారెడ్డి విద్యార్థులు ఆందోళన విరమించాలంటూ మంత్రి సబితాఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ఓ లేఖను పంపించారు. ‘కోవిడ్‌తో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉంటే.. మంత్రిగానే కాకుండా ఓ అమ్మలా బాధేస్తోంది, ఇప్పటికైనా ఆందోళన విరమించాలి’ అని కోరారు. ట్రిపుల్ ఐటీ.. ఉద్యమంలో ‘క్రియేటివిటి’ ఐదోరోజైన శనివారం విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగించారు. అందరూ పుస్తకాలు పట్టుకుని వచ్చారు. తమ సమస్యల్ని ఆర్ట్స్, బ్యానర్స్, డూడుల్స్, మీమ్స్, కవితలు, పాటల రూపంలో ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టించేలా కళను ప్రదర్శించారు. వాటిని తమ ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ చానళ్ల ద్వారా సోషల్‌మీడియాలో ఉంచారు. రోజంతా ఎర్రటి ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినా విద్యార్థులు దీక్షను కొనసాగించారు. ఐదురోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో పలువురు నీరసిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. -
అటవీ అధికారుల ఆత్మహత్యాయత్నం
నిర్మల్: తాము చేయని తప్పుకు సస్పెండ్ చేశారంటూ అటవీశాఖ అధికారులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలోనే డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్, బీట్ అధికారి వెన్నెల గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. మామడ మండలం ఆరేపల్లి రేంజ్లో అటవీశాఖ భూములను ఆక్రమించడం, పోడుభూముల్లో బోర్లు వేసు కోవడం వంటి చట్టవిరుద్ధ పనులు చేపడుతున్నా.. డబ్బు లు తీసుకుని అడ్డుకోకుండా ఉన్నారంటూ డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్, బీట్ అధికారి వెన్నెలను అటవీశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు గురు వారం అటవీ శాఖ కార్యాలయానికి వచ్చారు. అన్యా యంగా తమను సస్పెండ్ చేశారంటూ ఆఫీస్ ప్రాం గణం లోనే వారు పురుగులమందు తాగారు. అక్కడ ఉన్నవారు అడ్డుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వెన్నెలకు పెద్దగా ప్రమాదం లేదని, రాజశేఖర్‌కు చికిత్స అందించామని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. ఆత్మ హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Basara IIIT: బాసర ఐఐఐటీ విద్యార్థుల నిరసన గళం.. వర్షంలోనూ తగ్గేదేలే!
సాక్షి, నిర్మల్/బాసర: ‘మేమేమైనా రాజకీయ నాయకులమా? మాకు రాజకీయం చేయా ల్సిన అవసరం ఏముంది..? ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా! సమస్యలను పరిష్కరించాలని అడిగే హక్కు కూడా మాకు లేదా?’ అంటూ బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ఐటీ) విద్యార్థులు వరుసగా రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. ‘కలెక్టర్ వస్తే.. విద్యాశాఖ మంత్రి చెబితే మా సమస్యలకు శాశ్వత పరిష్కారం తీరుతుందన్న నమ్మకం పోయింది. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వర్సిటీకి రావాలి, రెగ్యులర్ వీసీని నియమించాలి, మాకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. ఇవే మా ప్రధాన డిమాండ్లు. ఇవి తీరే వరకు వెనకడుగు వేసేది లేదు’ అని స్పష్టంచేశారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలంటూ విద్యార్థులు బుధవారం ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో ఆందోళన కొనసాగించారు. ఉదయాన్నే ప్రధాన ద్వారం వద్దకు విద్యార్థులంతా చేరుకున్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దే రోజంతా బైఠాయించారు. రాత్రయినా.. వర్షం పడుతున్నా.. గొడుగులు పట్టుకుని అలాగే ఆందోళన కొనసాగించారు. బుధవారం రాత్రి వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంత్రితో మాట్లాడించినా.. నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ.. అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఆర్జీయూకేటీకి వెళ్లారు. కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితారెడ్డితో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న 12 డిమాండ్లలో రెండు, మూడు తక్షణమే పరిష్కరిస్తామని, మిగితావి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. ఇందుకు విద్యార్థులు ఒప్పుకోలేదు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వచ్చేదాకా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు. సంబంధిత వార్త: బాసర ట్రిపుల్ ఐటీ: స్పందించిన కేటీఆర్.. ఆపై చర్చలు విఫలం.. మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్ చర్చలు సఫలం..: కలెక్టర్ ఆర్జీయూకేటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ చెప్పారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బాసర పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల సందర్భంగా విద్యా ర్థులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు సరికాదన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, విద్యార్థులు గురువారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతారన్నారు. అయితే, తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేదాకా ఆందోళన ఆపేదిలేదని విద్యార్థులు తెగేసి చెప్పడం గమనార్హం. -
బాసర IIIT వద్ద హై టెన్షన్
-
ఉద్యోగాల భర్తీ నిలిపివేత
-
హిప్పో సబ్బుల మాటున ‘మత్తు’ రవాణా
నిర్మల్: నిర్మల్ జిల్లాలో నిషేధిత మత్తు పదార్థం క్లోరోఫామ్ (సీహెచ్)ను రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులుభారీ ఎత్తున పట్టుకున్నారు. ఎవరికీ అను మానం రాకుండా హిప్పో డిటర్జెంట్ పేరిట గుజరాత్ లోని ఓ రసాయనాల ఫ్యాక్ట రీ నుంచి హైదరాబాద్‌కు అక్కడ్నుంచి జిల్లాలకు సర ఫరా చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఆమేరకు అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గుజరాత్‌లోని వాపిలో ఉన్న శ్రీ కెమికల్స్ ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడ్నుంచి నిర్మల్‌కు నవత ట్రాన్స్‌పోర్టు వాహనంలో హిప్పో డిటర్జెంట్ పేరిట 20 బ్యాగుల్లో 560 కిలోల క్లోరోఫామ్‌ను రవాణా చేశారు. వీటిని తీసుకునేందుకు శనివారం నవత కార్యాలయానికి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ధర్మోరకు చెందిన అరుణ్గౌడ్ వచ్చారు. అప్పటికే అక్కడి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు అతడిని పట్టుకున్నారు. కల్లులో కలిపేందుకు క్లోరోఫామ్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని దాదాపు 50 గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. క్లోరోఫామ్ కిలో రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడు అరుణ్‌గౌడ్‌ను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. గతంలో ఇదే కేసులో రెండుసార్లు అరుణ్ గౌడ్ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. -
సోలార్ ‘ఆటో’ కూల్
నర్సాపూర్(జి): ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయట కాలుపెట్టేందుకు జనాలు జంకుతున్నారు. మరి పనిచేస్తే గానీ పూట గడవని వారి పరిస్థితి ఏంటి? అందుకే నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ సుదర్శన్ ఎండ నుంచి ఉపశమనానికి తన ఆటోలో చిన్న కూలర్ అమర్చుకున్నాడు. ఆటోపై సోలార్ పలకలను అమర్చాడు. దాని నుంచి వచ్చే విద్యుత్‌తో ఆటోలో అమర్చిన కూలర్ చల్లదనాన్ని ఇస్తోంది. అటు ప్యాసింజర్లూ చల్లగా ప్రయాణిస్తూ ఐడియా అదిరింది గురూ అంటున్నారు. -
Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే
అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే. తల్లికి తన బిడ్డలతో ఉండే ఏ బిడ్డయినా ఒకటే. ఆవుపాలు అమ్మ పాలకంటే శ్రేష్టం అంటారు. అలా.. ఓ శ్రేష్టమైన ఆవు తన బిడ్డతోపాటు నాలుగు మేకపిల్లలకూ పాలను పంచుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్కు చెందిన ముక్త్యార్కు కొన్నేళ్ల క్రితం అటవీప్రాంతంలో ఓ ఆవుదూడ దొరికింది. దాన్ని పెంచి పెద్దచేసిన తర్వాత అదొక బిడ్డకు జన్మనిచ్చింది. ముక్త్యార్ కొద్దిరోజుల క్రితం నాలుగు మేకపిల్లలను కొన్నాడు. ప్రస్తుతం వాటికి కూడా ఆ గోమాతనే పాలిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. – నిర్మల్ -
నేనేం చేశాను నాన్నా..!
నిర్మల్/నర్సాపూర్(జి): నిండా రెండేళ్లు లేని కొడుకుతో కలిసి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు.. లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన బరిడే వినేశ్(24)కు కుభీర్ మండలంలోనిసాంవ్లీ గ్రామానికి చెందిన సరితతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం అభిరామ్ అలియాస్ అయాన్ జన్మించాడు. ఇద్దరు అన్నదమ్ములతో కలిసి వినేశ్ సొంతూరులోనే గొర్రెలమందను చూసుకుంటున్నాడు. ఇటీవలే ఆస్తిపంపకాలూ చేసుకుని అన్నదమ్ములు ప్రశాంతంగా ఉన్నారు. ఈక్రమంలో ఈనెల 20న సరిత, అభిరామ్‌లను తీసుకుని వినేశ్ బైక్‌పై తన అత్తగారి ఊరు సాంవ్లీకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దుకాణానికి వెళ్దామని చెప్పి కొడుకు అభిరామ్‌ను పిలిచాడు. బండిపై వెళ్లిన ఆ తండ్రీకొడుకులు సాయంత్రమైనా తిరిగి రాలేదు. కనకాపూర్ వెళ్లాడేమోనని సరిత కుటుంబసభ్యులు ఫోన్ చేసి ఆరా తీశారు. అక్కడికీ రాలేదని తేలడంతో కుభీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 21నుంచి గాలిస్తున్నా.. వినేశ్ తన వెంట సెల్‌ఫోన్ తీసుకెళ్లక పోవడంతో ఆచూకీ లభించలేదు. కొడుక్కి ఉరేసి.. తానూ వేసుకుని.. జిల్లాలోని నర్సాపూర్(జి) మండలం నసీరాబాద్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మహిళలు మంగళవారం తునికాకు సేకరణకు వెళ్లారు. అక్కడ చెట్టుకు వేలాడుతూ రెండు కుళ్లిన శవాలు కనిపించాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి, నిర్మల్‌రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్సైలు అక్కడకు వెళ్లి పరిశీలించారు. సమీపంలో లభించిన బైక్, చిన్నారి అభిరాం మృతదేహం ఆధారంగా ఈనెల 21న సాంవ్లీ నుంచి బయలుదేరిన తండ్రీకొడుకులేనని ధ్రువీకరించారు. ముందుగా కొడుక్కి ఉరేసి, తర్వాత వినేశ్ ఉరేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కలహాలే కారణం.. ఘటనాస్థలంలో వినేశ్ రాసినట్లుగా ఉన్న సూసైడ్ నోట్ దొరికింది. తమ ఆత్మహత్యలకు భార్య, బామ్మర్దిల వేధింపులే కారణమని రాసినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య స్పర్థలు ఉన్నాయని, గతంలోనూ ఇలాగే కొడుకును తీసుకుని వినేశ్ బయటకు వెళ్లాడని, మళ్లీ పోలీసుల సాయంతో తిరిగి వచ్చాడని బంధు వులు చెబుతున్నారు.