Nirmal Photo Feature: Cow Is Sharing Milk With her Baby And Goat Kids - Sakshi
Sakshi News home page

Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే

Published Thu, Apr 28 2022 4:55 PM | Last Updated on Thu, Apr 28 2022 5:25 PM

Photo Feature: Cow Is Sharing Milk With her Baby And 4Goat Kids At Nirmal District - Sakshi

అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే. తల్లికి తన బిడ్డలతో ఉండే ఏ బిడ్డయినా ఒకటే. ఆవుపాలు అమ్మ పాలకంటే శ్రేష్టం అంటారు. అలా.. ఓ శ్రేష్టమైన ఆవు తన బిడ్డతోపాటు నాలుగు మేకపిల్లలకూ పాలను పంచుతోంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌కు చెందిన ముక్త్యార్‌కు కొన్నేళ్ల క్రితం అటవీప్రాంతంలో ఓ ఆవుదూడ దొరికింది. దాన్ని పెంచి పెద్దచేసిన తర్వాత అదొక బిడ్డకు జన్మనిచ్చింది. ముక్త్యార్‌ కొద్దిరోజుల క్రితం నాలుగు మేకపిల్లలను కొన్నాడు. ప్రస్తుతం వాటికి కూడా ఆ గోమాతనే పాలిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది.
 – నిర్మల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement