Goat kids
-
Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే
అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే. తల్లికి తన బిడ్డలతో ఉండే ఏ బిడ్డయినా ఒకటే. ఆవుపాలు అమ్మ పాలకంటే శ్రేష్టం అంటారు. అలా.. ఓ శ్రేష్టమైన ఆవు తన బిడ్డతోపాటు నాలుగు మేకపిల్లలకూ పాలను పంచుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్కు చెందిన ముక్త్యార్కు కొన్నేళ్ల క్రితం అటవీప్రాంతంలో ఓ ఆవుదూడ దొరికింది. దాన్ని పెంచి పెద్దచేసిన తర్వాత అదొక బిడ్డకు జన్మనిచ్చింది. ముక్త్యార్ కొద్దిరోజుల క్రితం నాలుగు మేకపిల్లలను కొన్నాడు. ప్రస్తుతం వాటికి కూడా ఆ గోమాతనే పాలిస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. – నిర్మల్ -
జాతి వైరానికి దూరం..ఆ అమ్మతనం
సాక్షి, గూడెంకొత్తవీధి (పాడేరు) : సృష్టిలో అమ్మతనానికి మించిన దైవం మరొకటి లేదు. అనంతకోటి జీవరాశుల్లో జాతి వైరం సహజం. కుక్కకు కోడికి పడదు. కోడికీ పిల్లికి పడదు. ఇలా ఒక్కో జాతివైరం ప్రకృతి సహజంగా ఉంటుంది. ఇందులో ప్రేమాభిమానాలకు తావుండదు. జీకేవీధి మండలంలో సప్పర్ల గ్రామంలో అబ్బాస్ అనే వ్యక్తి ఇంట్లో మేక పిల్లను పెంచుతున్నాడు. తన ఇంటిలో ఒక శునకం ఉంది. మేకకు రెండు పిల్లలు జన్మించాయి. ఐతే ఇటీవల మేక అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో రెండు మేక పిల్లలు అనాథలయ్యాయి. దీంతో తన ఇంటిలో ఉన్న కుక్క, మేక పిల్లలకు పాలిచ్చింది. మేక పిల్లలు కుక్క పాలు తాగుతున్నాయి. -
మేకపిల్లలా.. మజాకా!
చిత్రం చూశారా..? రెండు మేక పిల్లలు ఆడుతూ.. ఆడుతూ.. ఓ ఇంటిలోపలి నుంచి బయటికి వచ్చిన దూలంపై ఒకటి.. మరో దూలంపై ఇంకొకటి ఎక్కి అదరకా.. బెదరకా.. అట్టే నిల్చున్నాయి. ఈ దృశ్యం ఆదివారం పెద్దేముల్ మండలం మంబాపూర్లో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. - పెద్దేముల్