Milk
-
పాలు కారుస్తున్న వేప చెట్టు ఎగవడ్డ అమ్మలక్కలు
-
గరిటెడైనను చాలు.. గాడిద పాలు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.తెలంగాణ నుంచి వచ్చి..తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.15 మిల్లీలీటర్లు.. రూ.100కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.ఎందుకంత డిమాండ్ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.రోజుకి రూ.2 వేల సంపాదన మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి -
52 ఏళ్లుగా అన్నం బంద్!
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామానికి చెందిన రిటైర్డు ఉపాధ్యాయుడు లొక్కిడి గంగారాం యాభై రెండేళ్లుగా అన్నం తినడం బంద్ చేశారు. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామంలో 1948లో గంగారాం జన్మించారు. యాభై ఏళ్ల క్రితం ఆయన కొలిప్యాక్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. దైవ చింతన ఎక్కువగా ఉండడంతో అప్పటి నుంచి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద ఓ రెండు గదులలో నివాసం ఉంటున్నారు. గంగారాంకు భార్య సత్యగంగు ఉన్నారు. కుమారుడు గతంలోనే వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రస్తుతం గంగారాం వయస్సు 76 ఏళ్లు. గంగారాంకు 1971లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటి పోస్టింగ్ కలిగోట్ యూపీఎస్ పాఠశాలలో రాగా, అక్కడే 18 ఏళ్లు పని చేశారు. అప్పుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1972 సంవత్సరం నుంచి గంగారాం అజీర్తి సమస్యతో అన్నం తినడం బంద్ చేశారు. దీంతో ఆహారంగా పల్లి పలుకులు, నీరు తీసుకోవడం ప్రారంభించారు. ఉపాధ్యాయుడిగా కలిగోట్, కొలిప్యాక్, మనోహరాబాద్, కొండాపూర్, మచ్చర్ల, సుర్బిర్యాల్, ఖుదావంద్‌పూర్, చేంగల్, వాడి, లింగాపూర్ గ్రామాల్లో పని చేశారు.2004లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి పండ్లు జ్యూస్, అరటి, ఆపిల్, సీజనల్ పండ్లు తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. యాభై రెండు ఏళ్లుగా ఎలాంటి అనారోగ్యం రాలేదని గంగారాం తెలిపారు. ఒక్క మందు గోలి, ఇంజెక్షన్ తీసుకోలేదన్నారు. స్వచ్ఛమైన గాలి, సాత్విక ఆహారం తీసుకుంటే అనారోగ్యం దరి చేరదన్నారు. ప్రస్తుతం గంగారాం ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమయ్యారు. గత యాభై ఏళ్లు గా ఊరూరా తిరుగుతూ ‘శ్రీరామ కోటి ’రాయిస్తున్నారు. వెయ్యి కోట్లు రామనామం రాయించాలని సంకల్పంతో ఉన్నట్లు తెలిపా రు. ప్రస్తుతం మనోహరాబాద్ గ్రామ రెవిన్యూ శివారులో పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. లోక కల్యాణం, భక్తిభావం, మానవతా దృక్పథంతో భగవంతుని సన్నిధికి చేరుకోవాలని తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనదని, ఈ జీవితం భగవంతునికి అంకితమని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో బైక్‌పై తిరుగుతూ రామకోటి రాయిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నారు. పాండురంగ ఆశ్రమం వద్ద అన్ని రకాల దేవత విగ్రహాలను, స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. పచ్చని చెట్లు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి వచ్చే వారికి దైవత్వాన్ని బోధిస్తున్నారు. -
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు. ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..! ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! -
రెండో స్థానానికి కర్ణాటక
భారతదేశంలో కర్ణాటక రెండో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్), మాండ్య జిల్లా సహకార మిల్క్ యూనియన్లు సంయుక్తంగా కొత్త నందిని పాల ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడారు. దేశంలో పాల ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది.డెయిరీ రంగానికి రాష్ట్రం అపార మద్దతు ఇవ్వడంతోనే ఈ విజయం సాధ్యమైందని ముఖ్యమంత్రి చెప్పారు. పాడి పరిశ్రమను పెంపొందించడంలో, పాల ఉత్పత్తిదారులకు సరసమైన ధర కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కర్ణాటక ప్రస్తుతం రోజుకు 92-93 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు 2.5 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ‘క్షీరధారే పథకం’ ద్వారా, పాలను లీటరుకు రూ.32 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదనంగా లీటరుకు రూ.5 ప్రోత్సాహకాన్ని అందజేస్తోంది.ఇదీ చదవండి: అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!స్టాక్ మార్కెట్లో పాల ఆధారిత ఉత్పత్తులను అందించే కంపెనీలకు కర్ణాటక రాష్ట్రంలోని మిల్క్ యూనియన్ల సహకారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ పాలతోనే విభిన్న ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలియజేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి, పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్న కొన్ని కంపెనీలు కింద తెలియజేస్తున్నాం.పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్: గోవర్ధన్ అండ్ గో బ్రాండ్లకు ప్రసిద్ధి.దొడ్ల డెయిరీ లిమిటెడ్: పాల ఉత్పత్తుల తయారీ, పంపిణీలో దొడ్లా డెయిరీ దక్షిణ భారతదేశంలో బిజినెస్ చేస్తోంది.హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్: హట్సన్, అరుణ్, ఆరోక్య వంటి బ్రాండ్లను ఇది నిర్వహిస్తోంది.హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: ఈ సంస్థ ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.వాడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: ఐస్ క్రీములకు ఇది ప్రసిద్ధి. వాడిలాల్ పాల ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. -
అలాంటి వాళ్లు నెయ్యి లేదా వెన్న తినొచ్చా..?
నెయ్యి లేదా వెన్న ఏదైన డెజర్ట్ లేదా రెసిపీ రుచిని అమాంతం పెంచేస్తుంది. అయినా నెయ్యిని జోడించగానే ఏ స్వీట్ అయినా కమ్మగా మారిపోతుంది. ఎవ్వరికైనా..నెయ్యి లేదా వెన్నని తినే అలవాటు ఉంటే అంత ఈజీగా మానుకోలేరు. ఆ రుచి అలా కట్టిపడేస్తుంది. అయితే లాక్టోస్ పడని వారు ఇవి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు ఏం చేస్తే బెటర్? నెయ్యికి ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయి వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.లాక్టోస్ అసహనం అంటే..లాక్టోస్ అసహనం అనేది జీర్ణక్రియ పరిస్థితి. ఇది పాలల్లో ఉండే చక్కెర అయిన లాక్టోస్‌ను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లాక్టోస్ సరిపడని కారణంగా ఆయ వ్యక్తులు ఈ కింది సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అవేంటంటే..కడుపు నొప్పివాంతులువిరేచనాలునిరంతర కడుపు ఉబ్బరంగ్యాస్ సమస్య అలాంటి వారు వెన్న కంటే నెయ్యి తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాచినప్పుడు లాక్టోస్ కోల్పోయి కొవ్వులు మాత్రమే ఉంటాయి. అదే వెన్నలో ఎక్కువ లాక్టోస్ ఉంటుంది. అందువల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఇది అంత సురక్షితం కాదు. ప్రత్యామ్నాయాలు..సాధారణ పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు మంచివి. అలాగే కొబ్బరి లేదా బఠానీ పాలను కూడా ఉపయోగించొచ్చు. ఇవన్నీ పోషకమైనవి సాధారణ ఆవు పాలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు. నోట్: ఈ కథనం కేవలం అవగాహన కొరకు మాత్రమే! View this post on Instagram A post shared by Amita Gadre | Nutritionist (@amitagadre) (చదవండి: మరమరాల చాట్ అమ్ముతూ బ్రిటిష్ వ్యక్తి..!) -
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్‌లోని కెమికల్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్ -
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివనే చాలామంది భావిస్తారు. అంతెందుకు పూర్వకాలం మన పెద్దవాళ్లు అప్పుడే పితికిన పాలనే నేరుగా తాగేవారు కూడా. ఇలా తాగితే మంచి పోషకాలు అందుతాయని విశ్వసించేవారు. అయితే శాస్త్రవేత్తుల ఇలా అస్సలు తాగకూడాదని చెబుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తయాని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం మంచిదనే భావన కేవలం అపోహే అనే కొట్టిపారేస్తున్నారు. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే తాగాలని పిలుపునిస్తున్నారు. అసలు పచ్చిపాలు ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం? శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఏం వెల్లడయ్యిందంటే..పాశ్చరైజ్ చేసిన పాల కంటే పచ్చిపాలే రుచిగా ఉంటాయని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. దీని వల్ల లాక్టోస్ అసహనం ఉండదని, అలెర్జీలకు చికిత్స చేయగలదని చెబుతుంటారు. ముఖ్యంగా గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వాదనలు వినిపిస్తునన్నాయి. కానీ శాస్తవేత్తల పరిశోధనల్లో ఇవన్ని నిజం కాదని తేలింది. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలతో పోలిస్తే పచ్చి పాలు తాగడం లేదా సంబంధిత ఉత్పత్తులను తీసుకోవడం చాలా ప్రమాదమని అధ్యయనంలో వెల్లడయ్యింది. అలాగే ఆరోగ్యానికి సురక్షితం కాదని తేలింది. అదే పాశ్చరైజేషన్ పాల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం చాలా తక్కువని తెలిపారు. ఎందుకు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటే..పచ్చిపాలల్లో సూక్ష్మక్రిములు ఎక్రువగా ఉంటాయి. ఇవి ఆహార విషాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల ఉదర తిమ్మిరి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తయని చెబుతున్నారు. పచ్చిపాలల్లో సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు ఉంటాయిని, ఇవి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్పారు. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల వల్ల 840 రెట్లు అనారోగ్య ప్రమాదం, 45 రెట్లు ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంటుందని అన్నారు. పచ్చిపాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎవరైనా దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్యానికి గురవ్వుతారని వైద్యలు హెచ్చరించారుముఖ్యంగా చిన్నారులు, యువకులు, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, కేన్సర్, మధుమేహం లేదా హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి ఈ పాలు మరింత ప్రమాదకరమని చెప్పారు. అంతేగాదు అమెరికాలో పచ్చిపాలను విక్రయించడం చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాల్లో ఈ పాల విక్రయానికి షరతులతో కూడిన అనుమతి ఉంది. కేవలం రైతు నేరుగా పచ్చిపాలను విక్రయిస్తేనే అక్కడ ప్రజలు వినియోగించవచ్చు. అదీగాక ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ కలకలం పచ్చిపాల వినియోగాన్ని మరింతగా పరిమితం చేసింది. పక్షులు నుంచి పౌల్ట్రీ అలా యూఎస్‌లోని ఆవులకు సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. దీని కారంణంగా నలుగురు వ్యక్తులు మరణించారు కూడా. ఈ నేపథ్యంలో పచ్చిపాల వినియోగంపై మరింత ఆందోళనలు వెల్లువెత్తాయి. పాశ్చరైజేషన్ అంటే..? ఇది పాలను సురక్షితంగా చేస్తుందా..?పాల భద్రతకు పాశ్చరైజేషన్ ముఖ్యం. పాలను 145 డిగ్రీల ఫారెన్ హీట్‌కు గురిచేయడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే జెర్మ్స్, సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే ఈ ప్రక్రియలో పాలు త్వరతిగతిన చల్లబడిపోతాయి కూడా. పశ్చిపాలల్లో ఉండే పోషలకాలే పాశ్చరైజేషన్ పాలల్లో కూడా ఉండటమే కాకుండా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
పాలు, పాల ఉత్పత్తులకు ఏ1, ఏ2 పేర్లు వద్దు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కింద A1, A2 పేరుతో పాలు, నెయ్యి లేదా పాల ఉత్పత్తులను విక్రయించడంపై స్పష్టతనిచ్చింది. అన్ని పాల ఉత్పత్తుల మీద ఏ1, ఏ2 క్లెయిమ్‌లను తొలగించాలని వెల్లడించింది.ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ క్లెయిమ్‌లను వెంటనే తమ వెబ్సైట్ల నుంచి తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇప్పటికే ఈ లేబుల్స్ ముద్రించి ఉంటే.. అలంటి వాటిని తొలగించడానికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. లేబులింగ్స్ అనేవి కస్టమర్లను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006కు అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.ఏ1, ఏ2 పాలలో ప్రోటీన్లు వేరు వేరుగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ రెండు కేటగిరీల పాలలోని ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ నియమాలను పాటించాలని.. మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. -
రోజూ ఎనిమిది గ్లాసులు పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్! ఇలా తీసుకోవచ్చా..?
బాలీవుడ్ నటుడు, యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ఒక ఇంటర్యూలో తన చిన్నప్పుడూ రోజుకి ఏకంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు పాలు తాడేవాడినని చెప్పారు. అందదువల్లే తాను జీర్ణ సమస్యలు ఫేస్ చేస్తున్నానని తెలిసిందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన నాన్న ధర్మేంద్రకి బహుమతిగా వచ్చిన ప్రత్యేక గాజు గ్లాస్ తన దగ్గర ఉండేదని, దానిలోనే పాలు తాగేవాడనని అన్నారు. ఇలా ఆ హీరోలా ప్రతి రోజూ అన్ని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?. ఎదురయ్యే సమస్యలేంటీ తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాబీ డియోల్ మాదిరిగా అంతలా పాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇలా పిల్లలు, పెద్దలు తీసుకుంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తారని అన్నారు. పాలు కాల్షియం, విటమిన్ డీ,ప్రోటీన్ మూలం. ఇవి ఎముకల పెరుగుదలకి, అభివృద్ధికి తోడ్పతుంది. అయితే అధికంగా తీసుకుంటే మాత్రం అధిక బరువు, లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదుర్కొనవల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ఏంటి లాక్టోస్ అసహనం..?పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల లాక్టోస్ ఎంజైమ్‌లు అధికంగా పని చేస్తాయి కాబట్టి శరీరంలో లాక్టోస్ ఎంజైమ్‌లలో క్షీణత ఏర్పడి ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ లాక్టోస్ అనేది పాలలో కనిపించే చక్కెర. ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతుంది. ఓ వయసు వచ్చేటప్పటికీ శరీరంలో లాక్టేజ్ కార్యకలాపాలు తగ్గుతాయి. దీంతో లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, డయేరియా, పొత్తికడుపు తిమ్మిరికి కారణమవుతుంది. ఈ లక్షణాలు రోజూవారీ జీవితాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయం ప్రభావితం చేస్తాయని వెల్లడించారు నిపుణులు.వచ్చే ఆరోగ్య సమస్యలు..ఎక్కువ పాలు తాగే పెద్దల్లో అధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుంది. పాలు కేలరీలు కలిగిన పానీయం. పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు పిల్లలలో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను కలుగజేసే అవకాశం ఉంది. కలిగిస్తుంది. ఇలా పాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారి తీస్తుంది.అలాగే దీనిలోని అధిక కాల్షియం ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అదీగాక చాలా పాడి పశువులకు హార్మోన్ల కాక్టెయిల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇది పశువులలో వేగవంతమైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పైగా కృత్రిమంగా పాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఈ హార్మోన్లలో ఒకటి, IGF-1, అసాధారణ కణాల విభజన పెంచి, వివిధ కేన్సర్లు, మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. మితంగా పాలు తీసుకుంటే మంచి పోషకాలను, ప్రయోజనాలను పొందగలం. పోషకాల అసమతుల్యతను నివారించేలా పిల్లలు, పెద్దలు సమతుల్య ఆహారానికే ప్రాధాన్యతే ఇవ్వాలి. ముఖ్యంగా సంతృప్త కొవ్వును తగ్గించడం లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?
డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌ని నీరు వర్సెస్ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్ల నుంచి డెజర్ట్‌ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. నీటిలో నానబెడితే..నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్ డైట్ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. పాలల్లో నానబెడితే..పాలల్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే..జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్‌ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
పొంగిన నందిని పాల ధర
శివాజీనగర: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరికొన్ని నిత్యావసరాల ధరలను భగ్గున మండించింది. రాష్ట్ర పాల సమాఖ్య (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాల ధరను లీటర్‌పై రూ. 2 పెంచింది, బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటినుంచి అర్ధ, 1 లీటర్ పాల ప్యాకెట్లో అదనంగా 50 మి.లీ.పాలను చేర్చి విక్రయిస్తామన్నారు. 50 మిల్లీలీటర్ల పాల విలువ 2 రూపాయల 10 పైసలు అవుతుందన్నారు. ఇది అదనపు పాల ధర తప్ప పెంపు కాదని చెప్పారు.లీటరుకు రూ. 44కు చేరికప్రస్తుతం నందిని నీలిరంగు ప్యాకెట్ పాల ధర లీటర్ రూ.42 ఉండగా, బుధవారం నుంచి రూ.44 అవుతోంది. అర్ధ లీటర్ పాల ధర రూ.22 నుంచి రూ. 24కు చేరుతుంది. పెరుగు, ఇతర నందిని ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని తెలిపారు. కొన్నిరోజుల పాటు పాల ప్యాకెట్లపై పాత ఉన్నా కొత్త రేటును వసూలు చేస్తారని ప్రజలు గమనించాలని కోరారు.పోరాడుతాం: బీజేపీపాల ధరపై బీజేపీ నేతలు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే పాల ధరను 2 సార్లు పెంచారు. పేదలు, మద్య తరగతి ప్రజలపై కొంచైమెనా కనికరం ఉంటే తక్షణమే పాల ధరను తగ్గించాలన్నారు. పెట్రోల్–డీజిల్ ధరల పెరుగుదల, కూరగాయలతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెంపుపై నిరంతరం ఆందోళనలు చేస్తామని తెలిపారు.నాకు తెలియదే: సీఎం సిద్దుకేఎంఎఫ్ పాల ధర పెంపు తన దృష్టికి రాలేదని సీఎం సిద్దరామయ్య చెప్పడం గమనార్హం. మంగళవారం తన నివాస కార్యాలయం కృష్ణాలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం నిర్వహణపై సాహితీవేత్తలతో చర్యలు జరిపారు. ఆపై విలేకరులతో మాట్లాడుతూ పాల ధర పెంపు నాకు తెలియదు. కేఎంఎఫ్‌తో మాట్లాడుతాను. ధరల విషయం ప్రభుత్వ పరిధిలో ఉండదు అని అన్నారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పాల ధర తక్కువగా ఉంటుందని చెప్పారు. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వారు ఉపయోగించే కార్ల దగ్గర నుంచి వాచ్‌ల వరకు ప్రతీదీ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాటి ధరలన్ని కోట్లలోనే. అలానే ప్రస్తుతం అంబానీ కుటుంబం తాగే పాల గురించి ఓ టాపిక్ నెట్టింట తెగ వైరల్‌గా అవుతోంది. వాళ్లు తాగే అదే పాలను కొందరూ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా తాగుతారట. మరీ అవి ఏ పాలు, వాటి ప్రత్యకతలేంటో చూద్దామా..!సాధారణంగానే ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమేనట. వారు తాగే పాలు పూణే నుంచి వస్తాయట. నెదర్లాండ్స్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు జాతి పాలను తాగుతారట. ఈ జాతికి చెందిన ఆవులను పూణేలోని భాగ్యలక్ష్మి డెయిరీలో పెంచుతారు. ఈ డెయిరీ ఏకంగా 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు మూడు వేలకు పైగా ఈ జాతి ఆవులు ఉంటాయని చెబుతున్నారు. ఈ జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పాడి పరిశ్రమలోని ప్రధానమైన జాతి. వీటిని అత్యధిక పాలను ఉత్పత్తి చేసే జాతిగా పిలుస్తారు. ఈ పాలల్లో ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ ఆవుల సంరక్షణ కోసం కేరళ నుంచి వచ్చే ప్రత్యేక రబ్బరు పూతతో కూడిన దుప్పట్లు ఉపయోగిస్తారట. ఇవి మాములు వాటర్ తాగవు..ఆర్ఓ వాటర్‌ని మాత్రమే తాగుతాయట. ఇవి చూడటానికి నలుపు తెలుపు లేదా ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట. సాధారణంగా హోల్‌స్టెయిన్ ఆవు సాధారణంగా 680 నుంచి 770 కిలోల బరువు ఉంటుంది. రోజుకు దాదాపు 25 లీటర్లకు పైగా పాలు ఇస్తాయట. ఈ పాల ధర ఏకంగా రూ. 152లు పైనే పలుకుతుందట.ఈ పాలల్లో ఉండే పోషకాలు..హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవు పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి, A1, A2 బీటా-కేసిన్ (ప్రోటీన్) వంటివి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా ఈ పాలల్లో ఉంటాయట. (చదవండి: మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!) -
బర్డ్‌ఫ్లూ భయం లేదు.. అలా చేసిన పాలు సేఫ్!
జంతువుల్లో ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్ అమెరికాలో మనిషికి సోకడం భయాందోళన కలిగిస్తోంది. వైరస్ ఆనవాళ్లు మనుషులు తాగే ఆవు పాలలో కనిపించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు కీలక విషయం చెప్పారు.యూఎస్ స్టోర్లలో విక్రయిస్తున్న పాలు బర్డ్ ఫ్లూ నుండి సురక్షితమైనవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాలను పాశ్చరైజేషన్ చేస్తారని, పాశ్చరైజేషన్ వ్యాధిని ప్రభావవంతంగా చంపుతుందని పేర్కొన్నారు.అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుయంజా (HPAI) వ్యాప్తి దేశవ్యాప్తంగా పాడి పశువుల మందల ద్వారా వ్యాపించింది. తేలికపాటి లక్షణాలతో ఒక వ్యక్తికి సోకింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పాల విక్రయ సంస్థల నుంచి నమూనాలను ఎఫ్‌డీఏ పరీక్షించింది. ఇందులో ప్రతి ఐదు శాంపిల్స్‌లో ఒక దాంట్లో వైరస్ ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.అయితే పాశ్చరైజేషన్ ప్రక్రియ కారణంగా వైరస్ పాల ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం లేదని ఎఫ్‌డీఏ ప్రకటించింది. దీనిపై మరిన్ని పరీక్షలు అవసరమని పేర్కొంది. హెచ్‌పీఏఐని నిష్క్రియం చేయడంలో పాశ్చరైజేషన్ ప్రభావవంతంగా ఉంటుందిని ప్రాథమిక ఫలితాల్లో గుర్తించినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఇంతకుముందు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు పచ్చి పాలలో కనుగొనడంతో ఆరోగ్య అధికారులు పచ్చి పాలను తాగొద్దని సూచించారు. -
యూఎస్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్‌ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం..బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్‌ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్‌తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
సీతాకోక చిలుక పాలు గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఆవు పాలు, గేదే పాలు, ఒంటె పాలు ఇలా రకరకాల పాల గురించి విన్నారు. వాటిలో అత్యంత ఖరీదైన పాలు ఏవంటే ఒంటె పాలని ఠక్కున చెప్పేస్తారు. కానీ వాటన్నింటికంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలు ఇంకొకటి ఉన్నాయి. ఔను! అది కూడా ఓ చిన్న జీవి నుంచి వచ్చే పాలవి. ఎవ్వరూ నమ్మరు దాన్నుంచి పాలు వస్తాయా ? అని. కానీ ఓ జపాన్ వ్యక్తి ఆ జీవి నుంచి పాలను తీసి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఏ జీవి అంటే.. అదేనండి సీతాకోక చిలుక. ఏంటీ సీతాకోక చిలుక నుంచా..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగానే సీతాకోక చిలుక నుంచి పాలు తీసున్నాడు జపాన్ వ్యక్తి. అసలు సీతాకోక చిలుకకు పాలు ఎలా వస్తాయనే కదూ..! లార్వా దశలో ఓ చిన్న గుడ్డు నుంచి గొంగళి పురుగు బయటకొచ్చి ఏ చెట్టు కాండానికో, ఏ గోడకో బలంగా చుట్టుకుని దాని చుట్టు ఓ దూదిలాంటి రక్షణ వలయాన్ని ఏర్పారుచుకుంటుదంది. అది ప్యూపా దశకు చేరుకోవడానికి నాలుగు వారాలు పడుతుంది. సరిగ్గా అది ప్యూపా దశకు చేరుకుని ఇంకొక్క వారంలో సీతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుందనంగా దాని బాడిలో భారీ మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఆ టైంలో దాని కకూన్(గూడు) నుంచి ఈ ప్యూపాను తీసి జెంటిల్‌గా తోక భాగాన్ని ప్రెస్ చేయగానే తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది. ఇది చాలా గాఢతగా ఉంటుంది. ఇది ఒక లీటర్ నీటిలో కలిపి ఉపయోగించాలి. ఈ పాలని మార్కెట్లో అమ్మి కోట్లు సంపాదిస్తున్నాడు జపాన్ వ్యక్తి. ఈ సీతకోక చిలుక పాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలల్లో ఒకటిగా నిలిచింది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఇది ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న మహిళల పాలిట వరంలా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిన చాలామంది స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడ్డారట కూడా. ఇది నేచురల్ వయాగ్రాల కూడా పనిచేస్తుందంట ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయట. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. > (చదవండి: సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!) -
అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!
అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న. ఈ మిల్క్ షేక్నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ‘‘ఠండా..ఠండాగా కావాలి’’ అంటూ ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్ షేక్ లేదా బనానా మిల్క్ స్మూతీ. రెండు బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి, జ్యూస్ చేయాలి. దీనికి ఓ రెండు ఐస్‌ముక్కలు, కాస్తంత హార్లిక్స్.. డ్రైఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది. అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు పాల ద్వారా 150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి సరిపోతాయి. బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది. పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్‌తో బరువు పెరగాలనుకుంటే, బనానా మిల్క్ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్‌లను యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్. పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరు దూరంగా ఉండాలి? ♦ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ♦ సైనసైటిస్‌తో బాధపడేవారు పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ♦ పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు. -
అమూల్ బేబీనే టాప్..!
క్యూట్‌గా ఉన్న చిన్న పిల్లలను చూస్తే వెంటనే అమూల్ బేబీలా ఉన్నారు అంటాం. అంతలా అమూల్ బ్రాండ్ జనాల్లోకి వెళ్లింది. గుజరాత్‌కు చెందిన కంపెనీయే అయినా తెలుగు రాష్ట్రాల్లోను దీని పాల ఉత్పత్తులకు మంచి పేరే ఉంది. ఈ కంపెనీని పాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ కంపెనీగా మార్చాలని ప్రధాని మోదీ కంపెనీ వాటాదారులను విజ్ఞప్తి చేశారు. 'అమూల్' బ్రాండ్‌ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)ని ప్రస్తుతం ఎనిమిదో స్థానం నుంచి ప్రపంచంలోనే నంబర్ వన్ డెయిరీ కంపెనీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం రైతులు, సహకార సంఘాలకు సంబంధించిన ఇతర వాటాదారులకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని మోతెరా ప్రాంతంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సహకార సంఘాలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పదేళ్లలో భారతదేశ తలసరి పాల లభ్యత 40 శాతం పెరిగిందని చెప్పారు. ప్రపంచ పాడి పరిశ్రమ 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. భారత డెయిరీ రంగం మొత్తం టర్నోవర్ రూ.10 లక్షల కోట్లుగా ఉందన్నారు. వరి, గోధుమలు, చెరకు ఉత్పత్తి ఉమ్మడి టర్నోవర్ కంటే చాలా అది చాలా ఎక్కువ అన్నారు. డెయిరీ రంగంలో సేవలందిస్తున్న మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారని చెప్పారు. -
నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?
రోజువారీ జీవితంలో పాలు పెరుగు లేకుండా పొద్దు గడవదు. చాయ్ రూపంలో లేదా పెరుగు రూపంలోనో పాలను తీసుకోకుండా ఉండలేం. అందులోనూ ఆఫీస్‌కి వెళ్లేవాళ్లకు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అలాగే పెరుగన్నం తినకుండా భోజనం పూర్తి అయ్యిన ఫీల్ రాదు చాలామందికి. అయితే డాక్టర్లు మాత్రం ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే బరువు సులభంగా తగ్గుతారు అంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. అంతేగాదు ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మన ఆరోగ్యంలో గొప్ప మెరుగైన మార్పులు సంభవిస్తాయని అన్నారు. అదేంటి పౌష్టికాహారం అయిన పాలే మానేయాలా? ఏంటిదీ..? ఒక నెల రోజుల పాటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేందుకు సిద్ధపడితే మంచి మెరుగైన ఫలితాలు అందుకోగలరని వైద్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ డైరీ ఫ్రీ ప్రయోగం మంచి సత్ఫతితాలనిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు యశోధ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే డైరీ ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉంటే ఆహారం నుంచి అదనపు సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాయని అన్నారు. ఈ డైట్ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మెరుగ్గా ఉంచుతుందని చెబుతున్నారు. జస్ట్ మూడు వారాల్లోనే దీని ప్రయోజనాలు మన శరీరంలో కనిపించడం మొదలవుతుందని తెలిపారు. అంతేగాదు గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం వంటి రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు. అలాగే ఈ డైరీ ఉత్పత్తులు మన ఆహారంలో తగ్గిచడం ప్రారంభిస్తామో అప్పుడూ వెంటనే మన బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డైట్ ప్రభావం వ్యక్తులు మధ్య వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడూ పోషకలోపాలను భర్తీ చేసేలా సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవడం ముఖ్యం. అదే సమయంలో డైరీ ఉత్పత్తులను తగ్గిస్తే గట్ బ్యాక్టీరియా యాక్టివిటీలో మార్పులు వస్తాయాని, అవి ప్రతికూలం లేదా సానుకూలమైన కావొచ్చు. ఇది వ్యక్తలు ఆరోగ్య స్థితిని బట్టి ఆయా ఫలితాలు రావడం జరగుతుందని చెబుతున్నారు వైద్యులు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగపడి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మెటిమల సమస్య నివారణవవుతుంది. అయితే చర్మం మెరుగుదలకు అవసరమైన పాల ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని హర్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల్లో ఎముకల ఆరోగ్యానికి మూలమైన కాల్షియం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడూ ఆ భర్తీని కాల్షియం, విటమిన్ డీ వంటి ప్రోటీన్ పోషకాలు అందించే బాదం, టోఫు, బ్రోకలీ, అత్తి పండ్లను, పొద్దుతిరుగుడు విత్తనాలతో పొందొచ్చు. ఇక్కడ పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే డైట్ అనుసరించాలనుకుంటే ఆ పాలల్లో ఉండే కాల్షియంని పొందేలా ప్రత్యామ్నాయా ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం. పాల వినియోగంతో ముడిపడే ఉండే రొమ్ము, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్లు వటి వ్యాధులు దరిచేరవని తెలిపారు. అలాగే జీవక్రియ, నిద్ర, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేగాక కొందరూ వ్యక్తులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నవారు కూడా ఉన్నారన్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగపడి పలు విధాల అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతామని పేర్కొన్నారు. ఈ పాల ఉత్పత్తులను తగ్గించిన వెంటనే కొందరిలో శ్లేష్మం తగ్గి శ్వాసకోస సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఫలితాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందని, అందువల్ల ఈ డైట్‌ఫాలో అయ్యేటప్పుడూ డ్రైరీ ప్రోటీన్లకూ దూరంగా ఉండటం వల్ల వచ్చే అసహనాన్ని ఓపిగ్గా ఎదుర్కొంటూ ఫాలో అయితే మంచి ఫలితాలను పొందుతారని వైద్యుల సూచిస్తున్నారు. (చదవండి: -
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్‌కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్‌గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్‌గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్‌తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్‌కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్‌ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
కృత్రిమ పాలు.. అనారోగ్య పాలు!
అచ్చంపేట రూరల్: పాడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుతం కల్తీపాలతో మసకబారుతోంది. అక్రమ వ్యాపారులకు అడ్డాగా నిలుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు హానికరమైన రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. వాటితో పన్నీరు, కోవా, పెరుగు తదితర పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. అక్రమార్కుల పా‘పాల’తో అందరి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. డిమాండ్ పెరగడంతో.. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు పాలు, టీ తాగుతుంటారు. అలాగే పెరుగు, కోవా, పన్నీరు, నెయ్యి తదితరాలు మనిషి జీవనంలో భాగమయ్యాయి. హైదరాబాద్ నగరం సమీపంలో ఉండటంతో పాలకు మరింత డిమాండ్ పెరిగింది. గృహ యజమానులు, హోటళ్లు, మిఠాయి దుకాణాలకు రోజుకు వేల లీటర్లలో సరఫరా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని విజయ డెయిరీతో పాటు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు నేరుగా విక్రయిస్తున్నారు. పాల డిమాండ్ విపరీతంగా పెరగడంతో అక్రమార్కులు కృత్రిమంగా పాలు తయారు చేసి.. కాసులు దండుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో అధికం.. పట్టణ ప్రాంతాల్లో పాల విక్రయ కేంద్రాలు అధికంగా వెలుస్తున్నాయి. పల్లెల నుంచి పాలను తీసుకొస్తున్నామని చెబుతూ క్యాన్లలో అక్కడక్కడ విక్రయాలు సాగిస్తున్నారు. అమాయక ప్రజలు వీరిని నమ్మి పాలను కొనుగోలు చేస్తున్నారు. దశాబ్ద కాలంగా కృత్రిమ పాల తయారీ దందా సాగుతున్నా.. ఆహార పరిరక్షణ, స్థానిక యంత్రాంగం గుర్తించలేకపోతోంది. రసాయనాలు, పాలపొడి, నూనె, యూరియా, నీటి మిశ్రమాన్ని కలిపి తయారు చేసే ద్రావణంతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. కొందరు వెన్న తీసిన పాలలో యూరియా కలిపి వెన్న శాతాన్ని పెంచుతున్నారు. వెన్న శాతం ప్రకారం లీటరు పాలు రూ.40 నుంచి రూ.60 వరకు రైతుల వద్ద లభిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు కృత్రిమ పాలను గుర్తించలేరు. మరికొందరు పాలలో మీగడ తీసి యూరియా, నూనె ప్యాకెట్లు, సర్ఫు ద్వారా కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తప్పవు.. అచ్చంపేటలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నాలుగు సెంటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశాం. వారి నుంచి పాల శాంపిళ్లను సేకరించాం. హైదరాబాద్‌లోని స్టేట్ ల్యాబరేటరీకి శాంపిళ్లను పంపిస్తాం. పాలలో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల ఆరోగ్యానికి హాని కల్గిస్తే ఉపేక్షించేది లేదు. – మనోజ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అచ్చంపేటలో మెరుపు దాడులు... అచ్చంపేటలో కృత్రిమ పాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. లింగాల రోడ్డులోని శ్రీనివాస మిల్క్ సెంటర్, రైతు పాల విక్రయ కేంద్రంతో పాటు మరో రెండు సెంటర్లను పరిశీలించి, పాల శాంపిల్స్ సేకరించారు. అలాగే బస్టాండ్, పాత బజార్ ప్రాంతాల్లోని పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా.. గత డిసెంబర్లో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అచ్చంపేటలోని పాల కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ కల్తీ చేయడంతో పాటు పాడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు తనిఖీలు చేపట్టి.. కృత్రిమ పాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కూడళ్లలో పాలు పంచిన పోలీసులు..
కొత్త సంవత్సరం 2024లోకి మనమంతా కాలుమోపాం. నూతన సంవత్సరం తొలి రోజును ఆనందంగా గడిపేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పోలీసులు నూతన సంవత్సరం వేళ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జోధ్‌పూర్ పోలీసులు ఈ ఏడాది తొలిరోజున జనం చేత పాలు తాగించారు. నూతన సంవత్సరం వేళ నగరంలోని ప్రధాన కూడళ్లలో సామాన్యుల చేత పాలు తాగించిన పోలీసులు మద్యం సేవించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే మద్యానికి బదులుతా పాలు తాగాలని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భూపాల్ సింగ్ లఖావత్ కోరారు. కాగా నగరంలోని పలు కూడళ్లలో పోలీసులు ఏర్పాటు చేసిన పాలకేంద్రాలకు భారీగా జనం తరలివచ్చారు. కొందరు అక్కడే పాలుతాగగా, మరికొందరు పాలను పాత్రలలో ఇళ్లకు వెళ్లారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో నూతన సంవత్సరం సందర్భంగా పలువురు హుషారుగా నృత్యాలు చేశారు. చెన్నైలోనూ అర్థరాత్రి దాటిన తరువాత కూడా నూతన సంవత్సర వేడుకలు కొనసాగాయి. మెరీనా బీచ్‌కు చేరుకున్న జనం సంబరాల్లో మునిగిపోయారు. ఐటీ సిటీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో జనం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇది కూడా చదవండి: పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం! #NewYear2024 पर जोधपुर पुलिस की अनूठी पहल, दूध पिलाकर दिन की शुरुआत, बाल्टी-केतली लेकर लाइन में दिखे लोग #JodhpurNews pic.twitter.com/twS0y4SHse — Khushbu Goyal (@kgoyal466) January 1, 2024 -
అరెస్టైన ఇద్దరు పాల పాపాత్ములు!
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని కనుముకుల, గౌస్‌కొండ గ్రామాల్లో ఆదివారం ఎస్ఓటీ పోలీసులు అకిస్మిక దాడులు చేసి కల్తీపాలు తయారు చేస్తున్న పాలవ్యాపారులను అరెస్ట్ చేశారు. కనుముకులకు చెందిన పాల వ్యాపారులు పాండు, గౌస్ కొండ గ్రామానికి చెందిన అజ్గర్ ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 350 లీటర్ల కల్తీపాలు, 2.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 11 డోలోఫర్ స్కిమ్డ్ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారుచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.