
కొబ్బరి, బాదం, సోయా పాలు వంటివి వంటల్లో చవులూరించే రుచినే కాదు ఒంట్లో ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి. అలాంటి శ్రద్ధ, ఆసక్తి ఉన్న వారికోసమే ఈ డివైజ్. ఇది గింజలు, నట్స్ నుంచి పాలు తీసి పెడుతుంది. దీంట్లో బాదం లేదా కొబ్బరి లేదా సోయా(రాత్రి నానబెట్టి) వంటివి వేసుకుని.. సరిపడా నీళ్లు పోసుకుంటే.. జ్యూస్‌లా చేసిపెట్టేస్తుంది.
చివరిగా టీ వడకట్టుకునే తొట్టెతో వడకట్టుకుంటే సరిపోతుంది. పైగా ఇందులో బ్రెడ్ రెసిపీ తయారు చేసుకోవడం, కాఫీ గింజలను పౌడర్ చేసుకోవడం.. వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మగ్ మాదిరి ఉండే డివైజ్ కావడంతో వినియోగించడం చాలా సులభం.
ధర 109 డాలర్లు- (రూ.8,347)
చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733!
Comments
Please login to add a commentAdd a comment