Bread
-
ఆ బ్రెడ్‌తో కొలెస్ట్రాల్, కొలొరెక్టల్ కేన్సర్‌కి చెక్..!
బ్రెడ్‌ని చాలామంది స్నాక్స్ రూపంలోనో లేదా బ్రేక్ఫాస్ట్గానో తీసుకుంటుంటారు. అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు చెప్పడంతో కొందరూ ప్రత్యామ్నాయంగా గోధుమలతో చేసిన బ్రెడ్‌ని ఎంచుకుంటున్నారు. అయినప్పటకీ పరిమితంగానే తినమని నిపుణులు సూచించడం జరిగింది. అయితే బ్రెడ్ అంటే.. ఇష్టపడే ఔత్సాహికులు ఇలాంటి బ్రెడ్‌ని బేషుగ్గా తినొచ్చని నిపుణులే స్వయంగా చెప్పారు. పైగా ఆ సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.ఈ బ్రెడ్‌పై పరిశోధన చేసిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా ఉటుందని తెలిపారు. స్పెయిన్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం..ఆ దేశంలోని ప్రజలు ఏడాదికి సగటున 27.35 కిలోల బ్రెడ్‌ని తింటారట. వారికి ఈ బలవర్ధకమైన బ్రెడ్‌ని అందివ్వగా వారంతా బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ఈ బ్రెడ్ కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్నికూడా తగ్గిస్తుందట. దీని పేరు "రై బ్రెడ్"."రై బ్రెడ్" అనేది కేవలం రై ధాన్యంతో చేసిన రొట్టె. రై ఒక మట్టి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొద్ది మొత్తంలో ఇతర పిండిలతో కలిపి తయారు చేయడంతో రుచి చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. దీన్ని మొలాసిస్, కోకో పౌడర్ వంటి చేర్పులతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు. కలిగే లాభాలు..దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌గా పిలిచే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ధమనుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగి హృదయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కణితులు పెరగకుండా సంరక్షిస్తుంది. ఇందులోని ఫైబర్ పేగు రవాణాను వేగవంతం చేసేలా మల ఫ్రీక్వెన్సీని పెంచి బ్యాక్టీరియా జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది ఫెరులిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు రక్తప్రవాహంలోని చక్కెర, ఇన్సులిన్ విడుదలను నెమ్మదించేలా చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను 14 శాతం వరకు తగ్గిస్తుంది.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు, వైద్యులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: 6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
బ్రెడ్లలో వెరైటీ వెరైటీలను చూశాం. అలాగే వాటితో తయారు చేసే రకరకాల వంటకాలను కూడా చూశాం. కానీ బ్రెడ్‌ని ఏదో టిష్యూ పేపర్ అంతా లైట్‌వైట్‌గా పల్చగా ఉండే బ్రెడ్‌ని చూశారా. అసలు దీన్ని చూడగానే అలా ఎలా చేశారా అని ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కొరియా ఈ టిష్యూ బ్రెడ్‌ని తయారు చేసి అమ్మేస్తుంది. ఇది భారత్‌లో ఉండే రుమాలీ రోటీ మాదిరిగా ఉంది. అక్కడ బేకరి వాళ్లు టిష్యు బ్రెడ్‌లా పలచటి పొరలాంటి స్లైస్‌లు మాదిరిగా వచ్చేందుకు ప్రత్యేకమైన పిండిని ఉపయోగిస్తుంది. కాల్చేటప్పుడు సాధారణ బ్రెడ్లానే ఉంటుంది. కానీ స్లైస్‌లు మాత్రం టిష్యూలు మాదిరిగా ఉంటాయి. చూసేందుకు చక్కని ఆకృతిలో ఉండి తియ్యటి రుచిని కలిగి ఉంటాయట. వెన్న రాస్తే వచ్చే పొరలమాదిరిగా అతి సున్నితంగా ఉన్నాయి ఆ బ్రెడ్ స్లైస్‌లు. అందువల్ల దీన్ని రుమాలీ రోటీతో పోల్చారు. ఎందుకంటే రుమాలీ పల్చటి పెద్ద రోటీలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిపోయేలా ఉంటుంది. నిజానికి ఈ రుమాలీ రోటీ మొఘల్ యుగం నుంచి ప్రసిద్ధి చెందాయి. పాకిస్థాన్‌లో కూడా ఈ రోటీలు బాగా ఫేమస్. వీటిని వాళ్లు లాంబూ రోటీలు అని పిలుస్తారు. పంజాబీలో దీని అర్థం పొడవైనది అని. ఆ తర్వాత ఈ రుమాలీ రోటీల్లో రకరకాల స్పైసీ కర్రీని ఉంచి రోల్ చేసి తయారు చేసే వివిధ రెసీపీలు తయారు చేయడం మొదలు పెట్టారు. నిజానికి నాటి చెఫ్‌లు అదనప్పు నూనెను పీల్చుకునేందుకు ఈ రుమాలీ రోటీలు ఉపయోగించేవారట. ఇక నాటి రాజులు కూడా ఈ రోటీలను చేతి రుమాలు మాదిరిగా భోజనం తర్వాత చేతులను శుభ్రం చేయడానికి వినియోగించేవారట. ఆ తర్వాత క్రమేణ అదే తినేవంటకంగా రూపాంతరం చెందిందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by 마이시즌|미식 공간 소개 (@my_season___) (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..!
కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 15 లేదా 20 (నలువైపులా కట్ చేసి.. పాలలో ఒకసారి ముంచి.. చేతులతో గట్టిగా ఒత్తుకుని, విడిపోకుండా చపాతీకర్రతో చపాతీల్లా ఒత్తుకుని పక్కనపెట్టుకోవాలి) మటన్ కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని ఉడికించుకుని, చల్లారనివ్వాలి) బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) వాము పొడి, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, బ్రెడ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లపైనే నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికిన కీమా, జీలకర్రపొడి, గరం మసాలా, వాము పొడి, ఆమ్చూర్ పొడి, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, బంగాళదుంప గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అనంతరం చిన్నచిన్నబాల్స్లా చేసుకుని ఒక్కో బ్రెడ్ ముక్కలో ఒక్కో ఉండ పెట్టి.. గుండ్రంగా బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ ఉండలను పాలల్లో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. నచ్చిన కూరగాయల తురుముతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బాల్స్. ఇవి చదవండి: ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..! -
బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
బ్రెడ్‌ని మిగతా ఆహార పదార్థాల్లానే ఫ్రిజ్‌లో పెడుతుంటారు చాలమంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన బ్రెడ్‌ని ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిందటూ చాలా షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎలా ప్రిజ్‌లో ఉంచిన నిల్వ బ్రెడ్ మంచిది? ఎలా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది? నిజానికి బ్రెడ్ వంటివి ఎక్కువ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, పైగా బేక్ చేసే బేకరీ పదార్థాలని అస్సలు వద్దనే చెబుతారు. అలాంటిది ప్రిజ్‌లో నిల్వ ఉంచిన బ్రెడ్‌ని మాత్రం తీసుకుంటే మంచిదని వైద్యులు ఎలా చెబుతున్నారు?. పైగా పరిశోధనలో ఇలాంటి బ్రెడ్ తీసుకున్న వారిలో మంచి ఫలితం కనిపించిందంటూ ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు పోషకాహార నిపుణుడు డాక్టర్ అమీ షా. ఎందువల్ల మంచిందంటే..? తాజా వైట్ బ్రెడ్ కంటే నిల్వ ఉంచిన బ్రెడ్ మంచిది. అదికూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉన్నది మంచిదని అంటున్నారు. ఇలా ఫ్రీజర్‌లో నిల్వ ఉండటం వల్ల గ్లైసమిక్ ఇండిక్స్ తగ్గి ఆరోగ్యకరమైన స్టార్చ్‌గా మారుతుందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియా దీని వల్ల లభిస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై 2008లో జరిపిన పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని షా చెప్పారు. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధన బృందం దీని గురించి సుమారు 22 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న పదిమంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారికి ఇంట్లో తయారు చేసిన బ్రెడ్, మార్కెట్లో దొరికే బ్రెడ్లను వేర్వేరుగా నిల్వ చేసి ఇచ్చారు. కొందరికి తాజా బ్రెడ్ ఇవ్వగా, మరికొందరికి నిల్వ చేసింది ఇచ్చారు. మిగతా వారికి నిల్వ ఉంచి, రోస్ట్ చేసింది ఇచ్చారు. తాజాగా ఇంట్లో తయారుచేసిన బ్రెడ్‌తో పోలిస్తే, బ్రెడ్‌ను నిల్వ చేసి రోస్ట్ చేసినప్పుడూ బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా మార్కెట్లో కొన్న వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రెడ్‌ని రోస్ట్ చేసిందే బెటర్ అని తేలింది. అలాగే ఈ బ్రెడ్‌ని కూడా నిల్వ చేసి రోస్ట్ చేసి తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. ఇలా ఈ నిల్వ ఉండటం వల్ల వాటిలో కిణ్వన ప్రక్రియ జరిగి శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా అంది షుగర్ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం వైట్ బ్రెడ్‌ని తినేందుకు జంకకండి. చక్కగా తెచ్చుకుని ఒక రాత్రి ఫ్రిజ్‌లో పెట్టి రోస్ట్ చేసుకుని హాయిగా ఆస్వాదించండి. View this post on Instagram A post shared by Dr. Amy Shah (@fastingmd) (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఈ డివైస్‌తో ఇంట్లోనే బ్రెడ్ తయారు చేసుకోవచ్చు
ఈమధ్య.. కిరాణా లిస్ట్‌లో బ్రెడ్ అనేది కామన్ అయిపోయింది. అయితే బయట కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకుంటేనే హెల్దీ అండ్ టేస్టీ అంటుంటారు చాలామంది. ఈ బ్రెడ్ మేకింగ్ మెషిన్ 15 ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్‌తో యూజర్ ఫ్రెండ్లీగా నిలుస్తోంది. క్విక్ బ్రెడ్, గ్లూటెన్–ఫ్రీ బ్రెడ్, ఫ్రెంచ్ హోల్ వీట్ బ్రెడ్, జామ్ బ్రెడ్ వంటివాటిని లైట్, మీడియం, డార్క్ కలర్స్‌తో అందిస్తుంది. ఆటోమేటిక్ మిక్స్, ఇంటెలిజెంట్ ఫ్రూట్, నట్ డిస్పెన్సర్.. ఇలా సులభంగా పదార్థాలను కలిపి ప్రోగ్రామింగ్ చేస్తుంది. టైమ్ సెట్టింగ్‌కి.. పిఫ్టీన్ అవర్స్ టైమర్‌తో, ట్వంటీ మినిట్స్ పవర్ ఇంటరప్షన్ రికవరీతో, వన్ అవర్ ఆటోమేటిక్ హీటింగ్ ఆప్షన్ తో ఇది రూపొందింది. నాన్–స్టిక్ పాన్, మెజరింగ్ కప్ మెషిన్ తో పాటు లభిస్తాయి. దీన్ని సులభంగా శుభ్రం చేయవచ్చు. డివైస్ మూతపైన బ్రెడ్ ఆప్షన్స్‌తో పాటు.. చిన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,742). -
బనానా బ్రెడ్ రోల్స్.. టేస్ట్ అదిరిపోద్ది, ట్రై చేశారా?
బనానా బ్రెడ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు అరటిపండ్లు – 2, బటర్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, పంచదార – 3 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు) బ్రెడ్ స్లైస్ – 6 లేదా 8 తయారీ విధానమిలా: ముందుగా అరటిపండ్లను ముక్కలుగా చేసుకుని.. ఒక టేబుల్ స్పూన్ బటర్లో బాగా వేగించాలి. మెత్తగా గుజ్జులా మారిపోయే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో పంచదార, నెయ్యి వేసుకుని.. పంచదార కరిగిన వెంటనే ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ స్లైస్‌ని నాలుగువైపులా బ్రౌన్ కలర్ పీస్‌ని కట్ చేసి తీసేసి.. మిగిలిన బ్రెడ్ స్లైస్‌ని ఒకసారి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్ స్లైస్లోనూ కొద్దికొద్దిగా బనానా మిశ్రమాన్ని వేసుకుని.. రోల్స్‌లా చుట్టుకుని.. తడిచేత్తో అంచుల్ని అతికించుకోవాలి. ఫోర్క్ సాయంతో కొనలను నొక్కి, బాగా అతికించుకోవాలి. మిగిలిన బటర్‌తో వాటిని ఇరువైపులా వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ తాజాగా ఉండాలంటే..!
కొన్ని రకాల కాయగూరలని ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే పాడైపోతాయి. ఎలా నిలువ చేయలో అర్థంకాక సతమతమవుతుంటాం. పైగా అవి ఖరీదు కూడా. పోనీ వెంటనే వండటం కుదురుతుందా అంటే ఒక్కొసారి అస్సలు కుదరదు. అలాంటి టైంతో మన పెద్దవాళ్లు లేదా కొందరూ చెఫ్‌లు చెప్పే చిట్కాలు బాగా పనిచేస్తాయి. మన ఇబ్బంది తీరిపోతుంది. అలాంటి కొన్ని ఇంటి చిట్కాలు మీ కోసం.. గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ వేర్లు మునిగేలా పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. పచ్చని భాగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడల్లా కాస్త కట్ చేసుకోని వాడుకోవచ్చు. మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని దోరగా వేయించి గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. మార్కెట్లో దొరికే బ్రెడ్ క్రంప్స్లా ఇది ఉపయోగపడుతుంది. క్రిస్పీ వెజ్ నాన్‌వెజ్ డిష్‌లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యాప్సికాన్ని పేపర్ బ్యాగ్‌లో చుట్టిపెట్టి, రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది. బేకింగ్ సోడాలో కాస్త వెనిగర్ వేసి నల్లగా జిడ్డుపట్టిన పాత్రలపైన రాసి పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో తోమితే నలుపంతా పోయి పాత్ర కొత్తదానిలా మెరుస్తుంది. (చదవండి: దానిమ్మ ఎన్ని వ్యాధులకు చెక్‌పెడుతుందో తెలుసా! అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..) -
బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్..
కావలసినవి: బ్రెడ్ ముక్కలు – 1 కప్పు, ధనియాలు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, మిరియాలు – పావు టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి – 3 లేదా 4. వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 5 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి) కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ రసం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి.. అందులో ధనియాలు, జీలకర్ర , ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో బ్రెడ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు ఆ మిశ్రమం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం పట్టించిన బ్రెడ్ ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి చివరిలో తాలింపు వేసుకుని కలియ తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. (చదవండి: ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! ) -
బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది కాదా..?
అనారోగ్యంగా ఉన్న పేషెంట్లు ముందుగా కోలుకునేంత వరకు బ్రెడ్లే పెడుతుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ అయితే ఈజీ అని అందరూ దాన్నే ప్రిఫర్ చేస్తారు. పిల్లల కూడా జామ్, ఆమ్లెట్ వంటి వాటిని నొంచుకుని మరీ లాగిస్తుంటారు బ్రెడ్ల్ని. అయితే అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. ఆ బ్రెడ్లు ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను చూపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రెడ్ ఎక్కువగా వినయోగించడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందువల్ల ఇది ప్రమాదకారి అంటే.. ►ఇంట్లో తయారు చేసే బ్రెడ్‌లో సాధారణమైన వాటినే కలుపుతాం. తాజాగా బ్రెడ్ తింటాం. అదే మార్కెట్లో లభించే బ్రెడ్ అయితే తాజాగా ఉండేందుకు సోడియం సల్ఫెట్, పోటాషియం మెటాబైసల్ఫైట వంటి వాటిని అధికమొత్తంలో కలుపుతారు. దీనివల్ల ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉంది. బ్రెడ్ మెత్తగా ఉండేందుకు వినియోగించే ఎమల్సిఫైయర్లు మైక్రోబయోమ్‌లు కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొనవల్సి వస్తుంది. ►నిల్వ ఉండేదుకు వాడే రసాయానాలు కారణంగా ఆస్తమా, శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయి. మార్కెట్లో లభించే బ్రెడ్లు స్వచ్ఛమైన గోధుమ పిండి లేదా మైదా పిండితో తయారవ్వవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా టైప్ 2 మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ►మార్కెట్లో తయారయ్యే బ్రెడ్‌లో ఫైబర్ కంటెంట్ తక్కువుగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని బ్రెడ్లలో అధిక చక్కెర ఉంటుంది. ఇది ఊబకాయం, దంత క్షయం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తడమే గాక శరీరంలో అధిక కేలరీలు పెంచుతాయి. ►ఈ బ్రెడ్లకు కుత్రిమ రంగులు జోడించటం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది. గమనిక: ఎప్పుడూ బ్రెడ్ కొనేటప్పుడూ అందులో వాడే పదర్థాల మోతాదును చదివి ఎప్పుడూ తయారయ్యింది తదితర వివరాలు చదివిగానీ తీసుకోకండి. సాధ్యమైనంత మేర ఇంట్లో తయారయ్యే బ్రెడ్‌నే వినయోగించండి. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
రొట్టె కోసం రక్తపాతం..అన్నను హత్య చేసిన తమ్ముడు!
యూపీలోని కాన్పూర్‌లో రొట్టె ముక్కకోసం అన్నదమ్ములు రక్తం కళ్లజూసుకున్నారు. రొట్టె కోసం జరిగిన వివాదంలో తమ్ముడు అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అన్నయ్య.. తమ్ముని కోసం ప్రత్యేకంగా రొట్టెలు తయారు చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అన్నను హత్య చేసిన తమ్ముడు అంతటితో ఆగక సోదరుని మృతదేహంతో ఏమి చేశాడో తెలిస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ ఉదంతం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలోని నానామవు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలో కల్లూ, భూరా అనే అన్నదమ్ములుంటున్నారు. వీరిలో కల్లూ పెద్దవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. అయితే అతని సోదరుడు భూరాకు వివాహం జరిగింది. అతని భార్య రక్షాభంధన్ కోసం పుట్టింటికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదు. ఆమె ఇంటిలో ఉన్నప్పుడు భర్తకు, కల్లూకు వంటవండేది. తాజాగా భూరా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళుతూ అన్నతో తాను ఇంటికి వచ్చేసరికి రొట్టెలు తయారు చేసిపెట్టాలని కోరాడు. అయితే రాత్రి భూరా ఇంటికి వచ్చేసరికి కల్లూ అతని కోసం రొట్టెలు తయారు చేయలేదు. వెంటనే కోపంతో రగిలిపోయిన భూరా తన అన్నను ‘రొట్టెలు ఎందుకు తయారు చేయలేదని’ అడిగాడు. దానికి సమాధానంగా కల్లూ ‘నువ్వు నాకు రొట్టెలు తయారు చేయలేదు కనుక నేను నీకు రొట్టెలు తయారు చేయలేదు’ అని అన్నాడు. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఇంతలో తమ్మడు ఇంటి బయట ఉన్న పెద్ద బండరాళ్లు తీసుకు వచ్చి ఏకధాటిగా అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మృతిచెందినా తమ్ముని ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అన్న మృతదేహానికి తాడుకట్టి, దానికి లాక్కుంటూ గ్రామం శివారులకు తీసుకువచ్చాడు. అక్కడున్న నదిలోని పడవలో అన్న మృతదేహాన్ని ఉంచి, నది మధ్యలో దానిని వదిలివేశాడు. అయితే తమ్ముడు అన్న మృతదేహాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నప్పుడు గ్రామానికి చెందిన కొందరు దానిని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ విజయ్ ఢులా మాట్లాడుతూ తమ విచారణలో నిందితుడు.. రొట్టె కోసం తనకు, తన అన్నకు వివాదం జరిగిందని, ఈ నేపధ్యంలోనే తాను అన్నను హత్యచేశానని తెలిపాడన్నారు. నదిలోని కల్లూ మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు? -
మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!
కోమలంగా ఉండాల్సిన పాదాలు కాస్త చూసేందుకు అస్యహంగా ఉన్నాయా!. కనీసం బయటకువెళ్లలేని స్థితిలో ఉన్నారా. మరోవైపు ఆ పగుళ్లు వల్ల వచ్చే బాధ కారణంగా చన్నీటిలో పాదాలు పెట్టాలన్న భయం వేస్తుంది. ఎన్నో క్రీంలు వాడినా పాదాల పగుళ్లు సమస్య నుంచి బయటన పడలేక పోతుంటే ఈ చక్కటి చిట్కాను ఫాలోకండి. మంచి ఫలితం ఉంటుంది. ఏంటీ.. దీంతోనా! అని షాక్ అవ్వద్దు!. వర్షాకాలం లేదా శీతాకాలం వస్తే అందర్నీ వేధించే సమస్యే కాలు పగుళ్లు ఓ పట్టాన నయం కావు. పైగా మరింత పెద్దవై రక్తం కారి నొప్పి కూడా వస్తుంటుంది. చెప్పులు వేసుకుని నడవాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓ పక్క ఎవ్వరైన ఈ పగుళ్లు చూసి అసహ్యించుకుంటారేమోనని భయపడతాం. అందుకని అవికనిపించకుండా ఉండేలా సాక్స్ వంటి ఉపయోగించి మరీ దాచే ప్రయత్నం చేస్తాం. పోనీ మార్కెట్లో ఉండే పగుళ్లు తగ్గే క్రీం ట్రై చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కొబ్బరి నూనె, పసుపు వంటి ఎన్నో చిట్కాలు వాడి విసిగి వేసారిపోయి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇంతకీ ఆ చిట్కా ఏంటంటే.. బ్రెడ్‌తో కాలా పగుళ్ల సమస్యకు చెక్‌పెట్టొచ్చు. ఏంటీ బ్రెడ్! అని ఆశ్చర్యపోవద్దు. ఔను నిజంగానే దాంతో ఈజీగా పగుళ్లు తగ్గిపోతాయట. ముందుగా ఓ బ్రెడ్ స్లైడ్ తీసుకుని దాన్ని యాపిల్ వెనిగర్‌లో ముంచి మీ మడమను కవర్ చేసేలా ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా చుట్టేయాలి. ఇలా పగుళ్లు ఉన్న చోటల్లా ఇలా యాపిల్ వెనిగర్‌లో ముంచిన బ్రెడ్‌ని పెట్టి, ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా కట్టేయాలి. ఆ తర్వాత ఫలితం చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశం అంతా గట్టిగా అయ్యి నెమ్మదిగా అక్కడ చర్మం పొలుసులుగా వ్చేసి క్లీన్ అయిపోతుంది. ఎలా అంటే పార్లర్‌కి వెళ్లి పెడిక్యూర్ చేయించుకున్న మాదిరి ఉంటాయి పాదాలు. తప్పక ట్రై చెయ్యండి. (చదవండి: శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్ ఇదేనా!) -
బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో చాలామంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రౌన్ బ్రెడ్‌ను వినియోగిస్తుంటారు.గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో బ్రెడ్ వినియోగం విపరీతంగా పెరగిపోయింది. అల్పాహారం, శాండ్విచ్, పాన్కేక్.. ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా బ్రెడ్‌ను వాడుతున్నారు. మరి బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదా? ఇప్పుడు చూద్దాం. బిజీ లైఫ్ కారణంగా చాలామంది టిఫిన్‌గా బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్‌తో సరిపెట్టుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదు. బ్రెడ్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు శరీరంలో పిండిపదార్థం, ఉప్పు కూడా పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్‌లో పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎక్కువగా బ్రెడ్ తినేవారిలో ఊబకాయానికి కూడా దారితీస్తుంది. బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు. కాబట్టి ఇది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైట్ బ్రెడ్ తయారీకి వాడే పిండిలే ఫైబర్ అస్సలు ఉండదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా వస్తాయి. బ్రౌన్ బ్రెడ్ మంచిదేనా? ►వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ మంచిది. అయితే నార్మల్ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇందులో కల్తీ జరగడానికి ఆస్కారం ఎక్కువ. మైదా బ్రెడ్కే కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్‌గా విక్రయిస్తుంటారు. అందుకే ప్యాకెట్ వెనుక భాగంలో ఉండే ఇంగ్రీడియన్స్ను చెక్ చేసుకోవాలి. ► బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ఉపయోగించి తయారుచేస్తారు. ► బ్రౌన్ బ్రెడ్‌లో ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. ► బ్రౌన్ బ్రెడ్‌లో 28 గ్రాముల ధాన్యపు పోషకాలను అందిస్తుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. ► ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి విటమిన్ కే, ఈ, బీ, కార్భోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ► రోజూ 1-2 బ్రౌన్‌బ్రెడ్ ముక్కలను తీసుకోవడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ హార్మోన్ మంచి నిద్రకు ప్రేరేపించడమే కాకుండా, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ధాన్యం గింజలు గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా ఉండేలా చేస్తాయి. వీటి వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రిస్క్ తగ్గుతుంది. ► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి. -
అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి..
ప్రపంచంలో విచిత్రమైన రికార్డులు నెలకొల్పేవారు చాలామందే ఉన్నారు. అయితే ఒక మహిళ తన పొడవైన గడ్డంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిందనే విషయం మీకు తెలుసా? వినేందుకు ఇది వింతగా అనిపించినా ఇది ముమ్మాటికీ వాస్తవం. అమెరికాకు చెందిన ఎరిన్ హనీకట్ గత రెండేళ్లుగా తన గడ్డాన్ని పెంచుతూ వస్తోంది. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఎరిన్ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్) బాధితురాలు. దీని బారినపడిన వారికి హార్మోనల్ బ్యాలెన్స్ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా శరీరంపై అత్యధికంగా రోమాలు ఏర్పడతాయి. ఎరిన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమయ్యింది. మొదట్లో ఆమె వివిధ పద్దతుల్లో వాటిని తొలగించేది. మరోవైపు హైబ్లడ్ ప్రజర్ కారణంగా ఆమెకు చూపు మందగించింది. అప్పటి నుంచి ఆమె ముఖంపై వెంట్రుకలను పెంచసాగింది. ఎరిన్ హనీకట్ గడ్డం 30 సెంటీమీటర్ల పొడవు అంటే 11.81 ఇంచీలు పెరిగింది. ఒక మహిళకు ఇంత పొడవాటి గడ్డం ఉండటం విశేషం. ఫలితంగా ఆమె గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది. ఈమె కన్నా ముందు అమెరికాకు చెందిన 75 ఏళ్ల మహిళ వివియన్ హీలర్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమెకు 25.5 సెంటీమీటర్ల గడ్డం ఉంది. తాను సాధించిన రికార్డు గురించి ఎరిన్ మాట్లాడుతూ తాను గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంటానని ఎన్నడూ అనుకోలేదని అన్నారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
లో క్యాలరీస్ కోసం కాలిఫ్లవర్ బ్రెడ్ ట్రై చేయండి
కాలీఫ్లవర్ బాదం బ్రెడ్ తయారీకి కావల్సినవి: కాలీఫ్లవర్ – 1 (వేడి నీళ్లతో బాగా శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టుకోవాలి) బాదం తురుము – ఒకటింపావు కప్పులు, గుడ్లు – 6 ఆలివ్ నూనె – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా ఓరెగాన్ , బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ చొప్పున తయారీ విధానమిలా.. ముందుగా ఒక పెద్ద బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కాలీఫ్లవర్ తురుము, ఆలివ్ నూనె, బాదం తురుము, ఓరెగాన్ , బేకింగ్ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మేకర్లో వేసుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకునే ముందు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. -
బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు రూ.800 వరకు ఖర్చు!
ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే రొట్టె తినేవారు. ఇప్పుడైతే భారతీయుల్లో చాలామంది ప్రతిరోజూ రొట్టెల్ని లాగించేస్తున్నారు. అదేమంటే.. ఆరోగ్యం కోసమేనని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రొట్టెలు క్రేజీ ఫుడ్‌గా మారుతుండగా.. వాటి వినియోగంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం దేశంలో బ్రెడ్స్ అమ్మకాల విలువ 640 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024 మిలియన్ డాలర్లకు చేరిందంటే రొట్టెలు భారతీయులతో ఎలా లొట్టలు వేయిస్తున్నాయో అవగతం చేసుకోవచ్చు. సాక్షి, అమరావతి: పాశ్చాత్య వంటకమైన బ్రెడ్ భారతీయుల భోజనంలో ప్రధాన ఆహారంగా మారిపోతోంది. వేగవంతమైన జీవనశైలి, పనిభారం వల్ల వివిధ రకాల బ్రెడ్స్ భారతీయ భోజనశాలను ఆక్రమిస్తున్నాయి. ఎంతగా అంటే మసాలాలతో కూడిన కూరగాయ వంటకాలను భర్తీ చేస్తూ డైనింగ్ టేబుల్‌పై తిష్టవేస్తున్నాయి. జామ్, బటర్, పీనట్ బటర్ వంటి స్ప్రెడ్‌ల ఎంపికతో టోస్ట్, బ్రెడ్ ఆమ్లెట్లు పట్టణ వాసుల ఇళ్లలో నిత్య అల్పాహారాలుగా మారుతున్నాయి. రెడీ టు కుక్ ఆహారం అందుబాటులోకి రావడంతో మహిళలు సూప్, సలాడ్ డిన్నర్లను బ్రెడ్‌తో చేయడానికే మక్కువ చూపుతుండటం విశేషం. దక్షిణాది రాష్ట్రాలే టాప్ జాతీయ పోషకాహార సర్వే ప్రకారం బ్రెడ్ వినియోగిస్తున్న కుటుంబాల్లో ఓ వ్యక్తి సగటున రోజుకు 80 గ్రాముల బ్రెడ్ ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో స్త్రీల (66 గ్రా) కంటే పురుషులే (96 గ్రా) ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి ఒక కుటుంబం ఏడాదికి 31.7 కిలోలుగా పెరగనుంది. భారత్‌లో అతిపెద్ద బ్రెడ్ వినియోగదారుల జాబితాలో దక్షిణ భారతదేశం మొదటి స్థానంలో ఉండటం విశేషం. భారతదేశ బ్రెడ్ మార్కెట్ 2017లో 640.73 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,024.54 (సుమారు రూ.837 కోట్లు) మిలియన్ డాలర్లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులు నెలకు బ్రెడ్ కోసం రూ.300 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రొటీన్ బ్రెడ్స్ కూడా వచ్చేశాయ్ దేశంలో ఊబకాయ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది 2030 నాటికి దాదాపు 27 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇందుకు భారతీయుల ఆహారంలో కార్బోహైడ్రేట్లే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సంప్రదాయ భారతీయ భోజనంలో అన్నం, రోటీ, వేపుడు పదార్థాలు ఉంటాయి. దీనికితోడు ఆధునిక జీవనశైలిలో తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో కొవ్వు పెరిగిపోయి ఊబకాయానికి దారి తీస్తోంది. శరీరానికి కార్బోహైడ్రేట్లు అవసరమే కానీ.. కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రెడ్లలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్ వంటివి లభిస్తున్నాయి. జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్‌ని అధికంగా అందిస్తున్నాయి. మల్టీగ్రెయిన్ బ్రెడ్స్దే హవా మార్కెట్లో రకరకాల బ్రెడ్స్ వస్తున్నాయి. తృణధాన్యాల వినియోగం కాలక్రమేణా పెరుగుతోంది. హోల్‌గ్రెయిన్, మల్టీ గ్రెయిన్, రై బ్రెడ్, వీట్ బ్రెడ్లు అన్ని సూపర్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పట్టణ ప్రజలు రొట్టెల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర ఆహార పదార్థాల కంటే తృణధాన్యాల ఉత్పత్తుల్లో ఎక్కువ డైటరీ ఫైబర్ కంటెంట్ ఉన్నందున అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి. చదవండి: సాయంత్రం టీకి వీరు దూరంగా ఉండాలి! ఎందుకంటే.. -
ఆన్లైన్ ఆర్డర్.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం.. షాక్ తిన్న కస్టమర్!
ఒకప్పుడు ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కిరాణం షాప్‌లు, సూపర్ మార్కెట్ల వద్ద లైన్లో నిలబడి తీసుకొచ్చుకొనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా కూరగాయలు, పప్పులు, ఉప్పులు, వండిన ఆహారం.. పర్నీచర్ ఇలా ఒక్కటేంటి అన్నీ ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. చేతిలో ఒక్క ఫోన్ ఉంటే చాలు.. కోరుకున్న వస్తువులు నిమిషాల్లో మన ముందు వాలిపోతున్నాయి. ఫోన్లోని యాప్‌ల ద్వారా మనకు ఏం కావాలో క్లిక్ చేస్తే బయట ధరలకే వస్తువు డెలివరీ అయిపోతుంది. దీంతో ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతోంది. అయితే ఆన్లైన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చాక ప్రయోజనాలతోపాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఆర్డర్లు మారిపోవడం, నాణ్యత లేని వస్తువులు రావడం లేదా పాడైపోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్డర్ చేసిన వాటిల్లో క్రిమి కీటకాలు వస్తుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నితిన్ అరోరా అనే వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ ఇవ్వగా అందులో ఎలుక కనిపించడంతో ఖంగుతిన్నాడు. ట్విటర్ వేదికగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ‘లెట్స్ బ్లింకిట్‌లో అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్డర్ చేసిన బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుక వచ్చింది. ఇది మనందరిని హెచ్చరించే అంశం. ఆర్డర్ చేసే ముందు గమనించుకోండి. వస్తువు డెలివరీ ఆలస్యమైనా పర్లేదు, కానీ, 10 నిముషాల్లో పార్సిల్ వస్తుందని ఇలాంటివి అంటగట్టడం దారుణం’.. అని వాపోయాడు. Most unpleasant experience with @letsblinkit , where alive rat was delivered inside the bread packet ordered on 1.2.23. This is alarming for all of us. If 10 minutes delivery has such baggage, @blinkitcares I would rather wait for a few hours than take such items.#blinkit #zomato pic.twitter.com/RHNOj6tswA — Nitin Arora (@NitinA14261863) February 3, 2023 అరోరా పోస్టులో ఎలుకతో కూడిన బ్రెడ్ ప్యాకెట్‌ను మాత్రమే చూపించకుండా బ్లింకిట్ కస్టమర్ సర్వీస్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. ఈ ఫోస్టు వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదీ మరీ ఘోరమని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరస్తారంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఈ ఘటనపై కంపెనీ కామెంట్స్ విభాగంలో స్పందించింది. హాయ్ నితిన్! మీకు ఇలాంటి అసౌకర్యం కలగాలని తాము కోరుకోలేదని.. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ లేదా ఆర్డర్ ఐడీ పంపితే సమస్యను పరిష్కరిస్తామని బదులిచ్చింది. Hi Nitin, this is not the experience we wanted you to have. Please share your registered contact number or Order ID via DM for us to look into it. https://t.co/cmvbhHSmuW — Blinkitcares (@blinkitcares) February 3, 2023 -
Recipe: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా!
Winter- Recipes In Telugu: చలికాలంలో బ్రెడ్ గార్లిక్ సూప్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – అర కప్పు ►వెల్లుల్లిపాయ – సగం ( పలుచగా ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 2 (తినేవారి సంఖ్యని బట్టి పెంచుకోవచ్చు) ►కారం – 1 టేబుల్ స్పూన్ పైనే ►ఉప్పు – తగినంత ►బిర్యానీ ఆకు – 1 ►అన్నిరకాల కూరగాయ ముక్కలు – (చిన్నచిన్నగా తరిగి, 4 కప్పుల నీళ్లు పోసి.. కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని.. సుమారు రెండున్నర కప్పులు అయ్యేలా.. బాగా మరిగించి, ముక్కల్ని వడకట్టి.. ఆ వెజిటబుల్ స్టాక్‌ని పక్కన పెట్టుకోవాలి) ►నూనె – సరిపడా ►కొత్తిమీర తురుము – గార్నిష్‌కి తయారీ: ►ముందుగా ఒక కళాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి.. అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించాలి. ►అవి వేగాక బ్రెడ్ ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అనంతరం.. ఉడికించిన కూరగాయలను వడకట్టిన నీటిని 2 కప్పుల వరకు ఇందులో పోసుకోవాలి ► తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి. ►మధ్యలో రెండు గుడ్లను పగలగొట్టి.. పసుపు సొన విడిపోకుండా కళాయిలో వేరువేరుగా వేసుకోవాలి. ►గరిటెతో జాగ్రత్తగా కలుపుతూ ఉడకనివ్వాలి. ►మొత్తం మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ►గుంట గరిటెతో గుడ్లను సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ►తినే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ! Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా! -
Kitchen Tips: గుడ్లు, చాక్లెట్లు, ఉల్లి.. ఇంకా వీటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే
Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్‌లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు. అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్‌లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం. టమాటా: టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి. అరటికాయలు: అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు. అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఆవకాడో: ఫ్రూట్స్‌లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్‌లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. పుచ్చకాయ: ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు. వంకాయ: వంకాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే! చాక్లెట్లు: చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది. గుడ్లు: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్‌ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్. బ్రెడ్: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది. బత్తాయి పండ్లు: సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్‌లను ఫ్రిజ్‌లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా!
నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీకి కావలసినవి: ►గుడ్లు – 6, బ్రెడ్ పౌడర్ – అర కప్పు ►అల్లం తురుము – అర టీ స్పూన్ ►వెల్లుల్లి – 6 రెబ్బలు (తురుములా చేసుకోవాలి) ►పచ్చిమిర్చి –6 (మూడిటితో పేస్ట్‌లా చేసుకుని, మిగిలినవి చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి) ►కొత్తిమీర – 2 టీ స్పూన్లు, కరివేపాకు – అభిరుచిని బట్టి ►ఉల్లిపాయల ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు ►గరం మసాలా – 4 టీ స్పూన్లు ►ధనియాల పొడి – కొద్దిగా ►కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – సరిపడా ►టమాటా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►పెరుగు: 2 కప్పులు, రెడ్ చిల్లీ సాస్ – కొద్దిగా ►జీలకర్ర పొడి – 2 లేదా 3 టీ స్పూన్లు ►నూనె – 3 గరిటెలు, ఉల్లికాడల ముక్కలు – గార్నిష్‌కి సరిపడా ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ విధానం: ►ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టుకుని, పచ్చసొన లేకుండా తెల్లటి గుడ్డు భాగాన్ని మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►ఈ ముక్కల్లో సన్నగా తరిగిన పావు టీ స్పూన్ అల్లం తురుము, సగం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల గరం మసాలాతో పాటు బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ►అందులో మిగిలిన 2 గుడ్లు పగలగొట్టి తెల్లసొనను మాత్రమే ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ►తర్వాత ఈ మిశ్రమాన్ని కుకర్‌లో స్టీమ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►అనంతరం కళాయిలో 3 గరిటెల నూనె వేసుకుని.. వేడికాగానే టమాటా ముక్కలు, మిగిలిన అల్లం తురుము, మిగిలిన వెల్లుల్లి తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దోరగా వేయించాలి. ►రెడ్ చిల్లీ సాస్, పెరుగు, జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ►అనంతరం ఎగ్ ముక్కల్ని వేసుకుని.. పెరుగు– సాస్ మిశ్రమం ముక్కలకు పట్టే విధంగా గరిటెతో తిప్పుతూ కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి! చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు! -
Solar Oven: వెజ్‌తో పాటు నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా.. ధర రూ.48,738
ఈ రోజుల్లో సోలార్ మెషిన్స్‌కి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఆ తర్వాత ఇంధనం ఖర్చు ఉండదనేది వీటి ప్లస్ పాయింట్. టెక్నాలజీ పెరిగిన తరుణంలో.. సోలార్ కుక్ వేర్ మార్కెట్లోకి పోటెత్తుతోంది. ఇందులో కూరగాయ ముక్కలతో పాటు చికెన్, ఫిష్ వంటి నాన్‌వెజ్ ఐటమ్స్.. బ్రెడ్స్, కేక్స్ వంటివెన్నో గ్రిల్ చేసుకో వచ్చు, కుక్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ ఓవెన్ పెద్ద సైజ్ పెట్టెలా ఉంటుంది. దానికి ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ మూతతో పాటు.. మూడువైపులా (చిత్రంలో గమనించొచ్చు) సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను స్టోర్ చేసే సామర్థ్యం కోసం.. టెంపర్డ్ డబుల్ ప్యాన్డ్ గ్లాస్ మెటీరియల్ అమర్చి ఉంటుంది. థర్మల్ హీట్ రెసిస్టెంట్ లేయర్లు, అధిక నాణ్యత కలిగిన యానోడైజ్డ్ అల్యూమినియం రిఫ్లెక్టర్స్తో ఇందులోని ఆహారం వేగంగా ఉడుకుతుంది. మొత్తానికి ఈ సోలార్ ఓవెన్.. నాణ్యత కలిగినది, అనుకూలమైనది, ఉపయోగించడానికి సులభమైనది. సోలార్ ఓవెన్ ధర: 639 డాలర్లు (రూ.48,738) చదవండి👉🏾 హాట్ అండ్ కూల్ ట్రావెలింగ్ రిఫ్రిజిరేటర్.. ధర 6 వేలు! -
Milk Maker: కొబ్బరి, బాదం, సోయా పాలు.. ఇలా తయారు చేసుకోండి.. ధర ఎంతంటే!
కొబ్బరి, బాదం, సోయా పాలు వంటివి వంటల్లో చవులూరించే రుచినే కాదు ఒంట్లో ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి. అలాంటి శ్రద్ధ, ఆసక్తి ఉన్న వారికోసమే ఈ డివైజ్. ఇది గింజలు, నట్స్ నుంచి పాలు తీసి పెడుతుంది. దీంట్లో బాదం లేదా కొబ్బరి లేదా సోయా(రాత్రి నానబెట్టి) వంటివి వేసుకుని.. సరిపడా నీళ్లు పోసుకుంటే.. జ్యూస్‌లా చేసిపెట్టేస్తుంది. చివరిగా టీ వడకట్టుకునే తొట్టెతో వడకట్టుకుంటే సరిపోతుంది. పైగా ఇందులో బ్రెడ్ రెసిపీ తయారు చేసుకోవడం, కాఫీ గింజలను పౌడర్ చేసుకోవడం.. వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మగ్ మాదిరి ఉండే డివైజ్ కావడంతో వినియోగించడం చాలా సులభం. ధర 109 డాలర్లు- (రూ.8,347) చదవండి: Trendy Toaster: ఎన్నో రుచులను నిమిషాల్లో టోస్ట్ చేసుకోవచ్చు.. ధర రూ.3,733! -
బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా?
బ్రెడ్ పిజ్జా కావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 6, టొమాటో సాస్ – పావు కప్పు, చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, మిరప కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ – ఒక్కొక్కటి చొప్పున, స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్లు (ఉడికించినవి), మొజరెల్లా చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, బటర్ – సరిపడా, ఆలివ్ ముక్కలు – కొన్ని తయారీ: ముందుగా టొమాటో సాస్‌లో చిల్లీ సాస్, మిరప కారం, గరం మసాలా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ప్రతి బ్రెడ్ స్లైస్ మీద ఒక్కో స్పూన్ టొమాటో సాస్ మిశ్రమాన్ని రాయాలి. వాటిపైన కొద్దికొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్ వేసుకోవాలి. పైన మొత్తం చీజ్ తురుముతో ఫిల్ చేసుకుని.. పైన ఆలివ్ ముక్కలు వేసుకోవాలి. అనంతరం కళాయిలో కొద్దిగా బటర్ కరిగించి దోరగా 2 నిమిషాల పాటు మూత పెట్టి బేక్ చేసుకోవాలి. పాస్తా– చికెన్ పకోడా కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (క్లీన్ చేసి, ఉడికించి, తురుము చేసుకుని పెట్టుకోవాలి), పాస్తా – 1 కప్పు (ఉడికించినది), టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – 4 టేబుల్ స్పూన్లు చొప్పున (చిన్నగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, ధనియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, శనగపిండి, బియ్యప్పిండి – పావు కప్పు చొప్పున, నూనె – డీప్ ఫ్రైకి చాలినంత తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాస్తా, చికెన్ తురుము, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, జీలకర్ర, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు, శనగపిండి, బియ్యప్పిండి వేసుకుని నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. అందులో చిల్లీ సాస్ వేసుకుని మరోసారి కలుపుకుని.. నూనెలో పకోడాలా వేసుకుని దోరగా వేయించుకోవాలి. కాజున్ స్పైసీ పొటాటోస్ కావలసినవి: బేబీ పొటాటో – 20 (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక ఒక్కో పొటాటోను వడ మాదిరి ఒకటే సారి చేత్తో ఒత్తాలి), మాయొనైజ్(మార్కెట్లో దొరుకుతుంది) – 3/4 కప్పు, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్, తేనె, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, డ్రై థైమ్, ఒరెగానో – 1 టీ స్పూన్ చొప్పున, మిరప కారం – ఒకటిన్నర టీ స్పూన్+గార్నిష్‌కి కూడా మిరియాల పొడి – అర టీ స్పూన్, పాలు – 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము – గార్నిష్‌కి తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్లో మొక్కజొన్న పిండి, మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో వడలా ఒత్తిన ఒక్కో పొటాటో ముంచి, బాగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం.. మాయొనైజ్, టొమాటో సాస్, తేనె, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, డ్రై థైమ్, ఒరెగానో, మిరప కారం, మిరియాల పొడి, పాలు, ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ మొత్తం మిశ్రమాన్ని వేయించిన పొటాటో వడలపై వేసుకుని సర్వ్ చేసుకునే ముందు.. కొద్దిగా మిరప కారం, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సేకరణ: సంహిత నిమ్మన -
పాపం! ఏదో అనుకుంది: ఇంకేదో అయ్యింది
శాంటియాగో : వంట చేయటం అంత వీజీ కాదు! బ్యాచిలర్లకు ఆ కష్టం బాగా తెలుసు. నానా తంటాలు పడి వంట చేసి పెడితే, వంట రాని ఫ్రెండ్స్ దగ్గరినుంచి బాగోలేదని మూతి విరుపులు. అన్ని వేళలా రుచికరంగా వండటం సాధ్యపడే విషయం కాదు. కొన్నిసార్లు వంట చేయటంలో ఫెయిలవుతూ ఉంటాం. కానీ, చిలీకి చెందిన ఓ మహిళ మాత్రం వంట చేయకుండానే విఫలం అయింది. అయినా కూడా సోషల్ మీడియాలో పిచ్చ పాపులర్ అయింది. గత బుధవారం చిలీ.. శాంటియాగోకు చెందిన ఆండ్రూ పెర్సూ అలేగ్రియా అనే మహిళ బ్రెడ్ తయారు చేసే విధానాన్ని చూపెడుతూ ఓ వీడియో చేయాలనుకుంది. ( ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటే ఇదే..! ) అంతా సిద్ధం చేసుకుని బ్రెడ్డు కోసం పిండి ముద్దని అట్ల కర్రతో ఒత్తుతున్న నేపథ్యంలో పిండి ప్లేటు సరాసరి ముఖానికి వచ్చి తాకింది. దీంతో పిండి మొత్తం ఆమె ముఖానికి అంటుకుపోయింది. ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ కావటంతో ఖంగుతిన్న సదరు మహిళ వీడియో తీయటం ఆపమని బ్రతిమాలుకుంది. ‘‘బ్రెడ్డు తయారు చేయటానికి ఓ కొత్త పద్దతి’’ అనే శీర్షికతో ఫేస్బుక్లో విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపు 9 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. ( జలపాతంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని.. ) -
నెల్లూరులో కోలాహలంగా రొట్టెల పండుగ
-
ఒక రొట్టెకు పది రొట్టెలు
హజ్రత్ రాబియా బస్రీ ధార్మిక చింతనాపరురాలు. ఒకసారి ఐదుగురు అతిథులు ఆమె ఇంటి తలుపు తట్టారు. వచ్చిన అతిథులకు భోజన ఏర్పాట్లు చేయాల్సిందిగా సేవకురాలికి పురమాయించారు రాబియా. ‘ఇంట్లో తినడానికి కేవలం ఒకే ఒక్క రొట్టె మాత్రమే ఉంది’ అని సేవకురాలు వివరించింది. ‘ఇంట్లో ఉన్న ఆ ఒక్క రొట్టెను ఎవరికైనా దానం చేసేయి’ అని చెప్పింది రాబియా. చెప్పినట్లుగానే సేవకురాలు ఇంట్లో ఉన్న రొట్టెను దానం చేసి వచ్చింది. కాసేపటికే ఎవరో తలుపు తట్టిన శబ్దం. తలుపు తీసి చూడగా..‘ఫలానా ‘రాజుగారు తమకోసం ఆహారం పంపారు’ అనే మాటలు! ఆహార పళ్లాన్ని తీసుకుని సేవకురాలు రాబియాకు అందించింది. వాటిని తెరిచి చూడగా అందులో ఐదు రొట్టెలు ఉన్నాయి. ‘‘ఇవి మన కోసం పంపి ఉండకపోవచ్చు. పొరపాటుగా మన ఇంటికి వచ్చాయి’’ అంటూ రాబియా వాటిని రాజుగారికి తిప్పి పంపేశారు. కాసేపటి తరువాత రెండోసారి ఎవరో తలుపు తట్టిన శబ్దం. మళ్లీ ‘ఫలానా రాజుగారు తమకోసం ఆహారం పంపారు’ అనే మాటలు! వాటిని సేవకురాలు అందుకుని రాబియాకు అందించింది. ఆహార పళ్లాన్ని తీసుకుని చూడగా అందులో ఈసారి ఏడు రొట్టెలు ఉన్నాయి. ‘ఇవి మన కోసం పంపి ఉండకపోవచ్చు. పొరపాటుగా మన ఇంటికి వచ్చాయి’ అంటూ రాబియా తన సేవకురాలితో తిప్పి పంపేశారు. మరికాసేపటికి మూడోసారి తలుపుతట్టిన శబ్దం. సేవకురాలు తలుపుతట్టి చూడగా ‘ఫలానా రాజుగారు మీకోసం ఆహారం పంపారు’ అంటూ ఒక సేవకుడు ఆహార పళ్లాన్ని ఇచ్చి వెళ్లాడు. వాటిని యజమాని రాబియాకు అందించింది. పళ్లెంలో మొత్తం ఈ సారి పది రొట్టెలున్నాయి. ‘‘ఇవి ముమ్మాటికీ మన రొట్టెలే. ముందు వీటిని వచ్చిన అతిథులకు పెట్టు’’ అని సేవకురాలికి పురమాయించారు రాబియా. ‘రాజుగారి సేవకులు రెండుసార్లు ఆహారం తీసుకువస్తే వాటిని తిరిగి పంపడంలో ఔచిత్యమేమిటి?’ అని సేవకురాలు అడిగింది.‘‘ఒక పుణ్యం చేస్తే పదిరెట్ల పుణ్యఫలాన్ని ఇస్తానని అల్లాహ్ హామీ ఇచ్చాడు. అందుకే ఒక రొట్టె దానం చేసినందుకు గాను పది రొట్టెలు లభించేదాకా నేను తీసుకోను అని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. అందుకే రాజుగారి సేవకులను మాటిమాటికీ తిప్పి పంపాను.’’ అని సేవకురాలి సందేహాన్ని తీర్చారు రాబియా. మనస్సులో ఏదైనా మంచి పని చేయాలని సంకల్పం చేసుకుంటే ఆ పని చేసినంత పుణ్యం మన కర్మల ఖాతాలో జమచేయబడుతుంది. ఆ పుణ్యాన్ని ఆచరణలో పెడితే పదిరెట్ల పుణ్యఫలాన్ని మన ఖాతాలో జమచేస్తాడు అల్లాహ్. ఇది దైవవాక్కు. – ఉమైమా సిద్దీఖా -
పెట్టకండి.. ఫ్రిజ్జు తినేస్తుంది
ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఆ నిశ్చింతే వేరు. పండ్లు, కూరగాయలు, మిగతా పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టేస్తేరెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఒకేసారి కొని తెచ్చేసుకుని, ఫ్రిజ్‌లో ఓ మూల పడేసి, అవసరం వచ్చినప్పుడు బయటికి తీసి వాడుకునే సౌలభ్యం ఉండడం వల్ల ఫ్రిజ్ ఇప్పుడు దాదాపుగాప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. అయితే పండ్లుగానీ, బ్రెడ్డు, తేనె.. ఇంకా ఇతరత్రా పదార్థాలు ఏవైనాఫ్రిజ్లో పెట్టే ముందు మీరెప్పుడైనా ఆలోచించారా.. ‘వీటిని ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?’ అని. ఆలోచించే ఉంటారు.సమాధానమే దొరికి ఉండదు. ఫర్వాలేదు. ఏయే ఫుడ్స్‌ని ఫ్రిజ్‌లో రోజులకొద్దీ పెట్టకూడదో ఇప్పుడుసాక్షి ‘ఫ్యామిలీ’ ఇప్పుడు మీకు చెబుతోంది. కట్ చేసుకుని భద్రపరచుకోండి. భద్రపరచుకోవడం అంటే.. ఫ్రిజ్‌లో కాదని మీకు తెలియకుండా ఉంటుందా?! నట్స్ : బాదం పప్పులు, వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఇతరత్రా పప్పుల్ని ఫ్రిజ్‌లో పెడితే వాటి లోపల ఉండే నూనె నిక్షేపంగా ఉంటుంది కానీ, రుచే చప్పబడిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే గాలిచొరబడని ఒక డబ్బాలో ఈ నట్స్‌ను పోసి, మూత గట్టిగా బిగించండి. ఫ్రిజ్ బయట వేడి ఎక్కువగా లేని చోట ఆ డబ్బాను పెట్టుకోండి. నిల్వా ఉంటాయి, రుచీ ఎక్కడికీ పోదు. చాక్లెట్ స్ప్రెడ్ : బ్రెడ్ స్లయిస్కి అద్దుకుని తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో! అయితే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి తియ్యడం వల్ల కాస్త గట్టి పడినట్లయి స్లయిస్ మీద చక్కగా పరుచుకోదు. పైపెచ్చు కొంచెం ఫ్లేవర్ కూడా తగ్గుతుంది. కాబట్టి చాక్లెట్ స్ప్రెడ్‌ని కూడా టైట్ జార్లో ఉంచి మూత గట్టిగా తిప్పేయండి. కీర దోస : ఎవరి ఫ్రిజ్ డోర్ తెరిచినా కూరగాయలతో పాటు కీర దోస తప్పనిసరిగా కనిపిస్తుంది. కనిపించలేదంటే, అంతకు ముందే బయటికి తీసి లాగించేసి ఉంటారని అనుకోవాలి. సరే, కీర దోసను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదంటే.. చల్లదనానికి అవి మెత్తబడిపోతాయి. సొట్టలు పడతాయి. తాజాదనం పోతుంది. కట్ చేసి పెట్టినవైతే నీరుకారి పోతాయి. గది ఉష్ణోగ్రతలోనే ఇవి నవనవలాడుతూ ఉంటాయి. వెల్లుల్లి : వెల్లుల్లి గుబ్బలు గానీ, రెబ్బలు గానీ ఫ్రిజ్‌లోని తేమకు పాడైపోతాయి. రాత్రి వంటకో, మర్నాడు లంచ్‌కో ఒలిచి సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తప్ప మామూలుగానైతే బయటే ఉంచడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టమాటా : టమాటాలు కూడానా! అనిపిస్తుంది. అవును టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే ఆ చల్లదనానికి పై పొర పాడైపోతుంది. అందుకని కిచెన్ టెంపరేచర్లోనే వాటిని ఉంచేయడం బెటర్. అంతకన్నా బెటర్, ఎక్కువెక్కువ టమాటాల్ని ముందే కొనేసి పెట్టుకోకపోవడం. తేనె : బాటిల్లోని తేనెతో మీరు ఫైటింగ్ చేయదలచుకుంటే తప్ప మీరు తేనె సీసాను ఫ్రిజ్‌లో పెట్టనవసరమే లేదు. ఫ్రిజ్ చల్లదనానికి తేనె చిక్కనవుతుంది. అందులోని చక్కెర కణాలన్నీ ఉండలు చుట్టుకుపోతాయి. అందుకే తేనె చిక్కబడినట్లయి, చివరికి బంకమన్నులా మారినా ఆశ్చర్యం లేదు. ఉల్లిగడ్డలు : మరీ ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచితే ఉల్లిగడ్డలు కూడా పాడైపోతాయి. వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో వీటిని ఉంచాల్సిన మాట నిజమే కానీ, ఫ్రిజ్‌లో పెట్టినందు వల్ల ఇవి మెత్తబడి, చెమ్మగిల్లుతాయి. ఆలుగడ్డలు : ఫ్రిజ్‌లోని చల్లదనం ఆలుగడ్డలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దాంతో ఆలుగడ్డ టేస్టు తగ్గుతుంది. పైగా రంగు కూడా మారుతుంది. అందుకే ఆలుగడ్డల్ని బయటి వాతావరణంలోనే వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో కడగకుండా నిల్వ ఉంచాలి. కడిగితే మట్టి వల్ల ఏర్పడిన రక్షణ కవచం దెబ్బతింటుంది. బ్రెడ్డు : మీకు డౌట్ వచ్చే ఉంటుంది. బ్రెడ్‌ను ప్రిజ్‌లో పెట్టొచ్చా అని. పెడితే సేమ్ ఆలుగడ్డలకు వచ్చే సమస్యే బ్రెడ్డుకూ వస్తుంది. ఫ్రిజ్‌లోని చల్లదనానికి బ్రెడ్లోని పిండి పదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. అంతేకాదు, మామూలుగా పాడైపోయే బ్రెడ్డు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మరింత వేగంగా పాడవుతుంది. దీనినే ‘రిట్రోగ్రెడేషన్’ అంటారు. నిజానికి ఈ రిట్రోగ్రెడేషన్.. బేకింగ్ అవెన్ నుంచి బ్రెడ్డును బయటికి తీసిన మరుక్షణం నుంచే మొదలవుతుంది. అందుకే వీలైనంత త్వరగా బ్రెడ్‌ను వాడేయాలి. మామిడి పండ్లు : పండినవైతే కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. పండకుండా మాత్రం అలాగే పెట్టేయకూడదు. ఫ్రిజ్‌లోని చల్లదనం కాయను త్వరగా పండనివ్వదు. అందుకని పండేవరకు బయట ఉంచి, పండాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా కవర్లో చుట్టి పెట్టాలి. లేకుంటే పై పొర దెబ్బతింటుంది. పుచ్చకాయ : ఏంటి! పుచ్చకాయను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదా! అవును. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టినా, బయట పెట్టినా ఒకేలా నిల్వ ఉంటుంది పుచ్చకాయ. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో స్థలాన్ని వృథా చేయడం ఎందుకు? కోసిన ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు కానీ, కవర్లో పెట్టి, పెట్టాలి. విడిగా పళ్లెంలో పెట్టి సుదీర్ఘంగా ఉంచితే ఆ ఎర్రటి గుజ్జు మెత్తబడిపోతుంది. తినబుద్ధేయదు. అరటి పండ్లు : అరటి పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండు పై తోలు నల్లబడి పోతోంది. పండు రుచీ తగ్గుతుంది. కేక్ : కేక్ పైన క్రీమ్ ఉంటే తప్ప ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పైగా పొడి వాతావరణంలోనే కేక్ రుచి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి గాలి చొరబడని కంటెయినర్లో, ఫ్రిజ్ బయటే కేక్‌ను నిల్వ ఉంచుకోవాలి. ఇక కామన్ టిప్ ఏంటంటే.. వండిన పదార్థాల్ని రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదని డేవిస్లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. -
ఎగ్–బ్రెడ్ టోస్ట్
హెల్దీ కుకింగ్ తయారి సమయం: 10 నిమిషాలు కావలసినవి: కోడిగుడ్లు – రెండు బ్రెడ్ స్లైసెస్ – ఆరు (ఒక్కో దానిని రెండేసి ముక్కలుగా త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి) మిరియాల పొడి – టీ స్పూన్ ఉప్పు – చిటికెడు నూనె – టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా – చిటికెడు కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్ తయారి:ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు బాగా గిలక్కొట్టాలి.అందులో మిరియాలపొడి, ఉప్పు, బేకింగ్ సోడా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.నాన్‌స్టిక్ పాన్ వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి.ఒక్కో బ్రెడ్ స్లైస్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి పాన్ పై వేయాలి. రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేవరకు కాల్చి తీయాలి. -
హెల్త్‌టిప్స్
{బేక్‌ఫాస్ట్‌లో చపాతీ లేదా బ్రెడ్ మీద జామ్, జెల్లీలకు బదులు తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని రాసుకుని తింటే గుండె సంబంధ వ్యాధులు రావు. ఇది రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు కూడా దీన్ని పాటిస్తే రెండో స్ట్రోక్‌కు దూరంగా ఉంటారు. దాల్చిన చెక్క పొడి, తేనెల కాంబినేషన్ రక్తనాళాలను ఆరోగ్యవంతం చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఒక మోతాదు తేనెలో రెండు మోతాదుల నీటినీ, ఒక స్పూను దాల్చిన చెక్క పొడినీ కలిపి ఆ మిశ్రమంతో కీళ్లనొప్పులున్న చోట మర్దన చేస్తే రెండు - మూడు నిమిషాలలోనే బాధ తగ్గుతుంది. -
బ్రెడ్ గురించి భయపడొద్దు
బ్రెడ్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని, వాటివల్ల కేన్సర్ వస్తుందని వస్తున్న కథనాల గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా అన్నారు. ప్రతిరోజూ పూర్తి బ్రెడ్ ప్యాకెట్ ఎవరూ తినరని, మహా అయితే ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే తింటారు కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరికీ ఆరోగ్యభద్రత అనే అంశంపై అసోచాం ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభం సందర్భంగా డాక్టర్ మిశ్రా ఈ విషయాలు తెలిపారు. ఆహార పదార్థాల్లో రసాయన పదార్థాలకు బదులు కోడిగుడ్లు, పండ్లు, కూరగాయల వాడకాన్ని పెంచాలని, దాంతోపాటు ఏం తిన్నా.. పరిమితంగానే తినాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ వైద్యబీమా చేయించుకోవాలని, రోజుకు రూపాయి గానీ, పది రూపాయలు గానీ.. వాళ్ల సామర్థ్యాన్ని బట్టి పాలసీ తీసుకోవాలని, ఈ విషయంలో అసలు ఏమీ కట్టలేని వాళ్లకు ప్రభుత్వమే ప్రీమియం కట్టి వైద్యబీమా కల్పించాలని ఆయన సూచించారు. -
మార్కెట్లో 'బ్రెడ్' దుమారం
ముంబై: మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ వాడుతోందన్న వివాదం మ్యాగీ నూడుల్స్ ప్రియులను దిగ్భ్రాంతికి లోను చేసింది. తాజాగా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చెప్పిన విషయాలు మరింత దుమారాన్ని రాజేశాయి. బ్రెడ్, పిజ్జా, కొన్ని రకాల బిస్కట్లలో కాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నామని (చదవండి....బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!) సీఎస్ నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. దీంతో మంగళవారం నాటి మార్కెట్ లో ఫూడ్ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్, దాదాపు10 శాతం , బ్రిటానియా 2శాతం నష్టపోయింది. వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ కూడా ఇదే బాటలోఉంది. అసలే అంచనాలకు మించని ఫలితాలు, పతంజలి దెబ్బతో కుదేలైన బ్రిటానియాకు సీఎస్ ఈ రిపోర్టు అశనిపాతంలా తగిలింది. అయితే సీఎస్ఈ రిపోర్టును మెక్ డోనాల్డ్ , బ్రిటానియా తీవ్రంగా ఖండించాయి. తాము బ్రెడ్ , పిజ్జా తయారీలో పొటాషియం ఐయోడేట్ పొటాషియం బ్రోమేట్ తమ ఉత్పత్తుల్లో వాడటం లేదని వాదించాయి. సీఎస్ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవి మెకొ డోనాల్డ్ కొట్టిపారేసింది. భారత ఆహార ఎఫ్ ఎస్ ఎస్ ఏ నిబంధనల ప్రకారంమే బ్రెడ్ లోని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామని వివరణ ఇచ్చాయి. ఈ వివాదంలో పిజ్జాహట్, కెఎఫ్సీ తదితర ఆహార ఉత్పత్తుల కంపెనీలు ఇంకా ఉన్నాయి. కాగా బ్రెడ్, పిజ్జా, బర్గర్లలో కెమికల్స్‌ను గుర్తించినట్లు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలింది. బ్రెడ్‌తో పాటు బర్గర్, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్‌లో పొటాషియం బ్రొమేట్ (కేబీఆర్ఓ) లేదా పొటాషియం ఐయోడేట్ (కేఐఓ3)ల శాతం అధికంగా ఉందని, బ్రెడ్, పిజ్జా, బర్గర్లు, బేకరీ ఉత్పత్తుల్లో 84 శాతం పైన పేర్కొన్న రసాయనాలు ఉన్నట్లు శాంపిల్స్ ద్వారా తేటతెల్లమైంది. వీటి ద్వారా క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నాయని సీఎస్ఈ వెల్లడించడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. -
బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!
- ప్రముఖ రెస్టారెంట్ల బ్రెడ్ ఉత్పత్తుల్లో కేన్సర్ కారకాలు - సీఎస్ఈ పరిశీలనలో వెల్లడి న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ప్రముఖ సంస్థలు అందిస్తున్న బ్రెడ్ సంబంధ ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పరీక్షల్లో తేలింది. బ్రిటానియా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్వే, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక ఫుడ్ చైన్ రెస్టారెంట్లు అందిస్తున్న ఆహార పదార్థాల్లో పొటాషియం బ్రొమేట్, పొటాషియం అయొడేట్లు ఉన్నట్లు సీఎస్ఈ సోమవారం విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది. ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను సీఎస్ఈ పరిశీలించింది. ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రెడ్డుతో తయారైన పావ్‌లు, బన్లు, బర్గర్లు, పిజ్జాలు వంటి 38 నమూనాలను సీఎస్ఈ పరీక్షించింది. వీటిలో 84 శాతం పదార్థాల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రసాయనాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కానీ భారత్‌లో నిషేధం లేదు. బ్రిటానియా, కేఎఫ్‌సీ, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వేలు ఈ హానికర పదార్థాలను తాము వాడడం లేదన్నాయి. నమూనాలను తమ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబోరేటరీ (పీఎంఎల్)లో పరీక్షించిన అనంతరం, బయటి ప్రయోగశాలల్లో కూడా పరిశీలించాకే ఈ నివేదిక విడుదల చేశామని సీఎస్ఈ ఉప డెరైక్టర్ జనరల్ చంద్రభూషణ్ తెలిపారు. 38 నమూనాలను పరీక్షించగా 32 ఉత్పత్తుల్లో 1.15 నుంచి 22.54 పీపీఎం వరకు పొటాషియం బ్రొమేట్,పొటాషియం అయొడేట్లు ఉన్నట్లు తేలిందన్నారు. కాగా, సీఎస్ఈ నివేదికలోని అంశాలపై విచారణ జరిపినివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. -
బ్రెడ్ ప్యాకెట్లో నుంచి ఎలుక దూకింది!
న్యూఢిల్లీ: అస్వస్థతతో బాధ పడుతున్న మీరు అధిక పోషక విలువలుగల గోధుమ బ్రెడ్‌ను తిందామని సీల్డ్ ప్యాకెట్‌ను విప్పితే హఠాత్తుగా అందులో నుంచి బతికున్న ఎలుక బయటకు దూకితే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఎవరికైనా ఒళ్లు జలధరిస్తుంది కదా! ఈ సంఘటన రోజుకు వందలాది మంది రోగులకు చికిత్సచేసే ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలో ఏయిమ్స్ ఆస్పత్రిలోనే జరిగింది. పర్యవసానంగా ఆ బ్రెడ్‌ను తయారుచేసి సరఫరా చేసిన ఎం/ఎస్ బాన్ న్యూట్రియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏయిమ్స్ షోకాజ్ నోటీసును జారీ చేసి, మూడేళ్లపాటు ఆ కంపెనీ ఉత్పత్తుల సరఫరాను నిషేధిస్తున్నామని ప్రకటించింది. బ్రెడ్స్, బిస్కట్లు, కేక్స్, కుకీస్ లాంటి వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారుచేసి దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న ప్రముఖ బాన్ న్యూట్రియెంట్స్ కంపెనీ విషయంలోనే ఇలా జరిగితే ఇక సాధారణ కంపెనీలను ఎలా నమ్మగలం. సీల్డ్ బ్రెడ్ ప్యాకెట్‌ను విప్పగానే సజీవ ఎలుక సాక్షాత్కరించిన సంఘటన ఏయిమ్స్‌లో గత జూలై 29వ తేదీన జరగ్గా, దానిపై స్పందించేందుకు ఏయిమ్స్ లాంటి వైద్య విజ్ఞాన సంస్థ కూడా తాత్సారం చేసింది. సెప్టెంబర్ 9వ తేదీతో సెప్టెంబర్ 24వ తేదీన సదరు కంపెనీ ఉత్పత్తుల కొనుగోలును నిలిపివేస్తున్నట్టు నోటీసు జారీ చేసింది. ఎందుకింత ఆలస్యంగా స్పందించారని మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి సంఘటన జరిగినట్టు తన దృష్టికే రాలేదంటూ ఆస్పత్రి సూపరింటెండ్ వ్యాఖ్యానించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల బ్రెడ్ నాణ్యతను గుర్తించగలిగామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఏయిమ్స్ సీనియర్ డాక్టరొకరు వెల్లడించారు. తమ ఆస్పత్రిలో సాధారణ రోగులకే కాకుండా శస్త్ర చికిత్సలు చేసిన వారికి కూడా అధిక పోషక పదార్థాల కోసం బ్రౌన్ బ్రెడ్ అందిస్తామని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన బ్రెడ్‌ను తిన్నట్లయితే ఎలర్జీ, ఫీవర్, డయేరియా లాంటి జబ్బులే కాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్, మెనింజైటీస్ లాంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయని ఆయన వివరించారు. అలాంటి సంఘటన తన దృష్టికి రాలేదంటూ ఏయిమ్స్ సూపరింటెండెంట్ తప్పించుకోజూసినా 24, సెప్టెంబర్, 2015 నాడు కంపెనీకి జారీచేసిన షోకాజ్ నోటీసులో ఎలుక బయట పడిన సంఘటన ప్రస్థావన స్పష్టంగా ఉంది. ఇదే విషయమై బాన్ న్యూట్రియంట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఢిల్లీ డివిజన్ మేనేజర్‌ను మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. సీసం పాలు ఎక్కువ ఉందంటూ ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల కంపెనీ ‘నేస్లీ’పై కొన్ని రాష్ట్రాల్లో నిషేధం విధించిన విషయం తెల్సిందే. భారత్‌లో తయారవుతున్న పలు బ్రాండ్ల ఆహోర్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, సీసం పాళ్లు ఎక్కువగా ఉంటోందంటూ పలు ఉత్పత్తులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ (ఎఫ్‌డీఏ) నిషేధించిన విషయం తెల్సిందే. -
సుకీ...
మెట్రో కథలు మూడు రోజుల తర్వాత వార్త తెలిసి ఆమె మంచం పట్టింది. సుకీ గొంతు దాదాపు పోయిందట. ఆగకుండా మొరిగీ మొరిగీ ఏమై పోయి ఉంటుందో ఊహించుకుంటే ఆమెకు అన్నం ముద్ద దిగడం లేదు. బాగా బరువు తగ్గిపోయిందట. అప్పటికీ చెప్పి చెప్పి పంపింది- సుకీ ఏదంటే అది తినదూ దానికి బ్రెడ్ ఇష్టం రెండు పూటలా అదే పెట్టండీ అని. రొట్టె పెట్టారట. అది పొరపాటున కూడా మూచూడదు. తలుపు ఏ కాస్త అలికిడైనా తన వాళ్లు వచ్చారేమోనని ఉలికులికి పడుతోందనీ నిద్ర పోవడంలేదనీ కదలిక ఏమీ లేనట్టుగా శవంలాగా పడి ఉంటోందనీ... మీరు వెళ్తారా నన్ను వెళ్లమంటారా? అని ఆమె పెద్దపెద్దగా ఏడ్చింది. ఎవరు మాత్రం సమాధానం చెప్తారు. వెళ్లినా లాభం లేదు. తెచ్చుకున్నా మళ్లీ పంపాల్సిందే. అపార్ట్మెంట్లో ఉన్న ఇతర ఫ్లాట్స్ వాళ్లకు కూడా ఇదంతా సతమతంగా ఉంది. మొదట ఆ ఫ్లాట్ మీద ఎవరి దృష్టీ లేదు. జనరల్‌బాడీలో తెలిసింది- కార్పస్ ఫండ్ కట్టలేదని, ఎమినిటీస్‌కు కట్టాల్సింది కూడా కట్టకుండానే ఆక్యుపై చేసుకున్నారనీ, మెయింటెనెన్స్‌కు వాచ్‌మెన్‌ను పదేపదే తిప్పుతున్నారనీ.... అతను అప్పుడప్పుడు నీలిరంగు కోటు వేసుకుని గ్రే కలర్ ప్యాంట్ లెదర్ షూస్ కట్టుకుని టైతో బైక్ మీద వెళుతూ కనిపించేవాడు. టూ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్నవాళ్లు అలాంటి కోటు వేసుకోవడం ఏమిటో తెలియలేదు. ఆమె రోజూ వాకింగుకు కిందకు దిగినప్పుడల్లా పొద్దున కానీ సాయంత్రం కానీ వాచ్మెన్నో సెక్యూరిటీ గార్డ్నో ఏదో ఒకటి అనకుండా పైకి వెళ్లేది కాదు. అలా వాళ్లు అందరికీ తెలుసు. సుకీ వల్ల కూడా. మూడు నెలల వయసులో కార్ పార్కింగ్ దగ్గర అది సిట్ అంటే కూచుంటూ స్టాండ్ అంటే నిలబడుతూ అందరికీ కనిపించింది. చిన్న చిన్న బిస్కెట్లను ఇంకా చిన్న ముక్కలు చేసి అలా గాల్లోకి ఎగరేస్తే ఒక్కటి కూడా కింద పడకుండా నోట కరుచుకుని మరొక ముక్క కోసం కళ్లల్లో కళ్లు పెట్టి చూసేది. ముద్దుగా ఉండేది. ఎవరితోనైనా స్నేహం చేసేలా అనిపించేది. ఫ్లాట్స్‌లో కుక్క ఏమిటండీ అని వాళ్లూ వీళ్లూ అన్నారు. ఆమె సమాధానం చెప్పే పని కూడా పెట్టుకోలేదు. రోజూ ఆమె సుకీతోనే కనిపించేది. మంచి బెల్ట్ వేసి కుడి చేత్తో పట్టుకుని... ఆరు నెలల వయసుకు వచ్చి అది గునగున నడుస్తూ ఉంటే ఆమె అలా హైవే వరకూ వెళ్లి వచ్చేది. పిల్లలు ఆమెను చూసి భయపడేవారు. కాని సుకీకి కాలక్షేపంగా ఉంటుందని ఆమె వాళ్లను దానితో ఆడుకోనిచ్చేది. వాళ్లు ఉత్సాహంగా బిస్కెట్లో మరోటో పట్టుకుని వచ్చేవారు. మా గాడ్దికి తిండి యావ ఎక్కువ. లాబ్రడార్ కదా. బాగా తింటుంది. పెట్టండి అనేది. అది ఖరీదైన కుక్క అని అన్నారు. కొనాలంటే కనీసం ఇరవై వేలు ఉంటుందని చెప్పారు. కాదు ఎవరో తెలిసినవాళ్లు ఇస్తే తెచ్చుకుని ఉంటారు అని కూడా వినబడింది. దీని ఖర్చు నెలకు ఎంత లేదన్నా వెయ్యీ పదిహేను వందలు ఉంటుందట. ఇవి కాకుండా వాక్సిన్లు మందులూ జీర్ణానికి టానిక్కులూ డాక్టర్ విజిట్ కోసం ఆటోలో వేసుకొని వెళ్లడానికి అదొక ఖర్చూ... అయితే ఆమె అదంతా పెద్ద పట్టించుకున్నట్టు కనపడేది కాదు. కొడుకు ఈ మధ్యే ఏదో ప్రయివేట్ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగానికి చేరాడట. ఇంట్లో దాదాపు ఉండడు. కూతురు పెళ్లయి వెళ్లిపోయిందని అంటారు. ఇది నా కొడుకు. ఇదుంటే చాలు అంటుంటుంది ఆమె. సుకీ ఆమెను వదలదు. ఉదయం ఏడింటికి నిద్ర లేచి బద్దకంగా కన్ను తెరిస్తే ఈమె కనిపించాలి. లేకుంటే అపార్ట్మెంట్ మొత్తం ఊగేలాగా గోల చేసేస్తుంది. ఈమె కిచన్లో ఉంటే ఏం వండుతున్నావే అన్నట్టుగా అక్కడే ఉంటుందట. బట్టలు తెచ్చుకోవడానికి టై మీదకు వెళ్లాలన్నా తోకలాగా వెంట తీసుకువెళ్లాల్సిందే. ఎప్పుడూ పక్కన కూచుంటుంది. రెండు బుగ్గలకూ మూతిని తాకిస్తుంది. ఇంట్లో మాట్లాడ్డానికి మనిషి లేక కబుర్లు చెబుతూ ఉంటే చెప్పుకోవే అన్నట్టు వింటూ ఉంటుంది. దానికి ఆమె గురించి పట్టింపులు జాస్తి. అన్నం తినక ఏ పనుల్లోనో పడి మర్చిపోతే తిను అని గద్దించి చెప్తుంది. టీ టైమ్ గుర్తు చేస్తుంది. సాయంత్రం కిందకు తీసుకువెళితే పిల్లలందరితో రండ్రా చిన్నయ్యలూ అని దానికి ఎంత ఆటో. సైకిళ్లు తొక్కే పిల్లలను ఓడిస్తుంది. ప్రేమగా తాకే పిల్లలను మాటా పలుకూ లేకుండా ముచ్చటగా చూస్తూ తోక ఆడిస్తూ ఉంటుంది. తొమ్మిది నెలలు వచ్చేసరికి పెద్దవాళ్లకు కూడా ఫ్రెండ్ అయిపోయింది. కొందరు పొద్దున దానిని చూస్తారు. కొందరు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు పలకరిస్తారు. కొందరు రాత్రి నిద్రకు ముందు పచార్లకు దిగినప్పుడు దానికి గుడ్ నైట్ చెప్పి చెయ్యూపుతూ నవ్వుతూ ఫ్లాట్లలోకి వస్తారు. ఎంత అలవాటు అంటే ఆఖరకు దాని కోసం సుకీ ఎక్కడండీ అని ఆమెతో మాట్లాడటానికి కూడా సిద్ధమైపోయారు. అయితే సుకీ కూడా ఆమెను బాగా గడబిడగా ఉంచేది. బాత్రూమ్ బయట ఉంచిన స్లిప్పర్లను చీల్చి అవతల పారేసేది. దిండును నోట కరుచుకుందంటే ఎంత లాగినా దిండు చిరగాల్సిందే తప్ప అది పట్టు వదలదు. ఆకలేస్తే అడగొచ్చుగా. ఊహూ. ఒక్కోసారి కుర్చీ మీద లంఘించి అక్కణ్ణుంచి డైనింగ్ టేబుల్ మీదకు దూకి గిన్నెలు దొర్లించి... ఆ...య్... సుకీ... అని గట్టిగా కేకలేస్తే చాలు. ఇంకంతే మూలకు వెళ్లి దన్‌మని పడి పోతుంది. ఉలకదు. పలకదు. పోవే టక్కరిదానా అని ఆమె కూడా లెక్క చేయకుండా ఉంటుంది. అతనుంటే కాసేపు సరదా కోసం దానిని బతిమిలాడేవాడు. పట్టించుకోదు. కొడుకు ఉంటే బుజ్జగించేవాడు. కన్నెత్తి కూడా చూడదు. ఇక చూసి చూసి ఆమే వచ్చి సరేలే... రా... తిను... అని కాస్త పెరుగన్నం కలిపి తినిపించడానికి కూచుంటే అది కాళ్లూ చేతులు వెల్లికిలా పడేసి... సారీ... సారీ... అని ముఖం ప్రసన్నంగా పెట్టేదాకా మారాం చేస్తుంటే ఆమె నవ్వుతూ నువ్వొకదానివి దాపురించావే నా ప్రాణానికి అని కళ్ల చివర తుడుచుకునేది. నిన్ను వదిలి బతగ్గలనా అని దగ్గరకు తీసుకునేది. కాని- అలాంటి సందర్భం వచ్చి పడింది. స్టేట్ డివైడ్ అయ్యాక అతడి పరిస్థితి కొంచెం బాగ లేదు. రియల్ ఎస్టేట్‌లో అతను చేసే మార్కెటింగ్ ఫీల్డ్ దెబ్బ తినిందట. మరి ఇక్కడ ఇబ్బంది వచ్చిందో అక్కడ ఇబ్బంది వచ్చిందో ఈ రాజధానికీ ఆ రాజధానికీ క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నా ప్రతిఫలం లేదు. ఇంటి లోను ఒకటి కట్టాలి. ఖర్చులు చూడాలి. ఏవో చిన్నా పెద్ద అప్పులు ఉన్నట్టున్నాయ్. అవి తీర్చాలి. ఇక ఇలాగే ఉంటే అవదని బయటకు వెళ్లి ఏదో ఒకటి చేయాలని ఆమె నిశ్చయం తీసుకుంది. మరి సుకీ? మనిషి లేని ఇంట్లో అది క్షణం కూడా ఉండలేదు. ఉత్త బెదురుపోతు. లోపల పెట్టి తాళం వేసి పోతే మొరిగీ మొరిగీ సాయంత్రం లోపల ఠారున చచ్చిపోతుంది. పర్లేదు... నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇస్తానంటే వచ్చి వాళ్లూరు తిసుకెళతానంటున్నాడు. మన పరిస్థితి బాగు పడ్డాక తెచ్చుకుందాం అన్నాడతను. దాని మీద రెండు వారాలు నాలుగు వారాలు పెద్ద పెద్ద చర్చలు... ఏడుపులు అయ్యాయి. సరే... కనీసం ఆరు నెలలు అని ఒప్పందం కుదిరింది. స్నేహితుడు వచ్చాడు. కారులో తీసుకెళ్లిపోయాడు. మూడో రోజుకల్లా ఆమె మంచం పట్టింది. సుకీ... సుకీ... అన్నం మానేసింది. రెప్ప మూతపడితే నిద్రలో దాని కలలు. మంచం పక్కన రోజూలాగే పడుకుని ఉందేమో అన్నట్టుగా పదేపదే ఉలికిపడుతూ లేచి చూసేది. కాని అది ఎందుకు ఉంటుంది? అది నా కోసం ఏడుస్తూ ఉంటుందండీ... నేను లేకపోతే బతకదండీ... ఎంత ఏడ్చినా ఏం లాభం. ప్రస్తుతానికి పరిస్థితి అది. రెండు మూడు వారాలు గడిచాయి. మెల్లగా ఆమె అప్పుడప్పుడు కింద కనిపించడం మొదలుపెట్టింది. పిల్లలను చూసి తల దించుకుని వెళ్లిపోతూ ఉండేది. పెద్దవాళ్లతో కూడా ఏదో మొహమాటపు పలకరింపే. మొన్నొక రోజు రాత్రి కింద సుకీ ఇష్టంగా కూచునే మొక్కల దగ్గర కూచుని ఆమె ఎంతసేపటికీ కదల్లేదు. గేట్లు వేసేసే టైమ్ వచ్చినా కదల్లేదు. భర్త చూసి చూసి కిందకు వచ్చాడు. ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు? ఆమె పసిపిల్లలా చూస్తూ మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది. పాపిష్టిదాన్ని... బిడ్డలాగా పెంచి చేతులారా సాగనంపాను... దాని ఉసురు పోసుకున్నాను. ఒసే గాడిద్దానా... నేనింక నిన్ను సాకలేను వాళ్ల పంచనా వీళ్ల పంచనా పడి బతుకమ్మా... ఇంక నన్ను వదిలిపెట్టు అని నిజం చెప్పేసి ఉంటే అది అంతా అర్థం చేసుకుని అలాగే అంటూ నా కళ్లవైపు కూడా చూడకుండా వెళ్లిపోయేదేమో. కాని మోసం చేశాను. పోవే... అంకుల్ వాళ్లతో అలా షికారుకు పోయిరా అని అబద్ధం చెప్పి పంపించాను. తర్వాత ఎంత కంగారు పడి ఉంటుందో. ఎంత బెదిరిపోయి ఉంటుందో. ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని నా మీద కోపం పెట్టుకుని ఎంత అలిగి ఉంటుందో. అయ్యో... నేనెప్పుడు కనపడేది... దాని అలక ఎప్పుడు తీర్చేది... టక్కరిది టక్కరిది అని పిలిచేదాన్నే.... అసలైన టక్కరిదాన్ని నేనే కదా... ఏమీ రాద్ధాంతం చేయకుండా చాలా లోగొంతుకతో ఆమె పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటే ఆ గిల్ట్ ఈ జన్మకు సరిపడినదా అనిపించింది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
BREAD ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు
-
భయమొద్దు.. బ్రెడ్డే!
చూడ్డానికి భయానకంగా కనిపిస్తోంది కదూ.. మానవ శరీర భాగాలను ఖండఖండాలు చేస్తున్నట్లుగా.. భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది బ్రెడ్ మాత్రమే. ఎంచక్కా జామ్‌తో నంజుకు తినేయొచ్చు. థాయ్‌లాండ్‌కు చెందిన కిట్టివత్ ఉనారమ్ అనే కళాకారుడి ‘ప్రతిభ’కు నిదర్శనమీ చిత్రం. పెయింటింగ్, శిల్పాలు చెక్కడం ఇలా చాలా ప్రయత్నాలు చేసిన కిట్టివత్ ఏదైనా కొత్తగా చేయాలని తలంచాడు. చివరికి తమ కుటుంబానికి చెందిన బేకరీ వ్యాపారాన్ని చేపట్టిన తర్వాత అందులో తనకు కావాల్సిన ప్రయోగాలన్నీ చేశాడు. ఇందుకోసం ఫోరెన్సిక్ లాబొరేటరీలను సందర్శించాడు. మానవ శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తర్వాత వీటిని రూపొందించాడు. ఇవి చూడ్డానికి నిజమైన విలా కనిపిస్తుండటంతో ఇతడి కళకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో కిట్టివత్ ‘బాడీ బేకరీ’ ఓ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఈ చిత్రవిచిత్రమైన బ్రెడ్‌ను తిందామని థాయ్‌లాండ్ వెళ్లేరు. ఎందుకంటే.. కిట్టివత్ వీటిని అమ్మడం లేదు. ప్రస్తుతానికివి ప్రదర్శనకు మాత్రమేనట. -
గుడ్ బెటర్ బ్రెడ్
బ్రెడ్డు సూపర్లేటివ్ ఫుడ్డు. నేరుగా తింటే గుడ్ . కలిపి తింటే బెటర్. కొత్తగా కనిపెట్టి చేస్తే.. బెస్ట్. బ్రెడ్‌తో చేయగల ‘ది బెస్ట్’ ఐటమ్స్‌ని ఫ్యామిలీ ఈవారం మీకు అందిస్తోంది. బ్రెడ్ పిజ్జా కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 6; ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); టొమాటో - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); క్యాప్సికమ్ - 1 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); మోజెరిల్లా చీజ్ - పైన వేయడానికి తగినంత; టొమాటో/పాస్తా/పిజ్జా సాస్ - 2 టేబుల్ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ - 2 టీ స్పూన్లు; ఎర్ర మిరియాల పొడి - పైన చల్లడానికి తగినంత... తయారీ: ముందుగా అవెన్‌ను 200 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి బ్రెడ్‌స్లైసులను ఒక మూతతో గుండ్రంగా వచ్చేలా కట్ చేయాలి మఫిన్ ట్రేకి నూనె పూసి, కట్ చేసిన బ్రెడ్లను దాని మీద ఉంచి గుంటలా వచ్చేలా చేయాలి వాటి మీద టొమాటో లేదా పాస్తా సాస్‌ను ఒక పొరలా పూసి, పైన కూరముక్కలు వేయాలి వాటి మీద చీజ్, ఆ పైన ఆలివ్ ఆయిల్, ఎర్ర మిరియాల పొడి వే సి, బేకింగ్ ట్రేలో ఉంచి అవెన్‌లో పెట్టాలి సుమారు 10 నిమిషాలు ఉంచాక తీసేయాలి. బ్రెడ్ గార్లిక్ కావలసినవి: బ్రెడ్ పిండి - అర కప్పు (సూపర్ మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); ఈస్ట్ - టేబుల్ స్పూను; పాలు - పావు కప్పు; ఆలివ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; నువ్వు పప్పు - 2టీ స్పూన్లు; పంచదార - టేబుల్ స్పూను; ఉప్పు - టీ స్పూను; బటర్ - 3 టేబుల్ స్పూన్లు; పర్మేజన్ చీజ్ తురుము - 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి తురుము - టీస్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు.... తయారీ: అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ఒక పాత్రలో బ్రెడ్ పిండి, ఈస్ట్, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి చిన్న గిన్నెలో పాలు, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి గోరువెచ్చగా కాచి, బ్రెడ్ మిశ్రమం ఉన్న గిన్నెలో పోసి పిండి సాగేలా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు బాగా కలిపి పైన మూత ఉంచి సుమారు గంటసేపు పిండి రెట్టింపు అయ్యేవరకు నాననివ్వాలి మరొకసారి బాగా కలిపి వెడల్పుగా అయ్యేలా చేతితో ఒత్తి సుమారు పది నిమిషాలు పక్కన ఉంచాలి పాలతో నెమ్మదిగా బ్రష్ చేసి, పైన నువ్వుపప్పు చల్లాలి అవెన్‌లో ఉంచి సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి ఒక పాత్రలో వెల్లుల్లి తురుము, బటర్ తురుము, పర్మేజన్ చీజ్, కొత్తిమీర తురుము బాగా కలిపి ఉంచాలి బేక్ అయిన బ్రెడ్‌ను సుమారు 20 నిమిషాలు చల్లారాక, బ్రెడ్‌ను స్లైసులుగా కట్ చేయాలి సర్వ్ చేయడానికి ముందు, తయారుచేసి ఉంచుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని రెండు స్లైసుల మధ్య జాగ్రత్తగా చాకుతో పూసి, 200 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో సుమారు ఏడెనిమిది నిమిషాలు ఉంచి తీసేయాలి. ఎగ్‌లెస్ ఫ్రెంచ్ టోస్ట్ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 6; కస్టర్డ్ పొడి - 2 టేబుల్ స్పూన్లు (వెనిలా); పంచదార - 2 టేబుల్ స్పూన్లు; పాలు - అర కప్పు; నెయ్యి - తగినంత తయారీ: పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాక, కస్టర్డ్ పొడి, పంచదార వేసి బాగా కలిపి మిశ్రమం దగ్గర పడ్డాక దించేయాలి నాన్‌స్టిక్ పాన్ వేడి (సన్న మంట మీద )చేసి కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి బ్రెడ్ స్లైస్‌ను కస్టర్డ్ పొడి మిశ్రమంలో ముంచి పాన్ మీద వేసి, రెండువైపులా గోధుమరంగులోకి వచ్చేలా త్వరత్వరగా తిప్పుతూ కాల్చాలి ఇష్టమైనవారు పైన పంచదారతో కలిపిన దాల్చినచెక్క పొడి మిశ్రమం కొద్దిగా చల్లుకోవచ్చు. బ్రెడ్ ఉప్మా కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 4; ఉల్లిపాయ - 1; టొమాటో - 1; పచ్చి మిర్చి - 2; సాంబారు పొడి - టేబుల్ స్పూను; పసుపు - చిటికెడు; అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కొత్తిమీర - చిన్న కట్ట; నిమ్మరసం - టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; సెనగ పప్పు - టేబుల్ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; జీడిపప్పులు - 10 తయారీ: బ్రెడ్ స్లైసులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి టొమాటో, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి పచ్చి మిర్చిని ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి టొమాటో తరుగు, జీడిపప్పులు, ఉప్పు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు కలపాలి పసుపు, సాంబారు పొడి వేసి ఒకసారి కలిపి, కొద్దిగా నీరు చిలకరించాలి బ్రెడ్ ముక్కలు వేసి కలిపాక, నెయ్యి వేయాలి. మంట బాగా తగ్గించి, సుమారు రెండు మూడు నిమిషాలు ఉంచి దించే ముందర టీ స్పూను నిమ్మరసం, కొత్తిమీర వేయాలి సూచన: కావాలనుకుంటే టొమాటో ముక్కల బదులు టొమాటో సాస్ ఉపయోగించవచ్చు.; వైట్ బ్రెడ్ కంటె వీట్ బ్రెడ్ అయితే మంచిది.; ఇష్టపడే వారు పల్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని కూడా జత చేయవచ్చు. బ్రెడ్ కార్న్ రోల్స్ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 4; క్రీమ్ కలిపి ఉడికించిన స్వీట్ కార్న్ - ముప్పావు కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టీ స్పూను; మిరియాల పొడి - అర టీ స్పూను; టొమాటో సాస్ - తగినంత; ఉప్పు - తగినంత; కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు; నువ్వు పప్పు - టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి క్రీమ్ స్టయిల్ కార్న్ జత చేయాలి ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పావు కప్పు నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, వేసి పిండి గరిటెజారుగా కలపాలి బాణలిలో నూనె పోసి కాచాలి బ్రెడ్ స్లైసుల అంచులను తీసేసి, పల్చగా అయ్యేలా అప్పడాల కర్రతో ఒత్తి, అందులో 2 టీ స్పూన్లు ఉల్లితరుగు, స్వీట్‌కార్న్ మిశ్రమం ఉంచి బ్రెడ్‌ను రోల్ చేయాలి అంచులలో కార్న్‌ఫ్లోర్ పూసి, బ్రెడ్ అంచులను మూసేసి, వెంటనే కార్న్‌ఫ్లోర్‌లో బజ్జీ మాదిరిగా ముంచి, నువ్వు పప్పు మీద ఒకసారి దొర్లించి, కాగిన నూనెలో వేసి వేయించి, పేపర్ టవల్ మీదకు తీయాలి టొమాటో సాస్‌తో అందించాలి.