ఈ మధ్యకాలంలో చాలామంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రౌన్ బ్రెడ్‌ను వినియోగిస్తుంటారు.గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో బ్రెడ్ వినియోగం విపరీతంగా పెరగిపోయింది. అల్పాహారం, శాండ్‌విచ్, పాన్‌కేక్.. ఇలా ఒకటేమిటి చాలా రకాలుగా బ్రెడ్‌ను వాడుతున్నారు. మరి బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదా? ఇప్పుడు చూద్దాం.
బిజీ లైఫ్ కారణంగా చాలామంది టిఫిన్‌గా బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్‌తో సరిపెట్టుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదు. బ్రెడ్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు శరీరంలో పిండిపదార్థం, ఉప్పు కూడా పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్‌లో పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే రక్తంలో కలిసిపోతుంది. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఎక్కువగా బ్రెడ్ తినేవారిలో ఊబకాయానికి కూడా దారితీస్తుంది.
బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పెద్దగా ఏమీ ఉండవు. కాబట్టి ఇది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైట్ బ్రెడ్ తయారీకి వాడే పిండిలే ఫైబర్ అస్సలు ఉండదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా వస్తాయి.
బ్రౌన్ బ్రెడ్ మంచిదేనా?
►వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ మంచిది. అయితే నార్మల్ పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇందులో కల్తీ జరగడానికి ఆస్కారం ఎక్కువ. మైదా బ్రెడ్‌కే కలర్ వేసి బ్రౌన్ బ్రెడ్‌గా విక్రయిస్తుంటారు. అందుకే ప్యాకెట్ వెనుక భాగంలో ఉండే ఇంగ్రీడియన్స్‌ను చెక్ చేసుకోవాలి.
► బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ఉపయోగించి తయారుచేస్తారు.
► బ్రౌన్ బ్రెడ్‌లో ఐరన్, జింక్, కాపర్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి.
► బ్రౌన్ బ్రెడ్‌లో 28 గ్రాముల ధాన్యపు పోషకాలను అందిస్తుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
► ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి విటమిన్ కే, ఈ, బీ, కార్భోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
► రోజూ 1-2 బ్రౌన్‌బ్రెడ్ ముక్కలను తీసుకోవడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ హార్మోన్ మంచి నిద్రకు ప్రేరేపించడమే కాకుండా, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ధాన్యం గింజలు గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తక్కువగా ఉండేలా చేస్తాయి. వీటి వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రిస్క్ తగ్గుతుంది.
► మల్టీ గ్రైన్ బ్రెడ్ లో ఫ్యుతోన్యూట్రియన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించటానికి సహాయపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment