Egg Bread Manchurian Recipe Preparation in Telugu - Sakshi
Sakshi News home page

Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్‌ బ్రెడ్‌ మంచూరియా తయారీ ఇలా!

Published Wed, May 18 2022 10:05 AM | Last Updated on Wed, May 18 2022 10:51 AM

Recipes In Telugu: How To Prepare Egg Bread Manchuria - Sakshi

నోరూరించే ఎగ్‌ బ్రెడ్‌ మంచూరియా ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోండి.

ఎగ్‌ బ్రెడ్‌ మంచూరియా తయారీకి కావలసినవి:  
►గుడ్లు – 6, బ్రెడ్‌ పౌడర్‌ – అర కప్పు
►అల్లం తురుము – అర టీ స్పూన్‌
►వెల్లుల్లి – 6 రెబ్బలు (తురుములా చేసుకోవాలి)
►పచ్చిమిర్చి –6 (మూడిటితో పేస్ట్‌లా చేసుకుని, మిగిలినవి చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి)
►కొత్తిమీర – 2 టీ స్పూన్లు, కరివేపాకు – అభిరుచిని బట్టి
►ఉల్లిపాయల ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు
►గరం మసాలా – 4 టీ స్పూన్లు
►ధనియాల పొడి – కొద్దిగా
►కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – సరిపడా
►టమాటా ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌
►పెరుగు: 2 కప్పులు, రెడ్‌ చిల్లీ సాస్‌ – కొద్దిగా
►జీలకర్ర పొడి – 2 లేదా 3 టీ స్పూన్లు
►నూనె – 3 గరిటెలు, ఉల్లికాడల ముక్కలు – గార్నిష్‌కి సరిపడా

ఎగ్‌ బ్రెడ్‌ మంచూరియా తయారీ విధానం:
►ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టుకుని, పచ్చసొన లేకుండా తెల్లటి గుడ్డు భాగాన్ని మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
►ఈ ముక్కల్లో సన్నగా తరిగిన పావు టీ స్పూన్‌ అల్లం తురుము, సగం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్‌ కారం, 2 టీ స్పూన్ల గరం మసాలాతో పాటు బ్రెడ్‌ పౌడర్‌ వేసి బాగా కలుపుకోవాలి.
►అందులో మిగిలిన 2 గుడ్లు పగలగొట్టి తెల్లసొనను మాత్రమే ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
►తర్వాత ఈ మిశ్రమాన్ని కుకర్‌లో స్టీమ్‌ చేసుకుని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
►అనంతరం కళాయిలో 3 గరిటెల నూనె వేసుకుని.. వేడికాగానే టమాటా ముక్కలు, మిగిలిన అల్లం తురుము, మిగిలిన వెల్లుల్లి తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దోరగా వేయించాలి.
►రెడ్‌ చిల్లీ సాస్, పెరుగు, జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.
►అనంతరం ఎగ్‌ ముక్కల్ని వేసుకుని.. పెరుగు– సాస్‌ మిశ్రమం ముక్కలకు పట్టే విధంగా గరిటెతో తిప్పుతూ కాసేపటికి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.

చదవండి👉🏾Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి!
చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్‌ దోసెలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement